
ప్రేమలో విఫలమైతే జీవితమే అయిపోయినట్లు డీలా పడిపోతారు. పెళ్లి పెటాకులైతే అంతా శూన్యమైపోయినట్లు దిగులు చెందుతారు. అందుకు తాను కూడా అతీతుడిని కాదంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan). మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు ఆ బాధ భరించలేకపోయానంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ మాట్లాడుతూ.. రీనా దత్తా (Reena Dutta), నేను విడిపోయినప్పుడు దాదాపు మూడేళ్లపాటు ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయాను.
డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా..
ఏ స్క్రిప్టు కూడా వినలేకపోయాను. సినిమాలపై శ్రద్ధ పెట్టలేకపోయాను. ఏడాదిన్నరపాటు ఇంట్లో ఒంటరిగా కూర్చున్నాను. మందు ముట్టని నేను విపరీతంగా తాగడం మొదలుపెట్టాను. అసలేం చేయాలో అర్థం కాలేదు. రాత్రిళ్లు సరిగా నిద్రపట్టేది కాదు. అందుకే తాగుడుకు అలవాటుపడ్డాను. మద్యం తాగడం అంటేనే గిట్టని నేను ఒక ప్రతి రోజు ఒక బాటిల్ లేపేసేవాడిని. తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. దేవదాసులా మారిపోయాను.

రెండు పెళ్లిళ్లు- విడాకులు
కానీ మనకు నచ్చిన వ్యక్తులు మనతో లేరన్న విషయాన్ని జీర్ణించుకోవాలి. వాళ్లు తిరిగొచ్చే అవకాశం లేనప్పుడు మిస్ అవుతాం.. అయినా తప్పదని ముందుకు వెళ్లాలి అని చెప్పుకొచ్చాడు. ఆమిర్ ఖాన్, రీనా దత్తా 1986లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జునైద్ ఖాన్, కూతురు ఇరా ఖాన్ సంతానం. ఆమిర్-రీనా 2002లో విడాకులు తీసుకున్నారు.
60 ఏళ్ల వయసులో డేటింగ్
2005లో ఆమిర్.. కిరణ్ రావు (Kiran Rao)ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి సరోగసి ద్వారా ఆజాద్ జన్మించాడు. ఈ దంపతులు కూడా పెళ్లయిన 15 ఏళ్లకు విడిపోయారు. ప్రస్తుతం ఆమిర్ మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఇటీవల తన 60వ బర్త్‌డే వేడుకల్లో.. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌ను తన ప్రేయసిగా పరిచయం చేశాడు. వీరిద్దరూ ఏడాదిన్నర కాలంగా డేటింగ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment