Slum Dog millionaire
-
ఆసుపత్రి బిల్లు కూడా చెల్లించలేక అక్కడే మృతి చెందిన స్టార్ నటుడు
జీవితం అనూహ్యమైనది, ప్రతిదీ సెకన్లలో మారిపోతుంది. సంతోషం లేదా దుఃఖం ఏదీ శాశ్వతం కాదు, జీవితంలోని ప్రతి దశ మంచిదైనా, చెడ్డదైనా గడిచిపోతుంది. ఒకప్పుడు నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటూ కొంతమేరకు ఆర్థికంగా ఆయన నిలబడ్డాడు.. చేతినిండా సంపాదనతో భార్యాపిల్లలతో సంతోషంగా ఉన్నాములే అనుకున్న సమయంలో ఆ వ్యక్తి జీవింతంలోకి ఉపద్రవంలా ఊహించని కష్టాలు వస్తే.. అనారోగ్యం కారణంగా కూడబెట్టిన డబ్బంతా ఖర్చు పెట్టినా ఫలితం లేక చివరకు కనీసం మందులు కూడా కొనలేని స్థితిలో మరణిస్తే.. ఇదంతా సనిమా కథ కాదు.. ఒక హిట్ నటుడి జీవితం. స్లమ్‌డాగ్ మిలియనీర్ (2008), పీప్లీ లైవ్ (2010), ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002), జాలీ ఎల్ఎల్బి 2, పాన్ సింగ్ తోమర్ వంటి చిత్రాలలో నటించిన బాలీవుడ్ ప్రముఖ నటుడు సీతారాం పంచల్ గురించే ఇదంతా.. తన నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న ఈ నటుడు 10 ఆగస్టు 2017న పేదరికంలో మరణించాడని తెలిస్తే మీరు షాక్ అవుతారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కడంలో ఆయన పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. వెండితెరపై ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన సీతారాం నిజ జీవితంలో మాత్రం పేదరికంతో తన ప్రయణాన్ని ముగించాడు. కిడ్నీ, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కదల్లేని పరిస్థితికి చేరుకున్నాడు. దీంతో సినిమా అవకాశాలు లేక కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉండిపోయారు. ఈలోపు సినిమాల ద్వారా ఆయన కూడబెట్టిన డబ్బంతా కరిగిపోయింది. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో సాయం కోసం చెయి చాపాడు. 2017లో హర్యానా ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇచ్చింది. ఆ డబ్బు కూడా చాల్లేదు. అతని పరిస్థితిని గమనించిన సినీ ఆర్టీస్ట్ అసోసియేషన్ అతనికి ఆర్థిక సాయం చేయాలని నెటిజన్లను కోరింది. ఆయనకు సాయం చేయాలంటూ విరాళాల ఇవ్వాలని వేడుకుంది. కానీ ఆ సమయంలో కేవలం రూ. 1,06,575 మాత్రమే వచ్చింది. సరైన చికిత్స అందించేందుకు చేతిలో డబ్బు లేదు.. తాను కలిసి నటించిన స్టార్ హీరోలు ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. రోజులు గడిచాయి అతని ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. బరువు పూర్తిగా తగ్గిపోయాడు. ఎవరూ గుర్తించలేని స్థితికి చేరుకున్నాడు. అలా 2017 ఆగష్టు 10న ఆయన మరణించాడు. ఒక ఇంటర్వ్యూలో సీతారాం పంచల్ భార్య మాట్లాడుతూ.. 'నా భర్త డబ్బు లేక మాత్రమే చనిపోయాడు. ఆ సమయంలో సరైన చికిత్స అందించి ఉంటే బతికేవాడని డాక్టర్స్ చెప్పారు. కానీ, నా వద్ద అందుకు సరిపడా డబ్బు లేదు. డబ్బు మాత్రమే ఉండి ఉంటే ఆయన బతికే వాడనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. ఆయన చాలామంది స్టార్స్‌తో కలిసి నటించాడు. కానీ వారెవరూ సాయం చేయలేదు. కనీసం చూసేందుకు కూడా రాలేదు. చివరి రోజుల్లో ఆస్పత్రిలో బిల్లు కూడా చెల్లించలేకపోయాను. ఆస్పత్రి సిబ్బంది వారిని బతిమలాడి ఆయన పార్థివదేహాన్ని ఇంటికి తెచ్చాను. ఎవరైనా సాయం చేసి ఉంటే ఆయన బతికే వారు.' అని వాపోయింది. అక్షయ్ కుమార్,జాకీర్ హుస్సేన్,అజయ్ దేవగన్, ఇర్ఫాన్ ఖాన్ వంటి స్టార్స్‌తో పాటు అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో కూడా సీతారాం పంచల్ పనిచేశాడు. -
నిరుపేదలుగా మారిన బిల్ గేట్స్, ట్రంప్.. ‘ఇంత ఘోరంగా ఉన్నారేంటి!’
న్యూయార్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమలోని సృజనాత్మకను బయటకి తీస్తున్నారు. మిడ్ జర్నీ అనే కృత్రిమ మేధను వినియోగించి గోకుల్ పిళ్లై అనే ఆర్టిస్ట్ కోటీశ్వరుల్ని నిరుపేదలుగా మార్చేస్తున్నారు. కుబేరుల్ని మురికివాడల్లోకి తెస్తున్నారు. బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, మార్క్ జుకర్‌బర్గ్, ఎలన్ మస్క్ వంటి బిలియనీర్స్ సరైన బట్టలు కూడా లేకుండా మురికి మురికిగా ఆ ఫొటోల్లో దర్శనమిస్తున్నారు. భారత వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ ఫొటోలను గోకుల్ పిళ్లై ఆన్లైన్లో షేర్ చేస్తూ ‘స్లమ్ డాగ్ మిలియనీర్స్’ అని క్యాప్షన్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో అవి వైరల్‌గా మారాయి!. View this post on Instagram A post shared by Gokul Pillai (@withgokul) ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతున్నారు. వీరందరిలో ఎలాన్ మస్క్ మాత్రం నిరుపేద అవతారంలో కూడా సూపర్ రిచ్‌గా కన్పిస్తున్నారని ఓ యూజర్ చమత్కరించాడు. ఎంతైనా మస్క్ మస్కే అంటు నవ్వులు పూయించాడు. కాగా.. కొద్ది రోజుల క్రితం మార్క్ జుకర్‌బర్గ్‌కు సంబంధించిన ఓ ఏఐ ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ అధునాతన సాంకేతికతో రూపొందించిన ఫొటోలు నిజమైన ఫొటోలోకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి. దీంతో అసలు ఫొటోలు, ఎడిట్ చేసిన ఫొటోల మధ్య తేడా కూడా కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది. చదవండి: అమిత వేగంతో దూసుకెళ్తూ.. అడుగుకో నక్షత్రాన్ని పుట్టిస్తూ.. -
ఒక కథ చెప్పనా?
...అంటున్నారు సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కి సౌండ్ డిజైనర్‌గా ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ‘రోబో’,‘కోచ్చడయాన్’, ‘2.0’ తదితర దక్షిణాది చిత్రాలతో పాటు ‘రా.వన్’ వంటి హిందీ చిత్రాలకూ, హాలీవుడ్ మూవీస్కూ సౌండ్ డిజైనర్‌గా చేశారాయన. ఇప్పటివరకూ తెరపై వినిపించినరసూల్, త్వరలో కనిపించబోతున్నారు. యస్.. ఆయన హీరోగా ‘ఒరు కథై సొల్లట్టుమ్మా’ అనే చిత్రం రూపొందుతోంది. అంటే.. ‘ఒక కథ చెప్పనా?’ అని అర్థం. మలయాళం, తెలుగు, తమిళ,హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. కేరళలోని తిరుచ్చూరులో ప్రతి ఏటా జరిగే ‘పూరమ్’ అనే ఉత్సవం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఆ ఉత్సవాల్లో జరిగే ప్రతి శబ్దాన్ని రికార్డ్ చేయాలని కలలు కనే ఓ సౌండ్ డిజైనర్చుట్టూ సినిమా సాగుతుంది. ప్రసాద్ ప్రభాకరన్ దర్శకుడు. చిత్రవిశేషాలను ఆయన చెబుతూ – ‘‘పూరమ్ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో మేమంతా అక్కడే ఉండి, చిత్రీకరించాం.హాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన 80 మంది సాంకేతిక నిపుణులు ఉత్సవాల్లోని శబ్దాలను రికార్డ్ చేశారు. 22 కెమెరాలతో షూట్ చేశాం. స్వతహాగా సౌండ్ డిజైనర్ అయిన రసూల్ నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
మరో భారతీయ కథతో దేవ్ పటేల్
స్లమ్ డాగ్ మిలియనీర్, ద మ్యాన్ హు నో ఇన్ఫినిటీ లాంటి భారతీయ నేపథ్యం ఉన్న చిత్రాలతో ఆకట్టుకున్న బ్రిటీష్ నటుడు దేవ్ పటేల్, మరో భారతీయ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సరూ బ్రియర్లీ అనే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లయన్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఏ లాంగ్ వే హోం నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు గార్త్ డేవిస్ దర్శకుడు. కలకత్తా వీదుల్లో తప్పి పోయిన ఓ ఐదేళ్ల కుర్రాడు, ఓ ఆస్ట్రేలియా కుటుంబం చేరదీసే వరకు ఎలాంటి కష్టాలు పడ్డాడు. వేల కిలోమీటర్లు ఎలా ప్రయాణించాడు. 25 ఏళ్ల తరువాత జీవితంలో స్థిరపడిన ఆ యువకుడు తిరిగి తన గతాన్ని గుర్తు చేసుకోని తన కుటుంబం కోసం ఎలాంటి అన్వేషన సాగించాడు అన్న కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ నవంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. హాలీవుడ్ నటులు నికోలే కిడ్మన్, రూనీ మారా, డేవిడ్ వెన్హామ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.