సురబాయ (ఇండోనేసియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బాలికల అండర్–15 సింగి ల్స్ విభాగంలో భారత్‌కు టైటిల్ లభించడం ఖాయమైంది. ఈ విభాగంలో ఫైనల్ చేరిన ఇద్దరు క్రీడాకారిణులు తస్నిమ్ మీర్, తారా షా భారత్‌కే చెందిన వారు కావడం విశేషం. శనివారం జరిగిన అండర్–15 బాలికల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో తస్నిమ్ 21–16, 21–11తో సోరా ఇషియోకా (జపాన్)పై... తారా షా 21–18, 21–14తో కజునె ఇవాటో (జపాన్)పై విజయం సాధించారు.
చరిత్రకు విజయం దూరంలో...
గ్వాంగ్‌జౌ (చైనా): మరో విజయం సాధిస్తే జపాన్ స్టార్ కెంటో మొమోటా... బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధికంగా 11 టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మొమోటా టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మొమోటా 21–17, 21–12తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై గెలిచాడు. మరో సెమీఫైనల్లో ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా) 21–15, 21–15తో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో జిన్‌టింగ్‌తో మొమోటా తలపడతాడు.
‘ఆసియా’ ఫైనల్లో తస్నిమ్, తార
Published Sun, Dec 15 2019 6:01 AM | Last Updated on Sun, Dec 15 2019 6:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment