Turning Point
-
టర్నింగ్ పాయింట్లా...
త్రిగుణ్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘టర్నింగ్ పాయింట్’. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, ఇషా చావ్లా, వర్షిణి హీరోయిన్లుగా నటించారు. కుహన్ నాయుడు దర్శకత్వంలో స్వాతి సినిమాస్ పతాకంపై సురేష్ దత్తి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకుడు విజయ్ కనకమేడల కలిసి విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దర్శకుడు కుహన్ నాయుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో త్రిగుణ్ నటించారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంగేజ్ చేసేలా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు.‘‘కొత్తదనం ఆశించే ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు మా చిత్రంలో ఉన్నాయి. యూనిట్‌లోని అందరి కెరీర్స్‌కి ఓ టర్నింగ్ పాయింట్లా ఈ ‘టర్నింగ్ పాయింట్’ నిలుస్తుందన్న నమ్మకం ఉంది’’ అని తెలిపారు సురేష్ దత్తి. ఈ సినిమాకు సంగీతం: ఆర్.ఆర్. ధ్రువన్, కెమెరా: గరుడవేగ అంజి, సహ–నిర్మాతలు: నందిపాటి ఉదయభాను, జీఆర్ మీనాక్షి, ఎం. ఫణిభూషణ్ కుమార్. -
బాలకృష్ణ కేసులో కీలక మలుపు.. తెరపైకి మరో ఐఏఎస్ అధికారి పేరు!
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో కస్టడీ కన్పెషన్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. తన వాంగ్మూలంలో మరో ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పలువురి ఒత్తిడి మేరకే అక్రమాలకు పాల్పడినట్లు బాలకృష్ణ అంగీకరించారు. అక్రమాల చిట్టాను బయటపెట్టారు. ఐఏఎస్ అధికారి చెప్పిన ఫైళ్లు వెంటనే క్లియర్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఐఏఎస్‌ను విచారించేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం,కోర్టు అనుమతిని ఏసీబీ కోరనుంది. ఇప్పటికే శివ బాలకృష్ణ వద్ద డాక్యుమెంట్ లెక్కల ప్రకారం 250 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 214 ఎకరాలు భూములను ఏసీబీ గుర్తించింది. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీ లోకి తీసుకుని ఏసీబీ విచారించగా, శివ బాలకృష్ణతో పాటు ఇతర అధికారుల పాత్రపైన ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివ బాలకృష్ణ బినామీలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. శివబాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ ఫోకస్ పెట్టింది. సోదరుడు నవీన్ అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బాగోతం బయటపడుతోంది. మొన్న సోమేష్‌కుమార్, నిన్న అరవింద్ కుమార్, నేడు రజత్‌కుమార్ ఆస్తులపై వివాదం నెలకొంది. ఐఏఎస్ రజత్‌కుమార్..గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో పని చేశారు. హేమాజీపూర్ సర్వే నంబర్ 83, 84, 85లో ఆయన కుటుంబం పేరు మీద భూములు ఉన్నట్లు సమాచారం. వరుసగా పలువురు ఐఏఎస్‌ల మీద ఆరోపణలు రావడంతో భూములను ఇతరుల పేర్లు మీద మార్చడానికి రజత్‌కుమార్ స్లాట్ బుక్ చేసినట్లు తెలిసింది. 15 ఎకరాల భూమిని ఇతరుల పేరు మీద మార్చేందుకు రజత్‌కుమార్ సిద్ధమయినట్లు సమాచారం. ఇదీ చదవండి: శివ బాలకృష్ణపై ఈడీ.. ఐటీ? -
స్వరరాగ మధుర తరంగాలు
‘సాధన చేయుమురా నరుడా.... సాధ్యం కానిది లేదురా!’ అన్నది పెద్దల మాట ఇంగ్లీష్ పాట విషయంలో కూడా ఆ విలువైన మాటను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాల్లో పుట్టిన వారు, ప్రవాసభారతీయులు మాత్రమే ఇంగ్లీష్ పాటను బాగా పాడగలరా? ‘సాధన చేస్తే ఎవరైనా పాడగలరు’ అని నిరూపించింది నెక్సా మ్యూజిక్ ల్యాబ్... గోవాలో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో యువగళాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఎవరు వీరు?’ అని ఆరా తీసేలా చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాలు, భిన్నమైన సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన వారు, ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అని స్టూడియోలు, స్టేజ్‌ల చుట్టూ చక్కర్లు కొట్టిన గాయకులు కూడా ఇందులో ఉన్నారు. అలాంటి వారు తమ టాలెంట్‌ను ఈ మ్యూజిక్ ఫెస్టివల్లో ప్రదర్శించే అవకాశం రావడానికి ప్రధాన కారణం నెక్సా మ్యూజిక్ ల్యాబ్. నేషనల్వైడ్ టాలెంట్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ ‘నెక్సా మ్యూజిక్ ల్యాబ్’ మారుమూల ప్రాంతాల నుంచి మహా పట్టణాల వరకు మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకువచ్చి అంతర్జాతీయ స్థాయిలో మెరిపిస్తోంది. ఈ పోటీలో పాల్గొనదలచినవారు మూడు నిమిషాల నిడివి ఉన్న ఒరిజినల్ ఇంగ్లీష్ మ్యూజిక్ కంపోజిషన్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పాప్, జాజ్, ఫ్యూజన్...మ్యూజిక్ జానర్ ఏదైనా ఫరవాలేదు. దీంతో పాటు నెక్సా మ్యూజిక్ అడిషన్లో కూడా పాల్గొనవలసి ఉంటుంది. ఎంట్రీలకు మినీమం ఏజ్ లిమిట్...పద్దెనిమిది సంవత్సరాలు. సబ్మిట్ చేసిన ఎంట్రీలు నియమ, నిబంధనలకు తగినట్లుగా లేకపోతే నెక్సా గ్యాలరీలో కనిపించవు. అయినా నిరాశ చెందనక్కర్లేదు. తప్పులు సవరించుకొని ఫ్రెష్‌గా పంపవచ్చు. వ్యక్తిగత స్థాయిలోనూ, మ్యూజిక్ బ్యాండ్‌లో ఒకరిగా కూడా పాల్గొనవచ్చు. ఏఆర్ రెహమాన్ నేతృత్వంలోని జ్యూరీ 24 మందిని ఎంపిక చేస్తుంది. వీరికి నెక్సా మ్యూజిక్ సీజన్లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ ఇరవైనాలుగు మంది నుంచి ఫైనల్‌గా నలుగురిని ఎంపిక చేసి, వారి చేత పాడించిన ఆల్బమ్‌లను అంతర్జాతీయంగా విడుదల చేస్తారు. దిల్లీకి చెందిన నిశా నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన యువ మ్యూజిక్ బ్యాండ్ ‘హీట్ సింక్’ వరకు ఎంతోమందిలో కొత్త వెలుగు తీసుకువచ్చింది నెక్సా మ్యూజిక్ ల్యాబ్. బహుముఖ ప్రతిభ నెక్సా సీజన్ 1 విజేతగా నిలిచిన దిల్లీకి చెందిన నిశా శెట్టి సింగర్, సాంగ్‌రైటర్, వాయిస్ ఒవర్ ఆర్టిస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది. చిన్నప్పటి నుంచి నాటకాలు, వాటికి సంబంధించిన వర్క్‌షాప్‌లను చూస్తూ పెరిగింది. కథక్, కూచిపూడి, హిందుస్థానీ శాస్త్రీయసంగీతం నేర్చుకుంది. చిన్న చిన్న షోలలో పాల్గొనే నిశాకు ‘నెక్సా మ్యూజిక్ ల్యాబ్’ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. ‘ఎంపికైన విజేతలలో మీరు ఒకరు’ అంటూ నిర్వాహకుల నుంచి వచ్చిన మెయిల్ నేహాకు ఎప్పుడూ గుర్తుండే తియ్యటి జ్ఞాపకం. ‘కలలు కనడం వరకు మాత్రమే పరిమితం కాకూడదు. కల సాకారం చేసుకునే శక్తి కోసం ఎక్కడెక్కడో వెదకనక్కర్లేదు. అది మన దగ్గరే ఉంది’ అంటుంది నిశా శెట్టి. -
మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే..
లార్డ్స్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల ఓటమికి ప్రధాన కారణం ఒత్తిడిని అధిగమించకపోవడం. ఈ విషయాన్ని కెప్టెన్ మిథాలే అంగీకరించింది. 28 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి 9 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా పరాజయం పొందింది. ఇక మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ ఓపెనర్ పూనమ్ రౌత్ వికెట్.. 191/3 పటిష్ట స్థితిలో ఉన్న భారత్‌ను ఇంగ్లండ్ బౌలర్ ష్రబ్సోల్ దెబ్బతీసింది. క్రీజులో పాతుకుపోయిన పూనమ్ రౌత్(86)ను 43 ఓవర్లో ష్రబ్సోల్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్యాట్స్ఉమెన్ సుష్మావర్మ పరుగులేమి చేయకుండా వెనుదిరగడంతో భారత బ్యాట్స్ ఉమెన్లపై ఒత్తిడి పెరిగింది. అయినా వేద కృష్ణమూర్తి(35) క్రీజులో ఉండటం.. దాటిగా బ్యాటింగ్ చేయగల దీప్తి శర్మ బ్యాటింగ్ రావడం.. భారత్ గెలుస్తోందని అందరూ భావించారు. కానీ వేద అనవసర షాట్‌కు ప్రయత్నించి భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో మ్యాచ్ ప్తూర్తిగా ఇంగ్లండ్ వశం అయింది. చివర్లో శిఖా పాండే, దీప్తీ కుదురుగా ఆడినట్లు కనిపించినా అది ఎంత సేపు కొనసాగలేదు. పాండే అనవసర పరుగుకోసం ప్రయత్నించి రనౌట్ అయింది. థర్డ్ డౌన్లో వచ్చే దీప్తీ శర్మను చివర్లో బ్యాటింగ్ పంపడం కూడా భారత్‌ను కొంపముంచింది. ♦ బెడిసి కొట్టిన భారత్ ముందు జాగ్రత్త.. కేవలం విజయానికి 38 పరుగులే కావల్సిన సందర్భంలో దీప్తీని బ్యాటింగ్ పంపించకుండా సుష్మా వర్మ బ్యాటింగ్ రావడం భారత్‌ను కొంప ముంచింది. పూనమ్ రౌత్ వికెట్ అనంతరం దీప్తీ బ్యాటింగ్ వస్తే ఎలాంటి ఒత్తిడి ఉండేది కాదు. అది కాకుండా బ్యాటింగ్‌కు వచ్చిన సుష్మావర్మ డకౌట్ అవడంతో ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో చివర్లో దీప్తీ ఆదుకుంటుందనే భారత్ వ్యూహం.. బెడిసి కొట్టింది. -
మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదే!
హైదరాబాద్: అతనో మ్యాచ్ ఫినిషర్.. చేజింగ్ ఒత్తిడిలో ఎన్నో విజయాలందించిన అనుభవం.. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన సందర్భాలెన్నో.. అలాంటి డేంజరేస్ బ్యాట్స్ మన్ క్రీజులో ఉండగా గెలవడం కష్టమని భావించిందో ఎమో గానీ ముంబై మాత్రం మంచి వ్యూహంతో ఆ బ్యాట్స్ మన్ ను అవుట్ చేసి టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆ బ్యాట్స్ మన్ ఎవరో కాదు.. భారత మాజీ కెప్టెన్, రైజింగ్ పుణె వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని.. క్వాలిఫయర్-1 లో ఒంటి చెత్తో జట్టుకు విజయాన్నందించిన మహేంద్రుడు ఫైనల్ మ్యాచ్ లో మాత్రం జట్టును గెలిపించలేకపోయాడు. స్వల్ప లక్ష్యాన్ని ఎదుర్కొలేక అభిమానులను నిరాశపర్చాడు. దీంతో రైజింగ్ పుణె భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఇక ఆదివారం ఉప్పల్ లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఒక్క పరుగుతో పుణె పై గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలి నుంచి విజయ అవకాశం పుణే వైపు ఉన్న ధోని అవుటవ్వడంతో ఒక్కసారిగా ముంబై పట్టు సాధించింది. అజింక్యా రహానే అవుటవ్వడంతో క్రీజులోకి వచ్చిన ధోని స్మిత్ తో ఆచితూచి ఆడాడు. ఇదే పుణే ను కొంప ముంచింది. ధోని క్రీజులోకి వచ్చిన సమయానికి పుణెకు 49 బంతుల్లో 59 పరుగులు అవసరం. కేవలం ఓవర్ కు 8 పరుగులు చేస్తే చాలు. ఇది టీ20 ల్లో కష్టమేమి కాదు. కానీ ధోని ఒత్తిడి గురయ్యాడు. ఏ మాత్రం తన సహాజ ఆట తీరును ప్రదర్శించలేక పోయాడు. ఐదు ఓవర్ల పాటు క్రీజులో ఉన్న ధోని ఒక బౌండరీతో కేవలం 13 పరుగులు చేశాడు. అటు స్మిత్ కూడా వేగంగా ఆడలేకపోయాడు. ఇక కృనాల్ పాండ్యా బౌలింగ్ లో స్మిత్ సిక్స్ బాది ఒత్తిడి తగ్గించాడు.. అయితే పుణె మాత్రం ఈ ఐదు ఓవర్లలో 27 పరుగులే చేయడం గమనార్హం. పుణె విజయానికి 22 బంతుల్లో 32 పరుగులు కావల్సిన తరుణంలో బుమ్రా వేసిన బంతికి ధోని కీపర్ పార్దీవ్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ధోని అవుట్ తో పట్టు సాధించిన ముంబై పుణె కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. -
అదుపుతప్పి లారీ బోల్తా
న్యూశాయంపేట : హంటర్‌రోడ్డులోని ప్రకృతి చికిత్సాలయం మూలమలుపు వద్ద మంగళవారం ఉదయం కట్టెల లోడ్‌తో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ మూలమలుపు వద్ద సరైన సూచికలు లేకపోవడంతో తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయి. సూచికలు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు. -
ముగ్గురు యువకుల హత్యకేసులో కీలకమలుపు
-
'ఆగడు' మరో టర్నింగ్ పాయింట్: మహేశ్ బాబు
చెన్నై: త్వరలో విడుదల కానున్న ఆగడు చిత్రంపై అభిమానులే కాదు మహేశ్ బాబు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. తన కెరీర్లో ఈ చిత్రం మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని మహేశ్ బాబు భావిస్తున్నారు. 'నా కెరీర్లో ఓ సారి వెనక్కెళ్లి చూసుకుంటే కొన్ని చిత్రాలు నన్ను మంచి పొజిషన్లో నిలబెట్టాయి. అలాంటి వాటిలో దూకుడు సినిమా ఒకటి. నా జీవితంలో దూకుడు ఓ టర్నింగ్ పాయింట్. నా కెరీర్ కీలక దశలో ఉన్న సమయంలో ఆగడు కూడా మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నా. నా అభిమానులు మెచ్చేలా సినిమా తీయడం దర్శకుడు శ్రీను వైట్లకు తెలుసు. ఆయన దర్శకత్వంలో వచ్చిన దూకుడు విజయవంతమైంది' అని మహేశ్ అన్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఆగడు ఈ నెల 19న విడుదలవుతోంది. మిల్క్ బ్యూటీ తమన్నా మహేశ్ సరసన నటించారు. సోనూ సూద్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం ఇతర ముఖ్య తారాగణం. -
నితిన్‌కి టర్నింగ్ పాయింట్...
‘‘ఇడియట్, అమ్మ-నాన్న-ఓ తమిళమ్మాయి, పోకిరి చిత్రాల తర్వాత నిర్మాతగా, దర్శకునిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ‘హార్ట్ ఎటాక్’. నా కెరీర్లో మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయ్యే రేంజ్లో సినిమా వచ్చింది’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. నితిన్ కథానాయకునిగా ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘హార్ట్ ఎటాక్’. ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి పూరీ ఇంకా చెబుతూ -‘‘నితిన్‌కి ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది. అనూప్ మ్యూజిక్ చాలా బాగా చేశాడు. ఆరు పాటలూ సూపర్‌హిట్ అవుతాయి. ఆడియో వేడుకను జనవరి తొలివారంలో డిఫరెంట్‌గా ప్లాన్ చేశాం. జనవరి 31న సినిమా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ‘హార్ట్ ఎటాక్’తో తీరిందని, తన కెరీర్‌కి ఈ సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని నితిన్ చెప్పారు. ఆదాశర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అమోల్ రాథోడ్, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, కళ: బ్రహ్మ కడలి, పాటలు: భాస్కరభట్ల, సమర్పణ: లావణ్య.