poor
-
పేదల సంఖ్య పైపైకి..!
సాక్షి, అమరావతి: కోవిడ్ అనంతరం ధనికుల సంపద గణనీయంగా పెరుగుతోంది. అదే సమయంలో పేదల సంఖ్య పెరుగుతూ పోతోంది. 1990లో దేశంలోని మొత్తం ఆదాయంలో 34 శాతం వాటా బిలియనీర్లది కాగా, ఇప్పుడు అది 57 శాతానికి పెరిగింది. అయితే, అదే సమయంలో కోట్లాది మంది ఆదాయం 22.2 శాతం నుంచి 15 శాతానికి పడిపోయింది. దేశంలో లగ్జరీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ సాధారణ వినియోగ వస్తువులకు లేకపోవడం గమనార్హం. భారత్ వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఉన్నందున, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా ఉండాలని బ్లూమ్ వెంచర్స్ నివేదిక సూచిస్తోంది. నివేదికలోని మరిన్ని అంశాలు పరిశీలిస్తే... అందుబాటులో లేని ఇళ్లు.. ఐదేళ్ల క్రితం అందుబాటు ధరలో ఇళ్ల సంఖ్య 40 శాతం ఉండగా, ఇప్పుడు అది 18 శాతానికి తగ్గింది. గడచిన పదేళ్లలో ద్రవ్యోల్బణం పెరిగినా, మధ్యతరగతి వేతనాలు పెరగలేదు. దేశ అభివృద్ధి వేగవంతం కావాలంటే ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా చర్యలు తీసుకోవడం అవసరం. 14 కోట్ల మందికే కొనుగోలు శక్తి 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో కేవలం 13–14 కోట్ల మందికే సముచితమైన కొనుగోలు శక్తి ఉంది. ఇది మెక్సికో జనాభాకు సమానం. దేశ వినిమయ శక్తిలో వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరో 30 కోట్ల మంది కొనుగోలు శక్తిని పెంచుకునే దశలో ఉన్నారు. అయితే, మిగిలిన 100 కోట్ల మందికి కొనుగోలు శక్తి లేకపోవడం ఆరి్థక అసమతుల్యతను సూచిస్తోంది. కోవిడ్ అనంతరం భారత ఆరి్థక వ్యవస్థ ‘‘కే–ఆకారపు‘ (వృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందని దేశ ఒడిదుడుకుల వృద్ధి బాట) వృద్ధిబాటను అనుసరిస్తోంది. ధనికులు మరింత ధనవంతులవుతుండగా, పేదలు మరింత వెనుకబడుతున్నారు. లగ్జరీ వినియోగంలో పెరుగుదల దేశంలో ఆల్ట్రా లగ్జరీ వస్తువులు, ఖరీదైన ఫోన్లు, విలాస భవంతులకు డిమాండ్ విపరీతంగా ఉంది. ఐదేళ్ల క్రితం అందుబాటు ధరలో ఉన్న ఇళ్ల సంఖ్య 40 శాతంగా ఉండగా, ఇప్పుడు అది 18 శాతానికి పడిపోయింది. బ్రాండెడ్ ఉత్పత్తులకు భారతదేశం ప్రధాన మార్కెట్‌గా మారుతోంది. ఖరీదు ఎంతైనా నచి్చన వస్తువులను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. అంతర్జాతీయ కళాకారులు కోల్డ్‌ప్లే, ఈడీ షీరన్ వంటి ప్రముఖ సంగీత ప్రదర్శనల టిక్కెట్లు వేగంగా అమ్ముడుపోవడం, దేశంలో లగ్జరీ వినియోగం ఎలా పెరిగిందో సూచిస్తోంది. పెరగని మధ్యతరగతి వేతనాలు... దేశ వినిమయ వ్యవస్థలో అత్యంత కీలకమైన మధ్యతరగతి ప్రజల జీతాలు గడచిన కొన్నేళ్లుగా పెరగకపోవడం ప్రధాన సమస్య. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, జీతాలు పెరగకపోగా, వాస్తవంగా తగ్గాయి. భవిష్యత్తులో కూడా మధ్యతరగతి ప్రజలు ఇలాంటి గడ్డుపరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. పన్ను మినహాయింపు పరిమితి పెరిగినా.. సమస్యలే.. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని గత బడ్జెట్లో రూ.12.75 లక్షల ఆదాయం ఉన్నవారిని ఆదాయపన్ను నుంచి మినహాయించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది దిగువ మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందని భావిస్తున్నారు. అయితే, మరోవైపు, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోనున్నట్లు పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే తయారీ, ఐటీ రంగాల్లో ఉద్యోగావకాశాలు తగ్గుతున్నాయి.పేదల కొనుగోలు శక్తిలో తగ్గుదల.. కోవిడ్ తర్వాత పేదల వినిమయ సామర్థ్యం గణనీయంగా తగ్గింది. దీనితో పాటు, పొదుపు శక్తికూడాబలహీనపడింది. వ్యక్తిగత, క్రెడిడ్ కార్డుల వంటి అన్సెక్యూర్డ్ రుణాలు పెరిగిపోవడంతో ప్రజలు రుణ ఊబిలో చిక్కుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా, రిజర్వ్ బ్యాంక్ ఇటువంటి రుణాలపై ఆంక్షలు విధించింది. దేశీయ గృహ పొదుపు 50 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
ప్రపంచంలో 10 పేద దేశాలు: కనిపించని బంగ్లా, పాక్
ప్రపంచంలోని 10 అత్యంత పేద దేశాల జాబితా విడుదలయ్యింది. ఫోర్బ్స్ అందించిన ఈ సూచీలో టాప్‌లో నిలిచిన దేశాలు ప్రపంచంలో అతి చిన్న దేశాలుగా గుర్తింపుపొందాయి. వీటిలో భారత్‌కు సన్నిహిత దేశమైన మడగాస్కర్ 10వ స్థానంలో ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు.1. దక్షిణ సూడాన్దక్షిణ సూడాన్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా గుర్తింపు పొందింది. ఈ దేశపు జీడీపీ 29.99 బిలియన్ డాలర్లు. దక్షిణ సూడాన్ జనాభా 1.11 కోట్లు. ఈ దేశంలో యువత అత్యధిక శాతంలో ఉంది. 2011లో ఈ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. ఈ దేశంలోని అత్యధిక జనాభా వ్యవసాయంపైననే ఆధారపడింది.2. బురుండీమధ్య ఆఫ్రికాలోని బురుండీ ప్రపంచంలో రెండవ అత్యంత పేద దేశం. బురుండీ జీడీపీ 2.15 బిలియన్ డాలర్లు. ఇక్కడి జనాభా 1,34,59,236. రాజకీయ అస్థిరత, అంతర్గత సంఘర్షణలు ఈ దేశపు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశంలోని 80 శాతం జనాభా వ్యవసాయంపైననే ఆధారపడి జీవిస్తోంది.3. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రపంచంలో మూడవ పేద దేశం. ఇక్కడి జనాభా 58,49,358. జీడీపీ 3.03 బిలియన్ డాలర్లు. రాజకీయ అస్థిరత, సాయుధ పోరాటం మౌలిక సదుపాయాల కొరతతో ఈ దేశం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ దేశంలో 80 శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు.4. మలావిమలావి ప్రపంచంలో నాల్గవ పేద దేశం. మలావి జనాభా 2,13,90,465. జీడీపీ 10.78 బిలియన్ డాలర్లు. మలావి గణనీయమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. వర్షాధార వ్యవసాయంపై ఇక్కడ పంటలు సాగుచేస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వం విద్య, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి,పేదరికాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది.5. మొజాంబిక్మొజాంబిక్ ప్రపంచంలో ఐదవ పేద దేశం. మొజాంబిక్ జనాభా 3,44,97,736. జీడీపీ 24.55 బిలియన్ డాలర్లు. ఉగ్రవాదం, హింస మొజాంబిక్ ముందున్న ప్రధాన సమస్యలు. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు, జనాభా పెరుగుదల మొదలైనవి ఈ దేశాన్ని పేదరికంలోకి నెట్టివేశాయి.6. సోమాలియాసోమాలియా ప్రపంచంలో ఆరవ పేద దేశం. సోమాలియా జీడీపీ 13.89 బిలియన్ డాలర్లు. జనాభా 1,90, 09,151. ఇక్కడి అంతర్యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. దీంతో దేశం పతనమయ్యింది.7. కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ప్రపంచంలో ఏడవ పేద దేశం. జీడీపీ 79.24 బిలియన్ డాలర్లు. జనాభా 10,43,54,615. ఈ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రువాండా అనుకూల తిరుగుబాటుదారుల దాడులతో అతలాకుతలమవుతోంది. కాంగోలో దాదాపు 62 శాతం మంది రోజుకు రూ.180 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు.8. లైబీరియాలైబీరియా ప్రపంచంలో ఎనిమిదవ పేద దేశం. లైబీరియా జీడీపీ 5.05 బిలియన్ డాలర్లు. జనాభా 54,92,486. ఆఫ్రికన్ దేశమైన లైబీరియాలో అంతర్యుద్ధం కారణంగా శాశ్వత పేదరికం ఏర్పడింది. ప్రపంచ ఆహార కార్యక్రమం వంటి అంతర్జాతీయ సంస్థలు విద్య , ఆరోగ్య సంరక్షణలో లైబీరియాకు సహకారాన్ని అందిస్తున్నాయి.9. యెమెన్ప్రపంచంలోని పేద దేశాలలో యెమెన్ తొమ్మిదవ స్థానంలో ఉంది. యెమెన్ జీడీపీ 16.22 బిలియన్ డాలర్లు. జనాభా 34.4 మిలియన్లు. సంవత్సరాల తరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత యెమెన్‌ను ఆర్థికంగా దెబ్బతీశాయి. ఆహారం, నీరు, మందులు, నిత్యావసర వస్తువుల కొరత ఈ దేశాన్ని నిత్యం వెంటాడుతుంటుంది.10. మడగాస్కర్మడగాస్కర్ ప్రపంచంలోని 10వ పేద దేశం. మడగాస్కర్ జీడీపీ 18.1 బిలియన్ డాలర్లు. జనాభా 30.3 మిలియన్లు. ఈ దేశం భారతదేశానికి సన్నిహిత దేశంగా పేరొందింది. మడగాస్కర్ ఆఫ్రికాకు ఆగ్నేయ తీరంలో ఉన్న ఒక ద్వీప దేశం. మైనింగ్, పర్యాటకం ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి.ఇది కూడా చదవండి: ఆరు అలవాట్లు.. విజయానికి అడ్డు గోడలు -
గణనాథుడు అందరివాడే...! వైరల్ వీడియోలు
గణపతి అంటే చిన్నా పెద్దా అందరికీ అంతులేని భక్తి. ఈ విషయంలో పేద, గొప్ప తారతమ్యం ఉండదు. ఎంతటి వారైనా చేసిన తప్పులు మన్నించమంటూ బొజ్జ గణపయ్య ముందు గుంజీలు తీయాల్సిందే. విఘ్నాలు కాయవయ్యా అంటూ అధినాయకుడైన వినాయకుడిముందు మోకరిల్లాల్సిందే. ముఖ్యంగా వినాయక చవితికి పిల్లలు తెగ హడావిడి చేస్తారు. ఎలాగో అలాగ డబ్బులు వసూలు చేసి మరీ తమ సామర్థ్యం మేరకు బుల్లి గణపయ్య విగ్రహాలను ఏర్పాటు చేసుకొని కొలుస్తారు. ముల్లోకాలు చుట్టి రమ్మంటే తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మీరే నా ప్రపంచం అంటూ నమస్కరించి తల్లిదండ్రుల తర్వాతే మరేదైనా చాటి చెప్పిన తీరు పిల్లలకు ఆదర్శమే మరి. వినాయక చవితి సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు మీకోసం.Small wonders, big smiles – Ganpati arrives in a child's world! ❤️ pic.twitter.com/v08lzCG56C— Arpit (@ag_arpit1) September 8, 2024 A heartwarming visual of a man welcoming Bappa all alone 🙏 Ganpati Bappa Morya 🙏 pic.twitter.com/v2kLwHKm3F— Vineeta Singh 🇮🇳 (@biharigurl) September 9, 2024గణపతి బప్పా అంటే అందరికీ ఇష్టమే. ఆరోగ్యం , అభయం, విజయం, సంతోషం, సంపద, దైర్ఘ్యం, అన్నింటిని ప్రసాదించే గణపయ్య ముందు శునక రాజం కూడా భక్తితో సాష్టాంగపడటం విశేషం.Bappa is everyone’s favourite. An adorable devotee of Prabhu Ganesh bows down to Him with love and devotion…! 😍❣️🥰 pic.twitter.com/NjxtkTG5Ou— Sumita Shrivastava (@Sumita327) September 9, 2024 -
‘వందేభారత్‌పైనే శ్రద్ధనా?’ రైల్వే మంత్రి ఏమన్నారంటే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2024-25 బడ్జెట్లో ఉద్యోగ కల్పన, గ్రామీణాభివృద్ధిపై అధికంగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక మంత్రి తన 83 నిమిషాల సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో రైల్వే అనే పదాన్ని ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వం రైల్వేలకు ఏమి చేస్తున్నదనే ప్రశ్న పలువురి మదిలో మెదిలింది. అలాగే ప్రభుత్వం వందేభారత్‌పై పెడుతున్న శ్రద్ధ.. పేదల రైళ్ల విషయంలో పెట్టడం లేదంటూ పలు ఆరోపణలు వినవస్తున్నాయి. వీటిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.బడ్జెట్ వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో తక్కువ ఆదాయవర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారని, వీరికి సంబంధించిన రైళ్ల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. అటు వందేభారత్పైన, ఇటు సాధారణ ప్రయాణికులు రైళ్లపైన కూడా దృష్టి పెడుతున్నదన్నారు. రైలును రూపొందించే విధానం ప్రతి రైలుకు ప్రామాణికంగా ప్రత్యేకంగా ఉంటుందని, దానికి అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, నాన్-ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు ఉంటాయన్నారు. అల్ప ఆదాయ వర్గానికి చెందినవారు తక్కువ చార్జీలకే ప్రయాణించేలా చూడటమే రైల్వేల ప్రధాన లక్ష్యమన్నారు. దేశంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, డబ్లింగ్‌లో గణనీయమైన పెట్టుబడితో సహా గత ఐదేళ్లలో రైల్వేలపై మూలధన వ్యయం 77 శాతం పెరిగిందని 2023-24 ఆర్థిక సర్వే తెలిపిందన్నారు. 2014కు ముందు రైల్వేలకు మూలధన వ్యయం సుమారు రూ. 35,000 కోట్లు అని, నేడు ఇది రూ. 2.62 లక్షల కోట్లు అని, ఈ తరహా పెట్టుబడులు పెట్టినందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నానని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. -
ఆ వ్యాధి ధనవంతులకే వస్తుందా?
ధనవంతులకే పెద్ద వ్యాధులు వస్తాయి అని పూర్వం అనుకునేవారు. డబ్బుతో వైద్యం కొనవచ్చునని, కావాల్సిన ఆహార పదార్థాలు తెప్పించుకు తినగలరని తద్వారా ఎలాంటి వ్యాధినైనా వారు తట్టుకోగలరని అంచనా. అలాగే కొన్ని రకాల వ్యాధులు వారికి మాత్రమే వస్తాయన్న అపోహ కూడా ఉండేది. కానీ ఇప్పుడూ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో అదే నిజమని తేలింది. ముఖ్యంగా ప్రాణంతక వ్యాధి అయిన కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎవరికి అధికమో సవివరంగా వెల్లడించారు పరిశోధకులు. అవేంటో చూద్దామా..!ఫిన్లాండ్లోని హెల్సింకీ విశ్వవిద్యాలయం నిర్వంహించిన సరికొత్త అధ్యయనం ప్రకారం... మనకొచ్చే వ్యాధులకూ, సామాజిక, ఆర్థిక పరిస్థితికీ మధ్య సంబంధం ఉంది. మరీ ముఖ్యంగా కేన్సర్ విషయంలో. ఈ ప్రాణాంతక వ్యాధి పేదల కంటే సంపన్నులకు వచ్చే అవకాశాలు ఎక్కువని వీరు తేల్చారు. ముఖ్యంగా ధనవంతులలో రొమ్ము, ప్రొస్టేట్, వంటి ఇతర రకాల కేన్సర్ వచ్చే జన్యుపరమైన ప్రమాదం ఎక్కవగా ఉందని పరిశోధన పేర్కొంది. తక్కువ సంపాదన కలవారు డిప్రెషన్‌కి గురై ఆల్కహాల్‌కి బానిసవ్వడంతో ఊపిరితిత్తుల కేన్సర్ తోపాటు మధుమేహం, ఆర్థరైటిస్‌ల వంటి వ్యాధులు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎక్కువ ఆదాయాలు ఆర్జించే సంపన్న దేశాల్లో సర్వసాధారణంగా వచ్చే 19 వ్యాధుల గురించి పేర్కొంది. ఉన్నత విద్యావంతులైన మహిళల్లో రోమ్ము కేన్సర్‌కి సంబంధించిన జన్యు ప్రమాదం గురించి ముందుగానే వైద్యులని సంప్రదించడం, చికిత్స తీసుకోవడం వంటివి చేస్తారు. ముఖ్యంగా తక్కువ జన్యు ప్రమాదం లేదా తక్కువ విద్య ఉన్న మహిళలు కంటే వీరే అధికంగా ఆస్పత్రులను సందర్శించడం జరుగుతుందని పరిశోధన పేర్కొంది. అందుకోసం శాస్త్రవేత్తల బృందం సుమారు 80 ఏళ్ల వయసుగల దాదాపు రెండు లక్షలకు పైగా ఫిన్లాండ్ పౌరుల ఆరోగ్య డేటాని సేకరించారు. దానిలో వారి సామాజిక పరిస్థితితో లింక్అప్ అయ్యి ఉన్న జన్యుసంబంధాన్ని ట్రాక్ చేశారు. అయితే ఇలా వ్యాధుల వచ్చే ప్రమాదం జెండర్ పరంగా చూస్తే ఆడ, మగలో మద్య చాలా తేడా ఉందని, ఇది వారి వయసు మీద ఆధారపడి ఉంటుందని డాక్టర్ హగెన్ బీక్ చెప్పారు. ఇక్కడ వ్యాధి ప్రమాదానికి సంబధించిన జన్యు అంచనా అనేది సామాజిక ఆర్థిక నేపథ్యంపై ఆధారపడి ఉంటుందని పరిశోధనలో వెల్లడయ్యింది. ఇక్కడ ఒక వ్యక్తిలో జన్యు సమాచారం అనేది జీవితకాలంలో మారదు. వయసు రీత్యా లేదా పరిస్థితులు మారినప్పుడూ వచ్చే వ్యాధుల ప్రమాదం కారణంగా జన్యుప్రభావం మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒక నిర్థిష్ట వృత్తితో లింక్ అయ్యే వ్యాధి ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి వివిధ పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.(చదవండి: ఎద్దులు కాపలాకాస్తున్న సమాధి..ఏకంగా రెండువేల..!) -
పేదల ఇళ్లకు పెద్దపీట
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు 2024–25 రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఒకటిన్నర సెంట్ల చొప్పున 30.20 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు మహిళల పేరిట ఇచ్చిన స్థలాల్లో గృహ నిర్మాణాలను కూడా చేపట్టిందని నాబార్డు ప్రముఖంగా ప్రస్తావించింది. గ్రామీణ పేదల ఇళ్ల నిర్మాణాలకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించింది. 17,005 లేఔట్లలో వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, మూడు దశల్లో మొత్తం నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని పేర్కొంది. ఇప్పటికే తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిందని తెలిపింది.పేదల ఇళ్ల లబ్ధిదారుల నిర్మాణాలకు రాష్ట ప్రభుత్వం నాణ్యమైన మెటీరియల్‌ను తక్కువ ధరకే సమకూర్చడంతోపాటు కాలనీల్లో రోడ్లు, నీటి సరఫరా లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని నాబార్డు పేర్కొంది. 2024–25లో ఇళ్ల నిర్మాణాలకు రూ.20,901 కోట్లు రుణ ఆవశ్యకత ఉందని జిల్లాల వారీగా రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు తెలిపింది. -
బడుగు, బలహీనవర్గాల అధికారులపైనే పచ్చకుట్ర
సాక్షి, అమరావతి : బడుగు, బలహీనవర్గాలంటే ఎంతటి ద్వేషమో టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా చాటుకున్నారు. తాను అధికారంలో ఉండగా బీసీలు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకున్న ఘనుడీయన. అత్యంత అవినీతిపరుడైన తన సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వర రావు వంటి అధికారులను అడ్డం పెట్టుకుని కేంద్ర భద్రతా చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ ఎన్నికల అక్రమాలకు పాల్పడిన బరితెగింపు చరిత్ర కూడా ఆయనదే. ప్రస్తుతం ఎన్నికల్లోనూ టీడీపీ ఓటమి తప్పదని తేటతెల్లం కావడంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు.అందుకే ఏకంగా అధికార వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ అధికారులే లక్ష్యంగా కుట్రలకు తెగించారు. దాంతో పాటు రెడ్డి సామాజికవర్గం అధికారులపైనా కుట్రపూరితంగా దు్రష్పచారం చేస్తున్నారు. ఆ సామాజికవర్గాల అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పక్కా పన్నాగాన్ని అమలు చేస్తున్నారు. తద్వారా ఎన్నికల్లో తమ అక్రమాలకు అడ్డు లేకుండా చేసుకోవాలన్నది చంద్రబాబు లక్ష్యం.అందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్ట, రెడ్డి సామాజికవర్గాల అధికారులపై కొంతకాలంగా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేస్తున్నారు. అవాస్తవాలు, అసత్య ఆరోపణలతో ఎన్నికల కమిషన్ (ఈసీ)కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. బీజేపీతో జట్టు కట్టిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, తన వదిన దగ్గుబాటి పురందేశ్వరిని కూడా చంద్రబాబు తన పన్నాగంలో భాగస్వామిని చేసి, ఉమ్మడి కుట్రకు తెరతీశారు. టీడీపీ ఇచి్చన స్క్రిప్ట్ మేరకు పురందేశ్వరి కూడా అవే అసత్య ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదులు చేస్తున్నారు.చంద్రబాబు ఏ సామాజికవర్గాల అధికారులపై అసత్య ఆరోపణలు చేశారో.. సరిగ్గా ఆ అధికారులపైనే పురందేశ్వరి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆ సామాజికవర్గాలకు చెందిన అధికారుల నిబద్ధత, సమర్థతపై అపవాదులు వేస్తున్నారు. అనంతరం ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆ బడుగు, బలహీనవర్గాలు, రెడ్డి సామాజికవర్గ అధికారులను హఠాత్తుగా బదిలీ చేయిస్తున్నారు. ఆ అధికారులను ఆత్మన్యూనతకు గురి చేసి వేధిస్తున్నారు. బడుగు, బలహీనవర్గాలే సమిధలు చంద్రబాబు, పురందేశ్వరి ఈసీకి పదే పదే చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్న పేర్లలో 70% బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం మైనార్టీల అధికారులే. రెడ్డి సామాజికవర్గానికి చెందిన అధికారులు 20% ఉన్నారు. టీడీపీ, బీజేపీ ఒత్తిడితో ఈసీ ఇప్పటివరకు బదిలీ చేసిన, చార్జ్ మెమోలు జారీ చేసినవారిలో ఏకంగా 90% బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం, రెడ్డి సామాజికవర్గాలకు చెందినవారే ఉన్నారు. చంద్రబాబు కుట్రకు తలొగ్గి ఈసీ ఇప్పటివరకు 29 మంది అధికారులను బదిలీ చేసింది.వారిలో 14 మంది అంటే దాదాపు 50% బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం మైనారీ్టలకు చెందిన అధికారులే. ఇక రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు 11 మందిని బదిలీ చేసింది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన మరో ముగ్గురికి చార్జ్ మెమోలు జారీ చేసింది. అంటే మొత్తం 14మందిపై చర్యలు తీసుకుంది. అంటే టీడీపీ కుట్రలతో బదిలీ అయినవారిలో ఎస్సీ, ఎస్టీ, మైనారీ్ట, రెడ్డి సామాజికవర్గాలకు చెందిన అధికారులే 90% ఉండటం విభ్రాంతి కలిగిస్తున్న వాస్తవం. బ్రాహ్మణ, బలిజ, క్షత్రియ సామాజికవర్గాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు.చంద్రబాబు ఒత్తిడితో ఈసీ బదిలీ చేసిన అధికారుల జాబితా ఇలా ఉంది.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు ∙పి. రాజా బాబు (కలెక్టర్, కృష్ణా జిల్లా) ∙పీఎస్ గిరీషా (కలెక్టర్, అన్నమయ్య జిల్లా) ∙కల్పనా కుమారి (పీవో, సీతంపేట ఐటీడీయే, పార్వతీపురం మన్యం జిల్లా) ∙జి. పాలరాజు (ఐజీ, గుంటూరు) ∙కేకేఎన్ అన్బురాజన్ (ఎస్పీ, అనంతపురం జిల్లా) ∙పి. జాషువా (ఎస్పీ, చిత్తూరు జిల్లా) ∙పి.శరత్ బాబు (సీఐ, మాచర్ల) ∙వంగా శ్రీహరి (ఎస్సై, వెల్దుర్తి) ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారు ∙జి. లక్ష్మీశా (కలెక్టర్, తిరుపతి జిల్లా) ∙ఇ. మారుతి (ఎస్సై, సదుం, చిత్తూరు జిల్లా) బీసీ సామాజికవర్గానికి చెందినవారు ∙టి. కాంతి రాణా (పోలీస్ కమిషనర్, విజయవాడ) ∙సీహెచ్. అంజు యాదవ్ (సీఐ, శ్రీకాళహస్తి) ∙చిన మల్లయ్య (సీఐ, కారంపూడి) ముస్లిం మైనారీ్టలు ∙మహబూబ్ బాషా (డీఎస్పీ, రాయచోటి)రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు ∙కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి (డీజీపీ) ∙ఆర్.ఎన్. అమ్మిరెడ్డి (డీఐజీ, అనంతపురం) ∙ఎం. గౌతమి (కలెక్టర్, అనంతపురం జిల్లా) ∙కె. తిరుమలేశ్వరరెడ్డి (ఎస్పీ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా) ∙పి. పరమేశ్వర్‌రెడ్డి (ఎస్పీ, ప్రకాశం జిల్లా) ∙వై. రవిశంకర్‌రెడ్డి (ఎస్పీ, పల్నాడు జిల్లా) ∙రిశాంత్‌రెడ్డి (ఎస్పీ, ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక విభాగం) ∙వీర రాఘవరెడ్డి (డీఎస్పీ, అనంతపురం) ∙సి. మహేశ్వర్‌రెడ్డి (సీఐ, పలమనేరు, చిత్తూరు జిల్లా) ∙పి.జగన్మోహన్రెడ్డి (సీఐ, తిరుమల) ∙జి. అమర్నాథ్రెడ్డి (సీఐ, తిరుమల) ఈసీ చార్జ్‌మెమో జారీ చేసిన అధికారులు ∙కె. రఘువీరారెడ్డి (ఎస్పీ, నంద్యాల) ∙ఎన్. రవీంద్రనాథ్‌రెడ్డి (డీఎస్పీ, నంద్యాల) ∙కె. రాజారెడ్డి (సీఐ, నంద్యాల టూటౌన్) బదిలీ అయిన ఇతర ఓసీ సామాజికవర్గాల వారు ∙పీఎస్ఆర్ ఆంజనేయులు (డీజీ, ఇంటెలిజెన్స్) (బ్రాహ్మణ) ∙ఆర్. వినోద్ (ఎస్సై, తిరుమల) (క్షత్రియ) ∙ బీవీ శ్రీనివాసులు (ఎస్సై, తిరుమల), (బలిజ) -
PM Modi Emotional Video: బాల్యాన్ని గుర్తు చేసుకుని ప్రధాని భావోద్వేగం
సోలాపూర్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ భావోద్వేగానికి గురయ్యారు. లబ్ధిదారులకు పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇళ్లు అందజేస్తూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో 90 వేల మంది నిరుపేదలకు పీఎం ఆవాస్(అర్బన్) కింద ఇళ్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘లబ్ధిదారులకు అందజేసిన ఇళ్లను చూసినపుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. చిన్నతనంలో నాకు ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం ఉంటే బాగుండనిపించింది. అయితే ఇప్పుడు ఇంత మంది లబ్ధిదారుల ఇంటి కల నిజమయినందుకు సంతృప్తిగా ఉంది. వాళ్ల ఆశీర్వాదాలే నాకు పెద్ద ఆస్తి’ అని చెమర్చిన కళ్లతో మోదీ చెప్పారు. అణగారిన వర్గాల అభ్యన్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెపపడానికి ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడమే ఒక ఉదాహరణ అన్నారు. మోదీ గ్యారెంటీ అంటే ఇచ్చిన గ్యారెంటీని పూర్తి చేయడమే అని చెప్పారు. పీఎం అర్బన్ స్కీమ్ కింద సోలాపూర్‌లో చేపట్టిన రాయ్ హౌసింగ్ సొసైటీ ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టని మోదీ తెలిపారు. 90 వేల ఇళ్లు పొందిన లబ్ధిదారుల్లో శానిటరీ సిబ్బంది, వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు ఎక్కువగా ఉండటం గమనార్హం. #WATCH | PM Modi gets emotional as he talks about houses completed under PMAY-Urban scheme in Maharashtra, to be handed over to beneficiaries like handloom workers, vendors, power loom workers, rag pickers, Bidi workers, drivers, among others. PM is addressing an event in… pic.twitter.com/KlBnL50ms5 — ANI (@ANI) January 19, 2024 ఇదీచదవండి.. దశాబ్దాల కల నెరవేరుతోంది.. మోదీ -
పైసా కూడా లేకుండా పోటీకి దిగిన అభ్యర్థులు వీరే!
రాజస్థాన్‌లోని 199 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు (నవంబర్ 25) పోలింగ్ జరుగుతోంది. అన్ని పార్టీల నుంచి 1862 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాజస్థాన్ సహా మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. ఈసారి దేశంలోని అందరి దృష్టి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఇక్కడ బీజేపీ-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. రాజస్థాన్ ఎన్నికల్లో వందల కోట్ల ఆస్తులు కలిగిన అభ్యర్థులు పోటీకి దిగారు. అదేసమయంలో ఒక్క రూపాయి కూడా ఆస్తి లేని అభ్యర్థులు కూడా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పలువురు అభ్యర్థులు తమ అఫిడవిట్లలో తమ దగ్గర ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదని పేర్కొన్నారు. 1. బన్వారీ లాల్ శర్మ: అల్వార్ జిల్లాలోని తనగాజీ స్థానం నుండి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీకి దిగిన అభ్యర్థి బన్వారీ లాల్ శర్మ. ఆయన తన ఆస్తులను జీరోగా ప్రకటించారు. 2. హేమంత్ శర్మ: అల్వార్ జిల్లాలోని బెహ్రోర్ స్థానం నుండి పోటీ చేస్తున్న ఇండియన్ పీపుల్స్ గ్రీన్ పార్టీ అభ్యర్థి, న్యాయవాది హేమంత్ శర్మకు కూడా తనకు ఆస్తులు లేవని తెలిపారు. 3. దీపక్ కుమార్ మీనా: సామ్రాట్ మిహిర్ భోజ్ సమాజ్ పార్టీకి చెందిన దీపక్ కుమార్ మీనా.. సవాయ్ మోథ్పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన దగ్గర కూడా ఎలాంటి ఆస్తి లేదు. 4. బద్రీలాల్: ఆజాద్ సమాజ్ పార్టీకి చెందిన బద్రీలాల్ (కాన్షీరామ్) ఝలావర్ జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ దాగ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తన అఫిడవిట్లో తన ఆస్తులు సున్నా అని తెలియజేశారు. 5. నహర్ సింగ్: నహర్ సింగ్.. మజ్దూర్ కిసాన్ అకాలీ దళ్ టిక్కెట్‌పై గంగానగర్ జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానం రాయసింగ్నగర్ నుండి పోటీ చేస్తున్నారు. ఈయనకు కూడా ఎలాంటి ఆస్తి లేదు. 6. కన్హయ్యలాల్: కన్హయ్యలాల్ బికనీర్ జిల్లాలోని నోఖా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తనకు ఒక్క రూపాయి కూడా ఆస్తి లేదని ఆయన తన అఫిడవిట్లో పేర్కొన్నారు. 7. వేద్ ప్రకాష్ యాదవ్: తనకు ఒక్క రూపాయి కూడా ఆస్తులు లేవని ప్రకటించిన వేద్ ప్రకాష్ యాదవ్ అల్వార్ జిల్లాలోని ముండావర్ స్థానం నుంచి పోటీకి దిగారు 8. పురుషోత్తం భాటి: పురుషోత్తం భాటి అజ్మీర్ జిల్లాలోని బీవార్ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు. తనకు ఎలాంటి ఆస్తులు లేవని ఆయన అఫిడవిట్లో పేర్కొన్నాడు. రూ.500 ఆస్తుల యజమానులు మరోవైపు తమ వద్ద రూ.500 మేరకు ఆస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్న అభ్యర్థులు కూడా ఉన్నారు. బహుజన్ శోషిత్ సమాజ్ సంఘర్ష్ సమతా పార్టీకి చెందిన కుసుమ్ లత హిందౌన్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బహుజన్ ముక్తి పార్టీకి చెందిన చంద్ర కుమార్ చిత్తోర్‌గఢ్ జిల్లాలోని నింబహెరా నుండి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తమ వద్ద రూ.500 మేరకు ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఈ వీఐపీ సీట్లపైనే అందరి దృష్టి! -
పేదల ఇళ్లకు పావలా వడ్డీకే రుణాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తోంది. ఇప్పటికే ఇళ్ల లబ్ధిదారుల్లో 79 శాతం మందికి పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తుండగా.. ఈ మొత్తానికి అదనంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయిస్తోంది. లబ్ధిదారులకు ఉచితంగానే ఇసుక సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఇంటికి అవసరమైన ఇతర సామగ్రిని తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 16,06,301 మంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. ఇందులో 12,61,203 మందికి పావలా వడ్డీకి రూ.4,443.13 కోట్ల రుణాన్ని బ్యాంకులు మంజూరు చేశాయి. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు మహిళల పేరుతో చేసినందున పావలా వడ్డీ రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నారు. నిర్మాణాలపై సీఎస్ సమీక్ష ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేదల ఇళ్ల నిర్మాణాల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు. వర్షాకాలం ముగిసిన దృష్ట్యా ఇళ్ల నిర్మాణాలను మరింత వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి వారం ఎన్ని ఇళ్లు పూర్తి చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకుని.. ఆ లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు తరచూ ఇళ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించాలని సూచించారు. పావలా వడ్డీ రుణాలు మంజూరు చేయించడంపై శ్రీకాకుళం, ఎన్టీఆర్, చిత్తూరు, నెల్లూరు, విశాఖ జిల్లా కలెక్టర్లు మరింత దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు. వెనుకబడిన జిల్లాల్లో మరింత దృష్టి లబ్ధిదారులకు మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించేలా బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్‌జైన్ చెప్పారు. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ప్రత్యేక సూచనలు ఇచ్చారన్నారు. పావలా వడ్డీ రుణాలు మంజూరులో నాలుగైదు జిల్లాలు వెనుకబడగా.. ఆయా కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారన్నారు. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసినందున అదే స్ఫూర్తితో రెండో దశలో మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వారం వారం లక్ష్యాలను నిర్థేశించుకోవాలని జైన్ పేర్కొన్నారు. -
ఉన్నత విద్య పేదవాళ్లకి అందాలి
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన ఉన్నత విద్య పేదవాళ్లందరికీ అందాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆకాంక్షించారు. ఈ దిశగా విద్యా సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. జాతీయ విద్యావిధానం–2020 ఈ తరహా మార్పు లకు శ్రీకారం చుడుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ’’విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్లు– పూర్వ విద్యార్థులతో సంబంధాలు’’ అనే అంశంపై సోమవారం రాజ్‌భవన్‌లో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని పలు విశ్వవి ద్యాలయాల వీసీలు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల్లో స్థిరపడిన వర్సిటీల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతు లు పెంచి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బోధన విధానాలు తీసుకురావాలని సూచించారు. అకడమిక్ యాక్టివిటీని వర్సిటీలు మర్చిపోయాయి ప్రపంచంతో పోటీ పడగల సత్తా రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఉందని, అయితే అకడమిక్ యాక్టివిటీని విశ్వవిద్యాలయాలు మరిచిపోయా యని ఆమె వ్యాఖ్యానించారు. సరైన బోధన విధానాలు, మౌలిక వసతులు కల్పిస్తే ఇప్పుడు ప్రపంచ విశ్వవిద్యాలయాల గురించి చెప్పుకున్నట్టే, భవిష్యత్‌లో మన యూనివర్సిటీల గురించి చర్చించుకునే వీలుందన్నారు. విద్యావికాసానికి డిజిటల్ లైబ్రరీ మంచి అవకాశంగా పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సహకారం విశ్వవిద్యాలయాలకు అత్యంత ముఖ్యమని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. -
మా రేషన్ కార్డు ఎప్పుడు వస్తది సారు..?!
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే తెల్లరేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తరువాత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను ఇవ్వలేదు. 2016లో మాత్రం ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. ఆ సందర్భంలో చాలా మంది కొత్తగా కార్డులు, పేర్ల మార్పిడి, పిల్లల పేరు ఎక్కించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అలాంటి సమస్యలు అన్ని పరిష్కారం కాకపోను చాలా మందికి కొత్తగా రేషన్ కార్డులు అందని పరిస్థితి నెలకొంది. ఆతరువాత ప్రభుత్వం రేషన్ కార్టులకు సంబంధించి ఆన్లైన్ సైట్‌ను బందు పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలంటే అధికారులు రేషన్ కార్డులు తప్పనిసరిగా ఉండాలని చెబుతుండడంతో చాలామంది పేదలు పథకాలకు దూరమవుతున్నారు. రేషన్ కార్డుల్లేక.. వేలాది దరఖాస్తుల తిరస్కరణ.. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తోంది. ఇందుకోసం ఇటీవల జిల్లా వ్యాప్తంగా పేదల నుంచి దరఖాస్తులను స్వీకరించగా మొత్తం 78,890 మంది దరఖాస్తు వచ్చాయి. అందులో నియోజకవర్గానికి 3 వేల మందికి ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలో 18 వేల మందికి మొదటి విడతగా లబ్ధి పొందనున్నారు. అయితే ఈ పథకానికి వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో కేవలం 11 వేల మందిని మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించారు. ఇందులో తెల్ల రేషన్ కార్డులు లేక చాలా మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇదిలా ఉంటే బీసీ కులవృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఈ పథకానికి మొత్తం41,863 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కూడా రేషన్ కార్డులేని వారి వేలాది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వీటితోపాటు మైనార్టీ బంధు పథకంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా తాము ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్ కార్డులతోపాటు పేర్ల మార్పులు, కొత్తగా పిల్లల పేర్లు ఎక్కించి కొత్త కార్డులు పంపిణీ చేయాలని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు కోరుతున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే.. ప్రస్తుతం ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన గృహలక్ష్మి, బీసీలకు ఆర్థిక సాయం, మైనార్టీ బంధు, దళిత బంధు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతిఒక్క దరఖాస్తుదారు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. లేదంటే దరఖాస్తు చేసుకున్నా కూడా ఆన్లైన్లో తీసుకోని పరిస్థితి. అయినా కొందరు ఆన్లైన్లో కాకుండా కొన్ని పథకాలకు నేరుగా తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తుల ఆధారంగా అక్కడ ఆన్లైన్ చేశారు. కానీ, రేషన్ కార్డులేక పోవడంతో చాలా మంది దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. రేషన్ కార్డు అందించాలి తెల్ల రేషన్ కార్డు లేకపోవడంతో మేము గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోలేక పోయాము. గతంలో డబుల్ బెడ్రూం ఇల్లు కూడా రాలేదు. 2016లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఉంటేనే పథకాలకు అర్హులని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా రేషన్ కార్డు ఇచ్చి ఆదుకోవాలి. – అంబటి సంధ్య, పెద్దదేవులపల్లి తెల్ల రేషన్‌కార్డు లేక దరఖాస్తు చేసుకోలేదు నాకు రేషన్ కార్డు లేదు. చాలా కాలం క్రితం దరఖాస్తు చేసుకున్నాను. అయినా కార్డు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తుంది. కానీ, రేషన్ కార్డులేక నేను దరఖాస్తు చేసుకోలేక పోయాను. ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్ కార్డు తప్పనిసరి చేసి పేదలకు అవి పంపిణీ చేయకపోవడంతో పథకాల ఫలాలు అందరికీ అందడం లేదు. – శ్రీకాంత్, హనుమాన్ పేట, మిర్యాలగూడ -
పేదరికం పై పైకి!
యూకేను దెబ్బతీసిన కోవిడ్, యుద్ధాలు ప్రపంచదేశాలన్నింటి మాదిరిగానే యూకే కూడా కోవిడ్ వల్ల ఇబ్బందులు పడింది. ఇక అఫ్గానిస్తాన్ యుద్ధం, ప్రస్తుత రష్యా–ఉక్రెయిన్ల మధ్య నడుస్తున్న యుద్ధం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగింది. ఫలితంగా జీవన వ్యయం పెరిగిపోయింది. దీని ప్రభావం యూకేపై కూడా పడింది. – గారెత్ ఓవెన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, హైదరాబాద్ (కంచర్ల యాదగిరిరెడ్డి): కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని రకరకా లుగా మార్చేసిందనడంలో సందేహం లేదు! ప్రజల జీవనశైలి, ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోయాయి. కొందరికి కొత్త ఉద్యోగాలు వస్తే.. ఇంకొందరికి ఉన్నవి ఊడిపోయాయి. ఉద్యోగాలు ఉన్నా వేతనాలు తగ్గా యి. ముఖ్యంగా ప్రపంచం మొత్తమ్మీద పేదరికం పెరిగింది. ప్రపంచ బ్యాంకు మొదలుకొని అనేక అంతర్జాతీయ సంస్థలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. మరి ఎందుకు పేదరికం పెరిగింది? ఎలా పెరిగింది? ఎందరు పేదలుగా మారిపోయారు? పేదరికం పెంచిన కోవిడ్ కోవిడ్ మహమ్మారి కారణంగా అనేక మంది ఆదాయాలు పడిపోయాయని, ఫలితంగా దేశంలో 10 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువకు చేరారని తాజా లెక్కలు చెబుతున్నాయి. అయితే పేదరికం పెరగడం అనేది కోవిడ్ వల్ల మాత్రమే జరిగిన పరిణామం కాదని, లెక్కలు తప్పడం వల్ల నిన్నమొన్నటివరకూ పేదల సంఖ్య స్పష్టంగా ప్రపంచానికి తెలియలేదని ప్రపంచ బ్యాంకు అంటోంది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో జీవన వ్యయాన్ని లెక్కవేయడంలో జరిగిన పొరపాట్ల కారణంగా పేదలు తక్కువగా ఉన్నట్లు కనిపించిందని, వాస్తవానికి వీరి సంఖ్య చాలా ఎక్కువని, గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా కోవిడ్ వచ్చిపడటంతో పేదరికం మరింత పెరిగిపోయిందని చెబుతోంది. ఉద్యోగాలు, ఆదాయంపై ప్రభావం కోవిడ్ మహమ్మారి సమయంలో చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోవడం తెలిసిందే. అయితే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంచనాల ప్రకారం ఇది కేవలం ఉద్యోగాలు కోల్పోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. చాలామందికి ఆదాయం తగ్గింది. మరికొంతమంది ఇళ్లూ కోల్పోయారు. ఫలితంగా పేదరికమూ పెరిగింది. పేదల్లోని దిగువ 40 శాతం మందికి 2021లో సగటు ఆదాయం 6.7 శాతం తగ్గిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యయనం తేల్చింది. అదే సమయంలో ధనికులైన 40 శాతం మందిలో ఈ తగ్గుదల కేవలం 2.8 శాతం మాత్రమే. కోవిడ్ దెబ్బ నుంచి కోలుకోలేకపోవడం పేదల ఆదాయం తగ్గేందుకు కారణమైంది. అయితే ధనికుల్లో సగం మంది తమ కష్టాల నుంచి బయటపడటం గమనార్హం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిస్కల్ స్టడీస్ ప్రకారం యూకేలో కోవిడ్ దాదాపు ఏడు లక్షల మందిని పేదరికంలోకి నెట్టేసింది. కోవిడ్‌కు ముందు జనాభాలో 15 శాతం మంది పేదరికంలో మగ్గుతుండగా.. తదనంతర పరిస్థితుల్లో ఇది 23 శాతానికి చేరుకోవడం గమనార్హం. అమెరికన్ సెన్సస్ బ్యూరో అంచనాల ప్రకారం 2021లో పేదరికంలో ఉన్న జనాభా 11.6 శాతం. అంటే సుమారు నలభై లక్షల మంది. అయితే కోవిడ్ ముట్టడించిన 2020తో పోలిస్తే ఇందులో పెద్దగా తేడా ఏమీ లేకపోవడం ఆసక్తికరమైన అంశం. యూరప్ విషయానికి వస్తే, చాలా దేశాల్లో నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువైంది. యూరోపియన్ కమిషన్ ప్రాంతంలో సుమారు కోటీ ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు డిబేటింగ్ యూరప్ సంస్థ చెబుతోంది. ఉద్యోగాల్లో ఉన్నవారిలోనూ మూడొంతుల మంది వేతనాలు తగ్గాయి. దీంతో ఇక్కడ కూడా పేదరికం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా లెక్క అలా.. మనది ఇలా రోజుకు 1.90 డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారందరూ పేదలే అని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. కోవిడ్ కంటే ముందు ఇంతకంటే ఎక్కువ ఆదాయమున్న వారు కూడా మహమ్మారి కారణంగా పేదలుగా మారిపోయారని అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో ఉన్న వారి మోతాదు 7.8 శాతం నుంచి 9.1 శాతానికి చేరుకుందని లెక్క గట్టింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం కూడు, గుడ్డ, నీడలకు కావాల్సినంత కూడా సంపాదించలేని వారే పేదలు. ఈ కనీస అవసరాలు తీర్చుకునేందుకు సగటున 1.90 డాలర్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేసింది. అయితే మన దేశంలో ఈ మూడింటితో పాటు ఆరోగ్యం, విద్య కూడా పొందలేని వారిని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిగా వర్గీకరిస్తున్నాం. భారత్‌లో పేదరికాన్ని కొలిచేందుకు ‘టెండుల్కర్ మెథడాలజీ’ని ఉపయోగిస్తారు. దీని ప్రకారం మనిషి మనుగడ సాగిచేందుకు కావాల్సిన కనిష్ట మోతాదు కేలరీలకు అయ్యే ఖర్చుతో పాటు, దుస్తులు, నివసించేందుకు పెట్టే వ్యయాన్ని బట్టి పేదలా? కాదా? అన్న వర్గీకరణ జరుగుతుంది. 2021 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 9.2 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. అయితే వీరి సంఖ్య అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేతీరున లేదు. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగానూ, కేరళ, పంజాబ్ వంటిచోట్ల తక్కువగానూ ఉంది. 2020లోనే పేదల సంఖ్య సుమారు ఏడు కోట్లకు చేరుకుందని రెండు, మూడేళ్లలోనే ఈ సంఖ్య తొమ్మిది కోట్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు అంచనాలు చెబతున్నాయి. 16.3 కోట్ల దిగువ మధ్యతరగతి? రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు పేదలైతే..5.5 డాలర్లు సంపాదించేవారిని దిగువ మధ్య తరగతి వారిగా పరిగణిస్తున్నారు. ఈ వర్గీకరణలోకి వచ్చేవారు దేశం మొత్తమ్మీద 16.3 కోట్ల మంది ఉన్నారని ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. పేదరికంపై నడ్జ్ ఫౌండేషన్ పోరు ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’ 2015లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన లాభాపేక్ష లేని సంస్థ. పేదరిక నిర్మూలన మా లక్ష్యం. ప్రభుత్వం, పౌర సమాజం, కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. యువతకు వేర్వేరు అంశాల్లో నైపుణ్యాలు అందించేందుకు ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కృషి చేస్తున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల కోసం గ్రామీణాభివృద్ధి కేంద్రం కూడా నడుపుతున్నాం. వీరికోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాల్లో అమలవుతోంది. సమాజ సేవ చేయాలనుకునే సీఈవో, సీఓఓలకూ అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే సుమారు 30 మంది సీఈవో, సీఓఓలు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కలిసి పనిచేస్తున్నారు. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు వ్యక్తిగతంగా రుణాలిచ్చేందుకు, వడ్డీ సబ్సిడీలు కల్పించేందుకు ఆలోచన చేసి అమలు చేయడం వీరు సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పవచ్చు.– సుధా శ్రీనివాసన్, సీఈవో,ద నడ్జ్ ఫౌండేషన్ -
ఓటు దొంగలు.. బాబు అండ్‌కో
తాడికొండ: ఎన్నికలు సమీపిస్తుండడంతో బహుజనుల ఓట్లు దోచుకునేందుకు రాష్ట్రంలో బాబు అండ్ కో బ్యాచ్ అడ్డగోలుగా తిరుగుతుందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 1,049వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో శనివారం పలువురు మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పక్క రాష్ట్రంలో దాక్కున్న పలు పార్టీల నాయకులు ఇప్పుడు ఓట్లు వేయించుకునేందుకు బహుజనులకు వల విసురుతున్నారన్నారు.14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేదలకు ఏం చేశాడో చెప్పి ప్రజల్లోకి రావాలని లేకుంటే తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బహుజనుల కలలు సాకారం చేస్తుంటే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ చూడలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సుపుత్రుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్, బీజేపీలోని బాబు బంధువు పురందేశ్వరి.. బాబును గద్దెనెక్కించేందుకే ఎల్లో మీడియాతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కులమతాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్న చంద్రబాబు.. అన్ని ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించేందుకు పావులు కదుపుతున్నాడని చెప్పారు. రిలే నిరాహార దీక్షలో సమితి నాయకులు కారుమూరి పుష్పరాజు, బేతపూడి సాంబయ్య, పులి దాసు, మాదిగాని గురునాథం, ఈపూరి ఆదాం, నూతక్కి జోషి తదితరులు పాల్గొన్నారు. రిలే దీక్షలో బహుజన నేతలు -
పేదలకు ఇళ్ల జాగాలు ప్రభుత్వ బాధ్యత
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఇళ్ల జాగాలు ఇవ్వడం ప్రభుత్వ సామాజిక బాధ్యతని, అవసరమైతే మళ్లీ కొత్తగా ఇళ్ల జాగాల కోసం భూములు అసైన్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ భూములను అమ్ముకునే హక్కు కూడా పేదలకు కల్పించాలనే ఆలోచనతో ఉన్నామని చెప్పారు. ఆదివారం అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల అసైన్‌మెంట్‌ల్యాండ్ తీసుకుంటోందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. పేదల భూములను వారికే ఎస్టాబ్లిష్ చేసి రీ అసైన్ చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. పేదల భూములను కాపాడతామని భరోసానిచ్చారు. అసైన్మెంట్ భూములపై పార్టీలకు అతీతంగా దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుందామన్నారు. ఇలాంటి అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవో ఇచి్చందని, దానికి తగ్గట్టుగానే తెలంగాణలో కూడా పరిశీలిద్దామని సీఎం చెప్పారు. వ్యవసాయ భూముల అమ్మకానికి అనుమతించకపోయినా పట్టణప్రాంతాల్లో విక్రయానికి అనుమతిస్తే దళితులు ఇతర చోట్ల భూమి కొనుక్కునే అవకాశం ఉంటుందన్నారు. అందరూ సరేనంటూ రాబోయే ఐదారు రోజుల్లోనే ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకుని ఈ మేరకు జీవో కూడా విడుదల చేసేందుకు తనకు అభ్యంతరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గొంతెమ్మ కోర్కెలు సరికాదు కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, భద్రాచలంకు చెందిన ఐదు గ్రామాలను కేంద్రంతో మాట్లాడి తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. ప్రభుత్వపాఠశాలల్లో పనిచేసే స్వీపర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించడంతో పాటు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కేసీఆర్ స్పందిస్తూ సఫాయన్నా నీకు సలామన్న అని గతంలోనే గ్రామపారిశుధ్యకార్మికుల వేతనాలు పెంచామని, దశాబ్ది ఉత్సవాల సందర్భంగానూ రూ.వెయ్యి పెంచామని గుర్తు చేశారు అలాంటిది కొందరు గొంతెమ్మ కోర్కెలు కోరడం సరికాదని వ్యాఖ్యానించారు. గల్ఫ్ కార్మికులకు సంబంధించి ఒక విధానం తీసుకొచ్చేందుకు భవిష్యత్‌లో ప్రయత్నిస్తామని సీఎం చెప్పారు. ఆసరా పింఛన్ల విషయంలో భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే వెంటనే మరొకరికి త్వరలో పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని, పాల రైతులకు బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకుంటామని బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్ లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. -
దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తున్న మోదీ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందని సామాజిక ఉద్యమ కార్యకర్త మేధా పాట్కర్ ఆరోపించారు. సంయుక్త కిసాన్ మోర్చా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో కర్షక, కార్మిక సదస్సు నిర్వహించారు. మేధా పాట్కర్ మాట్లాడుతూ పేదలకు నిత్యావసర వస్తువులను అందించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల పంటకు కనీస మద్దతు ధర రావడంలేదని, అదానీ, అంబానీలకు మాత్రం రూ.వేల కోట్లు ఆదాయం వస్తోందన్నారు. ఆదివాసీల హక్కులను దెబ్బతీస్తూ అటవీ పర్యావరణ పరిరక్షణ చట్టంలో మార్పులు చేస్తున్నారన్నారు.సంయుక్త కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు హన్నన్ ముల్లా మాట్లాడుతూ మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని 13 నెలలపాటు రైతులు చేసిన ఉద్యమం సందర్భంగా ప్రధాని ఇచ్చిన హామీల అమలు కోసం ఆగస్టులో ఆందోళనలను నిర్వహిస్తామన్నారు. రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వినర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆల్ ఇండియా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ విభాగం జాతీయ అధ్యక్షుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరా, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. -
అన్నా.. ఇది పద్ధతి కాదే.. పవన్ కళ్యాణ్ కు అభిమాని చురకలు
పవన్ కళ్యాణ్.. నేను ప్రశ్నిస్తూనే ఉంటానంటూ ప్రతీ సారి చెప్పుకునే పీకే.. ఇప్పుడు పనికిరాని ప్రశ్నలు వేసి నవ్వులపాలవుతున్నాడు. తనకు తెలియని విద్యావిధానం గురించి, ఇంకెవరో రాసిచ్చిన ప్రశ్నలను అనుసంధానం చేసి.. దాన్ని సోషల్ మీడియా వేదికగా సంధించి ప్రభుత్వంపై బురద జల్లాలనుకున్న పవన్ ప్రయత్నం పాపం.. బెడిసికొట్టింది. ఆంధ్రప్రదేశ్ విద్యావిధానాలు భేష్ ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొచ్చిన పథకాలకు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అమెరికా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి వేదికగా జులై మూడో వారంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ డిస్కషన్ మీట్ సందర్భంగా ఏపీ ప్రతినిధులు ప్రత్యేకంగా రాష్ట్రంలో చేపడుతున్న విద్యావిధానాలను ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రజెంట్ తీసుకొచ్చారు. పేదరికాన్ని పారదోలాలంటే విద్యకు మించిన విధానం మరొకటి లేదన్న సీఎం జగన్ ఆశయానికి పలు ప్రశంసలు వచ్చాయి. (ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ విద్యావిధానాలపై స్టాల్) (చదవండి : ఏపీ విద్యావిధానాలు భేష్) విద్యార్థులకిచ్చిన ట్యాబ్లెట్లపై అక్కసు ఏపీ విధానాలను అందరూ ప్రశంసిస్తుంటే.. కొందరిలో మాత్రం అక్కసు మొదలైంది. అసలు పేద విద్యార్థులకు ట్యాబ్‌లు ఎలా ఇస్తారన్నట్టుగా వీరి వ్యవహారం తయారయింది. విద్యార్థుల విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు ట్యాబ్‌లు ఉపయోగపడుతాయన్న కనీస స్పృహ లేకుండా.. దానిపై చిలువలు పలువలుగా వ్యాఖ్యానాలు జోడించి, కొన్ని ప్రశ్నలను ట్విట్టర్ వేదికగా వదిలారు పవన్ కళ్యాణ్. Points to note : 1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుంది. 2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా 8వ తరగతి… — Pawan Kalyan (@PawanKalyan) July 23, 2023 సొంత అభిమాని నుంచే పవన్ కు ప్రశ్న పవన్ వ్యాఖ్యలను చాలా మంది తప్పుబట్టారు. అయితే వారంతా ప్రభుత్వానికి చెందిన వారని, వైఎస్సార్ సిపి క్యాడర్ అని జనసేన చెప్పుకోవచ్చు కానీ.. పవన్ ట్వీట్‌కు సొంత అభిమాని రమేష్ బోయపాటి నుంచి ఎదురయిన విమర్శను మాత్రం కచ్చితంగా క్షుణ్ణంగా చదవాల్సిందే. మీ సినిమాలు చూస్తాను, మిమ్మల్ని అనుసరిస్తాను కానీ, పేద విద్యార్థులకు మేలు చేసే విద్యావిధానాన్ని విమర్శిస్తే మాత్రం మౌనంగా ఉండలేనంటూ నేరుగా స్పందన వచ్చింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విద్యావిధానంలో కచ్చితంగా సీఎం జగన్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందేనంటూ నొక్కి వక్కాణించారు రమేష్ బోయపాటి. పవన్ కళ్యాణ్ గారు బైజూస్ తో రాష్ట్రం కుదుర్చుకున్న ఒప్పందం గురించి మీరు లేవనెత్తిన సందేహాలు విలువైనవి. ఇక్కడ మీ ట్వీట్ ఉద్దేశం బైజూస్ తో ఒప్పందం గురించి కన్నా, ఆ ఒప్పందంలో ఉన్న అనేక సందేహాల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం అనిపించింది. నేను కూడా ఈ విషయం గురించి అవగాహన ఏర్పరుచుకునే… pic.twitter.com/thDcCgldYM — Ramesh Boyapati (@rameshboyapati) July 24, 2023 -
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలపై హైకోర్టులో విచారణ
సాక్షి, విజయవాడ: అమరావతిలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం.. తీర్పు రిజర్వ్ చేసింది. జీవో 45పై హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని.. కాబట్టి నిర్మాణాలు చేసుకోవచ్చని అర్థం అని ప్రభుత్వ న్యాయవాదులు తమ వాదనలు ధర్మాసనానికి వినిపించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను కొంతమంది అడ్డుకుంటున్నారు.. చంద్రబాబు 1656 ఎకరాలను సంస్థలకు అమ్మేస్తే ఎందుకు స్పందించలేదు? మాస్టర్ ప్లాన్ తప్పు కాబట్టే సవరించామని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు. చదవండి: అలాంటి క్యారెక్టర్ ఉన్నోడా వలంటీర్లను అనేది!: సీఎం జగన్ ఫైర్ సీఆర్డీఏ చట్టంలో 5 శాతం భూమిని నిరుపేదలకు ఇవ్వాలని ఉంది. సీఆర్డీఏ చట్ట ప్రకారమే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. -
News Cartoon: వాళ్లతో పాటు మనం డబుల్, త్రిబుల్ పెరుగుతున్నాం!
వాళ్లతో పాటు మనం డబుల్, త్రిబుల్ పెరుగుతున్నాం! -
ఆ భూములు బాగు చేయొద్దు.. క్లియరెన్స్‌ను అడ్డుకున్న టీడీపీ నేతలు..
మంగళగిరి: పేదలకు అమరావతి (సీఆర్డీఏ) పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రైతుల ముసుగులో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పేదలకు ఇచ్చేందుకు సీఆర్డీఏ కేటాయించిన స్థలాలను బాగు చేయవద్దని పనులు నిర్వహిస్తున్నవారితో గొడవకు దిగారు. దీంతో శుక్రవారం కృష్ణాయపాలెంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఆర్డీఏ పరిధిలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, నిడమర్రు, మందడం, ఐనవోలు ప్రాంతాలను కలిపి ప్రభుత్వం ఆర్–5 జోన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఆర్డీఏ భూములను కేటాయించింది. ఆ భూముల్లో భారీగా కంపచెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఆర్–5 జోన్లో కేటాయించిన భూముల్లో ముళ్లకంపను తొలగించి మెరక చేసి లే అవుట్ వేయాలని సీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధంచేసింది. ఇందులో భాగంగా జంగిల్ క్లియరెన్స్, మెరక చేసే పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించింది. కృష్ణాయపాలెంలో కేటాయించిన భూముల్లో శుక్రవారం జంగిల్ క్లియరెన్స్ నిర్వహించేందుకు కాంట్రాక్టర్ జేసీబీలను తీసుకువెళ్లి పనులు ప్రారంభించే సమయంలో రైతుల ముసుగులో ఉన్న పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మంగళగిరి రూరల్ సీఐ భూషణం, ఎస్ఐ రమేష్‌బాబు వచ్చి సర్దిచెప్పారు. సీఆర్డీఏ ఇచ్చిన వర్క్ ఆర్డర్ కాపీని కాంట్రాక్టర్ చూపించి జంగిల్ క్లియరెన్స్ పనులు చేయాలని చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: సామాజిక న్యాయమే పరమావధి -
నిరుపేదలుగా మారిన బిల్ గేట్స్, ట్రంప్.. ‘ఇంత ఘోరంగా ఉన్నారేంటి!’
న్యూయార్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమలోని సృజనాత్మకను బయటకి తీస్తున్నారు. మిడ్ జర్నీ అనే కృత్రిమ మేధను వినియోగించి గోకుల్ పిళ్లై అనే ఆర్టిస్ట్ కోటీశ్వరుల్ని నిరుపేదలుగా మార్చేస్తున్నారు. కుబేరుల్ని మురికివాడల్లోకి తెస్తున్నారు. బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, మార్క్ జుకర్‌బర్గ్, ఎలన్ మస్క్ వంటి బిలియనీర్స్ సరైన బట్టలు కూడా లేకుండా మురికి మురికిగా ఆ ఫొటోల్లో దర్శనమిస్తున్నారు. భారత వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ ఫొటోలను గోకుల్ పిళ్లై ఆన్లైన్లో షేర్ చేస్తూ ‘స్లమ్ డాగ్ మిలియనీర్స్’ అని క్యాప్షన్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో అవి వైరల్‌గా మారాయి!. View this post on Instagram A post shared by Gokul Pillai (@withgokul) ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతున్నారు. వీరందరిలో ఎలాన్ మస్క్ మాత్రం నిరుపేద అవతారంలో కూడా సూపర్ రిచ్‌గా కన్పిస్తున్నారని ఓ యూజర్ చమత్కరించాడు. ఎంతైనా మస్క్ మస్కే అంటు నవ్వులు పూయించాడు. కాగా.. కొద్ది రోజుల క్రితం మార్క్ జుకర్‌బర్గ్‌కు సంబంధించిన ఓ ఏఐ ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ అధునాతన సాంకేతికతో రూపొందించిన ఫొటోలు నిజమైన ఫొటోలోకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి. దీంతో అసలు ఫొటోలు, ఎడిట్ చేసిన ఫొటోల మధ్య తేడా కూడా కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది. చదవండి: అమిత వేగంతో దూసుకెళ్తూ.. అడుగుకో నక్షత్రాన్ని పుట్టిస్తూ.. -
పేదలకు ఇళ్లు.. 4.4 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి.. మరో రూ.5,600 కోట్లు..
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 2023 సంవత్సరం చివరి నాటికి 30.2 లక్షల శాశ్వత గృహాలను అర్హులైన లబ్దిదారులందరికీ అందించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 18.63 లక్షల ఇళ్లకు గాను, మొదటి దశలో 16.91 లక్షల ఇళ నిర్మాణం ప్రారంభంకాగా, వీటిలో 4.4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన ఇళ్ల నిర్మాణం వివిధ దశలలో ఉంది. వైఎస్సార్ జగనన్న కాలనీలను నీటి సరఫరా, విద్యుత్, రోడ్లు, మురుగు కాల్వల ఏర్పాటు వంటి అన్ని మౌలిక సదుపాయాలతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. భారాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ, ఇ-ప్రొక్యూర్మెంట్ వేదికల ద్వారా టెండర్లను ఖరారు చేసిన మార్కెట్ ధర కంటే ధరకు 20 మెట్రిక్ టన్నుల ఇసుక, 5 మెట్రిక్ టన్నుల సిమెంట్, స్టీల్, 12 ఇతర నాణ్యమైన భవన నిర్మాణ సామగ్రిని ఉచితంగా అందిస్తోంది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 5,600 కోట్ల రూపాయలను కేటాయించింది. చదవండి: ఏపీ వార్షిక బడ్జెట్.. మహిళా సాధికారతే ధ్యేయంగా.. -
ప్రయివేట్ స్కూళ్లలో పేదలకు ఉచిత ప్రవేశాలు
సాక్షి, అమరావతి: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లలో ప్రవేశాలు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలకు చెందిన వారు (అనాథ పిల్లలు, హెచ్ఐవీ బాధిత పిల్లలు, దివ్యాంగుల) కోసం 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల(బీసీ, మైనారిటీ, ఓసీ)కు చెందిన పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించనున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో అర్హత కలిగిన పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించి 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వార్షిక ఆదాయం రూ.1,20,000, పట్టణ ప్రాంతంలో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వార్షికాదాయం రూ.1,44,000లను ప్రాతిపదికగా తీసుకుని వారి కుటుంబాల పిల్లలను అర్హులుగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాల కల్పనకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు వెల్లడించారు. ఒకటో తరగతిలో ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తు నమోదుకు షెడ్యూల్ కూడా ప్రకటించామన్నారు. అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు, అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్(సమగ్ర శిక్ష) దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. విద్యార్థుల ప్రవేశాలకు షెడ్యూల్ ఆన్లైన్ పోర్టల్‌లో అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల నమోదు తేదీలు: 06.03.2023 నుంచి 16.03.2023 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు (ఆన్లైన్ పోర్టల్‌లో) తేదీలు: 18.03.2023 నుంచి 07.04.2023 వరకు ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక ప్రక్రియ: 09.04.2023 నుంచి 12.04.2023 వరకు మొదటి ఎంపిక జాబితా విడుదల తేదీ: 13.4.2023 ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో మొదటి జాబితాలో ఎంపిక కాబడిన విద్యార్థుల ప్రవేశాలను నిర్థారించే తేదీలు: 15.04.2023 నుంచి 21.04.2023 వరకు రెండో ఎంపిక జాబితా విడుదల తేదీ: 25.4.2023 రెండో జాబితాలో ఎంపికైన విద్యార్థుల ప్రవేశాలను నిర్థారించే తేదీలు: 26.04.2023 నుంచి 30.04.2023 వరకు (చదవండి: కార్చిచ్చుకు పక్కా స్పాట్) -
AP: రాజధానిలో 900.97 ఎకరాల్లో పేదలకు ఇళ్లు
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాలను గృహ అవసరాలకు అనుగుణంగా వినియోగించేలా సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌లోని జోన్లలో మార్పులు చేసింది. చదవండి: ఎగుమతుల హబ్‌గా ఏపీ.. ఈ మేరకు శుక్రవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న అఫర్టబుల్, ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ జోన్‌తోపాటు రెసిడెన్షియల్ జోన్ నిబంధనల్లో మార్పులు చేస్తూ కొత్త జోన్‌ను తీసుకురానుంది. దీనిపై నవంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. -
ప్లేట్లెట్స్ బదులు బత్తాయి జ్యూస్.. బిగ్ ట్విస్ట్
లక్నో: కలకలం రేపిన ప్లేట్లెట్స్ బదులు పండ్లరసం పేషెంట్‌కు ఎక్కించి.. అతని మరణానికి కారణమయ్యారనే ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పేషెంట్‌కు ఎక్కించింది బత్తాయి రసం కాదని.. అది ప్లేట్లెట్స్ యూనిట్లేనని అధికారులు తేల్చారు. ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ కలెక్టర్ సంజయ్ ఖత్రీ మాట్లాడుతూ.. ఆ రోగికి ఇచ్చింది బత్తాయి రసం కాదని చెప్పారు. పేషెంట్‌కు ఎక్కిచ్చింది ప్లేట్లెట్స్. కాకపోతే వాటిని సరిగా నిల్వ చేయలేదని కలెక్టర్ ప్రకటించారు. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ఈ విషయాన్ని తమ నివేదికలో వెల్లడించినట్లు ఖత్రీ పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ఇప్పటికే అధికారులు ఆస్పత్రిని సీల్ చేయడమే గాక వివరణ ఇవ్వకపోవడంతో బుల్డోజర్తో కూల్చివేయాలని అదేశాలు కూడా జారీ చేశారు. (చదవండి: రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ ఘటన.. ఆసుపత్రికి షాకిచ్చిన అధికారులు) -
రెండు దేశాల భారత్
ఒకవైపు గిడ్డంగుల్లో ఆహారధాన్యాలు పుచ్చిపోతాయి. మరోవైపు పేద జనపు డొక్కలు తిండిలేక మాడిపోతాయి. ఒకవైపు సంపద పోగుపడి బిలియనీర్ల సంఖ్య ఎగబాకుతుంటుంది. ఆ పక్కనే మరికొన్ని కోట్ల పేదల ఆదాయం పడిపోయి, పేదరికం కూడా పెరిగిపోతుంటుంది. క్షీరసాగర మథనంలో కొందరికే అమృతం దక్కినట్టు స్వాతంత్య్ర ఫలాలు కూడా కొందరికే దక్కాయి. దేశం పేదది కాకపోయినా దేశంలో ఇంకా పేదవాళ్లున్నారు. విలువలకు పేరున్న దేశమైనా కులాల అసమానతలున్నాయి. అందుకే ఈ దేశంలోని వైవిధ్యాలనే కాదు, వైరుద్ధ్యాలనూ తరచి చూసుకోవాలి. జనాల మధ్య అంతరాలను తగ్గించడం ద్వారానే ఈ దేశాన్ని ఒక్కటిగా చేయగలం అని గుర్తించాలి. క్షీర సాగర మథనం. సముద్రం నుంచి అమృతాన్ని వెలికితీసేందుకు ఇటు రాక్షసులు, అటు దేవతలు రెండు వర్గాలు కలిసి శ్రమించి, మంధర పర్వతంతో సముద్రాన్ని మథిస్తారు. అందులోంచి అనేక విశిష్ట వస్తువులు, మనుషులు, జంతువులు, అనంతరం విషం, చిట్టచివరకు అమృతం వచ్చాయి. ఇది అందరికీ తెలిసిన కథే కావొచ్చు. కానీ నేడు ఇదే అత్యంత సందర్భోచితమైన అంశం. ఏ అమృతం కోసమైతే ఇరు వర్గాలు సమంగా శ్రమించాయో, దాని ఫలితాలు మాత్రం ఇరు పక్షాలకీ సమంగా అందలేదు. చావును శాశ్వతంగా తరిమికొట్టే అమృ తాన్ని దేవతలు చేజిక్కించుకుని, మరొక వర్గానికి మత్తులో ముంచెత్తే సురాపానం అంటగట్టారు. దేవతలు కదా ఏం చేసినా చెల్లుతుంది. మరో వర్గం కూడా అంతే శ్రమించినప్పటికీ అసలు ఫలితం దక్కక పోవడం కథలోని సారాంశం. అమృతం అందుకున్న వర్గం మరింత శక్తితో తమ ఆధిపత్యాన్ని నిలుపుకొంటూనే వచ్చింది. మరొక వర్గం కాలక్రమేణా దాడులకూ, దౌర్జన్యాలకూ గురై క్షీణించింది లేదా అధికారగణం చేతిలో బానిసలుగా మారిపోయింది. అసలు విషయానికొద్దాం. భారతదేశం స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. మన భారత ప్రభుత్వం ఈ సంద ర్భాన్ని ‘అమృత్ మహోత్సవ్’ పేరుతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవా లని నిర్ణయించింది. అందుకుగానూ గతేడాది మార్చి 12 నుంచి వచ్చే సంవత్సరం అంటే ఆగస్టు 15, 2023 వరకు ఈ ఉత్సవాలను నిర్వ హిస్తోంది. ఈ ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర ప్రయాణంలో పాల్గొన్న ప్రజలందరికీ ఈ ఉత్సవాలను అంకితం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 75 ఏళ్ల ఉత్సవాలు కాబట్టి అమృత్ మహోత్సవ్ అనే పేరు పెట్టారు కానీ, సరిగ్గా సరిపోయింది అది. అమృతం కోసం సాగర మథనంలో పాల్గొన్న అందరికీ అమృతం అందనట్టే స్వాతంత్య్ర ఫలాలు సైతం కొందరికే దక్కాయన్న విషయానికి ఈ పేరు సరిగ్గా సరిపోతుంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర పాలన మన దేశ ప్రజలకు అందించింది ఆకలి, పేదరికం, నిరుద్యోగం, అణచివేత. గత 75 ఏళ్ళలో జరిగిన ఆర్థికాభివృద్ధి, సమకూరిన సంపద, అతికొద్ది మంది సంపన్నుల, ఆధిపత్య వర్గాలకే వెళ్ళి పోయింది. సమాజంలో సంపద సమష్టిగానే వృద్ధి చెందుతుంది. కానీ ఫలితాలు అందరికీ అందడంలో మాత్రమే తేడా ఉంటుంది. మన దేశంలోని కేవలం వందమంది కోటీశ్వరులు 57 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని కలిగివున్నారని గ్లోబల్ రిపోర్టు తెలియజేసింది. అంటే ఇది భారతదేశ రెండు సంవత్సరాల ఆర్థిక బడ్జెట్‌కు సమానమని గుర్తించాలి. అదేవిధంగా 50 శాతం మంది జనాభా కేవలం 6 శాతం సంపదను కలిగి ఉన్నారు. అంతేకాకుండా కేవలం ఒక సంవత్సరంలోనే, అది కూడా కోవిడ్ సమయంలోనే 102 మందిగా ఉన్న కోటీశ్వరులు(బిలియనీర్స్) 142కి పెరిగారు. మార్చి 2020 నుంచి, నవంబర్ 30, 2021 వరకు 23 లక్షల కోట్లు ఉన్న కోటీశ్వరుల సంపద 57.3 లక్షల కోట్లకు చేరినట్టు లెక్కలు చెబు తున్నాయి. అదే విధంగా కోవిడ్ సమయంలోనే ఇప్పటి వరకు ఉన్న పేదలకు అదనంగా, 4.6 కోట్ల మంది పేదరికంలోకి దిగజారి పోయారు. అదేవిధంగా భారత దేశానికి మరొక అవలక్షణం ఉన్నది. అదే కులం. భారత దేశంలో సమకూరిన సంపద కూడా కొన్ని కులాలకే పరిమితమైపోయింది. ఇదే విషయాన్ని నితిన్ కూర్ బర్తి అనే విద్యావేత్త, 1961 నుంచి 2021 వరకు చేసిన అధ్యయనంలో కులాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయనీ, మన దేశంలో ఉన్న ఆధిపత్య కులాలు ఆదాయంలోనూ ఖర్చులోనూ మిగిలిన కులాల కన్నా ముందు వరుసలో ఉన్నాయనీ తేల్చారు. ‘వెల్త్ ఇన్ ఈక్వాలిటీ క్లాస్ అండ్ కాస్ట్ ఇన్ ఇండియా – 1962–2021’ అన్న ఈ పరిశోధనా పత్రాన్ని ఆయన ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు 2018లో సమర్పించారు. 2011లోని ఎన్ఎఫ్హెచ్ఎస్ డాటా ప్రకారం, ఒక ఎస్సీ కుటుంబానికి ఒక సంవత్సర ఆదాయం 89 వేలు ఉంటే, ఎస్టీ కుటుంబ వార్షికాదాయం 75 వేలు ఉంది. అదే ఓబీసీల్లో ఇది ఒక లక్షా నాలుగు వేలు. ఇక ఆధిపత్య కులాల్లో ఇది లక్షా 64 వేలు అని నితిన్ తేల్చారు. అదేవిధంగా సంవత్సర ఖర్చు ఎస్సీల్లో 87 వేలు, ఎస్టీల్లో 72 వేలు, ఓబీసీల్లో లక్షా ఎనిమిదివేలు, అగ్రకులాల్లో లక్షా 46 వేలుగా ఆయన లెక్కలు గట్టారు. సాధారణ ప్రజల్లో కూడా ఆర్థిక వ్యత్యాసాలు చాలా ఎక్కువగానే ఉన్నట్టు మనకు ఈ లెక్కలు చెబుతున్నాయి. వీటితో పని లేకుండానే ఏ గ్రామం వెళ్ళినా ఈ తేడాలు మనకు వీధుల్లో దర్శనమిస్తాయి. దళిత కుటుంబాల్లో, వారి ఇళ్లల్లో ఈ విషయాలు అత్యంత స్పష్టంగా మనం గమనించొచ్చు. ఇదే విషయం ఇటీవల మరొక సర్వేలో తేలింది. క్రానిక్ పావర్టీ రీసెర్చ్ సెంటర్ ద్వారా జరిగిన పరిశోధన ద్వారా ఇదే విషయం అక్షరసత్యమని రుజువయ్యింది. పేదరికం అనేది తరతరాలుగా వస్తున్న వారసత్వంగా కొందరికి మారిపోయిందని ఆ సంస్థ నిర్వహించిన సర్వే నిగ్గు తేల్చింది. ఇది భారత దేశానికే పరిమితమైన పరిణామంగా ఆ సంస్థ పేర్కొన్నది. ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలు, దళిత వాడలు, ఆ వర్గాలకు చెందిన ప్రజలు పేదలుగానే పుట్టి, పేదలు గానే మరణిస్తూ, తమ పిల్లలకు సైతం పేదరికాన్నే వారసత్వంగా ఇచ్చి వెళుతున్నారని ఈ పరిశోధన అభిప్రాయపడింది. ప్రపంచంలో వందమంది పేదలుంటే అందులో 28 మంది మనదేశంలోనే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. అదేవిధంగా ఆకలితో అలమటించే భారత దేశ ప్రజల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అధ్యయనం ప్రకారం 18 కోట్ల మంది ఇంకా సరిౖయెన ఆహారం కూడా అందని స్థితిలో బతుకులీడుస్తున్నారని 2020 నివేదికలో పేర్కొన్నారు. ఇంకా మహిళల్లో ఆకలి బాధ తీవ్రస్థాయిలో ఉన్నట్టు కనిపిస్తోంది. 15 నుంచి 49 ఏళ్ళ వయసు ఉన్న మహిళల్లో దాదాపు 51 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఐదేళ్ళలోపు పిల్లల్లో 35 శాతం మంది సరిౖయెన ఎదుగదలను కలిగిలేరు. ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల్లో మన ర్యాంకు 101 అని తేల్చారు. అయితే మన దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉన్నదనుకుంటే పొరపాటే. బియ్యం, గోధుమల ఉత్పత్తిలో మన దేశం స్వయం సమృద్ధిని సాధించింది. భారత రైతాంగం కష్టపడి పండించిన ఈ ధాన్యమంతా ఎఫ్‌సీఐ గోదాముల్లో పడి మూలుగుతోంది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం, గడచిన ఐదేళ్ళలో 38 వేల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు పుచ్చి, పురుగుల పాల య్యాయి. 2021 డిసెంబర్ నాటికి 213 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 378 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు నిల్వ ఉన్నాయి. కానీ ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతావనిలో ఇంకా ప్రజలు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వరి, గోధుమల లాంటి ఆహారధాన్యాలు పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఆకలితో కాలే కడుపునకు పిడికెడు అన్నం లేదు. ఇది భారత దేశ అమృతోత్సవ సంబరాల సత్యాలు. భారత దేశంలో క్షీరసాగర మథనం లాంటి సంప్రదాయాలే మనకు ఆద ర్శాలు. ఒక వైపు సంపద, మరోవైపు పేదరికం, ఒకవైపు ఆహార ధాన్యాల నిల్వలు పుచ్చిపోతోన్న స్థితి, మరోవైపు ఆకలితో మలమల లాడే కడుపులు. ఇన్ని సాక్ష్యాలున్నా ఇంకా మనది సమైక్య భారతమని అందామా? ముమ్మాటికీ అనలేం. ఇది వైరుద్ధ్య భారతం. ఇక్కడ ఒక్క భారతం లేదు. ఇవి రెండు భారతాలు. ఇంకా చెప్పాలంటే మరెన్నో భారతాలు. నిజానికి ఈ దేశం పేదది కాదు. ప్రజలే పేదవాళ్ళు. ఈ వైరుద్ధ్యాలు ఇప్పటికైనా మనకు అర్థం కాకపోతే, పరిణామాలు ఎవ్వరూ ఊహించలేరు. అమృతోత్సవాలు జరపడం కాదు, అందరికీ అమృతం అందించే గుణం కావాలి. -మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
అత్యంత పేద రాష్ట్రాల జాబితా విడుదల.. అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం కేరళ
న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత పేద రాష్ట్రాలు బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ మేరకు తన తొలి జాతీయ బహుముఖీన పేదరిక సూచిక(ఎంపీఐ) నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం బిహార్ జనాభాలో సగానికి పైగా.. అంటే 51.91 శాతం మంది నిరుపేదలే ఉన్నారు. జార్ఖండ్‌లో 42.16 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 37.79 శాతం మంది దారిద్య్రం అనుభవిస్తున్నారు. జనాభాలో 36.65 శాతం మంది పేదలతో నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్, 32.67 శాతం మంది పేదలతో ఐదు స్థానంలో మేఘాలయ ఉన్నాయి. ఇక అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో కేరళ(0.71 శాతం), గోవా(3.76 శాతం), సిక్కిం(3.82 శాతం), తమిళనాడు(4.89 శాతం), పంజాబ్(5.59 శాతం) ముందు వరుసలో నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలిలో 27.36 శాతం, జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌లో 12.58 శాతం, డయ్యూ డామన్‌లో 6.82 శాతం, చండీగఢ్‌లో 5.97 శాతం మంది పేదలు ఉన్నారు. అతి తక్కువగా పుదుచ్చేరిలో 1.72 శాతం మంది పేదరికం అనుభవిస్తున్నారు. లక్షద్వీప్‌లో 1.82 శాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో 4.30 శాతం, ఢిల్లీలో 4.79 శాతం మంది పేదలు ఉన్నట్లు తేలింది. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ప్రజల సంఖ్యలోనూ బిహార్‌దే అగ్రస్థానం కావడం గమనార్హం. దేశంలో బహుముఖీన పేదరిక సూచికను తయారు చేయడానికి ఆక్స్ఫర్డ్ వర్సిటీ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి చేసిన మెథడాలజీని ఉపయోగించినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను ఆధారంగా తీసుకున్నట్లు తెలిపింది. -
ఫలించిన ముందుచూపు: చేతినిండా.. పని..మనీ!
ప్రభుత్వం, అధికారుల ముందుచూపు ఫలించింది. కరోనా కష్టకాలంలోనూ ఉపాధి హామీ పథకం కింద చేతినిండా పని కల్పించడంతో పేదలకు భరోసా లభించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు కిందిస్థాయి సిబ్బందితో సమీక్షలు నిర్వహించి కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించారు. రికార్డు స్థాయిలో పనులు చేపట్టి లక్ష్యాన్ని అధిగమించారు. రాష్ట్రంలో జిల్లాను రెండో స్థానంలో నిలిపారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రెండేళ్లుగా కరోనా పట్టిపీడిస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ప్రతి ఇంటికి చేదోడు వాదోడుగా నిలిచింది. చేతి నిండా పని కల్పించి.. కడుపు నింపింది. జిల్లాలో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి. పల్లెల్లో వేకువజామునే లేచి తెలతెలవారే సమయంలో వందల సంఖ్యలో కూలీలు పనుల బాట పట్టడమంటే పండుగే మరి. ఐదు నెలల్లోనే లక్ష్యానికి మించి... పేదలకు ఉపాధి కల్పించటడంలో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిపింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఇచ్చిన లక్ష్యాలను అధిగమించింది. ఈ ఏడాదికి 1.95 కోట్ల పనిదినాలు కూలీలకు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐదు నెలల్లోనే లక్ష్యాన్ని దాటేసి 1.97 కోట్ల పనిదినాలు కల్పించారు. రాష్ట్రంలోనే అత్యధిక పనిదినాలు కల్పించిన విజయనగరం జిల్లా తర్వాత ప్రకాశం రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో 6.40 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులను జిల్లా యంత్రాంగం కల్పించింది. ఇప్పటి వరకు మొత్తం వేతనాల రూపంలో రూ. 484 కోట్లు కూలీలకు చెల్లించారు. ఈ పథకం ద్వారా 4.51 లక్షల కుటుంబాల్లోని దాదాపు 7.65 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లయింది. అత్యధికంగా యర్రగొండపాలెం మండలంలో... జిల్లాలో ఉపాధి పనులు అత్యధికంగా యర్రగొండపాలెం మండలంలో జరిగాయి. ఈ ఒక్క మండలంలోనే ఈ సంవత్సరంలో కూలీలకు 7,60,279 పనిదినాలు కల్పించారు. యర్రగొండపాలెం మండలం తర్వాతి స్థానంలో పెద్దారవీడు మండలంలో 6,60,093 పనిదినాలు, బేస్తవారిపేట 6,36,217, కొనకనమిట్ల 5,86,579, మార్టూరు 5,84,959, మర్రిపూడి 5,68,653, దోర్నాల 5,67,703, పొన్నలూరు 5,24,938, కొండపి 5,23,484, దర్శి మండలంలో 5,21,033 పనిదినాలు కల్పించారు. మా కుటుంబానికి ఉపాధి పని ఊరటనిచ్చింది కరోనా సమయంలో పనులు లేక ఇబ్బంది పడాల్సి వస్తుందని భయపడ్డాం. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం ద్వారా నేను, నా భర్త కలిసి 136 రోజులు పని చేశాం. రోజుకు రూ.145 చొప్పున మొత్తం రూ.19,720 మా బ్యాంకు ఖాతాలో జమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దయవల్ల అమ్మ ఒడి పథకం ద్వారా రూ.14 వేలు, ఆసరా ద్వారా రూ.18,500 నా ఖాతాలో జమయ్యాయి. దీంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా బతుకుతున్నాం. – మమ్ము రమణ, ఉపాధి హామీ కూలీ, యర్రగొండపాలెం కరోనా సమయంలోనూ ఉపాధి కరోనా మహమ్మారి ఒక పక్క వేధిస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులకు ఎటువంటి అడ్డంకులు కలగకుండా చూశాం. ఇతర పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా చేతినిండా పని కల్పించాం. ఒక్కో కూలీ అకౌంట్లో వారానికి రూ.1,300 నుంచి రూ.1,500 వరకు కూలి డబ్బు పడింది. వేలాది కుటుంబాల్లో 100 రోజుల చొప్పున కూడా ఉపాధి కల్పించాం. దీంతో కూలీలకు ఉపాధి దొరకడమే కాకుండా, గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా వేగం పుంజుకున్నాయి. – కె.శీనారెడ్డి, డ్వామా పీడీ -
దయగల పార్కు.. ఎందరిలోనో మార్పు!
ఒక చిన్న ఆలోచన.. ఏదైనా మంచి చేయాలనే తపన.. ఎంతో మార్పు తెస్తుంది. మానవత్వం చూపుతుంది. పదిమందికి ఉపయోగపడుతుంది. మరెందరికో ప్రేరణ కలిగిస్తుంది. ఒకటి రెండుగా.. రెండు నాలుగుగా.. సాయం చేసే చేతుల సంఖ్య విస్తరిస్తుంది. ఆర్తులకు అండగా నిలుస్తుంది. సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో అదో చిన్న పార్కు. చిన్నచిన్న మొక్కలతో కనిపించే ఈ ఉద్యానవనం పెద్ద మనసుతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ పార్కుకి వెళ్తే ‘నీ దగ్గరున్న వస్తువుల్లో నీకు ఉపయోగపడనవి.. వేరొకరికి అత్యవసరం కావొచ్చు. అలాంటి వస్తువుల్ని ఈ పార్కుకు తీసుకురండి.. అవసరమైన వాళ్లకి ఈ పార్కు ఇస్తుంది..’ అని ఒక బోర్డు కనిపిస్తుంది. ‘సమాజం మనకి చాలా ఇచ్చింది. అందుకే మనం తిరిగి ఇచ్చెయ్యాలి. లేదంటే లావైపోతాం..’ ఇటీవల ఒక సినిమాలోని ఈ డైలాగ్ మంచి పాపులర్ అయింది. నిజమే.. మనకు మంచి చేస్తున్న సమాజంలో మంచి పనులు చేస్తే.. పదిమందికి జీవితాన్ని అందించవచ్చు. వాల్ ఆఫ్ కైండ్‌నెస్ పేరుతో విశాఖ మహానగరపాలక సంస్థ (జీవీఎంసీ) శానిటరీ ఇన్స్పెక్టర్ చేసిన చిన్న ఆలోచన.. నగరవాసుల పెద్ద మనసుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకప్పుడు బహిర్భూమిగా ఉన్న ఈ స్థలం.. నేడు ఎందరో పేదలకు దుస్తుల్ని, ఇతర సామగ్రిని అందిస్తోంది. దాతృత్వ నిలయం జీవీఎంసీ 69వ వార్డు పరిధిలో జాతీయ రహదారి పక్కన బీహెచ్ఈఎల్ గోడ వద్ద సుమారు 400 గజాల స్థలాన్ని స్థానికులు పాతికేళ్లుగా బహిర్భూమిగా మార్చేశారు. దీంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు నిత్యం పారిశుధ్య కార్మికులు శ్రమించాల్సి వచ్చేది. రోజూ ఈ పరిస్థితి చూస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ బోయిన శ్రీనివాసరావు వినూత్నంగా ఆలోచించారు. ఆ ప్రాంతాన్ని పార్కుగా మార్చాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఈ ప్రాంతాన్ని పార్కుగా మార్చేందుకు భెల్ యాజమాన్యం నుంచి అనుమతులు తీసుకున్నారు. స్థలాన్ని చదును చేసి మొక్కలు నాటించారు. తన జీతంలో కొంత మొత్తాన్ని వెచ్చించి ఫ్లెక్సీలు, గోడకు రంగులు వేయించారు. గేటు మాత్రమే ఉండి.. సరైన కంచె లేకపోవడంతో ఇక్కడ నాటిన పూల మొక్కలకు, నాపరాళ్లకు రక్షణ ఉండేదికాదు. ఈ పార్కును దయగల పార్కుగా మార్చాలని భావించిన శ్రీనివాసరావు అక్కడ వాల్ ఆఫ్ కైండ్‌నెస్ బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ఇది దాతృత్వపు స్థలంగా మారింది. ఈ దయగల పార్కు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోంది. అనేకమంది ఇళ్లల్లో నిరుపయోగంగా ఉన్న సామగ్రిని ఈ పార్కులోకి తీసుకొస్తున్నారు. దుస్తులు, చెప్పులు, పుస్తకాలు, వంటసామగ్రి.. ఇలా తమకు అవసరంలేని వాటిని దాతలు తీసుకొచ్చి పార్కులో ఉంచుతున్నారు. వాటిని అవసరమైన నిరుపేదలు, కూలీలు తీసుకెళుతున్నారు. తెచ్చేవాళ్లు, తీసుకెళ్లేవాళ్లు నిరభ్యంతరంగా పార్కులోకి రావచ్చు. ఎవరికీ ఆటంకాలు లేవు. కైండ్‌నెస్ పార్కులో పాత దుస్తులను వేస్తున్న దాత సౌకర్యాలు కల్పిస్తే మరింత మేలు తోచిన సాయం చేయాలన్నది నా సంకల్పం. దీనికి కార్పొరేషన్ అధికారుల నుంచి మంచి సహకారం అందింది. చాలామంది దాతలు వస్తున్నారు. తమకు అవసరం లేని ఎన్నో వస్తువులు ఇస్తున్నారు. కానీ వాల్ ఆఫ్ కైండ్‌నెస్‌కు సరైన రక్షణ లేకపోవడం వల్ల అనేక వస్తువులు దుర్వినియోగమవుతున్నాయి. పెద్ద మనసుతో ఎన్నో రకాల వస్తువులు అందించేందుకు వస్తున్నా.. వాటిని సంరక్షించలేకపోతుండటంతో.. తిరిగి తీసుకెళ్లిపోవాలని మేమే దాతలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దాతలు సహకరించి.. ఫెన్సింగ్ ఏర్పాటుచేసి, అల్మరాలు పెడితే.. చాలామందికి ఈ దయగల పార్కు ఉపయోగపడుతుంది. – బోయిన శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్, జీవీఎంసీ నా మనవడికి మంచి దుస్తులు దొరికాయి నేను ఈ పార్కుకి రెండు రోజులకోసారి వస్తాను. మా మనవడు వేసుకోడానికి మంచి దుస్తులు, ఆడుకోడానికి బొమ్మలు ఇక్కడ దొరుకుతున్నాయి. వైజాగ్ నగరంలో సాయం చేసే దాతలు చాలామందే ఉన్నారని ఈ పార్కుకి వచ్చినప్పుడల్లా అనిపిస్తుంటుంది. – అప్పన్న, నాతయ్యపాలెం పేదల అవసరాలు తీర్చే పార్కు ఈ పార్కు మా ఇంటి అవసరాల్ని ఎన్నోసార్లు తీర్చింది. మేము కొనుక్కోలేని వస్తువులు ఎన్నో ఇక్కడ దొరికాయి. మాలాగే చాలామంది ఇక్కడికి వచ్చి.. నచ్చిన దుస్తులు, వస్తువులు తీసుకెళుతున్నారు. నిజంగా ఇది దయగల పార్కే. సాయం చేసిన ప్రతి ఒక్కరినీ దేవుడు చల్లగా చూస్తాడు. – పెంటమ్మ, రైల్వే ట్రాక్ దరి, బీహెచ్ఈఎల్ స్వచ్ఛభారత్‌కు ఆదర్శంగా.. ఒక బహిర్భూమిని వాల్ ఆఫ్ కైండ్నెస్గా మార్చిన శానిటరీ ఇన్స్పెక్టర్ని జీవీఎంసీ కమిషనర్‌తోపాటు అధికారులమంతా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇటీవల అమరావతిలో జరిగిన సమావేశంలోనూ ఈ దయగల పార్కుని ఉన్నతాధికారులు ప్రశంసించారు. స్వచ్ఛ భారత్‌కు ఆదర్శంగా పార్కుని తీర్చిదిద్ది కమిషనర్ సూచనల మేరకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. – వి.సన్యాసిరావు, అదనపు కమిషనర్, జీవీఎంసీ -
పేదలపై కాంగ్రెస్ కపట ప్రేమ!
భోపాల్: కాంగ్రెస్ గత ప్రభుత్వాలన్నీ పేదలపై కపట ప్రేమ చూపాయని, రోజుకు వందసార్లు పేదలంటూ పాట పాడడమే కానీ, వారికి చేసింది శూన్యమని ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పీఎంజీకేఏవై లబ్దిదారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గత ప్రభుత్వాల కారణంగా వ్యవస్థ వక్రగతి పట్టిందని దుయ్యబట్టారు. తమ పాలనలో ప్రభుత్వ పనితీరు మారిందని, పలు పథకాల ప్రయోజనాలు నిజంగా లబ్ధిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. నిరుద్యోగిత సమస్యను నివారించేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. ‘ప్రభుత్వ పనితీరులో మార్పు వల్ల ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయి. గత ప్రభుత్వాల హయంలో పాలన అపమార్గం పట్టింది. పేదలపై ప్రశ్నలు, జవాబులు వారే ఇచ్చుకునేవారు’అని ఆయన విమర్శించారు. పేదలపై కేవలం కపట సానుభూతిని మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాలు చూపాయని ఆరోపించారు. తమ ప్రభుత్వ చర్యలతో కరోనా సమయంలో దాదాపు 80 కోట్ల మంది భారతీయులకు ఉచిత రేషన్ సదుపాయం అందిందని, వీరిలో ఐదు కోట్ల మంది మధ్యప్రదేశ్‌కు చెందినవారిని మోదీ చెప్పారు. కరోనా మహమ్మారిలాంటి ప్రమాదాన్ని మానవాళి గత వందేళ్లలో చూడలేదని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ జనాభా ఉన్న భారత్‌లో కరోనా నియంత్రణ ఇతర దేశాలతో పోలిస్తే కష్టతరమైందన్నారు. నిరుద్యోగితను ఎదుర్కొంటాం దేశంలో కరోనా కారణంగా ఏర్పడిన నిరుద్యోగితను ఎదుర్కోవడంపై దృష్టి సారించామని ప్రధాని తెలిపారు. ఇందులో భాగంగా మౌలిక వసతులు, నిర్మాణ రంగాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నామని, వీటి కారణంగా పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. అదేవిధంగా చిన్నపరిశ్రమలకు సాయం అందిస్తున్నామని, రైతులకు ఊరటనిచ్చే చర్యలు చేపట్టామని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్‌ను ప్రమోట్ చేసే క్రమంలో భారతీయులు స్వదేశీ కళాకృతులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. టోక్యో ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన పలువురు పేద కుటుంబాలకు చెందినవారని, వారంతా అద్భుత ప్రదర్శన చూపారని చెప్పారు. ఒకప్పుడు బీమారు రాష్ట్రాల్లో(దేశంలో అత్యంత అల్పాదాయం కలిగిన రాష్ట్రాలు)ఒకటిగా ఉన్న మధ్యప్రదేశ్ ఇటీవల కాలంలో మంచి పురోగతి సాధించిందని ప్రశంసించారు. -
ఇటు ఆకలి, అటు ఆహార ధాన్యాల వృధా!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో గత జనవరి ఒకటవ తేదీ నాటికి పాడైన ఆహార ధాన్యాలు 7.2 లక్షల టన్నులు ఉండగా, మే ఒకటవ తేదీ నాటికి, అంటే నాలుగు నెలల కాలంలో అవి 71.8 లక్షల టన్నులకు చేరుకున్నాయి. అంటే దాదాపు 65 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు వృధా అయ్యాయి. లాక్డౌన్ సందర్భంగా ‘పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన’ కింద ఏప్రిల్, మే నెలల్లో పేద ప్రజలకు పంపిణీ చేసిన ఆహార ధాన్యాలకన్నా ఇవి ఎక్కువ. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పేద ప్రజలకు పంపిణీ చేసేందుకు, ఆహార కొరత ఏర్పడే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగం కోసం భారత ఆహార సంస్థ ఈ ఆహార ధాన్యాలను ఏటా సేకరిస్తోంది. అయితే ఆహార ధాన్యాలను నిల్వచేసే గిడ్డంగుల సామర్థ్యం కన్నా ఎక్కువ ధాన్యాలను సేకరించడం, ఉన్న గిడ్డంగులు ఎప్పటికప్పుడు మరమ్మతులు నోచుకోక పోవడం వల్ల దేశంలో ఏటా ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి. 2018, అక్టోబర్ నెల నుంచి దేశంలో ఆహార ధాన్యాల సేకరణ ఎక్కువైంది. 2020, మే ఒకటవ తేదీ నాటికి భారత ఆహార సంస్థ గరిష్టంగా 668 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను సేకరించాల్సి ఉండగా, 878 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను సేకరించింది. ఆహార ధాన్యాల కొనుగోలుకే కాకుండా వాటి రవాణాకు, నిల్వకు భారత ఆహార సంస్థకు ఎంతో ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆ నిల్వల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ కింద కొంత మొత్తాన్ని కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంది. గత ప్రభుత్వాలు ఆహార ధాన్యాల కొనుగోలుతో పాటు, వాటి రవాణా, నిల్వకు అయ్యే ఖర్చును కూడా భరించేవి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం ధాన్యం ధరనే చెల్లించి సరకును తీసుకుంటోంది. అదనపు నిల్వలను బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవాల్సిందిగా భారత ఆహార సంస్థను కేంద్రం ఆదేశించింది. చాలా సందర్భాల్లో బహిరంగ మార్కెట్ రేటుకన్నా ఎక్కువ మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి సేకరించడం వల్ల, తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తంలో డబ్బు రాకపోవడం ఒకటైతే, మార్కెట్లో అదనపు నిల్వలను తక్కువ ధరకు అమ్మాల్సి రావడం, అధిక మొత్తంలో నిల్వ ఉంచిన ధాన్యాలు పాడవడం వల్ల భారత ఆహార సంస్థ భారీగా నష్టపోతోంది. దాన్ని పూడ్చుకునేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. 2019, డిసెంబర్ 31వ తేదీ వరకు ఆ సంస్థకు 2.36 లక్షల కోట్ల అప్పు పేరకు పోయింది. భారత ఆహార సంస్థ నిల్వల్లో ఎక్కువగా బియ్యం, గోధుమలే ఉంటాయన్న విషయం తెల్సిందే. అదనంగా సేకరించిన దాదాపు 200 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఏం చేయాలో భారత ఆహార సంస్థకు అర్థం కావడం లేదు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి కేవలం 36 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే ఆ సంస్థ బహిరంగ మార్కెట్లో విక్రయించగలిగింది. కరోన లాక్డౌన్ సందర్భంగా రైళ్లు, బస్సుల్లోనే కాకుండా కాలి నడకన స్వగ్రామాలకు బయల్దేరిన లక్షలాది మంది వలస కార్మికులు ఆకలి కోసం అల్లాడుతుంటే, ఏటా ఎంతో మంది పేదలు ఆకలితో అలమటించి చనిపోతుంటే మరోపక్క టన్నుల కొద్ది ఆహార ధాన్యాలు వృధా అవడం గమనిస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. -
నిరుపేదలకు వెసులుబాటు
బొబ్బిలి: నిరుపేదలకు గ్యాస్ బండలు విడిపించుకోవడంలో ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకున్న ప్రభుత్వం వారికి వెసులు బాటు కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గ్యాస్ కంపెనీలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. గతంలో గిరిజన, గిరిశిఖర ప్రాంతాలకే కేటాయించిన 5 కిలోల సిలిండర్లను ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తెస్తున్నాయి. జిల్లాలోని ఆయా ఏజెన్సీల ద్వారా పేదలు పొందిన గ్యాస్ కనెక్షన్లకు ఈ సిలిండర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం జిల్లాలోని నిరుపేదలయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏల్లో ఉన్న నిరుపేదలను గుర్తించి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అయితే ఇచ్చారు గానీ... విడిపించుకునేందుకు వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ సమస్యలను గుర్తించి వారికి అందుబాటులో ఉండే ధరల్లో సరఫరాచేయాలని భావిస్తున్నారు.ఇప్పటికే ఇటువంటి జాబితాలను ఆయా గ్యాస్ ఏజెన్సీలకు పంపించారు. ఆ జాబితాల్లో కొన్ని పేర్లు ఉండగా మరికొన్ని పేర్లను గుర్తించి వెంటనే గ్యాస్ కనెక్షన్లకు 5 కిలోల సిలిండర్ జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. నిరుపేదలను దృష్టిలో ఉంచుకునే... జిల్లా వ్యాప్తంగా 26 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటి ద్వారా దీపం, సీఎస్ఆర్, ఉజ్వల, సాధారణ గ్యాస్ కనెక్షన్లు 5,50,000 ఉన్నాయి. అందులో ఎస్టీలు, ఎస్సీలు పొందిన కనెక్షన్లు అధికంగా ఉన్నప్పటికీ సిలిండర్ ధర రూ.703లు ఉండటంతో పేదలు విడిపించుకోలేకపోతున్నారు. ఇందుకోసం వారికి రెండేసి సిలిండర్లను ఇచ్చి గ్యాస్ కొనుగోలుకు వీలుగా రూ.253లకు 5కిలోల గ్యాస్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి కోసం ప్రస్తుతం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద వారికే ఈ సిలిండర్లు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినప్పటికీ పెద్ద మొత్తం వెచ్చించి గా>్యస్ విడిపించడం లేదని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈజీ గ్యాస్ కార్డులు.. గతంలో పుస్తకాలతో గ్యాస్ విడిపించుకునే వారు. ఇప్పుడు కొంత కాలంగా ఈజీ గ్యాస్ స్మార్ట్ కార్డులను పరిచయం చేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లోని నిరుపేదలకు కూడా ఈ ఈజీ గ్యాస్ కార్డులు, 5 కిలోల సిలిండర్లతో వినియోగం పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. 5 కిలోల సిలిండర్లకు ప్రాధాన్యత: ఇప్పటికే ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించిన ప్రభుత్వం ఇప్పుడు విడిపించుకోలేని పేదలను గుర్తించి వారికి 5 కిలోల గ్యాస్ సిలెండర్లను అందించాలని ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం తామే అటువంటి వారిని గుర్తించి చిన్న సిలిండర్లను అందించే చర్యలు ప్రారంభించాం. ప్రతీ ఒక్కరూ తమ ఫోన్ నంబర్‌ను గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్స్‌కు అందించాలి. దీనివల్ల వారికి అప్డేట్స్ ఇవ్వడం సులువవుతుంది. – జలగం ప్రసాదరావు, వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ -
పేదల కోసం భూసేకరణ
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉగాది పండగ నాటికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం పెద్ద మొత్తంలో భూ సేకరణ చేయాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ఇళ్లు లేని పేదలందరికీ స్థలాలు అందివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకలి్పంచారు. ఈ విషయంపై అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉగాది నాటికి జిల్లాలో మూడు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న లక్ష్యంతో రెవెన్యూ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేటు భూములు సేకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జిల్లా మొత్తం మీద 800 ఎకరాల నుంచి వెయ్యి ఎకరాల స్థలాన్ని సేకరించాలన్న ఆలోచనతో అధికార యంత్రాంగం ఉంది. సబ్ రిజి్రస్టార్ విలువ(ఎస్ఆర్) ప్రకారం మూడు రెట్ల అదనపు ధరతో జిరాయితీ భూములు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా భూ సేకరణ ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంత మేర స్థలం అవసరమన్న దానిపై యంత్రాంగం అంచనా వేస్తోంది. జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్బన్ పరిధిలో ఉండే నాలుగు మండలాలు మినహా.. మిగిలిన 11 మండలాల్లో వివరాలు సేకరిస్తున్నారు. అరకు, పాడేరు మండలాల్లో అక్కడ గిరిజనులకు ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన 9 మండలాల్లో అసలు ప్రభుత్వ స్థలాలు ఎంత మొత్తంలో ఉన్నాయి, ప్రైవేటు భూములు ఎంత మేర సేకరించాలి, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాల పరిస్థితిపై సర్వే చేసి తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వినయ్‌చంద్ ఇటీవల తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లో శివారు కొండలు, గుట్టలు, పోరంబోకు స్థలాలు ఎంత మేర ఉన్నాయన్న దానిపై రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. 3 లక్షల మందికి పట్టాల పంపిణీ ఉగాది నాటికి మూడు లక్షల మంది పేదలకు పట్టాలు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో అనువైన భూములను గుర్తించేందుకు తహసీల్దార్లు స్వీయ పర్యవేక్షణలో రెవెన్యూ బృందాలు రంగంలోకి దిగాయి. వీటిని ఆర్డీవోలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భూములు అందుబాటులో ఉన్నా.. అవి గ్రామాలకు శివారులోనూ, కొండలు, గెడ్డలు, గుట్టలకు అనుకుని ఉన్నాయి. ఇక అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, విశాఖ రెవెన్యూ డివిజన్లలో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు ఉన్నారు. ఇళ్ల స్థలాలు కేటాయింపులో స్పందన కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ దరఖాస్తులను విచారణ చేసి తగు నిర్ణయం తీసుకుంటున్నారు. ల్యాండ్ పూలింగ్ కోసం.. ప్రభుత్వ, జిరాయితీ భూముల సేకరణ తర్వాత.. అవసరమైతే అసైన్డ్ భూములపై తీసుకుని వారికి ల్యాండ్ పూలింగ్ ద్వారా తిరిగి భూములు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఎకరానికి 900 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నగర పరిధిలోని మండలాల్లో అసైన్డ్ భూములు లభ్యతపై అన్వేషణ జరుగుతోంది. విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో విశాఖ రూరల్, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం మండలాల్లో ఏ మేర అసైన్డ్ భూములు ఉన్నయన్న దానిపై రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. భూసేకరణలో నిర్లక్ష్యం వద్దు పేద ప్రజలకు ఉపయోగ పడే స్థలాలను సేకరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వద్దని కలెక్టర్ వినయ్‌చంద్ ఇటీవల జరిగిన సమీక్షలో తహసీల్దార్లకు సూచించారు. భూములను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయడానికి సిద్ధం అని కూడా చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిబ్బంది పని చేయాలని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం ఉగాది పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయాలన్నారు. సొంత ఇళ్లు కట్టుకోవడానికి ఎలాంటి స్థలం తీసుకుంటామో.. అదే పద్ధతిలో ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలం ఉండాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. -
పేదోళ్లకు పెద్ద కష్టం
ఆ ఇంట్లో గత 15 ఏళ్ల నుంచి ఓ మహిళ, ముగ్గురు బాలికలు నివాసం ఉంటున్నారు. భర్త అనారోగ్యంతో చనిపోవడంతో పాచి పనులు చేస్తూ ఒకటిన్నర దశాబ్ద కాలంగా ముగ్గురు బిడ్డలను ఆ తల్లే పోషిస్తోంది. బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలని ఆశపడింది. ముగ్గురినీ పదో తరగతి పైగానే చదివించింది. ఓవైపు పెళ్లీడుకొచ్చిన బిడ్డలు, మరోవైపు వారి చదువులు.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ముగ్గురూ చదువులు మానాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక్కొక్కరికైనా పెళ్లి చేసేందుకు నలుగురూ పనులకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఇంతలోనే విధి వెక్కిరించింది. వారి జీవితాలను ఓ కుదుపుకుదిపేస్తోంది. తినడానికి సరైన తిండి లేక ‘ఆకలి’ ఆ ఇంట్లో తల్లీకూతురిని మంచాన పడేసింది. మండల కేంద్రం మెంటాడ దిగువ వీధిలోని ఓ నిరుపేద కుటుంబం దీనావస్థ ఇది. సాక్షి మెంటాడ: మెంటాడ దిగువ వీధిలో అరసాడ సత్యవమ్మ, తిరుపతిరావు కాపురం ఉంటుండే వారు. వీరికి ముగ్గురు కుమార్తెల సంతానం. అయితే సత్యవతమ్మ భర్త తిరుపతిరావు సుమారు 15 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పిల్లలను పోషించేందుకు, వారిని చదివించడానికి సత్యవతమ్మ.. ఉపాధి, ఎంపీడీఓ, వెలుగు కార్యాలయాల్లో పాచి పనులు చేసేది. ఈ పనులు చేస్తూనే పెద్ద కుమార్తె లక్ష్మిని 10వ తరగతి, రెండో కుమార్తె రామకృష్ణమ్మను డైట్, మూడో కుమార్తె రాజేశ్వరిని ఇంటర్మీడియట్ వరకు చదివించింది. ఒక్క మహిళ సంపాదనతో నలుగురి పోషణ, ముగ్గురి చదువు భరించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో మధ్యలోనే వారి చదువులు ఆగిపోయాయి. గంజి కూడా కాచుకోలేని దుస్థితి.. ముగ్గురు కూతుర్లూ, తాను ఏవో ఒక పనులు చేసుకోవాలని నిర్ణయించుకోగా, అంతలోనే సత్యవతమ్మకు వెన్ను, భుజం పక్క భాగంలో తీవ్రమైన నొప్పి రాసాగింది. దీంతో నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా, పరిస్థితి బట్టి వైద్యులు ఆమెకు అక్కడే ఆపరేషన్ చేశారు. కానీ మందులు కొనుగోలుకు, మూడు పూటలా కాస్తా గంజి నీళ్లు తాగేందుకు కూడా వారి వద్ద డబ్బు లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సరైన తిండి లేక సత్యవతమ్మ, ఆమె రెండో కుమార్తె అరసాడ రామకృష్ణమ్మ ఏకంగా మచ్చం పట్టారు. రామకృష్ణమ్మ కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. తన పరిస్థితి ఇలా ఉండగా, కూతురు కూడా మంచాన పడటంతో సత్యవతమ్మ మరింత కుంగిపోయి పూర్తిగా మంచం పట్టింది. సాయం కోసం ఎదురుచూపులు.. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబానికి ఇంతటి కష్టం వచ్చిపడటంతో ఇంట్లో అందరూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మెరుగైన వైద్యం సంగతి పక్కనపెడితే.. కనీసం తిండి కూడా లేకపోవడంతో ఇంటిళ్లపాదీ ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి తమ ప్రాణాలు కాపాడేందుకు సహకరిస్తారని వారు ఎదురు చూస్తున్నారు. తమకు సాయం చేయాలనుకునే వారు 9491769356 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని వారు అభ్యర్థిస్తున్నారు. వలంటీర్ పోస్ట్ కోసం కాళ్లు పట్టుకున్నా.. మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి గురించి గ్రామస్తులకు, అధికారులకు తెలుసు. కనీసం గ్రామ వలంటీర్ పోస్టు ఇవ్వాలని గ్రామంలో ఉన్న అందరి కాళ్లు పట్టుకున్నాను. చివరకు ఎంపీడీఓకూ మా పరిస్థితి వివరించాను. ఏ ఒక్కరూ మా కుటుంబంపై కనికరం చూపించలేదు. ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నా. – అరసాడ రామకృష్ణమ్మ (డైట్ , మెంటాడ ) -
పేదరికం వెంటాడినా.. పట్టుదల నిలబెట్టింది
మహేశ్వరం: తండ్రి ట్రాక్టర్ డ్రైవర్ అయినా.. పేదరికం వెంటాడుతున్నా కృషి పట్టుదలతో రేయింబవళ్లు కష్టపడి చదివి పోలీస్ శాఖలో ఎస్ఐ ఉద్యోగం సాధించారు. మండల పరిధిలోని సిరిగిరిపురం గ్రామానికి చెందిన కాసుల అరుణ్‌కుమార్ ఏఆర్ ఎస్ఐగా ఎంపికయ్యారు. అంబర్‌పేట్‌లో పోలీస్ కానిస్టెబుల్‌గా విధులు నిర్వహిస్తూనే ఎస్ఐ పరీక్షలకుసిద్ధమై ఏఆర్ ఎస్ఐగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు పద్మ, భాస్కర్ దంపతులకు అరుణ్‌కుమార్ పెద్ద కుమారుడు. తల్లి రోజువారి వ్యవసాయ కూలీ, తండ్రి ట్రాక్టర్ డ్రైవర్‌గా గ్రామంలో పని చేస్తున్నారు. అరుణ్‌కుమార్ 1వ తరగతి నుండి 10 తరగతి వరకు మహేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇంటర్ తుక్కుగూడలోని వి/êన్‌కాలేజ్ జూనియర్ కాలేజ్, హైదరాబాద్‌లోని ప్రభుత్వ సిటీ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కష్టపడి చదివి ఏలాగైనా ఉన్నతమైన ఉద్యోగం సాధించి గ్రామానికి, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడురు. తల్లిదండ్రులు రోజు వారి కూలీలు. వారి కష్టాలను తీర్చాలన్న ఉద్దేశంతో ఉన్నతమైన ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నారు. డిగ్రీ పూర్తి 2016లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. అటు ఉద్యోగం చేస్తూనే ఎస్ఐ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ నెల 12న విడుదలైన ఎస్ఐ పరీక్ష ఫలితాల్లో పోలీస్ ఎగ్జిక్యూటివ్ కోటాలో 219 మార్కులు సాధించి ఏఆర్ ఎస్ఐగా ఎంపికయ్యారు. కాసుల అరుణ్‌కుమార్ ఏఆర్ ఎస్ఐగా ఎంపిక కావడంతో తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఐగా అరుణ్‌కుమార్ సెలెక్ట్ కావడం గర్వంగా ఉందని గ్రామ సర్పంచ్ కాసు సురేశ్ అన్నారు. అరుణ్‌కుమార్‌ని చిన్నప్పటి నుంచి చదువుల్లో ప్రోత్సహించేవాడినని, ఉద్యోగం సాధించడం మండలానికే గర్వకారణంగా ఉందని సర్పంచ్ సురేశ్ తెలిపారు. -
పేరు పార్ట్ టైం.. పని ఫుల్ టైం
ప్రభుత్వ పాఠశాలల్లోని ఆర్ట్, వర్క్, వృత్తి విద్య పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్ల పరిస్థితి (పీటీఐ) దయనీయంగా ఉంది. పేరుకు పార్ట్ టైం అయినా వారంతా ఫుల్ టైం పనిచేయాల్సి వస్తోంది. కేవలం మధ్యాహ్న వేళల్లో సహపాఠ్య కార్యక్రమాలు బోధన చేయించాలని వీరిని నియమించగా వీరు రోజంతా పని చేయాల్సి వస్తోంది. పాఠశాలల్లోని హెచ్ఎంల ఆదేశాలుతో వీరు పని చేయక తప్పడంలేదు. అరకొర జీతం..ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేయాలంటే తాము ఎలా బతకాలని ఇన్స్ట్రక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - కంచరపాలెం (విశాఖ ఉత్తర) విద్యాహక్కు చట్టం–2009లో భాగంగా 6,7,8 తరగతుల విద్యార్థులకు సృజనాత్మకత, పనిపట్ల అవగాహన పెంచడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్ట్, వర్క్, వృత్తి విద్య బోధించడానికి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు (పీటీఐ)ను సర్వశిక్ష అభియాన్, రాజీవ్ విద్యా మిషన్ నియమించాయి. 2012లో ఈ నియామకాలు జరిగాయి. పీటీఐల నియామక సమయంలో పార్ట్‌టైం విధానం అయినా పూర్తికాలం పని చేయించారు. ఈ సమస్యపై 2014లో కొంత మంది పార్ట్‌టైం బోధకులు అప్పటి రాష్ట్ర సంచాలకులుగా ఉన్న వి.ఉషారాణిని సంప్రదించారు. ఆమె ఒక జీవోను విడుదల చేశారు. పార్ట్‌టైం బోధకులతో కేవలం మధ్యాహ్న వేళల్లో మాత్రమే ఒక్క పూట బోధన చేయించాలని ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో మరే ఇతర పనులకు గాని, పాఠశాలలో ఇతర సబ్జెక్టుల బోధనకు గాని వినియోగించరాదని జీవోలో స్పష్టంగా సూచించారు. కేవలం పీటీఐలను సహపాఠ్యాంశాల బోధనకు మాత్రమే వినియోగించాలని ఆదేశాలిచ్చారు. కానీ అది అమలు మాత్రం జరగడం లేదు. హెచ్ఎంల ఒత్తిళ్లు జిల్లా పరిషత్, జీవీఎంసీ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు పార్ట్‌టైం బోధకులను రోజంతా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు ఇన్స్ట్రక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి పలుమా ర్లు వీరు తమ గోడును వి ద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లా రు. 2014–15లో విద్యాశాఖా ఇచ్చిన ఉత్తర్వులను చూపించినా హెచ్ఎంలు పట్టించుకోవడంలేదు. పీటీఐలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తికాలం పనిచేయాలని ఆదేశిస్తూ మానసికంగా ఒత్తిడి తెస్తున్నారని ఇన్స్ట్రక్టర్లు ఆరోపిస్తున్నారు. అలా చేయని యడల రీఎంగెజ్మెంటుపైన, డ్యూటీ సర్టిఫికెట్లపై హెచ్ఎంలు సంతకం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నార న్న ఆరోపణలు ఉన్నాయి. జీవీఎంసీ పరిధిలో కొంత మంది హెచ్ఎంలు మరో అడుగు ముందుకేసి రెండుపూటలా పనిచేస్తేనే..లేకుంటే ఉండనవసరం లేదని బెదిరింపులకు దిగుతున్నారని ఇన్స్ట్రక్టర్లు ఆవేదన చెందుతున్నారు. పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సమస్యపై ఆ యూనియన్ నాయకులు సంప్రదింపులు జరిపినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. సమస్య ఉన్న పాఠశాలల్లో యూనియన్ నాయకులు పలుమార్లు హెచ్ఎంను కలిసి చెప్పినా వారు వినిపించుకోవడంలేదు. ప్రాజెక్ట్ అధికారిని కలిసి చెబితా వారు నోటి మాట చెప్పి వదిలేస్తున్నారు. హెచ్ఎంలకు స్పష్టమైన ఆదేశాలు మాత్రం ఇవ్వడంలేదు. అసలే చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న పీటీఐలు మిగతా సమయంలో మరో చోట పనిచేసుకోవడానికి హెచ్ఎంలు అవకాశం ఇవ్వడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. 480 మంది ఇన్స్ట్రక్టర్లు జిల్లాలో 480 మంది పార్ట్‌టైం బోధకులు ఉన్నారు. వీరంతా నెలకు రూ.14వేల వేతనంతో పనిచేస్తున్నారు. చాలీచాలనీ వేతనాలతో పీటీఐలు పని చేయాల్సి వస్తోంది. వీరిలో ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కెందుకు ఉదయం వేళల్లో ప్రయివేటు పాఠశాలలు, ప్రయివేటు కార్యాలయాల్లో పనిచేస్తూ ఉండడం కనిపిస్తోంది. కటువుగా ప్రవరిస్తున్నారు మేం పాఠశాలలో రోజంతా పనిచేయలేం. అరకొర జీతంతో మేం ఎలా బతకాలి. ప్రభుత్వ విధివిధానాలు సక్రమంగా అమలు చేయడంలో హెచ్ఎంలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం పనిచేస్తున్నా హెచ్ఎంలు కటువుగా ప్రవర్తిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లాలంటేనే ఆందోళన చెందుతున్నాం. విద్యాశాఖాధికారులు సరైన నిర్ణయం తీసుకుని పార్ట్‌టైం ఉద్యోగులకు మేలు చేయాలి. – బి.నవీన, ఆర్ట్ ఇన్స్ట్రక్టర్ ఉత్తర్వులివ్వాలి ఆర్ట్,వర్క్ ఇన్స్ట్రక్టర్లకు ఒకపూట పనిచేయాలనే నిబంధన ఉన్నా కొంత మంది హెచ్ఎంలు పూర్తి కాలం పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. రెండు పూటల పనిచేయాలని ఉత్తర్వులు వస్తే మేం చేస్తాం. అంతేతప్ప ఇచ్చే జీతం తక్కువ, చేసే పని ఎక్కువ అయితే మేం వేగలేం. దీనిపై స్పష్టత అవసంర. – బి.శంకర్, ఆర్ట్ ఇన్స్ట్రక్టర్, పీటీఐల యూనియన్ నాయకుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతా పీటీఐలు ఒకపూటే పని చేయాలనే జీవో 2014లో విద్యాశాఖాధికారులు జారీ చేసిన మాట వాస్తవమే. పీటీఐల జీతాలు పెరిగిన తరువాత కొన్ని పాఠశాలలో హెచ్ఎంలు రెండుపూటల పాఠశాలలకు రావాలనే కోరుతున్నారనే సమస్య మా దృష్టికి వచ్చింది. సమస్యను జిల్లా ప్రాజెక్టు అధికారి సలహాతో రాష్ట్ర ఎన్పీడీ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం. అప్పటివరకు పీటీఐలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల మాటలకు అనుగుణంగా పనిచేసుకుంటే ఉద్యోగులకు మేలు జరుగుతుంది. – అలుగుబిల్లి శ్రీనివాసరావు, ఎస్ఎస్ఏ అకడమిక్ మానిటరింగ్ అధికారి, ఆర్వీఎం -
మహోన్నత మాలవ్యా
ఓసారి కాశీ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు విద్యార్థులు పడవ నడిపే ఓ నిరుపేదవాడి నుంచి ఓ పడవను అద్దెకు తీసుకున్నారు. ఆ పడవలో వారు ఉల్లాసయాత్ర చేపట్టారు. కానీ ఆ యాత్రలో వారు ఆ పడవను ఇష్టమొచ్చినట్లు నడిపి అది ఎందుకు పనికిరాకుండా పాడుచేసి పెట్టారు.ఎలాగోలా తీరం చేరుకున్న ఆ విద్యార్థులు పడవనడిపే అతనితో ఏదీ చెప్పకుండా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఆ పడవే అతని జీవనాధారం. దాని మీద వచ్చే ఆదాయంతోనే అతను తన కుటుంబాన్ని నడపాలి. అటువంటప్పుడు విద్యార్థులు పడవ చెడిపోయిందని చెప్పకుండా చల్లగా జారుకోవడంతో అతనికి కోపం వచ్చింది. అతనికేంటీ ఎవరికైనా కోపం వచ్చే తీరుతుంది. లాభం లేదనుకున్న ఆ పేదోడు స్థానిక విద్యావేత్త మదన్ మోహన్ మాలవ్యా ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళి ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి బయలుదేరాడు. మొత్తానికి అతను మాలవ్యా ఇంటికి చేరాడు. ఆ సమయంలో మాలవ్యా ఇంట ఏదో సమావేశం జరుగుతోంది. సమావేశంలో ఉన్న మాలవ్యాను కలవడానికి పేదోడు ముందుకు అడుగులు వేసాడు. కానీ అక్కడ కొందరు అతనిని లోపలికి వెళ్ళడానికి వీల్లేదని అడ్డుకున్నారు.ఆగ్రహావేశాలతో ఉడికిపోతున్న పేదోడు అక్కడెవరినీ లెక్కచేయలేదు. సమావేశం జరుగుతున్న హాలులోకి వెళ్ళి తన బాధనంతా వెళ్లగక్కాడు. మాలవ్యా అతని వద్దకు వచ్చి, జరిగిన నష్టాన్ని అర్థం చేసుకుని ‘‘దిగులు పడకు. నీ కోపం సబబే. నీ పడవకు మరమ్మతులు చేసి పెడతాను. నీకు నేనున్నాను’’ అంటూ హామీ ఇచ్చాడు. ఇతరులు ఏదైనా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు వారికి ఇబ్బంది కలిగించేలా మాట్లాడి నోరు పారేసుకోకూడదని, కోపాన్ని నియంత్రించుకోవాలని హితవుపలికారు మాల వీయ. అతని పడవకు ఉచితంగా మరమ్మతు పనులు చేసి పెట్టారు. – యామిజాల జగదీశ్ -
పసలేని ఎన్నికల పండుగ
అచ్చంపేట: ఎన్నికలంటే ఓ పండగ లెక్క! దాదాపు ఇరవై రోజులపాటు నిత్యం నాయకుల మాటల పోరు.. ర్యాలీలూ.. సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభా ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది. అంతెందుకు నిన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదేజోరు సాగింది. కానీ, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రచార హోరు కనిపించకపోగా.. మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో ఈ హుషారు కనిపిస్తున్నా.. ఊళ్లో మాత్ర పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చప్పుడే లేకుండాపోయింది. కొన్నిచోట్ల మాత్రం అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు ప్రధాన అనుచరులు మరీ రాలేదనకుండా గ్రాయిల్లో ప్రచారం చేసి వస్తున్నారు. కనిపించని ఉత్సాహం గ్రామాల్లోనే కాదు.. స్థానిక నేతల్లో కూడా పెద్దగా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. ప్రధానంగా పోటీ పడుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లోనూ ఇదే స్తబ్ధత నెలకొంది. ఏ ఎన్నికలు వచ్చినా.. అభ్యర్థులు లేదా ప్రజాప్రతినిధులు మండలాలు, గ్రామాల వారీగా తమ నాయక గణానికి బాధ్యతలు అప్పగిస్తుంటారు. ప్రచార బాధ్యతలు వారే చూసుకోవాల్సి ఉంటుంది. వారిపై మరికొందరు సమన్వయం చేస్తుంటారు. కానీ ఎంపీ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ప్రచార బాధ్యతలను ఇప్పటికీ నాయకులకు అప్పగించలేదు. అభ్యర్థులకు వెన్నుదన్నుగా ఉండే అనుచరులతోపాటు ఆయా పార్టీల సర్పంచ్‌లు కూడా గ్రామాల్లో సందడి చేయడం లేదు. బయటకు వెళ్తే ఎక్కడ ఖర్చుల భారం మీద పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వెళ్లినా మైకుల హోరు.. ర్యాలీలు నిర్వహించడం లేదు. సాదాసీదాగా వెళ్లి గ్రామస్తులతో సమావేశం మాత్రమే నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ప్రచారం ‘మమ’ అనిపిస్తున్నారన్నమాట. అప్పుడే మస్తుగుండే.. ‘ఎంపీ ఎన్నికలంటున్నరు.. మరీ మందూ లేదు.. విందూ లేదా..’ అని చాలామంది నాయకులకు మందుబాబుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పల్లెల్లో నాయకులు ప్రచారం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఇది కూడా కారణంగా మారుతోంది. శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లో మద్యం జోరుగా సరఫరా కావడంతో.. మందుబాబులందరికీ ప్రచారం జరిగినన్ని రోజుల పండగలా సాగింది. స్థానికంగా బాధ్యతలు తీసుకున్న నాయకులు ఇంటికొచ్చి మరీ.. మద్యం సీసాలను మందుబాబులకు అప్పగించి వెళ్లారని సమాచారం.! ఇప్పడేమె అంతా స్తబ్ధుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు ఊళ్లలో ప్రచారం చేయాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ప్రచారం చేసేందుకు వెళ్లకున్నా.. పైనుంచి డబ్బులు వచ్చినా ఖర్చు పెడతలేడు.. అన్న అపవాదూ వస్తోందని వాపోతున్నారు. ఐదు రోజులే మిగిలింది.. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ఐదురోజులే మిగిలింది. ఈ నెల 11న జరగనున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రచారాన్ని ఈ నెల 9 వరకు మాత్రమే చేయాల్సి ఉంది. ఇప్పటి దాకా పల్లెల్లోకి అభ్యర్థులే ప్రచారానికి రాలేదు. కేవలం పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాలు, మేజర్ మండల కేంద్రాల వరకే తమ ప్రచారాన్ని పరిమితం చేస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రమే మేజర్ ఓట్లు ఉన్న గ్రామాల్లో కార్యకర్తలు, గ్రామస్తులు నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నా.. అందాల్సినవి అందకపోవడం వల్లే ప్రచారం మాగబోయిందనే చర్చ గ్రామాల్లో వినిపిస్తోంది. సంఘాల వారీగా.. అభ్యర్థులు శాసనసభా ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీల నాయకులు గ్రామాల్లో కుల సంఘాల వారీగా కలుస్తున్నారు. కులం ఓట్లు గంపగుత్తగా తమకే వేసేలా వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుల సంఘాల నాయకులకు వారు కోరిన కోర్కెలకు హామీలు ఇస్తున్నారు. తాము గెలవగానే మీ హామీలను పూర్తి చేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. పార్లమెంట్ స్థానం పరిధి పెద్దగా ఉండటంతో అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. ఇక అభ్యర్థులు, పార్టీలు ఆర్థికంగా తోడ్పాటునందిస్తేనే స్థానిక నాయకులు ప్రచారానికి ముందడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. -
పేదలకు రుణాల్లోనూ మోసమే
సాక్షి, అమరావతి: పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు ఇస్తామని భారీయెత్తున ప్రచారం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆయా వర్గాల వారిని నిలువునా మోసం చేసింది. సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదంటూ నెపాన్ని బ్యాంకులపైకి నెట్టి చేతులు దులుపుకుంది. దీంతో 14 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మెగా రుణ మేళాలు నిర్వహించి సబ్సిడీతో రుణాలు ఇస్తామని ప్రచారం చేయడంతో సుమారు 15 లక్షల మంది ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 2015–16లో అరకొరగా రుణాలిచ్చిన ప్రభుత్వం అప్పటికి ఆ కార్యక్రమాన్ని ముగించేసింది. ఆ తర్వాత 2016–17, 2017–18, 2018–19 మూడు సంవత్సరాల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా రుణాలివ్వకుండా ఎగనామం పెట్టింది. దరఖాస్తుదారులైన పేదలు, నిరుద్యోగులు తమకు సబ్సిడీ రుణాలు ఎప్పుడిస్తారంటూ ఎక్కడికక్కడ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను, నేతలను నిలదీస్తుండటం, ఈలోగా ఎన్నికలు సమీపించడంతో గత జనవరిలో రుణ మేళాల నిర్వహణకు ప్రభుత్వం పూనుకుంది. ప్రచారార్భాటానికి రూ.4 కోట్ల వ్యయం రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సభలు ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి ఆర్భాటంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఇక ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికైతే మహిళలు, దళితులు, మైనార్టీలను భారీ స్థాయిలో బస్సులు, ఇతర వాహనాలు పెట్టి మరీ తరలించారు. ఇందుకోసం కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. నాలుగు మెగా రుణమేళాలకు నాలుగు కోట్లు ఖర్చయ్యాయి. ఎంతో ఆశతో ఆయా సభలకు వెళ్లిన దరఖాస్తుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నామమాత్రంగా కొంతమందికి మాత్రమే రుణాలు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. మొదటి రుణ మేళాలో 26,598 మందికి రుణాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రెండో మేళాలో 3,419 మందికి, మూడో మేళాలో 2,965 మందికి, నాలుగో మేళాలో 2,896 మందికి మాత్రమే రుణాలు ఇచ్చారు. అంటే 15 లక్షల మంది దరఖాస్తుదారులకు గాను నాలుగు మేళాల్లో కలిపి 35,878 మందికి మాత్రమే రుణాలు పంపిణీ చేశారన్నమాట. నాలుగు రుణమేళాల్లో కలిపి నాలుగు లక్షల మందికి సుమారు రూ.2,000 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం పంపిణీ చేసింది కేవలం రూ.253.49 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక ఇచ్చిన వారికన్నా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసిందా అంటే అదీ లేదు. బ్యాంకులకు సబ్సిడీని విడుదల చేయడంలో కార్పొరేషన్లు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయనే విమర్శలున్నాయి. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లు సగం మందికి కూడా సబ్సిడీలు విడుదల చేయలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. యూనిట్లు అందని వారు, సబ్సిడీ అందని వారు 30 శాతం వరకు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. -
పేద రైతుకే ‘పెట్టుబడి’
సాక్షి, మెదక్: చిన్న, సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పేద కర్షకులకు వరంలా మారింది. నిరుపేద రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ఈ పథకంతో గుంటభూమి ఉన్నా రైతుకు రూ. 6 వేలు వస్తుండటంతో వారు సంతోషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో గుంట, రెండు గుంటల భూమి ఉన్న వేలాదిమంది పేద రైతులు ఆ పథకాన్ని వదిలేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 3.20 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా 2.20 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 1.95 వేల మంది రైతులకు రూ.148 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా అందించింది. ఇందులో 25 వేల మంది రైతులకు సంబంధించిన భూములు వివిధ సమస్యలు ఉండటంతో పార్ట్(బీ)లో పెట్టినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ రబీ సీజన్లో 1.73 వేల మంది మాత్రమే రైతుబంధును తీసుకోగా ఇందుకోసం రూ. 136 కోట్లను పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఖరీఫ్ సీజన్ నుండి రబీ సీజన్‌తో పోల్చుకుంటే జిల్లావ్యాప్తంగా 5 వేల మంది రైతులు రైతుబంధు పథకాన్ని తీసుకోకుండా తిరస్కరించారు. దీనికి ప్రధాన కారణం ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇవ్వడమే ఈ లెక్కన గుంటభూమి ఉన్న రైతుకు కేవలం రూ. 100 మాత్రమే వచ్చింది. ఇలా ఐదారు గుంటల భూములున్న రైతులు దాదాపు 5వేల మంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను తిరస్కరించారు. జిల్లాలో తక్కువ భూమి ఉన్న రైతులే అధికంగా ఉన్నారు. దీంతో నిరుపేద రైతులకు రైతుబంధు పథకం ఉపయోగ పడడం లేదు. «ఎకరం నుంచి ఆపైన ఉన్న రైతులకు మాత్రమే ఉపయోగ పడుతోంది. ఈ లెక్కన వంద ఎకరాలు గల భూస్వామికి రూ. 4 లక్షలు రాగా ఎకరం భూమి ఉన్న రైతుకు కేవలం రూ. 4 వేలు మాత్రమే వచ్చింది. అదే గుంట భూమి ఉన్న రైతుకు రూ. 100 మాత్రమే చెక్కు రూపంలో వచ్చింది. దీంతో ఐదారు గుంటల భూములున్న రైతులకు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది జిల్లాలో లక్షా 7 వేల మందికి లబ్ధి.. జిల్లాలో 1.07 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులుగా తేల్చారు. జిల్లాలో 3.20 లక్షల ఎకరాల భూములు ఉండగా అందులో 1.7లక్షల మంది రైతులు మాత్రమే ఐదెకరాలలోపు భూములు కలిగి ఉన్నారు. ఒక్కో రైతుకు రూ. 6 వేలను మూడు విడతల్లో ఒక్కో విడతకు రూ.2వేల చొప్పున అందిస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో విడతకు జిల్లావ్యాప్తంగా రూ. 21.40 కోట్ల చొప్పున మూడు విడతల్లో రూ. 64.20 కోట్లను ఇవ్వనున్నారు. ఇప్పటికే చాలా మంది రైతుల అకౌంట్లలో రూ. 2 వేల చొప్పున వేసినట్లు అధికారులు చెబుతున్నారు. గుంట భూమి ఉన్నా కేంద్ర సాయం గుంట భూమి ఉన్న రైతులు సైతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులే. జిల్లాలోని 5 వేల మంది రైతులకు ఎకరం కన్నా తక్కువ భూమి ఉంది. దీంతో వారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు చెక్కులను తీసుకోలేదు. గుంట భూమి ఉన్న రైతుకు రైతుబంధు కింద రూ. 100 మాత్రమే వస్తుందనే ఉద్దేశంతో తీసుకోలేదు. ఇలాంటి రైతులందరూ వారి పట్టాపాస్‌పుస్తకాలు, బ్యాంకు అకౌంట్లు, ఆధార్ కార్డులు తెచ్చి ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారులకు అందజేయాలి. వారందరికీ ఏడాదికి రూ. 6వేల చొప్పున మూడు విడతల్లో డబ్బులు వస్తాయి. చిన్న, సన్నకారు రైతులందరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులకు డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు ఇస్తే ఐదు సంవత్సరాల పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు రైతు అకౌంట్లకే వస్తాయి. – పరశురాం, జిల్లావ్యవసాయశాఖ అధికారి -
ఒక దీపం చాలదా?
ఒకరోజు ఒక పేదవాడు ప్రవక్త ముహమ్మద్ (స) వద్దకు వచ్చి, ‘‘అయ్యా! నేను పేదవాడిని. నా కూతురు పెళ్ళీడుకు వచ్చింది. దయచేసి నా కూతురు పెళ్లికి ఏదైనా సహాయం చేయండి’ అని అడిగాడు. ‘‘బాబూ! ప్రస్తుతం నీకు సహాయం చేయడానికి నా వద్ద ఏమీ లేవు. నువ్వు ఒక పని చేయి, ఫలానావ్యక్తి దగ్గరకు వెళ్ళు. మీ అమ్మాయి పెళ్ళికి అవసరమైన సహాయం చేస్తాడు’’ అని సలహా ఇచ్చారు. ఆ పేదవాడు ప్రవక్త ముహమ్మద్ (స) తెలిపిన వ్యక్తి దగ్గరకు వెళ్ళే సమయానికి సాయంత్రం అయింది. ఇంట్లో నుండి ‘‘రెండు దీపాలు వెలిగించావు, ఒక దీపం చాలదా’’ అని భార్యతో ఆ పెద్దమనిషి అంటున్న మాటలు విని, ‘ఇంత పిసినారి నాకేం సహాయం చేస్తాడు’ అని మళ్ళీ తిరిగి ప్రవక్త (స) వద్దకు వెళ్ళి తాను విన్నది విన్నవించాడు. ప్రవక్త (స) మళ్ళీ ఆ వ్యక్తి వద్దకే వెళ్ళమన్నారు. అతడు తిరిగి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి తాను వచ్చిన విషయం విన్నవించాడు. ఆ పెద్దమనిషి ఇతన్ని ఎంతో ఆదరంగా ఆహ్వానించి, పెద్దమొత్తంలో డబ్బు సాయం చేశాడు. ఆ పెద్దాయన తాను ఆశించిన దానికన్నా ఎక్కువ సహాయం చేయడాన్ని చూసి ఆశ్చర్యపోతూ, ‘‘అయ్యా! ఇందాక మీరు రెండు దీపాలు వెలిగించినందుకు మీ భార్యను గద్దించారు. ఇప్పుడేమో నాకు నేను ఆశించిన దానికన్నా ఎక్కువ సహాయం చేశారు’’ అని అన్నాడు.‘‘నేను ఇలా పొదుపు చేయడం వల్లేకదా నీలాంటి వారికి సహాయం చేయగలిగాను. కాసిన్ని పుణ్యాలు సంపాదించుకోగలిగాను’’ అని సమాధానం ఇచ్చాడు ఆ పెద్దాయన. ‘‘వ్యర్థమైన ఖర్చులు చేయకండి. వ్యర్థమైన ఖర్చులు చేసేవారు సైతాన్ సోదరులు. సైతాన్ మీ బద్ధశత్రువు’’ (17: 27) అని ఖురాన్లో అల్లాహ్ చేసే హితబోధను మనమంతా పాటించి శాశ్వతమైన స్వర్గం కోసం పుణ్యాలు సమకూర్చుకునే సద్బుద్ధి ప్రసాదించు గాక. – షేక్ అబ్దుల్ బాసిత్ -
దేవునికి ఇష్టమైన కార్యం
ఒక ప్రాంతంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. చాలా ధనం ఉండటం వల్ల వేరే ఆలోచన లేక తింటూ, తాగుతూ సుఖాన్ని అనుభవిస్తుండేవాడు. ఆ ధనవంతుడి ఇంటి బయటనే లాజరు అనే ఒక బీదవాడు ఆకలికి అలమటిస్తూ ధనవంతుడు ఏమన్నా ఇస్తాడేమో అని ఆశగా ఎదురుచూస్తూ ఉండేవాడు. ఆ ధనవంతుడు భోజనం చేశాక తన పెదవులను రొట్టె ముక్కలతో తుడిచి వాటిని బయట పడవేస్తే ఆ రొట్టె ముక్కలతో కడుపు నింపుకునేవాడు లాజరు. కొంత కాలానికి ధనవంతుడు చనిపోయాడు. శరీరం ఇక్కడే ఉంది, ధనవంతుడు కదా! అంతిమ సంస్కారాలు బాగానే జరిగాయి. జనం కూడా బాగానే వచ్చారు. కానీ అతడు మాత్రం నరకంలో కళ్లు తెరిచాడు. అతని ధనం అతనికి సంతోషాన్ని ఇచ్చే స్థలాన్ని మాత్రం ఇవ్వలేదు. ఆ తరువాత బీదవాడైన లాజరు కూడా మరణించాడు. అతడు సంతోష కరమయిన స్థలంలో కళ్లు తెరిచాడు. ధనవంతుడు ధనవంతుడు కావడం వలన వేదనకరమయిన స్థలంలోనికి, లాజరు బీదవాడు కావడం వలన సంతోషకరమయిన స్థలం లోనికి వెళ్లలేదు. ప్రాణంతో ఉన్నప్పుడు తాము బతికిన దానిని బట్టి ఆ స్థలాలలోకి వెళ్లారని అర్ధమవుతుంది. తనకు ఆస్తి, ధనం ఉన్నప్పుడు ధనవంతుడు తన పక్కనే ఉన్న లాజరును పట్టించుకోలేదు. తన వరకు తాను తిని, తాగి సంతోషపడ్డాడు. దేవుడు ఒకరిని ధనవంతుడిగా లేదా బీదవాడిగా పుట్టించాడంటే ఎక్కడ పుట్టామో అక్కడ మనం మన భక్తిని కాపాడుకోవాలని! పక్కన ఒకరు ఆకలితో అలమటిస్తుంటే మనం అతడిని పట్టించుకోకుండా బతుకుతుంటే మనలను దేవుడు మెచ్చుకుంటాడా? బీదవాడు ధనవంతుడిని నిందించకుండా తన స్థితిని నిందించుకోకుండా తానున్న స్థితిలోనే భక్తిని కాపాడుకోవాలని లాజరు ద్వారా దేవుడు మనకు చెబుతున్నాడు. వేదన కరమయిన స్థలంలో ఉన్న ధనవంతుడు తన దాహాన్ని తీర్చమని.. లాజరుని పంపమని.. అబ్రహాముని అడిగినప్పుడు అబ్రహాము ‘‘నా కుమారుడా భూమి మీద నీవు నీకిష్టమయినట్టు బ్రతికావు’’ అని అంటున్నాడు అంటే భూమి మీద మన బతుకుని బట్టి మనకు స్థలం నిర్ణయించబడుతుందని అర్థమవుతుంది కదా. అందుకే. మన తోటి సహోదరునికి సాయం చేయాలి, సహోదరుడిని ప్రేమించాలి. అదే దేవుడికి ఇష్టమయిన కార్యం. -
దేవుడి పుస్తకం
అతను చాలా పేదవాడు. అయితేనేం, మానవత్వం మెండుగా ఉన్నవాడు. తను కష్టపడి సంపాదించినదానిలోనే తనకన్నా పేదలకు సాయం చేస్తుంటాడు. అనాథలకు, వృద్ధులకు సేవ చేస్తుంటాడు. ఓ రోజు రాత్రి అతను బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పుడు తెచ్చుకున్న ఆహారంలో అధికభాగం ఆకలితోఅలమటించిపోతున్న ఓ అభాగ్యుడికి ఇచ్చేశాడు. మిగిలింది తిని, మేనువాల్చగానే కళ్లు మూతలు పడ్డాయి. కాసేపటిలోనే గాఢనిద్రలోకి జారిపోయాడు. అర్ధరాత్రివేళ అద్భుతమైన సుగంధ పరిమళాన్ని మోసుకు వస్తున్న గాలి వీచింది. చంద్రుడి కాంతి లాంటి చల్లటి వెలుగేదో తన ఇంటిలో మెరుపులు సృష్టిస్తోంది. కళ్లు తెరిచి చూశాడు. అక్కడ ఒక దేవదూత కూర్చుని ఉంది. ఆమె తల వంచుకుని తన వద్ద ఉన్న పుస్తకంలో ఏదో రాసుకుంటోంది. ఆమె దగ్గరకి Ðð ళ్లి, ‘అమ్మా! ఎవరు మీరు? ఏమి రాస్తున్నారు?‘ అని అడిగాడు. ‘దేవుడంటే ఎంతమందికి ప్రేమ, భక్తి ఉన్నాయో తెలుసుకుని వారి పేర్లను ఈ పుస్తకంలో రాస్తున్నాను’ అని చెప్పిందామె. ‘ఆ పుస్తకంలో నా పేరు ఉందేమో చూసి చెప్పమ్మా!‘ అడిగాడు ఆత్రుతగా. వెంటనే పుస్తకమంతా వెదికి పెదవి విరిచిందామె. ‘అవునులే, ఎలా ఉంటుంది మరి, తోటి వారికి సాయం చేయడం, కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవడం.. అంతకు మించి నేను పూజలేమీ చేయను. కనీసం గుడికి కూడా వెళ్లనెప్పుడూ’’ అంటూ నిట్టూర్చాడతను. దేవదూత నవ్వుతూ వెళ్లిపోయింది. కొద్దిరోజుల తర్వాత మళ్లీ ఒక అర్ధరాత్రి అంతకుమునుపు కలిగిన అనుభవమే ఎదురైందతనికి. కళ్లు తెరిచి చూశాడు. అప్పుడు కనిపించిన ఆమే మళ్లీ ఏదో రాసుకుంటూ కనిపించింది. ఆమె చేతిలోని పుస్తకాన్ని అలాగే చూస్తున్నాడతను. ఈసారి అతనేమీ అడగకుండానే దేవదూత అతనివైపు చూసి నవ్వింది చల్లగా. ‘ఏంటి అలా చూస్తున్నావు, ఇది దేవుడు ప్రేమించే వారి పేర్లు ఉన్న పుస్తకం. చూస్తావా?’ అనడిగింది. ‘తప్పక చూస్తాను తల్లీ!‘ అంటూ అతను ఆ పుస్తకాన్ని అందుకున్నాడు. తన పేరు ఎలాగూ ఉండదని వెనకనుంచి అందులోని ఒక్కోపేజీ తిరగేస్తున్నాడు. తన పేరు ఎక్కడా కనిపించడం లేదు. కొంచెం బాధతోటీ, అపనమ్మకంతోటీ అలా తిరగేస్తూ మొదటిపేజీకి వచ్చాడు. ఆశ్చర్యం! అందులోని మొదటి పేరు తనదే! దేవుడిని అందరూ ప్రేమిస్తారు. కానీ దేవుడి ప్రేమను అందుకోవాలంటే ముందు మన తోటివారిని ప్రేమించగలగాలి. – డి.వి.ఆర్. -
ఆలన లేని పురపాలన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పాలన గాడినపడటం లేదు. జీహెచ్ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలోని మిగిలిన 72 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు అరకొర ఉద్యోగులతో నెట్టుకొస్తున్నాయి. జనాభాకు తగ్గట్లు మానవ వనరులు లేక పురపాలికలు స్థానిక ప్రజలకు కనీస సదుపాయాలు, మౌలిక సేవలు అందిం చ లేకపోతున్నాయి. ఈ క్రమంలో వచ్చే జూన్ 1 నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 71 పురపాలికలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ఉన్న 72 పురపాలికల్లో తీవ్ర ఉద్యోగుల కొరత ఉండగా, కొత్తగా ఏర్పాటు కానున్న పురపాలికలకు ఉద్యోగులను సర్దుబాటు చేయడంపై పురపాలక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. పురపాలికల్లో ప్రజలకు వేగంగా పౌర సేవలందించేందుకు ప్రభుత్వం సంస్కరణలను అమల్లోకి తీసుకువచ్చింది. అయితే, చాలా మునిసిపాలిటీల్లో సరిపడ సంఖ్యలో ఉద్యోగులు లేక ఈ సంస్కరణలు అమలు కావడం లేదు. పెండింగ్‌లోనే పోస్టుల భర్తీ ప్రతిపాదనలు నాలుగేళ్ల కింద కొత్తగా ఏర్పాటైన 11 నగర పంచాయతీల కోసం 1,100 కొత్త పోస్టులు సృష్టించాలని రాష్ట్ర పురపాలక శాఖ పంపించిన ప్రతిపాదనలు గత మూడేళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి. రెండేళ్ల కింద ఏర్పాటు చేసిన మరో 4 పురపాలికలకు అవసరమైన పోస్టులను సైతం ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీంతో ఇతర పురపాలికల నుంచి ఉద్యోగులను సర్దుబాటు చేశారు. పాత పురపాలికలకు మంజూరైన పోస్టుల్లో 26 గ్రేడ్–2 మునిసిపల్ కమిషనర్లు, 19 గ్రేడ్–3 మునిసిపల్ కమిషనర్ల పోస్టులతో పాటు ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, అకౌంట్స్ విభాగాల్లో వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో కొన్ని పురపాలికలకు ఇన్చార్జీ కమిషనర్లను ప్రభుత్వం నియమించింది. దీనికితోడు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న 71 మునిసిపాలిటీల్లో కనీసం 2,556 కొత్త పోస్టులను మంజూరు చేసి, భర్తీ చేయాల్సి ఉంది. -
ఇళ్లు చూపే అంతరాలు
ముంబైలో మురికివాడల ఉనికిని చాలామంది గుర్తించనప్పటికీ నగర ఆర్థిక వ్యవస్థకు బాగా దోహదం చేస్తున్న పలు పరిశ్రమలు అక్కడే ఉన్నాయన్న వాస్తవాన్ని మర్చిపోరాదు. నిజానికి మురికివాడలు లేకుంటే ముంబై స్తంభించిపోవచ్చు. విశ్లేషణ భూమ్మీద సంపన్నులు, పేదల మధ్య అంతరం మరీ కొట్టొచ్చినట్లు కనిపించే నగరం ఉందంటే అది ముంబైనే అని చెప్పాలి. దేశంలోనే అతి సంపన్నుడైన ముఖేష్ అంబానీ నివసిస్తున్న 27 అంతస్తుల నివాస భవనం ఇక్కడే ఉంది. 36 ఫ్లోర్లతో టెక్స్టైల్ టైకూన్ గౌతమ్ సింఘానియా నిర్మించిన భారీ భవంతీ ఇక్కడే ఉంది. అనిల్ అంబానీ 19 ఫ్లోర్ల భవనంలో ఉంటున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి చగన్ భుజ్‌బల్ తన కుటుంబం కోసం తొమ్మిదంతస్తుల భవంతి నిర్మించుకున్నారు. ఎంపీ, నటుడు శత్రుఘ్న సిన్హా ఏడు ఫ్లోర్లతో కూడిన నివాసంలో కుటుంబంతో ఉంటున్నట్లు తెలిసింది. ఈ సామాజిక శ్రేణిలో ఉంటున్న ఇతరులకు కూడా అద్భుత భవనాలు ఉన్నాయి కానీ పైన చెప్పిన ఆకాశ హర్మ్యాలు వీరికిలేవు. ఈ సంపన్నుల సంపదపై లేక వారి డాంబికాలతో నాకు పేచీ లేదు. కానీ ఇదీ కొన్ని పోలికలకు తావిస్తోంది. నందన్ నీలేకని రాసిన ‘ఇమేజింగ్ ఇండియా: ఐడియాస్ ఫర్ ది న్యూ సెంచురీ’ పుస్తకంలో ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా చెబుతున్న ధారవిలో ఉన్న తుక్కు, తోలు, రీసైక్లింగ్ పరిశ్రమ సంవత్సరానికి 1.7 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని సృష్టిస్తోందని తెలిపారు. ఇది అంబానీ నూతన గృహ నిర్మాణానికి పెట్టినంత వ్యయానికి సమానమని అంచనా. ఈ ఆకాశహర్మ్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా, కనిపించని గుడిసెలు ముంబైలో అధిక భాగంలో వ్యాపించి ఉన్నాయి. వర్ధిల్లుతున్న ఆర్థిక వ్యవస్థతో అతి పెద్దనగరంగా ముంబైకి ఉన్న ప్రతిష్టను ఇది పలుచబారుస్తోంది. మురికివాడల శ్రమతో ముంబై ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న తోడ్పాటును ఆర్థికవేత్తలెవరూ అర్థం చేసుకోలేదు. మురికివాడలు లేకుంటే ముంబై నగరం స్తంభించిపోవచ్చు. మురికివాడల పునరావాస ప్రాధికార సంస్థ ముంబై నగరంలో 12.5 లక్షల గుడిసెల్లో 62 లక్షల మంది గుడిసెవాసులు ఉన్నట్లు తేల్చింది. 1995కి ముందునుంచీ నగరంలో ఉన్న గుడిసె వాసులకు ఉచితంగా గృహాలను కల్పిస్తామని మొదట్లో చెప్పారు. తర్వాత దానిని 2000 సంవత్సరం వరకు పొడిగించారు. ఇక్కడ చెప్పొచ్చే అంశం మురికివాడల ఉనికి, నత్తనడకన నడుస్తున్న వాటి పునరావాసం మాత్రం కాదు. మురికి వాడలు, గుడిసెవాసుల పట్ల అనుసరిస్తున్న వైఖరి ఇక్కడ చర్చనీయాంశం. ఇటీవలే నగరంలోని అసల్ఫా మురికివాడ సుందరీకరణలో భాగంగా దాని వెలుపలి గోడలకు రంగులద్దారు. గుడిసెవాసుల జీవితాలకు కాస్త రంగులద్దడం అన్నమాట. కంటికి వికారంగా ఉండే వారి జీవితాలను పరోక్షంగా చిన్నచూపు చూసే చర్య ఇది. మురికివాడలకు వెలుపల ఉన్నవారు నగరంలో మురికివాడలు ఉన్నాయన్న విషయాన్ని నమ్మేందుకు కూడా ఇష్టపడరు. పైగా నగరాన్ని వృద్ధి చేయడంలో వారి పాత్రను గుర్తించాలని కూడా వీరు భావించరు. అనియత రంగంలో చాలాభాగం మురికివాడల నిర్వహణలోనే సాగుతోంది. మీ ఇళ్లలో పనిమనుషులు, మీ డ్రైవర్లు లాగే ఫైవ్ స్టార్ హోటల్స్‌లో వెయిటర్లు కూడా ఈ మురికివాడలకు చెందినవారే. చాలా సందర్భాల్లో వీరు నివసించే గుడిసెలు కుటుంబం మొత్తానికి కూడా 100 నుంచి 140 చదరపు అడుగులకు మించి ఉండవు. పునరావాసం కింద వీరికి కల్పిస్తున్న గృహాలు 225 చదరపు అడుగుల్లో ఉంటాయి. అంటే వారు ఇంతవరకు నివసిస్తున్న నివాస ప్రాంతం ఇప్పుడు రెట్టింపు అవుతుం దన్నమాట. కానీ ఇవి కూడా వారికి అందటం కష్టమే. ఎందుకంటే వీరికి గృహాలను నిర్మించి ఇవ్వవలసిన బిల్డర్లు, డెవలపర్లు మురికివాడల్లో నిర్మాణ హక్కులను పొందడమే కాకుండా అనుమతించిన మేరకు గుడిసె వాసులు కాని వారికి ఇలా కట్టిన గృహాలను అమ్ముకుం టారు. దీనికి వీరు గుడిసెవాసులకు డబ్బు చెల్లిస్తారు. గత రెండు దశాబ్దాల్లో ఉచితంగా 1.7 లక్షల మందికి గృహ నిర్మాణ పథకాలు మంజూరయ్యాయి. వీటిలో 1,441 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. కానీ ఇవన్నీ అమలై ఉంటే నగర గృహ కల్పన విధానంపై ఇది ప్రభావం చూపి పేదలకు మెరుగైన జీవితాన్ని అందించే అవకాశముండేది. ఇప్పుడు ప్రభుత్వం గుడిసెవాసులకు 322 చదరపు అడుగులలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తలుస్తోంది. ఈ అదనపు స్థలంలో కుటుంబాలు కాస్త సౌకర్యవంతంగా ఉంటాయి. మొదట్లో 100–140 చదరపు అడుగుల్లో ఉన్న స్లమ్ యూనిట్లు తర్వాత పునరావాసంలో 225 చదరపు అడుగులకు పెరిగాయి. తర్వాత వీటిని 269 చదరపు అడుగులకు పెంచారు. ఈ పెంపుదల ప్రభుత్వం ఉదారంగా తీసుకున్నది కాదు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 322 చదరపు అడుగుల పరిమితిని విధించింది మరి. అందుచేత, భూమి లభ్యతపైనే ఇంటి పరిమాణం ఆధారపడుతుంది. ముంబైలో ఇళ్లలో 10 శాతం మాత్రమే సగం జనాభా ఉంటున్న మురికివాడల స్వాధీనంలో ఉన్నాయి. అందుకే ముంబైలో కొన్ని అతి భారీ భవంతులు ఉండగా మరికొన్ని బతకడానికి మాత్రమే సరిపోయే పరిమాణంలో ఉంటున్నాయి. చివరకు మురికివాడలకు దూరంగా ఉండే ప్లాట్లలోని వారు కూడా ప్రధానమంత్రి అవాస్ యోజన పథకంలో తలపెట్టనున్న పరిణామం కలిగిన ఇళ్లలోనే నివసిస్తున్నారు. మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా.. నేను, ఒక అబ్బాయి 3 ఇయర్స్‌గా లవ్ చేసుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంటాం కానీ, అప్పుడప్పుడు క్యాజువల్‌గా గొడవలు అవుతుంటాయి. అన్నింటికీ తనే కాంప్రమైజ్ అయ్యి నన్ను కూల్ చేస్తుంటాడు. కానీ నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది చాలా న్యూస్‌లలో చూస్తున్నాం కదా.. తను కూడా అంతేనా? అనిపిస్తుంది. కానీ ఎప్పుడూ నాతో అలా ప్రవర్తించలేదు. పైగా మా నేపథ్యాలు వేరు. నేను బాగా చదువుతా. తను అంతగా చదవడు. ఇంకా తను మాకన్నా ఆర్థికంగా పూర్ కూడా. ఇవన్నీ నాకు అవసరం లేదు కానీ, ఇంట్లో ఒప్పుకోరు. మా డాడ్ చాలా స్ట్రిక్ట్. అందుకే కావాలనే చాలాసార్లు గొడవ పెట్టుకుని విడిపోదాం అన్నా. కానీ.. నా ఫ్యామిలీ గురించి ఆలోచించే ఇవన్నీ చేస్తున్నాని అర్థం చేసుకుని నాకు సర్దిచెప్పాడు. ఏం ఆలోచించకు మనం కలిసే అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. అలా తను నాకు నచ్చజెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజమే అనిపిస్తుంది. కానీ కొన్ని రోజులు గడిచేసరికి.. మళ్లీ మామూలుగా అయిపోతున్నా. మళ్లీ తనని విపరీతంగా బాధపెట్టేస్తున్నా. మా ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. దయచేసి సలహా చెప్పండి. – తులసి జంప్ చెల్లెమ్మా.. జంప్. ఇమ్మీడియట్లీ జంప్ వెరీ ఫాస్ట్... ‘సార్...’ ఆపు.. నువ్వు అంతగా ఫీల్ అవ్వొద్దు నీలాంబరి..! ‘సార్..’ వద్దు! ‘ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాయి సార్..’ ఎందుకు ఫీలింగ్? ‘అబ్బాయి పవిత్రంగా లవ్ చేస్తున్నాడు కదా సార్!’ అవునా? ‘అవునా ఏంటి అవునా.. మీ మనస్సుకు కళ్లు లేవు సార్ యు ఆర్ బ్లైండ్!!’ గుడ్డి మనసా నాదీ...? ‘ముమ్మాటికీ.. అదే అమ్మాయి... అబ్బాయి లేకుండా బతకలేను అని రాస్తే.. అబ్బాయిని ముప్పుతిప్పలు పెట్టేవారు. అమ్మాయి పేరెంట్స్ గురించి ఆలోచించి అబ్బాయిని లైట్ తీసుకుంటోంది కాబట్టి మీ ఫీలింగ్స్ బ్లైండ్‌గా సార్..’ నీ ఫీలింగ్‌లోనే ఆన్సర్ ఉంది.. అమ్మాయి పేరెంట్స్‌ని బాధ పెట్టకూడదు అనుకుంటోంది.. అలాంటప్పుడు జంప్ చెల్లెమ్మా.. జంప్!! ‘మీకు అరటిపండు జంప్.. జంప్ సార్!!’ ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
పేదలకు మెరుగైన వైద్యం అందించాలి
ఆస్పత్రి అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రత్యేకాధికారుల నియామకం కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ): నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు వైద్యులందరూ సమష్టిగా పని చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా కోరారు. శనివారం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో సూపరింటెండెంట్ ఛాంబర్లో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్), వార్డుల విభాగాధిపతుల సమావేశంలో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల నుంచి లక్షలాది మంది ప్రజలు జీజీహెచ్‌లో వైద్యం పొందేందుకు వస్తున్నారని, వీరికి సకాలంలో వైద్య చికిత్స అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తక్షణమే ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామన్నారు. పెరుగుతున్న జనాభాకనుగుణంగా ఆస్పత్రి అభివృద్ధి, వైద్య పరికరాలు, సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధుల మంజూరు, విధాన పరమైన నిర్ణయాల అమలుకు కలెక్టర్‌గా తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ సేవలను మరింత విస్త్రుతం చేయాలని కోరారు. సమాజంలో వైద్యులకు ఉన్న గుర్తింపు మరెవరికి లేదన్నారు. ప్రభుత్వ సేవకులుగా ప్రజలు మెచ్చేలా సర్వజనులకు వైద్యం అందించాల్సిన అవశ్యకత ఉందన్నారు. క్యాజువాలిటీకి రోగికి సంబంధిత వైద్య నిపుణులు పరిశీలించి చికిత్స అందించి, గంటలోపు అత్యవసర చికిత్స అందించి ఎమర్జెన్సీగా ఐసీయూ, వార్డులోకి తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, హౌస్సర్జన్లు, ఇంటర్న్లు,నర్సుల సమర్థ పనితీరుకు విధిగా ఈ బయోమెట్రిక్ హాజరు వి«ధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఈ విధానంలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆస్పత్రిలో నెలకొన్న మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను నెలకోసారి పర్యవేక్షించాలని జేసీని ఆదేశించారు. మూడు నెలలకోసారి హెచ్‌డీసీ సమావేశం జీజీహెచ్‌లో ప్రతీ మూడు నెలలకోసారి తప్పకుండా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెచ్‌డీఎస్ ఎప్పుడు జరిగిందని ప్రశ్నించారు. మార్చి 3, 2016 సంవత్సరంలో జరిగిందని సిబ్బంది బదులివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచిపద్ధతి కాదన్నారు.ఇక నుంచి ప్రతీ మూడునెలలకు సమావేశం జరగాలని ఆదేశాశించారు. నెలకోసారి జేసీ సంబంధిత హెచ్ఓడీలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.హెచ్‌డీఎస్‌లో ఇతర సభ్యుల నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకాధికారుల నియామకం జీజీహెచ్‌లో వైద్య చికిత్సల కోసం వస్తున్న రోగులకు సత్వరంగా వైద్య సేవలందించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పరిపాలనా సౌలభ్యం, జవాబుదారీతనం పెంపొందింపు, సేవల సరళీకృతం కోసం ప్రత్యేకాధికారులను నియమించారు.ఆసుపత్రిలో ఉన్న సుమారు 21వార్డులకు ఉన్న 14 మంది విభాగాధిపతులకు బాధ్యతలు అప్పగించారు. ఎమర్జన్సీ వార్డులోని క్యాజువాలిటీకి ప్రత్యేకాధికారిగా సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ మూర్తి, శానిటేషన్‌కు అసిస్టెంట్ ఆర్ఎంవో డాక్టర్ ప్రసాద్,ఆపరేషన్ ధియేటర్, జీజీహెచ్‌లో ఉన్న 8 ఐసీయూలు, సెంట్రల్ ల్యాబ్ వంటి విభాగాలకు ఒక్కో ప్రత్యేకాధికారులను కలెక్టర్ నియమించారు. సమాచారం అందివ్వండి రోగులకు మెరుగైన సేవలు అందించడం,వైద్య సదుపాయాల కల్పన కోసం ఆసుపత్రిలో లభిస్తున్న వైద్య సేవలు, యూనిట్ల,వైద్య పరికరాలు,వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, డ్రగ్స్ కొరతపై తక్షణమే రిపోర్టు తయారు చేసి తనకందజేయాలని కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావును ఆదేశించారు. ఆదాయ వనరులను సద్వినియోగం చేసుకోవాలి ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఆదాయ వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. ఏటా లక్షల్లో ఆదాయం వచ్చే సైకిల్ స్టాండ్ ఏర్పాటుకి ఉన్న అడ్డంకులు, రీటెండర్‌కు తక్షణమే చర్యలు తీసుకోవాలని జేసీ డాక్టర్ మలిఖార్జున్ని ఆదేశించారు. ఆసుపత్రికి ఆదాయం రాకుండా ఉన్న ఇతర వాటిపై సమగ్ర రిపోర్టు తయారు చేసి తనకందివ్వాలని ఆదేశించారు. టెస్ట్‌లో జాప్యం తగదు రంగరాయ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ లేబోరేటరీస్‌లో వైద్యులు సిపారసు చేసిన రోగ నిర్థారణ పరీక్షలు తీవ్ర జాప్యం చేసుకోవడంపై కలెక్టర్ ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ని ప్రశ్నించారు. టెస్ట్‌ల అనంతరం రిపోర్టు జారీ చేసేందుకు అయ్యే సమయాన్ని నిర్ణయించి , ఆవిధంగా రిపోర్టుల జారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. పరికరాల పరిస్థితిపై రెండు వారాలకోసారి రిపోర్టు ఇవ్వాలి రేడియాలజీలో ఉన్న పరికరాలతో పాటూ ఆసుపత్రిలో ఉన్న అన్ని రకాల వైద్య పరికరాలపై ప్రతీ పదిహేను రోజులకోసారి వాస్తవ పరిస్థితిని వివరిస్తూ రిపోర్టు అందజేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమన్నారు. నిపుణులు అందుబాటులో ఉండాలి ప్రెగ్నెన్సీ మహిళల ఆరోగ్య భద్రతరీత్యా గైనిక్ వార్డులో వైద్య నిపుణులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. హైరిస్క్,క్రిటికల్ ప్రెగ్నెన్సీ కేసులన్నీ జీజీహెచ్‌లోకి వస్తాయన్నారు.ఈ సమయంలో మిడ్వైఫ్లపైనే భారం వేయడం తగదని, నిపుణులు అందుబాటులో ఉండి తక్షణ చికిత్స అందించాలని కోరారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ ఏ మల్లిఖార్జున్, అసిస్టెంట్ కలెక్టర్ ఆనంద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మహాలక్ష్మిలతో పాటూ హెచ్ఓడీలు పాల్గొన్నారు. -
పేదలా? సంపన్నులా..? ఫేసే చెప్పేస్తుంది బాసూ!!
