
పేరెంట్స్ విడాకుల వల్ల తను సంతోషంగానే ఉన్నానంటోంది నటి కావేరి కపూర్ (Kaveri Kapur). కాకపోతే అది తర్వాతి కాలంలో తన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిందని చెప్తోంది. డైరెక్టర్ శేఖర్ కపూర్- నటి, సింగర్ సుచిత్రా కృష్ణమూర్తి (Suchitra Krishnamoorthi)ల కూతురే కావేరి. బాబీ ఔర్ రిషికి లవ్ స్టోరీ అనే హిందీ సినిమాతో వెండితెరకు నటిగా పరిచయమైంది.
విడాకులు తీసుకున్నప్పుడు హ్యాపీనే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కావేరి మాట్లాడుతూ.. అమ్మానాన్న విడిపోయినప్పుడు నేనంతగా బాధపడలేదు. వాళ్లు విడాకులు తీసుకున్నప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను. కానీ రానురానూ తేడా గమనించాను. పేరెంట్స్ విడాకులు నా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించాయి. పెద్దయ్యే కొద్దీ మానసికంగా చాలా ఇబ్బందిపడ్డాను.
ఇప్పటికీ మానసికంగా..
ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. ఇదొక ప్రక్రియలా కొనసాగుతోంది. అలాగే నాకు ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) ఉంది. ప్రస్తుతం వీటన్నింటి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాను. పూర్తిగా బయటపడేందుకు ఇంకాస్త సమయం పడుతుందని భావిస్తున్నాను. శేఖర్ కపూర్- సుచిత్ర కృష్ణమూర్తి 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2001లో కావేరి జన్మించింది. 12 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2007లో విడాకులు తీసుకున్నారు.
చదవండి: ప్రభుదేవా కన్సర్ట్.. కనీస గౌరవం లేదు, వివక్ష చూపిస్తున్నారు: నటి
Comments
Please login to add a commentAdd a comment