Clearance
-
దేశం విడిచి వెళ్తుంటే ట్యాక్స్ మొత్తం కట్టాల్సిందేనా? కేంద్రం క్లారిటీ
దేశం విడిచి వెళ్తున్న వారందరూ ముందుగా ట్యాక్స్ బకాయిలన్నీ తప్పనిసరిగా చెల్లించాలంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పందించింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 చట్టంలోని సెక్షన్ 230కు సంబంధించి వివరణ ఇచ్చింది.పన్ను చెల్లింపుదారుల్లో కలకలం సృష్టించిన ఈ వార్తలపై సీబీడీటీ స్పందిస్తూ.. దేశం విడిచి వెళ్తున్న ప్రతి భారతీయ పౌరుడు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలని సెక్షన్ 230 ఆదేశించదని పేర్కొంది. ఆవశ్యకమైన నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే ఇది వర్తిస్తుంది. 2004 ఫిబ్రవరి 5 నాటి సీబీడీటీ ఇన్స్ట్రక్షన్ నంబర్ 1/2004 ప్రకారం, తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వ్యక్తులు లేదా ప్రత్యక్ష పన్ను బకాయిలు రూ. 10 లక్షలకు పైగా ఉన్నవారికి మాత్రమే దేశం విడిచి వెళ్లే ముందు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఎందుకంటే ఇలాంటి వారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ విచారణలో ప్రత్యక్షంగా పాల్గొనడం అవసరం.అంతేకాకుండా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ ఏకపక్ష ప్రక్రియ కాదు. దీనికి ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా ఇన్కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ నుంచి లిఖితపూర్వకమైన ముందస్తు అనుమతి అవసరం. ఇన్కమ్ టాక్స్ యాక్ట్, వెల్త్ టాక్స్ యాక్ట్, గిఫ్ట్-టాక్స్ యాక్ట్, ఎక్స్పెండిచర్-టాక్స్ యాక్ట్, మనీ యాక్ట్, 2015 వంటి వివిధ పన్ను చట్టాల కింద సదరు వ్యక్తికి ఎటువంటి బకాయిలు లేవని ఈ సర్టిఫికెట్ నిర్ధారిస్తుంది. దీన్ని ఇటీవలి ఫైనాన్స్ బిల్లులో ప్రతిపాదించారు.ఫైనాన్స్ (నం. 2) బిల్లు, 2024లో క్లాజ్ 71లో బ్లాక్ మనీ యాక్ట్, 2015కు సంబంధించిన సూచనలను చేరుస్తూ సెక్షన్ 230కి సవరణలు ప్రతిపాదించారు. ఈ సవరణలు వచ్చే అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. దీని ప్రకారం.. గుర్తించిన కేటగిరీల కింద కొంతమంది వ్యక్తులు దేశం విడిచి వెళ్లేముందు తప్పనిసరిగా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలి. -
క్లియరెన్స్ వస్తేనే పాల్గొనేది?.. 'ఆడకపోతే మీ కర్మ'
వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను దక్షిణాది నగరాల్లో ఆడనుండగా.. ఒక్క టీమిండియాతో మాత్రమే అహ్మదాబాద్ వేదికగా ఆడనుంది. అయితే చెన్నై, కోల్‌కతాల్లో తాము ఆడలేమని.. ఈ రెండు వేదికలను మార్చాలని పీసీబీ ఐసీసీకి అభ్యర్థన పెట్టుకున్నప్పటికి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. తాజాగా పీసీబీకి మరో చిక్కు వచ్చి పడింది. అదేంటంటే భారత్‌లో ఏ టోర్నీ జరిగినా ప్రభుత్వం క్లియరెన్స్ తప్పనిసరి. ఇదే విషయమై పీసీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు మాకు ప్రభుత్వం నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. ఈ విషయమై మా ప్రభుత్వంతో చర్చలు జరిపాం. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాగానే ఈవెంట్ నిర్వహించే ఐసీసీ సమచారం అందిస్తాం. అయితే వరల్డ్‌కప్‌కు మేము ఆడబోయే మ్యాచ్‌ల్లో రెండు వేదికలను మార్చాలని పెట్టుకున్న ప్రతిపాదనను ఐసీసీ, బీసీసీఐ పట్టించుకోలేదు. ఈ విషయాన్ని మా ప్రభుత్వం ఎలా తీసుకుంటున్నది తెలియదు అని చెప్పుకొచ్చాడు. కాగా పాక్ ప్రభుత్వం నుంచి పీసీబీకి వరల్డ్‌కప్ ఆడేందుకు క్లియరెన్స్ రాకపోతే బోర్డు చాలా నష్టపోవాల్సి వస్తోంది. పాక్ జట్టు వరల్డ్‌కప్‌లో ఆడకుంటే కోట్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పాక్ క్రికెట్‌కు అంత మంచిది కాదు. ఈ లెక్కన చూసుకుంటే ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చేందుకే మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ఇక అభిమానులు మాత్రం ఆడకపోతే ఐసీసీకి వచ్చే నష్టం ఏమి ఉండదు.. పీసీబీకే పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని కామెంట్ చేశారు. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్, వివరాలు: అక్టోబర్ 12: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పాకిస్థాన్ vs క్వాలిఫయర్ 2 అక్టోబర్ 15: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్ వర్సెస్ భారత్ అక్టోబర్ 20: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs ఆస్ట్రేలియా అక్టోబర్ 23: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్ అక్టోబర్ 27: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా అక్టోబర్ 31: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ నవంబర్ 4: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs న్యూజిలాండ్ నవంబర్ 12: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs ఇంగ్లాండ్ చదవండి: ఎదురులేని లంక.. గ్రూప్ టాపర్‌గా సూపర్ సిక్స్‌కు ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం -
ఆ భూములు బాగు చేయొద్దు.. క్లియరెన్స్‌ను అడ్డుకున్న టీడీపీ నేతలు..
మంగళగిరి: పేదలకు అమరావతి (సీఆర్డీఏ) పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రైతుల ముసుగులో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పేదలకు ఇచ్చేందుకు సీఆర్డీఏ కేటాయించిన స్థలాలను బాగు చేయవద్దని పనులు నిర్వహిస్తున్నవారితో గొడవకు దిగారు. దీంతో శుక్రవారం కృష్ణాయపాలెంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఆర్డీఏ పరిధిలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, నిడమర్రు, మందడం, ఐనవోలు ప్రాంతాలను కలిపి ప్రభుత్వం ఆర్–5 జోన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఆర్డీఏ భూములను కేటాయించింది. ఆ భూముల్లో భారీగా కంపచెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఆర్–5 జోన్లో కేటాయించిన భూముల్లో ముళ్లకంపను తొలగించి మెరక చేసి లే అవుట్ వేయాలని సీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధంచేసింది. ఇందులో భాగంగా జంగిల్ క్లియరెన్స్, మెరక చేసే పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించింది. కృష్ణాయపాలెంలో కేటాయించిన భూముల్లో శుక్రవారం జంగిల్ క్లియరెన్స్ నిర్వహించేందుకు కాంట్రాక్టర్ జేసీబీలను తీసుకువెళ్లి పనులు ప్రారంభించే సమయంలో రైతుల ముసుగులో ఉన్న పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మంగళగిరి రూరల్ సీఐ భూషణం, ఎస్ఐ రమేష్‌బాబు వచ్చి సర్దిచెప్పారు. సీఆర్డీఏ ఇచ్చిన వర్క్ ఆర్డర్ కాపీని కాంట్రాక్టర్ చూపించి జంగిల్ క్లియరెన్స్ పనులు చేయాలని చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: సామాజిక న్యాయమే పరమావధి -
పోలీసులకు బకాయిలు విడుదల చేసిన ఏపీ సర్కార్
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం.. పోలీసులకు బకాయిలను విడుదల చేసింది. పోలీస్ సిబ్బంది టీఏ నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగుల జీపీఎఫ్ లోన్లను క్లియర్ చేసింది. పెడింగ్ నిధుల విడుదల పట్ల పోలీస్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. చదవండి: ఎకనమిక్ కారిడార్‌కు లైన్‌క్లియర్ -
సగం ధరకే రెడ్ మీ స్మార్ట్‌ఫోన్స్.. ఎక్కడంటే..!
సాక్షి,ముంబై: స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్మీ పేరెంట్ కంపెనీ ఎంఐ క్లియరెన్స్ సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్ అతి తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను అందిస్తోంది. ఈ సేల్‌లో కొనుగోలుదారులు రూ. 3,999కే స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎంఐ క్లియరెన్స్ సేల్కు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. దీని ప్రకారం రెడ్ మీ 6ఏ, రెడ్ మీ వై3, రెడ్ మీ నోట్ 7 ప్రో. వంటి మోడల్స్ ను దాదాపు సగం ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎంట్రీ-లెవల్ బడ్జెట్ ఫోన్ రెడ్ మీ 6ఏ మోడల్ ప్రారంభ ధర రూ.6,999 కాగా, క్లియరెన్స్ సేల్ లో దీన్ని రూ. 3,999కి అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఫీచర్లతో, 2జీ ర్యామ్, 16జీబీ స్టోరేజీతో వచ్చిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ 6ఏ, దీంతోపాటు మిగతా మోడళ్లను కూడా తక్కువకే ఎంఐ సేల్‌లో లభ్యం. అయితే ఈ సేల్‌లో తగ్గింపుతో కొనుగోలు చేసిన స్మార్ట్ఫోన్లు వారంటీని కలిగి ఉండవు అనేది గమనార్హం. -
మునుగోడు: రాజగోపాల్‌రెడ్డికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఊరట దక్కింది. రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ చేసిన ఫిర్యాదులకు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్నికల సంఘం తేల్చేసింది. ఈ మేరకు మంగళవారం ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. సుమారు రూ.5.24 కోట్ల బదిలీ జరిగిందని టీఆర్ఎస్ పార్టీ, రాజగోపాల్‌రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే టీఆర్ఎస్ ఆరోపణలు నిరాధారమైనవని ఈసీ తేల్చింది. రాజగోపాల్‌రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాల్లేవని ఈసీ వెల్లడించింది. అంతేకాదు.. ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. పలువురు వ్యక్తులు, సంస్థలకు నగదు బదిలీ చేశారన్నది టీఆర్ఎస్ ఆరోపణ. ఈ మేరకు రాజగోపాల్‌రెడ్డికి చెందిన సంస్థ నుంచి సుమారు రూ.5.24 కోట్లను స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 22 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్, ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఈ తరహాలో భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. నగదు లావాదేవీలపై సోమవారం సాయంత్రం 4 గంటల లోపు సమాధానం ఇవ్వాలంటూ రాజగోపాల్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే, ఈసీ నోటీసులకు రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ వివరణతో సంతృప్తి చెందిన ఎన్నికల కమిషన్.. రాజగోపాల్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: టీఎన్జీవో నేతలకు సిగ్గుండాలి..: బండి సంజయ్ -
ఆఫర్ క్లోజెస్ సూన్.. ఇప్పుడు కె.జి.యఫ్ 2 వంతు
హైదరాబాద్: మిగిలింది మూడు రోజులే.. మీ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చాలానాలను మార్చ్ 31వ తారీఖులోపు చెల్లించండి. అవకాశాన్ని నిర్లక్ష్యంతో చేజార్చు కోకండి. ప్రభుత్వం ఇచ్చిన రాయితీని సద్వినియోగం చేసుకోండి. ఆలస్యం చేయకు మిత్రమా అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అంటూ కె.జి.యఫ్ ఛాప్టర్ 2 ట్రైలర్‌లోని ఆఫర్ క్లోజెస్ సూన్ డైలాగ్ మీమ్‌ను వాడేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. వాహనదారులు.. సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికీ కూడా వాహనాల చలాన్లను క్లియర్ చేసుకోకుంటే.. వెంటనే ఆన్లైన్లో చెల్లించండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఇచ్చిన భారీ డిస్కౌంట్ల ఆఫర్ ముగిసిపోనుంది కాబట్టి. ఇప్పటికే తెలంగాణలో 50 శాతం ఛలాన్లు క్లియర్. హయ్యెస్ట్ ఎవరంటే.. ప్రత్యేకించి.. హైదరాబాద్ సిటీలో పెండింగ్ చలాన్లలో టూ వీలర్స్ టాప్‌లో ఉన్నాయి. ఓ స్కూటర్ ఓనర్‌కు.. అత్యధికంగా 178 చలాన్లు ఇంకా ఉన్నాయట. హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు ఆయనకి ఈ చలాన్లు ఎక్కువగా పడ్డాయట. ఇక ఆగస్టు 2019 నుండి ఇప్పటివరకు 178 చలాన్ల మొత్తం 48,595 రూపాయలుగా ఉంది. రాయితీ పోను అతను చెల్లించాల్సి వచ్చేది కేవలం రూ. 12,490 మాత్రమే. మరో బైకర్‌కు రూ.73,690 చలాన్లు ఉన్నాయట. అతను ప్రత్యేక రాయితీని ఉపయోగించుకుని 19,515 చెల్లిస్తే సరిపోతుంది. మరి వాళ్లు ఉపయోగించుకుంటారో లేదో? చూడాలి. -
వాహన దారులకు బంపర్ ఆఫర్
-
బాప్రే.. ఒక్క నిమిషానికి 700 పెండింగ్ చలాన్లు క్లియర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్‌కు విశేష స్పందన వస్తోంది. నిమిషానికి 700 పెండింగ్ చలాన్లను అధికారులు క్లియర్ చేస్తున్నారు. బైక్‌లు, ఆటోలకు 75 శాతం, కారు, లారీ, హెవీ వెహికిల్స్‌కు 50 శాతం రాయితీని తెలంగాణ పోలీసులు కల్పించిన విషయం తెలిసిందే. మాస్క్ చలాన్లపై 90 శాతం రాయితితో వాహనాదారు పెద్ద ఎత్తున క్లియర్ చేసుకుంటున్నారు. చలాన్ల రయితీ ఈ నెల 31 వరకు అందుబాటులో ఉండనుంది. గత నాలుగేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 6.19 కోట్ల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌కు ప్రత్యేక అవకాశం కల్పించిన తెలంగాణ పోలీసులు వాహనదారులకు మరో శుభవార్త చెప్పారు. చలాన్ల చెల్లింపుల కోసం గంటల తరబడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే చలానాలు చెల్లించాలని సూచించారు. ఈ-చలాన్ ద్వారా అన్ని పెండింగ్ చలాన్లు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి సేవలను కూడా ఉపయోగించుకోవచ్చని సూచించారు. అటు మీ సేవ, ఈ సేవలో కూడా చలానాలు చెల్లించేలా అవకాశం కల్పించారు ట్రాఫిక్ పోలీస్‌లు. -
Amazon Clearance Sale : 70 శాతం వరకు డిస్కౌంట్లు