టొరంటో: ఫేస్ రీడింగ్ గురించి తెలిసిందే. ఎదుటి వ్యక్తి ముఖకవళికల ఆధారంగా అతను ఏమనుకుంటున్నాడో చెప్పేయడమన్నమాట. అయితే అదే ముఖాన్ని చూసి ఓ వ్యక్తి సంపన్నుడా? నిరుపేదా? అనే విషయాన్ని కూడా చెప్పవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. కెనడాలోని టొరంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కుటుంబ వార్షికాదాయం సగటున 75వేల అమెరికా డాలర్లు ఉండే వారిపై పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని వెల్లడించారు. కుటుంబ ఆదాయం 60వేల డాలర్ల నుంచి లక్షడాలర్ల వరకు ఉన్న కొంత మంది వ్యక్తుల ముఖచిత్రాలను వలంటీర్లకు చూపించారు. వారిలో ఎవరు పేదవారో, ఎవరు సంపన్నులో గుర్తించమన్నారు. 53 శాతం మంది కరెక్టుగా పేదవారిని, డబ్బున్న వారిని గుర్తించగలిగారు. ఒక వ్యక్తి ఆర్థిక స్థితిగతులు అతని ముఖకవళికలు, తోటివారితో మెలిగే విధానంపై ప్రభావం చూపుతాయిని తేలింది. మన ముఖం మన అనుభవాలను, భావోద్వేగాలను ప్రదర్శిస్తుందని శాస్త్రవేత్తల్లో ఒకరైన నికోలస్ రల్స్ చెబుతున్నారు. అంతేగాక మనం ఎవరిని చూసినా మొదటగా వారి ముఖం చూస్తామని, మన మెదడులోని న్యూరాన్స్ మన ముఖ కవళికలను గుర్తించేలా చేస్తాయని ఆయన తెలిపారు. -
పేదలకు సేవ చేయడం అదృష్టం
– పుట్టిన రోజు వేడుకల్లో ఎంపీ బుట్టారేణుక – పేద మహిళలకు చీరల పంపిణీ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పేదలకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు కర్నూలు ఎంపీ బుట్టారేణుక పేర్కొన్నారు. బుధవారం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ బుట్టా రేణుక..జన్మదిన వేడుకలను యువజన, విద్యార్థి విభాగాల అధ్యక్షులు రాజవిష్ణువర్దన్‌రెడ్డి, అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై..ఎంపీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బుట్టా రేణుక.. ముఖ్యఅతిథుల సమక్షంలో భర్త నీలకంఠం, కుమారుడు అమోగ్లతో కలసి 46 కేజీల కేకును కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. తరువాత వందమంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలను వృద్ధిలోకి తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తున్నాని తెలిపారు. ఎంపీ ల్యాడ్స్‌తో పలు గ్రామాల్లో మంచినీటి పథకాలు, రోడ్లు, మురుగు కాలువలను నిర్మించినట్లు వివరించారు. భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, లీగల్ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు కర్నాటి పుల్లారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయకుమారి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు టీవీ రమణ, నాయకులు కటారి సురేష్, సాంబ, పర్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
నెరవేరిన ‘ఆకాంక్ష’
- కిరాణ కొట్టు యజమాని కొడుకు సివిల్స్ విజేత – వి. సాయి వంశీవర్థన్కు 220 ర్యాంకు – రెండో ప్రయత్నంలో విజయం – జార్ఖండ్‌లో మావోల కిడ్నాప్‌నకు గురైన వంశీవర్థన్ – పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ లక్రా స్ఫూర్తితో సివిల్స్ – పేదరిక నిర్మూలన కోసం ఆకాంక్ష పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు కర్నూలు (సిటీ) : కృషి, పట్టుదల ఉంటే అత్యున్నత లక్ష్యాలను సాధించవచ్చని ఓ కిరాణ కొట్టు యజమాని కుమారుడు నిరూపించారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని అతను చాటిచెప్పారు. 2016 సివిల్స్ ఫలితాల్లో అతను ఏకంగా 220వ ర్యాంకు సాధించి తన ‘ఆకాంక్ష’ను నెరవేర్చుకున్నారు. కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయనిపేటకు చెందిన వి.సుధాకర్, వి.లక్ష్మిదేవి దంపతుల కుమారుడు వి.సాయివంశీవర్దన్..సివిల్స్‌లో మెరిశారు. చదువులో మొదటి నుంచి ముందంజలో ఉండటంతో అతనని.. తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. ప్రాథమిక విద్య వైఎస్ఆర్ జిల్లా జమ్ములమడుగు నుంచి మొదలైంది. ఇక్కడ 1 నుంచి 7వ తరగతి వరకు సెయింట్ మేరీస్ స్కూలు, 8 నుంచి 10వ తరగతి వరకు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీవాణి స్కూలులో చదివారు. ఇంటర్మీడియట్ నెల్లూరు నారాయణ కళాశాలలో ఎంపీసీ గ్రూపు చదివి 950 మార్కులు సాధించారు. 2010లో చిత్తూరు జిల్లాలోని విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2010లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయగా ర్యాంక్ రాలేదు. అనంతరం టాటా కన్సల్టెన్సీ సర్వీసులో 2010–12 వరకు ఉద్యోగం చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిన ఫెలోషిప్‌కు ఎంపికై.. రెండు సంవత్సరాల పాటు జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడి జిల్లాలో పని చేశారు. ఈ సమయంలో పరాస్నాథ్ కొండల్లో పర్యటిస్తుండగా.. నలుగురు మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అయితే 48 గంటల తర్వాత తిరిగి అతన్ని వదిలేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో పంజాబ్ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ లక్రాను స్ఫూర్తిగా తీసుకొని.. 2015 నుంచి సివిల్స్‌కోసం ఢిల్లీలోని వాదిరామ్ ఇన్సిట్యూట్‌లో శిక్షణ పొందారు. 2016 నోటిఫికేషన్ విడుదల కావడంతో సోషియాలజీ ఆప్షన్ పరీక్ష రాసి 220 ర్యాంకు సాధించారు. అనాథలను ఆదుకునేందుకు ఆకాంక్ష .. టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో స్నేహితులతో కలిసి పేద విద్యార్థులను, అనాథ పిల్లలను ఆదుకునేందుకు ఆకాంక్ష పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ కోసం పని చేస్తున్న సమయంలోనే పేదరికం నిర్మూలించాలంటే ఐఏఎస్ సాధించి సమాజానికి తమవంతుగా సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు సాయి వంశీవర్థన్ తెలిపారు. అక్క సౌజన్య, బావ ప్రసాద్‌లు తనకు ఆర్థికంగా సాయం చేశారని చెప్పారు. స్నేహితులు రమేష్, రాజేష్...సలహాలు సూచలు ఇచ్చేవారని తెలిపారు. ముత్యాల రాజు స్ఫూర్తి - సివిల్స్ 905 ర్యాంకర్ రవికాంత్ మనోగతం నంద్యాల: ఆంధ్రప్రదేశ్‌కే చెందిన 2007 బ్యాచ్ సివిల్స్ టాపర్ ముత్యాల రాజు తనకు స్ఫూర్తి అని సివిల్స్ ర్యాంకర్ గోవిందపల్లె రవికాంత్ అన్నారు. బుధవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 905 ర్యాంక్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ ర్యాంక్‌కు ఐపీఎస్, ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందని, మళ్లీ సివిల్స్ రాసి ఐఏఎస్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రోజూ 10 గంటలు చదివానని, మధ్యలో రిలాక్స్ కోసం ధ్యానం చేసేవాడినన్నారు. అమ్మ కృపమ్మ, నాన్న రాజు ఆశీస్సులతోనే తాను ఈ ఘనత సాధించానన్నారు. కుటుంబ నేపథ్యం రవికాంత్ తండ్రి రాజు రిటైర్డ్ కానిస్టేబుల్, తల్లి కృపమ్మ హెల్త్ సూపర్వైజర్. స్థానిక జ్ఞానాపురంలోని వైఎస్ ప్రభుదాస్‌రెడ్డి రోడ్డులో నివాసం ఉంటున్నారు. రవికాంత్ ఎన్జీఓ కాలనీలోని గుడ్‌షప్పర్డ్ స్కూల్లో 10వ తరగతి వరకు, హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్, వరంగల్‌లోని ఎన్ఐటీలో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత సివిల్స్‌లో ర్యాంకు సాధించడానికి ఏడాది పాటు హైదరాబాద్‌లోని రెండు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందారు. అనంతరం నెల్లూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఏడాది ఉద్యోగం చేసి మళ్లీ సివిల్స్ రాయడానికి రాజీనామా చేశారు. గత ఏడాది సివిల్స్‌లో ప్రిలిమినరీ, మెయిన్స్‌లో ప్రతిభ చూపినా ఇంటర్య్వూలో ఫెయిల్ అయ్యారు. దీంతో ఆయన మరింత పట్టుదలగా చదివి ప్రస్తుతం 905 ర్యాంకును సాధించారు. -
దటీజ్ అర్జమ్మ
నిరుపేద గిరిజన కుటుంబం నుంచి ఎస్సైగా ఎదిగిన వైనం చేయూతనందిస్తే దైన్నైనా సాధిస్తామని నిరూపిస్తున్నారు గిరిజనులు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి కుంజ దుర్గయ్య ఓ రికార్డు సృష్టించగా నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రతికూల పరిస్థితుల్లో ఎస్సై పోస్టును సంపాదించుకుంది పుడిగి అర్జమ్మ. స్ఫూర్తిదాయకురాలైన ఆమెగురించి తెలుసుకుందామా.. గంగవరం : కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులవుతారూ అన్నాడు వేటూరి. అది అక్షర సత్యమని నిరూపించింది పుడిగి అర్జమ్మ. ఆమె పుట్టింది ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. కూలిపనులు చేసుకొనే తండ్రి, అన్నదమ్ముల ప్రోత్సాహంతో ఆమె కష్టించి బాగా చదువుకొంది. ఇప్పుడు సివిల్ ఎస్సైగా ఎంపికై పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది అర్జమ్మ. కృషి, పట్టుదల, సాధన ఉంటే దేనినైనా సాధించగలరనడానికి ఆమె నిదర్శనంగా నిలుస్తోంది. గంగవరం మండలం ఏటిపల్లి గిరిజన గ్రామానికి చెందిన అర్జమ్మ ఏటిపల్లి ఎంపీపీ పాఠశాలలో ప్రాథమిక విద్య, రాజవొమ్మంగి గురుకులం పాఠశాలలో ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ చదివింది. టెన్త్‌లో 511 మార్కులు సాధించి పాఠశాల తృతీయ స్థానం, ఇంటర్లో 854 మార్కులతో కళాశాల ద్వితీయ స్థానాన్ని సాధించింది. ఆమె ప్రతిభను, పేదరికాన్ని గుర్తించిన పెద్దాపురానికి చెందిన ‘సూర్య ఫౌండేషన్’ డైరెక్టర్ కె. దామోదర్ అర్జమ్మ ఉన్నత విద్యకు సహకారాన్ని అందించారు. ఆయన ప్రోత్సాహంతో ఆమె బీటెక్ పూర్తి చేసింది. రంపచోడవరం వైటీసీ, భద్రాచలం వైటీసీలో గ్రూప్ 2 కోచింగ్‌కు తీసుకుంటూ ఎస్సై పరీక్షకు హాజరై మంచి ర్యాంక్‌ను సాధించి సివిల్ ఎస్సైగా ఎంపికయ్యింది. కుటుంబ నేపథ్యం తండ్రి పుడిగి చంటబ్బాయి. ఇద్దరు అన్నలు బాలేష్, రమణ, తమ్ముళ్లు వీరబాబు, శ్రీనుబాబు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. బాలేష్ గంగవరం, అడ్డతీగల వారపు సంతల్లో కూరగాయల వ్యాపారి వద్ద రోజు కూలీగా పని చేస్తున్నాడు. పేదలకు న్యాయం చేస్తా నా లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం సాధించి పేదలకు సేవలు అందించడం. కష్టించి కృషి చేస్తే దేనినైనా సాధించగలమనే నమ్మకం కలిగింది. నాకు విద్యను అందించిన గురువులకు, ప్రోత్సాహం అందించిన వారందరికి రుణపడి ఉంటా. ఏజెన్సీలో మంచి ప్రతిభా వంతులున్నారు. చాలామంది పేదరికంతో ఉన్నత చదువులకు వెళ్లలేక పోతున్నారు. అటువంటి వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే విజయాలు సాధించýగలరు. -అర్జమ్మ చాలా గర్వంగా ఉంది అర్జమ్మ చదువుకు ఎటువంటి అడ్డు చెప్పలేదు. ఎంతో కష్టపడి చదువుకొని నేడు ఈ ఉన్నత ఉద్యోగాన్ని పొందడం మా కుటుంబానికి ఎంతో గర్వంగా ఉంది. అర్జమ్మ ఉన్నత చదువుకు సహకారం అందించిన వారికి ఎంతో రుణపడి ఉంటాం. -చంటబ్బాయి, అర్జమ్మ తండ్రి -
గృహ నిర్మాణాల్లో వేగం పెరగాలి
– మంత్రి కాల్వ శ్రీనివాసులు కర్నూలు(అర్బన్): గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలని రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. శనివారం సాయంత్రం ఆయన స్థానిక కలెక్టరేట్లోని సమావేశ భవనంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో కలిసి గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 10 లక్షల మంది గృహ వసతి లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 40 శాతం గృహ నిర్మాణాలు కూడా పూర్తి కాలేదని, ఈ నెలాఖరు నాటికి కేటాయించిన లక్ష్యాల్లో 60 శాతం పూర్తి చేయాలన్నారు. ఇసుక, ఇతర ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లా 13వ స్థానంలో ఉందని, వచ్చే రెండేళ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి మొదటి స్థానంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు. ఎమ్మిగనూరు ప్రాంతంలో నాగులదిన్నె, వేముగోడు రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కలెక్టర్‌ను కోరారు. జోహరాపురం కాలనీలో నిర్మించిన గృహాల్లో లబ్ధిదారులు నివాసం ఉంటడం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కోరారు. సమావేశంలో కోడుమూరు ఎమ్మెల్యే ఎం.మణిగాంధీ, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, హౌసింగ్ పీడీ హుసేన్‌సాహెబ్, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు. -
పేదలకు అందని వైద్యం
► ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎంవీ రమణయ్య నెల్లూరు: మన రాష్ట్రంలో ప్రజారోగ్యం ఆందోళనలో ఉందని, పేదలకు సరైన వైద్యం అందడం లేదని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎంవీ రమణయ్య పేర్కొన్నారు. స్థానిక జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం పతనం అంచున ప్రజారోగ్యం అనే సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారి దేశాలైన ఇంగ్లాండ్, అమెరికాలో సైతం వైద్యం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తోందన్నారు. ఎంత పెద్ద అధికారి అయినా, ప్రజాప్రతినిధులైనా అక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. అయితే అందుకు విరుద్ధంగా మన దేశంలో వైద్యరంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను తగ్గిస్తున్నాయని ఆరోపించారు. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయకుండా, అత్యవసర మందులను ఏర్పాటు చేయకుండా, నాణ్యత కలిగిన వైద్యపరికరాలు అందుబాటులో ఉంచకుండా ప్రభుత్వ వైద్యాన్ని ప్రభుత్వమే నీరుగారుస్తోందని విమర్శించారు. కార్పొరేట్ వైద్యరంగానికి పెద్దపీట వేస్తూ వారికి రా యితీలు ఇస్తున్నారని తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వ వైద్యశాలలు సరిగాలేవనే ప్రచారాన్ని ప్రభుత్వమే కల్పి స్తుందని విమర్శించారు. తద్వారా ప్రభుత్వ వైద్యశాలలను అపోలోలాంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్నారు. ఇప్పటికైనా వైద్యం అనేది తమ హక్కు అని ప్రజలు డిమాండ్ చేయాలన్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, 24గంటల ఆస్పత్రులను బలోపేతం చేసి వైద్యరంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థూల జాతీయ ఉత్పత్తిలో 5 శాతం నిధులను వైద్యరంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్యం పరిరక్షణ, స్వచ్ఛమైన తాగునీరు అందించడం, దోమల నిర్మూలన తదితర వాటి ద్వారా 90 శాతం జబ్బులను నిర్మూలించవచ్చన్నారు. సదస్సులో ఆ వేదిక జిల్లా కన్వీ నర్ శ్రీనివాసరావు, జనవిజ్ఞాన వేదిక, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా తదితర ప్రజాసంఘాలకు చెందిన నేతలు పాల్గొని వైద్యం ప్రభు త్వ ఆధీనంలోనే ఉండాలని, అప్పుడే పేదవారికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. -
లక్ష్యం లేనివారే నిజమైన పేదలు
- బిషప్ పూల ఆంతోని - భక్తి శ్రద్ధలతో దివ్యసంస్కారాల దినం - జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు కర్నూలు సీక్యాంప్: ఎలాంటి లక్ష్యం లేకుండా జీవించే వాళ్లే నిజమైన పేద వారని అని కర్నూలు, అనంతపురం డయాసిస్ బిషప్ పూల ఆంతోని అన్నారు. నగరంలోని బిషప్ చర్చిలో ఆదివారం ఫాదర్ కోల విజయరాజు ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధల మధ్య దివ్యసంస్కారాల దినం జరిపారు. నగరంతో పాటు ఆదోని, నంద్యాల, ఆత్మకూరు, బనగానపల్లి, పత్తికొండ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతీ మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండాలని పూల ఆంథోని తన ప్రసంగంలో అన్నారు. లక్ష్యం లేకుండా బతికే వారే పేదలని, అంతే కానీ ధనం లేనివారు కాదన్నారు. జీవితం సముద్రం లాంటిదని, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకుని జీవించాలన్నారు. కార్యక్రమంలో క్రైస్తవులు దివ్యసంస్కారాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఫాదర్ జోజిరెడ్డి, లూర్ధయ్యబృందం, మరియ దళ సభ్యులు, యువకులు, సిస్టర్లు పాల్గొన్నారు. -
ధనిక, పేద తేడాతో వ్యవసాయ పన్ను!
రాష్ట్రాలను కోరిన ఆర్థిక సలహాదారు అరవింద్ న్యూఢిల్లీ: పేద, ధనిక రైతుల స్థితిగతులకనుగుణంగా రాష్ట్రాలు రైతులపై వ్యవసాయ ఆదాయ పన్ను భారం మోపాలని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సూచించారు. కేంద్రప్రభుత్వం రైతులపై ఆదాయపన్ను విధించకుండా రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందని, అయితే రాష్ట్రాలు ఆ పన్ను వేయకుండా ఎవరూ ఆపలేరని అరవింద్ చెప్పారు. ఒకవేళ అలాంటి పన్ను విధించాలని రాష్ట్రాలు భావిస్తే ఆ నిర్ణయాధికారం, అవకాశాలు 29 రాష్ట్రాలకూ ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. అయితే, ధనిక, పేద రైతులను గుర్తెరిగి పన్ను వేయాలని రాష్ట్రాలకు సూచించారు. వ్యవసాయ ఆదాయంపైనా ఖచ్చితంగా పన్ను వేయాల్సిందేనని నీతి ఆయోగ్ సభ్యుడైన బిబేక్ డిబ్రోయ్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. అయితే, అలాంటి పన్నును కేంద్రప్రభుత్వం విధించబోదని ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. వ్యవసాయ ఆదాయంపై పన్ను ప్రసక్తే లేదు: పనగరియా వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే ప్రశ్నే లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో వ్యవసాయ ఆదాయంపై పన్ను ఎలా విధిస్తామని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయ ఆదాయంపై కూడా పన్ను విధించాలన్న నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డెబ్రోయ్ వివాదాస్పద వ్యాఖ్యలపై శుక్రవారం సీఐఐ సదస్సు సందర్భంగా స్పందిస్తూ... దేశంలోని 80 శాతం గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయంతో ముడిపడ్డాయని పేర్కొన్నారు. -
ఉచితంగా ఎంసెట్, పాలిటెక్నిక్ కోచింగ్
కర్నూలు(అర్బన్): జిల్లాలోని నిరుపేద విద్యార్థులకు ఐఐటీ రామయ్య కళాశాలలో ఎంసెట్, పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 20 నుంచి ఉచితంగా కోచింగ్‌ను ఇస్తున్నట్లు ఎస్యూఆర్డీఎస్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు అవ్వారి విజయగౌరి, అవ్వారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం స్థానిక కళాశాలలో కోచింగ్‌కు సంబంధించిన కరపత్రాలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జే లక్ష్మినరసింహ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ప్రస్తుతం వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు కోచింగ్ తీసుకోవాలంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇలాంటి సమయంలో జిల్లాలోని పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడం సంతోషకరమన్నారు. అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 8519814337, 7702105119 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
శ్మశానం పక్కనే అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లల్లో
దుర్భర జీవితం గడుపుతున్న ఒడిశా వాసులు రైల్వే స్టేషన్లో బొగ్గు దింపుతూ పొట్టపోసుకుంటున్న వైనం 12 ఏళ్ల క్రితం రైల్వేస్టేషన్ నుంచి గౌతమినగర్ డి–బ్లాక్‌కు తరలింపు రెండు నెలల్లో ఇళ్లిస్తామన్న నేతలు 2012లో అర్హుల జాబితా సిద్ధం చేసిన తహసీల్దార్ అప్పటినుంచీ ఎదురుచూపులతోనే సరి మామూలుగా ఓ కుటుంబం సరైన గాలి, వెలుతురు వచ్చేలా ఇల్లు కట్టుకోవాలంటే కనీసం 100 గజాల స్థలమైనా ఉండాలి. అలాంటిది.. కేవలం 20 గజాల స్థలంలో.. అది కూడా శ్మశానం పక్కన ఇల్లంటే.. అందులో జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఒడిశా రాష్ట్రం కలహండీ జిల్లా నుంచి 60 ఏళ్ల క్రితం పొట్ట చేతబట్టుకుని రాజమహేంద్రవరం వచ్చిన వారంతా అటువంటి అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లల్లోనే.. దారుణమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం : ఒడిశా నుంచి వచ్చిన వారంతా ఒకప్పుడు రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్ పక్కనే గుడిసెలు వేసుకుని ఉండేవారు. ఆ ప్రాంతాన్ని స్థానికులు ఒడిశాపేటగా పిలిచేవారు. అక్కడ సుమారు 200 కుటుంబాలుండేవి. అక్కడివారంతా రైల్వే స్టేష¯ŒSకు వచ్చే బొగ్గు దింపే పని చేసుకుంటూ జీవించేవారు. 2006లో రైల్వే శాఖ తమ స్థలం ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో వారం రోజులపాటు వారు నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాల వద్ద రోడ్డు పైనే ఉన్నారు. చివరికి వారందరినీ హుకుంపేట పంచాయతీ గౌతమీ నగర్ డి–బ్లాక్‌కు తరలించారు. అక్కడ శ్మశానం పక్కన ఒక్కో కుటుంబానికి 20 గజాల స్థలం ఇచ్చారు. రెండు నెలల్లో అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని, అప్పటివరకూ అక్కడే ఉండాలని చెప్పారు. ఆ తరువాత క్రమంగా నేతలు, అధికారులు ఈ విషయాన్ని విస్మరించారు. అప్పటినుంచీ వారు అక్కడే 20 గజాల స్థలంలో చిన్న పాకలు వేసుకుని నివసిస్తున్నారు. కనీస సౌకర్యాలూ కరువు ఒక్కో కుటుంబంలో చిన్నా పెద్ద కలిపి ఏడుగురున్నా 20 గజాల స్థలంలోనే చాలీచాలని పరిస్థితుల్లో ఒడిశా వాసులు నివసిస్తున్నారు. డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్ల మధ్యలోనే మురుగు పారుతుంది. ఇక్కడ కనీసం మట్టి రోడ్లు కూడా లేవు. విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో చీకటిలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో ఆరుబయటకు వెళ్లేందుకు ఆడపిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ దీనావస్థపై వారు ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. స్నానం చేసేందుకు కనీస ఏర్పాట్లు చేసుకోలేని ఆర్థిక స్థితి వారిది. దీంతో మహిళలు, ఆడపిల్లలు కూడా ఆరుబయటే స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకస్దిఇ. ఒడిశా పేటగా పిలుస్తున్న ఆ ప్రాంతం వర్షం పడితే ముంపు బారిన పడుతోంది. వర్షం తగ్టిన తర్వాత కూడా దాదాపు వారం రోజుల వరకూ నీరు ఎటూ వెళ్లని పరిస్థితి. నీరు ఇంకేవరకూ రోడ్డుపైనే ఉండాల్సి వస్తోంది. 2012లో అర్హులను ఎంపిక చేసిన తహసీల్దార్ ఒడిశాపేటలో ఒడిశా కుటుంబాలతోపాటు రాజమహేంద్రవరం నుంచి వెళ్లిన స్థానికులు కూడా ఉన్నారు. చాలామంది ఒడిశా వాసులు స్వస్థలాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా 40 కుటుంబాలు మాత్రం గౌతమి నగర్‌కు వెళ్లాయి. వారితోపాటు స్థానిక పేదలు మరో 24 కుటుంబాలవారు వెళ్లారు. వారానికి రెండు రోజులు మాత్రమే ఉండే బొగ్గు దింపు పనే వారికి నేటికీ ఆధారం. నెలకు నాలుగైదు రోజుల పనితో వచ్చే రూ.2 వేలతో వారు జీవనం సాగిస్తున్నారు. మిగిలిన రోజుల్లో స్థానికంగా ఏదైనా పని ఉంటే వెళతారు. ఇక్కడ దుర్భర జీవితం సాగిస్తున్నవారికి ఇళ్లు ఇచ్చేందుకు 2012లో అప్పటి తహసీల్దార్ సర్వే చేసి 64 మందిని అర్హులుగా తేల్చారు. పూర్తి వివరాలతో వారి జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. అయితే అప్పటినుంచీ ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఇళ్ల కేటాయింపు జరగలేదు. తమ బతుకులు మార్చాలని నేటికీ ఉన్నతాధికారులు, రాజకీయ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వారికి ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ, అది ఇంతవరకూ నెరవేరలేదు. -
నీరు-చెట్టులోనైనా మెరక చేయలేదు!
డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి బిక్కవోలు (అనపర్తి) : నీరు-చెట్టు కార్యక్రమంలోనైనా పేదల స్థలాలు మెరక చేస్తారని ఆశించిన లబ్ధిదారులకు నిరాశే మిగిలిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. నిరుపేదలకు గృహాల కల్పనలో టీడీపీ అవలంబిస్తున్న జాప్యాన్ని నిరసిస్తు పార్టీ ఆధ్వర్యంలో బిక్కవోలులో గురువారం జరిగిన ర్యాలీకి విశేష స్పందన లభించింది. మామిడాడ రోడ్డులోని కాలనీ స్థలాల వద్ద జరిగిన సమావేశంలో లబ్ధిదారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. టీడీపీ అలసత్వం కారణంగా మౌలిక వసతుల కల్పనకు మంజూరు చేసిన నిధులు కూడా మురిగి పోయాయని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికైనా మౌనం వీడి నీరు-చెట్టులో జరిగిన వాస్తవాలు ప్రజల ముందుంచాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఆర్ఐ చల్లా సంధ్యారాణి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు యమసాని రవీంద్రపాపారెడ్డి, వంటమి సూర్యప్రకాష్, కోరుకొండ నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి యరకారెడ్డి సత్య, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి నల్లమిల్లి దుర్గావరప్రసాదరెడ్డి, బిక్కవోలు, అనపర్తి మండల పార్టీ కన్వీనర్లు వంగా రామగోపాలరెడ్డి, మల్లిడి ఆదినారాయణరెడ్డి తదితరలు పాల్గొన్నారు. -
అభివృద్ధికి బాటలేద్దాం పేదరికాన్ని తరిమేద్దాం
జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం - గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలి - పదేళ్ల తర్వాత మీ జిల్లా ఎలా ఉండాలో ప్రణాళిక రూపొందించండి - అనాథ పిల్లల బాధ్యత ఇక ప్రభుత్వానిదే.. - పది రోజుల్లో అసైన్డ్ భూముల సర్వే చేయాలి - ఏడాదిలోగా కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలు నిర్మించాలి సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రజలు ఓట్ల ద్వారా మాకిచ్చిన అధికారం... కలెక్టర్లుగా మీకు వచ్చిన అవకాశం.. అంతిమంగా ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలి. ఈ అవకాశం కొందరికే వస్తుంది. మనం కూడా వెయ్యేళ్లు బతకం. అందుకే అవకాశం ఉన్నప్పుడు కలకాలం నిలిచే విధంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి...’’అని సీఎం కేసీఆర్ అన్నారు. సమర్థ నాయకత్వం (ప్రొవైడింగ్ లీడర్ షిప్), ప్రజల్లో చైతన్యం(కౌన్సెలింగ్ ద పీపుల్), స్థానిక వనరుల గుర్తింపు(మ్యాప్ ద లోకల్ రిసోర్స్), ఆర్థిక వనరుల వినియోగం (ట్యాప్ ద వెల్త్ ) అనే నాలుగు ప్రాతిపదికలపై పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ‘‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలి. ఎస్సీ, ఎస్టీలలో గుణాత్మక మార్పు రావాలి. బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలి. చిన్న జిల్లాల ఏర్పాటు ఫలితం ప్రజలకు అందాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులను అవగతం చేసుకోవాలి. ప్రతి కుటుంబం జీవన స్థితి గతులను అధ్యయనం చేయాలి. పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలి. అంకితభావంతో పని చేస్తే అసాధ్యమేమీ కాదు. తెలంగాణ సాధనే అందుకు నిదర్శనం...’’అంటూ కలెక్టర్ల వెన్నుతట్టారు. ఆదివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్పీ సింగ్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కనకయ్య, వెంకటేశ్వర్లు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘కలెక్టర్లు బాగా పని చేస్తున్నారు. హాస్పిటళ్లు, హాస్టళ్లు సందర్శిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తే అనుకున్న లక్ష్యాలను తొందరగా అందుకుంటామనే నమ్మకం నాకున్నది’’అని ప్రశంసించారు. సమావేశంలో సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే.. పదేళ్ల తర్వాత మీ జిల్లా మీ జిల్లాకు ప్రణాళిక తయారు చేయండి. ఇప్పుడు మీ జిల్లా ఎలా ఉంది? పదేళ్ల తర్వాత ఎలా ఉండాలో మ్యాప్ రూపొందించండి. దాని ప్రకారం మనం పని చేద్దాం. వివిధ రంగాలకు సంబంధించి పదేళ్ల ప్రణాళిక రూపొందించాలి. ప్రత్యేక కార్యక్రమాలు.. ప్రత్యేకాధికారులు బీసీల అభివృద్ధి, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీఎంవోలో ప్రత్యేకాధికారులను నియమిస్తాం. గొర్రెలు, చేపల పెంపకంతో ఆయా కుల వృత్తులకు అవసరమైన చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సెలూన్లు, హైజనిక్ లాండ్రీల ఏర్పాటు, ఇతర కుల వృత్తులకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన జరుగుతోంది. సెలూన్ల పరిస్థితి మారాలి. గ్రామాల్లో చెట్ల కింద, బండల మీద కూర్చోబెట్టి కటింగ్, షేవింగ్ చేసే పరిస్థితి పోవాలి. హైజనిక్ సెలూన్లు రావాలి. ప్రభుత్వం వాటికి ఆర్థిక సాయం అందిస్తుంది. మానవ వనరులను గుర్తించి ప్రోత్సహించాలి. జనగామ–పెంబర్తిలో నగిషీ కళాకారులు, కరీంనగర్ పిలిగ్రీ ఆర్ట్స్‌లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వారున్నారు. ప్రతీ ప్రాంతంలో ప్రత్యేక నైపుణ్యమున్న మానవ వనరులను ప్రోత్సహించాలి. గొర్రెలను మనమే ఎగుమతి చేయాలి రాష్ట్రంలో 25 లక్షల మంది యాదవులున్నారు. గొర్రెల పెంపకంలో వారికి అపారమైన అనుభవముంది. కానీ ప్రతీ రోజూ 500 లారీల గొర్రెలు రాష్ట్రానికి దిగుమతి కావడం బాధాకరం. మన రాష్ట్రమే గొర్రెలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థితికి రావాలి. నీటి ప్రాజెక్టులు, కొత్త బ్యారేజీలు, రిజర్వాయర్లు, చెరువులు చేపల పెంపకానికి ఉపయోగించాలి. జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీల ప్లాన్ రాష్ట్ర జనాభాలో 16-17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు, 50 శాతం మహిళలు ఉన్నారు. ఎస్సీలను ఊరికి దూరంగా ఉంచారు. ఎస్టీలను తండాలు, గూడెంలకు పరిమితం చేశారు. మహిళలను వంటింటికి పరిమితం చేశారు. 75 శాతం మందిని ఉపయోగించుకోవట్లేదు. ఇంత పెద్దమొత్తంలో మానవ వనరులను ఉపయోగించుకోని దేశం ప్రపంచంలో మనదొక్కటే. ఈ రుగ్మతను పోగొట్టాలి. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. నిధులను క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం కల్పిస్తాం. జిల్లాల వారిగా ఎస్సీ, ఎస్టీ ప్లాన్ సిద్ధం చేయాలి. బడ్జెట్ ప్రవేశ పెట్టేలోగా ప్రతిపాదనలు పంపించండి. గ్రామాలకు వెళ్లినపుడు కలెక్టర్లు కచ్చితంగా దళితవాడలు, ఎస్టీ తండాలను సందర్శించాలి. మళ్లీ మన ఊరు–మన ప్రణాళిక మన ఊరు–మన ప్రణాళిక కార్యక్రమాన్ని మరోసారి నిర్వహించాలి. గ్రామాల్లో ఎవరెవరి పరిస్థితి ఎలా ఉంది? వారికి ఏ అవసరం ఉంది? అనే విషయాలపై వివరాలు సేకరించాలి. దశల వారీగా అందరి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు తయారు చేయాలి. లబ్ధిదారులను ఎంపిక చేయడానికి లాటరీ పద్ధతిని అనుసరించాలి. ‘క్లీన్’గ్రామాలకు అవార్డులు గ్రామాల్లో ‘క్లీన్ ద విలేజ్’అనే కార్యక్రమం చేపట్టాలి. కూలిపోయిన ఇళ్ల శిథిలాలు, ముళ్లపొదలు, చెత్తా చెదారం తొలగించాలి. పాడుపడ్డ బావులను, బోరు గుంతలు పూడ్చేయాలి. పరిశుభ్రతలో ఉత్తమంగా నిలిచిన గ్రామాలకు ‘కలెక్టర్ అవార్డు’పేరిట నగదు బహుమతి ఇవ్వాలి. దళిత కాలనీలు, గిరిజన తండాలకూ అవార్డు ఇవ్వాలి. గ్రామాల్లో ‘పవర్ డే’నిర్వహించాలి. వంగిన స్తంభాలు, వేలాడే తీగలను సరిచేయాలి. ప్రతీ గ్రామంలో డంపింగ్ యార్డుకు అవసరమైన స్థలం గుర్తించాలి. పది రోజుల్లో అసైన్డ్ భూముల సర్వే అసైన్డ్ ల్యాండ్స్ వివరాలు సేకరించాలి. అవి ఏ స్థితిలో ఉన్నాయి. ఎవరి వద్ద ఉన్నాయనే వివరాలతో పది రోజుల్లో సర్వే పూర్తి కావాలి. గ్రామాల్లో కమతాల ఏకీకరణ జరగాలి. అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైతే వాటిని స్వాధీనం చేసుకుని, నిరుపేదలకు అందించాలి. అసైన్డ్ భూముల్లో వ్యవసాయం సాగేలా చూడాలి. సాదాబైనామాల ద్వారా పట్టాలిచ్చే కార్యక్రమం త్వరగా ముగించాలి. పది రోజుల్లో కారుణ్య నియామకాలు కారుణ్య నియామకాలు పది రోజుల్లో చేపట్టాలి. భార్యా భర్తలు ఒకేచోట పని చేసేలా బదిలీలు చేయాలి. రిటైరైన రోజు ఉద్యోగులను ప్రభుత్వ వాహనంలో ఇంటి దగ్గర దించి రావాలి. బాగా పని చేసిన అధికారులను గుర్తించి తగిన బహుమానం ఇవ్వాలి. కలెక్టర్ల వద్ద రూ.5 కోట్లు ప్రతి కలెక్టర్ వద్ద రూ.5 కోట్ల చొప్పున పెడతాం. వారి దృష్టికి వచ్చే సమస్యలను తక్షణం పరిష్కారం చేసేందుకు ఈ డబ్బు వినియోగించాలి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించాలి. ఏడాదిలోగా అన్ని జిల్లాల కార్యాలయాలు, పోలీస్ కార్యాలయాల నిర్మాణం పూర్తి కావాలి. అనాథ పిల్లల సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వమే స్వీకరించాలి. వారికి ప్రత్యేక స్కూళ్లు ఏర్పాటు చేసి మంచి విద్య, వసతి కల్పించాలి. కుటుంబంలో మరొకరికి ఆసరా పెన్షన్ వచ్చినప్పటికీ... అదే కుటుంబంలోని బీడి కార్మికులకు భృతి ఇవ్వాలి. జిల్లాల్లో ఒంటరి మహిళలను గుర్తించి, వారికి భృతి అందించాలి. వెటర్నరీ సైన్స్ చదివిన గ్రాడ్యుయేట్లకు వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించి పశు సంవర్ధక శాఖను బలోపేతం చేయాలి. నిర్మాణాల వేగం ‘డబుల్’కావాలి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో వేగం పెరగాలి. స్థానికంగా ఇళ్లు కట్టే వారితోనే నిర్మాణం చేయించండి. ప్రతీ గ్రామంలో శ్మశాన వాటికలు నిర్మించాలి. వాటికి ‘వైకుంఠధామం’అనే పేరు పెట్టాలి. రోడ్డు మీద గుంతలుండకుండా చర్యలు తీసుకోవాలి. గుంతలు పూడ్చకుంటే సంబంధిత అధికారిపై చర్య తీసుకోవాలి. హరితహారం మొక్కలను రక్షించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పక్క రాష్ట్రాల నుంచి గొర్రెలు కొనాలి జిల్లాల సరిహద్దులోని రాష్ట్రాల నుంచి గొర్రె పిల్లలను కొనుగోలు చేయాలి. తెలంగాణలో కొనవద్దు. కరీంనగర్ ఎల్ఎండీ వద్ద ఫిషరీస్ కాలేజీ ఏర్పాటుకు స్థలం గుర్తించాలి. వరంగల్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. జనగామలో ఆత్మరక్షణ కోసం మహిళలకు సామూహిక శిక్షణ ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలను బాగా ఉపయోగించుకోవాలి. బీడీ కార్మికులు, నేత కార్మికులకు ఇళ్లు కట్టించే పథకం కింద కేంద్రం నుంచి నిధులు తేవడానికి ప్రతిపాదనలు పంపాలి. స్కూళ్ల యూనిఫారాలు స్థానిక దర్జీలే కుట్టేలా చూడాలి. ఆ నైపుణ్యం ఐఏఎస్‌లకు కూడా ఉండదు! ‘‘గొర్రెలన్నీ ఒకే తీరుగ కనిపిస్తాయి. కానీ ప్రతి గొర్రెను ప్రత్యేకంగా గుర్తించే నైపుణ్యం యాదవులకుంటుంది. ఏదైనా గొర్రె అనారోగ్యంతో బాధపడితే దాన్ని గుర్తించి వైద్యం చేయిస్తడు. ఇతరులు కూడా తమ గొర్రె పిల్లలను మేపడానికి యాదవులకు ఇస్తారు. ఈ గొర్రె పిల్లలు పెద్దయినంక అది ఎవరిదో గుర్తించి వారికి అందజేస్తారు. అనుభవమే వారికి చదువు. అలాంటి నైపుణ్యం ఐఏఎస్ చదివిన వారికి కూడా ఉండదు’’అని సీఎం కేసీఆర్ సరదాగా చెప్పడంతో సదస్సులో నవ్వులు పూశాయి. -
తడారని కళ్లు
ఆదుకోని ‘ఆపద్బంధు’ సీఎం సహాయ నిధి కరువు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో 31 దరఖాస్తులు ఆదిలాబాద్ అర్బన్ : కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న ఆపద్బంధు పథకం బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడవలేకపోతోంది. ఆపత్కాలంలోనూ వారిని ఆదుకోలేకపోతోంది. అయిన వారిని కోల్పోయి సహాయం కోసం కుటుంబ సభ్యులు చెమర్చిన కళ్లతో ఎదురుచూస్తున్నా వారికి నిరాశే మిగులుతోంది. బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందడం లేదు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి అండగా ఉండేందుకు దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి తన హయాంలో ఆపద్బంధు పథకం ప్రవేశపెట్టారు. కాలానుగుణంగా మారుతూ వచ్చిన ప్రభుత్వాలు పథకాన్ని పట్టించుకోకపోవడంతో బాధితులకు సాయం అందడం లేదు. ఫలితంగా లబ్ధిదారులకు చెల్లించే ఆర్థికసాయం నుంచి గతంలోనే ప్రభుత్వం వైదొలిగి.. ఓ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించడం పథకంపై ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ఏటా అక్టోబర్ 2నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ ఒకటి వరకు బీమా చెల్లింపు గడువు విధించి బీమా సంస్థల ద్వారా చెల్లింపులు చేస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఆర్థిక సాయం ఆలస్యమవుతోందని, ఇప్పటికైనా ప్రభుత్వమే నేరుగా అపద్భందు పథకం కింద ఆర్థికసాయం అందించాలని బాధిత కుటుంబాలవారు కోరుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల్లోని 18నుంచి 69ఏళ్లలోపు పోషకుడు, కుటుంబ పెద్ద చనిపోయినట్లయితే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం పొందవచ్చు. విద్యుత్‌షాక్, ప్రమాదం, పాముకాటు, ప్రమాదవశాత్తు నీళ్లలో మునగడం, అగ్ని ప్రమాదం తదితర కారణాలతో మరణిస్తే బాధిత కుటుంబ సభ్యులు ఈ పథకం ద్వారా సాయం పొందవచ్చు. రూ.50వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తోంది. తెల్లరేషన్ కార్డు ఉండి ఆమ్ ఆద్మీ బీమా పథకం, అభయహస్తంలో బీమా పొందిన వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలులేదు. కాగా.. ఏడాదిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 223 దరఖాస్తులు ఈ పథకం అధికారులకు అందాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, విచారణ జరిపిన అధికారులు అందులోంచి 192 మందిని అర్హులుగా తేల్చి మంజూరు చేశారు. మిగతా 31 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బాధితులు దరఖాస్తుతో పాటు సరైనా వివరాలు అందించకపోవడం, దరఖాస్తుల్లో తప్పులు దొర్లడం, పత్రాలు సరిగ్గా లేకపోవడం, డెత్ సర్టిఫికెట్లలో పొరపాట్లు ఉండడంతో దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. సరైనా వివరాలు అందిస్తే ఆర్థికసాయం మంజూరుకు ఏ ఆటంకాలు ఉండవని, వివరాలు సరిగ్గా లేకపోవడంతో కొంత ఆలస్యం జరుగుతోందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. పథకంపై అవగాహన శూన్యం ఆపద్బంధు పథకం కింద దరఖాస్తు చేసుకుని ఆర్థికసాయం పొందేందుకు ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించడంలేదనే ఆరోపణలున్నాయి. కొందరు దీనిపై అవగాహన లేకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. ప్రజల్లో దీనిపై ప్రచారం లేకపోవడంతో పథకం అమలుకు ఆటంకాలు కలుగుతున్నాయి. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి.. ఏయే వివరాలు అందించాలో.. తెలియక బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. దరఖాస్తు చేసేందుకు దూరప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పథకంపై ప్రజల్లో అవగాహన... బీమా అందించేందుకు అధికారులు తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కాటేసిన పేదరికం
- కూలీకి వెళ్లి విద్యుదాఘాతానికి బలైన నిరుద్యోగి - కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నద్ధమవుతుండగా ఘటన - ఇటీవలే వివాహనం కూడా నిశ్చయం - ఒక్కగానొక్క కొడుకు మృతితో గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు డిగ్రీ చదివిన ఓ యువకుడు కానిస్టేబుల్ కావాలని కలలు కన్నాడు. ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ప్రాథమిక పరీక్షలూ పాసయ్యాడు. మెయిన్ పరీక్షకు సిద్ధమవుతుండగానే తల్లిదండ్రులు పెళ్లి కూడా ఖరారు చేసేశారు. వచ్చే ఏడాది ఈ సమయానికంతా ఉద్యోగం సాధించి ఓ ఇంటి వాడైతే చూడాలని ఆ తల్లిదండ్రులు ఆశ పడ్డారు. అంతలోనే ఉపద్రవం. పేదరికం కారణంగా కూలికి వెళ్లిన కొడుకు విద్యుదాఘాతంతో మృతిచెండంతో గుండెలవిసేలా రోదించారు. - పాములపాడు మండల కేంద్రానికి చెందిన అబ్దుల్లా, ఉసేన్మీ దంపతుల కుమారుడు జాకీర్‌బాషా(22) డిగ్రీ వరకు చదువుకున్నాడు. కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతూ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో అప్పుడప్పుడు కూలీపనులకు వెళ్తూ తల్లిదండ్రులకు సాయం సహాయకారిగా ఉండేవాడు. అందులోభాగంగానే గురువారం నాగరాజుకు చెందిన రేకులషెడ్డు ఏర్పాటు పనులకు వెళ్లాడు. పైకప్పునకు రేకులు ఏర్పాటు చేస్తుండగా పైనే ఉన్నకరెంటు తీగలు ప్రమాదవశాత్తూ తగిలి కింద పడ్డాడు. తోటి కూలీలు వెంటనే స్థానిక ప్రైవేటు వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం ఆత్మకూరుకు తరలించారు. కాగా మార్గమధ్యలోనే మృత్యుడికి చేరాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకరరెడ్డి తెలిపారు. -
క్షురక క్షుద్బాధ!
- అందని సంక్షేమ పథకాలు - వెక్కిరిస్తున్న పేదరికం - పట్టించుకోని ప్రభుత్వం - అభివృద్ధి దూరంగా నాయీ బ్రాహ్మణులు వెలుగోడు: నాయీబ్రాహ్మణులు..పెళ్లి, పేరంటాలు, పూజా పునస్కారాలు, దినకర్మలు, క్షౌరవృత్తితో పాటు అనేక రకాల పనులు చేయడంలో నేర్పరులు. సమాజానికి ఎంతో మేలు చేసే వీరికి మాత్రం ప్రభుత్వం తగిన చేయూతనివ్వడం లేదు. కులవృత్తుల సంక్షేమ నిధి నుంచి వీరికి సాయం అందడం లేదు. వీరి ఎదుగుదలకు.. డోలు, సన్నాయి లాంటి పరికరాలు ప్రభుత్వం అందించడం లేదు. సబ్సిడీపై రుణాలు కూడా ఇవ్వడం లేదు. వారసత్వంగా వచ్చే శిక్షణతోనే వృత్తి సాగిస్తూ వీరు పస్తులతో కాలం గడపుతున్నారు. జిల్లాలో నాయీ బ్రాహ్మణ కుటుంబాలు 12,000 వరకు ఉన్నాయి. జిల్లాలో 70,000 మంది ఓటర్లు ఉన్నారు. అనేక వృత్తుల వారికి ప్రభుత్వం చేయూత ఇస్తోందని.. తమను మాత్రం గాలికి వదిలేసిందని వీరు ఆరోపిస్తున్నారు. అన్ని వృత్తుల మాదిరి తమనూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. వృత్తిలో భాగంగా వీరు అనారోగ్యాలకు గురవుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు పోషించుకోవడం, పిల్లల్ని చదివించుకోవడం కష్టంగా మారింది. అద్దె చెల్లింపులూ కష్టమే.. ఒకప్పుడు తిండిగింజల కోసం వీరు క్షవరం చేసేవారు. ప్రస్తుతం డబ్బుల కోసం వృత్తి కొనసాగిస్తూ కుటుంబాలను పోషించుకున్నారు. ఏడెనిమిది సంవత్సరాల నుంచి క్షవర వృత్తి కొత్తపుంతలు తొక్కుతోంది. జిల్లాలో 6వేల వరకు మంగలిషాపులు ఉండగా.. వివిధ రకాల కాస్మోటిక్స్‌తో వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఒక షాపు ఏర్పాటు చేయాలంటే కనీసం లక్షన్నర రూపాయల ఖర్చు అవుతోంది. ఇంకా మెరుగైన సౌకర్యాలతో ఏర్పాటు చేయాలంటే రూ.5లక్షలు ఖర్చు అవుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి అద్దె చెల్లించడం కష్టంగా మారింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ కుటుంబాలను పోషించుకోలేని దుర్భర స్థితిలో వీరు ఉన్నారు. అందని ప్రభుత్వ సాయం.. ఎన్టిఆర్ హయాంలో క్షౌర వృత్తిపై పన్ను విధించారు. దీన్ని నిరసిస్తూ అనేక ఆందోళనలు చేపట్టడంతో అప్పటి ప్రభుత్వం వెనక్కితగ్గింది. తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్షౌర సామగ్రి ఇప్పించారు. ఇది కులవృత్తుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చారు. తరువాత వైఎస్ఆర్.. మంగలిషాపులకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చారు. అయితే కిరణ్‌కుమార్ రెడ్డి సర్కార్ దానిని తొలగించింది. ఎన్నో రకాలుగా సేవలు చేసే నాయిబ్రాహ్మణలకు ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదు. ఇవీ డిమాండ్లు – నాయిబ్రాహ్మణులకు ప్రభుత్వం ఇతర కులవృత్తుల మాదిరిగానే అన్ని సౌకర్యాలు కల్పించాలి. – కులవృత్తుల కోటాకింద క్షౌరవృత్తి సామగ్రి అందించాలి. – ఉచిత విద్యుత్ సరఫరా చేయాలి. – ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూం పథకం కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. – వత్తి శిక్షణలో భాగంగా హర్మోనియం, సన్నాయి, డోలు లాంటివి ఉచితంగా ఇప్పించాలి. – ప్రతి గ్రామంలో భవనం నిర్మించి ఇవ్వాలి. మండల కేంద్రంలో ఒక భవనం ఉండాలి. -
పుట్టపర్తిలో పెళ్లి సందడి
పుట్టపర్తి అర్బన్ : లండన్‌కు చెందిన సత్యసాయి భక్తులు అనిల్ పటేల్ దంపతుల సహకారంతో పుట్టపర్తికి చెందిన చల్లా సోదరులు సాయిక్రిష్ణ, భీమరాజు, విజయసాయిల ఆధ్వర్యంలో గురువారం పర్తి సాయి ధర్మశాలలో సామూహిక ఉచిత వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 72 జంటలు పెళ్లి పీటలపై కూర్చున్నాయి. తొలుత బంగారు తాళిబొట్టు, గిన్నె బొట్టు, వెండి మెట్టెలు, పట్టు వస్త్రాలను అందజేశారు. బంధు, మిత్రుల సమక్షంలో పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య వధువుల మెడలో తాళి కట్టారు. ముఖ్య అతిథులుగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్.జె.రత్నాకర్ రాజు, డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి, పుడా చైర్మన్ సుధాకర్, నగరపంచాయతీ చైర్మన్ పీసీ గంగన్న, ప్రశాంతి గ్యాస్ సూర్యనారాయణ, అహ్మద్, మంగళకర ఏఓ ప్రకాష్, వైస్ చైర్మెన్ రాము తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనిల్ పటేల్ మిత్ర బృందం కూడా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులకు సామగ్రిని అందజేశారు. -
పెద్ద నోట్ల రద్దుతో పేదలకే ఇబ్బందులు
- నోట్లు చెల్లవని చెప్పే హక్కు ఎవరికీ ఉండదు - మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి ఆళ్లగడ్డ : ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను చెల్లుబాటు కావని చెప్పే హక్కు ఎవరికీ ఉండదని మాజీ ఎంపీ గంగులప్రతాపరెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నోట్లు విడుదల చేసే సమయంలో ప్రతి నోటుపై ఈ నోటు విలువ తగ్గకుండా చూసే బాధ్యత మాది అని ప్రమాణం చేసి రిజర్వు బ్యాంకు గవర్నర్ సంతకం ఉంటుందన్నారు. అంటే ఈ నోటు విలువతో ప్రభుత్వం బాండు రాసిచ్చినట్లేనని ఆయన పేర్కొన్నారు. అలాంటి నోట్లు చెల్లవని చెప్పేందుకు రాజ్యంగాం ప్రకారం ఎవరికీ హక్కు లేదన్నారు. దొంగనోట్లు తప్ప దేశంలో చెలామనిలో ఉన్న నోట్లన్నీ రిజర్వు బ్యాంకు ముద్రించినవేనని, ప్రతి నోటుకు నోటు బదులు ఇచ్చేందుకు కావలసినంత గడువు ఇవ్వాల్సిందేనన్నారు. సరైన ఏర్పాట్లు చేయకుండా నోట్లు రద్దు చేయడంతో సామాన్యులు నానా యాతన పడుతున్నారన్నారు. దేశంలో అత్యధికులు, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు, నిరక్ష్యరాస్యులేన్నారని, ఇలాంటి దేశంలో ఒక్కసారిగా మార్పు తీసుకురావాలనుకోవడం కుదరదన్నారు. ప్రజలు తిరగబడలేదు, వారిలో అలజడి లేదనుకుంటే పొరపాటన్నారు. ప్రజలు సహనం కోల్పోయి ఆగ్రహానికి గురైతే వారిని అదుపు చేయడం, వ్యవస్త చిన్నాభిన్నమైతే సరిదిద్దడం ఎవరితరము కాదనే విషయం తెలుసుకోవాలని గంగుల పేర్కొన్నారు. -
పేద వధూవరులకు వివాహం
తెనాలి: పట్టణంలోని శ్రీవాసవి సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం పేద ఆర్యవైశ్య వధూవరులకు వివాహం జరిపించారు. విజయవాడ వాస్తవ్యులు జల్లా వెంకటేశ్వర్లు, అన్నపూర్ణల కుమార్తె మాధవి వెంకట దుర్గ జ్యోత్స్నకు, నకిరికల్లు మండలం రూపినగుంట్లకు చెందిన సోము వెంకటేశ్వర్లు, శిరోమణి కుమారుడు శివరామాంజనేయులుకు వైశ్యవిద్యానిధి హాస్టలు ఆవరణలో వివాహం చేశారు. సంస్థ అధ్యక్షుడు చీమకుర్తి కృష్ణమూర్తి, కార్యదర్శి పెండేల సుబ్బారావు, మాడిశెట్టి గౌరేశ్వరరావు, కొణిజేటి వెంకటేశ్వరరావు, తాళ్లూరి లక్ష్మీనారాయణ, పెండేల వెంకటేశ్వర్లు, మద్ది రామకోటేశ్వరరావు, తాలిశెట్టి సుధాకరరావు, ఆలమూరి మురళి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రానికి రతన్ టాటా సూచన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన డీమానిటైజేషన్ పై ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూపు సారధి రతన్ టాటా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై స్పందించారు. ఇప్పటికే మోదీ ఆపరేషన్ బ్లాక్ మనీకి మద్దతు తెలిపిన టాటా ట్విట్టర్ ద్వారా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులుపడుతున్న ప్రజల కష్టాలను తగ్గించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలని కో్రారు. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో అత్యవసర వైద్యసేవలు అందక బాధలు పడుతున్న పేదల కోసం ప్రభుత్వం ప్రత్యేక సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతోపాటు తన సలహాలతో కూడిన ఒకనోట్ ను కూడా జత చేశారు. జాతీయవిపత్తులు సంభవించినపుడు చేపట్టే అత్యవసర సహాయక చర్యల్ని ఈ సమయంలో కూడా పేదలకు అందించాలన్నారు. నగుదును అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని అభినందించిన ఆయన సామాన్య మానవుడి నిత్యావసరాల గురించి మర్చిపోకూడదని సలహా ఇచ్చారు. అలాగే డీమానిటైజేషన్ కార్యక్రమం అమలుకు మరిన్ని ఆలోచనలు చేయాలన్నారు. కాగా నవంబరు 8న ప్రధాని ప్రకటించిన పెద్ద నోట్ల రద్దుకు మద్దతు తెలిపిన బడా పారిశ్రామిక వేత్తలో రతన్ టాటా ఒకరు. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధాని చేపట్టిన డీమానిటైజేషన్ చాలా మంచి నిర్ణయమనీ, ఇది నల్లధనాన్ని తుడిచిపెడు తుందంటూ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి మనందరి మద్దతు అందించాల్సిన అవసరం వుందంటూ గతంలో మోదీకి మద్దుతు పలికిన సంగతి తెలిసిందే. Some further thoughts on implementation of demonetization program. pic.twitter.com/RZdicKvFS7 — Ratan N. Tata (@RNTata2000) November 24, 2016 -
నోట్ల రద్దును టాటా ఎలా అభివర్ణించారో తెలుసా?
-
పేదల అభ్యున్నతికి కృషి
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు – పథకం ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కర్నూలు(అగ్రికల్చర్): పేదల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. అందులో భాగంగానే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారని చెప్పారు. మన జిల్లాకు 10వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరు అయ్యాయని ఆయన ప్రకటించారు. గురువారం కర్నూలు వెంకటరమణ కాలనీలోని పర్యాటక సంస్థకు చెందిన హరిత గెస్ట్‌హౌస్‌లో ఉజ్వల యోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. మొదటి రోజు 200 గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలు ఆధార్ నంబరు, బ్యాంకు పాసు పుస్తకం చూసిస్తే ఎలాంటి డబ్బు లేకుండా గ్యాస్ కనెక్షన్ ఇస్తారనా్నరు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ... మహిళల సంక్షేమం లక్ష్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. వంటకు కట్టెలను వాడటంతో మహిళల ఆరోగ్యంతో పాటు అడవులు దెబ్బతింటున్నాయని చెప్పారు. గ్యాస్ కనెక్షన్లు లేనివారు తహసీల్దారు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఐఓసీ ఏరియా మేనేజర్ మీరనాయర్ మాట్లాడుతూ... 18 ఏళ్లు పైబడిన నిరుపేద మహిళలకు సిలిండరు, గ్యాస్, రెగ్యులేటరు, లైటర్, పాస్ పుస్తకం ఉచితంగా ఇస్తామని తెలిపారు. గ్యాస్ స్టవ్‌కు రూ.990, గ్యాస్‌కు రూ.600 కేంద్రం లోన్ ఇస్తుందని తెలిపారు. లోన్ తీరే వరకు వీరికి గ్యాస్ సబ్సిడీ రాదని అది కేంద్రానికి వెలుతుందన్నారు. గ్రామాల్లోనే క్యాంపులు పెట్టి గ్యాస్ వినియోగంపై అవగాహన కల్పించిన తర్వాతనే కనెక్షన్లు ఇస్తామని వెల్లడించారు. సమావేశంలో డీఎస్ఓ తిప్పేనాయక్, ఐఓసీ సేల్స్ ఆఫీసర్ హరికృష్ణ, హెచ్ఓపీ సేల్స్ ఆఫీసర్ మురళీమోహన్, బీఓపీ టెరిటరీ మేనేజర్ దిలీఫ్, సేల్స్ ఆఫీసర్ సురేష్, గ్యాస్ డిస్ట్రిబ్యూటరీలు రమేష్‌గౌడు, శ్వేత, వెంకటేశ్వరరెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు ఉచిత న్యాయ సహాయం
– లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : రూ.లక్షలోపు ఆదాయం ఉన్న అల్పసంఖ్యాక వర్గీయులు ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని లోక్ అదాలత్ జిల్లా జడ్జి ఎంఏ సోమశేఖర్ ప్రజలకు సూచించారు. గురువారం బి.తాండ్రపాడులో సంగీతరావు ఎడ్యుకేషనల్ అకాడమి ఆధ్వర్యంలో ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..ఉచిత న్యాయ సాయాన్ని మతిస్థిమితం లేనివారు, పారిశ్రామిక కార్మికులు, మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు పొందవచ్చన్నారు. ఇందుకు న్యాయ సేవాధికార సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం గృహహింస, మహిళాసాధికారత చట్టాలపై ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు వాడాలా ప్రసాదు, ఆదినారాయణరెడ్డి, మధుబాబు, ఎస్సీ, ఎస్టీ సొసైటీ డైరక్టర్ రామాంజనేయులు పాల్గొన్నారు. -
ఏడాదిలో 12వేల కేసులు పరిష్కారం
- న్యాయానికి ధనిక, పేద తేడా లేదు - జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ. సోమశేఖర్ - నేడు జాతీయ న్యాయ సేవా దినోత్సవం కర్నూలు(లీగల్): సత్వరన్యాయం అందించడంలో భాగంగా నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌ల ద్వారా ఏడాది కాలంలో 12,194 కేసులకు పరిష్కారం లభించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎ.సోమశేఖర్ తెలిపారు. నవంబర్ 9న జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.అనుపమ చక్రవర్తి ఆధ్వర్యంలో ప్రజలకు విస్తృతంగా న్యాయసేవలు అందించడంలో భాగంగా గడపగడపకూ న్యాయ సేవలు–సలహాలు కార్యక్రమాన్ని వారం రోజులుగా కొనసాగిస్తున్నామన్నారు. పేదవారికి న్యాయం అందని ద్రాక్షగా కాకూడదనే నినాదంతో భారత రాజ్యాంగ నిర్మాతలు 39(ఎ) అధికరణాన్ని పొందుపరచడం, దాని మేరకు 1987లో చట్టం చేసి అక్టోబర్ 11 భారత రాష్ట్రపతిచే ఆమోద ముద్ర వేయబడిందన్నారు. 1995 నవంబర్ 9వ తేదీన చట్టాన్ని అమలులోకి తెచ్చారు. దీనిప్రకారం రూ. లక్ష లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరు ఉచిత న్యాయ సేవకు అర్హులన్నారు. అలాంటి వారికి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేయడం, కోర్టు ఫీజు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది నవంబర్ 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 690 లోక్ అదాలత్‌లు నిర్వహించి 12,194 కేసులు పరిష్కారం కాగా, అందులో 9,154 క్రిమినల్ కేసులున్నట్లు చెప్పారు. 1,052 మందికి కోర్టు ఫీజు మినహాయింపు ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా 169 మంది పారా లీగల్ వాలంటీర్లు, 108 మంది ప్యానల్ న్యాయవాదులున్నారని, 40 గ్రామాల్లో ఉచిత న్యాయ సేవా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామీణులకు న్యాయ సలహాలు అందిస్తున్నట్లు చెప్పారు. -
అర్హులందరికీ పక్కా ఇళ్లు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో అర్హత గల పేదలకు 29,568 గృహాలు మంజూరు నిమిత్తం సంబంధిత నివేదికను నవంబర్ 5 లోగా సిద్ధం చేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టరేట్లో తహసీల్దార్లు, హౌసింగ్ ఏఈలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ గృహ పథకం కింద 18 వేల ఇళ్లు మంజూరు నిమిత్తం సంబంధిత ఫైలు సిద్ధం చేయాలని, ఐఏవై పథకం కింద 6,272 గృహాలు అర్హత గల వారికి మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 5,296 గృహాలు మంజూరుకు నివేదికను సిద్ధం చేయాలన్నారు. జేసీ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ దీపం పథకం ద్వారా సర్వే పూర్తి చేయాలని 5వ తేదీ తరువాత సర్వే నిర్వహించేది లేదన్నారు. హౌసింగ్ పీడీ ఈ.శ్రీనివాసరావు, డ్వామా పీడీ డి.వెంకటరమణ, డీఎస్వో శివశంకర రెడ్డి పాల్గొన్నారు. -
డబ్బుతోపాటొచ్చే దరిద్రం ఏమిటో తెలుసా?
న్యూయార్క్: డబ్బూ, డబ్బూ, డబ్బూ....డబ్బుతోటిదే లోకం. డబ్బుంటే సకల సౌకర్యాలు కనుసన్నల్లోకి వస్తాయని భావించేవాళ్లు, పాపిష్టిది డబ్బు, ప్రపంచాన్ని పాపపంకిలం చేస్తుందని ఈసడించేవాళ్లూ ఉంటారు. సమస్యలను తీర్చే, సమస్యలను తెచ్చే డబ్బు గురించి ఎవరి అనుభవాలనుబట్టి వారు నిర్వచనాలు ఇస్తుంటారు. డబ్బుతోబాటు డాబు, దర్పం వస్తుందని, దాన్ని వెన్నంటే స్వార్థం, పిసినారి తనాన్ని కూడా మూటగట్టుకొస్తుందని ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ పలు శాస్త్రీయ అధ్యయనాల ద్వారా నిరూపించింది. డబ్బున్న మారాజులు విందు, వినోదాల్లో తేలిపోవచ్చుగానీ వారికి సామాజిక జీవితం తక్కువని, ఎక్కువ శాతం వారు ఒంటరిగానే గడుపుతారని, అదే డబ్బులేని పేదవాళ్లు ఎక్కువగా సామాజిక జీవితం గడుపుతారని, అంటే బంధు, మిత్రులతో సుఖ సంతోషాలు పంచుకుంటారని ఈ అధ్యయనాల్లో తేలింది. తోటివారు ఏమైనా చెబుతుంటే దండిగా డబ్బున్న వాళ్లు వారి మాటలు వినిపించుకోకుండా ఎక్కడో ఆలోచిస్తుంటారు. అదే మధ్యతరగతి వాళ్లు తోటి వాళ్లు తమ కష్ట సుఖాల గురించి వివరిస్తుంటే అసహనంగా కదులుతూ మొబైల్ ఫోన్ లేదా పేపరు చూస్తూ అప్పుడప్పుడు మాత్రమే తలాడిస్తూ ఉంటారు. ఇక తక్కువ ఆదాయం కలిగిన కష్ట జీవులు తమ కష్టాల గురించి ఏకరువు పెడుతుంటే రెప్ప వాల్చకుండా చెప్పేవారి కళ్లలోకి చూస్తూ తలాడిస్తుంటారు. దయతో వారి మాటలను అర్థం చేసుకుంటారు. మొత్తంగా డబ్బున్న వారిలో ఔదార్యం మరీ తక్కువగాను, మధ్య తరగతి కుటుంబాల్లో కాస్త ఎక్కువగాను, దిగువ తరగతి పేదల్లో మరీ ఎక్కువగాను ఉంటుందని సామాజిక ప్రయోగాల ద్వారా తేల్చారు. కాయకష్టం చేసుకొని బతికే పేదవాళ్లలోనే తొటివారికి సేవచేయాలనే పెద్ద మనసు ఉంటుందని, వారు ఎక్కువ సామాజిక జీవితాన్ని గడపడం ద్వారానే వారికి ఈ గుణం అబ్బిందని అధ్యయనంలో వెల్లడైంది. పాత, చౌక కారును నడిపే యజమానులు బాటుసారులు రోడ్డు దాటుతున్నప్పుడు ఎక్కువసార్లు ఆగి, వారు దాటాకనే కారు నడుపుతారని, ఖరీదైన కార్లలో వెళ్లేవాళ్లు బాటసారుల కోసం కారును ఆపకుండా వీలైనంత వరకు దూసుకెళ్లేందుకే ప్రయత్నిస్తారని మరో అధ్యయనంలో రుజువైంది. దీన్నిబట్టి ఎక్కువ డబ్బున్నవారి, తక్కువ డబ్బున్న వారి మనస్తత్వం తీరును అర్థం చేసుకోవచ్చు. డబ్బున్న వారే ఎక్కువ మోసాలకు పాల్పడతారని, వారిలో చోర గుణం (స్టడీస్ ఆఫ్ షాప్లిఫ్టింగ్లో పేర్కొన్న అంశాల ప్రకారం)కూడా ఎక్కువగానే ఉంటుందట. డబ్బుకు సంబంధించిన ఓ వీడియో గేమ్‌ను డబ్బున్న వాళ్లతో, డబ్బులేని వాళ్లతో ఆడించగా డబ్బున్న వాళ్లు ఆ గేమ్‌లో మోసానికి పాల్పడ్డారు. వారిలో ఎక్కువ మంది పన్ను ఎగవేసేవారు ఉన్నట్లు కూడా తేలింది. అంతేకాకుండా తక్కువ డబ్బున్న వారే తమ డబ్బులో ఎక్కువ శాతం సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఇస్తున్నట్లు, ఎక్కువ డబ్బున్న వాళ్లు సామాజిక కార్యక్రమాలకు అతి తక్కువ విరాళాలు ఇస్తున్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. ప్రజల మధ్య ఎక్కువ ఆర్థిక అసమానతలున్న దేశాల్లో ధనవంతుల్లో దుర్మార్గం ఎక్కువ, ఔదార్యం తక్కువగా ఉందని, తక్కువ ఆర్థిక అసమానతులున్న దేశాల్లో ధనవంతుల్లో ఔదార్యం ఎక్కువగా ఉందని కూడా అధ్యయనకారులు సూత్రీకరించారు. ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో సామాజిక సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జీవన ప్రమాణాలు, జీవించే ప్రామాణిక కాలం, ఆరోగ్య వసతులు తక్కువ. శిశు మరణాలు ఎక్కువ. ప్రజల మధ్య పరస్పర విశ్వాసం పాళ్లు, సంతోషం పాళ్లు తక్కువే. అందుకే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల మాట్లాడుతూ సమకాలీన సమాజంలో ఆర్థిక అసమానతులను అధిగమించడమే అసలైన సవాల్ అని అన్నారు. అందరికి నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, పన్నుల వ్యవస్థను సరళీకరిస్తుందని ఆయన చెప్పారు. -
గ్రామీణ ఇంటి పథకంపై విసృత ప్రచారం
కర్నూలు(హాస్పిటల్): ఎన్టీఆర్ గ్రామీణ ఇంటి నిర్మాణ పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, డ్వామా పీడీ పుల్లారెడ్డి ఆదేశించారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకంపై మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకం కింద 1.50లక్షలు, రూ.2లక్షల అంచనాతో పేదలకు హౌసింగ్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉపాధి నిధులతో ఇంటినిర్మాణాలు చేపడతారన్నారు. రూ.1.50లక్షల స్కీమ్‌లు జిల్లాకు 11వేలు, రూ.2లక్షల స్కీమ్‌లో 15వేల ఇళ్లను కేటాయించారన్నారు. ఉపాధి నిధుల కింద ప్రతి ఇంటికి 90 రోజుల పనిదినాలు ఇస్తారన్నారు. 90 రోజుల ఉపాధి పనిదినాలకు రూ.17,460 అందజేస్తారన్నారు. ఇంటి నిర్మాణానికి మహిళా సమాఖ్యలచే తయారు చేసిన ఇటుకలను ఉచితంగా పంపిణీ చేస్తారన్నారు. ఈ మేరకు ప్రతి మండలానికి ఒక నిర్మిత కేంద్రాన్ని మహిళా సంఘాలకు కేటాయిస్తారన్నారు. వీరు తయారు చేసే మూడు రకాల ఇటుకలపై ఉపాధి లోగో ఉంటుందన్నారు. దంతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్లకు 12వేలు అందిస్తారు. మిగిలిన మొత్తాన్ని హౌసింగ్ వారు అందజేస్తారని తెలిపారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్, హౌసింగ్ పీడీ రాజశేఖర్, డ్వామా ఏపీడీ మురళీధర్, డీఆర్డీఏ ఏపీడీ శివలీల తదితరులు పాల్గొన్నారు. -
వీధినపడిన పేద కుటుంబాలు
ఇద్దరిని మింగిన విద్యుత్ స్తంభాలు బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు దమ్మపేట : పేదింట పెను విషాదం.. మృత్యువు విద్యుత్ స్తంభాల రూపంలో ఆ కుటుంబాలను ఛిన్నాబిన్నం చేసింది.. దీంతో ఆ రెండు కుటుంబాలు రోడ్డునపడ్డాయి. దమ్మపేట మండలం నాగుపల్లికి చెందిన లకావత్ చిట్టెయ్య, దారావత్ మహేష్ బుధవారం రాత్రి వ్యవసాయ భూమిలో దుక్కి దున్నేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం విరిగిపడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో నాగుపల్లి బంజార కాలనీలో విషాదాన్ని నింపింది. అదే కాలనీకి చెందిన లకావత్ చిట్టెయ్యకు ఎకరం మెరక భూమి ఉంది. అదే అతడి కుటుంబానికి జీవనాధారం. అతడికి పెళ్లీడుకొచ్చిన కూతురు, నిత్యం అనారోగ్య సమస్యలతో బాధపడే కుమారుడున్నాడు. చిట్టెయ్య తనకున్న ఎకరం భూమిలో వర్షాధార పంటలు సాగు చేసుకుంటూ.. కూలీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిట్టెయ్య సోదరుడు గతేడాది మొండివర్రెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఇద్దరు కొడుకుల మరణంతో తండ్రి భద్రు అనాథగా మిగిలాడు. మహేష్ నేపథ్యమిది.. నాగుపల్లికి చెందిన దారావత్ మహేష్ అవివాహితుడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచే స్తూ.. తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. బుధవారం రాత్రి నాగుపల్లిలో జరిగిన దుర్ఘటనలో మహేష్ మృత్యువాతపడ్డాడు. మహేష్ మరణంతో అతడి కుటుంబం ఆధారం కోల్పోయింది. ఊరి జనంతో సరదాగా ఉండే ఇద్దరు ఒకేసారి మరణించడంతో నాగుపల్లి అంతటా విషాదం నెలకొంది. -
పేదలను ఆదుకోండి
అర్వపల్లి నిలువ నీడ లేక అవస్థలు పడుతున్న పేదకుటుంబాన్ని ఆదుకునేందుకు సత్వరమే చర్యలు ప్రారంభించాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గోడ దాపున రేకుకింద దుర్భర జీవితం అనుభవిస్తున్న నీరజ కుటుంబంపై ‘అభాగ్యులను ఆదుకోరు’ అనే శీర్షికన ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. కథనాన్ని చూసిన కలెక్టర్ సత్యనారాయణరెడ్డి చలించిపోయి వెంటనే సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి, స్థానిక తహసీల్దార్ పులి సైదులులకు ఫోన్‌చేసి వారిని ఆదుకోవడానికి ఏం చేయాలో చూడాలని ఆదేశించారు. అలాగే తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ కూడా గ్రామాన్ని సందర్శించి కష్టాలో కొట్టుమిట్టాడుతున్న సట్టు నీరజ కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. నిలువ నీడలేక రేకుల సందులో తలదాచుకుంటున్న ముగ్గురు కుటుంబ సభ్యులను చూసి చలించిపోయారు. ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థికసాయం చేస్తానని ప్రకటించారు. ఆనారోగ్యం పాలైన నీరజకు తగిన వైద్యం అందించాలని తుంగతుర్తి క్లస్టర్ వైద్యాధికారి డాక్టర్ కోటా చలం, నాగారం వైద్యాధికారి శివప్రసాద్‌ను ఆదేశించారు. వారం రోజుల్లో రెండు గదుల ఇంటిని నిర్మిస్తామని తహసీల్దార్ పులి సైదులు తెలిపారు. అలాగే అంత్యోదయ కార్డును మంజూరు చేస్తున్నట్లు తహసీల్దార్ చెప్పారు. ఇంటి నిర్మాణం కోసం 20బస్తాల సిమెంట్‌ను అందజేస్తున్నట్లు తిరుమలగిరి చెందిన కాంట్రాక్టర్ బర్ల వెంకన్న చెప్పారు. తాత్కాలికంగా కుటుంబ ఖర్చుల కోసం తహసీల్దార్ పులి సైదులు, రూ. 1000, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుండగాని అంబయ్య, రూ. 1000నగదును నీరజ కూతురు హరిచందనసిరికి అందజేశారు. వీరితో పాటు పలువురు దాతలు ఆకుటుంబాన్ని ఆదుకోవడానికి సాయంచేస్తామని ప్రకటించారు. అమెరికా, ఆస్ట్రేలియా, హైదరాబాద్‌లకు చెందిన పలువురు దయగల మారాజులు సాయం చేస్తామని ఫోన్లో తెలియజేశారు. ఇదిలా ఉంటే నీరజ కుటుంబానికి ఇంటి నిర్మాణ పనులను ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభించాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ నారాయణరెడ్డి తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ పాశం విజయ, ఎంపీపీ దావుల మనీషా, ఎంపీడీఓ బి.శిరీష, సర్పంచ్ శీల స్వరూప, గుండగాని అంబయ్య, కళ్లెట్లపల్లి శోభన్‌బాబు, ఉప్పలయ్య, ఎమ్మారై సంద శ్రీరాములు, వీఆర్ఓ బాలసైదులు, పంచాయతీ కార్యదర్శి రవీందర్‌రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ యల్లమ్మ, ఉమ్మల్రెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ మంగమ్మ, పాష, చింతల వీరయ్య, శీల కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
పేదల గుండెల్లో వైఎస్
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన నిరుపేదలు ఆరోగ్యశ్రీతో ఆదివాసీలకు వైద్యం గిరిపుత్రులకు అటవీ హక్కు పత్రాలు 4.52 లక్షల మంది రైతులకు రూ.2,150 కోట్ల రుణ మాఫీ వైఎస్ వర్థంతి సందర్భంగా స్మరించుకుంటున్న జిల్లా ప్రజలు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి.. వారి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నాడు. తన పాలనలో ఏ పేద విద్యార్థులు చదువుకు దూరం కావద్దన్న ఆలోచనతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీని, ప్రతి ఒక్కరి ఇంటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను, ఆసరగా ఉండేందుకు పింఛన్లు.. ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. తన హయాం స్వర్ణ యుగమని చెప్పుకునేలా చేశారు. నేడు వైఎస్ 7వ వర్థంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ జిల్లా ప్రజలు నివాళులర్పిస్తున్నారు. గూడు లేని నిరుపేదలకు వైఎస్ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఓ వరంలా మారింది. వైఎస్ అధికారం చేపట్టిన తర్వాత ఇందిరమ్మ పేరుతో మూడు విడతల్లో జిల్లాలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇంటి నిర్మాణ వ్యయం పెంచి, అడిగిన వారందరికీ ఇళ్లు మంజూరు చేశారు. లబ్ధిదారులు నిర్మాణాలను వేగంగా కట్టుకోవడానికి బిల్లులు సైతం చెల్లించారు. జిల్లాలో ఇందిరమ్మ పథకం ద్వారా 2,69,610 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 2.15 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఆదివాసీలకు పోడుపై హక్కును కల్పిస్తూ వైఎస్ ప్రభుత్వం పత్రాలు పంపిణీ చేసింది. ‘‘ఏళ్లతర బడి పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు.. ఇక నుంచి దొంగల్లా కాకుండా దొరల్లా బతకండి’’– 2009 ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున భద్రాచలంలో గిరిజనులకు హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో నాటి సీఎం వైఎస్సార్ అన్న మాటలివి. నాడు హక్కు పత్రాలు పొందిన గిరిజనులు తమ పోడు భూముల్లో మాగాణి పంటలు పండించుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 691 గ్రామాలకు చెందిన 31,961 మంది గిరిజనులకు లబ్ధి చేకూర్చేలా 2.10 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలను ఇచ్చేందుకు వైఎస్ ఆమోద ముద్ర వేశారు. ఆయన ఆదేశాలతో 2008 నుంచి 2010 వరకు జిల్లాలోని 38 ఏజెన్సీ మండలాల్లో డీఎల్సీ ఆమోదం పొందిన 2.10 లక్షల ఎకరాలను అధికారులు పంపిణీ చేశారు. కొత్తగూడెం పట్టణంలో నివసిస్తున్న వారికి తాము నివసిస్తున్న ఇంటిపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ 373 జీఓ ఇచ్చారు. సింగరేణి సంస్థ ఏర్పాటుతో 120 ఏళ్ల క్రితం కొత్తగూడెం పట్టణం ఏర్పడింది. మొత్తం స్థలమంతా సింగరేణి ఆధీనంలోనే ఉండేది. అప్పటి నుంచి నివాసం ఉంటున్నప్పటికీ కొత్తగూడెం వాసులకు ఎలాంటి యాజమాన్య హక్కులు కలగలేదు. 2004లో నగర బాట కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం వచ్చిన వైఎస్.రాజశేఖరరెడ్డికి స్థానికులు, ప్రజాప్రతినిధులు ఇక్కడి సమస్యను వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. 2005 మార్చి 24న 373 జీఓ జారీ చేశారు. + 2008లో వైఎస్ఆర్ ఒకేసారి బేషరతుగా రుణమాఫీ చేసి రైతుల మన్ననలు పొందారు. జిల్లాలో 4.52 లక్షల మంది రైతులకు రూ.2,150 కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యాయి. అంతేకాదు, మళ్లీ రైతులకు రుణాలు ఇచ్చారు. బ్యాంకుల్లో రుణ బకాయిలు లేని రైతులకు కూడా ప్రయోజనం కలిగించేందుకుగాను జిల్లాలోని దాదాపు 70 వేల మంది రైతులకు రూ.5000 చొప్పున ప్రోత్సాహకాలను బ్యాంకుల ద్వారా అందించారు. అప్పటివరకు అరకొరగా కొంతమందికే వచ్చే పింఛన్ అందేది. వైఎస్ అధికారంలోకి వచ్చాక.. ఒక్కసారిగా పింఛన్‌ను రూ.200లకు పెంచారు. జిల్లాలో అర్హులైన 2లక్షల మందికి రూ.200 చొప్పున పింఛన్ అందజేశారు. ప్రస్తుతం ఇంట్లో ఎంతమంది అర్హులున్నా ఒకరికి మాత్రమే ఇస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వరంగా మారింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో జిల్లాలోని నిరుపేద, గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించారు. ఈ విద్యార్థులే ఏటా 10లక్షల మంది రూ.1300 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ పొందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ సేవలను వైఎస్సార్ ప్రారంభించారు. జిల్లాలో 2008, జూలై 17 న ఈ సేవలు మొదలయ్యాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితోపాటు ఐదు ఏరియా ఆస్పత్రులు, తొమ్మిది ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. జిల్లాలో ఈ పథకం కింద 2016, జూన్ 27వ తేదీ వరకు 93,300 మంది రోగులు లబ్ధి పొందారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రారంభమైన ఎనిమిదేళ్ల కాలంలో జిల్లాకు రూ.260.30 కోట్లను వెచ్చించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉచిత విద్యుత్ ఎందరో రైతులకు వరప్రదాయని అయింది. వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయం చేయలేకుండా ఉన్న రైతులను ఆదుకునేందుకుగాను ఉచిత విద్యుత్ పథకాన్ని అధికారంలోకి రాగానే వైఎస్ ప్రారంభించారు. జిల్లాలో 1.05లక్షల వ్యవసాయ కనెక్షన్లకు నాటి నుంచి ఉచిత విద్యుత్ అందుతోంది. -
పేదరిక నిర్మూలనే లక్ష్యం
– ఆర్డీటీ డైరెక్టర్ మంచో ఫెర్రర్ – విన్సెంట్ ఫెర్రర్ విగ్రహావిష్కరణ ఆలూరు: ఆర్థికంగా, సామాజికంగా చితికిపోయిన కుటుంబాలకు చేయూతనిచ్చి పేదరికాన్ని నిర్మూలించడమే ధ్యేయంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు పనిచేస్తోందని సంస్థ డైరెక్టర్ మంచో ఫెర్రర్ అన్నారు. మండల పరిధిలోని ఎం.కొట్టాల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ఆర్డీటీ డైరెక్టర్ మంచో ఫెర్రర్ ప్రసంగించారు. 47 ఏళ్ల కాలంలో రాయలసీమ జిల్లాల పరిధిలో 70 వేల మంది పేదలకు గహాలు నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. 20 వేల మంది నిరుపేద విద్యార్థులకు చేయూతనిచ్చామన్నారు. ప్రస్తుతం 80 మంది ఎంబీబీఎస్, 8 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్థికసాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్పెయిన్‌కు చెందిన స్వచ్చంధ సంస్థ నిర్వాహకుడు కార్లేస్, ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ షణ్ముఖరావు, ఏటీఎల్ శివశంకర్, గ్రామ పెద్దలు ఆంజనేయులు, ప్రభుదాస్, రామాంజనేయులు, ఆర్డీటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నిస్సహాయం..!
– హెచ్ఐవీ బాధితులకు అందని ఆర్థిక చేయూత – మూలుగుతున్న రూ.70 లక్షల నిధులు – మంజూరై ఐదు నెలలైనా పట్టించుకోని అధికారులు – ఆశగా ఎదురు చూస్తున్న బాధితులు – గిరిజన కుటుంబాల దరిచేరని స్పెషల్ ప్రాజెక్టు కర్నూలు(అర్బన్): తెలిసో... తెలియకో ... జరిగిన తప్పులకు వారు శిక్షను అనుభవిస్తున్నారు. పేదరికం.. నిరక్షరాస్యత కారణంగా వారు కోలుకోలేని జబ్బుకు గురయ్యారు. వారికి వచ్చిన జబ్బును ఎలాగూ నయం చేయలేం, కనీసం వారిపై ఆధారపడిన కుటుంబాలకైనా ఆర్థిక చేయూతనిద్దాం... అనే సంకల్పంతో చేపట్టిన కార్యక్రమం అమలు కావడం లేదు. దీంతో ఆయా కుటుంబాలు కన్నీరు కార్చడం తప్ప .. ఏమి చేయలేని నిస్సహాయ స్థితితో ఉన్నాయి. జిల్లాలో హెచ్ఐవీ వ్యాధి బారిన పడిన గిరిజన కుటుంబాలకు అందించాల్సిన రూ.70 లక్షల నిధులు ఐదు నెలలుగా గిరిజన సంక్షేమ శాఖ బ్యాంకు ఖాతాలో మూలుగుతున్నాయి. దేవుడు వరమిచ్చినా..పూజారి కరుణించని చందంగా గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ నిధులను మంజూరు చేసినా, స్థానికంగా ఉన్న కారణాల వల్ల ఆ నిధులు బాధితులకు అందడంలో తీవ్ర జాప్యం నెలకొనింది. ఐటీడీఏ ప్లెయిన్ ఏపీఓ స్పెషల్ ప్రాజెక్టు కింద 2015 మార్చి నెలలో రాయలసీమ నాలుగు జిల్లాల్లోని గిరిజన గూడేలు, తండాలు, కాలనీల్లో ప్రత్యేక సర్వే నిర్వహించి జిల్లాలో 138 మంది గిరిజన వర్గాలకు చెందిన వారు హెచ్ఐవీ వ్యాధితో బాధ పడుతున్నారని గుర్తించారు. ఈ వ్యాధి బారిన పడిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష ( పూర్తి సబ్సిడీతో) మంజూరు చేయించేందుకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి నివేదికలను గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌కు పంపారు. ఈ నేపథ్యంలోనే మొదటి విడతలో 70 మందికి రూ.70 లక్షలను గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఈ ఏడాది మార్చి 15వ తేదీన మంజూరు చేస్తూ బడ్జెట్‌ను విడుదల చేశారు. ఆ రోజు నుంచి నేటి వరక విడుదలైన రూ.70 లక్షలు బ్యాంకులో భద్రంగా ఉన్నాయే తప్ప బాధితులకు అందలేదు. మంజూరైన నిధులను అర్హులైన హెచ్ఐవీ బాధితులకు అందించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి కోరినా, ఫలితం ఇంతవరకు కనిపించలేదు. డివిజన్ల వారీగా మంజూరు .... జిల్లాలోని కర్నూలు డివిజన్లో 53 మంది, నంద్యాల డివిజన్లో 65 మంది, ఆదోని డివిజన్లో 20 మంది ప్రకారం మొత్తం 138 మంది గిరిజన వర్గాలకు చెందిన వారు హెచ్ఐవీ బారిన పడ్డారని నివేదికలు పంపారు. పంపిన నివేదికల ఆధారంగా మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.1 లక్ష ప్రకారం 70 మందికి రూ.70 లక్షలు ఆర్థిక సహాయం మంజూరైంది. కానీ ఇంతవరకు మంజూరైన వారికి ఆర్థిక సహాయం అందించక పోవడంతో ఆయా కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. కలెక్టర్‌కు ఫైల్ పెడుతున్నాం: హెచ్ సుభాషణ్రావు, డీటీడబ్ల్యూఓ హెచ్ఐవీ వ్యాధి బారిన పడిన గిరిజనులకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వారికి అందించేందుకు జిల్లా కలెక్టర్‌కు ఫైల్ పెడుతున్నాం. ఆర్థిక సహాయం మంజూరైన వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే బాధితులకు ఆర్థిక సహాయం అందుతుంది. సాధ్యమైనంత వరకు కష్ణా పుష్కరాలు ముగిసిన వెంటనే ఆర్థిక సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపడతాం. -
నెలాఖరులోపు హౌస్‌ఫర్ ఆల్ సర్వే పూర్తి
కర్నూలు(టౌన్): నెలాఖరులోపు హౌస్‌ఫర్ ఆల్ సర్వే పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆశాఖ రీజినల్ డైరెక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. మంగళవారం స్థానిక కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్లో మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు, హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల్లో మొదటి దశలో 18,618 ఇళ్లు మంజూరు అయ్యాయని, లబ్ధిదారుల ఎంపిక సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పేరుతో జిల్లాలో 1.89 లక్షల మొక్కలు నాటాలన్నారు. ప్రతి మొక్కను జియోట్యాగింగ్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. ఇంకుడు గుంతలను జిల్లాలో 13, 733 ఏర్పాటు చేయాలని చెప్పారు. వచ్చేనెల 1 వ తేదీ నుంచి అన్ని మున్సిపాలిటీల్లో ఈ– ఆఫీసు పాలన అమలు చేయాలన్నారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్, పట్టణ ప్రణాళిక విభాగం రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటపతిరెడ్డి, ఎమ్మిగనూర్ కమిషనర్ సంపత్ పాల్గొన్నారు. -
ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
సాక్షి, హైదరాబాద్: ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. అది సరైంది కాదని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి, జాతీయ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి హితవు పలికారు. శుక్రవారం ఆయన లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైద్యం కోసం పేదలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న వైఎస్సార్ 2007లో మూడు జిల్లాల్లో ఆరోగ్యశ్రీని ప్రారంభించి తొమ్మిది నెలలు తిరగక ముందే మిగతా 20 జిల్లాలకు వర్తింపజేశారన్నారు. 500 రోగాలను అందులో చేర్చడంతో పథకం ద్వారా వేలాది మంది లబ్ధి పొందారన్నారు. వైఎస్సార్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్లక్ష్యం చే శారన్నారు. ఇక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆరోగ్య శ్రీని మూసివేయడానికి కంక ణం కట్టుకున్నట్లు కన్పిస్తోందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 450 కోట్లు బకాయి చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. తక్షణమే బకాయిలు చెల్లించి... ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎటువంటి లోపాలు లేకుండా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్య శ్రీపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రులు స్పందించాలి... హైకోర్టు రూపొందించిన ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరించుకోవాలని, తమకు న్యాయం కావాలని తెలంగాణ న్యాయాధికారులు చేస్తున్న డిమాండ్ విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఇద్దరు సీఎంలు, గవర్నర్, చీఫ్ జస్టిస్ కూర్చొని తక్షణమే చట్టపరంగా దీనికి పరిష్కార మార్గం వెతకాలన్నారు.