Charu Asopa Denied House In Mumbai For Being Single Mom, Deets Inside - Sakshi
Sakshi News home page

Charu Asopa: ఒంటరిగా ఉన్న నటికి ఇల్లు దొరకని దీనస్థితి.. ఆ కారణంతోనే..

Published Sun, Apr 30 2023 10:33 AM | Last Updated on Sun, Apr 30 2023 12:31 PM

Charu Asopa Denied House in Mumbai for Being Single Mom - Sakshi

సుష్మితా సేన్‌ సోదరుడు రాజీవ్‌ సేన్‌- నటి చారు అసోపాలు విడిపోయిన సంగతి తెలిసిందే! రాజీవ్‌ చిత్రహింసలు పెట్టాడని, గర్భవతిగా ఉన్న సమయంలోనూ హింసించాడని భర్తపై ఆరోపణలు చేసింది చారు. అంతా అబద్ధం, తనే మరో నటుడితో సన్నిహితంగా మెదిలి నన్ను మోసం చేసిందని ఎదురుదాడి చేశాడు రాజీవ్‌. ఇలా వీరిద్దరి మధ్య గొడవ ముదిరి పాకాన పడటంతో తన కూతురిని తీసుకుని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది నటి. కానీ తనకు ఉండటానికి ఇల్లు దొరకడమే కష్టమైపోయిందట.

ప్రస్తుతం ఉంటున్న 1బీహెచ్‌కే నుంచి 2బీహెచ్‌కేకు మారాలనుకుంటోంది చారు. ఇందుకోసం ఎప్పటినుంచో అద్దె ఇల్లు వెతకడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న సమస్యలను చెప్తూ బాధపడింది చారు. ఆమె మాట్లాడుతూ.. 'ముంబైలో ఇల్లు దొరకడం అంత ఆషామాషీ కాదు. ఇప్పటికీ మండుటెండలో ఇంటి కోసం వెతుకుతూనే ఉన్నాను. ప్రతిరోజూ ఇల్లు వెతకడమే నా పనైపోయింది. చాలా కష్టంగా అనిపిస్తోంది. ఇక్కడ నాకు ఎదురవుతున్న సమస్యేంటంటే.. మొదట నేను నటిని, తర్వాత సింగిల్‌ పేరెంట్‌ను. ఈ రెండు కారణాల వల్ల నాకు ఇల్లు ఇవ్వడం లేదంటే మీరు నమ్ముతారా? ఇలాగైతే ముంబైలో నటీనటులకు ఇల్లెక్కడ దొరుకుతుంది?

ఇలా రోజూ తిరిగే క్రమంలో ఒక ఫ్లాట్‌ నాకు చూడగానే నచ్చింది. అన్నింటికీ అనుకూలంగా ఉన్నట్లు అనిపించింది. కానీ వాళ్లు నేను నా కూతురితో ఒంటరిగా ఉంటానని తెలిసి తిరస్కరించారు' అని చెప్పుకొచ్చింది చారు అసోపా. కాగా చారు అసోపా- రాజీవ్‌ సేన్‌ 2019 గోవాలో పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరి మధ్య విభేదాలు రావడంతో 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి చారు అసోపా ఏడాదిన్నర కూతురితో కలిసి విడిగా జీవిస్తోంది.

చదవండి: నీలాంటి వాళ్లు గుడికి ఎందుకు వస్తారో? నటుడిపై ట్రోలింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement