
సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు రజతం లభించింది. 2007లో ఈ మెగా ఈవెంట్ మొదలయ్యాక భారత్‌కు లభించిన తొలి పతకం ఇదే కావడం విశేషం. గోర్యాక్ చినా, కొస్టెనిక్, కాటరీనా లాగ్నో (గ్రాండ్ మాస్టర్లు), షువలోవా, కషిలిన్‌స్కాయాలతో కూడిన రష్యా జట్టు తో శనివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా, భక్తి కులకర్ణి, మేరీఆన్‌గోమ్స్‌లతో కూడిన భారత జట్టు 0–2తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌ను భారత్ 1.5–2.5తో చేజా ర్చుకోగా... రెండో మ్యాచ్‌లో టీమిండియా 1–3తో ఓటమి చవిచూసింది. ప్రపంచ రెండో ర్యాంకర్ గోర్యాక్‌చినాతో జరిగిన తొలి గేమ్‌లో హారిక 47 ఎత్తుల్లో గెలిచి, రెండో గేమ్‌ను 39 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment