gayatri
-
గాయత్రి–ట్రెసా జోడీ శుభారంభం
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు.మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–10, 21–10తో ఒర్నిచా–సుకిత్త (థాయ్‌లాండ్) జోడీపై విజయం సాధించింది. 30 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం భారత జంట ఆధిపత్యం కనబరిచింది. రెండో గేమ్‌లో స్కోరు 11–9 వద్ద గాయత్రి–ట్రెసా ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 19–9తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒక పాయింట్ ప్రత్యర్థి జంట నెగ్గినా ఆ వెంటనే భారత జోడీ రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 14–21, 7–21తో చి యు జెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. పైకప్పు నుంచి నీరు కారడంతో... టోర్నీ తొలి రోజు భారత ప్లేయర్ ప్రణయ్‌కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. కోర్టు–3లో కెనడా ప్లేయర్ బ్రియాన్ యాంగ్తో మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్‌ను 21–12తో నెగ్గి, రెండో గేమ్‌లో 6–3తో ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో స్టేడియం పైకప్పు నుంచి అనూహ్యంగా వర్షం నీరు కోర్టులోకి పడటం మొదలైంది. దాంతో కోర్టు–3లో ప్రణయ్ మ్యాచ్ నిలిచిపోయింది. గంట తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. ప్రణయ్ 9–11తో వెనుకంజలో ఉన్న దశలో మళ్లీ పైకప్పు నుంచి నీరు కారడం మొదలైంది. దాంతో నిర్వాహకులు ప్రణయ్, యాంగ్ మ్యాచ్‌ను నిలిపివేసి బుధవారానికి వాయిదా వేశారు. -
వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం.. భార్య బాలీవుడ్ నటి: ఎవరీ బిలియనీర్? (ఫోటోలు)
-
టీడీపీ నేతల వేధింపులతో ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
శ్రీకాళహస్తి/సాక్షి నెట్వర్క్: అధికారంలోకి వచ్చినప్పటినుంచి మహిళలు, ఉద్యోగినులపై కూటమి పక్షాల నేతల వేధింపులు, అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారి వేధింపులు భరించలేక కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా తమను ఉద్యోగాల నుంచి తొలగించడంతో తిరుపతి, కృష్ణాజిల్లాల్లో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు. తమ ఉద్యోగాలు తీయవద్దని వేడుకున్నా నేతలు కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా తీసేశారు.. నా ఉద్యోగం ఇప్పించమ్మా.. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం తాటిపర్తి పంచాయతీలో సంఘమిత్ర రేవతిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ బాధను తట్టుకోలేక రేవతి పురుగుమందు తాగింది. అంతకుముందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సతీమణి రిషితను ఉద్దేశించి మాట్లాడుతూ సెల్ఫీ వీడియో తీసింది. ఆ వీడియోలో.. ‘అమ్మా! రిషితమ్మా.. నేను 16 సంవత్సరాలుగా సంఘమిత్రగా పనిచేస్తున్నాను. దళితురాలైన నన్ను తొలగించారు. ఎలాగైనా నా జాబు నాకు వచ్చేట్లు చేయాలని అభ్యర్థిస్తున్నాను, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా..’ అంటూ సెల్ఫీ వీడియోను ఆపేసి పురుగుమందు తాగింది. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతిని సీఐటీయూ నాయకులు పరామర్శించారు.ఎస్టీ మహిళకు అన్యాయం కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో టీడీపీ నేతలు ఎస్టీ మహిళను ఉద్యోగం నుంచి తీయించేశారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించావంటూ వెలుగు పథకంలో బుక్‌కీపర్‌గా పనిచేస్తున్న గాయత్రిని తీవ్ర ఒత్తిళ్లకు గురిచేశారు. వారి సూచనతో వెలుగు అధికారులు శుక్రవారం గాయత్రిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో గాయత్రి ప్రాణాలు తీసుకోవాలని నిద్రమాత్రలు మింగింది. కుటుంబసభ్యులు ఆమెను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
సెమీస్‌లో గాయత్రి–ట్రెసా జోడీ
మకావ్: వరుసగా ఐదు టోర్నమెంట్లలో క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఆ అడ్డంకిని ఆరో ప్రయత్నంలో అధిగమించింది. మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో మూడో సీడ్ గాయత్రి–ట్రెసా జాలీ జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–12, 21–17తో ఆరో సీడ్ సు యిన్ హుయ్–లోన్ జి యున్ (చైనీస్ తైపీ) జంటపై గెలిచింది. గత జూన్‌లో సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సెమీఫైనల్ చేరిన తర్వాత గాయత్రి–ట్రెసా ఐదు టోర్నీలు ఆడారు. అయితే ఈ ఐదు టోర్నీల్లో వారు క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 16–21, 12–21తో ఓడిపోయాడు. నేడు జరిగే మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సెయి పె షాన్–హుంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. గతవారం చైనా ఓపెన్ టోర్నీ తొలి రౌండ్లోనే సెయి పె షాన్–హుంగ్ ఎన్ జు చేతిలో ఓడిన గాయత్రి–ట్రెసా ఈసారి గెలిచి బదులు తీర్చుకుంటారో లేదో వేచి చూడాలి. -
కుర్రకారు గుండెలు బేజారు చేస్తోన్న ‘గాయత్రీ భరద్వాజ్’ (ఫొటోలు)
-
సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
బేబీ సినిమా కథ నాదేనంటూ షార్ట్ ఫిలిం డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ కొన్నిరోజులుగా పోరాడుతున్నాడు. గతేడాదిలో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బేబీ' చిత్రాన్ని సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తే ఎస్కేఎన్ నిర్మాతగా తెరకెక్కించారు. అయితే, ఈ కథ మొత్తం తనదే అంటూ ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్ బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్ శ్రీరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాలతో సహా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్ అనే బుక్‌ను వెబ్సైట్లో https://babyleaks2023.blogspot.com/ అందుబాటులోకి తీసుకొచ్చాడు.బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్‌ను మీడియా ముందుంచారు. అయితే, తాజాగా సినీ నటి గాయత్రి గుప్తా కూడా ఈ అంశంపై రియాక్ట్ అయింది. ఫిదా సినిమాతో పాపులర్ అయిన గాయత్రి.. ఐస్ క్రీమ్ 2, కొబ్బరిమట్ట, మిఠాయి లాంటి సినిమాల్లో నటించింది. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గురించి గాయత్రి ఇలా చెప్పుకొచ్చింది. 'బేబీ సినిమా కథను ప్రేమించొద్దు అనే పేరుతో శిరిన్ శ్రీరామ్ రాసుకున్నారు. దానిని సాయి రాజేష్ కాపీ కొట్టేశాడు. ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా నన్ను అనుకున్నారు. అందుకు ఆడిషన్ కూడా జరిగింది. స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఆ ఫోటోలను సాయి రాజేష్‌కు చూపించాను. దానినే బేబీలో కాపీ కొట్టాడు. ట్రైలర్ విడుదల అయ్యాక చూసి నేను షాక్ అయ్యాను. సాయి రాజేష్‌తో ఇబ్బందులు నాకు కొత్త కాదు. ఆయన డైరెక్ట్ చేసిన కొబ్బరిమట్టలో కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు. ఆ సినిమాకు సంబంధించి రూ. 3లక్షలు ఇస్తానన్నారు. కానీ, కేవలం రూ.25 వేలు ఇచ్చి బాగా టార్చర్ పెట్టారు. అవన్నీ సరేలే అనుకుంటే.. బేబీ కథను మొదట రాసుకుంది శిరిన్. కానీ, సాయి రాజేష్ మాత్రం ఆ కథను తానే క్రియేట్ చేశానంటాడు. ఇద్దరూ కలిసి ఆ కథతో సినిమా తీద్దామని చివరి క్షణంలో బడ్జెట్ లేదని తెలివిగా శిరిన్‌ను తప్పించాడు. అదే కథను శిరిన్ నుంచి సాయి రాజేష్ కాపీ కొట్టేసి.. గీతా ఆర్ట్స్‌లో చర్చలు జరిపాడు. ఆ సంస్థ చాలా మంచిది. కానీ, పాము లాంటి సాయి రాజేష్‌ను వారు గుర్తించాలి. బేబీ సినిమా కోసం సాయి రాజేష్ చాలా చీప్ ట్రిక్స్ చేశాడు. బేబీ పాత్రను చాలా దారుణంగా చూపించాడు. కొందరైతే హీరోయిన్ పోస్టర్‌ను చెప్పులతో కూడా కొట్టారు. అంతలా ఆయన పబ్లిసిటీని ఉపయోగించుకున్నాడు. సాయి రాజేష్ లాంటి వ్యక్తి టాలీవుడ్‌కు మచ్చలా మిగిలిపోతాడు. బేబీ కథ రాసుకున్న శిరిన్ శ్రీరామ్‌కు న్యాయం జరిగాలి.' అని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది. -
ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి జోడీ
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–14, 21–10తో హువాంగ్ యు సున్–లియాంగ్ టింగ్ యు (చైనీస్ తైపీ) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో నలుగురు భారత ప్లేయర్లు సతీశ్ కుమార్, ఆయూశ్ శెట్టి, శంకర్ ముత్తుస్వామి, కార్తికేయ గుల్షన్ కుమార్ పోటీపడ్డా ఒక్కరు కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు. నేడు జరిగే మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)తో పీవీ సింధు తలపడుతుంది. -
Gayatri Reddy Bhatia Photos: ఇప్పుడు కావ్యా మారన్ ఫేమస్.. కానీ అప్పట్లో ఈమె క్రేజ్ వేరు! గుర్తుపట్టారా?
-
ఉబెర్ కప్ టోర్నీకి సింధు దూరం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ మహిళల టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఈసారి భారత ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగనుంది. ఈ మెగా టోర్నీ ఏప్రిల్ 27 నుంచి మే 5 వరకు చైనాలోని చెంగ్డూలో జరగనుంది. సింగిల్స్ విభాగం నుంచి స్టార్ ప్లేయర్ పీవీ సింధు తప్పుకోగా... డబుల్స్ విభాగం నుంచి పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ; అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీలు కూడా వైదొలిగాయి. పారిస్ ఒలింపిక్స్కల్లా తన ఆటలో మరింత పదును పెరిగేందుకు, పూర్తి ఫిట్‌గా ఉండేందుకు సింధు ఉబెర్ కప్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు దక్కించుకోవాలనే లక్ష్యంతో గాయత్రి–ట్రెసా, అశ్విని–తనీషా జోడీలు ఇతర క్వాలిఫయింగ్ టోర్నీలపై దృష్టి పెట్టాయి. భారత మహిళల జట్టు ఉబెర్‌కప్‌లో మూడుసార్లు (1957, 2014, 2016) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పూర్తి బలగంతో బరిలోకి దిగనుంది. భారత మహిళల జట్టు: అన్మోల్, తన్వీ శర్మ, అష్మిత, ఇషారాణి బారువా (సింగిల్స్); శ్రుతి మిశ్రా, ప్రియా కొంజెంగ్‌బమ్, సిమ్రన్, రితిక (డబుల్స్). భారత పురుషుల జట్టు: ప్రణయ్, లక్ష్య సేన్, శ్రీకాంత్, ప్రియాన్షు, కిరణ్ జార్జి (సింగిల్స్); సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, అర్జున్, ధ్రువ్ కపిల, సాయిప్రతీక్ (డబుల్స్). ఆసియా చాంపియన్‌షిప్ నుంచి వైదొలిగిన సాత్విక్ జోడీ భుజం గాయం నుంచి సాత్విక్ పూర్తిగా కోలుకోకపోవడంతో... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ వైదొలిగింది. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన ఈ మెగా టోర్నీలో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం పురుషుల డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. థామస్ కప్‌లో మాత్రం సాత్విక్–చిరాగ్ ద్వయం బరిలోకి దిగుతుందని భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. ఆసియా చాంపియన్‌షిప్ ఈనెల 9 నుంచి 14 వరకు చైనాలో జరుగుతుంది. -
Maddali Usha Gayathri: నృత్య తపస్వి
ఆమె ప్రయాణం నాట్యం. ఆమె ప్రయత్నం నాట్యకళకు జీవం పోయడం. నాలుగేళ్ల వయసు నుంచి కూచిపూడిని జీవనాడిగా చేసుకుని., 69 ఏళ్ల వయసులోనూ కళను వీడలేదు హైదరాబాద్ వాసి మద్దాలి ఉషాగాయత్రి. సుదీర్ఘ నృత్య ప్రయాణంలో భారత్‌తోపాటు దేశ విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. వందల మంది ఔత్సాహికులు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా 200కు పైగా నృత్యాంశాలకు సోలోగా కొరియోగ్రఫీ చేశారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలికి బ్యాలే చేసి, కేంద్ర ప్రభుత్వ అవార్డులు పొందారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న డా. ఉషా గాయత్రి నృత్య ప్రయాణం తెలుసుకుంటే ఈ కళాసేవ ఒక తపస్సులా అనిపించకమానదు. ‘‘కూచిపూడి నృత్యానికి సంబంధించిన సాహిత్యం, రచనలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పుస్తకాలుగా తీసుకురావాలనేది నా చిరకాల స్వప్నం. దానిని నిజం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాను’’ అని తనను తాను పరిచయం చేసుకున్న తపస్వి ఉషాగాయత్రి తన నృత్య జీవన గమ్యాన్ని ఇలా మనముందుంచారు. ‘‘నాలుగేళ్ల వయసులో ఉదయ్ శంకర్ శిష్యుడైన దయాల్ శరణ్ వద్ద నాట్యాభ్యాసం మొదలుపెట్టాను. ఇక్కడే కథక్, ఒడిస్సీ, సంగీతం కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత ప్రఖ్యాత గురువు వేదాంతం జగన్నాథ శర్మ వద్ద కూచిపూడి, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, పద్మభూషణ్ డా.వెంపటి చినసత్యం, వేదాంతం ప్రహ్లాద శర్మ వద్ద యక్షగానాలు, ప్రఖ్యాత కళాక్షేత్ర గురువు కమలారాణి వద్ద నట్టువాంగం, పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ వద్ద పదములు నేర్చుకున్నాను. 1988లో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ. పూర్తయ్యింది. అంతేకాకుండా ‘తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర వృద్ధి, వికాసం, నాట్యంలో అవతరణ‘ అనే అంశం మీద పరిశోధన చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పొందాను. రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాలయంలోని నృత్య విభాగంలోనూ పనిచేశాను. ఆ తర్వాత దాదాపు పాతిక సంవత్సరాలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగం చేశాను. నాట్యానికే అంకితం అవ్వాలనే తపనతో ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ‘నృత్యకిన్నెర‘ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో వందల మందికి శిక్షణనిస్తూ వచ్చాను. ఇందులో 50 మంది శిష్యులు నృత్యంలో డిప్లొమా సర్టిఫికెట్లు పొందారు. 10 మంది చిన్నారులు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీఆర్టీ స్కాలర్షిప్ పొందారు. నా శిష్యులు దేశవిదేశాల్లో స్థిరపడటమే కాకుండా నృత్యంలో పీహెచ్డీ, ఎం.