![Charu Asopa and Rajeev Sen are officially divorced Shares In Instagram - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/8/WhatsApp%20Image%202023-06-08%20at%2016.15.24.jpeg.webp?itok=uN_ti_64)
బుల్లితెర సీరియల్ నటి చారు అసోపా చారు- నటి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ గతంలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ చివరికీ విడిపోయేందుకే మొగ్గుచూపారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో తప్పు చేసింది నువ్వంటే నువ్వని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ జంట మనస్పర్థలతో గతేడాది డిసెంబరులో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
(ఇది చదవండి: జీవితం చాలా చిన్నది.. తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి: రాజీవ్ సేన్)
తాజాగా ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో రాజీవ్ సేన్, చారు అసోపా అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అయితే గతంలో తమ కుమార్తె కోసం స్నేహపూర్వకంగా ఉన్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని రాజీవ్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు రాజీవ్ సేన్.
'మేము ఒకరికొకరు వీడిపోయినా కుడా మా ప్రేమ అలాగే ఉంటుంది. మేము ఎల్లప్పుడూ మా కుమార్తెకు అమ్మ, నాన్నాలాగే ఉంటాం.' అంటూ పోస్ట్ చేశారు. దీనిపై ఇంకా చారు అసోపా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. ఈ జంట జూన్ 9, 2019న గోవాలో పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరు మొదటి బిడ్డను స్వాగతించారు. తమ కుమార్తెకు జియానా అని పేరు పెట్టారు.
(ఇది చదవండి: అతనిపై విపరీతమైన క్రష్.. కానీ నన్ను మోసం చేశాడు: హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment