జీవితం చాలా చిన్నది.. తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి: రాజీవ్ సేన్ | Rajeev Sen Reacts to estranged wife Charu Asopa allegations | Sakshi
Sakshi News home page

Rajeev Sen Vs Charu Asopa: చారుది చిన్నపిల్ల మనస్తత్వం.. ఆమె తిరిగి రావాలనుకుంటున్నా: రాజీవ్ సేన్

Published Wed, Nov 9 2022 9:48 PM | Last Updated on Wed, Nov 9 2022 9:55 PM

Rajeev Sen Reacts to estranged wife Charu Asopa allegations - Sakshi

బుల్లితెర సీరియల్‌ నటి చారు అసోపా చారు- నటి సుష్మితా సేన్‌ సోదరుడు రాజీవ్‌ సేన్‌ రాజీవ్‌ సేన్‌ల విడాకుల వ్యవహారం కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. తప్పు చేసింది నువ్వంటే నువ్వని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. సహ నటుడితో రొమాంటిక్‌ రీల్‌ చేయలేదా అని భార్యను నిలదీసే వచ్చాక వీరిద్దరి వ్యవహారం. ఆ వివాదం కాస్తా నెట్టింట తీవ్రమైన చర్చకు దారి తీసింది. భర్త ఆరోపణలపై చారు ఆవేదన వ్యక్తం చేసింది. అంత ఈజీగా నిందలు ఎలా వేస్తారని భర్త రాజీవ్ సేన్‌ను ఉద్దేశించి మాట్లాడింది. 

(చదవండి: అంత ఈజీగా నిందలు ఎలా వేస్తారు? భర్త ఆరోపణలపై నటి ఆవేద)

అయితే ఈ వ్యవహారంలో తన భార్య చారు అసోపా ఆరోపణలపై రాజీవ్ సేన్ ప్రతిస్పందించారు. ఆమె నా కుమార్తెతో  సహా బయటకు వెళ్లడం ద్వారా తనకు తానే ప్రతీది కోల్పోయేలా చేసుకుందన్నారు. ఆమె కోసం ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని రాజీవ్ వ్యాఖ్యానించారు. చారు-కరణ్ మెహ్రాల ‘వ్యవహారం, చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లడం నుంచి.. ముద్దుల కూతురు జియానా పుట్టినరోజు వేడుకపై గురించి మాట్లాడారు. ఒక వ్యక్తిగా చారు మీడియాతో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం తప్పు అని అన్నారు. ఈ విషయంలో ఆమె కూడా బాధపడి ఉంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదంతా ప్రజలకు ఒక జోక్‌లా అనిపిస్తుందని రాజీవ్ వెల్లడించారు. 

విడాకులు కావాలంటే గౌరవప్రదంగా తీసుకోవాలి కానీ.. ఇలా  పరువు తీసుకునేలా చేయకూడదని  రాజీవ్ అన్నారు. నేను చారు, మా కుటుంబంతో కలిసి చాలా వ్లాగ్స్ చేశాం.. కానీ జరిగినదంతా చూసి చాలా బాధపడినట్లు తెలిపారు. నా గురించి ఇంత దారుణంగా ఎవరూ మాట్లాడలేదని రాజీవ్ సేన్ అన్నారు. చారుది చిన్న పిల్ల మనస్తత్వమని.. తాను ఎక్కువ ఎమోషనలవుతుందని ఆయన పేర్కొన్నారు. 

రాజీవ్ సేన్ మాట్లాడుతూ.. 'ఈ వ్యవహరంలో నేనే స్పష్టంగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ఈ వివాదం వల్ల నా బిడ్డ ప్రభావితం కావడం నాకు ఇష్టం లేదు.. అందుకే చారు తిరిగి వచ్చేందుకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి. చారు మా కుటుంబానికి తిరిగి రావాలనుకుంటున్నాం. ఇది జియానా ఇల్లు. మన జీవితం చాలా చిన్నది.' అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement