Aishwarya
-
స్టూడెంట్‌గా నటించడం ఓ సవాల్: ఐశ్వర్యా శర్మ
‘‘డ్రింకర్ సాయి’లో ఒక మంచి ప్రేమకథను చూస్తారు. ఈ సినిమాలో బాగీ పాత్రలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ఐశ్వర్యా శర్మ తెలిపారు. ధర్మ హీరోగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ఐశ్వర్యా శర్మ మాట్లాడుతూ– ‘‘మా నాన్న స్టేజ్ యాక్టర్ కావడంతో నేనూ ఆర్టిస్టుగానే ఉండాలనుకున్నాను. ఇంటర్ పూర్తయిన తర్వాత జమ్మూ నుంచి ముంబై వచ్చి యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. కొన్ని యాడ్స్‌లో నటించాను. ‘డ్రింకర్ సాయి’తో హీరోయిన్గా పరిచయమవుతున్నాను. ఈ సినిమాలో మెడికల్ స్టూడెంట్ బాగీ పాత్ర చేశాను. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా ఈ క్యారెక్టర్ ఉంటుంది. అందుకే ఈ స్టూడెంట్ క్యారెక్టర్ సవాల్‌గా అనిపించింది. ఇక ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికీ, ‘డ్రింకర్ సాయి’ సినిమాకు పోలిక లేదు’’ అని చెప్పారు. -
‘సంబరాల ఏటిగట్టు’ మూవీ ఈవెంట్లో మెరిసిన హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (ఫొటోలు)
-
ధనుష్ – ఐశ్వర్య జంటకు విడాకులు మంజూరు
-
ధనుశ్ - ఐశ్వర్య విడాకులు.. ఇక అదొక్కటే మిగిలి ఉంది!
కోలీవుడ్ స్టార్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న జంటల్లో ధనుశ్- ఐశ్వర్య ఒకరు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇవాళ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ధనుశ్, ఐశ్వర్య కోర్టుకు హాజరయ్యారు. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు తమ నిర్ణయాన్ని న్యాయమూర్తి వివరించారు. ఇటీవల వీరిద్దరు త్వరలో కలుసుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.తాజాాగా కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయమూర్తికి వివరించారు. విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం త్వరలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు తుది తీర్పును నవంబర్ 27కు వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే మరో స్టార్ జంట విడాకులు తీసుకోవడం దాదాపు ఖరారైనట్లే.(ఇది చదవండి: కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!)అయితే వీరి నిర్ణయంతో కోర్టు విడాకులు మంజూరు చేసే అవకాశముంది. ఇద్దరు కూడా కలిసి ఉండాలనుకోవట్లేదని ఇవాళ కోర్టుకు వివరించారు. దీంతో ఈ జంట తమ వివాహబంధానికి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను ధనుశ్ పెళ్లాడారు. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి బంధానికి ఎండ్ కార్డ్ పడనుంది. -
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల పుకార్లకు చెక్..
-
కూతురి డ్రీమ్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా అర్జున్..
-
Aishwarya Sushmita: వనితా విశేషణం..
యాక్ట్రెస్, సింగర్, మోడల్, బెల్లీ డాన్సర్, నేషనల్ లెవెల్ బాడ్మింటన్ ప్లేయర్.. ఈ విశేషణాలన్నింటి కలబోత ఐశ్వర్యా సుష్మితా! ‘బ్యాడ్ కాప్’ సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఐశ్వర్యా సుష్మితా పుట్టింది బిహార్‌లోని దర్భంగాలో. పెరిగింది ఢిల్లీలో. నాన్న.. నారాయణ్ వర్మ, ఎస్బీఐ ఉద్యోగి. అమ్మ.. నీతా వర్మ, గృహిణి. ఐశ్వర్యా.. ఫిలాసఫీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్.ఐశ్వర్యా ఆసక్తిని గమనించి, తల్లిదండ్రులూ ఆమెను మోడలింగ్ వైపే ప్రోత్సహించారు. దాంతో ఢిల్లీ బేస్డ్ మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయింది ఐశ్వర్యా. అక్కడే ప్రింట్ అడ్వర్టయిజ్మెంట్స్కి మోడల్‌గా పనిచేసింది.స్కూల్ డేస్‌లో ఆమె లక్ష్యం ఐఏఎస్ కావాలని. అందుకే కాలేజీకొచ్చాక ఫిలాసఫీ సబ్జెక్ట్‌ని ఎంచుకుంది. ఆమెకు స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం. బాడ్మింటన్ ప్లేయర్‌గా జాతీయ స్థాయిలో రాణించింది. అంతేకాదు అందాల పోటీల్లోనూ పాల్గొని, 2016, ఎన్డీటీవీ గుడ్ టైమ్ కింగ్‌ఫిషర్ సూపర్మోడల్స్కీ ఎంపికైంది. ఇవన్నీ ఆమె లక్ష్యాన్ని మార్చాయి.ఆ టైమ్‌లోనే ముంబై మోడలింగ్ ఏజెన్సీల నుంచీ ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. ముంబై వెళ్లింది. మనీశ్ మల్హోత్రా, అనితా డోంగ్రే, రేణు టాండన్, మానవ్ గంగ్వానీ, రాహుల్ ఖన్నా వంటి సూపర్ డిజైనర్స్‌కి మోడల్‌గా పని చేసింది. టీవీ కమర్షియల్స్‌లోనూ నటించింది. ఆ ఫేమే ఆమెకు ‘స్పెషల్ ఆప్స్ 1.5’ అనే వెబ్ సిరీస్‌లో అవకాశాన్నిచ్చింది.ఆ నటన ఆమెను తాజాగా ‘బ్యాడ్ కాప్’ వెబ్ సిరీస్‌లో ప్రాధాన్యమున్న పాత్రకు ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.ఐశ్వర్యాకు సంబంధించి ఇంకో విశేషం, విశేషణం ఏంటంటే ఆమెకు స్పోర్ట్స్ బైక్ రైడింగ్ అంటే ప్రాణం. ఏ కొంచెం వీలు దొరికినా బైక్ రైడింగ్ చేస్తుంది. ఆమె ఫిట్నెస్ ఫ్రీక్ కూడా! రోజూ యోగా చేస్తుంది."నా పేరు విని అందరూ ఆశ్చర్యపోతారు సంబంధం లేకుండా రెండు పేర్లేంటని! ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్లు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ క్రౌన్స్ గెలుచుకున్న ఏడాదే పుట్టాను. మా పేరెంట్స్‌కి వాళ్లిద్దరంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానం కొద్దే నాకు ఆ ఇద్దరి పేర్లను కలుపుతూ ఐశ్వర్యా సుష్మితా అని పెట్టారు. అదన్నమాట నా పేరు వెనుకున్న స్టోరీ!" – ఐశ్వర్యా సుష్మితా -
'అలీ క్లబ్ మిస్ ఫినాలే'లో ఐశ్వర్య!
సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా యువ ప్రతిభను కనిపెట్టి, వారిని ప్రోత్సహించే ప్రతిష్టాత్మక పోటీ ‘అలీ క్లబ్ మిస్ అండ్ మిస్టర్ టీన్ ఇండియా’. ఈ పోటీలో పాల్గొనడానికి, విజేతగా నిలవడానికి దేశవ్యాప్తంగా యువత ఆసక్తి చూపిస్తుంది. అయితే ‘అలీ క్లబ్ మిస్ అండ్ మిస్టర్ టీన్ ఇండియా–2024’ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన 17 ఏళ్ల కాటేపల్లి ఐశ్వర్య ఫైనలిస్ట్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది.ఫ్యాషన్, జీవనశైలి, వినోద రంగాల్లో యువ ప్రతిభతో వారి కలలను నెరవేర్చుకోవడానికి అద్భుత వేదికగా ఫ్యాషన్ పోటీలు నిలుస్తా్తయి. ముఖ్యంగా నగరంలో ‘అలీ క్లబ్ మిస్, మిస్టర్ టీన్ ఇండియా’.. ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’ ద్వారా గుర్తింపు పొందింది. ఇలాంటి వేదికపై తన అభిరుచులు, ఫ్యాషన్‌పై ఆమె అంకితభావంతో విజేతగా నిలవడానికి గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. సెమీ ఫైనల్స్ ఆత్మస్థైర్యాన్ని పెంచింది... ప్రస్తుతం షాఫ్ట్ మల్టీమీడియాలో కంప్యూటర్ సైన్స్‌పై దృష్టి సారిస్తూ 12వ తరగతి చదువుతోంది ఐశ్వర్య. ఆమె చదువులతో పాటు మల్టీమీడియా, ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా కోసం కృషి చేస్తుంది. నగరంలోని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో పనిచేస్తూ వాస్తవ ప్రపంచ అనుభవాన్ని పొందుతోంది. ఈ ప్రయాణం వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన వృద్ధికి ఆమె నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ నెల 31న ఢిల్లీ వేదికగా జరగనున్న గ్రాండ్ ఫినాలేలో విజేతగా నిలవడానికి ఇప్పటికే అక్కడికి చేరుకున్నానని ఐశ్వర్య తెలిపింది.గత నెలలో జరిగిన సెమీ–ఫైనల్ రౌండ్లో దేశవ్యాప్తంగా పాల్గొన్న ఫ్యాషన్ ఔత్సాహికులను దాటుకుని గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టడం మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచిందని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా యువ ప్రతిభావంతులకు గుర్తింపునిచ్చే ఈ వారసత్వంలో ప్రాతినిథ్యం వహిస్తూ హైదరాబాద్ నగరాన్ని మరోసారి జాతీయ వేదికపై నిలపడం సంతోషంగా ఉందన్నారు. తన తోటి పారి్టసిపెంట్స్తో కలిసి జడ్జిల ప్యానెల్ ముందు తమ సామర్థ్యాలను ప్రదర్శించే ఫినాలే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఐశ్వర్య తెలిపింది. -
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్.. అది మన చేతుల్లోనే ఉంది: నటి
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం తరచుగా వినిపిస్తూనే ఉంటోంది. ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం ఎదురైన వారు ఇండస్ట్రీలో చాలామందే ఉంటారు. ఇలాంటి చేదు అనుభవాలను అందరూ ధైర్యంగా బయటికి చెప్పలేరు. మరికొందరు తమ కెరీర్లో ఎదుర్కొన్న ఇలాంటి సంఘటనలపై ఓపెన్ అవుతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి ఐశ్వర్య సుస్మిత తనకెదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాట్లాడింది. ఇటీవల ఆమె 'బాడ్ కాప్' అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది.ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని ఐశ్వర్య సుస్మిత తెలిపింది. అయితే ఈ విషయాన్ని పెద్దది చేయడం ఒక్కటే మార్గం కాదని ఐశ్వర్య అన్నారు. తాను ఎప్పుడూ ఎలాంటి ఆడిషన్స్‌ను మిస్ చేసుకోలేదని పేర్కొంది. తాను విలువల విషయంలో రాజీ పడేది లేదని.. కష్టపడి పనిచేస్తానని చెప్పుకొచ్చింది.ఐశ్వర్య మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఇలాంటివీ చాలా విన్నా. చాలామంది వ్యక్తులు పలు విధాలుగా కథలు చెప్పేవారు. నేను అప్పటికీ మోడల్‌గానే ఉన్నా ఇంకా నటనలోకి అడుగు పెట్టలేదు. మీరు వారితో పడుకోకపోతే మీకు అవకాశాలు రావని నాకు చెప్పేవారు. కానీ పరిశ్రమలోకి రావడానికి ఇది ఒక్కటే మార్గం కాదు. కానీ ఆ సమయంలో కొందరు డైరెక్టర్స్, క్యాస్టింగ్ డైరెక్టర్స్ నన్ను పర్సనల్‌గా కలవమని చెప్పేవారు. కానీ ఇక్కడ మనల్ని ఎవరూ బలవంతం చేయడం లేదు. వెళ్లాలా? వద్దా? అనేది మన నిర్ణయం. ఇది కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు.. కార్పొరేట్ రంగంలోనూ ఉంది.' అంటూ తన అనుభవాలను గుర్తు చేసుకుంది.కాగా.. ఐశ్వర్య సుస్మిత మోడల్‌గా తన కెరీర్‌ని ప్రారంభించింది. 2016లో కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్‌గా తొలిసారి అవకాశం దక్కించుకుంది. ఆమె మోడలింగ్ నుంచి నటన వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి ఓటీటీలో అరంగేట్రం చేసిన ఐశ్వర్య సుస్మిత త్వరలోనే సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధమవుతోంది. -
దుబాయ్‌లో భర్త.. కన్నుమూసిన ఏడు నెలల గర్భిణి
ముస్తాబాద్(సిరిసిల్ల): కడుపులో పెరుగుతున్న బిడ్డను కళ్లారా చూడకుండానే ఓ గర్భిణి అనారోగ్యంతో మృతిచెందింది. గ్రామస్తులు, కుటుంబీకుల కథనం మేరకు.. ముస్తాబాద్ మండలం మద్దికుంటకు చెందిన ఝాన్సీ అలియాస్ ఐశ్వర్య (20)కు గూడెం గ్రామానికి చెందిన ఈడుగురాళ్ల అంజయ్య, విజయ దంపతుల కుమారుడు హరీశ్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. ఝాన్సీ ప్రస్తుతం 7 నెలల గర్భిణి. ఇటీవలే భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఝాన్నీ అనారోగ్యానికి గురికాగా నెల రోజులుగా వైద్యం చేయిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. పెళ్లయిన ఏడాదిన్నరకే ఝాన్సీ మృతిచెందడంతో రెండు కుటుంబాలు దుఃఖంలో మునిగాయి. ఆమె కడసారి చూపునకు భర్త -
సామాజిక కళకు సై అంటున్నారు...
‘నా కాళ్లకు ప్రయాణ దాహం పట్టుకుంది’ అంటున్నారు యువ ఆర్టిస్ట్‌లు. ఆ ప్రయాణ అనుభవాలు వారి కళకు బలాన్ని ఇస్తున్నాయి. సమాజంతో కలిసి పనిచేయడానికి అవసరమైన స్ఫూర్తిని ఇస్తున్నాయి. పబ్లిక్ ఆర్ట్‌గా ప్రాచుర్యం ΄పొందిన ‘మ్యూరల్ ఆర్ట్’ ద్వారా మానసిక ఆరోగ్యం నుంచి మహిళాశక్తి వరకు ఎన్నో విషయాలను ప్రచారం చేస్తున్నారు. కార్టూన్లతో నవ్వించడమే కాదు ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించేలా చేస్తున్నారు. కళకు సామాజిక ప్రయోజనాన్ని జోడించిన వారి క్రియేటివ్ జర్నీ గురించి....ముంబైకి చెందిన మేఘకు మ్యూరల్ ఆర్ట్ అంటే ఎంత ఇష్టమో ప్రయాణాలు అంటే కూడా అంతే ఇష్టం. ఆ ప్రయాణాలలో ప్రకృతి అందాలను ఆస్వాదించడం అంటే ఇష్టం.ఆమె దృష్టిలో ప్రకృతి అనేది విశాలమైన కాన్వాస్. అస్సాంలోని పచ్చటి కొండల నుంచి జమ్మూ కశ్మీర్‌లోని తెల్లటి మంచుల కొండల వరకు నదుల జలకళ నుంచి ఎడారుల ఇసుక మెరుపుల వరకు ఎన్నో ప్రాంతాల అందాలను ఆస్వాదించింది.తన కళకు ఇన్స్పిరేషన్ తాను వెళ్లిన ప్రాంతాలే. ‘ప్రయాణం అంటే ప్రతి రోజు ఒక కొత్త ఎనర్జీతో నిద్ర లేచే ఉత్సాహం. ఆ ఉత్సాహ శక్తి మన కళలో ప్రతి ఫలిస్తుంది’ అంటుంది మేఘ.మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి తన మ్యూరల్ ఆర్ట్‌ను సాధనంగా వాడుకుంటుంది స్నేహ చక్రవర్తి. ‘మైండ్ అండ్ మ్యాటర్’ చారిటబుల్ ట్రస్టుతో కలిసి ‘ది ట్రావెల్ అండ్ పెయింట్: ఇండియా టూర్’ చేసింది. ఆల్ ఇండియా ఆర్ట్ టూర్లో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంది. అట్టడుగు వర్గాల పిల్లలతో సంభాషించి వారితో స్నేహం చేసే అవకాశం వచ్చింది.‘కళ’ అనేది మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో విస్తృతంగా ప్రచారం చేస్తోంది స్నేహ చక్రవర్తి.తిరువనంతపురానికి చెందిన అమితకు చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే ఇష్టం. ప్రయాణాలు అంటే మరీ ఇష్టం. ‘మొదట్లో ప్రముఖ చిత్రకారుల ఆర్ట్‌వర్క్స్‌ను అనుసరిస్తూ ఆనందించేదాన్ని. అయితే అసలైన ఆనందం నాకు వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతో మాట్లాడినప్పుడు దొరికింది. ఒక ప్రాంతానికి తనదైన అందాలు ఉన్నట్లే సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యలను నా కళ ద్వారా ప్రతిబింబించాలనుకుంటు న్నాను’ అంటుంది అమిత.చిత్రకళకు సంబంధించి నిర్దిష్టమైన శైలికి పరిమితం కావడం అంటే అమితకు ఇష్టం లేదు. ఐడియాల విషయంలో ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచించడం ఆమెకు ఇష్టం. ‘యూనిక్ ఎక్స్ప్రెషన్’ను అమితంగా ఇష్టపడుతుంది.మేఘ, స్నేహ, అమితలుæమాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది యువ కళాకారులు తమవైన కళారూపాలతో సమాజంతో కలిసి నడుస్తున్నారు. సామాజిక కళకు సై అంటున్నారు.జస్ట్ లోకల్...చెన్నైకి చెందిన పదహారుమంది యువ ఆర్టిస్ట్‌లు ఐశ్వర్య మణివణ్ణన్ మార్గదర్శకత్వంలో ‘లోకల్’ థీమ్‌తో వందకుపైగా కళారూపాలు ఆవిష్కరించారు. టెక్నాలజీపై అతిగా ఆధారపడడం వల్ల కోల్పోతున్నది ఏమిటో తెలియజేస్తాయి ఈ చిత్రాలు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడో జరిగే సంఘటనల గురించి తెలుసుకునే మనం, సమీపంలోని వాటి గురించి మాత్రం తెలుసుకోలేము. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో విషయాల గురించి అన ర్గళంగా చెప్పగలిగే వాళ్లలో చాలామందికి లోకల్ విషయాలలో అంతంత మాత్రమే అవగాహన ఉంటుంది. ‘తమ స్థానికతతో కళాకారులు మమేకం కావడానికి లోకల్ అనే థీమ్ ఉపయోగపడుతుంది’ అంటుంది ఐశ్వర్య. చెన్నైలోని వైబ్రెంట్ స్ట్రీట్ లైఫ్... అందులోని సాంస్కృతిక వైవిధ్యం అంటే ఐశ్వర్యకు ఇష్టం. తన స్టూడెంట్స్‌తో కలిసి నార్త్ చెన్నైలోని కాశిమేడుకు వెళ్లింది. గంభీరమైన సముద్రాన్ని చూసిన తరువాత స్టూడెంట్స్‌కు కొత్తప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. ఎంతోమంది జాలరులతో మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వారి ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. అక్కడి దృశ్యాలు స్టూడెంట్స్ ముందున్న కాన్వాస్‌లోకి నడిచొచ్చాయి. సహజత్వాన్ని ప్రతిబింబించాయి.ఈజ్ దట్ యూ? ‘టాలెంటెడ్ ఇలస్ట్రేటర్’గా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకుంది ముంబైకి చెందిన ప్రణిత కొచ్రేకర్. దైనందిన జీవిత దృశ్యాల నుంచి మానసిక ఒత్తిడి, ఆందోళన వరకు ఎన్నో అంశాలు ఆమె చిత్రాలకు థీమ్‌గా ఉంటాయి. ఊహల్లో నుంచి కాకుండా సొంత అనుభవాల్లో నుంచి చిత్రాలు వేయడం అంటే ప్రణితకు ఇష్టం.‘కళకు సామాజిక ప్రయోజం ఉంది. అది శక్తిమంతమైన మాధ్యమం’ అంటున్న ప్రణిత తన కళ ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. వివిధ సామాజిక మాధ్యమాలను తన కళకు వేదికగా ఉపయోగించుకుంటోంది.యాంగ్జయిటీ డిజార్డర్లపై ‘ఇజ్ దట్ యూ?’ టైటిల్‌తో వేసిన డ్రాయింగ్ సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. తన బొమ్మల ద్వారా నవ్వించడంతోపాటు ఆలోచించేలా చేయడం ప్రణిత ప్రత్యేకత.‘డా.ఇంటర్నెట్’ పేరుతో యాంగ్జయిటీని తగ్గించుకోవడానికి ఏంచేస్తే బాగుంటుందో చిత్రం చివర సలహా కూడా ఇస్తుంది ప్రణిత. -
హీరోను పెళ్లాడిన అర్జున్ కూతురు.. ఫోటోలు వైరల్!
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతిని ఆమె పెళ్లి చేసుకుంది. చెన్నైలో హనుమాన్ ఆలయంలో జరిగిన ఈ వివాహా వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. తాజాగా వీరి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.కాగా.. ఐశ్వర్య- ఉమాపతిల ఎంగేజ్మెంట్ వేడుక గతేడాది అక్టోబర్‌లో జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అనుమతితోనే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఐశ్వర్య కెరీర్ అనుకుంత సక్సెస్‌ఫుల్‌గా సాగడం లేదు. కూతురి కోసం అర్జున్ డైరెక్టర్‌గా మారి సినిమా తీయగా అది కూడా ఆశించినంత ఫలితం అందుకోలేకపోయింది. మరోవైపు ఉమాపతి తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. కోలీవుడ్‌లో అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్ కుటుంబం, తిరుమనం, థానే వాడి సినిమాల్లో హీరోగా నటించాడు. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) -
బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్న జబర్దస్త్ ఐశ్వర్య
-
మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..
-
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
-
Shankar Daughter Reception Photos: శంకర్ కుమార్తె రిసెప్షన్ హైలైట్స్.. దిల్‌రాజు, సిద్దార్థ్, బేబమ్మ సహా ఎందరో.. (ఫోటోలు)
-
డైరెక్టర్ కూతురి రెండో పెళ్లి.. స్టెప్పులతో అదరగొట్టిన స్టార్స్
ప్రముఖ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఏప్రిల్ 15న జరిగిన ఈ వివాహ వేడుకకు రజనీకాంత్, సూర్య, కమల్ హాసన్ సహా దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన స్టార్స్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంగళవారం ఎంతో వైభవంగా రిసెప్షన్ నిర్వహించగా బాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా సౌత్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తమ డ్యాన్సులతో స్టేజీ దద్దరిల్లేలా చేశారు. వీరితోపాటు శంకర్ రెండో కూతురు, హీరోయిన్ అదితి శంకర్ కూడా ఎంతో హుషారుగా చిందేయడం విశేషం. ఇక వీరంతా తమిళ హిట్ సాంగ్స్‌కు కాలు కదిపారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐశ్వర్య శంకర్ గతంలో క్రికెటర్ దామోదర్ రోహిత్‌ను పెళ్లాడింది. ఇతడు ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు రావడంతో ఐశ్వర్య తన నుంచి విడాకులు తీసుకుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తరుణ్ కార్తికేయన్‌తో నిశ్చితార్థం జరగ్గా రెండు రోజులక్రితమే ఘనంగా వివాహం జరిపించారు. #RanveerSingh & #AditiShankar dancing for ThalapathyVijay & #Trisha's Apadi Podu Song 🤩🔥pic.twitter.com/RFXuZLSZo1 — Kolly Corner (@kollycorner) April 16, 2024 చదవండి: నువ్వు వర్జినా..? ముందు నీ పెళ్లి గురించి చెప్పమన్న హీరోయిన్ తనయుడు -
Aishwarya Wedding Reception: డైరెక్టర్ శంకర్ కుమార్తె పెళ్లి రిసెప్షన్లో సినీ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
రజతంగా ఐశ్వర్య కాంస్యం
గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ ఐశ్వర్య మిశ్రా కాంస్యం సాధించింది. అయితే ఇప్పుడు ఆమె ప్రదర్శనకు రజత పతకంగా ప్రమోషన్ దక్కింది. ఈ ఈవెంట్లో రజతం సాధించి ఉజ్బెకిస్తాన్ అథ్లెట్ ఫరీదా సొలియెవా డోపింగ్ పరీక్షలో పట్టుబడింది. దాంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ఆమెపై 3 ఏళ్ల నిషేధం విధించింది. ఫలితంగా ఐశ్వర్య టైమింగ్ (53.07)ను రెండో స్థానంగా గుర్తిస్తూ ఆమె కాంస్యాన్ని రజతంగా మార్చారు. -
ప్రముఖ నటుడి ఇంట పెళ్లి.. డాక్టర్ వెడ్స్ ఇంజనీర్!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు బైజు సంతోష్ కూతురు, డాక్టర్ ఐశ్వర్వ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. చెన్నైలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న రోహిత్‌ను పెళ్లాడింది. తిరువనంతపురంలోని ప్రముఖ క్లబ్లో ఐశ్వర్య, రోహిత్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు మలయాళ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే తన భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది ఐశ్వర్య. తమది ప్రేమ వివాహం కాదని.. రోహిత్‌ను మ్యాట్రిమోనీ సైట్లో చూసి పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. అతని తల్లిదండ్రులు కేరళలోని పాతానంతిట్టకు చెందినవారు కాగా.. రోహిత్ పంజాబ్‌లో పుట్టి పెరిగారని తెలిపింది. నేను అతనితో ఒక్కసారి మాట్లాడాక.. నన్ను అర్థం చేసుకోగలడని అనిపించిందని ఐశ్వర్య పేర్కొంది. మరోవైపు పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు ఆమె మలయాళంలో పేరున్న నటుడి కూతురన్న విషయం తనకు తెలియదని రోహిత్ చెబుతున్నాడు. ఐశ్వర్య- రోహిత్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. బైజు సంతోష్‌కు ఐశ్వర్య పెద్దకూతురు. ఆమె ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె పెళ్లికి ప్రియదర్శన్, షాజీ కైలాస్, అన్నీ, మేనక, సోనా నాయర్, కలడి ఓమన, డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి హాజరయ్యారు. కాగా.. బైజు సంతోష్ మలయాళంలో మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌లో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్‌గా రీమేక్ చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించారు. View this post on Instagram A post shared by Binzu Gopalan - Makeupartist (@binzugopalan) View this post on Instagram A post shared by MoonWedlock Wedding Company (@moonwedlock) -
నేను చనిపోవాలట.. వారికేం వస్తుందో మరి!: బుల్లితెర నటి
ఒకప్పుడు సెలబ్రిటీలను ఆరాధించేవారు. పొగడ్తలే ఎక్కువగా వినిపించేవి.. విమర్శలు అంతగా ఉండేవి కావు. ఒకవేళ ఉన్నా ముఖం పట్టుకుని తిట్టేంత సీన్ అయితే లేదు. కానీ సోషల్ మీడియా పుణ్యమాని తారలు ఏ పోస్ట్ పెట్టినా.. అక్కడే తిట్టేస్తున్నారు, నోటికొచ్చింది అనేస్తున్నారు. ఇలాంటి ఆన్లైన్ ట్రోలింగ్ బాధితురాల్లో బుల్లితెర నటి ఐశ్వర్య శర్మ ఒకరు. నేను చనిపోవాలట ఒకరైతే ఏకంగా ఆమెను చచ్చిపోమని కోరారు. దానికి ఐశ్వర్య.. నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా నేను మాత్రం.. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలనే కోరుకుంటున్నానని రిప్లై ఇచ్చింది. ఈ ట్రోలింగ్ గురించి ఆమె మాట్లాడుతూ.. 'ట్రోలింగ్ అనేది ఒక దినచర్యలా మారిపోయింది. ప్రతిరోజూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాను. నేను ఏ తప్పూ చేయలేదు అయినా అటువంటి కామెంట్స్ వస్తుంటే బాధగా ఉంటుంది. మరోవైపు నా అభిమానులు చాక్లెట్స్, పువ్వులు.. ఇలాంటి బహుమతులు పంపుతూ ఉంటారు. గిఫ్టులు తీసుకోవడంలో నాకే ఇబ్బందీ లేదు. కానీ ఏ కారణం లేకుండా నా కోసం ఖర్చు పెట్టొద్దని నా అభిప్రాయం. అందుకే వారిని బహుమతులు పంపొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. బహుమతులు, విమర్శలు.. ఏదీ వద్దు అయినా వాళ్లు వినరు.. కానీ ఓసారి గుర్తు చేయాలనుకున్నాను. ఓ వ్యక్తి దీన్ని కూడా తప్పుపట్టి నాపై విమర్శలు గుప్పించాడు. నేను కూడా ఒక మనిషినే.. నేనేదైనా తప్పు చేస్తే మీరు ఇష్టమొచ్చినట్లు తిట్టండి, ప్రశ్నించండి. కానీ ఏమీ చేయకపోయినా నన్ను అనరాని మాటలు అంటున్నారు. అదెందుకో అర్థం కావడం లేదు. నాకు ఎవరి బహుమతులు వద్దు, ఎవరి విమర్శలూ వద్దు. ట్రోలింగ్ వల్ల నా మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. నేను చచ్చిపోతే వారికి మనశ్శాంతి వస్తుందా? శాడిస్టులు.. ముందేమో తిడతారు.. నటులు ఆత్మహత్య చేసుకుంటే మళ్లీ మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడతారు. అసలు మీకు దాని గురించి మాట్లాడే హక్కు లేదు. కొందరు శాడిస్టులు పక్కవాళ్లను మాటలతో హింసించి ఆనందం పొందుతారు. సెలబ్రిటీల జీవితం ఎంతో ఆకర్షణీయంగా బాగుంటుందనుకుంటారు. కానీ దాని వెనక వారు పడ్డ కష్టాలను ఎవరూ పట్టించుకోరు. ఒక ఆర్టిస్టుగా నేనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒక నెగెటివ్ రోల్ చేస్తే నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాననుకుంటున్నారు. ఇదెంతవరకు కరెక్ట్?' అని ఆవేదన వ్యక్తం చేసింది నటి ఐశ్వర్య. చదవండి: చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. -
స్టార్ హీరో ఈవెంట్లో అసభ్య ప్రవర్తన.. యాంకర్‌తో అలా!
కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడు లేని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ సందర్భంగా చిత్రబృందం చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాంకర్‌తో అసభ్య ప్రవర్తన బుధవారం చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో ఓ చేదు సంఘటన జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హోస్ట్ చేస్తున్న యాంకర్ ఐశ్వర్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. చాలామంది ఫ్యాన్స్ హాజరైన ఈవెంట్లో ఆమె అసభ్యకరంగా తాకాడు. అతని తీరుతో విసిగిపోయిన యాంకర్ అక్కడే దేహశుద్ధి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ సైతం యాంకర్ ఐశ్వర్యకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. వెంటనే స్పందించి అతనికి బుద్ధిచెప్పడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలోనూ పోస్ట్ చేసింది. 😨😨 pic.twitter.com/JJljl7ntBc — Christopher Kanagaraj (@Chrissuccess) January 3, 2024 -
కూతురితో కలిసి వేడుకలో పాల్గొన్న కల్యాణ్ దేవ్.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరో కల్యాణ్ దేవ్ తెలుగువారికి సుపరిచితమే. మెగా అల్లుడిగా అభిమానుల్లో పేరు సంపాదించుకున్నాడు. విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాల్లో నటించారు. అయితే ప్రస్తుతం కల్యాణ్ దేవ్ ఏ ప్రాజెక్ట్‌లోనూ నటించడం లేదు. చిరంజీవి కుమార్తె శ్రీజను పెళ్లి చేసుకున్న కల్యాణ్ దేవ్ ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ నవిష్క అనే కూతురు ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే కల్యాణ్ దేవ్ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటారు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఉంటున్న కల్యాణ్ దేవ్ గతంలో తన తల్లి బర్త్‌డే జరుపుకున్న ఫోటోలను పంచుకున్నారు. అలాగే తాజాగా ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా తన చెల్లెలు ఐశ్వర్య సీమంతం వేడుకలో పాల్గొన్న ఫోటోలను కల్యాణ్ దేవ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వేడుకలో తన కూతురు నవిష్కతో కలిసి పాల్గొన్నారు. మీ అందరి ప్రేమ, అభిమానాలతో నా కుటుంబం ఇంకా పెరుగుతోంది.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి కల్యాణ్ దేవ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి (ఫొటోలు)