
బంధాన్ని తెంచుకోవడం అంత ఈజీ కాదు.. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితులు తలకిందులైనప్పుడు చాలామంది ఆ బంధాన్ని కష్టంగా కొనసాగించడానికి బదులు తెంపుకోవడానికే ప్రయత్నిస్తారు. బుల్లితెర నటి శుభంగి ఆత్రే (Shubhangi Atre) కూడా అదే పని చేసింది. పరిస్థితి చేయిదాటిపోయిందని అర్థమయ్యాక భర్త పీయూశ్ పూరే (Piyush Poorey)తో విడాకులు ఇచ్చేసింది. ఇంతలోనే పీయూశ్ పూరే (ఏప్రిల్ 19న ) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు.
విడాకులకు కారణం..
ఈ క్రమంలో శుభంగి.. తమ అన్యోన్య దాంపత్యం చెల్లాచెదురవడానికి గల కారణాన్ని వెల్లడించింది. నేను టీవీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాను కాబట్టి భర్తను వదిలేశాను అని చాలామంది అనుకుంటారు. అది నిజం కాదు. అతడికున్న తాగుడు వ్యసనం వల్లే విడిపోవాల్సి వచ్చింది. మందుకు బానిసవడం వల్ల అది కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.
ఎంతో ప్రయత్నించా..
మా బంధాన్ని కాపాడుకోవాలని చాలారకాలుగా ప్రయత్నించాను. కానీ పరిస్థితులు చేయిదాటిపోయాయి. అతడితో మందు మాన్పించేందుకు రిహాబిలిటేషన్ సెంటర్‌కు కూడా పంపించాను. అయినా తనలో మార్పు రాలేదు. ఇరు కుటుంబాలు తనను మార్చాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆ వ్యసనం.. అతడిని నాశనం చేసింది. మాపై కూడా ప్రభావం చూపింది.
ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు
విడాకులు ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. 2018-2019 సమయంలో ఆ ఆలోచన మొదలైంది. చివరకు ఈ ఏడాది విడాకులు తీసుకున్నాం. డివోర్స్ అయ్యాక కూడా నేను అతడితో టచ్‌లోనే ఉన్నాను. ఇంతలోనే అతడు కాలం చేశాడు. త్వరలోనే నేను, నా కూతురు.. ఇండోర్‌లో ఉన్న పీయూశ్ కుటుంబాన్ని కలుస్తాం అని చెప్పుకొచ్చింది.
సీరియల్స్‌తో ఫేమస్
శుభంగి ఆత్రే- పీయూశ్ 2003లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2005లో కూతురు పుట్టింది. 2022 నుంచి దంపతులిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. కాగా శుభంగి ఆత్రే 2006లో కసౌజీ జిందగీకే సీరియల్‌తో నటప్రయాణం ఆరంభించింది. కస్తూరి, బాబ్జీ ఘర్ పర్ హైర్, హవన్ వంటి పలు సీరియల్స్ చేసింది.
చదవండి: పాకిస్తాన్‌కు ఎప్పుడు వస్తున్నావ్? దద్దమ్మ అంటూ సింగర్ కౌంటర్