A R Rahman
-
రెహమాన్ విడాకుల కారణం పై క్లారిటీ ఇచ్చిన మోహినిడే
-
రెహమాన్ విడాకులు.. ఆస్తి పంపకాలపై లాయర్ ఏమన్నారంటే?
సంగీత సామ్రాట్ ఏఆర్ రెహమాన్ 29 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికాడు. భార్య సైరా భానుకు విడాకులు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే అతడి శిష్యురాలు మోహిని డే కూడా తన భర్త మార్క్ హార్ట్సచ్కు విడాకులు ఇస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రెండు విడాకులకు ఏమైనా సంబంధం?ఈ క్రమంలో ఈ రెండు విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. దీనిపై సైరా భాను లాయర్ వందన షా స్పందించారు. ఈ రెండు జంటల విడాకులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. రెండు విడాకులు వేర్వేరు అని నొక్కి చెప్పారు. రెహమాన్-సైరా పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారన్నారు. ఆస్తి పంపకాలుఅందుకు గల కారణాలను చెప్పే స్వేచ్ఛ తనకు లేదన్నారు. ఆస్తి పంపకాలు, భరణం వంటి వాటి గురించి ఇంకా ప్రస్తావన రాలేదని, ఒకవేళ వచ్చినా వాటి గురించి బయటకు చెప్పలేనని తెలిపారు. కాగా ఏఆర్ రెహమాన్, సైరా భానుల వివాహం 1995 మార్చిలో జరిగింది. ఈ దంపతులకు ఖతీజా, రహీమా, అమీన్ అనే పిల్లలు సంతానం.చదవండి: ధనుశ్ - ఐశ్వర్య విడాకులు.. ఇక అదొక్కటే మిగిలి ఉంది! -
రాక్షసుడిలా 'రాయన్'.. అంచనాలు పెంచేసిన ట్రైలర్
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న 'రాయన్' నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.'రాయన్' ట్రైలర్‌తోనే ధనుష్ ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు రాయన్‌తో ఆయనలో దాగివున్న దర్శకత్వం టాలెంట్ అందరినీ మెప్పించేలా ఉంది. ట్రైలర్‌ను కూడా అందరినీ మెప్పించేలా కట్ చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జులై 26న రిలీజ్ కానుంది. -
RC 16 Launching Ceremony: గ్రాండ్‌గా ప్రారంభమైన బుచ్చి బాబు-రామ్ చరణ్ సినిమా (ఫొటోలు)
-
రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..
-
లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్
సాక్షి, ముంబై: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కుమార్తెలు రతీజా రెహమాన్, రహీమా రెహమాన్ ఫాస్టెస్ట్, లగ్జరీ కారును కొనుగోలు చేశారు. పోర్షే టైకాన్ కారు కొన్న విషయాన్ని స్వయంగా రెహమాన్ ట్విటర్లో వెల్లడించారు. యువ నిర్మాతలు, కూల్ మెటావర్స్ ప్రాజెక్ట్ లీడర్స్ రతీజా, రహీమా (ఏఆర్ఆర్ స్టూడియోస్) కారు కొన్నందుకు ముఖ్యంగా కాలుష్య రహిత కార్‌ను ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో సంతోషం ప్రకటించారు. అంతేకాదు ‘గర్ల్ పవర్’ అంటూ గర్వాన్ని ప్రకటించారు. “ARR స్టూడియోస్” పేరుతో ఉన్న ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును, పక్కనే ఖతీజా , రహీమా నిలబడి ఉన్న బ్యూటిఫుల్ పిక్‌ను షేర్ చేశారు. జర్మన్ స్పోర్ట్స్ కార్కు చెందిన, జెంటియన్ బ్లూ మెటాలిక్ కలర్లో మెరిసిపోతున్న పోర్షే టైకాన్ ధర రూ. 1.53 కోట్ల నుంచి రూ. 2.34 కోట్లు. ఉంటుంది. జర్మన్ స్పోర్ట్స్ కార్ తయారీదారు Taycan EV టాప్-స్పీడ్‌ను 260Kmphకి పరిమితం చేసింది.ఈ కారు కేవలం 2.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లలో పోర్షే టైకాన్ ఒకటి. ఈ ఖరీదైన లగ్జరీ స్పోర్ట్స్ కారుకు భారతదేశంలో డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా అనేక మంది యువ పారిశ్రామికవేత్తలు దీనిపై మనసు పారేసుకుంటున్నారు. 2021లో భారతదేశంలో పోర్షే టైకాన్‌ను లాంచ్ చేసింది. Taycan RWD, Taycan 4S, Taycan Turbo మరియు Taycan Turbo Sin ఉన్నాయి. Our young producers of #ARRstudios spearheading cool #Metaverse projects @RahmanKhatija #RaheemaRahman. Have chosen to go green with the #electriccar. Be the change you want to see. #bosswomen #girlpower #gogreen pic.twitter.com/i8TFUZULF9 — A.R.Rahman (@arrahman) November 23, 2022 -
'రజనీకాంత్ సినిమాలకు చేయాలంటే నరకంలా ఫీల్ అయ్యేవాడిని'
సూపర్ స్టార్ రజనీకాంత్, ఏ ఆర్ రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కలెక్షన్ల పరంగానే కాక మ్యూజికల్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసింది. ఈ వరుసలో ముత్తు, శివాజీ, రోబో, రోబో 2.0 వున్నాయి. ఈ లెజెండరీల కాంబినేషన్లో సినిమా వస్తుందంటే చాలు మూవీ లవర్స్ కు పండగే. అయితే ఇదంతా తెరపైన మనకి కనపడేవి.కానీ దీని వెనుక చాలా వ్యయ ప్రయాసలు,కష్టాలు, దగున్నాయని అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు ఏ ఆర్ రెహమాన్. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. రజనీకాంత్ సినిమాలకు పనిచేసిన రోజులు అంత ఆహ్లాదకరంగా ఉండేవి కాదని, ఆయన సినిమాకు పనిచేయడమంటే నరకంలా భవించేవాడినని చెప్పాడు. ఇప్పట్లో కొంచెం నయం అని, అప్పట్లో రజనీకాంత్ సినిమాలకు చాలా వరకు దీపావళికి విడుదలయ్యేవి. సినిమాకు పాటలు, బీజీఎం అధిరిపోవాలని అందరూ అనేవాళ్ళు. పైగా ఆయన చిత్రాలకు చాలా తక్కువ సమయం ఉండటంతో ఒత్తిడి కూడా అధికంగా వుండేదని, ఓ రకంగా చాలా ఒత్తిడి కూడా ఉండేదని చెప్పుకొచ్చాడు రెహమాన్. -
ఆయన పాట కమనీయం.. స్వరం రమణీయం
కొన్నేళ్ళుగా తన డ్రీమ్ ప్రాజెకై్టన మ్యూజికల్ ఫిల్మ్ ‘99 సాంగ్స్’తో ఏప్రిల్ 16న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలకరించనున్న ప్రపంచ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ‘సాక్షి’తో ఎక్స్‌క్లూజివ్‌గా, సుదీర్ఘంగా సంభాషించారు. అందులో నుంచి కొన్ని ముఖ్యాంశాలు... ► రచయితగా, నిర్మాతగా కొత్త జర్నీ గురించి... రెహమాన్: దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలోనే గడుపుతున్నా. కొత్తగా ఏదైనా చేయమని నా మైండ్ చెప్పింది. ఆస్కార్ అవార్డు తర్వాత హాలీవుడ్లో 5 ఏళ్ళున్నా. అక్కడి సినిమాలు చేశా. ఆ టైమ్‌లో కొన్ని వర్క్‌షాప్స్ చేశా. మనం ఎందుకు ఓ కథ చెప్పకూడదని అప్పుడనిపించింది. సంగీతం అనేది యూనివర్సల్ సబ్జెక్ట్. ప్రపంచంలో మంచి కథలున్నప్పుడు మనమూ చెప్పవచ్చనుకొని ‘99 సాంగ్స్’ కథ రాశాను. తల్లితో రెహమాన్ ► కొత్త రెహమాన్ పుట్టారననుకోవచ్చా? ఇదో మ్యూజికల్ ఫిల్మ్ లాగా అనిపిస్తోంది. (నవ్వేస్తూ...) అవును నిర్మాతగా కొత్త రెహమాన్నే. ఈ సినిమాలో పాటలు ఎక్కువే. అలాగని సినిమా పూర్తిగా సంగీతం గురించే కాదు. సామాజిక అంశాలూ ఉన్నాయి. ఈ కొత్త ప్రపంచానికీ, పాత ప్రపంచానికీ మధ్య వైరుధ్యాలనూ, డిమాండలోని తేడాలనూ మా కథ చూపిస్తుంది. ► మీ నిజజీవిత ఘట్టాలేమైనా కథలో పెట్టారా? లేదు. ఇది ఫ్రెష్స్టోరీ. వృత్తిలో భాగంగా చాలామందిని కలిశా. ఎన్నో ప్రదేశాలు చూశా. కొత్త క్యారెక్టర్లను చూశా. మనుషుల్ని రకరకాలుగా విడదీస్తున్న వేళ మ్యూజిక్, స్పోర్ట్స్, సినిమా... వీటి గురించి అందరినీ కలుపుతాయి. ముఖ్యంగా సినిమా. మా సినిమా రైట్ టైమ్‌లో వస్తోంది. ► ఈ కథపై దాదాపు ఏడేళ్లు వర్క్ చేశారట? ఒక అమ్మాయికి, ఒక అబ్బాయి వంద పాటలు రాయడమనేది నా బేసిక్ థాట్. కానీ ప్రేక్షకులకు పాటలే సరిపోవు. వాళ్లకు సినిమా చూస్తున్నామనే అనుభూతి కలగాలి. మ్యూజిక్, విజువల్స్ కలిస్తే బాగుంటుంది. ముందు తరాలవారు అలానే చేశారు. కె. విశ్వనాథ్ గారు తీసిన ‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’, బాలచందర్‌గారి ‘సింధుభైరవి’, మణిరత్నం ‘నాయగ¯Œ ’ ఇలాంటి సినిమాలు చూసి చాలా నేర్చుకున్నా. దర్శకులు శంకర్, సంజయ్ లీలా భన్సాలీ గ్రాండియర్ విజువల్స్‌తో పాటలను తెరకెక్కిస్తారు. ప్రతి దర్శకుడు, మ్యూజిక్ కంపోజర్ మైండ్స్ వేర్వేరు. ఈ ‘99 సాంగ్స్’ డైరెక్టర్ విశ్వేశ్ కృష్ణమూర్తి, నేను కలిసి ఉమ్మడి కలగా ఈ సినిమా చేశాం. ► చెన్నై సంగీత ప్రపంచానికి ఇది మీ కానుక...? అనుకోవచ్చు. 1980లలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం... ఇలా సౌత్‌లో ఉన్న సినీ జీనియస్‌లు అందరూ మద్రాసులోనే ఉండేవారు. తర్వాత ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ అయిపోయింది. ఓసారి దిలీప్ కుమార్ గారు మద్రాసులో 6 నెలలున్నారు. ఓ సినిమా చేశారు. అలా చెన్నైలో హిందీ సినిమాల షూటింగ్‌లూ జరిగాయి. అలాంటి మంచి రోజులు రావాలని, మరో స్వర్గం రావాలనీ మా సినిమా ఓ చిన్ని ప్రయత్నం. ► మ్యూజికల్ ఫిల్మ్స్ ఇండియాలో తక్కువ. నిర్మాతగా తొలిసారే ఇలాంటి ఛాలెంజ్...? (నవ్వేస్తూ) రెగ్యులర్‌గా ఉంటే, తీస్తే లైఫ్ బోర్ కొడుతుంది. అందుకే ఈ ఛాలెంజ్. జనం లవ్, యాక్షన్ ఫిల్మ్స్ చూశారు. ఓ మ్యూజికల్ సినిమా చూడబోతున్నామనే ఎగ్జయిట్మెంట్ వారికి ఉంటుంది. థియేటర్స్‌లో పాటలు వస్తున్నప్పుడు కొందరు మొబైల్ బ్రౌజింగ్‌లో ఉంటారు. ఏకకాలంలో ‘మల్టీఫుల్ థింగ్స్’ కోరుకుంటున్నారు. కానీ ఈ సినిమాకు అలా జరగదు. బిగువైన స్క్రీన్‌ప్లేతో ‘99 సాంగ్స్’ ఉంటుంది. ► తమిళం, హిందీ, తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. పాటలకు, గాయకుల విషయంలో జాగ్రత్తలు? ప్రతి పాటకూ 10 –13 రివిజన్స్ జరిగాయి. లిప్‌సింక్, మీనింగ్, పొయిట్రీ చూసుకున్నాం. అనువాదం చేయకుండా స్వేచ్ఛగా ఏ భాషకు ఆ భాషలో పాటలు రాశారు. డబ్బింగ్ సినిమాలా ఉండకూడదనుకున్నా. (నవ్వేస్తూ) అందర్నీ కష్టపెట్టి చాలా రివైజింగ్ వెర్షన్స్ చేశాం. కొన్నిసార్లు సింగర్స్నూ మార్చాం. తెలుగులో సీతారామశాస్త్రి గారు ‘సాయి..’ సాంగ్ బ్యూటిఫుల్‌గా రాశారు. అలాగే వెన్నెలకంటి కుమారుడు రాకేందు మౌళి. ► భారత చరిత్రలో తొలిసారి డాల్బీ ఎట్మాస్ టెక్నాలజీతో రిలీజ్ చేస్తున్న సౌండ్ ట్రాక్ ఆల్బమ్ అట కదా ఇది... అవును. ఆడియో త్వరలోనే రిలీజ్ చేస్తాం. ఫస్ట్ డాల్బీ సౌండ్ ట్రాక్ మా సినిమాతో లాంచ్ అవడం గౌరవంగా ఉంది. ఈ సినిమాను హిందీలోనే విడుదల చేద్దామనుకున్నాం. జియో స్టూడియోస్ మాతో అసోసియేటయ్యాక తెలుగు, తమిళంలోనూ చేయాలనుకున్నాం. ► మొదట మీకు కథ తట్టిందా? లేక సంగీతమా? (నవ్వుతూ) కథే! కథలో నుంచే సంగీతం వచ్చింది. కథ ప్రకారమే పాటలు ఉంటాయి. ► కె.విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’ సినిమాలు నచ్చాయన్నారు. మీరు ఆ టైమ్‌లో ఉంటే, ఆ సినిమాలకు చేసి ఉంటే...? లేదండీ. వాటికి లెజెండ్స్ వర్క్ చేశారు. కేవీ మహాదేవన్ గారిని నా గురువుగా భావిస్తాను. కర్ణాటక సంగీతం నుంచి తీసుకొని ఆయన సినిమాకు చేసిన ట్యూన్స్‌ను మ్యాచ్ చేయలేం. ► విశ్వనాథ్ గారి లాంటి వారితో ఓ మ్యూజిక్ ఫిల్మ్ చేయాలని మీరు ఆశపడుతుంటారా? ‘ఇఫీ’ ఫంక్షన్ లో గోవాలో విశ్వనాథ్‌గారిని కలిశా. గంట మాట్లాడా. ఆయనకి చాలా వినయం. అలాంటి అద్భుత చిత్రాలన్నీ భగవత్ కృప అని వినయంగా చెప్పారు. కమల్‌హాసన్ గారిని కలిసినప్పుడు రెండు గంటలు మాట్లాడుకున్నాం. ‘సాగర సంగమం’ రూపకల్పనలో విశ్వనాథ్‌గారి కృషి, అందరి మేధామథనం సంగతుల్ని నెమరేసుకున్నాం. ► మ్యూజిక్, రచన, నిర్మాణం... ఏది కష్టం? ఏ విషయాన్ని అయినా మూలాల నుంచి తపనతో నేర్చుకోవాలి. మ్యూజిక్‌లో నేను ఫాలో అయిన ఈ విధానాన్నే ప్రొడక్షన్, రైటింగ్లోనూ చేశా. సినిమా నిడివి మూడున్నర గంటలు వచ్చింది. కథాంశం పాడవకుండా ఉండేలా రెండు గంటల్లో సినిమా ఉండేలా కొత్త ఎడిట్ చేశాం. ‘మామ్’ చిత్ర ఎడిటర్ మోనిషా పని చేశారు. ట్రైలర్ కట్ కోసం దర్శకుడు అట్లీని సంప్రదించాం. కమర్షియల్ వేలో కట్ చేశారాయన. తమిళ వెర్షన్ కు దర్శకుడు గౌతమ్ మీనన్ డైలాగ్స్ అందించారు. ఆస్కార్ గెలిచిన ‘లా లా ల్యాండ్’కు చేసిన పియానో ప్లేయర్ మా సినిమాకు పనిచేశారు. చాలామంది అంతర్జాతీయ నిపుణులు, నా స్నేహితులు నన్ను గైడ్ చేశారు. ► నిర్మాతల కష్టాలు అర్థమయ్యాయా? (నవ్వేస్తూ) ప్రొడ్యూసర్ జాబ్ జూదం లాంటిది. నిర్మాతగా ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఫినిష్. చాలామంది నష్టపోయారు. కానీ ధైర్యంగా ముందుకు వెళ్లకపోతే లైఫ్ లేదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘సినిమాలో మంచి పాట ఇది.. వినండి’ అని నేనెప్పుడూ చెప్పను. కానీ నిర్మాత బాధ్యతలు వేరు. కెప్న్ ఆఫ్ ది షిఫ్ మనమే. సినిమాను రిలీజ్ చేయాల్సిన బాధ్యతా నిర్మాతలదే. కానీ ఈ ప్రొడక్ట్ ఒక్క నిర్మాతదే కాదు. డైరెక్టర్స్, ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్... ఇలా చాలామంది కలిస్తేనే ఒక సినిమా. వీటికి తోడు ఏఆర్ రెహమాన్ సినిమా అంటే కొన్ని అంచనాలు ఉంటాయి. వాటినీ అందుకోవాలి. ఇందులో అందరి కృషీ ఉంది. ► నిర్మాతగా, రచయితగా... కొనసాగుతారా? ‘99 సాంగ్స్’ రిలీజ్ కోసం చూస్తున్నా. నేను నిర్మాతగా కొనసాగాలో లేదో జనం నిర్ణయిస్తారు. ► సినిమా రఫ్కట్ మీ అమ్మగారికి చూపించారట అవును. ఆమె తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతారు. ఆ సమయంలో అమ్మ అనారోగ్యంతో మంచం మీదున్నారు. ఆవిడ చూసి ఇంగ్లీష్ సినిమాలా ఉందన్నారు. ఇనిషియల్ కట్, కథలోని సీన్లు ఆమెకి అలా అనిపించాయి. ► దర్శకులు శంకర్ ఇదే మాట అన్నట్లున్నారు? ఆయన ఓ పాట చూశారు. విజువల్స్ అంత గ్రాండ్‌గా అనిపిస్తుండడం హ్యాపీగా ఉంది. హాలీవుడ్ విజువల్స్, భారతీయ ఆత్మ – మా సినిమా. ► మీ చిత్రదర్శకుడు విశ్వేశ్కి మీ సలహాలేమైనా? లేదు. 2016లో ఈ సినిమాను స్టార్ట్ చేశాం. వర్క్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ నాలుగేళ్లు జరిగాయి. ► రాబోయే రోజుల్లో సినీ డైరెక్టర్‌గా కూడా...? లేదు. ‘లే మస్క్’ అనే ఓ చిన్న వర్చ్యువల్ రియాలిటీ ఫిల్మ్ మాత్రం తీశా. దర్శకత్వం అంటే, 2–3 ఏళ్ళు అన్నీ పక్కన పెట్టేయాలి. (నవ్వేస్తూ) నన్ను సంగీతం వదిలేయమంటారా ఏమిటి? ► మీరు వర్క్ చేసిన రాజ్–కోటితో అనుబంధం? కోటి గారిని కలుస్తుంటా. అన్నయ్య లేని నాకు ఆయన అన్నయ్య. రాజ్ గారిని చూసి చాలా కాలమైంది. ఆయనను కలవాలని ఉంది. ► గత ఏడాది మీ అమ్మ గారి లానే, లెజండ్ సింగర్ ఎస్పీ బాలు దూరమయ్యారు... (బాధగా)ఎస్పీబీ గారి లాంటి సింగర్ మరొకరు రారు. 40 వేల పాటలు పాడిన ఆయనను ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. 1982 –83 టైమ్‌లో అనుకుంటా... నా ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఆయన బర్త్ డేకి, మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో జరిగింది. నా మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లో ఆయన పాడిన పాటలన్నీ మళ్ళీ వీడియో రికార్డ్ చేయిద్దామని అనుకున్నాను. ఆయన ఎగ్జయిటయ్యారు. కానీ ఇంతలో కరోనా వ్యాప్తి. ప్రాజెక్ట్ ఆగింది. ఆయన వెళ్ళిపోయారు. ► ఆస్కార్ సాధించారు. మన సిన్మాలకి బెస్ట్ ఫారిన్ఫిల్మ్గా ఆస్కారొచ్చే ఛాన్స్? మన ఫిల్మ్‌మేకర్స్ ఏం మిస్సవుతున్నామో గమనించాలి. బావిలో కప్పల్లా ఉండిపోకూడదు. మనం వెళ్ళాలి, పోటీ పడాలి. నేను ‘ఫ్యూచర్ ప్రూఫ్స్’ వర్క్‌షాప్ కూడా చేశా. మార్కెటింగ్‌లో, క్రియేటివ్ సైడ్ కొత్త ఆలోచనలను సమీకరించడానికి ఈ ఛానెల్‌ను స్టార్ట్ చేశా. నేను అనకూడదు కానీ హాలీవుడ్లో భారతీయ సినిమాల పట్ల చిన్న రేసిజమ్ ఉంది. ఏ భాష సినిమా అయినా బాలీవుడ్ అనేస్తారు. నిజానికి, అద్భుతమైన డైరెక్టర్లు, సాంకేతిక నిపుణులు ఉన్నారు మన దగ్గర. మన మధ్య ఉన్న గ్యాప్‌ను కూడా పూడ్చుకోవాలి. ► నార్త్, సౌత్ మధ్య వివక్ష మాటేమిటి? అదో పెద్ద కథ. మరోసారి మాట్లాడతా. కానీ, జనరల్‌గా సౌత్ డైరెక్టర్స్ నార్త్‌లో చేస్తున్నారు. నార్త్ హీరోలు సౌత్‌లో నటిస్తున్నారు. జనం సమైక్యంగానే ఉన్నాం. తెలుగువారు తమిళం, తమిళం వారు తెలుగును ఇష్టపడతారు. హిందీవారు తమిళ పాటలను ఇష్టపడతారు. సో.. వుయార్ యునైటెడ్. వుయార్ హ్యాపీ ఇండియా. ► మీరు మళ్ళీ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేసేదెప్పుడు? ‘ఏ మాయ చేసావే’ స్ట్రైటేగా! మంచి కథ, దర్శకుడు కుదిరితే మళ్లీ చేస్తా. తెలుగంటే ఇష్టం. నా దగ్గరవాళ్ళతో తెలుగులోనే మాట్లాడుతుంటా. ► ఇటీవల ఓ ఫంక్షన్ లో ఈ తరం సంగీత దర్శకులు యువన్ శంకర్, జీవీ ప్రకాశ్, అనిరు«ధ్ మిమ్మల్ని పొగుడుతుంటే ఏమనిపించింది? ఈ తరంలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. వారు ప్రేమను చూపించడాన్ని గౌరవంగా ఫీలవుతున్నా. ఆర్టిస్టులందరూ కలిసి ఉంటే మరిన్ని అద్భుతాలు వస్తాయి. యువ సంగీతజ్ఞుల కోసం మేం ‘మాజా’ అనే యాప్ స్టార్ట్ చేశాం. ఇండిపెండెంట్ మ్యూజిక్‌ను ముందుకు తీసుకెళ్ళి, ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ► మీరు చాలామందికి స్ఫూర్తి. కొత్తతరాన్ని చూసి మీరు ఇన్ స్పైర్ అవుతారనుకోవచ్చా? అవును. ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తున్నా. ఎవరైనా కొత్త మ్యూజిక్‌ను ట్రై చేసినప్పుడు మెచ్చుకుంటే వారిలో మరింత జోష్ వస్తుంది. ► మీరు చాలామందిని ట్రైన్ చేస్తున్నారు కదా? మా కె.ఎం కన్జర్వేటరీ ద్వారా చాలామంది పైకొస్తు్తన్నారు. మేం కొన్ని షోలు చేశాం. కొన్నిసార్లు ఈ పాటను మరోలా పాడదామని అనిపిస్తుంటుంది. ఒకసారి నీతీ మోహన్, జనితాగాంధీ లాంటి యంగ్‌స్టర్స్ ఆడుతూ, పాడే శైలి చూశా. స్టేజ్‌పై ఎలా ఉండాలనే విషయాల్ని నేను వారిని చూసి నేర్చుకున్నా. మనం ఇంకా బాగా పాడాలి, ఏదో రిటైర్డ్ ఆఫీసర్లలా బిగుసుకోని ఉండకూడదని (నవ్వేస్తూ) అనుకున్నా. ఇప్పుడు బన్నీ, సిధ్ శ్రీరామ్ బాగా షైనవుతున్నారు. హ్యాపీగా ఉంది. ► మీ సంగీతానికి వారసులెవరు? మీ ఇంట్లో... నా అకాడెమీలోని స్టూడెంట్స్‌ను సొంత బిడ్డలుగా భావిస్తా. అమీన్, సార్థక్ కల్యాణి, పూర్వీ కౌటిశ్, ఔరంగాబాద్ అంజలీ గైక్వాడ్... ఇలా నా లెగసీని కంటిన్యూ చేయడానికి చాలామంది ఉన్నారు. అందులో నా బిడ్డలూ భాగస్వాములే. ► మీరీ స్థాయికి చేరుకోవడంలో మీ అమ్మగారి పాత్ర? గత ఏడాది మా అమ్మ మాకు దూరమయ్యారు. నేను, నా ఫ్యామిలీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాం. మా అమ్మకి మేం అంతలా అటాచ్ అయ్యాం. నా పిల్లలు, నా సిస్టర్స్ ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తుంటే, నా బాధను దిగమింగుకొని, వాళ్లల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత తీసుకున్నా. మా అమ్మగారు ఈ లోకాన్ని వదిలి మరో మంచి లోకాన్ని చేరుకున్నారు. ఈ విషయాన్ని మా ఫ్యామిలీ మెంబర్స్‌కు కన్విన్సింగ్‌గా చెప్పడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఆమె త్యాగం, గైడ్‌లైన్స్, ధైర్యమే మమ్మల్ని ఈ స్థాయిలో నిలిపాయి. మా అమ్మ పేరిట చెన్నైలో ఓ స్మారక చిహ్నం నిర్మిస్తున్నాం. ► ప్రపంచసిన్మాకి, భారతీయ సినిమాకు తేడా? ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి తెలియాలి. మనం బెగ్గర్స్ కాదు. మనకంటూ ఓ స్టేటస్, ఉనికి, ఐకమత్యం ఉన్నాయని ప్రపంచం మొత్తం తెలియాలి. కష్టపడి పనిచేసే తత్వం మన నేలలోనే ఉంది. అంతర్జాతీయ ప్రేక్షకులు మన ప్రతిభను గుర్తించాలి. ఇండియా అనగానే ఏదో పేదరికంలో మగ్గే దేశం అన్నట్లు జాలి చూపిస్తుంటారు వారి సినిమాల్లో. అది కరెక్ట్ కాదు. అందుకే, నాకు ‘బాహుబలి’ నచ్చింది. ‘ఎవెంజర్స్’, ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ లాగా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది. మన దగ్గర్నుంచి యంగ్ ఫిల్మ్‌మేకర్స్ మంచి ప్రతిభావంతులు వస్తున్నారు. మన సినిమాలు ప్రపంచస్థాయిని చేరుకోవాలని కోరుకుంటున్నా. – రెంటాల జయదేవ -
నయా రహమానియా
-
నటుడిగా మారిన రెహమాన్
సంగీతదర్శకుడిగా పలు మధురమైన పాటలను వినిపిస్తుంటారు ఏఆర్ రెహమాన్. ఆ పాటల్లో నటీనటులు అద్భుతంగా నటించారు. ఇప్పుడు రెహమాన్ నటుడిగా మారారు. మోహన్ లాల్ హీరోగా రూపొందుతున్న ‘ఆరట్టు’ అనే మలయాళ చిత్రంలో అతిథి పాత్ర చేశారు రెహమాన్. ఈ యాక్షన్ కామెడీ మూవీకి బి. ఉన్నికష్ణన్ డైరెక్టర్. ‘‘మ్యూజిక్ మ్యాస్ట్రో రెహమాన్ తో షూట్లో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అంటూ లొకేషన్ ఫోటోను షేర్ చేశారు మోహన్ లాల్. ఈ చిత్రం ద్వారా శ్రద్ధా శ్రీనాథ్ మలయాళ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ ఏడాది నవంబరులో సినిమా విడుదల కానుంది. చదవండి: ఏదో పెద్ద శక్తి ఉంది.. దానిపై నాకు చాలా నమ్మకం View this post on Instagram A post shared by Mohanlal (@mohanlal) -
రెహమాన్‌కు అరుదైన గౌరవం
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ‘బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా)’∙సంస్థ ఈ అరుదైన గుర్తింపును రెహమాన్‌కి అందించింది. ‘ఇండియన్ బ్రేక్ త్రూ ఇన్షియేటివ్ అంబాసిడర్’గా ఆయన్ని నియమించినట్లు ఆ సంస్థ తెలిపింది. బాఫ్టా రాయబారిగా రెహమాన్ ఇకపై నెట్‌ఫ్లిక్స్‌తో కలసి భారతదేశంలోని ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించాల్సి ఉంటుంది. దీనిపై రెహమాన్ స్పందిస్తూ – ‘‘సినిమాలు, కళలు, క్రీడలు, టీవీ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. భారత్‌లోని అద్భుతమైన ప్రతిభావంతులను ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. బాఫ్టాతో కలసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు. బాఫ్టాకు రెహమాన్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా బెర్రీ తెలిపారు. కాగా ప్రతి ఏటా ఈ సంస్థ ప్రదానం చేసే అవార్డులకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. -
ఎవరీ గ్యాంగ్?
బయటకే తళుకులు.. లోపలంతా చీకటి రాజకీయాలే ప్రతిభకు పోటు నెపోటిజం అవుట్‌సైడర్స్‌కు తిప్పలు తప్పవు ఈ మధ్య బాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న విమర్శలివి. ముఖ్యంగా వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూ, ప్రశాంతంగా కనిపించే ఏ ఆర్ రెహమాన్ ‘నాకు హిందీ సినిమాలు రానీకుండా ఓ గ్యాంగ్ పని చేస్తోంది’ అని ఆరోపించడం సంచలనం అయింది. ఇంతకీ ఎవరీ గ్యాంగ్? ఈ గ్యాంగ్ వెనక ఉన్న సూత్రధారి ఎవరు? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. ఇక రెహమాన్ వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయనకు మద్దతుగా స్పందించినవారి గురించి తెలుసుకుందాం. రెహమాన్ బిజీ కంపోజర్. ఎప్పుడూ నాలుగైదు ప్రాజెక్ట్స్ చేతిలో ఉంటాయి. అయితే హిందీలో మాత్రం తక్కువ సినిమాలు చేస్తున్నారు. అది ఆయన అంతట తగ్గించింది కాదు తగ్గించబడింది అట. ‘హిందీలో తక్కువ సినిమాలు చేస్తున్నారెందుకు?’ అనే ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పుకొచ్చారు. ‘నాకు సినిమాలు రాకుండా బాలీవుడ్ లో కొందరు గ్రూపిజమ్ చేస్తున్నారు. ట్యూన్స్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తానని, ఇలా మరికొన్ని అవాస్తవమైన వార్తలు నా మీద çసృష్టించారు. నాకు సినిమాలు రానివ్వకుండా ఓ గ్యాంగ్ పని చేస్తోంది’’ అని తెలిపారు రెహమాన్. ఆస్కార్ విజేత రెహమాన్‌కి కూడా ఇలా అవుతుందా? అని షాకయ్యారందరూ. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రెహమాన్‌కే ఇలా జరిగితే ఇక వేరేవాళ్ల పరిస్థితేంటి? అనే చర్చకు దారితీసింది. గ్రూపిజమ్, ఫేవరెటిజమ్ తో నచ్చినవాళ్లకు పని కల్పిస్తూ ఇష్టారాజ్య ధోరణిగా వ్యవహరిస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. రెహమాన్‌కి మద్దుతుగా పలువురు ప్రముఖులు స్పందించారు. ‘‘ఏది ఏమైనా నా పని నేను చేసుకుంటూ ఉంటాను’’ అని రెహమాన్ ట్వీట్ చేశారు. ‘డబ్బు పొతే తిరిగి సంపాదించుకోవచ్చు. పేరు పొతే కూడా సంపాదించుకోవచ్చు. కానీ విలువైన సమయాన్ని వృ«థా చేస్తే మళ్లీ ఎంత ప్రయత్నించినా తిరిగి తెచ్చుకోలేము. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవద్దు. మనం చేయాల్సిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. వాటి మీద దృష్టి పెడదాం’’ అని కూడా అన్నారు రెహమాన్. బాలీవుడ్ గురించి కొందరి మాటలు విన్నాక గ్యాంగ్ కుట్రలు, గ్రూపిజాలు ఉన్నాయని అర్థమవుతోంది. మరి.. ఇవి ఎలా ఆగుతాయి? ఎవరికి నచ్చిన పని వాళ్లు చేసుకునే వాతావరణం ఏర్పడుతుందా? బంధుప్రీతి, గ్యాంగ్.. వంటి వివాదాలేనా? రేపు మరో కొత్త వివాదానికి తెరలేస్తుందా? ప్రస్తుతం బయట ఉన్నట్లే బాలీవుడ్ లో అంతా అనిశ్చితి! ‘రెహమాన్ ఈ సమస్య ఎందుకు ఏర్పడిందో చెప్పనా? నువ్వు ఆస్కార్ సాధించిన సంగీత దర్శకుడివి. ఆస్కార్ గెలవడం అంటే బాలీవుడ్ లో మృత్యువుని ముద్దాడినట్టే. నిన్ను బాలీవుడ్ హ్యాండిల్ చేయలేనంత ప్రతిభ నీలో ఉంది అని అర్థం’’ అని ట్వీట్ చేశారు దర్శకుడు శేఖర్ కపూర్. – శేఖర్ కపూర్, సంగీత దర్శకుడు ‘‘రెహమాన్ కి కేవలం హాలీవుడ్ సినిమాల మీదే ఆసక్తి ఉందని, బాలీవుడ్ సినిమాలు చేసే ఆసక్తి లేదని మొదటి నుంచి అతని మీద ఆరోపణలు వేస్తూనే ఉన్నారు. దాంతో చాలామంది దర్శకులు ఆయనకు ఆసక్తి లేదేమో అనుకుని ఉండుంటారు. కానీ ఆయనతో పని చేయాలనుకునేవారు ఆయనతో పని చేస్తూనే ఉన్నారు. – రియానా, రెహమాన్ సోదరి. నాకూ ఇలానే జరిగింది! ‘‘ఆస్కార్ గెలిచిన తర్వాత బాలీవుడ్ నన్ను దూరం పెట్టింది. ఎవ్వరూ సినిమాల అవకాశాలు ఇవ్వకపోవడంతో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను. హిందీలో కొన్ని నిర్మాణ సంస్థలు నా ముఖం మీదే నువ్వు మాకు అవసరం లేదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినా నేను పని చేసిన ఇండస్ట్రీ అంటే నాకు గౌరవం’’ – రెసూల్ పూకుట్టి, సౌండ్ డిజైనర్. మీకు పరిమితులు లేవు. మీరు కేవలం బాలీవుడ్ కాదు. అంతకు మించి. మీరు కంపోజ్ చేసిన పాటల్ని వినడానికి మేము ఎప్పుడూ ఎదురు చూస్తుంటాం. – శ్వేతా మోహన్, గాయని. రెహమాన్ లాంటి నమ్మదగ్గ మనిషి మాట్లాడినప్పుడే ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి అని అందరికీ అవగాహన వస్తుంది. థ్యాంక్యూ సార్. – మీరా చోప్రా, నటి. నెపోటిజం (బంధుప్రీతి) టాపిక్ మీద ఇటీవల నేషనల్ మీడియాలో తరచూ కనిపిస్తున్న కంగనా కూడా ఈ విషయం మీద మద్దతుగా మాట్లాడారు. ’’ఈ (బాలీవుడ్) ఇండస్ట్రీలో పని చేసే ప్రతి ఒక్కరూ కచ్చితంగా వేధింపులకు గురవుతారు. మరీ ముఖ్యంగా స్వతంత్రంగా పని చేద్దాం అనుకునే వాళ్లు’’ అన్నారు కంగనా. – కంగనా, నటి -
ఓ గ్యాంగ్ నాకు వ్యతిరేకంగా పని చేస్తోంది
‘‘నా దగ్గరకు వచ్చిన ఏ మంచి సినిమానీ నేను కాదనను. కానీ నా వెనకాల ఒక గ్యాంగ్ ఉందనిపిస్తోంది. ఆ ముఠా నా గురించి లేనిపోనివి చెప్పి, నా దగ్గరకు రావాలనుకున్నవాళ్లను రానివ్వడంలేదని నా ఫీలింగ్’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. దక్షిణాదితో పోల్చితే హిందీలో తక్కువ సినిమాలు చేయడానికి కారణం ఏంటి? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెహమాన్‌ని అడిగితే ఈ విధంగా స్పందించారు. ‘దిల్ సే’, ‘తాళ్’, ‘లగాన్’, ‘స్వదేశ్’, ‘రంగ్ దే బసంతి’, ‘గురు’, ‘రాక్‌స్టార్’, ‘తమాషా’, ‘ఓకే జాను’ తదితర హిందీ చిత్రాలకు రెహమాన్ సంగీతదర్శకుడిగా వ్యవహరించారు. ఇక హిందీలో తాను ఎందుకు తక్కువ సినిమాలు చేస్తున్నాననే విషయం గురించి రెహమాన్ మాట్లాడుతూ – ‘‘నన్ను అపార్థం చేసుకుని, ఓ గ్యాంగ్ నా గురించి తప్పుడు ప్రచారం చేస్తోంది. కొంతమందికి, నాకు మధ్య దూరం పెంచుతోంది. ముఖేష్ చాబ్రా నా దగ్గరకు వచ్చినప్పుడు రెండు రోజుల్లో నాలుగు ట్యూన్స్ ఇచ్చాను. అప్పుడాయన ‘ఆయన దగ్గరకు వెళ్లొద్దు అని నాతో ఎంతమంది చెప్పారో లెక్కలేదు. మీ గురించి కథలు కథలుగా చెప్పారు’ అన్నారు. నేనెందుకు హిందీలో తక్కువ సినిమాలు చేస్తున్నానో ఆ మాటలు విన్నాక అర్థమైంది. నా దగ్గరకు మంచి సినిమాలు ఎందుకు రావడంలేదో గ్రహించాను. హిందీలో నేను చాలావరకు డార్క్ సినిమాలే చేస్తున్నాను. ఎందుకంటే ఓ గ్యాంగ్ నాకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. పీపుల్ (సినిమా ఇండస్ట్రీవాళ్లు) నాతో మంచి సినిమాలు చేయాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఓ గ్యాంగ్ అది జరగకుండా చేస్తోంది. ఆ మంచిని నాదాకా రాకుండా చేస్తోంది. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే నేను విధిని నమ్ముతాను. అలాగే ప్రతిదీ ఆ దేవుడి దగ్గరనుంచే వస్తుందని నమ్ముతాను. కాబట్టి నా దగ్గరకు వచ్చిన సినిమాలను నేను చేస్తున్నాను. కానీ నేను మాత్రం అందర్నీ స్వాగతిస్తున్నాను. నా దగ్గరకు రావచ్చు. మంచి సినిమాలు చేయొచ్చు. అందరికీ స్వాగతం’’ అన్నారు. -
రెహమాన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత బాలీవుడ్ పరిశ్రమలో నెపోటిజంపై పెద్ద దుమారమే రేగింది. దీంతోపాటు సంగీత పరిశ్రమ మాఫియా గుప్పిట్లో చిక్కుకుందంటూ సోనూ నిగంలాంటి ప్రముఖ గాయకులు కూడా బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మేస్ట్రో ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సంబంధించిన కొన్ని పుకార్లు ఇండస్ట్రీలో వ్యాపించాయని, దీని వెనక ఒక గ్యాంగ్ ఉందని పేర్కొన్నారు. సంగీతాభిమానులు, బాలీవుడ్ తన నుంచి చాలా ఆశిస్తోంటే..దానికి ఒక ముఠా అడ్డుపడుతోందని ఆరోపించారు. రేడియో మిర్చి ఆర్జే సురేన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. బాలీవుడ్ సినిమాలకు సంగీతాన్నిఎందుకు కంపోజ్ చేయలేదని అడిగినపుడు పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. తాను మంచి సినిమాలకు ఎపుడూ నో చెప్పలేదని, కానీ ఒక ముఠా తనపై పుకార్లను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. సినిమాలు తన వరకు రాకుండా కుట్ర చేస్తున్నారనీ, సమయానికి స్వరాలు ఇవ్వరనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రెహమాన్‌ను సంప్రదించవద్దని సలహా ఇచ్చారంటూ దిల్ బెచారా దర్శకుడు ముఖేష్ ఛబ్రా మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. రెహమాన్ దగ్గరికి వెళ్లొద్దని బాలీవుడ్లో ఛబ్రాకు పలువురు చెప్పారని అన్నారు. కానీ ముఖేష్ ఛబ్రాకు కేవలం రెండు రోజుల్లో నాలుగు పాటలకు స్వరాలు కూర్చి ఇచ్చినట్టు వివరించారు. (కరోనా: కూరలమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు) కాగా తమిళ, తెలుగు సహా అనేక భాషల్లో అద్భుతమైన స్వరాలను అందించిన రెహమాన్ హిందీలో తమాషా, రాక్‌స్టార్, దిల్ సే, గురుతో సహా ఇతర బాలీవుడ్ సినిమాలకు నేపథ్య సంగీతాన్ని అందించారు. ఆయన తాజా ఆల్బం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం దిల్ బెచారా. ఇటీవల మరణించిన సుశాంత్‌కు నివాళిగా రెహమాన్ బృందం వర్చువల్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. ఒక స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇందులో రెహమాన్ తో పాటు ఇతర ప్రముఖ గాయకులు, ఈ చిత్ర గేయ రచయిత అమితాబ్ భట్టాచార్య తమదైన రీతిలో నివాళి అర్పించిన సంగతి తెలిసిందే. (ఆ కథనంపై చలించిన సోనూసూద్) -
రీమిక్స్‌లు దారుణంగా ఉంటున్నాయి
ప్రస్తుతం బాలీవుడ్లో రీమిక్స్‌ల ట్రెండ్ నడుస్తోంది. దాదాపు ప్రతీ సినిమాలో ఏదో ఒక పాపులర్ పాట రీమిక్స్ వెర్షన్ వినిపిస్తోంది. ఈ రీమిక్స్ పాటల ట్రెండ్ గురించి మీరేమంటారు? రీమిక్స్ అయిన మీ పాటలు మీకు నచ్చాయా? అని ఎ.ఆర్. రెహమాన్‌ని అడిగితే ఇలా సమాధానమిచ్చారాయన. ‘‘ఓకే జాను’లో ‘హమ్మా.. హమ్మా..’ (‘బొంబాయి’ సినిమాలోని హమ్మా.. హమ్మా’ పాట) ను పాట బాగా రీమిక్స్ చేశారు. ఆ తర్వాత రీమిక్స్ అయిన పాటలు చాలావరకూ దారుణంగా ఉంటున్నాయి. కొన్నిసార్లు రీమిక్స్ పాటను నన్ను ప్రమోట్ చేయమంటారు కూడా. ‘నాకు ఈ పాట నచ్చలేదు. ఒకవేళ సపోర్ట్ చేస్తే కచ్చితంగా విమర్శలకు గురవుతాను’ అని చెప్పాను. రీమిక్స్ చేసే ఫాస్ట్ ఫుడ్ దారిని ఎంచుకోకుండా కథకు అవసరమయ్యే పాటను తయారు చేసుకోవడం బెస్ట్’’ అన్నారు రెహమాన్. -
రెహమాన్‌తో తొలిసారి
తమిళ స్టార్ హీరో విజయ్ వీలున్నప్పుడల్లా తన సినిమాలో పాటలు పాడుతుంటారు. గతంలో ‘రసిగన్, వేలై, తుపాకీ, కత్తి, తేరి, భైరవ’ వంటి సినిమాల్లో 20కి పైగా గీతాలను ఆలపించారు విజయ్. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘బిగిల్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. బిగిల్ అంటే విజిల్ అని అర్థం. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో ‘వెరితనం..’ అనే పాటను విజయ్ పాడారట. వెరితనం అంటే కసి, ఉన్మాదం వంటి అర్థాలున్నాయి. ఇదిలా ఉంటే.. రెహమాన్ సంగీత దర్శకత్వంలో విజయ్ పాడటం ఇదే తొలిసారి కావడం విశేషం. దీపావళికి రిలీజ్ కానున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. -
కొంచెం ఆలస్యంగా..
రెహమాన్ తొలిసారి కథా రచయితగా, నిర్మాతగా మారిన చిత్రం ‘99 సాంగ్స్’. విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎహన్ భట్, ఎడిల్సీ వర్గస్ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాను జూన్ 21న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతుందని రెహమాన్ తన ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘‘99 సాంగ్స్’ సినిమా మీద మీరు చూపిస్తున్న ఆసక్తి, ప్రేమ మమ్మల్ని విపరీతమైన ఆనందానికి గురి చేస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు ఫుల్ స్పీడ్‌లో జరుగుతున్నాయి. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’’ అని తెలిపారు. -
రెహమాన్ రాసిన ప్రేమకథ
సరికొత్త ట్యూన్స్, బీట్స్‌తో ఇన్ని సంవత్సరాలు సంగీత ప్రియుల్ని అలరించిన రెహమాన్ నిర్మాతగా, కథారచయితగా మారనున్న విషయం తెలిసిందే. ‘99 సాంగ్స్’ అనే చిత్రాన్ని నిర్మించడంతో పాటు ఈ సినిమా కథను రెహమానే అందించడం విశేషం. ఈ సినిమా జూన్ 21న రిలీజ్‌కు రెడీ అయింది. ఎహాన్ భట్, ఎడిల్సీ వర్గాస్ జంటగా మనీషా కొయిరాల, లిసా రే ముఖ్య పాత్రల్లో విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విశేషాల గురించి రెహమాన్ మాట్లాడుతూ – ‘‘నిర్మాతగా, కథా రచయితగా నా తొలి చిత్రం జూన్ 21న రిలీజ్ అవుతుందని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ‘99 సాంగ్స్’ సినిమా స్వచ్ఛమైన ప్రేమకథతో తీసినది. సంగీతమే ఈ సినిమాకు సోల్. జియో స్టూడియోస్‌తో కలసి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఎప్పటిలానే మీ ప్రేమ, అభిమానం, సపోర్ట్‌కు చాలా థ్యాంక్స్’’ అన్నారు. -
ఆయనే నాకు స్ఫూర్తి : ఏఆర్ రెహ్మాన్
తమిళ సినిమా: సంగీత సామ్రాజ్యానికి ఏకై క రారాజు ఇళయరాజానే అని నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ప్రశంసించారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సంగీతజ్ఞాని ఇళయరాజా, పలు భాషల్లో వెయ్యి చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించి ప్రపంచ ఖ్యాతి గాంచారు. ఈ సందర్భంగా ఆయనను నిర్మాతల మండలి ఘనంగా సత్కరించే రీతిలో స్థానిక నందనంలోని వైఎంసీఏ మైదానంలో రెండు రోజులు పాటు బ్రహ్మాండంగా సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శనివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ చేతుల మీదుగా సంగీత విభావరిని ప్రారంభించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ మొదలగు భారతీయ సినీ ప్రముఖులు పలువురు పాల్గొన్న ఈ కార్యక్రమంలో లక్షలాదిమంది సంగీత ప్రియులు విచ్చేశారు. కళాకారులు, గాయనీగాయకులు పలువురు పాల్గొని ఆటపాటలతో ఆహూతులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ మాట్లాడుతూ 1996లో తన అన్నయ్య వరదరాజన్‌తో కలసి చెన్నై నగరానికి వచ్చిన ఇళయరాజా, అన్నక్కిళి చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారన్నారు. గ్రామీణ పాటలకు, తమిళ సంప్రదాయ పాటలకు ప్రాణ ప్రతిష్ట చేసి ఘనుడు ఇళయరాజా అని పేర్కొన్నారు. కేవలం 13 రోజుల్లో సింపోనిని సమకూర్చి ప్రపంచ రికార్డు సాధించిన ఖ్యాతి ఆయనదని కీర్తీంచారు. 5 జాతీయ అవార్డులకు అలంకారంగా మారిన ఘనత ఇళయరాజాదని శ్లాఘించారు. ఈయనకు తమిళం, తెలుగు అంటూ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. అలాంటి సంగీతజ్ఞాని సంగీత పయనం ఇంకా పలు కాలాల పాటు దిగ్విజయంగా కొనసాగాలని గవర్నర్ ఆకాంక్షించారు. సంగీత సామ్రాజ్యానికి రారాజు నిర్మాతల మండలి అధ్యక్షడు, నటుడు విశాల్ మాట్లాడుతూ ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో రాజు ఉంటారని, అయితే సంగీత సామ్రాజ్యానికి మాత్రం ఏకైక రారాజు ఇళయరాజానే అని అన్నారు. అలాంటి సంగీత రాజును సత్కరించుకోవడం తమకు గర్వం కాదని, ఆయన రుణాన్ని కొంచెం అయినా తీర్చుకోవడం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆపాలని చాలామంది ప్రయత్నించారన్నారు. అయితే ఇళయరాజా చాలాకాలం క్రితమే ఒక చిత్రం కోసం ఎన్ కిట్ట మోదాదే నా రాజాధిరాజనడా (నాతో ఢీకొనవద్దు నేను రాజాధిరాజునురా) అన్న పాటను రూపొందించారన్నారు. ఆ విషయం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలన్న వారికి అర్థం అయ్యి ఉంటుందని విశాల్ చురకలు వేశారు. ఇళయరాజానే నాకు స్ఫూర్తి : ఏఆర్ రెహ్మాన్ ప్రఖ్యాత సంగీత దర్శక ద్వయం ఇళయరాజాను, ఏఆర్ రెహ్మాన్‌ను ఒకే వేదికపై చూడడం ప్రేక్షకులకు కనులపండుగగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఆర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. తనకు ఇళయరాజానే స్ఫూర్తి అని పేర్కొన్నారు. తనకు ఇప్పుడు హెడ్మాస్టర్ ముందు నిలబడిన స్టూడెంట్‌గా అనిపిస్తోందన్నారు. తనకు ఆస్కార్ అవార్డు లభించినప్పుడు ఎందరో సంగీత దర్శకులు అభినందించినా, సంగీత మేధావి ఇళయరాజా ప్రశంసలను ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. అనంతరం ఇళయరాజా మాట్లాడుతూ.. ఏఆర్ రెహ్మాన్ తన తండ్రి వద్ద కంటే తన వద్దే ఎక్కువ రోజులు ఉన్నారని, తనతో 500ల చిత్రాలు పనిచేశారని గుర్తుచేసుకున్నారు. కాగా, ఈ వేదికపై సినీ పరిశ్రమ అంతా కలసి ఇళయరాజాకు బంగారంతో చేసిన వయోలిన్‌ను బహుకరించారు. కాగా ఈ బ్రహ్మాండ సంగీత విభావరి కార్యక్రమానికి నటి సుహాసిని వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆసాంతం రక్తికట్టించారు. -
ఒక్క ట్వీట్‌తో రూమర్లకు చెక్ పెట్టేశాడు!
శంకర్ సినిమా వస్తోందంటే.. ఆ చిత్రానికి సంగీత దర్శకుడెవరు అనే ప్రశ్నే రాదు. ఎందుకంటే శంకర్-రెహమాన్ కాంబినేషన్‌కు ఉండే క్రేజ్ అలాంటిది. శంకర్ మొదటి సినిమా జెంటిల్మెన్ నుంచి మొదలు రీసెంట్గా వచ్చిన ‘2.ఓ’ వరకు ప్రతీ సినిమాకు రెహమానే స్వరాలు సమకూర్చారు. అయితే ప్రస్తుతం యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో శంకర్ భారతీయుడు-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి అందరూ ఊహించినట్టు ఏఆర్ రెహమాన్ కాక.. అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు శంకర్. ఇక అప్పటినుంచి శంకర్, రెహమాన్‌లకు మధ్య గొడవలు జరిగాయని, ‘2.ఓ’ షూటింగ్ సమయంలో ఇద్దరికి మనస్పర్థలు వచ్చాయని అందుకే ఈ సినిమాకు రెహమాన్‌ను తీసుకోలేదని ఏవేవో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాటన్నంటికి స్వర మాంత్రికుడు రెహమాన్ ఒక్క ట్వీట్‌తో చెక్ పెట్టేశాడు. మరో బ్లాక్ బస్టర్ చిత్రానికి సిద్దమవుతున్న నీకు, నీ బృందానికి గుడ్ లక్ అంటూ ట్వీట్ చేశారు. దీంతో వీరిద్దరికి ఎలాంటి గొడవలు జరగలేదని అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. Wishing you and your team for yet another block buster ! Good luck buddy 🌹 https://t.co/7RzPBaH34n — A.R.Rahman (@arrahman) 18 January 2019 -
రెహమాన్‌ని ఫిదా చేసిన ‘బేబి’
-
హ్యాట్రిక్ సాధిస్తారా?
ఇటీవల ‘సర్కార్’ సినిమాతో మరో సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నారు తమిళ నటుడు విజయ్. ఆయన నెక్ట్స్ అట్లీ దర్శకత్వంలో హీరోగా నటించనున్నారు. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. ఎజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఏఆర్. రెహమాన్ సంగీతం అందించనున్నారు. అట్లీ–విజయ్ కాంబినేషన్లో ఇది వరకు వచ్చిన ‘తేరి (తెలుగులో ‘పోలీసోడు’), ‘మెర్సెల్’ (తెలుగులో ‘అదిరింది’) సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించాయి. ఇప్పుడు ఈ ఇద్దరు హ్యాట్రిక్ హిట్‌పై కన్నేశారు. వచ్చే ఏడాది దీపావళికే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక చాన్స్ కోసం సమంత, కాజల్, సాయేషా, కీర్తీ సురేశ్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో విజయ్ బాక్సింగ్ కోచ్ పాత్రలో నటించబోతున్నారన్న ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. -
‘వారి పేర్లు విని షాక్ అయ్యాను’
‘#మీటూ ఉద్యమం’లో కొందరి పేర్లు విని షాకయ్యానంటున్నారు ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. మీటూ ఉద్యమంలో భాగంగా పలువురు ప్రముఖుల మీద లైంగిక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రెహమాన్ ఇలా స్పందించారు. ఈ సందర్భంగా తాను మీటూ ఉద్యమానికి పూర్తి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. తన సోదరి మీటూ ఉద్యమం గురించి స్పందించిన కొద్దిసేపటికే రెహమాన్ తన అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘గత కొంత కాలంగా మీటూ ఉద్యమాన్ని గమనిస్తున్నాను. బాధితులు.. నిందుతుల్లో కొందరి పేర్లు విన్నప్పుడు చాలా షాక్‌కు గురయ్యాను. మన పరిశ్రమ చాలా క్లీన్‌గా.. మహిళలను గౌరవించే విధంగా మారాలని ఆశిస్తున్నాను. ధైర్యంగా ముందుకు వచ్చిన బాధితులందరికి తగిన శక్తి సమకూరాలని కోరుకుంటున్నాను. సోషల్ మీడియా వల్ల బాధితులు తమకు జరిగిన అన్యాయాల గురించి స్వేచ్ఛగా మాట్లాగల్గుతున్నారు. ఇది చాలా మంచి విషయం. కానీ ఇంటర్నెట్లో న్యాయం, అన్యాయాల గురించి మాట్లాడేటప్పుడు కాస్తా జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే దీన్ని కొందరు తప్పుడు ప్రయోజనాలు కోసం కూడా వాడే అవకాశం ఉంది’ అని ట్వీట్ చేశారు. pic.twitter.com/VmkhntI5ho — A.R.Rahman (@arrahman) October 22, 2018 -
‘కేరళ కేరళ డోంట్ వర్రీ కేరళ’
సాక్షి, న్యూఢిల్లీ : కేరళను ముంచెత్తిన వరదల వల్ల అపార ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించడంతో బాధితులను ఆదుకునేందుకు ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి, దేశంలోని నలుమూలల నుంచి విశాల హృదయులు తమ శక్తి మేరకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక నటులు, కళాకారులు, సెలబ్రిటీలు, సంగీత సామ్రాట్లు తమదైన శైలిలో బాధితులను ఊరడిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లి అక్కడ తన సంగీత కచేరీని నిర్వహించారు. రెహమాన్ తాను సంగీతం సమకూర్చిన ‘ప్రేమ దేశం (కాదల్ దేశం)’ చిత్రంలోని ‘ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా’ పాటను ఆయన స్టేజ్‌పైన పడాల్సి ఉంది. అయితే కేరళను భారీ వరదలు ముంచెత్తుతున్నాయని తెల్సి బాధితుల్లో స్థైర్యాన్ని నింపడం కోసం ఆయన వారికి సంఘీభావంగా పాట పల్లవిలోని మాటలను కొద్దిగా మార్చి ‘కేరళ కేరళ డోంట్ వర్రీ కేరళ’ అంటూ ఆయన పాడారు. దానికి ప్రేక్షకుల నుంచి కూడా భారీ స్పందన లభించింది. వారిలో ఒకరు ఆయన పాడిన పాట పల్లవి వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇప్పుడది వైరల్ అవుతోంది. అనంతరం రెహమాన్ కేరళ బాధితులను ధైర్యంగా ఉండాలంటూ, కేరళను ఆదుకోవాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ రెండు వేర్వేరు ట్వీట్లు చేశారు. -
కేరళ వరదలు: ఏఆర్ రెహమాన్ పాడిన పాట!