ఇండియాలో నంబర్ 1 ఈ కామర్స్ సైట్ అమెజాన్ ఎలక్ట్రానిక్ వస్తువులపై క్లియరెన్స్ సేల్ ప్రకటించింది. వేలాది ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్మకానికి ఉంచింది. గరిష్టంగా 70 శాతం వరకు పలు వస్తువులపై డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. ఈ ఆఫర్‌తో పాటు అమెజాన్ కూపన్లు ఉపయోగించడం ద్వారా మరో రూ. 10,000 రూపాయల వరకు ఎంఆర్పీపై తగ్గింపు పొందవచ్చని అమెజాన్ తెలిపింది. మొబైల్ మిస్ అమెజాన్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సేల్స్‌లో లాప్‌ట్యాప్, డెస్క్‌టాప్, కెమెరా, ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్స్, పవర్‌బ్యాంక్, హార్డ్డిస్క తదితర వస్తువులపై భారీ ఆఫర్లు ఉన్నాయి. అయితే ఎక్కువ డిమాండ్ ఉండే ఫోన్లు ఈ క్లియరెన్స్ సేల్స్ కేటగిరిలో లేవు. దీంతో వినియోగదారులు కొంత నిరాశకు లోనవుతున్నాయి. అయితే మిగిలిన ఐటమ్స్‌లో అవసరమైనవి తక్కువ ధరకు లభిస్తున్నాయనే వారు ఉన్నారు. చదవండి : ఇక ఆడి పెట్రోల్, డీజిల్ కార్లు ఉండవా? -
తొలగిన అడ్డంకి
-
కూల్చివేతకు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్ : సచివాలయం భవ నాల కూల్చివేతకు లైన్‌క్లియర్ అయ్యింది. గత వారం రోజులుగా కూల్చివేత పను లపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుతం ఉన్న భవనాల కూల్చివేతకు ఎటువంటి ముందస్తు అనుమతి అవస రం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. భూమిని సిద్ధం చేయడం (ప్రిపరేషన్ ఆఫ్ ల్యాండ్) అంటే భవనాలను కూల్చి వేయం కూడా వస్తుందని, ఇందుకు అనుమతి అవసరమన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. ఈ వాదనను నిరూపించేందుకు ఎటువంటి ఆధారాలను, తీర్పులను పిటిషనర్ సమర్పించలేదని పేర్కొంది. నూతన నిర్మాణాలకు మాత్రమే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు ఉండాలని పేర్కొంది. పునాదుల కోసం భూమిని తవ్వే ముందు మాత్రమే అనుమతులు ఉండాలని, కూల్చివేతలకు వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం కింద స్థానిక సంస్థల అనుమతి ఉంటే సరిపోతుందని పర్యావరణ శాఖ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి కూల్చివేత పనులు చేపట్టాలని ఆదేశించింది. సచివాలయం కూల్చివేత నిబంధనలకు విరుద్దంగా చేస్తున్నారంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. సరైన అనుమతులు లేకుండానే సచివాలయ భవనాలను కూల్చివేస్తున్నారని, వీటిని ఆపాలంటూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, డాక్టర్ చెరుకు సుధాకర్‌లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. సచివాలయం భవనాల కూల్చివేతకు అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు నివేదించారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ అధికారులు సమర్పించిన లేఖను ధర్మాసనానికి సమర్పించారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. సచివాలయం కూల్చివేసి కొత్తది నిర్మించాలన్న విషయంలో మంత్రిమండలి తుది నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్ వాదనలు వినిపించారని, అయితే జూన్ 30న ఈ మేరకు మంత్రి మండలి తీర్మానం చేసిందని, ఈ తీర్మానం ప్రతిని ఏజీ సమర్పించారని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. భద్రతా కారణాల రీత్యా ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి అత్యాధునిక హంగులతో, మంచి నిర్మాణ శైలితో నూతన భవనాలను నిర్మించాలని మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని పరిశీలించామని వివరించింది. ఈ నేపథ్యంలో మంత్రిమండలి తుది నిర్ణయం లేకుండానే కూల్చివేత పనులు చేపడుతున్నారన్న పిటిషనర్ వాదన సరికాదని స్పష్టం చేసింది. కూల్చివేత సమయంలో వచ్చే వ్యర్థాలను తొలగించే విషయంలో సంబంధిత అధికారుల నుంచి అనుమతులు లేవన్న పిటిషనర్ వాదననూ ధర్మాసనం తోసిపుచ్చింది. రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ ఈ మేరకు జీహెచ్ఎంసీ నుంచి ఈనెల 4న అనుమతులు తీసుకొని 7వ తేదీ నుంచి కూల్చివేత పనులు ప్రారంభించారని పేర్కొంది. కరోనా విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో కూల్చివేతలు చేపట్టరాదని పిటిషనర్ వాదిస్తున్నారని అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాల్లో ఎక్కడా కూల్చివేత పనులు చేపట్టరాదని లేదని పేర్కొంది. కూల్చివేతలతో వెలువడే దుమ్ము, ధూళితో కాలుష్యం ఏర్పడుతోందని, సచివాలయం సమీపంలోని ప్రజలకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే పరిస్థితి లేకుండా వారికున్న ప్రాథమిక హక్కులను హరిస్తున్నారన్న పిటిషనర్ తరఫు వాదననూ ధర్మాసనం తోసిపుచ్చింది. పిటిషనర్ లేవనెత్తిన ఇతర అభ్యంతరాలకు సరైన ఆధారాలు చూపలేదని ధర్మాసనం పేర్కొంది. నూతన భవనాల నిర్మాణ సమయంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం నిబంధనల మేరకే అనుమతులు తీసుకొని వ్యర్థాలను తరలిస్తున్నామని వివరించారు. -
కార్ల విక్రయాలు 8 శాతం డౌన్
న్యూఢిల్లీ: కస్టమర్ల నుంచి అంతగా డిమాండ్ లేకపోవడంతో ఫిబ్రవరిలో వాహనాల అమ్మకాలు తగ్గాయి. గతేడాది ఫిబ్రవరిలో 15,79,349 యూనిట్లు అమ్ముడవగా గత నెలలో 8.06 శాతం క్షీణించి 14,52,078 యూనిట్లకు తగ్గాయి. ఇక కార్ల అమ్మకాలు..గతేడాది ఫిబ్రవరిలో 2,34,632 యూనిట్లు అమ్ముడు కాగా ఈసారి 8.25 శాతం క్షీణించి 2,15,276 యూనిట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా 7.97 శాతం క్షీణించి 12,22,883 యూనిట్స్ నుంచి 11,25,405 యూనిట్స్‌కు తగ్గాయి. ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య ఎఫ్ఏడీఏ బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘సంవత్సరాంతపు క్లియరెన్స్ సేల్, కొత్త మోడల్స్ లాంచింగ్‌తో జనవరిలో గణనీయంగా అమ్మకాలు జరిగాయి. కానీ నెల తిరిగేసరికి ఫిబ్రవరిలో మళ్లీ పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గతనెలలోనే విక్రయాలు గణనీయంగా తగ్గాయి‘ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ ఆశిష్ హర్షరాజ్ కాలె తెలిపారు. సమీప భవిష్యత్‌లో ఆశావహ సూచనలేమీ కనిపించకపోతుండటంతో.. గత ఆరు నెలల నుంచి దేశీయంగా ఆటోమొబైల్స్ విక్రయాలు క్షీణ బాటలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో బీమాపరమైన వ్యయాలు భారీగా పెరిగిన దగ్గర్నుంచి ఒకదానితర్వాత మరొకటిగా అన్నీ ప్రతికూల పరిణామాలే చోటు చేసుకుంటూ ఉండటంతో వినియోగదారులు కార్ల కొనుగోలు ఆలోచనలను వాయిదా వేసుకుంటూ వస్తున్నారని ఆశిష్ చెప్పారు. మొత్తం మీద వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా మారిందని పేర్కొన్నారు. పేరుకుపోతున్న నిల్వలు.. దేశవ్యాప్తంగా డీలర్లందరి దగ్గర వాహనాల నిల్వలు గణనీయంగా పేరుకుపోయాయని ఆశిష్ చెప్పారు. గత రెండు నెలల్లో కొంత తగ్గినప్పటికీ.. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ‘కొందరు ద్విచక్ర వాహనాల డీలర్ల దగ్గర ఆందోళనకర స్థాయిలో, కనీవినీ ఎరుగనంతగా ఏకంగా 100 రోజులకు సరిపడే స్టాక్ పేరుకుపోయింది. ఈ అంశం గురించి మేం పదే పదే చెబుతూనే ఉన్నాం. ఇక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు మొదలైనవి పెరగడంతో డీలర్ల నిర్వహణ వ్యయాలూ భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో డీలర్లు అర్జంటుగా నిల్వలను తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నారు‘ అని ఆశిష్ చెప్పారు. పరిశోధన సంస్థలకూ వాహనాల బల్క్ డేటా విక్రయం ఆటోపరిశ్రమ వృద్ధికి కొత్త విధానం ఆటోమొబైల్ రంగానికి తోడ్పాటునిచ్చే దిశగా కేంద్రం కొత్త విధానాన్ని ఆవిష్కరించింది. దీనితో ఇకపై అర్హత కలిగిన వ్యాపార సంస్థలు, వ్యక్తులు, పరిశోధకులు వాహన రిజిస్ట్రేషన్ డేటాను బల్క్‌గా కొనుగోలు చేసేందుకు వెసులుబాటు లభించనుంది. ఇందుకోసం ఏడాదికి రూ. 3 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ‘బల్క్ డేటా అవసరమైన వ్యాపార సంస్థలు, ఇతరత్రా వ్యక్తులు 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ. 3 కోట్లు కట్టాల్సి ఉంటుంది. పరిశోధన అవసరాల కోసం విద్యా సంస్థలు తీసుకునేట్లయితే రూ. 5 లక్షలు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ఆయా సంస్థలు ఈ డేటాను కచ్చితంగా అంతర్గతంగానే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది’ అని ‘బల్క్ డేటా షేరింగ్ విధానం, ప్రక్రియ’ నిబంధనల్లో పేర్కొన్నారు. డేటాను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవడంతో సర్వీసులు మెరుగుపడేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
6,700 యూనిట్లకు క్లియరెన్సులు ఇచ్చాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 6,700 యూనిట్లకు క్లియరెన్సులు ఇచ్చామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం వెల్లడించారు. వీటి ద్వారా రూ.1,36,000 కోట్ల పెట్టుబడులను ఆకర్శించామని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. పరోక్షంగా మరో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల విస్తరణకు తోడ్పాటు అందిస్తున్నట్టు చెప్పారు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఖాయిలా పడ్డ యూనిట్లను తెరిచేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నట్టు తెలిపారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) దక్షిణ ప్రాంత మండలి తొలి సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిన్న, మధ్యతరహా (ఎస్ఎంఈ) కంపెనీలకు చేయూతనివ్వాల్సిందిగా ఐసీసీ ప్రతినిధులను కోరారు. రానున్న రోజుల్లో ఎస్ఎం ఈలే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించనున్నాయని అన్నారు. మంచి వ్యాపార ఆలోచన ఉండి కూడా మెంటార్షిప్ లేక విఫలమైన కంపెనీలు ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకుంటామని ఐసీసీ దక్షిణ ప్రాంత మండ లి చైర్మన్ రాజీవ్ రెడ్డి తెలిపారు. సమావేశంలో ఐసీసీ ప్రెసిడెంట్ శాశ్వత్ గోయెంకా, చాంబర్ ప్రతినిధులు మయంక్ జలాన్, రాజీవ్ సింగ్ పాల్గొన్నారు. -
లుపిన్కు యూఎస్ఎఫ్డీఏ క్లియరెన్స్
ముంబై: దేశీయ ఫార్మా దిగ్గంజ లుపిన్ లిమిటెడ్ సోమవారం నాటి మార్కెట్లో భారీగా లాభపడుతోంది. గోవా ప్లాంటు తనిఖీల్లో సంస్థకు అమెరికా యూఎస్ఎఫ్డీఏ నుంచి క్లీన్ చిట్ లభించడంతో మదుపర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు దిగారు. దీంతో ఈ షేరు ఇంట్రాడేలో రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. గతజులై 7 తరువాత భారీగా లాభపడి గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది ఫార్మా కౌంటర్ 6 శాతం బలహీనపడగా లుపిన్ మాత్రం 23 శాతం ఎగిసింది. మరోవైపు ఈఐఆర్ నుంచి తమకు ఆమోదం లభించిందన్న సంస్థ ప్రకనటతో గత శుక్రవారం11 శాతం క్షీణించిన లుపిన్ కు నేడు సెంటిమెంట్ బలంగా ఉంది. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన తనిఖీల్లో గోవా యూనిట్ కు (ఈఐఆర్) యూఎస్ఎఫ్డీఏ క్లియరెన్స్ ల భించడంతో కౌంటర్‌కు భారీ డిమాండ్ పుట్టింది. ప్రస్తుతం 8 శాతానికిపైగా లాభాలతో మార్కెట్లో టాప్ విన్నర్ గా ట్రేడవుతోంది. కాగా లుపిన్.. గుండెజబ్బులు, డయాబెటిస్, ఆస్త్మా వంటి పలువ్యాధుల చికిత్సలో జనరిక్ ఫార్ములేషన్లు, బయోటెక్నాలజీ ఔషధాలను తయారీలో పేరుగడించిన సంగతి తెలిసిందే. -
ఓట్ల తొలగింపుపై స్పష్టత ఇవ్వాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు (నెహ్రూనగర్): తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిళ్ళ మేరకే గుంటూరు కార్పొరేషన్లో ఓట్లు తొలగించారని, ఓట్ల తొలగింపులో పారదర్శకత లోపించిందని, ఏ ప్రతిపాదికన ఓట్లు తొలగించారో స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు నగర కమిషనర్ నాగలక్ష్మిని కోరారు. శుక్రవారం ఓట్ల తొలగింపుపై కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై సానూకూలంగా స్పందించిన కమిషనర్ ఓట్ల తొలగింపు విషయంలో పొరపాట్లు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి భయంతో వైఎస్సార్సీపీకి పట్టున్న ప్రాంతాల్లో ఓట్లు తొలగించారంటూ ధ్వజమెత్తారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు అన్నారు. గతంలో డీలిమిటేషన్ ప్రక్రియలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతను పక్కన పెట్టిన తరుణంలో జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అక్షింతలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. అధికార నేతలకు తలొగ్గి, వారి మెప్పుకోసం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే అధికారులపై కూడా న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ఎయిర్పోర్ట్... సైట్ క్లియరెన్స్
కొత్తగూడెం: కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ సైట్ క్లియరెన్స్ ఇచ్చింది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో నాలుగు ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సంబంధించి కమిటీ సమావేశం జరగ్గా, ఆంధ్రప్రదేశ్‌లో మూడు, కొత్తగూడెంలోని రేగళ్లలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం సైట్ క్లియరెన్స్ ఇచ్చింది. -
అనుమతుల మేరకే బృందావన్ నిర్మాణం
సమయమొచ్చినప్పుడు ‘వారి’ పేర్లు వెల్లడిస్తాం విలేకరుల సమావేశంలో గండ్ర సోదరులు హన్మకొండ : బృందావన్ పేరుతో అపార్ట్మెంట్ నిర్మించిన తమను డబ్బు అడిగిన వివరాలను సమయం, సందర్భం వచ్చినప్పుడు బయటపెడుతామని గండ్ర వెంకటరమణరెడ్డి, గండ్ర భూపాల్‌రెడ్డి చెప్పారు. అన్ని అనుమతులు పొందిన తర్వాతే బృందావన్ అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టినా, వడ్డేపల్లి అభివృద్ధి కమిటీ పేరుతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే, ఈ ఆరోపణలపై స్పందించకుంటే తాము తప్పు చేసిన వారమవుతామనే భావనతో వాస్తవాలు చెప్పేందుకు వచ్చామని తెలిపారు. హన్మకొండ వడ్డేపల్లిలోని జీఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్లో బిల్డర్ గండ్ర భూ పాల్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది బ్లాక్‌లో 270 ఫ్లాట్లతో బృందావన్ అపార్్టమెంట్ నిర్మించే క్రమంలో రోడ్డు ఆ క్రమించామని ఆరోపించడంలో వాస్తవం లేదన్నారు. ‘కుడా’ మాస్టర్ ప్లాన్‌లో రోడ్డు 40 ఫీట్లే ఉందని.. కొత్త మాస్టర్ ప్లాన్ అమలులోకి వస్తే 60 ఫీట్ల రోడ్డు కోసం స్థలం వదిలేందుకు సిద్ధమన్నారు. 60 ఫీట్లు రోడ్డుకు వదిలి స్థలం విక్రయించినట్లు చెబుతుండడంపై స్పందిస్తూ డాక్యుమెంట్లలో పొరపాటున 60 అడుగులుగా పడితే సరిచేయించామని తెలిపారు. ఇక డ్రె యినేజీని బల్దియా ఆధ్వర్యాన నిర్మిస్తామని చెప్పగా రూ.12.40 లక్షలు డీడీ ద్వారా చె ల్లించామని అన్నారు. మురుగు నీరు పోవడాని కి సొంత ఖర్చులతో పైపులు వేశామని చె ప్పారు. ఈ ఏడాది మార్చి 15న ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే బల్ది యా అధికారులు నాలుగు అభ్యంతరాలు చె ప్పారన్నారు. అయితే, వాటిని సరిచేసి మరోసారి దరఖాస్తు చేసుకుంటే జూలై 26వ తేదీన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చారని వెంకటరమణారెడ్డి, భూపాల్‌రెడ్డి వెల్లడించారు. -
'పవర్ ఆఫ్ పాటీదార్' కు సెన్సార్ చిక్కులు!
సూరత్ః పవర్ ఆఫ్ పాటీదార్ పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గతంలో గుజరాత్ రాష్ట్రంలో చెలరేగిన పాటీదార్ ఆందోళన ఆధారంగా తెరకెక్కనున్న గుజరాతీ సినిమా విడుదలకు అనుమతి నిరాకరించింది. రాళ్ళు రువ్వుకోవడం, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, ప్రధాని నరేంద్ర మోదీ వంటి వారి నిజమైన పేర్లను వాడటం వంటి అనేక కారణాలతో సినిమా విడుదలకు తిరస్కరించింది. పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి ఆధ్వర్యంలో గతంలో గుజరాత్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆందోళనల నేపథ్యంలో తీసిన గుజరాతీ సినిమా 'పవర్ ఆఫ్ పాటేదార్' విడుదలకు సీబీఎఫ్సీ అనుమతి నిరాకరించింది. గుజరాత్ లో జరిగిన ఆందోళనల్లో రాళ్ళు రువ్వుకోవడం వంటి సన్నివేశాలతోపాటు, ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, ప్రధాని నరేంద్ర మోదీ మొదలైనవారి పేర్లను సినిమాలో వాడటమే కాక, ఆందోళన సమయంలో హార్థిక్ కు సహాయకులుగా ఉన్నవారే సినిమాలో పాత్రలు ధరించడంపై కూడా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే సెన్సార్ బోర్డు ఇప్పటిదాకా సినిమాలో అభ్యంతరకర సీన్లు కట్ చేయడంపై తమకు ఎటువంటి రాత పూర్వక ఆదేశాలు జారీ చేయలేదని, అటువంటి ఆదేశాలు అందితే సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సినిమా నిర్మాత మహేష్ పటేల్ తెలిపారు. సినిమాలో హార్థిక్ పటేల్ తో సహా ఆందోళనలోపాల్గొన్న అనేకమంది నాయకులకు చెందిన పేర్లను వాడటంతోనే సీబీఎఫ్సీ అడ్డు చెప్తున్నట్లు పటేల్ తెలిపారు. అంతేకాక పాటీదార్ టైటిల్ పై కూడా సీబీఎఫ్సీ అభ్యంతరం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్ ఆందోళన, హార్థిక్ పటేల్ కు సంబంధించిన కథలు తెరకెక్కితే.. అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నదే ప్రధాన కారణం అయి ఉండొచ్చని, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ అటువంటి సినిమాలు రాకుండా చేసేందుకు ఇది.. ప్రభుత్వం చేస్తున్నప్రయత్నంలో భాగంలానే ఉందని పటేల్ అన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఆనందీ బెన్ క్యారెక్టర్ ను సినిమాలో పెట్టడం కూడా అభ్యంతరానికి మరోకారణంగా తెలుస్తోందన్నారు. ఒకవేళ బోర్డు.. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు కట్ చేసేందుకు ఆదేశిస్తే అందుకు తాము సిద్ధమేనని, కానీ సినిమా మొత్తానికే సమస్యాత్మకం చేస్తున్నారని, ఇప్పటికే కేసర్ భవానీ ఫిల్మ్ ప్రొడక్షన్ సమర్పణలో 12 కు పైగా గుజరాతీ సహా ఇతర భాషా చిత్రాలను నిర్మించిన 'పవర్ ఆఫ్ పాటీదార్' నిర్మాత పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. -
గుణదల ఫ్లైవోవర్ పనులు ప్రారంభం
దగ్గరుండి పునఃప్రారంభం చేయించిన సీఆర్డీఏ సీఈ ఆరు నెలల్లో పూర్తి చేయించేందుకు సన్నాహాలు భూసేకరణకు ఇబ్బందులు తొలగించే యత్నం విజయవాడ బ్యూరో : గుణదల ఫ్లైవోవర్ నిర్మాణ పనులు ఎట్టకేలకు మళ్లీ ప్రారంభమయ్యాయి. సీఆర్డీఏ చీఫ్ ఇంజినీర్ కాశీవిశ్వేశ్వరరావు శుక్రవారం రామవరప్పాడు సెంటర్ సమీపంలో దగ్గరుండి పనులు మొదలు పెట్టించారు. ఈ ఫ్లైవోవర్ నిర్మాణంలో ఉండగా, 2013, డిసెంబర్లో ఒక గడ్డర్ కూలడంతో పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావడం ఆలస్యమవడం, వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ ముందుకురాకపోవడంతో ఫ్లైవోవర్ నిర్మాణం అయోమయంగా మారింది. ఈ ఫ్లైవోవర్ నిర్మాణం పూర్తి కాకపోవడం వల్లే ఇన్నర్ రింగురోడ్డు పనులు పూర్తయినా దాన్ని ప్రారంభించే అవకాశం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ ఏర్పడిన తర్వాత ఈ ఫ్లైవోవర్ నిర్మాణంపై దృష్టిపెట్టారు. సీఆర్డీఏ చీఫ్ ఇంజినీర్ కాశీవిశ్వేశ్వరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు చేశారు. రకరకాల కారణాలతో కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టకుండా జాప్యం చేస్తుండడంతో ఆయన మాట్లాడి నిర్మాణానికి ఒప్పించారు. శుక్రవారం ఒక శ్లాబ్ నిర్మాణ పనిని దగ్గరుండి ప్రారంభించేలా చూశారు. అడ్డుగా ఉన్న ఇళ్ల తొలగింపునకు చర్యలు ఫ్లైవోవర్ నిర్మాణానికి అడ్డంకిగా మారిన భూసేకరణకు సైతం ఇబ్బందులను తొలగించేందుకు ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. రామవరప్పాడు సమీపంలోని రెండుచోట్ల ఫ్లైవోవర్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఇళ్లను తొలగిస్తేనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అక్కడి ఇళ్లను తొలగించాలంటే వాటిల్లో నివసిస్తున్న వారికి వేరేచోట ఇళ్లు ఇవ్వాలి. దీనిపై జిల్లా కలెక్టర్‌కు సీఆర్డీఏ లేఖ రాయనుంది. ఎంత త్వరగా ఆ ఇళ్లు తొలగిస్తే అంత వేగంగా పనులు నిర్వహిం చేందుకు అవకాశం ఉంది. ఇన్నోటెల్ హోటల్ వల్ల నిర్మాణానికి ఏమైనా ఇబ్బంది వస్తుందనే విషయంపైనా చర్చిస్తున్నారు. ఐదేళ్లు ఆలస్యం.. వీజీటీఎం ఉడా 2006 సంవత్సరంలో ఇన్నర్ రింగురోడ్డుకు ప్రణాళిక రూపొందించింది. రూ.74.24 కోట్లతో చేపట్టిన ఈ పనులకు 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. సంవత్సరంలో ఈ ప్రాజెక్టు పూర్తికావాల్సి ఉండగా, అనేక అవాంతరాల కారణంగా పనులు సజావుగా జరగలేదు. గుణదల ఫ్లైవోవర్ గడ్డర్ కూలడంతో పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో నిర్మాణ వ్యయం రూ.119 కోట్లకు పెరిగినట్లు గత సంవత్సరం నిర్ధారించారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆరు నెలల్లో పూర్తి చేయిస్తా : సీఈ ఆరు నెలల్లో ఫ్లైవోవర్ నిర్మాణం పూర్తయ్యేలా చూస్తానని సీఆర్డీఏ చీఫ్ ఇంజినీర్ కాశీవిశ్వేశ్వరరావు చెప్పారు. మొత్తం 21 శ్లాబులు వేయాల్సి ఉందని, నెలకు మూడు, నాలుగు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.