
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ పరాక్రమాన్ని చూపుతూ ఆయన జీవిత కథ ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) ఛావా చిత్రాన్ని తెరకెక్కించారు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసు భాయి పాత్రలో రష్మిక మందన్నా అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించారు. ఈ మూవీలోని "ఆయా రే తూఫాన్" పాటకు విపరీతంగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. సోసల్‌మీడియాలో ఈ పాట బీజీఎమ్‌తో ఎన్నో రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ సాంగ్‌ను లైవ్‌లో ఏ.ఆర్.రెహమాన్, మరాఠీ సింగర్ వైశాలి సామంత్(Vaishali Samant) పాడారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.
బాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటే వినిపిస్తోంది. ఈ పాటతో మరాఠీ సింగర్ వైశాలి సామంత్‌కు మరింత గుర్తింపు దక్కింది. ఇప్పటికే ఆమె చాలా పాటలు పాడినప్పటికీ ఆయా రే తుఫాన్ సాంగ్‌తో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఈ పాటకు ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతం అందించడంతో పాటు ఆయన కూడా ఆలపించారు.

ఛావా కలెక్షన్స్
ప్రపంచవ్యాప్తంగా ఛావా 8 రోజుల్లోనే రూ. 297 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. 2025లో తొలి హిట్‌గా ఛావా నిలిచింది అంటూ ఇండస్ట్రీ వర్గాలు కూడా తెలుపుతున్నాయి. త్వరలో రూ. 500 కోట్ల మార్క్‌ను సులువుగా చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీకి మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. అయితే, ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయాలంటూ ఇప్పటికే చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో అన్ని భాషలలో విడుదల చేస్తే బాగుండేదని తెలుపుతున్నారు. అదే జరిగింటే ఇప్పటికే రూ. 500 కోట్ల కలెక్షన్స్ దాటేదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment