Charu Asopa Reveals Horrible Casting Couch Experience - Sakshi
Sakshi News home page

Charu Asopa: ఆ డైరెక్టర్‌ మాటలకు ఏకంగా జ్వరమొచ్చింది: చారు అసోఫా

Published Fri, Aug 11 2023 7:01 PM | Last Updated on Fri, Aug 11 2023 7:47 PM

Charu Asopa Reveals Horrible Casting Couch Experience - Sakshi

బాలీవుడ్ బుల్లితెర భామ చారు అసోఫా బీటౌన్‌లో అందరికీ సుపరిచితమే. 'మేరే ఆంగ్నే మే' సీరియల్‌తో ప్రేక్షకుల ఆదరణ తెచ్చుకుంది. ఆ తర్వాత దేవోన్ కే దేవ్...మహాదేవ్‌, బల్వీర్‌, జిజి మా, కైసా హై యే రిష్టా అంజనా లాంటి సీరియల్స్‌లో నటించింది. అంతే కాకుండా ఇంపేషంట్ వివేక్, కాల్‌ ఫర్‌ ఫన్‌, యోల్క్, జోహరి లాంటి హిందీ చిత్రాల్లో కనిపించింది.

(ఇది చదవండి: ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? జూ.ఎన్టీఆర్‌తో ఆ సినిమాలో )

ఈ ఏడాదిలోనే తన భర్త రాజీవ్ సేన్ నుంచి విడాకులు తీసుకున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచుకుంది. తన జీవితంపై తీవ్ర ప్రభావం చూపిన సంఘటనను వివరించింది. తనకు 20 ఏళ్ల వయసులో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు తన అంచనాలను తారుమారు చేశాయని పేర్కొంది.

చారు అసోఫా మాట్లాడుతూ..' నేను సినిమా అవకాశంపై మాట్లాడానికి వెళ్లా. అది చాలా పేరున్న ప్రొడక్షన్ హౌస్‌. అక్కడు ఓ డైరెక్టర్‌ను కలిశాను. ఆ సమయంలో డైరెక్టర్ నా ముందు ఓ ప్రాజెక్ట్ ఉంచాడు. అది పెద్ద ప్రాజెక్ట్ కావడంతో నేను వెంటనే సంతకం చేశా. ఆ తర్వాత నాకు ఊహించని సంఘటన ఎదురైంది. అతను అడిగిన మాటలకు నాకు మూడు రోజులు జ్వరం తగ్గలేదు. అతని మాటలకు రెండు చేతులు జోడించి.. మీరు అడుగుతున్నది నేను చేయలేనని చెప్పా. దానికి అతను బదులిస్తూ.. నువ్వు చేయకపోతే బయట చాలామంది అమ్మాయిలు వెయిట్‌ చేస్తున్నారు అంటూ చెప్పాడు. అలా అయితే మీరు వారినే సెలెక్ట్ చేసుకోండి.' అంటూ అక్కడి నుంచి వచ్చేశా అని తెలిపింది. ఆ సమయంలో తాను ధైర్యంగా అతన్ని ఎదిరించినట్లు వెల్లడించింది. అంతే కాకుండా తనకు తెలిసిన కొంతమంది డైరెక్టర్లతో కాంప్రమైజ్ కావాలని కోరినట్లు ఆమె వెల్లడించింది. కాగా.. ప్రస్తుతం చారు అసోపా  తన 18 నెలల కూతురు జియానా బాధ్యతలు చూసుకుంటోంది.

(ఇది చదవండి: సినిమాని 'దేశభక్తి' కాపాడిందా? లేదంటే..!) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement