మార్చికల్లా మరో 150 స్టోర్స్
ప్రస్తుతం 500 కేంద్రాలు
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ నెక్సా ఔట్‌లెట్లను పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. బెంగళూరులో 500వ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 150 స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇందులో 100 కేంద్రాలు చిన్న నగరాల్లో రానున్నాయని వెల్లడించింది. నెక్సా సేల్స్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు చాలా దూకుడుగా ప్లాన్ చేశామని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు పెద్ద ఎత్తున వెళ్లాలన్నది తమ ప్రణాళిక అని వెల్లడించారు. నెక్సాలో లభించే మోడళ్లకు ఈ నగరాల నుంచి మంచి డిమాండ్ ఉందన్నారు. కార్యక్రమంలో మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నొబుటాకో సుజుకీ కూడా పాల్గొన్నారు.
నెక్సా వాటా 37 శాతం..
మారుతీ సుజుకీ 2015 జూలైలో నెక్సా ఔట్‌లెట్లకు శ్రీకారం చుట్టింది. ఏడాదిలోనే 94 నగరాల్లో 100 నెక్సా షోరూంలను నెలకొలి్పంది. ప్రస్తుతం ఇగ్నిస్, బలీనో, ఫ్రాంక్స్, సియాజ్, జిమ్నీ, ఎక్స్‌ఎల్6, గ్రాండ్ విటారా, ఇని్వక్టో మోడళ్లను నెక్సా షోరూంలలో కంపెనీ విక్రయిస్తోంది. సంస్థ మొత్తం విక్రయాల్లో నెక్సా వాటా 37 శాతం ఉంది. 2023–24లో 54 శాతం వృద్ధితో నెక్సా షోరూంల ద్వారా 5.61 లక్షల కార్లు రోడ్డెక్కాయి. నెక్సా స్టూడియో పేరుతో చిన్న కేంద్రాలను కంపెనీ ఏర్పాటు చేస్తోంది. సంస్థ ఖాతాలో అరీనా, నెక్సా, కమర్షియల్ ఔట్‌లెట్ల సంఖ్య ప్రస్తుతం 3,925కు చేరుకుంది. ఇవి దేశవ్యాప్తంగా 2,577 నగరాలు, పట్టణాల్లో విస్తరించాయి.
Comments
Please login to add a commentAdd a comment