రెహమాన్‌ విడాకులు.. ఆస్తి పంపకాలపై లాయర్‌ ఏమన్నారంటే? | Is AR Rahman Divorce Connected to Mohini Dey Separation?: Advocate Clarifies | Sakshi
Sakshi News home page

రెహమాన్‌ విడాకులకు ఆమెకు ఏ సంబంధం లేదు: లాయర్‌

Published Thu, Nov 21 2024 5:12 PM | Last Updated on Thu, Nov 21 2024 5:51 PM

Is AR Rahman Divorce Connected to Mohini Dey Separation?: Advocate Clarifies

సంగీత సామ్రాట్‌ ఏఆర్‌ రెహమాన్‌ 29 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికాడు. భార్య సైరా భానుకు విడాకులు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే అతడి శిష్యురాలు మోహిని డే కూడా తన భర్త మార్క్‌ హార్ట్‌సచ్‌కు విడాకులు ఇస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. 

రెండు విడాకులకు ఏమైనా సంబంధం?
ఈ క్రమంలో ఈ రెండు విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అన్న చర్చ సోషల్‌ మీడియాలో మొదలైంది. దీనిపై సైరా భాను లాయర్‌ వందన షా స్పందించారు. ఈ రెండు జంటల విడాకులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. రెండు విడాకులు వేర్వేరు అని నొక్కి చెప్పారు. రెహమాన్‌-సైరా పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారన్నారు. 

ఆస్తి పంపకాలు
అందుకు గల కారణాలను చెప్పే స్వేచ్ఛ తనకు లేదన్నారు. ఆస్తి పంపకాలు, భరణం వంటి వాటి గురించి ఇంకా ప్రస్తావన రాలేదని, ఒకవేళ వచ్చినా వాటి గురించి బయటకు చెప్పలేనని తెలిపారు. కాగా ఏఆర్‌ రెహమాన్‌, సైరా భానుల వివాహం 1995 మార్చిలో జరిగింది. ఈ దంపతులకు ఖతీజా, రహీమా, అమీన్‌ అనే పిల్లలు సంతానం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement