junior badminton tourny
-
‘ఆసియా’ ఫైనల్లో తస్నిమ్, తార
సురబాయ (ఇండోనేసియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బాలికల అండర్–15 సింగి ల్స్ విభాగంలో భారత్‌కు టైటిల్ లభించడం ఖాయమైంది. ఈ విభాగంలో ఫైనల్ చేరిన ఇద్దరు క్రీడాకారిణులు తస్నిమ్ మీర్, తారా షా భారత్‌కే చెందిన వారు కావడం విశేషం. శనివారం జరిగిన అండర్–15 బాలికల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో తస్నిమ్ 21–16, 21–11తో సోరా ఇషియోకా (జపాన్)పై... తారా షా 21–18, 21–14తో కజునె ఇవాటో (జపాన్)పై విజయం సాధించారు. చరిత్రకు విజయం దూరంలో... గ్వాంగ్జౌ (చైనా): మరో విజయం సాధిస్తే జపాన్ స్టార్ కెంటో మొమోటా... బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధికంగా 11 టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మొమోటా టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మొమోటా 21–17, 21–12తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై గెలిచాడు. మరో సెమీఫైనల్లో ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా) 21–15, 21–15తో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో జిన్‌టింగ్‌తో మొమోటా తలపడతాడు. -
గాయత్రి ‘డబుల్’ ధమాకా
రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పుల్లెల గాయత్రి సత్తా చాటింది. అండర్- 17 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. వరంగల్‌లో ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైన ల్లో గాయత్రి (రంగారెడ్డి) 21-9, 21-10తో సామియా (హైదరాబాద్)పై గెలుపొందగా... డబుల్స్‌లో గాయత్రి-సామియా (హైదరాబాద్) జోడి 21-19, 21-14తో సాహితి -సృష్టి జూపూడి (మెదక్) జంటపై నె గ్గి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అండర్-19 బాలికల సింగిల్స్‌లో గాయత్రి రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో వైష్ణవి (రంగారెడ్డి) 21-15, 21-19తో గాయత్రి (రంగారెడ్డి)పై గెలిచింది. డబుల్స్‌లో సాహితి-సృష్టి జూపూడి (మెదక్) జోడి 22-20, 21-12తో ఇషిత-రూహి (హైదరాబాద్) జంటపై విజయం సాధించింది. విజేత విష్ణువర్ధన్: అండర్-17 బాలుర సింగిల్స్‌లో విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్) 21-19, 21-16తో పవన్కృష్ణపై నెగ్గగా... బాలుర డబుల్స్‌లో నవనీత్ (మెదక్)-సాయి కృష్ణ (రంగారెడ్డి) జోడి 21-18,19-21, 21-11తో ఖాదిర్ మొయినుద్దీన్- విష్ణువర్ధన్ (హైదరాబాద్) జంటపై విజయం సాధించారు. అండర్-19 బాలుర సింగిల్స్‌లో ఆదిత్య బాపినీడు (ఖమ్మం) 16-21, 21-11, 21-13తో సాయం బోత్రా (హైదరాబాద్)పై గెలుపొందగా... డబుల్స్ విభాగంలో సిద్ధార్థ్-సాయి కృష్ణ (రంగారెడ్డి) జోడి 21-13, 21-16తో నవనీత్-తరుణ్ (మెదక్) జంటపై నెగ్గింది. -
శ్రీకృష్ణ-సాయి పవన్ జంటకు టైటిల్
ఆలిండియా జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్ సీడ్ శ్రీకృష్ణ (తెలంగాణ)-సాయి పవన్ (ఏపీ) జోడి అండర్-17 టైటిల్‌ను సాధించింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన అండర్-17 బాలుర డబుల్స్ ఫైనల్లో ఈ జోడి 21-10, 21-13తో సిద్ధార్థ మిశ్రా-సిద్ధాంత్ సలార్ (ఉత్తరప్రదేశ్) జంటపై గెలుపొందింది. ఇదే విభాగం సింగిల్స్ ఫైనల్లో రాహుల్ భరద్వాజ్ (కర్ణాటక) 21-18, 21-8తో మైస్నం మెరాబా (మణిపూర్)పై నెగ్గాడు. బాలికల తుదిపోరులో ఆకర్షి కశ్యప్ (చత్తీస్‌గఢ్) 21-8, 21-8తో రాషి లంబే (మహారాష్ట్ర)పై గెలిచింది. డబుల్స్‌లో అశ్విని భట్-మిథుల (కర్ణాటక) 21-15, 18-21, 21-13తో సిమ్రాన్ సింగ్-రితిక ఠక్కర్ (మహారాష్ట్ర)పై విజయం సాధించారు. అండర్-19 బాలుర సింగిల్స్‌లో తుదిపోరులో మిథున్ (ఎయిరిండియా) 21-4, 4-0తో బెంగాల్‌కు చెందిన అరింతప్ దాస్‌గుప్తా (రిటైర్డ్‌హర్ట్)పై నెగ్గాడు. బాలికల టైటిల్‌ను శిఖ గౌతమ్ (కర్ణాటక) 21-17, 21-14తో ఐరా శర్మ (హరియాణా)పై గెలిచి చేజిక్కించుకుంది. బాలుర డబుల్స్ ఫైనల్లో బోధిత్ జోషి (ఉత్తరాఖండ్)-మిథున్ (ఎయిరిండియా) 21-19, 21-9తో గౌస్ షేక్-బషీర్ సయ్యద్ (ఏపీ)పై గెలుపొందాడు. బాలికల డబుల్స్ తుదిపోరులో మహిమ అగర్వాల్-శిఖ గౌతమ్ (కర్ణాటక) 17-21, 21-17, 22-20తో అశ్విని భట్-మిథుల (కర్ణాటక)లపై విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో కృష్ణ ప్రసాద్ (ఏపీ)-మహిమ అగర్వాల్ (కర్ణాటక) 21-15, 22-20తో బాలరాజ్-మిథుల (కర్ణాటక)పై గెలుపొందారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ట్రోఫీలు అందజేశారు. ఇందులో ‘శాట్స్’ ఎండీ దినకర్ బాబు, భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు మల్రెడ్డి రంగారెడ్డి, కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్, స్థానిక కార్పొరేటర్ పారుపల్లి అనిత దయాకర్ రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.