మంగళగిరి: పేదలకు అమరావతి (సీఆర్‌డీఏ) పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రైతుల ముసుగులో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పేదలకు ఇచ్చేందుకు సీఆర్‌డీఏ కేటాయించిన స్థలాలను బాగు చేయవద్దని పనులు నిర్వహిస్తున్నవారితో గొడవకు దిగారు. దీంతో శుక్రవారం కృష్ణాయపాలెంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఆర్‌డీఏ పరిధిలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, నిడమర్రు, మందడం, ఐనవోలు ప్రాంతాలను కలిపి ప్రభుత్వం ఆర్–5 జోన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఆర్‌డీఏ భూములను కేటాయించింది. ఆ భూముల్లో భారీగా కంపచెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఆర్–5 జోన్‌లో కేటాయించిన భూముల్లో ముళ్లకంపను తొలగించి మెరక చేసి లే అవుట్ వేయాలని సీఆర్‌డీఏ ప్రణాళికలు సిద్ధంచేసింది.
ఇందులో భాగంగా జంగిల్ క్లియరెన్స్, మెరక చేసే పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించింది. కృష్ణాయపాలెంలో కేటాయించిన భూముల్లో శుక్రవారం జంగిల్ క్లియరెన్స్ నిర్వహించేందుకు కాంట్రాక్టర్ జేసీబీలను తీసుకువెళ్లి పనులు ప్రారంభించే సమయంలో రైతుల ముసుగులో ఉన్న పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మంగళగిరి రూరల్ సీఐ భూషణం, ఎస్‌ఐ రమేష్‌బాబు వచ్చి సర్దిచెప్పారు. సీఆర్‌డీఏ ఇచ్చిన వర్క్ ఆర్డర్ కాపీని కాంట్రాక్టర్ చూపించి జంగిల్ క్లియరెన్స్ పనులు చేయాలని చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
చదవండి: సామాజిక న్యాయమే పరమావధి
Comments
Please login to add a commentAdd a comment