
కోలీవుడ్ స్టార్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న జంటల్లో ధనుశ్- ఐశ్వర్య ఒకరు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇవాళ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ధనుశ్, ఐశ్వర్య కోర్టుకు హాజరయ్యారు. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు తమ నిర్ణయాన్ని న్యాయమూర్తి వివరించారు. ఇటీవల వీరిద్దరు త్వరలో కలుసుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
తాజాాగా కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయమూర్తికి వివరించారు. విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం త్వరలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు తుది తీర్పును నవంబర్ 27కు వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే మరో స్టార్ జంట విడాకులు తీసుకోవడం దాదాపు ఖరారైనట్లే.
(ఇది చదవండి: కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!)
అయితే వీరి నిర్ణయంతో కోర్టు విడాకులు మంజూరు చేసే అవకాశముంది. ఇద్దరు కూడా కలిసి ఉండాలనుకోవట్లేదని ఇవాళ కోర్టుకు వివరించారు. దీంతో ఈ జంట తమ వివాహబంధానికి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను ధనుశ్ పెళ్లాడారు. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి బంధానికి ఎండ్ కార్డ్ పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment