
సాక్షి, న్యూఢిల్లీ : మారుతి సుజుకి తన కార్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. మారుతీ సుజుకీ ప్రధాన డీలర్ షిప్ నెక్సా ద్వారా విక్రయిస్తున్న కార్లపై సూపర్ డీల్స్ అందిస్తోంది. ఎంపిక చేసిన వివిధ మోడళ్లపై సుమారు రూ.60 వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఏప్రిల్ నెలలో మాత్రమే ఈ డిస్కౌంట్ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. సియాజ్, బాలెనో, ఎస్-క్రాస్, ఇగ్నిస్ కార్లపై ఈ డిస్కౌంట్ రేట్లు అందుబాటులో ఉన్నాయి.
ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ పై రూ.33 వేల దాకా తగ్గింపును అందిస్తోంది. ఇందులో 15 వేల రూపాయల డిస్కౌంట్, 15 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. అలాగే నెక్సా డీలర్ షిప్ కింద పరిచయమైన మొదటి మోడల్ కార్ ఎస్-క్రాస్‌పై ఏకంగా రూ.55 వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో 20 వేల రూపాయల డిస్కౌంట్, రూ. 25 వేల ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 10 వేల కార్పొరేట్ డిస్కౌంట్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment