
గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ ఐశ్వర్య మిశ్రా కాంస్యం సాధించింది. అయితే ఇప్పుడు ఆమె ప్రదర్శనకు రజత పతకంగా ప్రమోషన్ దక్కింది. ఈ ఈవెంట్‌లో రజతం సాధించి ఉజ్బెకిస్తాన్ అథ్లెట్ ఫరీదా సొలియెవా డోపింగ్ పరీక్షలో పట్టుబడింది. దాంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ఆమెపై 3 ఏళ్ల నిషేధం విధించింది. ఫలితంగా ఐశ్వర్య టైమింగ్ (53.07)ను రెండో స్థానంగా గుర్తిస్తూ ఆమె కాంస్యాన్ని రజతంగా మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment