
ఇండియాలో నంబర్ 1 ఈ కామర్స్ సైట్ అమెజాన్ ఎలక్ట్రానిక్ వస్తువులపై క్లియరెన్స్ సేల్ ప్రకటించింది. వేలాది ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్మకానికి ఉంచింది. గరిష్టంగా 70 శాతం వరకు పలు వస్తువులపై డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. ఈ ఆఫర్‌తో పాటు అమెజాన్ కూపన్లు ఉపయోగించడం ద్వారా మరో రూ. 10,000 రూపాయల వరకు ఎంఆర్‌పీపై తగ్గింపు పొందవచ్చని అమెజాన్ తెలిపింది.
మొబైల్ మిస్
అమెజాన్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సేల్స్‌లో లాప్‌ట్యాప్, డెస్క్‌టాప్, కెమెరా, ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్స్, పవర్‌బ్యాంక్, హార్డ్‌డిస్క తదితర వస్తువులపై భారీ ఆఫర్లు ఉన్నాయి. అయితే ఎక్కువ డిమాండ్ ఉండే ఫోన్లు ఈ క్లియరెన్స్ సేల్స్ కేటగిరిలో లేవు. దీంతో వినియోగదారులు కొంత నిరాశకు లోనవుతున్నాయి. అయితే మిగిలిన ఐటమ్స్‌లో అవసరమైనవి తక్కువ ధరకు లభిస్తున్నాయనే వారు ఉన్నారు.
చదవండి : ఇక ఆడి పెట్రోల్, డీజిల్ కార్లు ఉండవా?