గాయత్రి ‘డబుల్’ ధమాకా | gaytri wins singles and doubles titles of junior badminton tourny | Sakshi
Sakshi News home page

గాయత్రి ‘డబుల్’ ధమాకా

Published Mon, Aug 1 2016 2:44 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

గాయత్రి ‘డబుల్’ ధమాకా

గాయత్రి ‘డబుల్’ ధమాకా

రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పుల్లెల గాయత్రి సత్తా చాటింది. అండర్- 17 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. వరంగల్‌లో ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైన ల్లో గాయత్రి (రంగారెడ్డి) 21-9, 21-10తో సామియా (హైదరాబాద్)పై గెలుపొందగా... డబుల్స్‌లో గాయత్రి-సామియా (హైదరాబాద్) జోడి 21-19, 21-14తో సాహితి -సృష్టి జూపూడి (మెదక్) జంటపై నె గ్గి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అండర్-19 బాలికల సింగిల్స్‌లో గాయత్రి రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో వైష్ణవి (రంగారెడ్డి) 21-15, 21-19తో గాయత్రి (రంగారెడ్డి)పై గెలిచింది. డబుల్స్‌లో సాహితి-సృష్టి జూపూడి (మెదక్) జోడి 22-20, 21-12తో ఇషిత-రూహి (హైదరాబాద్) జంటపై విజయం సాధించింది.


 విజేత విష్ణువర్ధన్: అండర్-17 బాలుర సింగిల్స్‌లో విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్)  21-19, 21-16తో పవన్‌కృష్ణపై నెగ్గగా... బాలుర డబుల్స్‌లో నవనీత్ (మెదక్)-సాయి కృష్ణ (రంగారెడ్డి) జోడి 21-18,19-21, 21-11తో ఖాదిర్ మొయినుద్దీన్- విష్ణువర్ధన్ (హైదరాబాద్) జంటపై విజయం సాధించారు. అండర్-19 బాలుర సింగిల్స్‌లో ఆదిత్య బాపినీడు (ఖమ్మం) 16-21, 21-11, 21-13తో సాయం బోత్రా (హైదరాబాద్)పై గెలుపొందగా... డబుల్స్ విభాగంలో సిద్ధార్థ్-సాయి కృష్ణ (రంగారెడ్డి) జోడి 21-13, 21-16తో నవనీత్-తరుణ్ (మెదక్) జంటపై నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement