న్యూయార్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమలోని సృజనాత్మకను బయటకి తీస్తున్నారు. మిడ్ జర్నీ అనే కృత్రిమ మేధను వినియోగించి గోకుల్ పిళ్లై అనే ఆర్టిస్ట్ కోటీశ్వరుల్ని నిరుపేదలుగా మార్చేస్తున్నారు. కుబేరుల్ని మురికివాడల్లోకి తెస్తున్నారు.
బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, మార్క్ జుకర్‌బర్గ్, ఎలన్ మస్క్ వంటి బిలియనీర్స్ సరైన బట్టలు కూడా లేకుండా మురికి మురికిగా ఆ ఫొటోల్లో దర్శనమిస్తున్నారు. భారత వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ ఫొటోలను గోకుల్ పిళ్లై ఆన్‌లైన్‌లో షేర్ చేస్తూ ‘స్లమ్ డాగ్ మిలియనీర్స్’ అని క్యాప్షన్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో అవి వైరల్‌గా మారాయి!.
ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతున్నారు. వీరందరిలో ఎలాన్ మస్క్ మాత్రం నిరుపేద అవతారంలో కూడా సూపర్ రిచ్‌గా కన్పిస్తున్నారని ఓ యూజర్ చమత్కరించాడు. ఎంతైనా మస్క్ మస్కే అంటు నవ్వులు పూయించాడు.
కాగా.. కొద్ది రోజుల క్రితం మార్క్ జుకర్‌బర్గ్‌కు సంబంధించిన ఓ ఏఐ ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ అధునాతన సాంకేతికతో రూపొందించిన ఫొటోలు నిజమైన ఫొటోలోకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి. దీంతో అసలు ఫొటోలు, ఎడిట్ చేసిన ఫొటోల మధ్య తేడా కూడా కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది.
చదవండి: అమిత వేగంతో దూసుకెళ్తూ.. అడుగుకో నక్షత్రాన్ని పుట్టిస్తూ..
Comments
Please login to add a commentAdd a comment