స్వరరాగ మధుర తరంగాలు | Nationwide talent discovery platform NEXA Music is building a new league of independent music stars | Sakshi
Sakshi News home page

స్వరరాగ మధుర తరంగాలు

Published Fri, Apr 7 2023 12:17 AM | Last Updated on Fri, Apr 7 2023 7:10 AM

Nationwide talent discovery platform NEXA Music is building a new league of independent music stars  - Sakshi

విన్నర్స్‌తో ఏఆర్‌ రెహమాన్‌

‘సాధన చేయుమురా నరుడా.... సాధ్యం కానిది లేదురా!’ అన్నది పెద్దల మాట
ఇంగ్లీష్‌ పాట విషయంలో కూడా ఆ విలువైన మాటను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విదేశాల్లో పుట్టిన వారు, ప్రవాసభారతీయులు మాత్రమే ఇంగ్లీష్‌ పాటను బాగా పాడగలరా?
‘సాధన చేస్తే ఎవరైనా పాడగలరు’ అని నిరూపించింది నెక్సా మ్యూజిక్‌ ల్యాబ్‌...


గోవాలో జరిగిన మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో యువగళాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఎవరు వీరు?’ అని ఆరా తీసేలా చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాలు, భిన్నమైన సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన వారు, ‘ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌’ అని స్టూడియోలు, స్టేజ్‌ల చుట్టూ చక్కర్లు కొట్టిన గాయకులు కూడా ఇందులో ఉన్నారు. అలాంటి వారు తమ టాలెంట్‌ను ఈ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించే అవకాశం రావడానికి ప్రధాన కారణం నెక్సా మ్యూజిక్‌ ల్యాబ్‌.

నేషనల్‌వైడ్‌ టాలెంట్‌ డిస్కవరీ ప్లాట్‌ఫామ్‌ ‘నెక్సా మ్యూజిక్‌ ల్యాబ్‌’ మారుమూల ప్రాంతాల నుంచి మహా పట్టణాల వరకు మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకువచ్చి అంతర్జాతీయ స్థాయిలో మెరిపిస్తోంది.

ఈ పోటీలో పాల్గొనదలచినవారు మూడు నిమిషాల నిడివి ఉన్న ఒరిజినల్‌ ఇంగ్లీష్‌ మ్యూజిక్‌ కంపోజిషన్‌ను సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. పాప్, జాజ్, ఫ్యూజన్‌...మ్యూజిక్‌ జానర్‌ ఏదైనా ఫరవాలేదు. దీంతో పాటు నెక్సా మ్యూజిక్‌ అడిషన్‌లో కూడా పాల్గొనవలసి ఉంటుంది.
ఎంట్రీలకు మినీమం ఏజ్‌ లిమిట్‌...పద్దెనిమిది సంవత్సరాలు.
సబ్మిట్‌ చేసిన ఎంట్రీలు నియమ, నిబంధనలకు తగినట్లుగా లేకపోతే నెక్సా గ్యాలరీలో కనిపించవు. అయినా నిరాశ చెందనక్కర్లేదు. తప్పులు సవరించుకొని ఫ్రెష్‌గా పంపవచ్చు. వ్యక్తిగత స్థాయిలోనూ, మ్యూజిక్‌ బ్యాండ్‌లో ఒకరిగా కూడా పాల్గొనవచ్చు.

ఏఆర్‌ రెహమాన్‌ నేతృత్వంలోని జ్యూరీ 24 మందిని ఎంపిక చేస్తుంది. వీరికి నెక్సా మ్యూజిక్‌ సీజన్‌లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ ఇరవైనాలుగు మంది నుంచి ఫైనల్‌గా నలుగురిని ఎంపిక చేసి, వారి చేత పాడించిన ఆల్బమ్‌లను అంతర్జాతీయంగా విడుదల చేస్తారు.
దిల్లీకి చెందిన నిశా నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన యువ మ్యూజిక్‌ బ్యాండ్‌ ‘హీట్‌ సింక్‌’ వరకు ఎంతోమందిలో కొత్త వెలుగు తీసుకువచ్చింది నెక్సా మ్యూజిక్‌ ల్యాబ్‌.    

బహుముఖ ప్రతిభ
నెక్సా సీజన్‌ 1 విజేతగా నిలిచిన దిల్లీకి చెందిన నిశా శెట్టి సింగర్, సాంగ్‌రైటర్, వాయిస్‌ ఒవర్‌ ఆర్టిస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది. చిన్నప్పటి నుంచి నాటకాలు, వాటికి సంబంధించిన వర్క్‌షాప్‌లను చూస్తూ పెరిగింది. కథక్, కూచిపూడి, హిందుస్థానీ శాస్త్రీయసంగీతం నేర్చుకుంది. చిన్న చిన్న షోలలో పాల్గొనే నిశాకు ‘నెక్సా మ్యూజిక్‌ ల్యాబ్‌’ టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది.

‘ఎంపికైన విజేతలలో మీరు ఒకరు’ అంటూ నిర్వాహకుల నుంచి వచ్చిన మెయిల్‌ నేహాకు ఎప్పుడూ గుర్తుండే తియ్యటి జ్ఞాపకం.
‘కలలు కనడం వరకు మాత్రమే పరిమితం కాకూడదు. కల సాకారం చేసుకునే శక్తి కోసం ఎక్కడెక్కడో వెదకనక్కర్లేదు. అది మన దగ్గరే ఉంది’ అంటుంది నిశా శెట్టి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement