Discount offers
-
సీజన్ ముగిసినా.. సందడే సందడి
పండుగ సీజన్ ముగిసిపోయినా కార్ల విషయంలో మాత్రం ఆఫర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. వివిధ కార్ల కంపెనీలు నగదు డిస్కౌంట్లు, ఇతరత్రా బహుమతులతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆటో డీలర్ల అసోసియేషన్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా వాహన రిటైలర్ల దగ్గర 75–80 రోజులకు సరిపోయే నిల్వలు పేరుకుపోయాయి. వీటి విలువ సుమారు రూ. 75,000 కోట్లుగా ఉంటుంది. వాహన విక్రయాల గణాంకాలకు సంబంధించిన వాహన్ పోర్టల్ ప్రకారం నవంబర్‌లో తొలి ఇరవై రోజుల్లో 1,77,362 ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మరోవైపు, కార్ల కంపెనీలన్నీ కలిసి నవంబర్‌లో సుమారు 3,25,000 నుంచి 3,30,000 వరకు వాహనాలను హోల్‌సేల్‌గా డీలర్లకు సరఫరా చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వాహన నిల్వలను తగ్గించుకోవడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ‘‘ఏడాది చివరన పాత స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీలు సాధారణంగా ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. డీలర్ల దగ్గర ఏకంగా 65–70 రోజులకు సరిపడా నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సంస్థలు భారీగా డిస్కౌంట్లకు తెరతీశాయి. ఇది ఒక రకంగా కార్ల కొనుగోలుదార్లకు అసాధారణ అవకాశంలాంటిదే’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ మొబిలిటీ వర్గాలు తెలిపాయి.30% వరకు..కంపెనీలు అధికారికంగా రేట్ల తగ్గింపు లేదా డిస్కౌంట్లపై ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ డిసెంబర్ 31 వరకు డీలర్ల దగ్గర చాలామటుకు మోడల్స్ ధరలపై (ఎక్స్‌షోరూమ్) 20–30 శాతం డిస్కౌంటును కొనుగోలుదార్లు ఆశించవచ్చని ఎఫ్ఏడీఏ వర్గాలు తెలిపాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి డిస్కౌంట్లు ఉంటాయని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. అంతగా అమ్ముడు కాని మోడల్స్ పేరుకుపోయినా, లేక అమ్ముడవుతున్న స్థాయికి మించి ఉత్పత్తి చేసినా.. ఆ నిల్వలను వదిలించుకోవడానికి భారీ డిస్కౌంట్లు ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. మరోవైపు, పెళ్ళిళ్ల సీజన్, ప్రమోషనల్ ఆఫర్లు మొదలైనవి ప్యాసింజర్ కార్ల అమ్మకాలు పెరగడానికి దోహదపడగలవని ఆశిస్తున్నట్లు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. గణనీయంగా నిల్వలు పేరుకుపోయి ఉన్నందున తయారీ కంపెనీలు సరఫరాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. ఆఫర్ల వెల్లువ.. → ఎరీనా షోరూమ్‌లలో మారుతీ సుజుకీ ఇండియా తమ ఆల్టో కే10, వ్యాగన్ఆర్, సెలీరియో, ఎస్ప్రెసో కార్లపై రూ. 20,000–35,000 వరకు రిబేట్ ఇస్తోంది. వేరియంట్లను బట్టి స్విఫ్ట్‌పై రూ. 25,000–50,000 వరకు, బ్రెజాపై రూ. 10,000–20,000 వరకు డిస్కౌంట్ ఉంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 15,000 ఎక్సే్చంజ్ బోనస్, మోడల్‌ను బట్టి రూ. 2,100–2,300 వరకు కార్పొరేట్ డిస్కౌంట్లకు ఇది అదనమని పేర్కొన్నాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ. 35,000–45,000 వరకు, ఆరాపై రూ. 20,000 వరకు, ఐ20పై 20,000–45,000 వరకు, ఎక్స్టర్పై (నిర్దిష్ట వేరియంట్స్‌పై) రూ. 20,000–30,000 వరకు, వెన్యూపై 45,000–50,000 వరకు (వేరియంట్‌ను బట్టి), వెర్నాపై రూ. 70,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇక టక్సన్పై రూ. 50,000, అయానిక్ 5 ఈ–ఎస్‌యూవీపై రూ. 2 లక్షల మేర డిస్కౌంట్లు ఇస్తోంది. → టాటా మోటార్స్ కూడా అ్రల్టోజ్పై రూ. 25,000, పంచ్‌పై (ఐసీఈ వెర్షన్) రూ. 20,000 నగదు డిస్కౌంట్ ఇస్తోంది. అటు టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్ సెడాన్, నెక్సాన్ ఎస్‌యూవీల ధరలు (ఐసీఈ మోడల్స్) వరుసగా రూ. 4.99 లక్షలు, రూ. 5.99 లక్షలు, రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. → మహీంద్రా అండ్ మహీంద్రా కూడా కొన్ని మోడల్స్‌లో నిర్దిష్ట వేరియంట్లపై, లభ్యతను బట్టి, పరిమిత కాలంపాటు ఆఫర్లు అందిస్తోంది. బొలెరో నియోపై రూ. 70,000 వరకు, స్కారి్పయో ఎన్‌పై రూ. 50,000, థార్ 4 ్ఠ4పై రూ. 1.25 లక్షలు క్యాష్ డిస్కౌంటు ఇస్తోంది. ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్‌పై ఏకంగా రూ. 3 లక్షల నగదు డిస్కౌంట్ ఉంటోంది. → హోండా కార్స్ ఇండియా, జీప్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తదితర కార్ల కంపెనీలు కూడా ఏడాది ఆఖరు నాటికి నిల్వలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
Lok sabha elections 2024: ఓటేస్తే డిస్కౌంట్... ఫ్రీ హెయిర్ కట్!
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం! మన రాత మారాలన్నా, నేతల తలరాతలు మార్చాలన్నా మన చేతుల్లోనే ఉంది. అందుకే ప్రతి ఓటరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం కోడై కూస్తోంది. అయినా కొందరిలో మాత్రం చలనం శూన్యం. అందుకే, ఈ ఓట్ల జాతరలో దుమ్మురేపేందుకు మేము సైతం అంటున్నారు కొందరు ఔత్సాహిక వ్యాపారులు. అటు ఓటింగ్ శాతం, ఇటు తమ వ్యాపారం పెరిగేలా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ‘ఓటేసి వేలిపై సిరా చుక్క చూపండి, డిస్కౌంట్ పొందండి’ అంటూ ఓటర్లను ఊరిస్తున్నారు. ఉత్తరాఖండ్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ తాజాగా ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రంలో 19న శుక్రవారం ఒకే విడతలో లోక్‌సభ ఎన్నికలు పూర్తవుతాయి. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి 20వ తేదీ సాయంత్రం దాకా తమ హోటళ్లు, రెస్టారెంట్లలో ఏం తిన్నా బిల్లులో 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, వేలిపై సిరా గుర్తు చూపి డిస్కౌంట్ పొందచ్చొని అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ సాహ్ని చెబుతున్నారు. శుక్రవారమే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనున్న తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో కూడా ఓటేసిన వారికి పోలింగ్ రోజు హోటళ్లు, ఫుడ్ స్టాల్స్, బేకరీలు.. ఇలా ఎక్కడ ఏం తిన్నా 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఓటర్లను ప్రోత్సహించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.అరుణ్ రాజ్ చెప్పారు. ఇక కాంచీపురం కలెక్టర్ కలైసెల్వి మోహన్ వాటర్ బాటిళ్లపై పోలింగ్ సంబంధ పోస్టర్లను అతికించడం ద్వారా ఓటర్లలో చైతన్యం నింపుతున్నారు. ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరిగే మహారాష్ట్రలోని అకోలాకు చెందిన అనంత కౌల్కర్ అదిరిపోయే ఆఫరిచ్చాడు. ఓటేసి సిరా గుర్తు చూపిన వారికి తన సెలూన్లో ఫ్రీగా హెయిర్ కట్ చేస్తాననంటూ షాపు ముందు బోర్డు పెట్టేశాడు. మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనున్న జంషెడ్‌పూర్‌లో కూడా ఓటేసిన వారికి హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు డిస్కౌంట్ ఇచ్చేలా ఈసీ అధికారులు ఒప్పించారు. గత నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో 2,600 పై చిలుకు పోలింగ్ బూత్‌లకు ఫ్రీ రైడ్స్ ఆఫర్ చేయడం తెలిసిందే. ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జూన్ 1 దాకా సుదీర్ఘంగా జరగనున్న నేపథ్యంలో ఆఫర్ల జోరు కూడా పెరిగేలా కనిపిస్తోంది! -
అలా కనిపిస్తాయంతే.. డిస్కౌంట్లపై జొమాటో సీఈవో నిజాయితీ కామెంట్
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లలో మనం తరచూ 50 శాతం.. 60 శాతం అంటూ కొన్ని డిస్కౌంట్ ఆఫర్లను చూస్తుంటాం. అయితే ఆ ఆఫర్ల గుట్టును బయటపెట్టారు జొమాటో (Zomato) సీఈవో దీపిందర్ గోయల్ (Deepinder Goyal). యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా తన పోడ్కాస్ట్ 'ది రణవీర్ షో'లో చర్చ సందర్భంగా, జొమాటో తన కస్టమర్లకు అంతంత తగ్గింపులను ఎలా అందించగలదని గోయల్‌ను ప్రశ్నించారు. దీనికాయన సమాధానమిస్తూ.. "ఆ డిస్కౌంట్లు అంత పెద్దవేమీ కావు, అలా కనిపిస్తాయంతే" అని నిష్కపటంగా వ్యాఖ్యానించారు. జొమాటో తరచుగా "రూ. 80 వరకు 50% తగ్గింపు" వంటి ఆఫర్లను అందజేస్తుందని, వాస్తవానికి ఇక్కడ లభించే డిస్కౌంట్ రూ. 80 మాత్రమేనని, పూర్తిగా 50 శాతం తగ్గింపు కాదు అని దీపిందర్ గోయల్ స్పష్టం చేశారు. ఉదాహరణకు గోయల్ లెక్కల ప్రకారం.. ఆర్డర్ మొత్తం రూ. 400 అయితే దానిపై లభించే డిస్కౌంట్ రూ.80 అంటే తగ్గింపు 20 శాతం మాత్రమే. అందులో నిజాయితీ లేదు ఈ డిస్కౌంట్ పద్ధతి కస్టమర్లను తప్పుదారి పట్టించవచ్చని గోయల్ అంగీకరించారు. దాన్ని మార్చాలని తనకు ఉన్నప్పటికీ, పోటీదారులు ఈ అతిశయోక్తి తగ్గింపు ఆఫర్లను కొనసాగిస్తున్నప్పుడు జొమాటో మాత్రమే దీన్ని మార్చడం కష్టమన్నారు. ‘నేను ఈ రకమైన డిస్కౌంట్లను నిజాయితీగా పరిగణించను. డిస్కౌంట్లు సూటిగా, నిజాయితీగా ఉండాలి. మీరు మీ కస్టమర్‌కు తగ్గింపును వాగ్దానం చేస్తే, అది స్పష్టంగా ఉండాలి’ అని గోయల్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక వ్యాపార ప్రత్యర్థులు అయినప్పటికీ, స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటీతో తన స్నేహపూర్వక సంబంధం గురించి గోయల్ పంచుకున్నారు. తాము కలిసినప్పుడు వ్యాపార విషయాలను మాట్లాడుకోమని వివరించారు. ఇదీ చదవండి: షాపింగ్ చేస్తున్నారా? బెస్ట్ క్యాష్ బ్యాక్ ఆఫర్లున్న క్రెడిట్‌కార్డులు ఇవే.. -
అనైతిక డిస్కౌంట్లను ప్రభుత్వం కట్టడి చేయాలి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ రంగంలో రేట్లను పెంచేసి ఆపైన భారీగా డిస్కౌంట్లు ప్రకటించడం లాంటి అనైతిక ధోరణులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం, సంబంధిత నియంత్రణ సంస్థలు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీయూటీఎస్ ఇంటర్నేషనల్ సంస్థ ఒక నివేదికలో అభిప్రాయపడింది. అసలు రేటు ఎక్కువే ఉన్నప్పటికీ తాము తక్కువకే కొంటున్నామనే తప్పుడు భావనను వినియోగదారుల్లో కలిగించే ఇలాంటి పద్ధతులు .. మోసం కిందకే వస్తాయని పేర్కొంది. ఫ్లాష్ అమ్మకాలపై ఎకాయెకిన నిషేధం విధించడం కాకుండా వినియోగదారుల హక్కుల పరిరక్షణను పటిష్టం చేయడంపైనా, మార్కెట్లో విక్రేతలందరికీ సమాన అవకాశాలు లభించేలా చూడటంపైనా ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీయూటీఎస్ వివరించింది. భారీగా డిస్కౌంటునివ్వడం, పోటీ సంస్థలను దెబ్బతీసే ఉద్దేశంతో అత్యంత చౌకగా అమ్మడం అనే రెండు విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలను నిర్దేశించాలని పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండింటినీ ఒకదానికొకటి పర్యాయపదాలుగా ఉపయోగిస్తుండటం వల్ల గందరగోళం నెలకొందని తెలిపింది. -
‘ఆ డిస్కౌంట్లు అనైతికం.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’
ఈ-కామర్స్ రంగంలో ధరలు పెంచి డిస్కౌంట్లను అందించడం వంటి అనైతిక పద్ధతులను అరికట్టడానికి ప్రభుత్వం, సంబంధిత నియంత్రణ సంస్థలు తక్షణమే చర్యలు తీసుకోవాలని వినియోగదారులకు సంబంధించిన మేధో సంస్థ ‘కట్స్ ఇంటర్నేషనల్’ (CUTS International) తాజాగా విడుదల చేసిన నివేదికలో సూచించింది. అసలు ధరలు ఎక్కువగా చూపి పొదుపుపై తప్పుడు అవగాహన కల్పించడం ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నారని పేర్కొంది. ఫ్లాష్ సేల్స్‌పై పూర్తిగా నిషేధం విధించే బదులు, వినియోగదారుల రక్షణ చర్యలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, మార్కెట్లో వ్యాపార సంస్థలన్నింటికీ సమాన అవకాశాలు ఉండేలా చూడాలని సూచించింది. న్యాయమైన, స్థిరమైన ఈ-కామర్స్ వ్యవస్థను ప్రోత్సహించడానికి, విక్రేతలు తమ ఉత్పత్తుల ధరలను నిర్ణయించే స్వయంప్రతిపత్తిని కలిగి ఉండటం చాలా కీలకం. డిస్కౌంట్ భారాన్ని విక్రేతలపై మోపడం ఆర్థిక ఒత్తిడికి దారి తీస్తుందని, వారి లాభాల మార్జిన్లు క్షీణించవచ్చని నివేదిక పేర్కొంది. వినియోగదారుల సంక్షేమం కోసం, అమ్మకందారులందరూ మార్కెట్లో నిలదొక్కుకోవడం కోసం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఉత్పత్తులు/విక్రయదారుల 'సెర్చ్, ర్యాంకింగ్' పరంగా స్వీయ-ప్రాధాన్యత వంటి పద్ధతులలో పాల్గొనకూడదని సిఫార్సు చేసింది. -
బంపరాఫర్ : డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుగోలుపై 10 లక్షల డిస్కౌంట్!
స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, ఇతర పండగల సీజన్లో ఆయా ఈ - కామర్స్ కంపెనీలు, స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కొనుగోలు దారుల్ని ఆకట్టుకునేందుకు భారీ ఎత్తున డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అందుకు అనుగుణంగా వినియోగదారులు తక్కువ ధరకే తమకు కావాల్సిన వస్తువులు సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. వ్యాపారం కూడా భారీ ఎత్తున జరుగుతుంది. ఇప్పుడీ ఈ డిస్కౌంట్ ఫార్మలానే రియల్ ఎస్టేట్ కంపెనీలు అప్లయ్ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు రియాలిటీ సంస్థలు కొనుగోలు దారులకు తక్కువ ధరలకే వారు కోరుకున్న ప్లాట్లు, విల్లాలు, వన్ బీహెచ్‌కే, టూబీహెచ్‌కే ఇళ్లను అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ( ఫైల్ ఫోటో ) 👉 ముంబైకి చెందిన డెవలపర్లు ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31వరకు అపార్ట్మెంట్లను బుక్ చేసుకునే గృహ కొనుగోలుదారులకు జీరో స్టాంప్ డ్యూటీ, ఫ్లెక్సీ పేమెంట్ ప్లాన్ (బై నవ్ పే లేటర్) 12 నెలల ఈఎంఐ మినహాయింపును అందిస్తున్నారు. జీఎస్టీని సైతం రద్దు చేస్తున్నారు. 👉 జేపీ ఇన్ఫ్రా జీరో స్టాంప్ డ్యూటీ, ఫ్లెక్సీ-పేమెంట్ ప్లాన్, 12 నెలల ఈఎంఐ మినహాయింపును అందిస్తుంది. ఆఫర్లో భాగంగా స్టాంప్ డ్యూటీ, జీఎస్టీని మినహాయించింది. 👉 త్రిధాతు రియాల్టీ అనే సంస్థ 2 బీహెచ్‌కే యూనిట్‌పై రూ. 10 లక్షలు, 3 బీహెచ్‌కే పై 20 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ( ఫైల్ ఫోటో ) 👉ఢిల్లీ-ఎన్సీఆర్లో భూటానీ ఇన్ఫ్రా సొంతింటి కలల్ని నిజం చేసుకునేందుకు వీలుగా ఓ స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. పథకంలో కస్టమర్లు కోరుకున్న ధరకే ప్రాపర్టీని అందిస్తున్నట్లు తెలిపింది. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 15 వరకు కొనసాగే ఈ స్కీమ్‌లో రూ.1 కోటి అంతకంటే ఎక్కువ విలువైన 77 యూనిట్ల కేటాయింపును లక్కీ డ్రా ఆధారంగా నిర్ణయిస్తారు. 👉 పథకం కింద, కొనుగోలుదారులు భూటానీ ఇన్ఫ్రా ప్రాపర్టీని ఎంచుకుంటే ఎంత ధరకి ఆ స్థిరాస్థి కావాలనుకుంటున్నారో అంతకే కోట్ చేయొచ్చు. ఉదాహరణకు, ఒక యూనిట్ ధర రూ. 2 కోట్లు అయితే కొనుగోలుదారులు తమ బడ్జెట్ ప్రకారం రూ.1.75 కోట్లు లేదా రూ.1.5 కోట్ల ధరను కోట్ చేయవచ్చు. ఈ సందర్భంగా..లక్కీ డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తామని భూటానీ ఇన్ఫ్రా సీఈఓ ఆశిష్ భుటానీ తెలిపారు. ( ఫైల్ ఫోటో ) 👉 గౌర్స్ గ్రూప్ గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని గౌర్ వరల్డ్ స్మార్ట్‌స్ట్రీట్ ప్రాజెక్ట్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ప్రతి బుకింగ్‌పై కారును ఉచితంగా అందిస్తోంది. ఈ పథకం ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 13 రెండు రోజులు అందుబాటులో ఉంది. అంతేకాదు మూడు సంవత్సరాల పాటు షాపుల నిర్వహణ అంతా ఉచితం 👉 ఘజియాబాద్‌లోని గౌర్ ఏరోసిటీ మాల్లోని షాపుల కోసం కంపెనీ ప్రతి బుకింగ్‌పై ఐఫోన్‌ను అందిస్తోంది. 👉 బెంగళూరులో ప్రావిడెంట్ హౌసింగ్ సంస్థ ప్రస్తుతం ఫ్రీడమ్ ఆన్లైన్ హోమ్ ఫెస్ట్ 4.0ని నిర్వహిస్తోంది, ఇందులో కొనుగోలుదారులు ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా హౌసింగ్ యూనిట్‌ను బుక్ చేసుకోవచ్చు. గరిష్ట ధర రూ. 12 లక్షలుగా నిర్ణయించింది. ఇలా డిస్కౌంట్ ధరలకే వారికి నచ్చిన ప్లాట్లను అందిస్తూ సేల్స్‌ను పెంచే ప్రయత్నం చేస్తున్నాయి ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలు. చదవండి👉 6 నెలల్లో ఏకంగా రూ.15 వేలు పెరిగిన ఇంటి అద్దె! -
కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్స్ చూడండి!
భారతదేశంలో త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. అంతకంటే ముందు మహీంద్రా, మారుతి సుజుకి కంపెనీలు ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా కంపెనీ తన థార్ 4x4, బొలెరో, బొలెరో నియో, మరాజో, ఎక్స్యువి300 వంటి కార్ల మీద డిస్కౌంట్స్, బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో భాగంగానే కనిష్టంగా రూ. 30,000 నుంచి గరిష్టంగా రూ. 73,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్స్ ఎంచుకునే వేరియంట్, ఇంజిన్ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. (ఇదీ చదవండి: హ్యుందాయ్ కొత్త కారు - టాటా ప్రత్యర్థిగా నిలుస్తుందా?) మారుతి సుజుకి విషయానికి వస్తే.. కంపెనీ ఈ నెలలో నెక్సా మోడల్స్ అయిన ఇగ్నిస్, సియాజ్, బాలెనో మీద రూ. 64,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి వాటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇక ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ ఆర్, సెలెరియో, స్విఫ్ట్, ఈకో, డిజైర్ మీద కూడా కంపెనీ రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. (ఇదీ చదవండి: ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!) మారుతి సుజుకి, మహీంద్రా కంపెనీలు అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ బెనిఫిట్స్ స్టాక్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని అధికారిక డీలర్షిప్ సందర్శించవచ్చు. -
స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు..
Flipkart Big Bachat Dhamaal Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డమాల్ సేల్ మళ్లీ వచ్చేసింది. స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. ఈ సేల్ మే 19న ప్రారంభమైంది. మే 21 వరకు కొనసాగుతుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a), ఐఫోన్ 14 (iPhone 14)తో పాటు కొత్తగా లాంచ్ అయిన మరికొన్ని స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి ఇది మంచి అవకాశం. స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్స్, ఇయర్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర గాడ్జెట్లపై సూపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై ఈ సేల్‌లో ఎలాంటి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయో ఓ లుక్కేయండి.. ఇదీ చదవండి: Redmi A2 Series: రూ. 6 వేలకే సరికొత్త స్మార్ట్ఫోన్లు.. లాంచ్ చేసిన షావోమీ గూగుల్ పిక్సెల్ 7ఏ కొత్తగా లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) ధర రూ. 43,999లుగా ఉంది. కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకుంటే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్చేంజ్ ద్వారా రూ. 34,000 వరకు తగ్గింపు లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ 6.1అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. Tensor G2 SoC చిప్‌తో జోడించారు. ఐఫోన్ 14 యాపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) 128 GB వేరియంట్ రూ. 69,999 వద్ద లభిస్తుంది . హెచ్డిఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇక పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్ఛేంజ్పై రూ. 33,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 14లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే ఉంది . Apple A15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. ఒప్పో రెనో 8 ప్రో 5G ఒప్పో రెనో (OPPO Reno) 8 Pro 5G (12 జీబీ ర్యామ్, 256 జీబీ రోమ్) ఫోన్‌ను రూ. 45,999లకే కొనుక్కోవచ్చు. అంతే కాకుండా కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని వాడుకుంటే 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. Mediatek డైమెన్సిటీ 8100 మాక్స్ ప్రాసెసర్ ఉన్న ఈ ఫోన్ 6.7 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. వివో T1X వివో (Vivo) T1X ఫోన్ 4GB ర్యామ్, 128GB రోమ్ వేరియంట్ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ సేల్‌లో రూ. 12,999 కే లభిస్తుంది. మరోవైపు కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకుంటే అదనంగా మరో 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక పాత ఫోన్ల ఎక్స్చేంజ్పై గరిష్టంగా రూ. 12,450 లభిస్తుంది. పోకో F5 5G ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పోకో (Poco) F5 5G ఫోన్ 8GB వేరియంట్ రూ. 29,999లకు లభిస్తోంది. కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్ప్లే, Qualcomm Snapdragon 7+ Gen2 చిప్సెట్ ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లు, వాటిపై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి తెలుసుకునేందుకు సాక్షి బిజినెస్ పేజీని చూడండి -
ఆఫర్ల జాతరకు సిద్ధమైన అమెజాన్..
అమెజాన్ భారత్‌లో తన మొదటి గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫ్ ది ఇయర్ ను ప్రకటించింది. ఇందులో స్మార్ట్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉంటాయని పేర్కొంది. ఈ ఆఫర్ల జాతర మే 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ గ్రేట్ సమ్మర్ సేల్కు సంబంధించిన టీజర్‌ను అమెజాన్ విడుదల చేసింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రైమ్ మెంబర్లకు ఒక రోజు ముందే అందుబాటులో ఉంటుంది. అమెజాన్ గృహోపకరణాలు, ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ఉత్పత్తులపై గ్రేట్ సమ్మర్ సేల్‌లో భారీ తగ్గింపులను అందించబోతున్నట్లు టీజర్లో పేర్కొంది. ఇదీ చదవండి: ఐఫోన్14 ప్లస్‌పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు! అమెజాన్ అందించే డిస్కౌంట్లరకు అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉంటాయని వెల్లడించింది. ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా 10 శాతం ఆదా చేసుకోవచ్చు. రాబోయే సేల్ కోసం అమెజాన్ ఒక వెబ్‌పేజీని రూపొందించింది. అందులో కొన్ని డీల్స్ ప్రివ్యూను అందిస్తుంది. స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు ఉండనున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ (OnePlus Nord CE 2 Lite)ని రూ. 18,499లకే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా రెడ్మీ (Redmi 12C) ఫోన్‌ను రూ.8,999లకు సొంతం చేసుకోవచ్చు. ఇక వన్‌ప్లస్ బుల్లెట్స్ జెడ్2 (OnePlus Bullets Z2)పై రూ.1,599 తగ్గింపు ఉంటుంది. ఐఫోన్ 14పై కూడా భారీ డిస్కౌంట్ ఉంటుందని అమెజాన్ హింట్ ఇచ్చింది. ఐఫోన్ 14 బేస్ మోడల్ ధర రూ.71,999. సరికొత్త స్మార్ట్ఫోన్లు, వాటి యాక్సెసరీస్‌పై 40 శాతం వరకు తగ్గింపు, నోకాస్ట్ ఈఎంఐలను ప్రకటించింది. అలాగే పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.10,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ సేల్‌లో ప్రైమ్ మెంబర్ల కోసం రూ. 5,000 విలువైన అమెజాన్ పే రివార్డ్‌లతో పాటు 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలపై.. టీవీలు, ఇతర ఉపకరణాలపై అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో కస్టమర్లు 60 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. వన్‌ప్లస్ వై సిరీస్ హెచ్డీ-రెడీ LED ఆండ్రాయిడ్ టీవీని రూ.14,999లకే కొనుక్కోవచ్చు. అలాగే ఎల్జీ 190L సింగిల్-డోర్ రిఫ్రిజిరేటర్ రూ. 17,490, 1.5-టన్నుల 5-స్టార్ AI ట్విన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఎయిర్ కండీషనర్ రూ. 46,490లకే లభిస్తుంది. ఇదీ చదవండి: Google Play Store: గూగుల్ సంచలనం! 3500 యాప్‌ల తొలగింపు.. -
ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్!
మే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో బట్టలు, స్మార్ట్ ఫోన్లు ఇతర గృహోపరకరణాలు కొనుగోలు చేయాలని అనుకున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ దేశీయ ఈ - కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కొనుగోలు దారులకు అదిరిపోయే సేల్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. మే 5 నుంచి మే 10 వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ పేరుతో ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్స్ ఆరు రోజుల పాటు జరిగే ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్‌లో ఎంపిక చేసిన ఉత్పత్తులపై 80 శాతం డిస్కౌంట్స్, బై వన్ గెట్ వన్ ఆఫర్లను పొందవచ్చు. అదే సమయంలో నిర్వహించే క్రేజీ డీల్స్, బెస్ట్ ప్రైస్ వంటి డీల్స్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. 80శాతం వరకు డిస్కౌంట్స్ ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం, గ్రూమింగ్, స్టైలిష్ ప్రొడక్ట్‌లపై ఆఫర్లు, మైక్రో ఎస్డీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్, హార్డ్ డ్రైవ్‌లపై 60 శాతం డిస్కౌంట్, టీవీలు, ఉపకరణాలపై 75 శాతం, రిఫ్రిజిరేటర్లు,వాషింగ్ మెషీన్లపై 55 శాతం, గృహోపకరణాలపై 70 శాతం డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు.ప్లిప్‌కార్ట్ సొంతం ప్రొడక్టులైన ఫ్యాషన్, బ్యూటీ,ఫుడ్, స్పోర్ట్స్ ప్రొడక్ట్, హోమ్, కిచెన్‌లో వినియోగించే వస్తువులపై 80శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ పాలసీ ఈ సేల్ మే 5న ప్రారంభమై మే 10న ముగుస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు మే 4న డీల్స్‌లో కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు 5శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ క్రెడిట్ కార్డ్ యూజర్లు రూ. 20వేల విలువైన సూపర్‌కాయిన్స్, రివార్డ్‌ల కంటే నాలుగు రెట్లు సంపాదించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ పాలసీలో వస్తువులు కొనుగోలు చేసి తర్వాత డబ్బులు చెల్లించే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. చదవండి👉 మే 1 నుంచి అమల్లోకి రానున్న ఫోన్ కాల్స్ నిబంధనలు! -
డిస్కౌంట్ ఇస్తే తప్పేంటి? కానీ...! కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:‘ఈ-కామర్స్ వేదికల్లో ఫ్లాష్ సేల్స్ గురించి ప్రభుత్వం ఆందోళన చెందడం లేదు. వినియోగదారుల ఎంపికలను పరిమితం చేయడానికి ఈ-రిటైలర్లు ఉపయోగించే దోపిడీ ధర, ఇతర మోసపూరిత పద్ధతులకు తాము వ్యతిరేకం’ అని వాణిజ్య, పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం స్పష్టం చేశారు. ‘ఫ్లాష్ సేల్స్ ప్రయోజనాలను పొందేందుకు తరచుగా ఈ-మార్కెట్ ప్లేస్ వేదికల్లోవస్తువులు కొనుగోలు చేసే వినియోగదారులు ఆన్లైన్ రిటైలర్ ఇష్టపడే లేదా ప్రమోట్ చేసిన సంస్థల ఉత్పత్తుల వైపునకు మళ్లించబడుతున్నారు. ఇది మోసం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలకు విరుద్ధం’ అని అన్నారు. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) డిస్కౌంట్లతో మంచి డీల్.. ‘ఎవరైనా డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటే నేనెందుకు ఫిర్యాదు చేయాలి. వినియోగదారులకు మంచి డీల్ లభిస్తోంది. ఈ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వస్తువులను డంపింగ్ చేయడం ద్వారా దోపిడీ ధరలను అనుసరించడం, వినియోగదారుల ఎంపికలను పరిమితం చేసే పద్ధతుల పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. త్వరలో ప్రవేశపెట్టనున్న ఈ-కామర్స్ విధానం ద్వారా అటువంటి మోసాలను ఆపడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. ఫ్లాష్ సేల్స్ విషయంలో ఈరోజు వినియోగదారుడు ఉత్సాహంగా ఉండవచ్చు. కానీ ఒక విధానకర్తగా నేను భారతీయ కస్టమర్లకు దీర్ఘకాలిక మంచిని చూడవలసి ఉంటుంది. దోపిడీ ధరలను లేదా ప్రజల ఎంపికలను మోసం చేసే విధంగా ఇటువంటి పద్ధతులను మేము వ్యతిరేకిస్తున్నాము’ అని మంత్రి తెలిపారు. (షాపింగ్ మాల్స్ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే!) చిన్నవారిని రక్షించుకుంటాం.. ‘విదేశీ ఈ-కామర్స్ సంస్థల వద్ద ఇబ్బడిముబ్బడిగా నిధులున్నాయి. వారికి భారతదేశంలో కొన్ని బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం, భారీ నష్టాలను నమోదు చేయడం సమస్య కాదు. ధర, వ్యయాలకు సంబంధం లేకుండా కస్టమర్లను సముపార్జించడమే లక్ష్యంగా ఇవి పనిచేస్తాయి. దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చట్టాలను ఈ–కామర్స్ సంస్థలు గౌరవించాల్సిందే. మార్కెట్ ప్లేస్ మార్కెట్ ప్లేస్‌గా మాదిరిగానే పనిచేయాలి. దిగ్గజ ఈ-కామర్స్ సంస్థల కారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కుటుంబ వ్యాపారాలు మూతపడ్డాయి. చిన్న రిటైల్ వ్యాపారులను కాపాడేందుకు, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం చివరివరకు వారికి అండగా ఉంటుంది. చిన్న వ్యాపారులను రక్షించే ఈ ప్రయత్నానికి భారత్ లేదా విదేశీయులైనా ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను’ అని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. -
అమెజాన్‌లో ఆగని ఆఫర్లు.. ఈ వస్తువులపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్!
Amazon Blockbuster Value Days Sale: మీరు ఓ కంపెనీకి చెందిన బ్రాండెడ్ టీవీ కొనాలనుకుంటున్నారు? అయితే ఆ టీవీ డిస్కౌంట్‌కే వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. అందుకోసం ఏయే ఈ - కామర్స్ సంస్థలు టీవీలపై డిస్కౌంట్లు ఇస్తున్నాయోనని అని ఎదురు చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ‘బ్లాక్‌బ్లస్టర్ వ్యాల్యూ డేస్’ సేల్‌ను ప్రారంభించింది. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 17 వరకు ప్రత్యేకంగా సేల్ నిర్వహించ నుంది. ఈ సేల్‌లో పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అంతేకాదు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై జరిపే కొనుగోళ్లు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై 10 శాతం ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ సైతం అందిస్తుంది. (పనిమనుషులకు హెలికాప్టర్లో ఐలాండ్ ట్రిప్, వైరల్ వీడియో) ఇక ఈ ప్రత్యేకమైన సేల్‌లో 32 అంగుళాల స్మార్ట్ టీవీలపై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ‘4కే, ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ’ టీవీలపై 60 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఏడాది పాటు నో - కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. (క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!) వన్ ప్లస్, ఎల్జీ, సోనీతో పాటు ఇతర టీవీ ఉత్పత్తులపై 70శాతం డిస్కౌంట్‌కే సొంతం చేసుకోవచ్చు. వన్ ప్లస్, రెడ్మీ, శాంసంగ్‌తో పాటు ఇతర గేమింగ్ డివైజ్‌లపై 25శాతం, గేమ్ టైటిల్స్‌పై 50 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు. అమెజాన్ ఉత్పత్తులైన ప్లే స్టేషన్ డివైజ్‌లపై 70 శాతం తగ్గింపుకే సొంతం చేసుకోవచ్చు. ఫోన్లపై డిస్కౌంట్లు బ్యాంక్ ఆఫర్లతో పాటు ధరల విభాగాలలో ప్రసిద్ధ మోడళ్లపై తగ్గింపు ధరలకే అమెజాన్ విక్రయిస్తుంది. విక్రయ సమయంలో, ఫ్యాషన్, గృహోపకరణాలు, కిచెన్‌లో వినియోగించే వస్తువులు ఇలా ఇతర విభాగాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉండనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 ఊహించని ఎదురు దెబ్బ..చిక్కుల్లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే! -
ఓలా ఎస్1 ప్రో కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' మార్కెట్లో ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా మంచి అమ్మకాలు పొందుతున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపైన కంపెనీ ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కావున కొనుగోలుదారుడు సాధారణ ధర కంటే తక్కువకే ఈ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. నివేదికల ప్రకారం, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ రూ. 5,000 తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా కొనాలనుకునే కస్టమర్ రూ. 1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు 2021లో రూ. 10,000 వరకు పెరిగాయి. ఆ సమయంలో కంపెనీ అమ్మకాల పరంగా కొంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తరువాత కాలంలో దేశీయ మార్కెట్లో ప్రత్యులకు గట్టి పోటీ ఇవ్వడానికి తమ స్కూటర్ల మీద మంచి ఆఫర్స్ అందించడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు రూ. 5వేలు డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది. (ఇదీ చదవండి: మహిళల కోసం ఫైర్ బోల్ట్ నయా స్మార్ట్‌వాచ్ - తక్కువ ధర & ఎక్కువ ఫీచర్స్) ఓలా ఎలక్ట్రిక్ 2023 మార్చి అమ్మకాల్లో 27,000 యూనిట్లను విక్రయించి మంచి వృద్ధిని నమోదు చేసింది. గత ఏడు నెలలుగా దేశీయ విఫణిలో తిరుగులేని అమ్మకాలు పొందుతున్న ఓలా ఇప్పుడు కూడా మంచి అమ్మకాలను పొందుతూ 30 శాతం పెరుగుదలను నమోదు చేసింది. -
రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు
హైదరాబాద్: రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్ పేరుతో భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోళ్లపై అత్యుత్తమ డీల్స్‌తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 7.5 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ అందిస్తుంది. అదనంగా రూ.1000 విలువైన డిస్కౌంట్ కూపన్స్ ఇస్తుంది. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) టీవీలు, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ వాచీలు, కిచెన్ పరికరాలపై ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి. ఈ ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకూ డిజిటల్ డిస్కౌంట్ డేస్ కొనసాగుతాయని, రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లలో కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. -
టాటా, మారుతి, హ్యుందాయ్: కారు ఏదైనా ఆఫర్ మాత్రం భారీగానే!
సాక్షి, ముంబై: ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా , టాటా కంపెనీలు తమ పలు మోడళ్ల కార్లపై మార్చి మాసంలో భారీ తగ్గింపు లభిస్తోంది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది చక్కటి అవకాశం. మారుతి, హ్యుందాయ్, టాటా కార్లపై ప్రస్తుతం లభిస్తున్న తగ్గింపు వివరాలను చూద్దాం. (రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 1,999కే ) మారుతి కార్లపై డిస్కౌంట్లు మార్చిలో రూ. 52వేల వరకు తగ్గింపుతో మారుతి సుజుకి ఇగ్నిస్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే మారుతి సియాజ్పై రూ. 28 వేల వరకు తగ్గింపు లభ్యం. ఇక పాపులర్ కారు ఆల్టోపై రూ. 38వేలు, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సోపై రూ. 49వేలు , వ్యాగన్ఆర్ కారు కొనుగోలుపై రూ. 64వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఇంకా స్విఫ్ట్ రూ. 54వేల దాకా, డిజైర్ మోడల్ కొనుగోలుపై రూ. 10 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. (ఐటీ మేజర్‌ను నడిపించిన ఈ ధీర వనితల్ని గుర్తుపట్టారా? వీరే లేకపోతే..!) అయితే మారుతి సుజుకి బాలెనో, బ్రెజ్జా, గ్రాండ్ విటారా వంటి మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు. హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లు మార్చిలో గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఆరా వంటి మోడళ్లపై హ్యుందాయ్ డిస్కౌంట్లనుఅందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ రూ.38 వేలు దాకా, పాపులర్ ఐ20పై రూ. 20 వేలు, హ్యుందాయ్ ఆరాపై రూ.33 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే, క్రెటా, వెన్యూ, అల్కాజార్ , టక్సన్ వంటి SUV మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు. టాటా కార్లపై డిస్కౌంట్లు అత్యధికంగా అమ్ముడైన టాటా ప్యాసింజర్ వాహనం టాటా నెక్సాన్ మార్చిలో రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది. టాటా హారియర్ ,టాటా సఫారిపై రూ.45వేల రకు తగ్గింపు ఉంది. దీంతోపాటు టాటా టియాగోపై సుమారు రూ. 28వేలు, టాటా టిగోర్‌పై రూ. 30వేల వరకు తగ్గింపు ఉంది. టాటా ఆల్ట్రోజ్ రూ. 28 వేల దాకా తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. -
ఫిబ్రవరిసేల్స్: మారుతి బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీదారు మారుతి సుజుకి ఇండియా తన కస్టమర్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లో అమ్మకాలను పెంచుకునే క్రమంలో పలు మోడళ్ల కార్లపై తగ్గింపును ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో బాలెనో, సియాజ్ , ఇగ్నిస్ వంటి మోడల్ కార్లపై నేరుగా నగదు తగ్గింపులతో పాటు, కార్పొరేట్ డిస్కౌంట్లు , ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందించింది. (ఇదీ చదవండి: టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్‌పై అదిరిపోయే ఆఫర్లు) మారుతీ సుజుకి సియాజ్ హై-ఎండ్ సెడాన్. మారుతి సుజుకి సియాజ్ రూ.40,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఇందులో రూ. 25,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ , రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు. 105 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రధాన ఫీచర్లు (Valentine’s Day sale: ఐఫోన్14 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు ) మారుతీ సుజుకి బాలెనో హై-ఎండ్ హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి బాలెనో సీఎన్జీ మోడల్ కొనుగోలుపై రూ. 15,000 వరకు ఆదా చేయవచ్చు. బాలెనోలోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 90 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది మారుతీ సుజుకి ఇగ్నిస్ పలు చిన్న కార్లలో ఒకటైన మారుతి సుజుకి ఇగ్నిస్ పై గరిష్టంగా రూ.50,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో రూ.25వేల వరకు క్యాష్ డిస్కౌంట్. మారుతి సుజుకి ఇగ్నిస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 83 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. -
5జీ, ఇతర స్మార్ట్ఫోన్లపై అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్’ పేరుతో డిస్కౌంట్ సేల్కు తెర తీసింది. డిసెంబర్ 10 నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు స్మార్ట్‌ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. ముఖ్యంగా కొన్ని 5జీ మోడల్స్‌తోపాటు, వన్‌ప్లస్ 10 ప్రొ, ఐఫోన్ 14, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 సహా అనేక స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసినవారికి 10శాతం తక్షణ డిస్కౌంట్ లభ్యం. కనిష్టంగా రూ. 5,000 కొనుగోలు చేసిన వినియోగదారులు రూ. 1,000 వరకు (పది శాతం) తగ్గింపు పొందవచ్చు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగ దారులు కనీసం రూ. 1,250 వరకు పది శాతం తగ్గింపును పొందవచ్చు. అమెజాన్ ఆఫర్లు శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్ ఫోన్ రూ. 9,699కి లభ్యం. ఐక్యూ జీ6 లైట్ 13,999 కి లభిస్తుంది. రెడ్మీ ఏ1 డిస్కౌంట్ అనంతరం రూ. 6,119 కి లభిస్తుంది.రెడ్మీ 11ప్రైమ్ 5జీ రూ. 11,999, రెడ్ మీ నోట్ 11 రూ. 10,999లకు కొనుగోలు చేయ వచ్చు. ఒప్పో ఎఫ్ 21ఎస్ ప్రొ 5జీ: ఒప్పో ఎఫ్21ఎస్ ప్రొ 5జీ రూ. 24,499కి అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ఆఫర్గా అదనంగా రూ. 3,000 తగ్గింపును కూడా పొందవచ్చు. ఇంకా ఒప్పో ఏ సిరీస్‌లో, ఒప్పో ఏ76, ఏ77 వరుసగా రూ. 15,490. రూ. 16,999కి అందుబాటులో ఉన్నాయి. లావా: ఇక స్వదేశీ బ్రాండ్, లవా బ్లేజ్ NXTని రూ.8,369కి సొంతం చేసుకోవచ్చు. అలాగే లావా జెడ్3 రూ.6,299కే లభ్యం. టెక్నో టెక్నో పాప్ 6 ప్రో రూ.5,579కి, టెక్నో స్పార్క్ 9 రూ.7,649కి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇటీవల తీసుకొచ్చిన పోవా 5జీ , టెక్నోకేమాన్ 19 మాండ్రియన్ వరుసగా రూ. 14,299 ,రూ. 16,999కి అందుబాటులో ఉంటాయి. -
క్రోమా ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ ఆఫర్లు.. భలే ఉందిగా!
హైదరాబాద్: టాటా గ్రూపునకు చెందిన క్రోమా దీపావళి పండగ సందర్భంగా ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ పేరుతో పలు డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తుంది. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 20% వరకూ క్యాష్‌బ్యాక్, రెండేళ్ల కాలపరిమితితో అతి సులభమైన ఈఎంఐ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపింది. పలు బ్యాంక్ కార్డులపై పదిశాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా క్రోమా స్టోర్లతో పాటు కంపెనీ వెబ్సైట్లో ఈ ఆఫర్లు అక్టోబర్ 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
పండగ సీజన్: తగ్గేదేలే అంటున్న కంపెనీలు, పుల్ జోష్‌లో ఆ రంగం!
న్యూఢిల్లీ: పండుగల సీజన్ కావడంతో కంపెనీలు ప్రకటనలను హోరెత్తిస్తున్నాయి. వినియోగ డిమాండ్‌ను అనుకూలంగా మలుచుకునేందకు తమ ఉత్పత్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ కామర్స్, ఫ్యాషన్, అప్పారెల్, ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలు ఈ పండుగల సీజన్ కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను 15–20 శాతం పెంచాయి. దీన్నిబట్టి కంపెనీలు విక్రయాలకు సంబంధించి నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దసరా నుంచి పండుగల సీజన్ మొదలు కాగా, ఇప్పటికే ఈ విభాగాల్లో విక్రయాలు అంచనాలను మించాయి. దీంతో కంపెనీలు సైతం తగ్గేదేలా అంటూ ప్రకటనలకు మరింత ఖర్చు చేస్తున్నాయి. ‘‘ఈ కామర్స్, అప్పారెల్, ఫ్యాషన్, ప్రీమియం ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, బ్యూటీ, వెల్నెస్ ఉత్పత్తులు, వినోద, జ్యుయలరీ సంస్థలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను (నిధుల కేటాయింపులు) 15–20 శాతం పెంచాయి. పండుగల డిమాండ్‌కు అనుకూలంగానే ఇది ఉంది. ఈ కేటగిరీల్లో ఇప్పటి వరకు విక్రయాలు లక్ష్యాలను మించి నమోదయ్యాయి’’అని మీడియా టెక్నాలజీ స్టార్టప్ ఆర్డీ అండ్‌ఎక్స్ నెట్వర్క్ చైర్మన్ ఆశిష్ భాసిన్ తెలిపారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో మాత్రం ప్రకటనల పరంగా ఆచితూచి అనుసరించే ధోరణి ఉన్నట్టు చెప్పారు. ఇక ముందూ కొనసాగొచ్చు.. పండుగల సమయాల్లో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తుంటారు. గత రెండు సంవత్సరాల్లో కరోనా ప్రభావం కొనుగోళ్ల డిమాండ్‌పై చూపించింది. కానీ, ఈ ఏడాది వైరస్ ప్రభావం ఏమీ లేదు. సాధారణ ఆర్థిక కార్యకలాపాల మద్దతుతో వినియోగ డిమాండ్ పట్టణాల్లో బలంగానే ఉంది. దీంతో విక్రయాలు గణనీయంగానే నమోదవుతున్నాయి. దీపావళి వరకు ఈ కొనుగోళ్లు జోరుగా ఉంటాయని జాన్‌రైజ్ అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. ఆ తర్వాత పండుగల సీజన్ కూడా కలిసొస్తుందని అన్నారు. విస్తృత స్థాయిలో ఉత్పత్తులు, వాటిపై ఆఫర్లను ఈ సీజన్లో అందిస్తున్నట్టు ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ తెలిపారు. డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. అన్ని మాధ్యమాల్లో తమ ఉత్పత్తులకు సంబంధించి విస్తృతమైన ప్రచారం చేపట్టినట్టు వెల్లడించారు. ఈ సీజన్లో ఎక్కువే.. ‘‘మా జ్యుయలరీ బ్రాండ్లు తనిష్క్, మియా, జోయ, కార్ట్‌లేన్‌కు సంబంధించి ప్రకటనలపై చేసే ఖర్చు గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో పెరిగింది’’అని టాటా గ్రూపు కంపెనీ టైటాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ చావ్లా తెలిపారు. ఎగువ మధ్య తరగతి, ఖరీదైన విభాగాల్లో వినియోగదారుల ఆసక్తి పెరిగినట్టు చెప్పారు. దీంతో మరింత మంది కస్టమర్లను ఆకర్షించడం ద్వారా, మెరుగైన వృద్ధి అంచనాలను చేరుకునే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. విచక్షణారహిత వినియోగ విభాగంలో ఇప్పటి వరకు డిమాండ్ బలంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇది ప్రకటనలపై అధిక వ్యయాలకు మద్దతునిస్తున్నట్టు చెప్పాయి. ఫ్రెంచ్ అప్పారెల్ బ్రాండ్ సెలియో సీఈవో సత్యేన్ మొమాయ మాట్లాడుతూ.. దసరా సమయంలో పెట్టుబడులపై మంచి రాబడులు రావడంతో ప్రకటనల బడ్జెట్‌ను 25 శాతం పెంచినట్టు ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
ఐఫోన్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్!
యాపిల్ ఐఫోన్ కొనుగోలుదారులకు ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. దివాళీ సేల్‌లో భాగంగా ఐఫోన్లను డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఐఫోన్ 13 ధర రూ.69,990 ఉండగా రూ.59,990కే అందిస్తుంది. ఇక 256జీబీ, 512జీబీ ఫోన్ల ధరల్ని సైతం తగ్గించింది. ఐఫోన్ కొనుగోలుదారులు ఎస్బీఐ, కొటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగిస్తే రూ.1250 అదనంగా ఆఫర్‌ను పొందవచ్చు. దీంతో పాటు యూజర్లు ఎక్స్ఛేంజ్ డీల్ కింద రూ 16,990 వరకూ పొందుతారు. ఐఫోన్ 13 ఫీచర్లు యాపిల్ సంస్థ ఐఫోన్ 13, మినీ, ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. వీటిలో ఐఫోన్ 13 గులాబీ, నీలం తదితర అయిదు రంగుల్లో లభిస్తుంది. ఇక ఈ ఫోన్ల ఫీచర్ల విషయానికొస్తే.. ఫోన్ల వెనుకవైపు అధునాతన డ్యుయల్ కెమెరాలు, 5జీ, 6 కోర్ సీపీయూ, 4 కోర్ జీపీయూ, కొత్త ఏ15 బయోనిక్ చిప్సెట్ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 13 డిస్ప్లే 6.1 అంగుళాలు, మినీ డిస్ప్లే 5.4 అంగుళాలుగా ఉంటుంది. ఐఫోన్ 12 మినీతో పోలిస్తే 13 మినీ బ్యాటరీ సామర్థ్యం 1.5 గంటలు, ఐఫోన్ 12తో పోలిస్తే ఐఫోన్ 13 బ్యాటరీ సామర్థ్యం 2.5 గంటలు ఎక్కువగా ఉంటుంది. -
రిలయన్స్ డిజిటల్ దసరా ఆఫర్లు
హైదరాబాద్: దసరా సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. బ్యాంకు కార్డులపై 10% తగ్గింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. యాపిల్ వాచ్‌ను రూ.17,100కు, శామ్సంగ్ వాచ్‌ను రూ.6,490కు అందిస్తున్నట్టు తెలిపింది. అలాగే, స్మార్ట్‌వాచ్‌లు రూ.1,599 నుంచి అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లపైనా ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నట్టు తెలిపింది. శామ్సంగ్ ఎం53 5జీ ఫోన్‌ను కేవలం రూ.19,999కు, శామ్సంగ్ ఎస్22ను రూ. 49,990కే ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్లు లేదా మైజియో స్టోర్ లేదా రిలయన్స్డిజిటల్ డాట్ ఇన్ పోర్టల్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే జేబుకి చిల్లే!
దసరా పండుగ వచ్చేస్తోంది. ఇంకేముంది ఫెస్టివల్ సీజన్ వచ్చినట్లే. ఇప్పటికే దేశీయ ప్రముఖ ఈకామర్స్ సంస్థలు.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ డే అని, మరో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌ని నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 23నుంచి ప్రారంభమవుతున్నా ఈ ఆఫర్ సేల్‌లో మనకు కావాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ల్యాప్ ట్యాప్స్,స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. ఇంత వరకు అంతా బాగానే ఉంది గానీ ఇక్కడే మనం ఓ విషయాన్ని గుర్తించుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ►కంపెనీ ఇస్తున్న డీల్స్‌లను చెక్ చేయండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న డీల్‌ల వైపు ఆకర్షితులయ్యే ముందు, అవి ఎంత నిజమైనవో చెక్ చేయండి. లాంచ్ సమయంలో కంపెనీ దాని ధర ఏమిటో చూడండి. కొన్నిసార్లు నకిలీ డిస్కౌంట్లు కూడా జాబితాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో కొందరు అమాయక కస్టమర్లు మోసపోతారు. ►డిస్కౌంట్లు ఆఫర్లు మాత్రమే కాదు ఆ వస్తువులు మనకి అవసరమా కాదా అని కూడా చూసుకోవాలి. లేదంటే కొన్న తర్వాత వాటిని వాటిని వాడకుండా ఇంట్లో ఓ మూలనా ఉంచాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆ వస్తువు నిరుపయోగంగా మారుతుంది. ►మీ కార్ట్‌లో త్వరగా మంచి డీల్‌లను ఉంచుకోండి. లేదంటే ఆఫర్ ముగిసిపోతుందనే తొందరలో మంచి వస్తువులను మిస్ చేసుకునే చాన్స్ ఉంది. కొనుగోలు చేసే ముందు మీరు కొందామని అనుకుంటున్న వస్తువుని ఇతర వాటితో పోల్చి చూడడం ఉత్తమం. ►బ్యాంక్ ఆఫర్లను సరి చూసుకోవాలి అలాగే వస్తువులపై కంపెనీ ఇస్తున్న తగ్గింపు ధరలను సరిగా చెక్ చేసుకోవాలి. వీటితో పాటు బయటి మార్కెట్లో, ఇతర వెబ్సైట్లో వాటి ప్రస్తుత ధర ఎంత ఉందనేది కూడా తెలసుకోవాలి. మీరు కొనుగోలు చేయదలుచుకున్న ప్రాడెక్ట్ మీ బడ్జెట్లో ఉందో లేదో కూడా చెక్ చేసుకోవడం ఉత్తమం. ►షిప్పింగ్ చార్జ్‌ల విషయంలోనూ తనిఖీ చేయండి. ఈఎంఐ(EMI) ఆఫర్‌ను సరిగా లెక్కించుకోండి. చదవండి: ఇన్ఫినిక్స్ నుంచి తొలి 55 ఇంచెస్ టీవీ.. తక్కువ ధరకే వావ్ అనిపించే ఫీచర్లు! -
తొమ్మిదో వసంతంలోకి ‘బి న్యూ మొబైల్స్’
హైదరాబాద్: ప్రముఖ మొబైల్స్ విక్రయ సంస్థ బి న్యూ మొబైల్స్ ఎనిమిది ఏళ్లు పూర్తి చేసుకుని, తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టింది. వార్షికోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన మొబైల్స్‌పై 50% వరకు స్టోర్స్‌లో, ఆన్‌లైన్‌లోనూ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎంపిక చేసిన టీవీలపై రూ.7వేల వరకు, లాప్‌ట్యాబ్‌లపై రూ.5వేల వరకు క్యాష్ బ్యాక్‌ను అందిస్తుంది. ప్రారంభ ధర రూ.1,599కే స్మార్ట్ వాచ్‌లను పొందవచ్చు. ఎస్బీఐ కార్డు ద్వారా కొనుగోలుపై 7.5% వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ప్రజల నిత్య జీవనంలో కీలకమైన సెల్ఫోన్లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను సామాన్యులకు అందజేయడంలో బి న్యూ ముందంజలో ఉంటుందని సంస్థ సీఎండీ యరగుంట్ల బాలాజీ చౌదరి తెలిపారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో 150పైకి షో రూమ్‌లను కలిగి ఉన్నాము. తర్వలోనే మరిన్ని షోరూంలను అందుబాటులోకి తీసుకొస్తాము. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి ప్రజలకు సెల్ఫోన్లను తక్కువ ధరలకే అందించేందుకు గ్రామీణ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టిని సారించాము’’అని బాలాజీ పేర్కొన్నారు. -
డిస్కౌంట్ల పండగొచ్చింది..!
న్యూఢిల్లీ: పండుగల సమయాల్లో డిస్కౌంట్ సేల్స్ నిర్వహించడాన్ని చూశాం. కానీ, ఈ విడత పండుగలకు ముందే ఆఫర్ల విక్రయాలు మొదలయ్యాయి. కన్జ్యూమర్ గూడ్స్ అయిన టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, వస్త్రాలు, నిత్యావసర ఉత్పత్తులను సైతం తగ్గింపు ధరలపై కంపెనీలు విక్రయిస్తున్నాయి. బిస్కెట్లు, పప్పులపైనా ఈ తగ్గింపు ధరలు అమలవుతుండడం విశేషం. కరోనా తర్వాత సరఫరా వ్యవస్థలో ఏర్పడిన సమస్యలు, ముడి సరుకుల ధరలు పెరుగుదల ప్రభావంతో అధిక వ్యయాలను అధిగమించేందుకు, కంపెనీలు ఉత్పత్తుల ధరలను పెంచుతూ వచ్చాయి. ఇది డిమాండ్‌పై ప్రభావం చూపించింది. ఈ విడత పండుగల నాటికి విక్రయాలు జోరందుకుంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఎల్జీ, శాంసంగ్, సోనీ టీవీల ధరలు గత కొన్ని వారాల్లో 5–8% వరకు తగ్గాయి. మధ్య శ్రేణి నుంచి అధిక ధరల ల్యాప్‌టాప్ ధరలను సైతం రూ.1,500 నుంచి రూ.2,000 వరకు కంపెనీలు తగ్గించి విక్రయిస్తున్నాయి. ఇక స్మార్ట్ఫోన్లపై కంపెనీలు 4–5% డిస్కౌంట్ ఇస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నూనెలు సైతం.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా దిగి వస్తుండడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. వంట నూనెల ధరలు 15–20 శాతం వరకు తగ్గాయి. పెద్ద బిస్కెట్ ప్యాక్‌ల ధరలపై ఎఫ్ఎంసీజీ కంపెనీలు 15–20 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల పాటు విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్టు ఎఫ్ఎంసీజీ కంపెనీలు తెలిపాయి. ‘‘తయారీ వ్యయాలు తగ్గినందున ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తూ ఆగస్టు 15 నుంచి మా బిస్కెట్ ప్యాక్‌లపై 10–15 శాతం తగ్గింపు ఇస్తున్నాం’’అని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. మరికొంత కాలం పాటు ముడి సరుకుల ధరల తీరును గమనించిన తర్వాత, అన్ని రకాల ఉత్పత్తులపై ధరల తగ్గింపు పరిశీలిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు, సెమీకండక్టర్లు, ఓపెన్ సెల్ ధరలు ఇటీవలి కాలంలో చెప్పుకోతగ్గ మేర తగ్గాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సైతం తయారీ వ్యయాలు 15 శాతం వరకు శాంతించాయి. ధరలు తగ్గించినప్పటికీ, ఇప్పటికీ ఉత్పత్తుల ధరలు కరోనా మహమ్మారి ముందు నాటితో పోలిస్తే అధికంగానే ఉండడం గమనించాలి. దీనికి కారణం కంపెనీలు గత రెండేళ్ల కాలంలో ధరలను గణనీయంగా పెంచాయి. -
ఫెస్టివ్ సీజన్: పలు కంపెనీల కార్లపై డిస్కౌంట్ బొనాంజా
సాక్షి,ముంబై: రానున్న పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ దిగ్గజాలు ఆపర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఎంట్రీ లెవల్, చిన్న కార్లపై డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించాయి. ఇందులో దిగ్గజ సంస్థలు కార్లుపోటీ పడుతుండటం విశేషం. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, రెనాల్ట్ తమ కార్లను తక్కువ ధరల్లోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. మారుతి సుజుకి మారుతి కొన్ని మోడల్‌లు రూ. 50,000 వరకు భారీ ఆఫర్‌తోపాటు, క్యాష్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ల రూపంలో తొమ్మిది నుంచి 60వేల రూపాయల దాకా డిస్కౌంట్లను అందిస్తోంది. మారుతి సుజుకి ఆల్టో, వ్యాగన్ ఆర్, క్లెరియో, ఎస్-ప్రెస్సో, స్విఫ్ట్ , డిజైర్ వంటి మోడళ్లపై నగదు తగ్గింపులను అందిస్తోంది. అన్ని మోడల్‌లు కూడా ఎక్స్ఛేంజ్ బోనస్ లభ్యం. రెనాల్ట్ ఇండియా రెనాల్ట్ ఇండియా క్విడ్ హ్యాచ్‌బ్యాక్, ట్రైబర్ MPV, కిగర్ కాంపాక్ట్ SUV తదితర మోడళ్లపై రూ. 60,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇంకా నగదు తగ్గింపులు, స్క్రాపేజ్ ప్రయోజనాలు ,ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో కూడా అందిస్తోంది. దీంతోపాటు ప్రత్యేక ఫ్రీడమ్ కార్నివాల్ ఆఫర్ కింద రూ. 5,000 విలువైన యాక్సెసరీలు ఉచితం. అలాగే తన అన్ని మోడళ్లలో యాక్సెసరీలపై పరిమిత ఫ్రీడమ్ కార్నివాల్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. హ్యుందాయ్ దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుందాయ్ సాంత్రో, ఐ10 నియోస్, ఔరా, ఐ20, ఎక్స్ంట్, కొనా ఈవీ వంటికార్లపై సుమారు రూ.13 వేల నుంచి రూ.50 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్లు, అదనపు ఇన్సెంటివ్‌లు అందించనుంది. టాటా మోటార్స్ టాటా మోటార్స్ వివిధ మోడళ్లలో పండుగ సీజన్ డిస్కౌంట్లు 20- 40వేల రూపాయల విలువైన పథకాలను అందిస్తోంది. ప్రధానంగా టియాగో, టైగోర్, నెక్సాన్, సఫారీ వంటి మోడల్ కార్లపై రూ.40 వేల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. అలాగే ఓనం పండుగ సందర్భంగా కేరళ వాసుల కోసం బంపర్ ఆఫర్లను ప్రకటించింది. దేశీయంగా మహీంద్రా కూడా ఎక్స్‌యూవీ300, బొలెరో, బొలెరో నియో వంటి మోడల్ కార్లపై పలు ఇన్సెంటివ్‌లు, ఆఫర్లు ప్రకటించింది. గత నాలుగు నెలల్లో రిటైల్ విక్రయాలు వెనుకబడి ఉన్నాయి. ఎంట్రీ లెవల్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ప్రస్తుతం పుంజుకుంటున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోటివ్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి వెల్లడించారు.దీంతోపాటు, రానున్న నెలల్లో మెరుగైన సరఫరాతో, కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గించాలని కోరారు. దీనికి అనుగుణంగా ప్యాసింజర్ వెహికల్ ఒరిజినల్-ఎక్విప్మెంట్ తయారీదారులందరూ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా తమ సరఫరాలను రీకాలిబ్రేట్ చేయాలని గులాటీ కోరారు. గత కొన్ని నెలలుగా తమ ప్రొడక్షన్ ప్లాంట్లలో 95 శాతం ఉత్పత్తి చేయాలని ప్రణాళికల్లో ఉన్నామని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా కార్ల ఉత్పత్తి చేయడం కార్ల తయారీ సంస్థలకు పెద్ద సవాల్ అని పేర్కొన్నారు.