ఆసుపత్రి బిల్లు కూడా చెల్లించలేక అక్కడే మృతి చెందిన స్టార్‌ నటుడు | Oscar-Winning Film Actor Did Not Pay Hospital Bills In Last Days | Sakshi
Sakshi News home page

ఆసుపత్రి బిల్లు కూడా చెల్లించలేక మృతి చెందిన స్టార్‌ నటుడి జీవితం గురించి తెలుసా?

Published Thu, Apr 4 2024 7:55 AM | Last Updated on Thu, Apr 4 2024 8:44 AM

Oscar Winning Film Actor Last Days Did Not Pay Hospital Bills - Sakshi

జీవితం అనూహ్యమైనది, ప్రతిదీ సెకన్లలో మారిపోతుంది. సంతోషం లేదా దుఃఖం ఏదీ శాశ్వతం కాదు, జీవితంలోని ప్రతి దశ మంచిదైనా, చెడ్డదైనా గడిచిపోతుంది. ఒకప్పుడు నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటూ కొంతమేరకు ఆర్థికంగా ఆయన నిలబడ్డాడు.. చేతినిండా సంపాదనతో భార్యాపిల్లలతో సంతోషంగా ఉన్నాములే అనుకున్న సమయంలో ఆ వ్యక్తి జీవింతంలోకి ఉపద్రవంలా ఊహించని కష్టాలు వస్తే.. అనారోగ్యం కారణంగా కూడబెట్టిన డబ్బంతా ఖర్చు పెట్టినా ఫలితం లేక చివరకు కనీసం మందులు కూడా కొనలేని స్థితిలో మరణిస్తే..  ఇదంతా సనిమా కథ కాదు.. ఒక హిట్‌ నటుడి జీవితం.

స్లమ్‌డాగ్ మిలియనీర్ (2008), పీప్లీ లైవ్ (2010), ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002), జాలీ ఎల్‌ఎల్‌బి 2, పాన్ సింగ్ తోమర్ వంటి చిత్రాలలో నటించిన బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సీతారాం పంచల్ గురించే ఇదంతా.. తన నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న ఈ నటుడు 10 ఆగస్టు 2017న పేదరికంలో మరణించాడని తెలిస్తే మీరు షాక్ అవుతారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు దక్కడంలో ఆయన పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. వెండితెరపై  ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన సీతారాం నిజ జీవితంలో మాత్రం పేదరికంతో తన ప్రయణాన్ని ముగించాడు. 

కిడ్నీ, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కదల్లేని పరిస్థితికి చేరుకున్నాడు. దీంతో సినిమా అవకాశాలు లేక కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉండిపోయారు. ఈలోపు సినిమాల ద్వారా ఆయన కూడబెట్టిన డబ్బంతా కరిగిపోయింది. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో సాయం కోసం చెయి చాపాడు. 2017లో హర్యానా ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇచ్చింది. ఆ డబ్బు కూడా చాల్లేదు. అతని పరిస్థితిని గమనించిన సినీ ఆర్టీస్ట్‌ అసోసియేషన్‌ అతనికి ఆర్థిక సాయం చేయాలని నెటిజన్లను కోరింది. ఆయనకు సాయం చేయాలంటూ విరాళాల ఇవ్వాలని వేడుకుంది.

కానీ ఆ సమయంలో కేవలం రూ. 1,06,575 మాత్రమే వచ్చింది. సరైన చికిత్స అందించేందుకు చేతిలో డబ్బు లేదు.. తాను కలిసి నటించిన స్టార్‌ హీరోలు ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. రోజులు గడిచాయి అతని ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. బరువు పూర్తిగా తగ్గిపోయాడు. ఎవరూ గుర్తించలేని స్థితికి చేరుకున్నాడు. అలా 2017 ఆగష్టు 10న ఆయన మరణించాడు.

ఒక ఇంటర్వ్యూలో సీతారాం పంచల్ భార్య  మాట్లాడుతూ.. 'నా భర్త డబ్బు లేక మాత్రమే చనిపోయాడు. ఆ సమయంలో సరైన చికిత్స అందించి ఉంటే బతికేవాడని డాక్టర్స్‌ చెప్పారు. కానీ, నా వద్ద అందుకు సరిపడా డబ్బు లేదు. డబ్బు మాత్రమే ఉండి ఉంటే ఆయన బతికే వాడనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. ఆయన చాలామంది స్టార్స్‌తో కలిసి నటించాడు. కానీ వారెవరూ సాయం చేయలేదు. కనీసం చూసేందుకు కూడా రాలేదు. చివరి రోజుల్లో ఆస్పత్రిలో బిల్లు కూడా చెల్లించలేకపోయాను. ఆస్పత్రి సిబ్బంది వారిని బతిమలాడి ఆయన పార్థివదేహాన్ని ఇంటికి తెచ్చాను. ఎవరైనా సాయం చేసి ఉంటే ఆయన బతికే వారు.' అని వాపోయింది. అక్షయ్ కుమార్,జాకీర్ హుస్సేన్,అజయ్ దేవగన్, ఇర్ఫాన్‌ ఖాన్‌ వంటి స్టార్స్‌తో పాటు అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో కూడా సీతారాం పంచల్ పనిచేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement