మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ తనను చిత్రహింసలు పెట్టాడని మీడియా ముందు కంటతడి పెట్టుకుంది అతడి భార్య, నటి చారు అసోపా. తాను గర్భవతిగా ఉన్న సమయంలోనూ హింసించాడని వాపోయింది. తాజాగా ఆమె ఆరోపణలను తోసిపుచ్చాడు రాజీవ్.
'చారు అసోపా ప్రతిసారి ఉమెన్ కార్డ్ వాడాలనుకుంటోంది. ఆమె మైండ్ పూర్తిగా పోయిందని అర్థమవుతోంది. అలాగే తనపై ఉన్న కాస్త గౌరవం కూడా తుడిచిపెట్టుకుపోయింది. నేను హింసించానన్నందుకు ఒక్క సాక్ష్యం కూడా లేదు, కానీ లేనిపోని అభాండాలు వేస్తోంది. నా కుటుంబం అంతా కూడా నాకంటే తననే ఎక్కువగా ప్రేమిస్తూ ఆమెకే సపోర్ట్ చేసినప్పటికీ ఇలాంటి అవమానకరమైన ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇందుకు ఆమెను నేనెప్పటికీ క్షమించను. చారు అసోపా టీవీ నటుడు కరణ్ మెహ్రాతో రొమాంటిక్ రీల్ చేసింది. ఈ విషయం ఆమె తల్లే బయటపెట్టింది. మళ్లీ నేనే మోసం చేస్తున్నానని, అనుమానిస్తున్నానని నామీదే నిందలు వేసింది. ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం అసలు!
నమ్మకం లేనిది నాకు కాదు, తనకు! ఆమె తల్లి చెప్పినట్లుగా అంతకుముందు రిలేషన్‌షిప్‌లో కూడా చారు ఎవరినీ నమ్మేది కాదు. నేను మనిషిని, నాకూ కోపం వస్తుంది. కానీ ఇలా కోపం రావాలని రెచ్చగొట్టే వ్యక్తులు చాలా ప్రమాదకరం. ఆమె స్వార్థపూరితంగా తనను తాను రక్షించుకోవడానికి నా బిడ్డను ఓ కవచంలా వాడుకుంటోంది. నా కూతురు ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం నచ్చట్లేదు. ప్రతిదానికీ ఆమె మీడియా ముందుకు రాకపోతే పరిస్థితులు మరోలా ఉండేవి. అయినా ఇంత జరిగాక ఊరుకునే ప్రసక్తే లేదు. ఆమెతో నేనిక వేగలేను. పదేపదే నామీద నిందలు వేసే మనిషితో నేను జీవితం కొనసాగించలేను' అని చెప్పుకొచ్చాడు రాజీవ్.
చదవండి: ఇప్పుడసలైన మజా.. ఆదిరెడ్డి వర్సెస్ గీతూ
కాంతార హీరో రిషబ్ శెట్టి నటించిన తెలుగు సినిమా?
Comments
Please login to add a commentAdd a comment