Nexa
-
మారుతీ సుజుకీ నెక్సా విస్తరణ
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ నెక్సా ఔట్లెట్లను పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. బెంగళూరులో 500వ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 150 స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇందులో 100 కేంద్రాలు చిన్న నగరాల్లో రానున్నాయని వెల్లడించింది. నెక్సా సేల్స్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు చాలా దూకుడుగా ప్లాన్ చేశామని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు పెద్ద ఎత్తున వెళ్లాలన్నది తమ ప్రణాళిక అని వెల్లడించారు. నెక్సాలో లభించే మోడళ్లకు ఈ నగరాల నుంచి మంచి డిమాండ్ ఉందన్నారు. కార్యక్రమంలో మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నొబుటాకో సుజుకీ కూడా పాల్గొన్నారు.నెక్సా వాటా 37 శాతం.. మారుతీ సుజుకీ 2015 జూలైలో నెక్సా ఔట్లెట్లకు శ్రీకారం చుట్టింది. ఏడాదిలోనే 94 నగరాల్లో 100 నెక్సా షోరూంలను నెలకొలి్పంది. ప్రస్తుతం ఇగ్నిస్, బలీనో, ఫ్రాంక్స్, సియాజ్, జిమ్నీ, ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా, ఇని్వక్టో మోడళ్లను నెక్సా షోరూంలలో కంపెనీ విక్రయిస్తోంది. సంస్థ మొత్తం విక్రయాల్లో నెక్సా వాటా 37 శాతం ఉంది. 2023–24లో 54 శాతం వృద్ధితో నెక్సా షోరూంల ద్వారా 5.61 లక్షల కార్లు రోడ్డెక్కాయి. నెక్సా స్టూడియో పేరుతో చిన్న కేంద్రాలను కంపెనీ ఏర్పాటు చేస్తోంది. సంస్థ ఖాతాలో అరీనా, నెక్సా, కమర్షియల్ ఔట్లెట్ల సంఖ్య ప్రస్తుతం 3,925కు చేరుకుంది. ఇవి దేశవ్యాప్తంగా 2,577 నగరాలు, పట్టణాల్లో విస్తరించాయి. -
‘ఆహా గోదారి’కి నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డు
సాక్షి,హైదరాబాద్: ముంబై వేదికగా నిర్వహించిన నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్‌లో భాగంగా గేబో నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వరంలో నిర్మించిన ‘ఆహా గోదారి’ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అవార్డు పొందింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డులను అందించారు. ఈ వేదికపై ఆహా ఏకంగా 13 అవార్డులను గెలుచుకుని దాని ప్రశస్తిని చాటుకుంది. హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో 48 విభాగాల్లో ఈ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ‘అన్‌స్టాపబుల్ సీజన్–2’తో ఉత్తమ నాన్–ఫిక్షన్ ఒరిజినల్ స్పెషల్ షోగానే కాకుండా ‘ఆహా’ ఉత్తమ ప్రాంతీయ వేదికగా టైటిల్‌ను పొందింది. వ్యక్తిగత విభాగంలో ‘అన్యాస్ ట్యుటోరియల్’ చిత్రానికి గాను విజయ్ కె.చక్రవర్తి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (సిరీస్) అవార్డును, ‘ఆహా గోదారి’కి గోపవాఝల దివాకర్ ఉత్తమ డాక్యుమెంటరీ ఒరిజినల్‌గా, ‘న్యూసెన్స్’లో కిరణ్ మామెడి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ (సిరీస్)గా, ‘భామకలాపం–1’లో ప్రియమణి రాజ్ ఉత్తమ నటిగా, ఇదే చిత్రానికి అభిమన్యు తడిమేటి ఉత్తమ కథా పురస్కారాన్ని, అన్యస్ ట్యుటోరియల్, భామాకలాపం–1 చిత్రాలకు నివేదిత సతీ‹Ù, శరణ్య ప్రదీప్‌లు ఉత్తమ సహాయ నటులుగా తదితర అవార్డులను ఆహా గెలుచుకుంది. బెస్ట్ రీజినల్ ప్లాట్ఫామ్గానూ ఆహా సీఈఓ రవికాంత్ సబ్నవిస్–2 అవార్డులను పొందారు. -
స్వరరాగ మధుర తరంగాలు
‘సాధన చేయుమురా నరుడా.... సాధ్యం కానిది లేదురా!’ అన్నది పెద్దల మాట ఇంగ్లీష్ పాట విషయంలో కూడా ఆ విలువైన మాటను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాల్లో పుట్టిన వారు, ప్రవాసభారతీయులు మాత్రమే ఇంగ్లీష్ పాటను బాగా పాడగలరా? ‘సాధన చేస్తే ఎవరైనా పాడగలరు’ అని నిరూపించింది నెక్సా మ్యూజిక్ ల్యాబ్... గోవాలో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో యువగళాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఎవరు వీరు?’ అని ఆరా తీసేలా చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాలు, భిన్నమైన సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన వారు, ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అని స్టూడియోలు, స్టేజ్‌ల చుట్టూ చక్కర్లు కొట్టిన గాయకులు కూడా ఇందులో ఉన్నారు. అలాంటి వారు తమ టాలెంట్‌ను ఈ మ్యూజిక్ ఫెస్టివల్లో ప్రదర్శించే అవకాశం రావడానికి ప్రధాన కారణం నెక్సా మ్యూజిక్ ల్యాబ్. నేషనల్వైడ్ టాలెంట్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ ‘నెక్సా మ్యూజిక్ ల్యాబ్’ మారుమూల ప్రాంతాల నుంచి మహా పట్టణాల వరకు మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకువచ్చి అంతర్జాతీయ స్థాయిలో మెరిపిస్తోంది. ఈ పోటీలో పాల్గొనదలచినవారు మూడు నిమిషాల నిడివి ఉన్న ఒరిజినల్ ఇంగ్లీష్ మ్యూజిక్ కంపోజిషన్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పాప్, జాజ్, ఫ్యూజన్...మ్యూజిక్ జానర్ ఏదైనా ఫరవాలేదు. దీంతో పాటు నెక్సా మ్యూజిక్ అడిషన్లో కూడా పాల్గొనవలసి ఉంటుంది. ఎంట్రీలకు మినీమం ఏజ్ లిమిట్...పద్దెనిమిది సంవత్సరాలు. సబ్మిట్ చేసిన ఎంట్రీలు నియమ, నిబంధనలకు తగినట్లుగా లేకపోతే నెక్సా గ్యాలరీలో కనిపించవు. అయినా నిరాశ చెందనక్కర్లేదు. తప్పులు సవరించుకొని ఫ్రెష్‌గా పంపవచ్చు. వ్యక్తిగత స్థాయిలోనూ, మ్యూజిక్ బ్యాండ్‌లో ఒకరిగా కూడా పాల్గొనవచ్చు. ఏఆర్ రెహమాన్ నేతృత్వంలోని జ్యూరీ 24 మందిని ఎంపిక చేస్తుంది. వీరికి నెక్సా మ్యూజిక్ సీజన్లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ ఇరవైనాలుగు మంది నుంచి ఫైనల్‌గా నలుగురిని ఎంపిక చేసి, వారి చేత పాడించిన ఆల్బమ్‌లను అంతర్జాతీయంగా విడుదల చేస్తారు. దిల్లీకి చెందిన నిశా నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన యువ మ్యూజిక్ బ్యాండ్ ‘హీట్ సింక్’ వరకు ఎంతోమందిలో కొత్త వెలుగు తీసుకువచ్చింది నెక్సా మ్యూజిక్ ల్యాబ్. బహుముఖ ప్రతిభ నెక్సా సీజన్ 1 విజేతగా నిలిచిన దిల్లీకి చెందిన నిశా శెట్టి సింగర్, సాంగ్‌రైటర్, వాయిస్ ఒవర్ ఆర్టిస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది. చిన్నప్పటి నుంచి నాటకాలు, వాటికి సంబంధించిన వర్క్‌షాప్‌లను చూస్తూ పెరిగింది. కథక్, కూచిపూడి, హిందుస్థానీ శాస్త్రీయసంగీతం నేర్చుకుంది. చిన్న చిన్న షోలలో పాల్గొనే నిశాకు ‘నెక్సా మ్యూజిక్ ల్యాబ్’ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. ‘ఎంపికైన విజేతలలో మీరు ఒకరు’ అంటూ నిర్వాహకుల నుంచి వచ్చిన మెయిల్ నేహాకు ఎప్పుడూ గుర్తుండే తియ్యటి జ్ఞాపకం. ‘కలలు కనడం వరకు మాత్రమే పరిమితం కాకూడదు. కల సాకారం చేసుకునే శక్తి కోసం ఎక్కడెక్కడో వెదకనక్కర్లేదు. అది మన దగ్గరే ఉంది’ అంటుంది నిశా శెట్టి. -
నెక్సా కస్టమర్లు 20 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెక్సా రిటైల్ చైన్ల ద్వారా ఇప్పటి వరకు 20 లక్షల కార్లు రోడ్డెక్కాయని మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది. ప్రీమియం కార్ల విక్రయాల కోసం 2015లో నెక్సా కేంద్రాలను కంపెనీ ప్రారంభించింది. బలేనో, ఇగ్నిస్, సియాజ్, ఎక్స్ఎల్6, గ్రాండ్ వితారా మోడళ్లు ఇక్కడ కొలువుదీరాయి. త్వరలో మార్కెట్లోకి రానున్న ఎస్‌యూవీలు ఫ్రాంక్స్, జిమ్నీ సైతం వీటి సరసన చేరనున్నాయి. ఇతర మోడళ్లను అరీనా ఔట్లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. హ్యుండై, టాటా మోటార్స్ విక్రయాల కంటే నెక్సా కేంద్రాల ద్వారా వచ్చే ఏడాది అధిక యూనిట్లను నమోదు చేయాలన్నది లక్ష్యమని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. రెండవ స్థానం దిశగా.. తొలి 10 లక్షల యూనిట్లకు నాలుగేళ్లు, ఆ తర్వాతి 10 లక్షల యూనిట్లకు మూడేళ్ల సమయం పట్టిందని శశాంక్ వెల్లడించారు. ‘ప్రస్తుతం మారుతీ సుజుకీ అరీనా, హ్యుండై, టాటా మోటార్స్ తర్వాత నెక్సా నాల్గవ స్థానంలో ఉంది. వచ్చే ఏడాది రెండవ స్థానానికి చేరుతుంది. సంస్థ మొత్తం విక్రయాల్లో 47 శాతం వృద్ధితో నెక్సా వాటా 23 శాతం ఉంది. దేశీయ ప్యాసింజర్ కార్ల రంగంలో నెక్సా 10 శాతం వాటా కైవసం చేసుకుంది. ఈ ఔట్లెట్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 2.55 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022–23లో 3.7 లక్షల యూనిట్లు ఆశిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త మోడళ్లు, గ్రాండ్ వితారా కారణంగా నెక్సా నుంచి 6 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటాం’ అని వివరించారు. పరిశ్రమ కంటే మెరుగ్గా.. 2023–24లో ప్యాసింజర్ వాహన పరిశ్రమ వృద్ధి 5–7.5 శాతం ఆశిస్తున్నామని శశాంక్ తెలిపారు. ‘పరిశ్రమలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్లు, 2023–24లో 41 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు కావొచ్చు. ఆర్థిక వృద్ధి, రుతుపవనాల సరళి, గ్రామీణ మార్కెట్‌పై దాని ప్రభావం, వడ్డీ రేట్ల పెరుగుదల, నగదు లభ్యత స్థాయిలు, పరిస్థితులకు తగ్గట్టుగా వాహన తయారీ కంపెనీలు చేపట్టిన ధరల పెంపు వంటి అంశాల ఆధారంగా ఈ వృద్ధి ఆధారపడి ఉంటుంది. పరిశ్రమ కంటే మెరుగైన వృద్ధిని మారుతీ సుజుకీ ఆశిస్తోంది’ అని పేర్కొన్నారు. -
ఖరీదైన కారు కొన్న రచ్చ రవి, ధరెంతంటే..
నటుడు, కమెడియన్ రచ్చ రవి ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దసరా పండుగ సందర్భంగా కొత్త కారు కొన్నట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు నెక్సా గ్రాండ్ వింటారా కారును కొనుగోలు చేసి దానితో దిగిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా ‘ఇన్ని సంవత్సరాలు నాకు మద్దతుగా నిలుస్తున్న మీ అందరికి నా ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు. కాగా రచ్చ ఈ కారు విలువ దాని ఫీచర్లను బట్టి దాదాపు రూ. 20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. చదవండి: ఆదిపురుష్ టీజర్‌పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు రచ్చ రవి. ఈ షోలో తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో కమెడియన్‌గా మంచి గుర్తింపు పొందాడు. అదే క్రేజ్‌తో సినిమాల్లో సైతం ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో జబర్థస్త్ షో నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. దీంతో నటుడిగా తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రవిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. View this post on Instagram A post shared by Racha Ravi (@meracharavi) -
బాలెనో, ఆల్ట్రోజ్ కంటే తక్కువ ధరలో.. i20 ఎరా!
న్యూఢిల్లీ: హ్యచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి హ్యుందాయ్ తెరలేపింది. పప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఐ 20 ధరలు తగ్గించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మార్కెట్లో పోటీగా ఉన్నా టాటా, నెక్సాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. మాగ్నాకంటే తక్కువ హ్యచ్‌బ్యాక్ సెగ్మెంట్లో హ్యుందాయ్ ఐ20కి మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఐ20 మోడల్లో మాగ్నా వేరియంట్ ధర తక్కువ. ఢిల్లీ ఎక్స్ షోరూమ్‌లో మాగ్నా ట్రిమ్ వేరియంట్ ధర రూ. 6.85 లక్షల నుంచి రూ.8.21 లక్షల వరకు లభిస్తోంది. ఇప్పుడు ఇంత కంటే తక్కువ ధరలో ఐ20 ఎరా ట్రిమ్ మోడల్‌ను మార్కెట్లోకి తెస్తోంది. రూ. 6 లక్షల దగ్గర కేవలం పెట్రోల్ వెర్షన్లోనే లభించే హ్యుందాయ్ ఐ20 ఎరా ట్రిమ్ మోడల్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇదే సెగ్మెంట్లో టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 5.80 లక్షలు, నెక్సా బాలెనో ధర రూ. 5.98 లక్షలుగా ఉంది. ఇంచుమించు వీటికి దగ్గరగానే ఐ20 ఎరా ట్రిమ్ ప్రైస్ ఉండేలా హ్యుందాయ్ జాగ్రత్త పడుతోంది. నో కాంప్రమైజ్ ధర తగ్గించినప్పటికీ కారు బిల్ట్ క్వాలిటీలో హ్యుందాయ్ పెద్దగా కాంప్రమైజ్ కావడం లేదు.పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, మాన్యువల్ ఎయిర్ కండీషన్, మాన్యువల్ గేర్ సిస్టమ్ అందిస్తోంది. అయితే వెనుక వైపు పవర్ విండోస్‌కి బదులు మాన్యువల్ విండోస్ అందించింది. నేటి ట్రెండ్‌కి తగ్గ ఇన్ఫోంటైన్ సిస్టమ్ కాకుండా బేసిక్ ఇన్ఫోంటైన్ సిస్టమ్ అందిస్తోంది. త్వరలో ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాలు హ్యుందాయ్ వెల్లడించనుంది. -
మారుతి నెక్సా రికార్డ్
మారుతి సుజుకీ నెక్సా కార్లను 10 లక్షల మేర (మిలియన్ కార్లు) విక్రయించి రికార్డు సృష్టించింది. 2015లో ఈ కారును మారుతి సుజుకీ ఆవిష్కరించింది. నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 200 పట్టణాల పరిధిలోని 350 ఔట్లెట్ల వద్ద ఇది అందుబాటులో ఉంది. పైగా దేశంలో మూడో అతిపెద్ద బ్రాండ్‌గానూ అవతరించింది. -
మారుతి కార్లపై భారీ తగ్గింపు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : మారుతి సుజుకి తన కార్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. మారుతీ సుజుకీ ప్రధాన డీలర్ షిప్ నెక్సా ద్వారా విక్రయిస్తున్న కార్లపై సూపర్ డీల్స్ అందిస్తోంది. ఎంపిక చేసిన వివిధ మోడళ్లపై సుమారు రూ.60 వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఏప్రిల్ నెలలో మాత్రమే ఈ డిస్కౌంట్ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. సియాజ్, బాలెనో, ఎస్-క్రాస్, ఇగ్నిస్ కార్లపై ఈ డిస్కౌంట్ రేట్లు అందుబాటులో ఉన్నాయి. ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ పై రూ.33 వేల దాకా తగ్గింపును అందిస్తోంది. ఇందులో 15 వేల రూపాయల డిస్కౌంట్, 15 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. అలాగే నెక్సా డీలర్ షిప్ కింద పరిచయమైన మొదటి మోడల్ కార్ ఎస్-క్రాస్‌పై ఏకంగా రూ.55 వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో 20 వేల రూపాయల డిస్కౌంట్, రూ. 25 వేల ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 10 వేల కార్పొరేట్ డిస్కౌంట్స్ ఉన్నాయి. -
మారుతీ కొత్త కారు లాంచింగ్ అప్పుడేనట!
మారుతీ సుజుకీ నుంచి ఎంతోకాలంగా వేచిచూస్తున్న ఇగ్నిస్ మోడల్ కారు మార్కెట్లోకి వచ్చేస్తోంది. 2016 జనవరి 13న ఈ కారును దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టనున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. మారుతీ సుజుకీ అధికారిక వెబ్సైట్లో 'ఇగ్నిస్ కమింగ్ సూన్' అనే విషయాన్ని కంపెనీ పొందుపరిచినట్టు తెలిసింది. రిట్జ్‌కు రీప్లేస్‌గా ఈ మోడల్‌ను మారుతీసుజుకీ ప్రవేశపెడుతోంది. మొదటిసారి 2016 ఆటో ఎక్స్‌లో ఈ కారును ప్రదర్శించారు. నెక్సా డీలర్షిప్ ద్వారా ఈ కారును కంపెనీ విక్రయించనుంది. గుజరాత్లో ఏర్పాటుచేసిన కొత్త ప్లాంటులో ఈ కారును కంపెనీ తయారుచేసింది. మహింద్రా కేయూవీ100కి పోటీగా ఇగ్నిస్ మోడల్ మార్కెట్లోకి రాబోతుంది. ఇగ్నిస్ మోడల్ ప్రత్యేకతలు... 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, దాంతో పాటు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో హెడ్‌ల్యాంప్స్ నావిగేషన్‌తో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్ప్లే యూఎస్బీ ఏయూఎక్స్ భద్రతా పరమైన ఫీచర్లు: యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ధర