Rajeev Sen
-
విడిపోయినా భర్తతో కలిసే విహారయాత్ర.. నటి ఏమందంటే?
భార్యాభర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా కలిసే ఉన్నామంటోందో బాలీవుడ్ మాజీ జంట. కూతురి కంటే ఏదీ ఎక్కువ కాదంటున్నారు. వారే బుల్లితెర నటి చారు అసోపా.. హీరోయిన్ సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్. చారు-రాజీవ్ 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021లో జియానా అనే కూతురు పుట్టింది. ఆ మరుసటి ఏడాది ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించారు. గతేడాది విడాకులు తీసుకున్నారు.దూరంగా ఎందుకు పెడతాను?విడిపోయారన్న మాటే కానీ తరచూ కలుసుకుంటూనే ఉన్నారు. కూతురితో కలిసి హాలీడే ట్రిప్పులకు కూడా వెళ్తున్నారు. ఈ మధ్యే దుబాయ్‌కు వెళ్లొచ్చారు. దాని గురించి చారు మాట్లాడుతూ.. 'మా ట్రిప్ అద్భుతంగా జరిగింది. జియానా చాలా సంతోషపడిపోయింది. కుటుంబమంతా కలిసి ట్రిప్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి! రాజీవ్.. జియానా తండ్రి. అలాంటప్పుడు నా కూతురికి అతడి కుటుంబాన్ని ఎందుకు దూరంగా ఉంచుతాను? అందుకే అందరం కలిసే వెళ్లాం. అన్నీ మర్చిపోయిరాజీవ్ అమ్మ సుష్మిత అంటే కూడా నాకిష్టం. రాజీవ్‌తోనూ హ్యాపీగా ఉన్నాను. విడిపోయినంతమాత్రాన మా బంధాలన్నీ తెగిపోయినట్లు కాదు. జియానాను తన కుటుంబానికి దూరంగా ఉంచాలనుకోవడం లేదు. రాజీవ్, నేను మంచి ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నాం. జియానా ముందు పాత విషయాలన్నీ మర్చిపోయి స్నేహితులుగా కొనసాగితే అంతకన్నా గొప్ప విషయం ఇంకేముంటుంది?' అని చెప్పుకొచ్చింది.చదవండి: లవ్యూ బేబి అంటూ పందిట్లో కన్నీళ్లు.. రెండునెలలకే అడ్డంగా దొరికిన హీరో -
మొన్ననే విడాకులు.. అంతలోనే మళ్లీ కలవాలని ఉందంటున్న నటుడు
బుల్లితెర నటి చారు అసోపా, మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడిపోయిన సంగతి తెలిసిందే! 2022లోనే వీరు విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి విడిగానే జీవిస్తున్నారు. ఇటీవల జూన్ 8న అధికారికంగా విడాకులు మంజూరైనట్లు తెలిపారు. ఈ క్రమంలో తాను చేసింది సరైన పనే అని చారు అభిప్రాయపడుతుండగా రాజీవ్ మాత్రం బాధలో కూరుకుపోయినట్లు కనిపిస్తున్నాడు. విడాకులు వచ్చి వారం రోజులు కాకముందే మళ్లీ కలిస్తే బాగుండని ఆశపడుతున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మేమిద్దరం కలిసి ఉండనంత మాత్రాన నా కూతురి మీదున్న ప్రేమ తగ్గదు. నా బిడ్డ విషయంలో మేమిద్దరం ఒకరికి ఒకరం మద్దతుగా ఉంటాం. ఒక తండ్రిగా నా కూతురికి నేను ఎక్కువ సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాను. నేనెప్పుడూ చారు క్షేమాన్ని కోరుకుంటాను. తనకు ఎప్పుడూ అండగా ఉంటాను. తనపై నా ప్రేమ అలాగే ఉంటుంది. ఏదో ఒక రోజు మేము మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు రాజీవ్. కాగా చారు అసోపా, రాజీవ్ సేన్ 2019 జూన్ 9న పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా 2021లో పాప పుట్టింది. ఆమెకు జియానా అని నామకరణం చేశారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ పాపకు తల్లిదండ్రులుగా మాత్రం ఉంటామని చెప్తున్నారు. ఇకపోతే రాజీవ్ ఇటీవలే 'హజ్రత్' అనే షార్ట్ ఫిలింలో నటించడమే కాక దాన్ని నిర్మించాడు కూడా! చారు విషయానికి వస్తే దేవాన్ కీ దేవ్.. మహదేవ్, మేరే అంగ్నే మే, జీ మా, బాల్ వీర్ వంటి పలు సీరియల్స్‌లో నటించింది. చదవండి: ఆ స్థానంలో ప్రభాస్‌ను తప్ప ఎవరినీ ఊహించుకోలేను: కృతీ సనన్ -
విడాకులు తీసుకున్న బుల్లితెర నటి.. భర్త పోస్ట్ వైరల్!
బుల్లితెర సీరియల్ నటి చారు అసోపా చారు- నటి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ గతంలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ చివరికీ విడిపోయేందుకే మొగ్గుచూపారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో తప్పు చేసింది నువ్వంటే నువ్వని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ జంట మనస్పర్థలతో గతేడాది డిసెంబరులో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. (ఇది చదవండి: జీవితం చాలా చిన్నది.. తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి: రాజీవ్ సేన్) తాజాగా ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో రాజీవ్ సేన్, చారు అసోపా అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అయితే గతంలో తమ కుమార్తె కోసం స్నేహపూర్వకంగా ఉన్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని రాజీవ్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు రాజీవ్ సేన్. 'మేము ఒకరికొకరు వీడిపోయినా కుడా మా ప్రేమ అలాగే ఉంటుంది. మేము ఎల్లప్పుడూ మా కుమార్తెకు అమ్మ, నాన్నాలాగే ఉంటాం.' అంటూ పోస్ట్ చేశారు. దీనిపై ఇంకా చారు అసోపా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. ఈ జంట జూన్ 9, 2019న గోవాలో పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరు మొదటి బిడ్డను స్వాగతించారు. తమ కుమార్తెకు జియానా అని పేరు పెట్టారు. (ఇది చదవండి: అతనిపై విపరీతమైన క్రష్.. కానీ నన్ను మోసం చేశాడు: హీరోయిన్) -
మండుటెండలో తిరుగుతున్నా, ఎవరూ ఇల్లు అద్దెకివ్వడం లేదు: నటి
సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్- నటి చారు అసోపాలు విడిపోయిన సంగతి తెలిసిందే! రాజీవ్ చిత్రహింసలు పెట్టాడని, గర్భవతిగా ఉన్న సమయంలోనూ హింసించాడని భర్తపై ఆరోపణలు చేసింది చారు. అంతా అబద్ధం, తనే మరో నటుడితో సన్నిహితంగా మెదిలి నన్ను మోసం చేసిందని ఎదురుదాడి చేశాడు రాజీవ్. ఇలా వీరిద్దరి మధ్య గొడవ ముదిరి పాకాన పడటంతో తన కూతురిని తీసుకుని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది నటి. కానీ తనకు ఉండటానికి ఇల్లు దొరకడమే కష్టమైపోయిందట. ప్రస్తుతం ఉంటున్న 1బీహెచ్‌కే నుంచి 2బీహెచ్కేకు మారాలనుకుంటోంది చారు. ఇందుకోసం ఎప్పటినుంచో అద్దె ఇల్లు వెతకడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న సమస్యలను చెప్తూ బాధపడింది చారు. ఆమె మాట్లాడుతూ.. 'ముంబైలో ఇల్లు దొరకడం అంత ఆషామాషీ కాదు. ఇప్పటికీ మండుటెండలో ఇంటి కోసం వెతుకుతూనే ఉన్నాను. ప్రతిరోజూ ఇల్లు వెతకడమే నా పనైపోయింది. చాలా కష్టంగా అనిపిస్తోంది. ఇక్కడ నాకు ఎదురవుతున్న సమస్యేంటంటే.. మొదట నేను నటిని, తర్వాత సింగిల్ పేరెంట్ను. ఈ రెండు కారణాల వల్ల నాకు ఇల్లు ఇవ్వడం లేదంటే మీరు నమ్ముతారా? ఇలాగైతే ముంబైలో నటీనటులకు ఇల్లెక్కడ దొరుకుతుంది? ఇలా రోజూ తిరిగే క్రమంలో ఒక ఫ్లాట్ నాకు చూడగానే నచ్చింది. అన్నింటికీ అనుకూలంగా ఉన్నట్లు అనిపించింది. కానీ వాళ్లు నేను నా కూతురితో ఒంటరిగా ఉంటానని తెలిసి తిరస్కరించారు' అని చెప్పుకొచ్చింది చారు అసోపా. కాగా చారు అసోపా- రాజీవ్ సేన్ 2019 గోవాలో పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరి మధ్య విభేదాలు రావడంతో 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి చారు అసోపా ఏడాదిన్నర కూతురితో కలిసి విడిగా జీవిస్తోంది. చదవండి: నీలాంటి వాళ్లు గుడికి ఎందుకు వస్తారో? నటుడిపై ట్రోలింగ్ -
ఈ ఏడాది విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే..
సినీ ఇండస్ట్రీలో ప్రేమ- విడాకులు చాలా కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడాకులు తీసుకున్న సెలబ్రిటీల లిస్ట్ అంతకంతకూ ఎక్కువైపోయింది. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న దంపతులు సైతం తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టేశారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకొని చివరికి కోర్టు మెట్లు ఎక్కారు. 2022 ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. త్వరలోనే 2023లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరెవరో ఓసారి చూసేద్దామా.. ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ తమిళ స్టార్ హీరో ధనుష్- రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలోనే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. తమిళ నాట స్టార్ కపుల్‌గా గుర్తింపు పొందిన ఈ జంట 2004 నవంబర్ 18న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యుల నిర్ణయంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి నాటికి ధనుష్ వయసు 21 ఏళ్లు, ఐశ్వర్య వయసు 23 ఏళ్లు. ఈ దంపతులకు యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. సాఫీగా సాగిపోతుందనుకున్న వీరి వైవాహిక బంధంలో మనస్పర్థలు ఏర్పడి ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. యోయో హనీసింగ్- షాలినీ తల్వార్ బాలీవుడ్ ర్యాపర్, మ్యూజిక్ కంపోజర్ యో యో హనీసింగ్ తన పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. సుమారు పదేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన హనీసింగ్-షాలినీలు 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. కానీ మనస్పర్థలు రావడంతో సెప్టెంబర్ 8న విడాకులు తీసుకున్నారు. ఇక హనీసింగ్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఇతర మహిళలతో వివాహేతర సంబంధంపెట్టుకున్నాడని ఆరోపిస్తూ షాలిని కోర్టును ఆశ్రయించడంతో వివాదం రచ్చకెక్కింది. ఇదిలా ఉంటే షాలినీతో విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే హనీసింగ్ తన గర్ల్‌ఫ్రెండ్ టీనా తడానితో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మీడియా కంట పడింది. రాజీవ్ సేన్- చారు అసోపా మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకులు వ్యవహరం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. టీవీ నటి చారు అసోపా- రాజీవ్ సేన్లు 2019 జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న కూతురు జియానా ఉంది. అయితే పెళ్లయిన ఏడాదిన్నరగే విడిపోతున్నట్లు ప్రకటించి అందిరికి షాక్ ఇచ్చిన ఈ దంపతులు తమ కూతురి కోసం కలిసి ఉండాలనుకుంటున్నామంటూ ఇటీవల తమ విడాకులను రద్దు చేసుకున్నారు. కానీ మళ్లీ ఏమైందో ఏమో కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం భార్యభర్తలుగా విడిపోతున్నామని, కేవలం కూతురు జియానుకు తల్లిదండ్రులుగా ఉంటున్నామని తెలిపారు. రాఖీ సావంత్- రితేష్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నానుతూ ఉంటుంది రాఖీ సావంత్. బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయిన ఆమె ఈ ఏడాది వాలంటైన్స్ డే రోజు తన భర్త రితేశ్ సింగ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది.రితేశ్‌కు ఆల్రెడీ పెళ్లైన విషయాన్ని తన దగ్గర దాచిపెట్టాడని, వారు విడాకులు తీసుకోలేదు కాబట్టి చట్టబద్ధంగా తమ వివాహం చెల్లదండూ అతడితో తెగదెంపులు చేసుకుంది. మాజీ భర్త జ్ఞాపకాలను సైతం వదిలించుకుంది. ఇక ప్రస్తుతం తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో మునిగితేలుతుంది. సుస్మితా సేన్-లలిత్ మోదీ మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్ ప్రేమ వ్యవహారం మీడియాలో ఎంత హాట్‌టాపిక్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు తనకంటే 15 ఏళ్ల చిన్నవాడైన మోడల్ ప్రముఖ మోడల్ రోహ్మన్తో ప్రేమాయణం నడిపిన సుస్మితా తాజాగా మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీతో సహజీవనం చేస్తుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు మాల్దీవుల్లో షికార్లు చేసిన ఫొటోలు, లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా పిక్స్‌ను స్వయంగా లలిత్ మోదీ షేర్ చేశాడు. ఈ సందర్భంగా సుస్మితాను తన బెటర్ హాఫ్(భార్య) అంటూ పరిచయం చేశాడు మోదీ. ఆ తర్వాత ప్రస్తుతం తాము డేటింగ్లో ఉన్నామనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహరం మీడియాలో, సోషల్ మీడియాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ లలిత్ మోదీకి గుడ్‌బై చెప్పి ప్రస్తుతం రోహ్మన్తోనే సుస్మితా కలిసి ఉంటున్నట్లు తెలుస్తుంది. సోహైల్ ఖాన్-సీమా సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి పెళ్లిళ్లు అచ్చొచ్చినట్లు కనిపించడం లేదు. ఇప్పటికే అర్బాజ్ ఖాన్ విడాకులు తీసుకోగా, ఇప్పుడు సల్మాన్ మరో తమ్ముడు సోహైల్ ఖాన్ కూడా భార్య నుంచి విడిపోయాడు. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న సోహైల్- సీమా ఖాన్లు 24 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ప్రేమించి, పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న సోహైల్-సీమా ఖాన్లు విడాకులు తీసుకోవడం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే వీరి విడాకుల వెనుక ఓ హీరోయిన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీతో సొహైల్ ఖాన్ కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి. కారణం ఏదైనా తమ వివాహ బంధానికి ముగింపు పలికారు ఈ బ్యూటిఫుల్ కపుల్. -
జీవితం చాలా చిన్నది.. తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి: రాజీవ్ సేన్
బుల్లితెర సీరియల్ నటి చారు అసోపా చారు- నటి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ రాజీవ్ సేన్ల విడాకుల వ్యవహారం కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. తప్పు చేసింది నువ్వంటే నువ్వని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. సహ నటుడితో రొమాంటిక్ రీల్ చేయలేదా అని భార్యను నిలదీసే వచ్చాక వీరిద్దరి వ్యవహారం. ఆ వివాదం కాస్తా నెట్టింట తీవ్రమైన చర్చకు దారి తీసింది. భర్త ఆరోపణలపై చారు ఆవేదన వ్యక్తం చేసింది. అంత ఈజీగా నిందలు ఎలా వేస్తారని భర్త రాజీవ్ సేన్‌ను ఉద్దేశించి మాట్లాడింది. (చదవండి: అంత ఈజీగా నిందలు ఎలా వేస్తారు? భర్త ఆరోపణలపై నటి ఆవేదన) అయితే ఈ వ్యవహారంలో తన భార్య చారు అసోపా ఆరోపణలపై రాజీవ్ సేన్ ప్రతిస్పందించారు. ఆమె నా కుమార్తెతో సహా బయటకు వెళ్లడం ద్వారా తనకు తానే ప్రతీది కోల్పోయేలా చేసుకుందన్నారు. ఆమె కోసం ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని రాజీవ్ వ్యాఖ్యానించారు. చారు-కరణ్ మెహ్రాల ‘వ్యవహారం, చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లడం నుంచి.. ముద్దుల కూతురు జియానా పుట్టినరోజు వేడుకపై గురించి మాట్లాడారు. ఒక వ్యక్తిగా చారు మీడియాతో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం తప్పు అని అన్నారు. ఈ విషయంలో ఆమె కూడా బాధపడి ఉంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదంతా ప్రజలకు ఒక జోక్‌లా అనిపిస్తుందని రాజీవ్ వెల్లడించారు. విడాకులు కావాలంటే గౌరవప్రదంగా తీసుకోవాలి కానీ.. ఇలా పరువు తీసుకునేలా చేయకూడదని రాజీవ్ అన్నారు. నేను చారు, మా కుటుంబంతో కలిసి చాలా వ్లాగ్స్ చేశాం.. కానీ జరిగినదంతా చూసి చాలా బాధపడినట్లు తెలిపారు. నా గురించి ఇంత దారుణంగా ఎవరూ మాట్లాడలేదని రాజీవ్ సేన్ అన్నారు. చారుది చిన్న పిల్ల మనస్తత్వమని.. తాను ఎక్కువ ఎమోషనలవుతుందని ఆయన పేర్కొన్నారు. రాజీవ్ సేన్ మాట్లాడుతూ.. 'ఈ వ్యవహరంలో నేనే స్పష్టంగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ఈ వివాదం వల్ల నా బిడ్డ ప్రభావితం కావడం నాకు ఇష్టం లేదు.. అందుకే చారు తిరిగి వచ్చేందుకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి. చారు మా కుటుంబానికి తిరిగి రావాలనుకుంటున్నాం. ఇది జియానా ఇల్లు. మన జీవితం చాలా చిన్నది.' అని అన్నారు. -
నీ భార్యతో రొమాన్సా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా?: నటుడు
బుల్లితెర సీరియల్ నటి చారు అసోపా- రాజీవ్ సేన్ల విడాకుల వ్యవహారం గత రెండురోజులుగా చర్చనీయాంశంగా మారింది. తప్పు చేసింది నువ్వంటే నువ్వని.. ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. సహ నటుడు కరణ్ మెహ్రాతో రొమాంటిక్ రీల్ చేసింది నిజం కాదా? అని భార్యను మీడియా ముఖంగా నిలదీశాడు రాజీవ్. తాజాగా ఈ వ్యవహారంపై హిందీ బిగ్‌బాస్ 10వ సీజన్ కంటెస్టెంట్, నటుడు కరణ్ మెహ్రా స్పందించాడు. 'నీ భార్య చారుతో రొమాన్సా? అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా రాజీవ్ ? పదేళ్ల క్రితం ఓసారి చారును కలిశాను. తర్వాత ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాను. అప్పుడెప్పుడో జూన్‌లో ప్రమోషనల్ ఈవెంట్ కోసం తనతో మాట్లాడాను. అదే చివరిసారి మేము మాట్లాడుకోవడం! ఇలా నాపై చెత్త ఆరోపణలు చేయడం దారుణం. అతడిపై పరువునష్టం దావా వేస్తాను' అని చెప్పుకొచ్చాడు. కాగా పలుమార్లు గొడవపడ్డ చారు అసోపా- రాజీవ్ ఈసారి మాత్రం విడాకులు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. చదవండి: అంత ఈజీగా నిందలు ఎలా వేస్తారు? : నటి ఆవేదన నటుడికి ఇల్లమ్మేసి కొత్త డూప్లెక్స్ కొన్న జాన్వీ కపూర్ -
అంత ఈజీగా నిందలు ఎలా వేస్తారు? భర్త ఆరోపణలపై నటి ఆవేదన
మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్, నటి చారు అసోపాల విడాకులు వ్యవహరం రోజురోజుకు ముదురుతోంది. చీటింగ్ చేశాడని చారు, మోసం చేసిందని రాజీవ్ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజీవ్ తనని చిత్రహింసలు పెట్టాడని, తాను గర్భవతిగా ఉన్న సమయంలోనూ హింసించాడంటూ ఆమె వాపోయింది. భార్య ఆరోపణలను ఖండిస్తూ రాజీవ్ సేన్.. ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన భార్య ‘యే రిషిత క్యా కెహలాతా హై’ ఫేం, నటుడు కరణ్ మెహ్రాతో రొమాంటిక్ వీడియో చేసిందని, తప్పు చేసింది ఆమె అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. చదవండి: చీటింగ్ చేసి ప్రియాంక మిస్ వరల్డ్ అయ్యిందా?.. కో-కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు ఇక భర్త ఆరోపణలపై తాజాగా చారు అసోపా స్పందించింది. అంత తేలిగ్గా ఒక అమ్మాయి మీద లేనిపోని నిందలు ఎలా వేస్తారని? ప్రశ్నించింది. ‘రాజీవ్ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. అంత తేలిగ్గా నాపై లేనిపోని నిందలు వేస్తున్నాడు. నా గురించి చెప్పేందుకు ఏం లేదు. అందుకే రాజీవ్ నా మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఓ అమ్మాయిపై ఇలాంటి నిందలు వేయడం అంత తేలికా?.. నన్ను, నా క్యారెక్టర్‌ను తగ్గించేందుకే రాజీవ్ ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నాడు’ అని పేర్కొంది. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అలాగే తన ఇన్స్టాగ్రామ్ చూపిస్తూ ఈ వీడియో రొమాంటిక్ కాదని, షూటింగ్లో భాగంగా కరణ్, నేను ఓ ఈవెంట్లో తీసిందని తెలిపింది. ‘నా మొత్తం ఇన్స్టాగ్రామ్ చూస్తే పరాయి వ్యక్తితో ఉన్నది ఈ ఒక్క వీడియో మాత్రమే. అది కూడా రొమాంటిక్ వీడియో కాదు. వర్క్‌లో భాగంగా ఓ చానల్ వాళ్లు నన్ను, కరణ్‌ని ఇంటర్య్వూకి పిలిచారు. అప్పుడు కరణ్ నా పక్కనే ఉన్నాడు. ఆ చానల్ వాళ్లు అప్పుడు తీసిన వీడియో ఇది. పక్కనే మరికొందరు కూడా ఉన్నారు. ఇది రొమాంటిక్ వీడియో అయితే మేం ఇద్దరమే ఉండాలి కదా?’ అని చెప్పింది. గతంలో కూడా రాజీవ్ తనపై ఇలాంటి అరోపణలే చేశాడని, అప్పుడు డ్రైవర్‌తో ఇప్పుడు తన కో-స్టార్‌తో అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Charu Asopa Sen (@asopacharu) -
ఆమెకు మైండ్ పోయింది, ఎప్పటికీ క్షమించను: సుష్మితా సోదరుడు
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ తనను చిత్రహింసలు పెట్టాడని మీడియా ముందు కంటతడి పెట్టుకుంది అతడి భార్య, నటి చారు అసోపా. తాను గర్భవతిగా ఉన్న సమయంలోనూ హింసించాడని వాపోయింది. తాజాగా ఆమె ఆరోపణలను తోసిపుచ్చాడు రాజీవ్. 'చారు అసోపా ప్రతిసారి ఉమెన్ కార్డ్ వాడాలనుకుంటోంది. ఆమె మైండ్ పూర్తిగా పోయిందని అర్థమవుతోంది. అలాగే తనపై ఉన్న కాస్త గౌరవం కూడా తుడిచిపెట్టుకుపోయింది. నేను హింసించానన్నందుకు ఒక్క సాక్ష్యం కూడా లేదు, కానీ లేనిపోని అభాండాలు వేస్తోంది. నా కుటుంబం అంతా కూడా నాకంటే తననే ఎక్కువగా ప్రేమిస్తూ ఆమెకే సపోర్ట్ చేసినప్పటికీ ఇలాంటి అవమానకరమైన ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇందుకు ఆమెను నేనెప్పటికీ క్షమించను. చారు అసోపా టీవీ నటుడు కరణ్ మెహ్రాతో రొమాంటిక్ రీల్ చేసింది. ఈ విషయం ఆమె తల్లే బయటపెట్టింది. మళ్లీ నేనే మోసం చేస్తున్నానని, అనుమానిస్తున్నానని నామీదే నిందలు వేసింది. ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం అసలు! నమ్మకం లేనిది నాకు కాదు, తనకు! ఆమె తల్లి చెప్పినట్లుగా అంతకుముందు రిలేషన్షిప్లో కూడా చారు ఎవరినీ నమ్మేది కాదు. నేను మనిషిని, నాకూ కోపం వస్తుంది. కానీ ఇలా కోపం రావాలని రెచ్చగొట్టే వ్యక్తులు చాలా ప్రమాదకరం. ఆమె స్వార్థపూరితంగా తనను తాను రక్షించుకోవడానికి నా బిడ్డను ఓ కవచంలా వాడుకుంటోంది. నా కూతురు ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం నచ్చట్లేదు. ప్రతిదానికీ ఆమె మీడియా ముందుకు రాకపోతే పరిస్థితులు మరోలా ఉండేవి. అయినా ఇంత జరిగాక ఊరుకునే ప్రసక్తే లేదు. ఆమెతో నేనిక వేగలేను. పదేపదే నామీద నిందలు వేసే మనిషితో నేను జీవితం కొనసాగించలేను' అని చెప్పుకొచ్చాడు రాజీవ్. చదవండి: ఇప్పుడసలైన మజా.. ఆదిరెడ్డి వర్సెస్ గీతూ కాంతార హీరో రిషబ్ శెట్టి నటించిన తెలుగు సినిమా?