
సెంట్రల్ ఫ్లోరిడా (అమెరికా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్‌లో పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో భారత జట్టుకు రజత పతకం లభించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కూడిన భారత జట్టు 1–5 సెట్‌ల తేడాతో లీ జాంగ్‌యువాన్, కావో వెన్‌చావో, వాంగ్ యాన్‌లతో కూడిన చైనా జట్టు చేతిలో ఓడిపోయింది.
తొలి సెట్‌లో రెండు జట్లు 54–54తో సమంగా నిలిచి చెరో పాయింట్ దక్కించుకున్నాయి. రెండో సెట్‌ను చైనా 58–55తో నెగ్గి 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మూడో సెట్‌ను చైనా 55–54తో సొంతం చేసుకొని 5–1తో స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకుంది. ఆర్చరీ సీజన్ తొలి టోర్నీలో ఇప్పటి వరకు భారత్‌కు మూడు పతకాలు లభించాయి.