ఏ. పట్టాలు పొంది గురువులు, నర్తకులుగా అభివృద్ధి చెందారని చెప్పుకోవడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. పాదం కదపని వేదిక లేదు సంగీత నాటక అకాడమీ, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్, టీటీడీ, రాష్ట్ర సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఎన్నో వందల ప్రదర్శనలు. దేశంలోని న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చాను. భారత స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో 1997లో మారిషస్‌లో ఇచ్చిన ప్రదర్శనకుగాను ఆనాటి ప్రెసిడెంట్ సత్కరించడం ఒక గొప్ప జ్ఞాపకం. ప్రదర్శనల కోసం శిష్యులతోపాటు యూకే, యూరోప్‌లలో పర్యటించాను. యూకేటీఏ, జయతే కూచిపూడి, అంతర్జాతీయ కూచిపూడి ఫెస్టివల్లో భాగంగా ప్రదర్శనలు ఇవ్వడం మరో గొప్ప అనుభూతి. ప్రధానంగా దాదాపు 200 లకు పైగా సోలో నృత్యాంశాలకు కొరియోగ్రఫి చేయడంతో పాటు ప్రతిష్టాత్మకమైన 16 బ్యాలేలు చేశాను. ఇందులో భాగంగా రచయిత ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవల శివభక్త మార్కండేయ, మా తెలుగుతల్లికి మల్లెపూదండ, స్వర్ణోత్సవ భారతి, వందేమాతరం, సంక్రాంతి లక్ష్మి, రుక్మిణీ సత్య, అలిమేలుమంగ చరిత్ర, యశోదకృష్ణ వంటి బ్యాలేలు ప్రదర్శించాను. రవీంద్రుని గీతాంజలి మాట నిజమైన వేళ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలికి బ్యాలే చేయడం నా అదృష్టంగా భావిస్తాను. కలకత్తా వేదికగా ఈ ప్రదర్శన చేసిన సమయంలో ఒక విషయం నన్ను అమితమైన ఆనందానికి లోను చేసింది. ‘ఏదో ఒకనాడు, ఎవరో ఒకరు నా సాహిత్యానికి నృత్య రూపాన్ని తీసుకువస్తారు’ అని ఆనాడే రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన మాటలను అక్కడి వారు ప్రస్తావించడం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని, సంతృప్తినిచ్చింది. కావ్యాలకు, కథనాలకు, నృత్యానికి ఎంతటి అనుబంధం ఉంటుందో ఆ సంఘటన రుజువు చేసింది. 12 గంటలు 12 మంది శిష్యులు నృత్యం దర్శయామిలో భాగంగా 72 సోలో నృత్యాంశాలైన శబ్దాలు, తరంగములు, దరువులు, తిల్లానాలు, అష్టపదులు, కీర్తనలు.. తదితర అంశాలతో 12 మంది శిష్యురాళ్లతో కలిసి 12గంటల పాటు అవిరామంగా నృత్యప్రదర్శన చేశాం. 12గంటల పాటు నిరంతరాయంగా నట్టువాంగం నిర్వహించి దానిని గురువు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రికి అంకితం చేశాం. చేసిన సోలో ప్రదర్శనలు, బ్యాలేలు న్యూ ఢిల్లీ దూరదర్శన్ తో పాటు విదేశీ ఛానళ్లలోనూ ప్రసారమయ్యాయి. ఎంతో ప్రోత్సాహం.. ఈ నృత్య ప్రయాణంలో నా జీవిత భాగస్వామి మద్దాళి రఘురామ్ ప్రోత్సాహం ఎనలేనిది. ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నాను. వాటిలో .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2001లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రీయ అవార్డు ‘హంస పురస్కారాన్ని’, 2004లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం, యూరప్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ నర్తకిగా, న్యూయార్క్‌లో ఉత్తమ నాట్యగురువుగా, సిలికాన్ ఆంధ్ర అంతర్జాతీయ కూచిపూడి కన్వెన్షన్ లో ఆనాటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు, మారిషస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నృత్యరత్న బిరుదుతోపాటు, ఉత్తమ నర్తకి–నాట్యగురు అవార్డులను పొందాను. 1984లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (న్యూ ఢిల్లీ) ఆధ్వర్యంలో ఉత్తమ కళాకారిణిగానూ, భారత్‌తో పాటు విదేశాల్లో నిర్వహించిన పలు అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాలకు న్యాయనిర్ణేతగా సేవలందించాను. గత డిసెంబర్లో స్ట్రోక్ వచ్చి వీల్‌చెయిర్‌లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా నా కళా తపన ఆగలేదు. వీల్ చెయిర్ నుంచే విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణను అందిస్తున్నాను. ఈ నెల 6న రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక పురస్కారాన్ని వీల్‌చెయిర్‌లో ఉండే అందుకున్నాను. నా శ్వాస ఉన్నంతవరకు కళాసేవలో తరించాలని, కళలో ఔత్సాహికులను నిష్ణాతులను చేయాలన్నదే నా తపన’ అంటూ ఉషాగాయత్రి తన సుదీర్ఘ నృత్య ప్రయాణాన్ని ఎంతో ఆనందంగా మన ముందు ఆవిష్కరించారు. – హనుమాద్రి శ్రీకాంత్, సాక్షి సిటీ, హైదరాబాద్ -
ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి జోడీ
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా ద్వయం 16–21, 21–19, 21–17తో భారత్‌కే చెందిన అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జంటను ఓడించింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–13, 24–22తో ఒంగ్ యె సిన్–తియో ఈ యి (మలేసియా) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో లక్ష్య సేన్ (భారత్) 15–21, 21–15, 21–3తో కాంటా సునెయామ (జపాన్)పై నెగ్గగా... ప్రియాన్షు రజావత్ (భారత్) 8–21, 15–21తో ప్రపంచ నంబర్‌వన్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. -
ప్లీజ్ సాయం చేసి కాపాడండి.. దీనస్థితిలో నటి గాయత్రి
సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ రంగుల ప్రపంచంలో అందరి జీవితాల్లో వెలుగులు కనిపించవు. సెలబ్రిటీల లైఫ్ అంటేనే లగ్జరీ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ.. అది అందరి జీవితాల్లో ఉండదు. వెండితెరపై ఎంతో సంతోషంగా కనిపించే చాలా మంది నటీ, నటుల జీవితాల్లో ఎన్నో కన్నీళ్లు ఉంటాయి. ఐస్‌క్రీమ్ 2, ఫిదా, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోని, కొబ్బరిమట్ట.. ఇలా అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి గుప్తా జీవితంలో ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే గాయత్రి చాలాకాలంగా ఓ వ్యాధితో బాధపడుతోంది. 'ఆర్థరైటిస్' జబ్బుతో పోరాడుతున్నట్లు ఆమె గతంలో చెప్పింది. ఇది డిప్రెషన్ వల్ల వచ్చే శారీరక వ్యాధని ఆమె చెప్పింది. అందుకు ట్రీట్మెంట్ తీసుకుంటే నయం అవతుందని అందుకు సరిపడా డబ్బులు తన వద్దలేవని గాయత్రి బాధపడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆమె వైద్యానికి రూ. 12 లక్షలు ఖర్చు అవుతుందని ఈ మేరకు ఎవరైనా దాతలు విరాళాలు అందిస్తారేమోనని గాయత్ర గుప్తా ఎదురు చూస్తుంది. దాతలు సాయం చేయాలంటే ఇంపాక్ట్ గురు అనే స్వచ్చంద సంస్థ ఈ విరాళాల సేకరణకు ముందుకు వచ్చింది. ఆమె వైద్యానికి రూ. 12 లక్షల ఖర్చు అవుతుండగా.. ఇప్పటి వరకు ఆమెకు కేవలం రూ.1.5 లక్షలు మాత్రమే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆమెకు ఇంకా సుమారుగా రూ. 10 లక్షలకు పైగా డబ్బు కావాల్సి వస్తుంది. ఈ మేరకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ తన వంతుగా సాయం చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా త్వరగా కోలుకుంటావని ఆమెకు భరోసా కల్పించాడు. అంతేకాకుండా గాయిత్రికి దాతలు సాయం చేయాలని ఆయన కోరాడు. ఫిదా సినిమాలో సాయిపల్లవి ఫ్రెండ్‌గా కనిపించిన గాయత్రి గుప్తాకు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ప్రముఖులు సాయం చేస్తారేమో తెలియాల్సి ఉంది. దయచేసి నాకు సాయం చేయండి: గాయత్రి నా ఆరోగ్య పరిస్థితి మరింతి ప్రమాదంగా మారింది. దీంతో తక్షణమే నేను ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది నా జీవితంలో చాల సంక్లిష్టమైన సమయం. నా వైద్యానికి అవసరం అయ్యే డబ్బు నా వద్ద లేదు. దయచేసి నాకు సాయం చేయండి. ఇంపాక్ట్‌గురు. కామ్ అనే ఫండింగ్ సంస్థ ద్వారా నాకు సాయం చేయండి. మీకు తోచినంత మొత్తాన్ని నా వైద్య ఖర్చులకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ వ్యాఖ్యలతో అవకాశాలకు బ్రేక్ టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌తో పాటు బిగ్‌బాస్ టీమ్‌పై లైంగిక ఆరోపణలతో గాయిత్రి గుప్తా తెరపైకి వచ్చింది. బిగ్‌బాస్ మూడో సీజన్‌కు పోటీదారుగా పాల్గొనేందుకు తనకు ఆసక్తి ఉందా అని ముగ్గురు సభ్యులు తనను సంప్రదించారని.. ఒకవేళ 'బిగ్ బాస్' ఎంపికైతే తమను ఎలా సంతృప్తి పరుస్తారని టీమ్ సభ్యులు అడిగినట్లు గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు కూడా తనను ఇబ్బంది పెట్టినట్లు ఆమె బహిరంగంగానే చెప్పింది. దీంతో ఆమెకు ఎవరూ సినిమా అవకాశాలు ఇవ్వలేదని చెప్పవచ్చు. -
స్టార్ హీరోతో ఒక్క సినిమా చేసింది.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిని!
ఇటీవల ఇటలీలో రోడ్డు ప్రమాదానికి గురైన బాలీవుడ్ హీరోయిన్ గాయత్రి జోషి. ఈ సంఘటనతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ప్రముఖ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ను పెళ్లాడిన గాయత్రి.. తన కెరీర్లో కేవలం ఓకే ఒక్క సినిమాలో మాత్రమే నటించింది. అయితే ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన వికాస్ ఒబెరాయ్‌ను వివాహం చేసుకుంది. సార్డినియా సూపర్‌కార్ టూర్లో పాల్గొనేందుకు గాయత్రి, వికాస్ ఇటలీకి వెళ్లారు. ఇటలీలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కాగా.. గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై ఇటలీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రీ జోషి కెరీర్ ఎలా ప్రారంభమైంది? 1977లో నాగ్‌పూర్‌లో జన్మించిన గాయత్రి ముంబైలోని కళాశాలలో చదువుతున్న సమయంలో మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. మోడల్‌గా ప్రముఖ కంపెనీల బ్రాండ్స్ ప్రకటనలలో నటించింది. షారుఖ్ ఖాన్‌తో కూడా ఓ ప్రకటనలో మొదటిసారి కనిపించింది. 1999లో గాయత్రి మిస్ ఇండియా పోటీలో పాల్గొని టాప్ 5లో నిలిచింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఆమె మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెలుచుకుంది. జపాన్‌లో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ 2000లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించింది. స్వదేశ్‌తో బాలీవుడ్లో అరంగేట్రం 2004లో మోడల్‌గా సక్సెల్ అయిన గాయత్రిని అశుతోష్ గోవారికర్ స్వదేశ్ చిత్రంలో నటించింది. షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గాయత్రి తన తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకుంది. అయితే వికాస్ ఒబెరాయ్‌ని వివాహం చేసుకుని సినిమాలకు వీడ్కోలు పలికింది. పెళ్లి తర్వాత గాయత్రి లైఫ్ గాయత్రి భర్త వికాస్.. ఒబెరాయ్ కన్స్ట్రక్షన్ ప్రమోటర్లలో ఒకరు. అతను భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు. ఒబెరాయ్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 22,780 కోట్లు. ఇతరత్రా కలిసి ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 28000 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. గాయత్రి, వికాస్‌లకు ఇద్దరు కుమారులు సంతానం కాగా.. ముంబయిలో నివసిస్తున్నారు. -
విషాదం: బిలియనీర్ వికాస్, నటి గాయత్రి లగ్జరీ కార్ క్రాష్, వీడియో వైరల్
బాలీవుడ్ మూవీ 'స్వదేశ్' లో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన యాక్టర్ గాయత్రి జోషి ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ప్రమాదానికి గురైంది. గాయత్రితోపాటు, భర్త, వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ తృటిలో ఈ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. అయితే మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఇటలీలో విహార యాత్రలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సార్డినియా సూపర్‌కార్ ఎక్స్పీరియన్స్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు గాయత్రి ప్రయాణిస్తున్న లంబోర్ఘిని కారు మరో లగ్జరీ కారు ఫెరారీని, క్యాంపర్ వ్యాన్ని ఢీకొట్టింది. లంబోర్ఘిని ,ఫెరారీతో సహా ఇతర లగ్జరీ వాహనాలతో పాటు, మినీ ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇది జరిగింది. దీంతో ఫెరారీ కారులో ఉన్న స్విట్జర్లాండ్‌కు జంట ప్రాణాలు కోల్పోయారు. మీడియా నివేదికల ప్రకారం, ఫెరారీలో మంటలు చెలరేగడంతో మెలిస్సా క్రౌట్లీ(63) మార్కస్ క్రౌట్లీ, 67 అక్కడి క్కడే ప్రాణాలొదిలారు. వికాస్ ఒబెరాయ్ మేనేజర్ ప్రకారం గాయత్రి, వికాస్ జంట ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. కాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన గాయత్రీ జోషి వీడియో జాకీగా తన కెరీర్‌ను ప్రారంభించింది. అడ్వర్టైజింగ్ మోడల్‌గా కూడా పనిచేసింది. హన్స్ రాజ్ హన్స్ 'ఝంజరియా, జగ్జిత్ సింగ్ 'కాఘజ్ కి కష్టి'తో సహా అనేక మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. ఆ తర్వాత ఫెమినా ఇండియా అందాల పోటీల్లో విజేతగా నిలవాలనే లక్ష్యంతో 2000లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకుంది. అలాగే మిస్ ఇంటర్నేషనల్ 2000లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇక సినిమాల విషయానికి వస్తే 2004లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ 'స్వేడ్స్'లో నటించింది. 2005లో వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ని పెళ్లాడి సినిమాలకు గుడ్‌బై చెప్పింది. వీరికి ఇద్దరు పిల్లలు. వికాస్ ఒబెరాయ్: టాప్ ముంబై రియల్టర్, ఒబెరాయ్ రియల్టీ ఎండీ వికాస్ ఒబెరాయ్. ఫోర్బ్స్ అతని నికర విలువ 3.8 బిలియన్లు డాలర్లుగా అంచనా వేసింది. Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T — Globe Clips (@globeclip) October 3, 2023 -
గాయత్రి–ట్రెసా జోడీ శుభారంభం
కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 54 నిమిషాల్లో 21–15, 16–21, 21–16తో జిలీ డెబోరా–చెరిల్ సీనెన్ (నెదర్లాండ్స్) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ అప్రియాని రహాయు–సితీ ఫాదియా సిల్వా (ఇండోనేసియా)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ నుంచి మాళవిక బన్సోద్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందగా... పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ నుంచి కిరణ్ జార్జి, రవి చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయారు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం మెయిన్ ‘డ్రా’కు చేరింది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సుమీత్–అశ్విని జోడీ 21–15, 21–14తో అలి్వన్ మొరాదా–అలీసా (చెక్ రిపబ్లిక్) జంటను ఓడించింది. మహిళల డబుల్స్ క్వాలిఫయింగ్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ 21–16, 21–14తో సిక్కి రెడ్డి–ఆరతి జంటపై గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. -
ఏక్ దమ్ స్టెప్పులు
ఏక్ దమ్ ఎనర్జీతో స్టెప్పులేశారు రవితేజ. స్టువర్టుపురం దొంగగా చెప్పుకునే టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘ఏక్ దమ్... ఏక్ దమ్’ అంటూ జోష్‌గా సాగేపాట లిరికల్ వీడియోను ఈ నెల 5న విడుదల చేయనున్నట్లు వెల్లడించి,పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్. నూపుర్ సనన్‌ను రవితేజ ఆటపట్టించే సందర్భంలో ఈపాట వస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, సహనిర్మాత: మయాంక్ సింఘానియా. TIGER's Super Entertaining and Energetic Avatar for a peppy number 🤩💫#TigerNageswaraRao First Single #EkDumEkDum out on September 5th 🥁🎷 A @gvprakash musical 🎶 In cinemas from October 20th 🥷@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AAArtsOfficial @AnupamPKher pic.twitter.com/PIKO52wezZ — Tiger Nageswara Rao (@TNRTheFilm) September 1, 2023 -
టైగర్ ప్రియురాలు ఈమెనే..
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్ (నటి కృతీ సనన్ చెల్లెలు), గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లు. ‘ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2’ వంటి వరుస విజయాలు అందుకున్న అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సారా పాత్రలో నటిస్తున్నారు నూపుర్. ‘టైగర్ లవ్ సారా’ అంటూ సోమవారం నూపుర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘రవితేజ కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. అక్టోబర్ 20న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. అనుపమ్ ఖేర్, రేణూ దేశాయ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్. మది, సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్, సహనిర్మాత: మయాంక్ సింఘానియా. Nothing makes me feel more proud than to launch my sister’s first PAN INDIA film Poster!🥹🧿❤️ #TigerNageswaraRao Meet our TIGER'S LOVE ❤️ Introducing @NupurSanon as the lovely Sara from the GRAND WORLD of #TigerNageswaraRao 🥷 WORLDWIDE HUNT begins from October 20th 🐯🔥… pic.twitter.com/hlyGMVv9ly — Kriti Sanon (@kritisanon) August 28, 2023 -
నాకున్న జబ్బు ఇదే, ఎక్కువ రోజులు బతకనని చెప్పారు: నటి
ఐస్‌క్రీమ్ 2, ఫిదా, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోని, కొబ్బరిమట్ట.. ఇలా అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది గాయత్రి గుప్తా. అంతకంటే ముందే యాంకర్‌గా, షార్ట్ ఫిలింస్ చేస్తూ కూడా ఫేమస్ అయింది. టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌తో పాటు బిగ్‌బాస్ టీమ్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లోకెక్కింది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే గాయత్రి చాలాకాలంగా ఓ వ్యాధితో బాధపడుతోంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. పదేళ్లపాటు బెడ్ రెస్ట్.. గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. 'సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఇంట్లో ఒప్పుకోలేదు. పాతికేళ్ల వయసులో ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. నాకు యాంక్లోసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉంది. అది ఎందుకు? ఎలా వచ్చిందో అర్థం కాలేదు. పదేళ్లపాటు బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఇది డిప్రెషన్ వల్ల వచ్చే శారీరక వ్యాధి. ఈ విషయం నాకు ఆరు నెలల క్రితం తెలిసింది. చాలామంది డాక్టర్లు నేను ఎక్కువ కాలం బతకనని చెప్పారు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం బతకడం కష్టమని మూడేళ్ల కిందట డాక్టర్స్ చెప్పారు. ఊహ తెలిసినప్పటినుంచి రాత్రిళ్లు నిద్ర లేదు ఊహ తెలిసినప్పటి నుంచి రాత్రిళ్లు సరిగా పడుకోలేదు. డిప్రెషన్ వల్లే నాకు నిద్ర దూరమైంది. నెలకు రెండు బయాలాజిక్స్ ఇంజక్షన్స్ తీసుకున్నాను. ఇంజక్షన్స్ వేసుకోకపోతే కదలడానికి కూడా కష్టమయ్యేది. అలాగే విపరతీమైన బ్యాక్ పెయిన్ ఉండేది. పెయిన్ కిల్లర్ వేసుకున్న ప్రతిసారి నాకు గుండెదడ వస్తుంది. దాదాపు 10 ఏళ్ల నుంచి తరచూ పెయిన్ కిల్లర్స్ వాడుతూనే ఉన్నాను. డాక్టర్స్ నేను చనిపోతానని చెప్పినప్పుడు ఈ నొప్పి భరించడం కంటే అదే నయం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ బాధ నుంచి నెమ్మదిగా బయటకు వస్తుంటే బతుకుపై ఆశ కలుగుతోంది. సైకాలజీ థెరపీ వచ్చాక ఈ వ్యాధిపై మరింత క్లారిటీ వచ్చింది. సమయానికి పడుకోవడం, యోగా చేయడం.. ఇలా అన్నీ చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది గాయత్రి గుప్త. చదవండి: ఘనంగా బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి నిశ్చితార్థం.. కాలికి పట్టీలు, చేతికి ఉంగరం తొడుగుతూ.. -
వెంకటేశ్ 'సైంధవ్' హార్ట్ ఎవరంటే..?
సైంధవ్ హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరు? ఆ మాటకొస్తే సైంధవ్ హార్ట్ ఎవరు? అంటే... బేబీ గాయత్రి. సైంధవ్, గాయత్రిల అనుబంధం ఎలాంటిదో ‘సైంధవ్’ చిత్రంలో చూడాల్సిందే. వెంకటేశ్ టైటిల్ రోల్లో శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో గాయత్రి పాత్ర చేస్తోంది బేబీ సారా. వెంకటేశ్‌తో సారా ఉన్న పొస్టర్ని ‘హార్ట్ ఆఫ్ సైంధవ్’ అంటూ సోమవారం విడుదల చేశారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా, నవాజుద్దీన్ సిద్ధిఖ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా దక్షిణాది భాషల్లో, హిందీలోనూ డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఎస్. మణికందన్. ∙వెంకటేశ్, సారా -
చెరుకు మిషన్‌లోకి చున్నీ: యువతి మృతి
శ్రీకాకుళం: శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథాలయం వద్దనున్న చెరుకు మిషన్ వద్ద పని చేస్తున్న గాయత్రి (18) అనే యువతి చున్నీ మిషన్‌లోకి వెళ్లిపోవడంతో ఊపిరాడక మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కండ్ర వీధికి చెందిన గాయత్రి ఆదివారం సాయంత్రం చెరుకు మిషన్ వద్ద పనిచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు చున్నీ మిషన్‌లోకి వెళ్లిపోయి ఊపిరాడక అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. స్థానికులు హుటాహుటిన రిమ్స్‌కు తరలించినా అప్పటికే ఆమె మృతి చెందింది. ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు రిమ్స్ వైద్యులతో మాట్లాడారు. -
సాగర తీరంలో కయాకింగ్ క్వీన్
ఆ యువతి పడవ నడపగలదు.. ఒడుపుగా లంగరు సైతం వేయగలదు. తండ్రినే గురువుగా భావించి.. సాగర సంగమ తీరాన్నే శిక్షణ కేంద్రంగా ఎంచుకుని ‘కయాకింగ్ అండ్ కనోయింగ్’ క్రీడలో రాణిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఆ యువతి ప్రపంచ ఒలింపిక్స్‌లో రాణించి భారత్ తరఫున పతకం అందుకోవాలని తహతహలాడుతోంది. నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక సాగర సంగమ తీరానికి చెందిన నాగిడి గాయత్రి గ్రామీణులకు పెద్దగా పరిచయం లేని ‘కయాకింగ్ అండ్ కనోయింగ్’ జలక్రీడలో రాణిస్తోంది. ఏడేళ్ల వయసులోనే తండ్రి వెంట నది బాటపట్టిన గాయత్రి చేపల వేట నేర్చుకుంది. జల క్రీడల్లో రాణించాలనే ఆ చిన్నారి తపనను గమనించి తండ్రి నాగబాబు కృష్ణా నదిలో ఈత నేర్పించారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివిన గాయత్రి కరాటేలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. విజయనగరం జిల్లా గరివిడి వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చేసింది. నాటు పడవతోనే నదిలో సాధన చేసి గత ఏడాది గుజరాత్లో జరిగిన 36వ జాతీయస్థాయి కయాకింగ్ అండ్ కెనోయింగ్ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో రజత పతకం 18 సంవత్సరాల నాగిడి గాయత్రి కరాటే, రోయింగ్, కయాకింగ్ అండ్ కనోయింగ్ పోటీల్లో పలు పతకాలు సాధించింది. 2017లో ఢిల్లీలో జరిగిన 33వ నేషనల్ తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం పొందింది. 2021లో రాష్ట్రస్థాయి రోయింగ్ పోటీల్లో బంగారు పతకం కైవశం చేసుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో గుజరాత్లో జరిగిన జాతీయస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో నాలుగో స్ధానంలో నిలవగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 11న భోపాల్‌లో జరిగిన 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ విభాగంలో జాతీయ స్థాయిలో రజత పతకం కైవశం చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో గోవాలో జరిగే 37వ జాతీయస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలకు గాయత్రి అర్హత సాధించింది. దాతల సహాయం, మెరుగైన శిక్షణ అందిస్తే ప్రపంచ ఒలింపిక్ పోటీల్లో పతకం సాధిస్తానని గాయత్రి ధీమా వ్యక్తం చేస్తోంది. చేపల వేటలో సాయపడుతూ.. తండ్రి నాగిడి నాగబాబుకు చేపల వేటలో గాయత్రి సహాయపడుతోంది. తండ్రితో పాటు రాత్రివేళలో బోటుపై సాగర సంగమ ప్రాంతానికి వెళ్లి వల, గాలం ద్వారా చేపల వేట సాగిస్తోంది. పురుషులకు దీటుగా పడవ నడుపుతూ.. లంగరు కూడా వేస్తోంది. చేపల వేటలో తలపండిన మత్స్యకారులు చేయలేని పనులను సైతం గాయత్రి సునాయాసంగా చేస్తుంది. గాలానికి రొయ్య గుచ్చడంలో గాయత్రి దిట్ట. ఒడుపుగా గుచ్చకపోతే రొయ్య ముళ్ళు చేతిలో దిగి తీవ్రంగా బాధిస్తుంది. నాగాయలంకలో 40 చేపల వేట బోట్లు ఉండగా.. వీటిపై ముగ్గురు మాత్రమే గాలానికి ఒడుపుగా రొయ్య గుచ్చేవారు ఉంటే.. అందులో గాయత్రి ఒకరు కావడం విశేషం. నాగిడి నాగబాబు పెద్ద కుమార్తె గౌతమి స్మిమ్మింగ్‌లో, కుమారుడు రాజేష్ తైక్వాండోలో, నాగబాబు సోదరి లక్ష్మీకుమారి కుమారులు కన్నా కుమార్, ఈశ్వర్ తైక్వాండో, కయాకింగ్‌లో, నాగబాబు సోదరుడు సాంబశివరావు కుమార్తె భార్గవి రోయింగ్‌లో, కుమారుడు శ్యాం కయాకింగ్‌లో రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకోవడం విశేషం. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తా మా కుటుంబానికి చేపల వేటే జీవనాధారం. మా నాన్న ఎంతో కష్టపడి శిక్షణ ఇప్పిస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్ అకాడమీ సెక్రటరీ శివారెడ్డి ప్రోత్సాహం మరువలేనిది. కోచ్‌లు శ్రీనివాస్, నాగబాబు, చిన్నబాబు శిక్షణ నన్ను ఈ స్థాయికి తెచ్చాయి. ప్రపంచ ఒలింపిక్స్ వాటర్ స్పోర్ట్స్ క్రీడల్లో పాల్గొని బంగారు పతకం సాధించాలని ఉంది. దాతల ప్రోత్సాహం, మరింత మెరుగైన శిక్షణ అందిస్తే ఇంకా రాణిస్తాను. – నాగిడి గాయత్రి, కయాకింగ్ క్రీడాకారిణి -
మహిళా ద్వేషికి జెడ్ కేటగిరీ భద్రతా?: గాయత్రి రఘురాం ఫైర్
సాక్షి, చెన్నై: రాష్ట్ర బీజేపీలో మహిళలకు ఎక్కడ భద్రత ఉందో..? తాను తండ్రిగా భావించే ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మహిళా నేత, సినీ నటి గాయత్రి రఘురాం వ్యాఖ్యానించారు. మహిళలను అవమాన పరిచే జోకర్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకుల నుంచి వస్తున్న విమర్శల గురుంచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పార్టీ మహిళ నేత, సినీ నటి గాయత్రి రఘురాం అధ్యక్షుడికి వ్యతిరేకంగా తరచూ తీవ్ర వ్యాఖ్యల తూటాలను పేల్చుతూ వస్తున్నారు. తాజాగా అధ్యక్షుడు అన్నామలైకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడంపై ఆమె స్పందించారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. ఇందులో తనను తీవ్రంగా అవమానపరిచి, అత్యంత నీచాతి నీచంగా తనతో వ్యవహరించిన అధ్యక్షుడికి జెడ్ కేటగిరీ భద్రత ఎందుకో..? అని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీలో మహిళ భద్రత సూపర్ అని ఎద్దేవా చేస్తూ, ప్రధాని నరేంద్రమోదీని తాను తండ్రిస్థానంలో చూస్తానని పేర్కొన్నారు. రాజకీయ జోకర్‌కు ఈ భద్రత అవసరమా..? అని విమర్శించారు. ఇలాంటి వారి కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం శోచనీయమన్నారు. దూరంగా శాసన సభాపక్ష నేత.. అసెంబ్లీలో సేతు సముద్రం ప్రాజెక్టు సాధనే లక్ష్యంగా డీఎంకే ప్రభుత్వం తీర్మానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు బీజేపీ శాసన సభా పక్ష నేత నయనార్ నాగేంద్రన్ మద్దతు ఇచ్చారు. రామసేత వంతెనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు అన్నామలై అందుకు భిన్నంగా మీడియాతో స్పందించారు. ఇది ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్న విభేదాలను ఈ విషయం స్పష్టం చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం తిరునల్వేలిలో జరిగిన సంక్రాంతి వేడుకలకు అన్నామలై హాజరైనా నయనార్ నాగేంద్రన్ దూరంగా ఉండటం చర్చకు దారి తీసింది. తిరునల్వేలి జిల్లాలో సీనియర్‌నేతగా నాగేంద్రన్ ఉన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పార్టీలో చర్చకు దారి తీసింది. -
'మహిళలంటే పార్టీలో గౌరవం లేదు..' బీజేపీకి నటి గుడ్‌బై..
చెన్నై: తమిళ నటి గాయత్రి రఘురామ్ బీజేపీకి రాజీనామా చేశారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమళై సారథ్యంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, సమాన హక్కులు లేవని ఆరోపించారు. భారమైన హృదయంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే గాయత్రిని గతేడాది నవంబర్లోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అన్నమళై. ఆరు నెలల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ ఆమెను ఎలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని చెప్పారు. దీంతో రెండు నెలల తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గాయత్రి ప్రకటించారు. అనంతరం వరుస ట్వీట్లు చేశారు. హిందూ ధర్మం నా హృదయం, మనస్సాక్షిలో ఉంది. ఓ రాజకీయ పార్టీలో దీని కోసం వెతుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. దీనికి బదులు గుడికి వెళ్లి దేవుడు, ధర్మం కోసం అన్వేషిస్తాన. భగవంతుడు అన్నిచోట్లా ఉన్నాడు. నాతోనూ ఉన్నాడు. న్యాయం ఆలస్యం చేస్తే, న్యాయాన్ని నిరాకరించినట్లే. అని గాయత్రి ట్విట్టర్లో రాసుకొచ్చారు. చదవండి: ప్రజాప్రతినిధుల భావప్రకటన స్వేచ్ఛ.. కీలక తీర్పు -
BCCI: జనని, గాయత్రి, వ్రిందా... రంజీ చరిత్రలో తొలిసారి!
BCCI- Ranji Trophy- ముంబై: భారత దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలిసారి మహిళా అంపైర్లు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు మహిళా అంపైర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. భారత క్రికెట్లో ఇది కొత్త మలుపు కానుందని బోర్డు అభిప్రాయ పడింది. వ్రిందా రాఠి (ముంబై), జనని నారాయణ్ (చెన్నై), గాయత్రి వేణుగోపాలన్ (ఢిల్లీ)లకు ఈ అవకాశం దక్కింది. డిసెంబర్ 13న ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీలో కొన్ని ఎంపిక చేసిన మ్యాచ్‌లకు వీరు అంపైర్లుగా వ్యవహరిస్తారు. 32 ఏళ్ల వ్రిందా ముంబైలో చిన్న స్థాయి క్లబ్ మ్యాచ్‌ల నుంచి మొదలు పెట్టి బీసీసీఐ అంపైర్‌గా ఎదగగా, 43 ఏళ్ల గాయత్రి బోర్డు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణురాలై 2019 నుంచి అంపైరింగ్ చేస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన 36 ఏళ్ల జనని క్రికెట్‌పై ఆసక్తితో ఉద్యోగం వదిలి అంపైరింగ్ వైపు వెళ్లింది. చదవండి: FIFA WC Pre- Quarterfinals: స్పెయిన్‌కు షాక్.. మొరాకో సంచలనం! బోనో వల్లే ఇదంతా! Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్ -
మంత్రి గంగుల, ఎంపీ గాయత్రీ రవికి సీబీఐ నోటీసులు
-
‘నీళ్ల’పై తడాఖా.. జోరుగా ప్రపంచ రాపెల్లింగ్ పోటీలు
సాక్షి, ఇచ్చోడ(బోథ్): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండివాగు అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన గాయత్రి జలపాతం వద్ద శనివారం ప్రపంచ రాపెల్లింగ్ పోటీలు నిర్వహించారు. అడ్వెంచర్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు వివిధ దేశాల నుంచి 20 మంది యువతీ, యువకులు తరలివచ్చారు. శనివారం సాయంత్రం విదేశీ యువతితోపాటు ఇద్దరు యువకులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 30 మంది యువకులు పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం విదేశీ యువతతోపాటు మరో 30 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారు. రెండు ఎత్తైన భారీ కొండల మధ్య నుంచి వస్తున్న గాయత్రి జలపాతం చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. గాయత్రి జలపాతం వద్ద ప్రపంచ రాపెల్లింగ్ పోటీలు -
అత్యాచారయత్నం కేసు.. గాయత్రి భర్త చెప్పిన షాకింగ్ విషయాలు..
సాక్షి, హైదరాబాద్: కొండాపూర్‌లో యువతిపై అత్యాచారయత్నం కేసులో పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితురాలు గాయత్రి భర్త శ్రీకాంత్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై గాయత్రి భర్త ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తన అత్త చేసే ఆరోపణలు అసత్యమని తెలిపారు. గాయత్రి తండ్రి మరణం అనంతరం వాళ్లు గాయత్రి మీద కక్ష కట్టారన్నారు. చదవండి: ఎంత పనిచేశావ్ నాన్నా! పుట్టింటికి నవ వధువు.. ప్రాణాలు తీసిన కన్నతండ్రి ఆస్తి పంపకాల్లో గాయత్రిని ఆమె తల్లి, సోదరే వేధించారన్నారు. గాయత్రి స్థలంలో తన తమ్ముడు ప్రదీప్ ఇళ్లు కట్టాలని చూశాడని.. దాన్ని గాయత్రి అడ్డుకుందని తెలిపారు. గాయత్రి కుటుంబంలో పరస్పరం అందరూ కేసులు వేసుకున్నారన్నారు. గాయత్రికి తాను సపోర్ట్‌గా ఉన్నందుకు తనపై కక్ష కట్టారని శ్రీకాంత్ తెలిపారు. గాయత్రి అరాచకాలపై తనకేమి తెలియదన్నారు. మీడియాలో వస్తున్న కథనాలపై తనకు సమాచారం లేదని శ్రీకాంత్ అన్నారు. కాగా, సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతిపట్ల అమానుషంగా ప్రవర్తించిన గాయత్రి ఇల్లును కబ్జా చేయడానికి ఆమె కుటుంబీకులు యత్నించారు. ఆమె భర్త శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్యసహా మరికొందరిపై ఆదివారం కేసు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించి గాయత్రికి, ఆమె తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్య మధ్య కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. -
గాయత్రి ఇల్లు కబ్జాకు కుటుంబీకుల యత్నం
గచ్చిబౌలి: సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతిపట్ల అమానుషంగా ప్రవర్తించిన గాయత్రి ఇల్లును కబ్జా చేయడానికి ఆమె కుటుంబీకులు యత్నించారు. ఆమె భర్త శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్యసహా మరికొందరిపై ఆదివారం కేసు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించి గాయత్రికి, ఆమె తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్య మధ్య కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. వీటిలో కొన్ని ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఒకరి పేరిట ఉండగా, పొజిషన్లో వేరొకరు ఉన్నారు. యువతిపై లైంగిక దాడి ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం గాయత్రిసహా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఉంటాడని భావించిన కుటుంబసభ్యులు ఆదివారం మధ్యాహ్నం తల్లి, సోదరి, సోదరుడు ప్రదీప్ రాజు, సమీప బంధువులు మల్లికార్జున్, అఖిల్ తదితరులు గాయత్రి ఇంటి వద్దకు వచ్చారు. ఆ సమయంలో వాచ్‌మన్ గేటుకు తాళం వేయగా అతడిపై దాడి చేసి తాళం పగులకొట్టారు. కృష్ణవేణి, సౌజన్య లోపలికి వెళ్లగా, మిగిలినవారు గేటు వద్దే ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న శ్రీకాంత్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. దీంతో ఆయన ‘డయల్–100’కు ఫోన్‌కాల్ చేయడంతో గచ్చిబౌలి ఠాణాకు చెందిన మహిళా ఎస్సై, కానిస్టేబుళ్లు గాయత్రి ఇంటి వద్దకు చేరుకుని అక్కడ ఉన్నవారిని బయటకు పంపేశారు. అద్దెకున్నవారికి బెదిరింపులు గాయత్రి నుంచి ఇల్లు అద్దెకు తీసుకున్న హేమంత్ వద్దకు ఈ ఏడాది మార్చి 30న సౌజన్య వెళ్లారు. ఆ ఇల్లు తనదని వెంటనే ఖాళీ చేయాలని హేమంత్‌ను బెదిరించి కరెంట్ కనెక్షన్ తొలగించడంతో ఆమెపై కేసు నమోదైంది. గాయత్రి తన ఇంటికి సమీపంలో ఉన్న కొన్ని దుకాణాలను అద్దెకు ఇవ్వగా, వీటిల్లో వ్యాపారాలు చేసుకుంటున్న అమిత్‌సింగ్, జేమ్స్, పాండు, మధుసూదన్ల వద్దకు సౌజన్య వెళ్లి హంగామా చేసింది. వారి సామాన్లను పగులకొట్టడంతోపాటు సూసైడ్ నోట్లో వారి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగడంతో ఆమెపై మరో కేసు నమోదైంది. (చదవండి: సినిమా స్టోరీని తలపిస్తున్న గచ్చిబౌలి గాయత్రి కేసు.. ట్విస్టులే ట్విస్టులు) -
నటి గాయత్రి రఘురాంపై కేసు నమోదు
నటి గాయత్రి రఘురాంతో పాటు 150 మంది బీజేపీ కార్యకర్తలపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం కోయంబేడులోని అంబేడ్కర్ విగ్రహానికి వీసీకే, ఇతర పార్టీ నాయకులు నివాళులర్పించే సమయంలో బీజేపీకి చెందిన నటి గాయత్రి రఘురాం, 150 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో గాయత్రి రఘురాం వెట్రివేల్, వీరవేల్ అంటూ కుమారస్వామి పేరుతో నినాదాలు చేశారు. దీంతో వీసీకే, ఇతర పార్టీ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు నటి గాయత్రి రఘురాంతో పాటు 150 మందికి పైగా కార్యకర్తలపై ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా వీసీకే తదితర పార్టీలకు చెందిన 30 మందికి పైగా కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ గాయత్రి మృతి.. ప్రమాదానికి ముందేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం కేసులో దర్యాప్తు కొనసాగుతోందని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. హోలీ సందర్భంగా జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి తన స్నేహితుడు రోహిత్‌తో కలిసి ప్రిసమ్ పబ్‌కు వెళ్లినట్లు తెలిసిందని పేర్కొన్నారు. అయితే ప్రీసమ్ పబ్‌లోకి వెళ్లి పార్టిసిపేట్ చేశారా లేదా అన్నది క్లారిటీ లేదని తెలిపారు. గచ్చిబౌలి ఏఐజీ అసుపత్రిలో వెంటిలేటర్‌పై రోహిత్ చికిత్స పొందుతున్నాడని తెలిపారు. అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదానికి కారణామని తమ ప్రాథమిక విచారణలో తెలిసినట్లు పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కాగా గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే. అతివేగంగా వచ్చిన వీరి కారు ఎల్లా హోటల్ ముందు ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టి గాల్లోకి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఆ దగ్గర్లోనే గార్డెనింగ్ పనులు చేస్తున్న మహేశ్వరి(38)ని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రోహిత్, జూనియర్ ఆర్టిస్ట్, యూట్యూబర్ గాయత్రిని గచ్చిబౌలిలోని ఏఐ జీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే గాయత్రి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఫుట్‌పాత్‌ను కారు ఢీ కొట్టడంతో రెండు చక్రాలు ఊడిపడ్డాయి. కారు పల్టీ కొట్టగానే అందులోంచి గాయత్రి బయట పడిపోయినట్లుగా సీసీ పుటేజీలో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే గత కొన్నాళ్లుగా గాయత్రి, రోహిత్ మధ్య స్నేహం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం హోలీ పండగ సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లిన రోహిత్ తనను పికప్ చేసుకున్నాడు. తరువాత ఇద్దరు కలిసి ప్రిసమ్ పబ్‌లో పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం ఇద్దరూ ఇంటికి బయలుదేరగా ప్రమాదం జరిగింది. గాయత్రి కారును డ్రైవ్ చేయగా, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. రోహిత్ కూకట్‌పల్లిలోని హెచ్ఎంటీ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. చదవండి: ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యం మరోవైపు రోడ్డు ప్రమాదంపై గాయత్రి తల్లి స్పందించారు. తన కూతుకు అన్యాయం చేసి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రోహిత్‌తో కలిసి కూతురు బయటకు వెళ్లిందని తెలిపారు. న్యాయ వ్యవస్థ, పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు. -
బీడీ చుట్టలు చుడితేనే జీవనం సాగేది.. అలాంటిది పది లక్షలంటే..
సాక్షి, నిజామాబాద్(దోమకొండ): బీడీ చుట్టలు చుడితేనే ఆ పేద కుటుంబం జీవనం సాగేది. ఆర్థికంగా ఇబ్బందులున్నా చదువు ఉంటేనే భవిష్యత్తుల్లో ఏదో ఒకరకంగా జీవనం సాగించవచ్చని భావించి పాఠశాలకు పంపుతున్నారు. ఈలోగా తొమ్మిదో తరగతి చదువుతున్న తమ కుమార్తె యాయత్రికి బోన్ క్యాన్సర్ అని తెలిసి దోమకొండకు చెందిన బీసు రాజనర్సు, అర్చన దంపతలు ఒక్కసారిగా కుంగిపోయారు. ఆపరేషన్ కోసం రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో దాతల కోసం ప్రస్తుతం ఆ పేద కుటుంబం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం విద్యార్థిని హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నెల కిందట చేతినొప్పి రావడంతో డాక్టర్ల సూచన మేరకు పరీక్షలు నిర్వహించిన అనంతరం బోన్ క్యాన్సర్‌గా ధృవీకరించారు. విద్యార్థిని తండ్రి రాజనర్సు కామారెడ్డిలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, తల్లి అర్చన బీడీలు చుడుతుంది. తమ కుమార్తె వైద్యం కోసం దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు రాజనర్సు (ఫోన్ నెంబర్ 9951068730) అర్చన (7036475197) విజ్ఞప్తి చేశారు. -
‘ఏ కలర్స్ అద్దమంటారు’ .. ఓ డిజైనర్ ప్రయాణం
‘‘మేడమ్! మీ వీడియోలు చూశాం. పోయిన వారం హైదరాబాద్‌కి వచ్చాం, మిమ్మల్ని చూసిపోదామని...’’ అని ఏలూరు దగ్గర వేల్పుచర్ల అనే గ్రామం నుంచి ముగ్గురు మహిళలు వచ్చారు. ‘‘మేడమ్! మా అమ్మ ఇలా ఉంటారు’’ అని ఫోన్లో ఫొటో చూపిస్తూ ‘‘అమ్మకు ఏ కలర్ కాంబినేషన్లో చీరలు తీసుకోమంటారు’’ అని ఓ యువతి అడుగుతోంది. ఇంతలో ఆమె భర్త వచ్చి ‘‘గాయత్రీ! వేర్‌హౌస్‌కి వెళ్తున్నాను’’ అని చెప్పి బయలుదేరారు. షోరూమ్ వెనుకగా ఉన్న ప్రింటింగ్ యూనిట్లో ఒక వ్యక్తి ఒక చీరను తెచ్చి బోర్డరు చూపిస్తూ... ‘‘ఏ కలర్స్ అద్దమంటారు’’ అని అడిగి ఆమె ‘పింక్’ అని చెప్పగానే తలూపుతూ వెళ్లిపోయాడు. ‘‘మీ వీడియోలు రోజూ చూస్తుంటాం. అలవాటైపోయింది. మీరు మా ఇంట్లో ఒకరిలా అయిపోయారు’’ అంటూ ఆ మహిళలు గాయత్రితో మాటల్లో పడిపోయారు. ‘‘మమ్మీ! వీడియో అప్ లోడ్ చేశాను. అమ్మమ్మ క్యారియర్ పంపించింది. ఆఫీస్ రూమ్‌లో పెట్టాను’’ అని క్లుప్తంగా చెప్పి మరో ఫ్లోర్‌లోకి వెళ్లి పోయాడు ఓ కుర్రాడు. ఇది... హైదరాబాద్, సైనిక్‌పురిలో ‘గాయత్రీరెడ్డి ట్రెడిషనల్ డిజైనర్ స్టూడియో’ నిర్వహిస్తున్న ఫ్యాషన్ డిజైనర్ గాయత్రి డైలీ రొటీన్. ఇది ఆమె తనకు తానుగా నిర్మించుకున్న సామ్రాజ్యం. 2008లో ఇంట్లో ఒక మూలగా ఒక టేబుల్‌తో మొదలైన తొలి అడుగు ఇప్పుడు పర్వత శిఖరానికి చేరువలో ఉంది. అన్నీ అమరిన దశ నుంచి జీవితం ఒక్కసారిగా పరీక్ష పెట్టింది. అంతా అగమ్యం. జీవితం తనను ఎటు తీసుకువెళ్తుందో తెలియని అస్పష్టమైన అయోమయమైన స్థితిలో వేసిన మొదటి అడుగు అది. గమ్యం కనిపించకపోయినా సరే... నీ ప్రయాణం ఆపవద్దు అనే ‘సంకల్పం’ మాత్రమే ఆమెకు తోడు. నేను కూడా నీకు తోడుగా వస్తానని భర్త నైతిక మద్దతునిచ్చాడు. ‘కుటుంబాన్ని నడిపించాల్సిన నేను వ్యాపారంలో నష్టపోయాను. నా బాధ్యతను నీ భుజాలకెత్తుకున్నావు. ఈ టైమ్‌లో నేను చేయగలిగింది ఇంతవరకే’ అని మాత్రం చెప్పాడాయన. పదమూడేళ్ల కిందట అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు నెలకు వందమందికి పైగా ఉద్యోగులకు జీతాలిచ్చే స్థాయికి చేరింది. బంధువులను మొహమాట పెట్టి కస్టమర్లుగా మార్చుకోలేదామె. కస్టమర్లను ఆత్మీయ బంధువులుగా మార్చుకున్నారు. మధ్యవర్తులెవరూ లేరు! ‘‘నా కస్టమర్‌కు నేను మంచి క్వాలిటీ ఇవ్వాలి. ధర అందుబాటులో ఉండాలి. అందుకోసం చేనేతకారులున్న ప్రతి గ్రామానికీ వెళ్లాను. ఐదేళ్ల పాటు నిరంతర ప్రయత్నం తర్వాత నేను వారి విశ్వాసం చూరగొనగలిగాను. అప్పటి వరకు చేనేతకారులు వాళ్ల వాళ్ల గ్రామాల్లో షావుకారు చేతిలో ఉండేవారు. షావుకారు నూలు కొనుగోలు కోసం డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటాడు. కాబట్టి చేనేతకారులు నేసిన దుస్తులను షావుకారుకు తప్ప మరెవరికీ ఇవ్వడానికి వీల్లేదనే విరచిత రాజ్యాంగం ఒకటి అమలులో ఉండేది. బయటి వాళ్లు ఎవరైనా సరే ఆ షావుకారు దగ్గర కొనాల్సిందే. ఏ వ్యాపారమైనా సరే... ఉత్పత్తిదారుడికీ– వినియోగదారుడికి మధ్య వారధిగా ఉండే వ్యక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ధర కూడా పెరిగిపోతుంది. నేను ఐదేళ్లు కష్టపడి షావుకారు అనే ఒక మధ్య వ్యక్తిని తొలగించగలిగాను. అలాగే నాకు ఏ కౌంట్ నేత కావాలో, ఏయే కాంబినేషన్లలో కావాలో చేనేతకారులకు ముందుగానే చెప్తాను. ఇంత పోటీలో కూడా నన్ను మార్కెట్లో నిలబెట్టింది. సౌకర్యం విషయంలో ఫ్యాబ్రిక్ ధరించినప్పుడు ఒంటికి హాయిగా అనిపించాలి. మన్నిక విషయంలో పెట్టిన డబ్బు వృథా కాలేదని సంతృప్తి కలగాలి. ఇవే నేను నమ్మిన సూత్రాలు. అనుసరిస్తున్న నియమాలు.’’ అని చెప్పారు గాయత్రి. పిల్లలకు కొంతే ఇవ్వాలి! ‘‘మరో రెండేళ్లకు యాభై ఏళ్లు నిండుతాయి. అప్పటికి షోరూమ్, వేర్ హౌస్, నగరంలో ఉన్న మూడు ప్రింటింగ్ యూనిట్లను ఒక చోటకు చేర్చాలి. ఇప్పటి వరకు దేశంలో అన్ని రకాల వస్త్రకారులను అనుసంధానం చేస్తూ నేను ఏర్పాటు చేసిన నెట్‌వర్క్‌ను నా ఉద్యోగులతో నడిపించాలని, ఇక నా పరుగులు ఆపేయాలనేది కోరిక. భగవంతుడి దయ వల్ల పోగొట్టుకున్న ఆస్తులకంటే ఎక్కువే సంపాదించుకున్నాం. పిల్లలను చదివించాం, జీవితాన్ని మొదలుపెట్టడానికి భరోసాగా కొన్ని ఆస్తులను మాత్రమే వాళ్లకు ఇస్తాం. వాళ్ల జీవితాన్ని వాళ్లే మొదలు పెట్టాలి. అలా చేయకపోతే డబ్బు మీద గౌరవం ఉండదు, జీవితం విలువ తెలియదు. ఇక సమాజానికి తిరిగి ఇవ్వడం మొదలు కావాల్సిన సమయం వచ్చింది. అది నా ఉద్యోగులతోనే మొదలవుతుంది’’ అని చెప్పేటప్పుడు గాయత్రీరెడ్డిలో జీవితం నేర్పిన పరిణతితోపాటు స్థితప్రజ్ఞత కనిపించింది. అక్షరం నేర్పిన విలువలు ఇల్లు దిద్దుకోవడం, చక్కగా వండి పెట్టుకోవడం, పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవడం... ఇదే నా లోకంగా ఉండేది. ఆర్థిక సమస్యలే రాకపోయి ఉంటే నాలో ఇంత శక్తి ఉందని నాకు కూడా ఎప్పటికీ తెలిసేది కాదేమో. అయితే కంచి పరమాచార్య చెప్పినట్లు మనం దేనిని పైకి విసురుతామో అది మనకు అంతకంటే వేగంగా వచ్చి చేరుతుందని నమ్ముతాను. మా వారు మధ్యప్రదేశ్‌లో కాంట్రాక్టులు చేస్తున్నప్పుడు తప్పని సరై నేర్చుకున్న హిందీ ఇప్పుడు నార్త్ ఇండియా పర్చేజ్కి, అక్కడి నుంచి వచ్చిన పనివాళ్లతో మాట్లాడడానికి పనికొస్తోంది. బెంగళూరులో ఉన్నప్పుడు రోజంతా ఏమీ తోచడం లేదని నేర్చుకున్న ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ఈ రోజు నన్ను విజేతగా నిలబెట్టింది. అంతకంటే ముందు ఇంకో విషయం చెప్పాలి. పదో తరగతి వరకే చదివిన నేను మా ఇంటి దగ్గరున్న లైబ్రరీలో ఉన్న పుస్తకాల్లో చందమామ నుంచి ఆధ్యాత్మికం వరకు దాదాపుగా చదివేశాను. ఆ అక్షరజ్ఞానం నేర్పిన విలువలే నాకు యూనిట్ నిర్వహణలో ఉపయోగపడుతున్నాయి. – గాయత్రీరెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ – వాకా మంజులారెడ్డి -
‘హ్యాపీడేస్’ అప్పు ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?
Happy Days Appu: సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీడేస్’మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అప్పటి యూత్ ఆడియెన్స్‌ని ఓ రేంజ్లో ఆకట్టుకుండి ఈ సినిమా. తన మార్క్ సహజమైన కథ, కథనాలతో ఆకట్టుకునే శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’తో ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కాలేజీలో ఎనిమిది మంది స్నేహితులు.. వాళ్ళ పరిచయాలు.. ప్రేమలు.. అపార్ధాలు.. ద్వేషాలు.. మళ్ళీ తిరిగి కలిసే ప్రయత్నాలు ఇదే హ్యాపీడేస్ సినిమా. ఇది సినిమాలా కాకుండా మన పక్కన జరిగే.. మన జీవితంలో జరిగే కథలా అనిపిస్తుంది. సినిమా మొత్తం ఎనిమిది మంది క్యారెక్టర్ల చుట్టే తిరుగుతోంది. అందులో పొట్టి జుట్టుతో కనిపించే అమ్మాయి గుర్తుందా? అదేనండి నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్‌గా మూవ్ అయ్యే అప్పు అలియాస్ అపర్ణ. హ్యాపీడేస్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అప్పు క్యారెక్టర్ని మర్చిపోలేరు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది గాయత్రీరావు. తొలి సినిమాయే అయినా.. ఎంతో అనుభవం ఉన్నట్లు నటించింది. హ్యాపీ డేస్ సినిమా తరువాత రామ్ చరణ్ నటించిన ‘ఆరంజ్’పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలోనూ నటించిన గాయత్రిరావు.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో 2019లో వివాహం చేసుకొని చెన్నైలో స్థిరపడిపోయింది. ఇక గాయత్రీ ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆమె తల్లిదండ్రులు సినీ పరిశ్రమకు చెందిన వారు. తల్లి పేరు బెంగుళూర్ పద్మ. తండ్రి అరుణ్ కుమార్. పద్మ టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించింది. హ్యాపీ డేస్ సినిమాలో కూడా పద్మ నిఖిల్ కి అమ్మగా నటించింది. ఈమె పాత చిత్రాలలో చాలా హిట్ సినిమాల్లో కూడా నటించింది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో గాయత్రీ రావు విఫలమైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పుటికీ.. ఫ్యామిలీ లైఫ్‌ని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది గాయత్రీ. అవకాశాలు వస్తే.. మళ్లీ నటించేందుకు సిద్దమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. త్వరగా అవకాశాలు వచ్చి మరోసారి వెండితెరపై ‘అప్పు’ అలరించాలని ఆశిద్దాం. చదవండి: ఈ ఏడాదైనా స్టార్ హీరోల దర్శనం దొరికేనా? -
నా చూపు పల్లెవైపే: గాయత్రి
పాతికేళ్ల తర్వాత అమ్మమ్మ ఊరు వెళ్లిన గాయత్రికి అక్కడ కబేళాకు తరలిస్తున్న రెండు ముసలి ఆవులు కనిపించి, మనసు కరిగిపోయింది. రైతులను బతిమిలాడి ఆ ఆవులను తీసుకొచ్చి వాటికి ఒక చోటు, నెలకు సరిపడా గ్రాసం ఏర్పాటు చేసింది. అది మొదలు ‘ఇక పోషించలేం అనుకున్న రైతుల దగ్గర నుంచి రెండేళ్లుగా ఒక్కొక్క ఆవును ఒక దగ్గరకు చేరుస్తూ వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటోంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని తాటిచర్లలో అలా ఇప్పటివరకు 84 ఆవులతో గో క్షేత్రాన్ని ఏర్పాటు చేసింది గాయత్రి గుండపంతుల. బ్యాంకు ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్, బెంగళూరులకు వెళ్లినా నలుగురు మనుషులను గో సంరక్షణ కోసం ఏర్పాటు చేసి, వాటి బాగోగులను చూసుకుంటున్న గాయత్రిని కదిలించినప్పుడు ఎన్నో విశేషాలను ఇలా పంచుకున్నారు ఆమె. ‘‘మా అమ్మమ్మ గారి ప్రకాశం జిల్లా ఊరైన తాటిచర్లకు పాతికేళ్ల్ల తర్వాత వెళ్లాను. నా చిన్నప్పుడు చూసిన పల్లెకు ఈ పల్లెకు ఏ మాత్రం పోలిక లేదనిపించింది. ఎక్కడా జీవకళ అనేదే కనిపించలేదు. దాదాపు ఏడెనిమిదేళ్లుగా అక్కడ వర్షాలు లేకపోవడంతో పచ్చటి పంట పొలాలు లేవు. యువతరం పల్లెను వదిలి పట్టణాలకు వెళ్లిపోయారు. వృద్ధులు మాత్రం మిగిలారు అక్కడ. వారితో పాటు వృద్ధ గోమాతలు. వాటిని పోషించలేక రైతులు అమ్మేసుకుంటున్నారు. అది చూసి మనసు కలత పడింది. చిక్కిశల్యంగా ఉన్న రెండు గోవులను కబేళాకు తరలిస్తుంటే అక్కడివారికి నచ్చజెప్పి, వాటిని కాపాడగలిగాను. తెలిసిన వారి గోశాల ఉంటే అందులో వాటిని ఉంచి, పోషణ బాధ్యతలను అప్పజెప్పి తిరిగి హైదరాబాద్ వచ్చేశాను. నేను బ్యాంకు ఉద్యోగిని. డిగ్రీ చదువుకునే కొడుకు, ఫార్మాసిస్ట్ అయిన భర్త.. ఇదీ నా కుటుంబం. ఊళ్లో జరిగిన విషయాలను ఇంట్లో చెప్పాను. గోవులను సంరక్షించే బాధ్యతలో తామూ పాలుపంచుకుంటామని ఇద్దరూ చెప్పారు. దీంతో ప్రతి 15 రోజులకు ఒకసారి తాటిచర్లకు వెళ్లే ప్లాన్ చేసుకున్నాను. వెళ్లినప్పుడల్లా దీనంగా కనిపించిన గోవులను గోశాలకు చేర్చడం, వాటి సంరక్షణకు మనుషులను నియమించడం, గ్రాసం ఏర్పాట్లు చూడటం.. ఇదే పనిగా పెట్టుకున్నాను. ఇప్పుడా గోవులు జీవకళతో కనిపించడం నాకు ఎనలేని సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తోంది. ఇప్పుడు అక్కడ వర్షాలు పడుతున్నాయి..! రెండేళ్లుగా ఇప్పుడక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి. రైతులు వరి పంట వేసుకుంటున్నారు. గోవులున్నాయి కాబట్టి వర్షాలు పడుతున్నాయనే ఆలోచన అక్కడి వారిలో వచ్చింది. పంట చేతికి వచ్చినప్పుడు గడ్డి తీసుకొచ్చి ‘మా వంతుగా ఈ గ్రాసం’ అని గోశాలకు ఓ మోపు గడ్డి ఇచ్చి వెళుతుంటారు. ఇది మంచి పరిణామంగా అనిపిస్తుంటుంది నాకు. కొందరు అవసరం కోసం తప్పక ఆవును అమ్మాలని చూస్తారు. కానీ, ఆవుతో వారికి అనుబంధం ఉంటుంది. చూస్తూ చూస్తూ వాటిని రోడ్డున వదిలేయలేరు. కబేళాకు అమ్మనూ లేరు. దీంతో తమ దగ్గర సాకలేని ఆవులను తీసుకొచ్చి, మా గోశాలలో వదులుతుంటారు. చుట్టుపక్కల హైవేలో ఎవరి పోషణా లేకుండా తిరిగే ఆవులు ఒక్కోసారి ప్రమాదాలకు గురవుతుంటాయి. అలాంటివాటిని మా గోశాలకు తీసుకొచ్చి వదులుతుంటారు అలా ఇప్పటి వరకు గోశాలలో 84 ఆవులు చేరాయి. అందులో నాలుగు ఆవులకు దూడలు పుట్టాయి. ఆ లేగదూడలతో కాసేపు గడిపితే చాలు– మనసుకు ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. సకాలంలో వైద్య సదుపాయాలు రెండేళ్లలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ట్రాన్స్ఫర్ అయ్యింది. బెంగళూరు వెళ్లినా నా చూపు పల్లెవైపే ఉంటుంది. మా వారు రవిశంకర్ ఫార్మసిస్ట్ కావడంతో గోవులకు ఏ చిన్న మెడికల్ అవసరం వచ్చినా తగిన వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. అలా వైద్య సిబ్బంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చి గోవులకు మెడికల్ చెకప్ చేసి వెళతారు. మా వారు, మా అబ్బాయి కూడా ప్రతి నెలా గోశాలకు వెళ్లి ఆవులను చూసి, ఏ చిన్న అసౌకర్యం లేకుండా చూసుకొని తిరిగి వస్తారు. అలా మా కుటుంబం గోశాల సంరక్షణ బాధ్యత తీసుకుంది. ఈ క్రమంలో మా బంధువు, విజయవాడ వాసి అయిన నాగేంద్ర మామయ్య ఆస్ట్రేలియాలో పదిహేనేళ్లు ఉండి సొంతూరుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన గోశాలకు వచ్చి, ఆవు దూడలతో అనుబంధాన్ని పెంచుకున్నారు. తాను ఇక గోశాలలోనే ఉండిపోతానన్నారు. మేం ముగ్గురం కలిసి గోశాలకు ‘శ్రీ దత్త బృందావన గో క్షేత్రం’ అని నామకరణం చేసి ట్రస్ట్‌గా ఏర్పడ్డాం. గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరకు వెళ్లిన సమయంలో గోశాల గురించి చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించారు. ‘ఆ ఆవులు ఉన్నన్ని రోజులు వాటిని సాకుతూ ఉండండి’ అన్నారు. ఓ మంచి ప్రయత్నం మొదలుపెడితే అన్ని అనుకూలతలు అవే ఏర్పడతాయని అర్థమైంది. ముందు తరాలకూ అందించాలి.. గో సంరక్షణ గురించి ఈ తరానికి తెలియాలి. అది మనమే నేర్పించాలి. గోవులనే కాదు ఏ ధార్మిక కార్యక్రమమైనా పిల్లలు అలవర్చుకునేలా చేస్తే ముందు తరాలకు మన సంస్కృతిని అందించిన వాళ్లం అవుతాం’ అని వివరించారు గాయత్రి. మంచి పని ఎప్పుడూ మరికొందరికి మార్గం చూపుతూనే ఉంటుంది. ఉద్యోగాలు చేసుకుంటూ, పట్టణ జీవనంలో తీరికే లభించదు అనుకునేవారికి గాయంత్రిలాంటి వారు చేస్తున్న ఇలాంటి సేవా కార్యక్రమాలు ఓ కొత్త ఆలోచనా పథం వైపు నడిచేలా చేస్తాయి. కర్తవ్యాన్ని బోధిస్తాయి. – నిర్మలారెడ్డి -
ఆర్డర్లే ఆర్డర్లు- ఈ షేర్లకు భలే జోష్
ముంబై, సాక్షి: ఒక్కరోజు విరామం తదుపరి తిరిగి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 234 పాయింట్లు ఎగసి 46,194 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 68 పాయింట్లు ఎగసి 13,546కు చేరింది. వెరసి మార్కెట్లు మళ్లీ రికార్డుల ర్యాలీ బాట పట్టాయి. కాగా.. ఆర్థిక రికవరీ పరిస్థితులు నెలకొనడంతో పలు కంపెనీలు ఆర్డర్లు, కాంట్రాక్టులను దక్కించుకుంటున్నాయి. తాజాగా ఇర్కాన్ ఇంటర్నేషనల్, గాయత్రి ప్రాజెక్ట్స్, ఇండియన్ హ్యూమ్‌పైప్స్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా ఈ జాబితాలో చేరాయి. ఫలితంగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. (డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్.. హాట్‌హాట్) ఆర్డర్ల బాటలో రైల్వే రంగ పీఎస్‌యూ.. ఇర్కాన్ ఇంటర్నేషనల్‌కు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) నుంచి రూ. 900 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించింది. దీనిలో భాగంగా గుర్గావ్- పటౌడీ- రేవారీ సెక్షన్లో అప్‌గ్రేడ్ పనులు చేపట్టవలసి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇర్కాన్ షేరు ఎన్ఎస్ఈలో 5.6 శాతం జంప్‌చేసి రూ. 93 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 96కు చేరింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇండియన్ హ్యూమ్ పైప్ రూ. 550 కోట్ల ఆర్డర్‌ను దక్కించుకుంది. 21 నెలలో పూర్తిచేయవలసిన ఆర్డర్లో భాగంగా కాన్పూర్ డివిజన్లోని 550 గ్రామాలలో మంచినీటి సరఫరా సౌకర్యాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇండియన్ హ్యూమ్ పైప్స్ షేరు 6 శాతం ఎగసి రూ. 195 వద్ద ట్రేడవుతోంది. (ర్యాలీ షురూ- 46,000 ఎగువకు సెన్సెక్స్) అప్పర్ సర్క్యూట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి నమామీ గంగే, గ్రామీణ నీటి సరఫరా పథకాలకు అనుగుణంగా సౌకర్యాల కల్పనకు రూ. 1,332 కోట్ల విలువైన కాంట్రాక్టులు లభించినట్లు గాయత్రి ప్రాజెక్ట్స్ తెలియజేసింది. భాగస్వామ్య సంస్థ ద్వారా సాధించిన ఈ ప్రాజెక్టులో 97.5 శాతం వాటా తమకున్నట్లు వెల్లడించింది. దీంతో్ గాయత్రి ప్రాజెక్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 36.35 వద్ద ఫ్రీజయ్యింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి భాగస్వామ్య సంస్థ ద్వారా పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా రూ. 952 కోట్ల విలువైన కాంట్రాక్టును సొంతం చేసుకున్నాయి. నమామీ గంగే, గ్రామీణ నీటి సరఫరా కార్యక్రమాలలో భాగంగా 952 గ్రామాలకు 10ఏళ్లపాటు నీటి సరఫరా సంబంధ పనులను నిర్వహించవలసి ఉన్నట్లు జేవీ తెలియజేసింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్పీఎంఎల్ 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 13.20 వద్ద ఫ్రీజయ్యింది. ఇక పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ 3.5 శాతం పెరిగి రూ. 182 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 190 వరకూ జంప్‌చేసింది. -
పిజ్జా 2
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉండగా తాజాగా ‘ఫిలిమ్’ పేరుతో మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ రాబోతోంది. విజయదశమి ముందు లాంచ్ కానున్న ఈ ఫిలిమ్ ఓటీటీలో విడుదల కానున్న తొలి చిత్రం విజయ్ సేతుపతి నటించిన ‘పిజ్జా 2’. ‘‘ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 13న విడుదలైంది. అయితే సినిమా రిలీజైన వెంటనే లాక్ డౌన్ మొదలయింది. దీంతో ఈ చిత్రాన్ని ఇప్పుడు ఫిలిమ్ ఓటీటీలో నేరుగా విడుదల చేస్తున్నాం. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ‘పిజ్జా 2’ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత డి. వెంకటేష్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గాయత్రి కథానాయికగా నటించారు. -
‘కాళేశ్వరం’ ఎత్తిపోతలు షురూ
కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో బుధవారం రాత్రి ఆరు మోటార్లను ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు. మే 11వ తేదీన గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడంతో మోటార్లను నిలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో.. కాళేశ్వరం వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే, ప్రాణహిత వరద కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తోంది. దీంతో కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ వద్ద అప్రోచ్ కెనాల్ నుంచి ఫోర్ బే వరకు నీరు నిల్వ అయింది. వరద కూడా పెరుగుతుం డటంతో లక్ష్మీ పంపుహౌస్‌లోని 11 మోటార్లలోని ఆరు మోటార్లను ఆన్ చేయగా.. 12 పంపుల ద్వారా గ్రావిటీ కాల్వలోకి నీరు ఎత్తిపోస్తోంది. ఈ నీరు 13.41 కిలోమీటర్ల దూరంలోని అన్నారంలోని సరస్వతీ బ్యారేజీకి తరలుతోంది. రాత్రిలోగా మిగిలిన మోటార్లను ఒకేసారి నడిపించనున్నట్లు తెలిసింది. ఈ సీజన్లో మోటార్లు ఆన్ చేయడం ఇదే ప్రథమం కావడంతో ఎస్ఈ, డీఈఈ, ఏఈఈ స్థాయి ఇంజనీరింగ్ అధికారులు పంపుహౌస్ వద్ద పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ కాంతులతో జిగేల్ కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో మోటార్ల ద్వారా నీరు డెలివరీ సిస్టర్న్ వద్ద ఎత్తిపోస్తున్నాయి. దీంతో సిస్టర్న్‌కు రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చారు. దీంతో నీరు రంగు రంగులుగా మారి జిగేల్‌మంటోంది. -
అడల్ట్ గ్రూప్స్‌లో నటి ఫోన్ నెంబర్
చెన్నై : డోమినోస్ పిజ్జా డెలివరీ బాయ్‌పై తమిళ నటి గాయత్రి సాయి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయత్రి ఇంటికి పిజ్జా తీసుకువచ్చిన డెలివరీ బాయ్ ఆ తర్వాత ఆమె ఫోన్ నెంబర్‌ను వాట్సాప్‌లోని పలు అడల్ట్ గ్రూప్స్‌లో షేర్ చేశాడు. దీంతో పలువురు ఆమెను వేధిస్తూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడం, పోన్స్ చేయడం ప్రారంభించారు. వేధింపులతో ఆగ్రహానికి లోనైనా గాయత్రి.. తేనాంపేటలోని మహిళ పోలీస్ స్టేషేన్లో పిజ్జా డెలివరీ బాయ్‌పై ఫిర్యాదు చేశారు. అలాగే ట్విటర్ వేదికగా తనకు ఎదురైన వేధింపులను వివరించారు. ‘ఫిబ్రవరి 9న చెన్నైలోని నా ఇంటికి డోమినోస్ డెలివరీ బాయ్ పిజ్జా తీసుకుని వచ్చాడు. పిజ్జా డెలివరీ చేసే సమయంలో అతడు మత్తులో ఉన్నాడు. అతడు నా ఫోన్ నంబర్‌ను పలు అడల్ట్ గ్రూప్స్‌లో షేర్ చేశాడు. ఇందుకు సంబంధించి అతని యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ.. అది పెండింగ్‌లోనే ఉంది. అతను నా నెంబర్ షేర్ చేయడంతో.. విపరీతమైన ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయ’ని గాయత్రి తెలిపారు. అలాగే పిజ్జా డెలివరీ బాయ్ ఫొటోను కూడా షేర్ చేశారు. తనకు వస్తున్న వాట్సాప్ మెసేజ్‌లను స్ర్కీన్ షాట్లను ఆమె ట్విటర్లో ఉంచారు. అలాగే తనకు సాయం చేయాల్సిందిగా తమిళనాడు పోలీసులను కోరారు. ఆన్లైన్లో ఆన్లైన్ యాప్‌లు తమ నెంబర్లు ఇతరులకు షేర్ చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. మరోవైపు గాయత్ని ఫిర్యాదుపై పోలీసులు స్పందిస్తూ.. పిజ్జా డెలివరీ బాయ్‌ను అదుపులోకి తీసుకున్నామని, విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. కాగా, ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అంజలి చిత్రంతో గాయత్రి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆమె నటించారు. .@DrMRaviIPS1 commisioner called and said he is transferring the case to protection under women Sir. Hope other online apps do not share our numbers. Most of our orders these days are online. The complaint is lodged in Teynampet station sir https://t.co/0RiKZIo9es — Gayatri Sai (@gainsai) February 27, 2020 .@dominos_india this is how he spread it through Whatsapp @TNPOLICE_HQ please help pic.twitter.com/xePh7QsiGo — Gayatri Sai (@gainsai) February 26, 2020 -
భారత బ్యాడ్మింటన్ సీనియర్ జట్టులో గాయత్రి
న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించారు. ఈనెల 11 నుంచి 16 వరకు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఈ టోర్నీ జరుగుతుంది. భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. పురుషుల విభాగంలో మాత్రం భారత అగ్రశ్రేణి క్రీడాకారులందరూ పాల్గొంటున్నారు. కొంతకాలంగా జూనియర్‌స్థాయిలో నిలకడగా రాణిస్తోన్న చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి మహిళల సీనియర్ జట్టులో చోటు దక్కించుకుంది. మరో తెలుగమ్మాయి, డబుల్స్ స్పెషలిస్ట్ కె.మనీషా కూడా భారత జట్టులోకి ఎంపికైంది. పురుషుల జట్టు: సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, శుభాంకర్ డే, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, ఎం.ఆర్.అర్జున్. మహిళల జట్టు: అష్మిత చాలిహ, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, అశ్విని భట్, శిఖా గౌతమ్, రుతుపర్ణ పాండా, కె.మనీషా. -
పరాజయంతో ప్రారంభం
చెన్నై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–5)లో భాగంగా సోమవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ 2–5తో చెన్నై సూపర్ స్టార్స్ జట్టు చేతిలో ఓడింది. సింధు మాత్రమే హైదరాబాద్ తరఫున గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–జెస్సికా (చెన్నై) జోడీ 15–6, 13–15, 15–13తో ఇవనోవ్ –సిక్కి రెడ్డి (హైదరాబాద్) జంటపై గెలిచింది. తొలి పురుషుల సింగిల్స్‌లో టామీ సుగియార్తో 15–11, 15–10తో సిరిల్ వర్మ (హైదరాబాద్)పై నెగ్గాడు. రెండో సింగిల్స్ చెన్నైకి ‘ట్రంప్’ మ్యాచ్ కాగా... ఇందులో లక్ష్యసేన్ 15–6, 13–15, 15–14తో ప్రియాన్షు (హైదరాబాద్)పై నెగ్గడంతో చెన్నైకు రెండు పాయింట్లు లభించాయి. దీంతో చెన్నై రెండు మ్యాచ్‌లు ఉండగానే 4–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. హంటర్స్ ‘ట్రంప్’ మ్యాచ్ అయిన మహిళల సింగిల్స్‌లో సింధు 15–5, 15–5తో గాయత్రిని ఓడించడంతో చెన్నై ఆధిక్యం 4–2కి తగ్గింది. అయితే పురుషుల డబుల్స్‌లో సాత్విక్–సుమిత్ రెడ్డి (చెన్నై) ద్వయం 15–14, 11–15, 15–8తో బెన్లెన్–సియాన్ వెండీ (హైదరాబాద్) జోడీపై నెగ్గడంతో చెన్నై 5–2తో విజయం సాధించింది. -
గాయత్రి మిస్సింగ్ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : కుత్బుల్లాపూర్‌లో సంచలనం సృష్టించిన గాయత్రి (19) మిస్సింగ్‌లో కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఇంట్లో చూసిన పెళ్లి సంబంధం నచ్చకపోవడంతోనే ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ మేరకు తన కోసం వెతకొద్దంటూ లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబ సభ్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు. దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట్‌కు చెందిన గాయత్రి(19) బుధవారం తను పనిచేసే సూపర్ మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల మొత్తం వెలికారు. ఎక్కడా యువతి ఆచూకి లభించకపోవడంతో గురువారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో తనిఖీ చేయగా ఆమె రాసిన లేఖ లభించింది. సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ కాల్ డాటా ఆధారంగా గాయత్రి ఆచూకి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
డ్రీమ్ రైడర్
‘‘ఫస్టియర్‌లో మాత్రమే ఫస్ట్మార్క్ వస్తే అదృష్టమనుకుంటారు.. సెకండియర్‌లో కూడా నిలుపుకున్నావనుకో హార్డ్‌వర్క్ అని నమ్ముతారు’’ ఇది ఒక అక్క తన చెల్లికి చెప్పిన మాట. విన్న చెల్లి ఇంటర్ సెకండియర్‌లో కూడా ఫస్ట్మార్క్ తెచ్చుకుంది. భవిష్యత్‌పట్ల కన్న కలలను ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటోంది. ఆమే లక్ష్మీగాయత్రి ఆకుండి. ఈ అమ్మాయికి ఇంకో ప్రత్యేకతా ఉంది. హైదరాబాద్‌లో రాపిడో (టూ వీలర్ ట్యాక్సీ)లో తొలి మహిళా కెప్టెన్. వ్యవహారంలో టూ వీలర్ ఉమన్ ట్యాక్సీ రైడర్. అసలు ఆ సాహసం గురించే ఆరా తీద్దామని గాయత్రిని కదిలిస్తే ఆమె సాధించిన ఇంకొన్ని లక్ష్యాలూ తెలిశాయి. అన్నిటి గురించి క్లుప్తంగా ఇక్కడ.. స్వభావరీత్యా ఇంట్రావర్ట్, చదువు మీద పెద్దగా ఆసక్తిలేని గాయత్రి ఇంటర్లో ఫస్ట్రావడానికి కారణం.. టూ వీలర్ అనే తాయిలం. తొమ్మిదో తరగతిలో తన తమ్ముడితో (కజిన్) కలిసి గేర్ బైక్ నడపడం నేర్చుకుంది. ఆ అమ్మాయికి డ్రైవింగ్ ప్యాషన్. టెన్త్ తర్వాత చదువులో ఆమెను ముందుకు తోయడానికి ‘‘ఇంటర్ ఫస్టియర్‌లో మంచి మార్కులు వస్తే నీకు బండి కొనిపెడ్తాను’’ అని ఆశ పెట్టాడు తండ్రి. బండి కోసం ఇంటర్‌ను ఇష్టపడి తను తీసుకున్న కామర్స్ గ్రూప్‌లోనే కాదు అన్ని గ్రూపుల్లోకి ఫస్ట్‌గా నిలిచింది. ‘‘పద్దెనిమిదేళ్లు నిండితేనే బండి.. ఇంటర్ సెకండియర్ కూడా పూర్తి అవనీ..’’ అన్నాడు తండ్రి నింపాదిగా. అప్పుడే అన్నది బ్రిలియంట్ స్టూడెంట్ అయిన అక్క పైన ప్రస్తావించిన మాటను. కష్టపడి ఇంటర్ సెకండియర్‌లో కూడా అన్ని గ్రూపుల్లోకి మళ్లీ ఫస్ట్ మార్క్ తెచ్చుకుంది. బండి కొనిపించుకుంది. అయితే దీనికన్నా ముఖ్యమైన లక్ష్యం ఉంది గాయత్రికి.. ఫ్యాషన్ డిజైనర్ కావాలని. బార్బీ బొమ్మ .. సినిమాలకు కాస్ట్యూమ్స్ నాన్నమ్మ కొనిచ్చిన బార్బీకి దర్జీ దగ్గర్నుంచి తెచ్చుకున్న గుడ్డముక్కలతో డ్రెస్‌లు కుట్టడం, బొమ్మలేయడం చిన్నప్పటి నుంచి గాయత్రికున్న వ్యాపకం. ఈ అమ్మాయి ఆసక్తి గమనించిన ఆమె పిన్ని ఫ్యాషన్ డిజైనింగ్ గురించి చెప్పింది. ఆ క్షణం నుంచి ఫ్యాషన్ డిజైనింగే ధ్యేయంగా పెట్టుకుంది గాయత్రి. పదవ తరగతి అయిపోగానే ఆ కోర్సులో చేరుతానని చెప్పిన గాయత్రిని ‘‘ఇంటర్ తర్వాతే నీకు ఆసక్తి ఉన్న కోర్స్’’ అని కన్విన్స్ చేశారు పేరెంట్స్. ఇంటర్ అయ్యాక డిగ్రీ అన్నారు. అందుకే డిగ్రీ తర్వాతే హైదరాబాద్‌లోని హ్యామ్స్టెక్ కాలేజ్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా చేసింది. ఆ సమయంలోనే కజిన్ ద్వారా ఒక సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం వచ్చింది ఆమెకు. దాంతో ఆమె వర్క్ తెలిసి వెంటవెంటనే మరిన్ని అవకాశాలు వచ్చాయి. సినిమాలతోపాటు కమర్షియల్ యాడ్స్కీ పనిచేసింది. మరి రాపిడో..? ‘‘నేను కమర్షియల్ యాడ్స్‌కి పని చేస్తున్నప్పుడు నా సాఫ్ట్వేర్ ఫ్రెండ్ ఒకరు ఐటీ సెంటర్ నుంచి ఎక్కడో ఉన్న వర్క్ప్లేస్కొచ్చి నన్ను కలిసేవాడు. ఇంత దూరం ఎలా వచ్చావ్ అని అడిగితే రాపిడో టూ వీలర్ ట్యాక్సీ అని చెప్పేవాడు. ఆ టైమ్‌లోనే బెంగళూరులో రాపిడో ట్యాక్సీ రైడ్ చేస్తున్న ఉమన్ గురించి ఆర్టికల్ కూడా చదివా. నాకూ బైక్ నడపడం ఇష్టం, సరదా కాబట్టి రాపిడో కెప్టెన్‌గా అప్లయ్ చేశా. నిజానికి కొన్ని నిమిషాల్లో వెరిఫికేషన్ జరుగుతుంది. కానీ నా విషయంలో మూడు వారాలైనా ఏ రెస్పాన్స్ రాలేదు. డైరెక్ట్‌గా ఆఫీస్‌కు వెళ్లి అడిగా. కొంచెం తటపటాయించి ‘‘అమ్మాయిలకు ఇంకా ఇవ్వడం లేదు సేఫ్టీగ్రౌండ్లో... ’’ అన్నారు. ‘మీరే అలా అంటే ఎలా? నా విషయంలో మీకు ఏ భయమూ అక్కర్లేదు. నేను సెల్ఫ్ డిఫెన్సివ్’ అని పోరితే.. చాలా సేఫ్టీ మెజర్స్ చెప్పి అప్రూవ్ చేశారు. నా ఫస్ట్ రైడ్ మెహిదీపట్నంలో. ఒక అబ్బాయి. నన్ను చూడగానే ఆశ్చర్యపోయాడు. ప్రశ్నలేవీ అడగకుండానే బండి మీద కూర్చున్నాడు. కొంచెం అసౌకర్యంగా ఫీలవుతుంటే చెప్పాను.. కంఫర్టబుల్‌గానే ఉండండి అని. అతని డెస్టినేషన్‌లో దిగిపోయాక చెప్పా... ఇది నా ఫస్ట్‌రైడ్ అండీ అని. కంగ్రాట్స్ చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత నుంచి వరస రైడ్స్. సాధారణంగా ఉదయం ఆరు నుంచి ఎనిమిది వరకు, సాయంకాలం అయిదు నుంచి ఏడు వరకు మాత్రమే రైడ్స్‌కి వెళ్తా. ఒకరోజు మాత్రం రోజంతా తిరగాలనిపించి టిఫిన్ బాక్స్ కూడా తీసుకెళ్లా. తినడానికి టైమ్ దొరికినా ప్లేస్ దొరకదు ఎక్కడా! అప్పుడనిపించింది హైదరాబాద్‌లో షెడ్స్లాంటివి కట్టి డైనింగ్ ప్లేసెస్‌గా డెవలప్ చేస్తే ఎంతోమందికి ఉపయోగం ఉంటుంది కదా అని. రైడింగ్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఎవరూ నాతో మిస్ బిహేవ్ చేయలేదు. చాలా మంది తర్వాత వాట్సాప్‌లో ‘‘డూయింగ్ గుడ్.. గుడ్ జాబ్..’’ అంటూ మెసేజ్ పెట్టినవాళ్లే. ఒకతనైతే.. ఆడపిల్లలు బైక్ నడుపుతుంటే నాకు చాలా భయమేసేది. ఆమడదూరంలోంచి వెళ్లేవాణ్ణమ్మా. కాని నువ్వు నా ఒపీనియన్‌ను పటాపంచలు చేశావ్. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చావ్ అని అప్రిషియేట్ చేశాడు’’ అని రాపిడో రైడర్‌గా తన అనుభవాలను చెప్పింది గాయత్రి. మాయ... ఒకవైపు సినిమాలు, ఇంకో వైపు కమర్షియల్స్ బిజీలో రాపిడో స్పీడ్‌ను కొంచెం స్లో చేసింది. పైగా ఇప్పుడు తన చిరకాల ఇచ్ఛ... లక్ష్యం అయిన ఫ్యాషన్ డిజైనర్‌గా ‘మాయ’ పేరుతో బ్రాండ్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి త్వరలోనే ‘మాయా డిజైనర్ స్టూడియో’నూ ప్రారంభించనుంది. ‘‘పనికి అమ్మాయి, అబ్బాయి అన్న తేడా లేదు. కావల్సిందల్లా క్లారిటీ, కాన్ఫిడెన్స్ మాత్రమే. సెల్ఫ్ డిఫెన్సివ్‌గా ఉండాలి. మన బలం, బలహీనత పేరెంట్స్‌కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే అన్ని విషయాలనూ షేర్ చేసుకోవాలి. పేరెంట్స్‌ను మించిన ఫ్రెండ్స్ ఉండరు. జీవితంలో ప్రతిక్షణం విలువైందేనని గుర్తుంచుకోవాలి’’ అంటుంది లక్ష్మీ గాయత్రి ఆకుండి. – సరస్వతి రమ -
బ్లాక్మెయిల్
విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా రంజిత్ జయకొడి దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘పురియాద పుదిర్’. ఈ చిత్రం ‘పిజ్జా–2’ పేరుతో తెలుగులో రిలీజ్ కానుంది. డీవీ సినీ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ పతాకాలపై ఉదయ్ హర్ష వడ్డేల్ల, డీవీ వెంకటేష్ ‘పిజ్జా 2’ని డిసెంబరు మొదటి వారంలో తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘అభివృద్ధి చెందిన సాంకేతిక సాయంతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్య ప్రధానాంశంగా ఈ సినిమా సాగుతుంది. థ్రిల్లర్ జానర్లో రూపొందింది. విజయ్ సేతుపతి నటన సినిమాకు హైలైట్’’ అని చిత్రబృందం పేర్కొంది. -
‘రూ.పదివేలు, స్మార్ట్ ఫోన్‌తో పచ్చి మోసం’
సాక్షి, విజయవాడ : గత ఎన్నికల్లో 94 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని మోసం చేసిన చంద్రబాబు.. మరోసారి ‘పసుపు-కుంకుమ’తో భారీ మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి విమర్శించారు. ఆదివారం ఆమె మీడియా మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు చెల్లని చెక్కులు ఇస్తున్నారని ఆరోపించారు. మరోసారి మహిళలను మోసం చేయడానికే ‘పసుపు-కుంకుమ’ పథకాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు పదివేల రూపాయలు, స్మార్ట్ ఫోన్లు ఇస్తామని చెప్పడం పచ్చి మోసం అన్నారు. ఈ ఐదేళ్లలో రాజధాని నిర్మాణం పేపర్ల మీదే ఎలా జరిగిందో.. అలాగే పది రూపాయలు చెక్కు మీదే ఉంటాయి కానీ ఒక్క రూపాయి చేతికి రావని చెప్పారు. గత ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. రుణమాఫీ వాగ్దానాన్నే మాఫీ చేశారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు మహిళలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. -
‘చంద్రబాబుకు ఆత్మగౌరవం ఉందా?’
సాక్షి, విజయవాడ : తెలుగువారి ఆత్మగౌరవం గురించి పదే పదే మాట్లాడే చంద్రబాబు నాయుడికి అసలు ఆత్మగౌరవం ఉందా అని బీజేపీ అధికార ప్రతినిధి సీ గాయత్రి ప్రశ్నించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విలువలతో స్థాపించిన టీడీపీకి చంద్రబాబు అంత్యక్రియలు నిర్వహించారన్నారు. అధికారం కోసం ఏ గడ్డి అయినా కరవటానికి చంద్రబాబు వెనకాడరని విమర్శించారు. అవినీతి టీడీపీ, కుంభకోణాల కాంగ్రెస్ ఒక్కటై మరల తెలుగు రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకునే పనిలో నిమగ్నమయ్యాయని వ్యాఖ్యానించారు. సింగపూర్ కంపెనీలకు రాజధానిని తాకట్టుపెట్టి, దేశంలో ఎమర్జన్సీ విధించిన కాంగ్రెస్‌తో చేతులు కలిపిన చంద్రబాబు తీరు ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలుగుదేశాన్ని అన్న ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు అధికార దాహంతో తెలుగుదేశం వ్యవస్థాపకుడిని వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘టీడీపీ పాలనలో దుర్గమ్మకీ రక్షణ లేదు’
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ దుర్మార్గపు పాలనలో ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా దేవికి సైతం రక్షణ కరవైందని బీజేపీ అధికార ప్రతినిధి గాయత్రి మండిపడ్డారు. బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె టీడీపీ పాలనలో టీడీపీ పాలనలో అమ్మాయిలకే కాకుండా, సాక్షాత్తు దుర్గమ్మకే రక్షణ లేకుండా పోయిందని అన్నారు. భక్తులు సమర్పించిన సారెలో చీర మాయమైతే, ఇప్పటివరకూ విచారణ చేపట్టకపోవడంపై ప్రభుత్వ తీరును ఆమె ఎండగట్టారు. భక్తుల మనోభావాలతో టీడీపీ నాయకులు ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, శివ స్వామిని హౌస్ అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దుర్గగుడి పాలకమండలి ఒక అరాచక శక్తిగా తయారు అయ్యిందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాత ఈవో సూర్యకుమారి ఉన్నప్పుడు 50 లక్షల రూపాయల చీరలు మాయం చేశారని ఆరోపించారు. టీడీపీ అధినేత తిరుపతిలోని వజ్రాలు మాయం చేస్తుంటే...మేం తక్కువ అనే విధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు దుర్గ గుడిలో చీరలు మాయం చేస్తున్నారని విమర్శించారు. చీర మాయం విషయంపై ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని గాయత్రి డిమాండ్ చేశారు. -
సెమీస్‌లో గాయత్రి, సిరిల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: యోనెక్స్ సన్‌రైజ్ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు పుల్లెల గాయత్రి, ఎ. సిరిల్ వర్మ సెమీస్‌కు దూసుకెళ్లారు. గచ్చిబౌలిలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సిరిల్ వర్మ 21–18, 21–11తో ఆలాప్ మిశ్రా (మధ్యప్రదేశ్)పై, రాహుల్ యాదవ్ (తెలంగాణ) 22–20, 21–15తో శ్రీరామ్ (కర్ణాటక)పై గెలిచారు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో గాయత్రి 23–21, 21–9తో శైలి రాణే (రైల్వేస్)పై నెగ్గగా, మూడోసీడ్ సాయి ఉత్తేజిత రావు (ఏపీ) 21–12, 21–11తో ఆషి రావత్ (ఢిల్లీ)ని ఓడించింది. డబుల్స్ విభాగాల్లో మేఘన జక్కంపూడికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల (ఎయిరిండియా)–మేఘన (ఆర్బీఐ) జంట 21–12, 21–11తో హేమనాగేంద్ర బాబు (రైల్వేస్)– నింగ్షి హజారికా (అస్సాం) జోడీపై నెగ్గింది. మహిళల డబుల్స్‌లో మేఘన–పూర్విషా రామ్ (ఆర్బీఐ) జంట 5–21, 19–21తో అపర్ణ బాలన్–కె. శ్రుతి జోడీ చేతిలో ఓడింది. -
మోహన్‌బాబు వ్యాఖ్యలపై స్పందించిన తమన్
సాక్షి, హైదరాబాద్ : విలక్షణ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యలపై ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్పందించారు. మోహన్‌బాబు లాంటి సీనియర్ నటులు తనను విమర్శించినా అవి తనకు ఆశీర్వాదంలాగే తీసుకుంటానని తమన్ వ్యాఖ్యానించారు. గాయత్రి సినిమాకు తమన్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా "తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు అన్న మాట నిజమే. నేనైతే తట్టుకోగలిగాను కానీ పని చేయడం చాలా కష్టం అతనితో. టాలెంట్ ఉంది కాని బాగా బద్ధకస్తుడు" అంటూ మోహన్‌బాబు, తమన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటన జరిగిన చాలా రోజులు తర్వాత తమన్ స్పందించారు. పాటలు ఇవ్వడం ఎందుకు ఆలస్యమైందో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. గాయత్రికి మంచి మ్యూజిక్ ఇవ్వాలని అనుకున్నారని, అందుకే కొంత సమయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ వివరణ ఇచ్చారు. అంతేకాదు మోహన్ బాబు లాంటి పెద్ద మనిషి తిట్టినా అది తనకి ఆశీర్వాదం లాంటిదేనని వ్యాఖ్యానించారు. -
‘గాయత్రి’ పైరసీపై మోహన్ బాబు ఆగ్రహం
-
‘గాయత్రి విషయంలో నా మనసు ఏడుస్తోంది’
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల విడుదలైన గాయత్రి చిత్రం పైరసీపై నటుడు మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీకి పాల్పడినవారిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘పైరసీ చేసినవారు, చూసినవారు నికృష్టులు. గాయత్రి సినిమా విషయంలో నా మనసు ఏడుస్తోంది. పైరసీకి పాల్పడినవారు పాపం అనుభవించకతప్పదు. సినిమా కోసం నిర్మాతగా ఎనిమిది నెలలు కష్టపడ్డా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మంచు విష్ణు, శ్రియ నటించిన ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహించారు. చాలాకాలం తర్వాత మోహన్‌బాబు హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేశారు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
గాయత్రి: బాబు అండ్ కోపై మోహన్‌బాబు సెటైర్ల వర్షం!
సాక్షి, హైదరాబాద్: కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు తాజా సినిమా ‘గాయత్రి’. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాలో మోహన్‌బాబు డైలాగ్స్ ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తోంది. ఓ సీన్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఎండగడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రివర్గ సహచరుల తీరుపై మోహన్‌బాబు వేసిన సెటైర్లు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘అటవీశాఖ మంత్రికి జాతీయ పక్షి ఏమిటో తెలియదు. క్రీడాశాఖమంత్రికి ఒలింపిక్స్‌లో మనకెన్ని పతకాలు వచ్చాయో తెలియదు. రవాణాశాఖ మంత్రికి రన్నింగ్ బస్సెలెన్నో తెలియదు. ఛీఛీఛీ.. మంత్రివర్యా.. బీకామ్‌లో ఫిజిక్స్ చదివానని ఒకడు.. బీఎస్సీలో హెచ్ఈసీ చదివానని ఇంకొకడు.. నేనిచ్చిన పెన్షన్ తీసుకుంటూ.. నేనేసిన రోడ్ల మీద నడుస్తూ.. నాకే ఓటు ఎందుకు వేయరని అడిగేవాళ్లు ఇంకొందరు.. భారతదేశ సార్వభౌమధికారం అని పలుకడం చేతకాక.. సార్వబౌబౌ అనేవాళ్లు ఇంకొందరు.. మీరందరూ మంత్రులూ.. మీకు మేం ఓట్లేసి గెలిపించాం’ అంటూ మోహన్‌బాబు సెటైరికల్‌గా పేల్చిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్వయానా సీఎం చంద్రబాబు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు, సీఎం తనయుడు లోకేశ్ ప్రమాణస్వీకారం సందర్భంగా తడబాటుకు గురవ్వడాన్ని వ్యంగ్యంగా గుర్తుచేసేలా మోహన్‌బాబు డైలాగ్ ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
ప్రేక్షకాదరణే శ్రీరామ రక్ష..
సాక్షి, తిరుపతి: ప్రేక్షకుల, అభిమానుల ఆదరణతోనే సినీ పరిశ్రమలో తమ కుటుంబమంతా రాణించగలుగుతోందని, ప్రేక్షకులే శ్రీరామరక్ష అని ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. తిరుపతికి విచ్చేసిన ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో మంచు విష్ణు, మనోజ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఎం సునీల్ చక్రవర్తి శాలువ కప్పి గజమాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. గాయత్రి సినిమాను విజయవంతం చేసినందుకు అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమాని మాట్లాడుతూ.. గాయత్రి సినిమాలో తమ అభిమాన నటుడు అద్భుతంగా నటించాడని తెలిపారు. ఆయనకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు. -
మార్చిలో పెళ్లి?
‘ఇంతకీ మీ పెళ్లెప్పుడు?’ అనే ప్రశ్నను కథానాయికల ముందుంచితే.. జనరల్‌గా వారి సమాధానం దాదాపు ఒకేలా ఉంటుంది. ‘అప్పుడేనా? ప్రస్తుతం సినిమాలతో బిజీ. పెళ్లి చేసుకునే తీరికెక్కడిది. అందుకు చాలా టైమ్ ఉంది’ అంటారు. అదే ప్రశ్న శ్రియను అడిగితే.. డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్లో ఆగ్రహం ఉంటుంది. ‘మీ పెళ్లెప్పుడు?’ అనే ప్రశ్న వింటే చాలు.. ‘మైండ్ యువర్ బిజినెస్’ అని ఘాటుగా సమాధానమిస్తారు. ఆ సంగతలా ఉంచితే.. తాజాగా రష్యాకు చెందిన ఓ వ్యాపారవేత్తతో శ్రియ వివాహం జరగనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సౌత్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఆ యువకుని కుటుంబసభ్యులతో పెళ్లి విషయంపై శ్రియ కుటుంబం మాట్లాడిందని భోగట్టా. పెళ్లికి రెండు కుటుంబాలూ సమ్మతం తెలిపాయని సమాచారం. మార్చిలో వీరి వివాహం రాజస్థాన్‌లో జరగనుందని టాక్. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వివాహం సింపుల్‌గా జరపాలని ప్లాన్ చేస్తున్నారట. ‘మీ పెళ్లెప్పుడు?’ అనే ప్రశ్నకు మండిపడుతున్న శ్రియ.. ఈ వార్తకు ఎలా స్పందిస్తారో చూడాలి. -
‘గాయత్రి’ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
'గాయత్రి 'ట్రైలర్ విడుదల
-
భర్త యాక్షన్ చెప్తే భార్య కట్ చెప్తుంది
భార్యాభర్తలై జంటగా పని చేసే నటులున్నారు.. కొరియోగ్రాఫర్లు ఉన్నారు... సింగర్లు ఉన్నారు... కాని భార్యాభర్తలై జంటగా పని చేసే దర్శకులు మొత్తం ఆసియా ఖండానికి ఒకే ఒకరు ఉన్నారు. వారే పుష్కర్–గాయత్రి. వారిరువురు కలిసి డైరెక్ట్ చేసి తాజా తమిళ సినిమా ‘విక్రమ్ వేదా’ పన్నెండు కోట్ల పెట్టుబడికి 90 కోట్లు సంపాదించి సంచలనం సృష్టిస్తోంది. చెట్టు మీద ఉన్న శవాన్ని దింపి భుజాన వేసుకుని నడుస్తున్న విక్రమార్కుడితో బేతాళుడు రోజుకో కథ చెబుతాడు. చిత్ర విచిత్రమైన కథలు. గాయత్రి–పుష్కర్ల కథ కూడా కొంచెం విచిత్రమైనదే. దర్శకత్వం వహించే భార్యాభర్తలుగా వీళ్లు ఒక ట్రెండ్ సృష్టించారు. గతంలో మనం ‘భారతి–వాసు’ వంటి స్నేహితులు, అబ్బాస్– మస్తాన్ వంటి అన్నదమ్ములు కలిసి దర్శకత్వం వహించిన సందర్భాలు ఉన్నాయి. కాని భార్యాభర్తలు కలిసి దర్శకత్వం వహించడం వింత. ఎవరు యాక్షన్ చెప్తారు, ఎవరు కట్ చెప్తారు, ఎవరు స్క్రీన్ ప్లే రాస్తారు, ఎవరు డైలాగ్ ఎక్స్ప్లయిన్ చేస్తారు.. ఇదంతా అంత సులభం కాదు. కాని మా విషయంలో ఇది చాలా ఈజీ అంటారు గాయత్రి–పుష్కర్. పెళ్లే మాకు దర్శకత్వం లాంటిది... దర్శకత్వమే మాకు పెళ్లి లాంటిది అంటారు వాళ్లు. మెడ్రాస్ కపుల్ పుష్కర్–గాయత్రిలు పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. అందుకే వారి నరనరాన చెన్నై ప్రవహిస్తూ ఉంటుంది. ఇద్దరూ లయోలా కాలేజ్‌లో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుతూ ఉండగా ఒకరికొకరు పరిచయం ఏర్పడింది. ఆ రోజులను తలుచుకుంటూ గాయత్రి ఇలా అంది– ‘ఇద్దరికీ ఒకేరకమైన ఇష్టాలు ఉండటం గమనించాం. ఇద్దరికీ ఒకే రకమైన సినిమాలు ఇష్టం. పుస్తకాలు ఇష్టం. ఇద్దరం ఒకే నాటకానికి కలిసి వెళ్లే వాళ్లం. ఇద్దరం డైరెక్షన్లోకి రావాలని అప్పుడే నిర్ణయించుకున్నాం’ అందామె. డిగ్రీ అయ్యాక సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కడో ఒక చోట అసిస్టెంట్స్‌గా చేరి కెరీర్ మొదలెడతారు. కాని పుష్కర్–గాయత్రీలు సినిమా నియమబద్ధంగా చదవాలని నిర్ణయించుకున్నారు. అందుకే గాయత్రి షికాగోలో, పుష్కర్ న్యూ ఓర్లెన్స్లో సినిమా కళను అభ్యసించారు. అక్కడి నుంచి వచ్చాక పి.సి.శ్రీరామ్, మానవ్ మీనన్ వంటి వారి దగ్గర యాడ్ రంగంలో పని చేశారు. ఇక చాలు అనుకొని 2007లో ‘ఓరమ్ పో’ సినిమాతో దర్శకత్వంలోకి వచ్చారు. బ్లాక్ కామెడీ ఇండియన్ సినిమాలో బ్లాక్ కామెడీతో వచ్చే సినిమాలు తక్కువ. అమర్యాదకరమైన, నలుగురు బహిరంగంగా చర్చించని విషయాలను వేదికగా తీసుకుని హాస్యాన్ని పండించే ఈ తరహా సినిమాలనే పుష్కర్–గాయత్రీలు సినిమాలుగా తీయాలని నిశ్చయించుకున్నారు. వాళ్ల మొదటి సినిమా ‘ఓరమ్ పో’ చెన్నై అర్ధరాత్రిళ్లు ఆటో రేసింగ్ పెట్టుకునే ఆటోడ్రైవర్ల మధ్య నడిచే సినిమా. ఈ సినిమాతో పుష్కర్–గాయత్రీలు కొత్త ప్రేక్షకులను సృష్టించుకున్నారని చెప్పవచ్చు. వీరి తర్వాతి సినిమా ‘వా–క్వార్టర్ కట్టింగ్’ కూడా కొత్తరకం కథే. ఉద్యోగం కోసం సౌదీకి వెళ్లాలనే కుర్రాడు తాను సౌదీకి వెళ్లబోయే రాత్రి ఇక సౌదీకి వెళ్లాక అక్కడ మద్యం తాగలేనని గ్రహించి జీవితంలో ఇప్పటిదాకా మద్యం ముట్టలేదు కనుక ఒక్కసారి ముట్టి వెళ్లిపోదామని అనుకుంటాడు. అయితే ఆ రోజు ఎలక్షన్లు జరుగుతుంటాయి కనుక అది డ్రై డే. ఇక అతడు, అతడి స్నేహితులు మద్యం కోసం ఎన్ని పాట్లు పడ్డారన్నది కథ. దీనికి కూడా ప్రేక్షకులు హిట్ టాక్ ఇచ్చారు. అద్వైతం పుష్కర్–గాయత్రీలు ఇద్దరు కాదు. దాదాపు ఒక్కరే అన్నట్టుగా కలిసిపోయారు. ‘మీకు విభేదాలు రావా?’ చాలామంది వారిని ప్రశ్నించారు. ‘మేము ఒకరి కళ్లలో మరొకరు కళ్లు పెట్టి చూసిన వెంటనే ఒకరి అభిప్రాయం మరొకరికి తెలిసిపోతుంది. తప్పును ఆపేస్తాం. ఒప్పును కొనసాగిస్తాం’ అంటుంది గాయత్రీ. ఇంట్లో అయినా లొకేషన్లో అయినా వీరి మధ్య వాదన ఉండదు చర్చ ఉంటుంది. అందుకే మా జంట సక్సెస్ అయ్యింది అంటారు వాళ్లు. విక్రమ్ వేదా సూపర్ హిట్ తర్వాత రజనీకాంత్ అంతటి వ్యక్తి ప్రత్యేకంగా వీరిని అభినందించాడు. వీరికి చాలా డిమాండ్ ఏర్పడింది. ఇద్దరూ విడివిడిగా దర్శకత్వం వహించవచ్చు కదా అని అడిగితే వాళ్లు చెప్పే జవాబు ‘అంత అవసరం ఏమొచ్చింది?’ అని. ఈ జంట చాలా జంటలకు ఆదర్శం అవ్వాలి. విక్రమ్ వేదా పుష్కర్–గాయత్రీలు చాలా ఒరిజినల్ స్క్రిప్ట్ కోసం ప్రయత్నించే దర్శకులు అని చెప్పుకోవచ్చు. అందుకే వారు పదేళ్ల కాలంలో కేవలం మూడు సినిమాలే తీశారు. మొదటి రెండు సినిమాల తర్వాత వాళ్లు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని ‘విక్రమ్ వేదా’కు దర్శకత్వం వహించారు. దీనికి ముందు ఒకటి రెండు స్క్రిప్ట్‌లు అనుకున్నా వారిని అవి ఉత్సాహపరచలేదు. ఆ సమయంలో వారి దృష్టి బేతాళ కథల మీద పడింది. విక్రమార్కునితో బేతాళుడు రోజుకో కథ చెప్పడం దానికి అనూహ్యమైన జవాబును విక్రమార్కుడు చెప్పడం ఇలా సాగే కథలాగా ఒక సినిమా తీయాలనుకున్నారు. అదే విక్రమ్ వేదా. ఇందులో విక్రమ్ అనే సిన్సియర్ పోలీసాఫీర్, వేదా అనే రౌడీ ఎలా ఒకే ఘటనకు తమ తమ దృక్కోణం నుంచి జవాబులు చెప్పారో ఆసక్తికరంగా ఉంటుంది. విక్రమ్ తన వాదన వినిపిస్తుంటే వేదా తన వాదన వినిపిస్తాడు. మనిషి పూర్తిగా మంచి పూర్తిగా చెడ్డ ఉండడని మధ్యలో కొన్ని గ్రే ఏరియాలు ఉంటాయని ఈ కథ చెబుతుంది. అనూహ్యమైన మలుపులతో చెన్నై ఒరిజినాలిటీతో సాగే ఈ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పలికారు. -
ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం!
సాక్షి, హైదరాబాద్: మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న తాజా చిత్రం ‘గాయత్రి’.. మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు విష్ణు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ను విష్ణు ట్విట్టర్లో షేర్ చేశాడు. గర్భవతిగా కనిపిస్తున్న శ్రియకు విష్ణు జడ వేస్తూ కనిపిస్తున్న ఈ పోస్టర్లో 'ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం' అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. తన కెరీర్లో ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో అత్యంత చాలెజింగ్ రోల్ ఇదేనని, తన కెరీర్లో బెస్ట్ సాంగ్ కూడా ఇదేనని.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విష్ణు కామెంట్ చేశారు. నిఖిలా విమల్ టైటిల్ రోల్లో కనిపిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. . తమన్ సంగీతం అందించాడు. One of the most challenging roles I played so far. And one of my career best song in #Gayatri. Hope you all like the my first look from #Gayatri pic.twitter.com/ChyPhA4uhG — Vishnu Manchu (@iVishnuManchu) 1 January 2018 -
ఆసక్తికరంగా ‘గాయత్రి’ ఫ్టస్ట్‌లుక్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'గాయత్రి'. క్రిస్మస్ సందర్భంగా సోమవారం ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని మోహన్‌బాబు సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు . ‘ఆ రోజు రాముడు చేసింది తప్పయితే... నాదీ తప్పే’ అనే పవర్ఫుల్ క్యాప్షన్‌తో ఈ పోస్టర్ విడుదల చేశారు. దీంతో దీనిపై మరింత ఆసక్తికరంగా. ఈ క్యాప్షన్‌పై అప్పుడే సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది. కాగా మోహన్‌బాబు- విష్ణు- శ్రేయ-నిఖిలా విమల్ కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కుంది. ఇందులో మోహన్‌బాబు రోల్ ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుందని అంటున్నాడు డైరెక్టర్ మదన్. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. బ్రహ్మానందం, జర్నలిస్ట్‌గా అనసూయ తదితరులు నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు కూతురిగా నిఖిలా విమల్ కనిపించనున్నారట. ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే...నాదీ తప్పే #Gayatri pic.twitter.com/1nNd6r5c3v — Mohan Babu M (@themohanbabu) December 25, 2017 -
సైలెంట్‌గా... కూల్‌గా
హంగామా లేకుండా మొదలుపెట్టారు. హడావిడి లేకుండా షూటింగ్ చేశారు. కూల్‌గా కంప్లీట్ చేశారు. మోహన్‌బాబు హీరోగా నటించిన‘గాయత్రి’ సినిమా గురించే చెబుతున్నాం. సైలెంట్‌గా షూటింగ్ చేసేసి, రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని మోహన్‌బాబు తెలిపారు. సినిమానైతే కూల్‌గా కంప్లీట్ చేశారు కానీ, ఇందులో మోహన్‌బాబు మాత్రం కూల్‌గా కనిపిస్తారని చెప్పలేం. ఆయన స్టైల్‌కి తగ్గట్టుగా సూపర్ పవర్ఫుల్ రోల్ చేశారట. ‘పెళ్లైన కొత్తలో’ ఫేమ్ మదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో గాయత్రి పాత్రను నిఖిలా విమల్ చేశారు. ఓ పవర్ఫుల్ పాత్రలో మంచు విష్ణు కనిపిస్తారు. శ్రియ కీలక పాత్ర చేశారు. ఆరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తోన్న ఈ చిత్రం గురువారంతో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. బ్రహ్మానందం, అనసూయ ఇతర ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సర్వేశ్ మురారి, ఫైట్స్: కనల్ కణ్ణన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయకుమార్ ఆర్. -
ప్రియుడి సాయంతో మాజీ ప్రియుడిని..
సాక్షి, గుంటూరు : తాడేపల్లి ఎన్టీఆర్ కరకట్ట వద్ద దారుణం వెలుగు చూసింది. ప్రియుడిని ఓ మహిళ మరో ప్రియుడి సాయంతో చంపేసి సెప్టిక్ ట్యాంక్‌లో శవాన్ని పడేసింది. కరకట్ట ప్రాంతానికి చెందిన గాయత్రి అనే మహిళ విజయవాడ చెందిన రాజయ్య అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. వారిమధ్య విభేదాలు తలెత్తటంతో సుధాకర్ అనే మరో యువకుడితో కలిసి రాజయ్యను ఇంట్లోనే చంపేసింది. అనంతరం మృతదేహాన్ని తన ఇంటి సెప్టిక్ ట్యాంకులో పడేసింది. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు గాయత్రిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని వెలికి తీయించనున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’
కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాతలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్తలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ 24 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణవర్మ చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గొప్ప దర్శకులైన జంధ్యాల గారు రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. ప్రజెంట్ ట్రెండ్‌కి అనుగుణంగా, అన్ని కమర్షియల్ హంగులతో.. అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాము. చిత్రం చాలా బాగా వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యుల నుండి మంచి ఫీడ్ బ్యాక్ తో పాటు యూ బై ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామ’న్నారు. -
ప్రిక్వార్టర్స్‌లో పుల్లెల గాయత్రి
యోగ్‌జకార్తా(ఇండోనేసియా): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి పుల్లెల గాయత్రి మహిళల సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో గాయత్రి 19–21, 21–18, 21–17తో మిచెల్లి స్కోడ్‌స్ట్రప్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ కాయ్ యాన్యాన్ (చైనా)తో గాయత్రి తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో కార్తికేయ్ గుల్షన్ కుమార్, లక్ష్య సేన్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. నాలుగో రౌండ్లో కార్తికేయ్ 21–15, 21–12తో బ్రియాన్ యాంగ్ (కెనడా)పై, లక్ష్య సేన్ 21–16, 21–11తో లి షెఫెంగ్ (చైనా)పై గెలిచారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో గారగ కృష్ణప్రసాద్–ధ్రువ్ కపిల ద్వయం 21–12, 21–16 తే యాంగ్ షిన్–చాన్ వాంగ్ (కొరియా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
మూడో రౌండ్లో గాయత్రి
యోగ్‌జకార్తా (ఇండోనేసియా): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి పుల్లెల గాయత్రి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన తొలి రౌండ్లో గాయత్రి 21–8, 21–12తో విక్టోరియా (ఇండోనేసియా)పై, రెండో రౌండ్లో 21–4, 21–11తో అనికా బెస్ట్బీర్ (దక్షిణాఫ్రికా)పై విజయం సాధించింది. భారత్‌కే చెందిన ఆకర్షి కశ్యప్, అష్మిత చలియా కూడా మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఆకర్షి రెండో రౌండ్లో 21–9, 21–4తో హనా మొహమ్మద్ (ఈజిప్ట్)పై, అష్మిత 21–13, 14–21, 21–19తో థి ఫుంగ్ ట్రాన్ (వియత్నాం)పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో రాహుల్ భరద్వాజ్, కార్తికేయ్ గుల్షన్ కుమార్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. -
సినిమా చూస్తూ బాల్కనీ నుంచి దూకేసిన నటుడు
-
సినిమా చూస్తూ బాల్కనీ నుంచి దూకేసిన నటుడు
సాక్షి, బెంగళూరు : హర్రర్ చిత్రంలో నటించిన ఓ నటుడు ఆ సినిమాను చూస్తూ విచిత్రంగా ప్రవర్తించాడు. ఈ ఘటన శుక్రవారం బెంగళూరులోని మెజస్టిక్ సమీపంలోని మేనక థియేటర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... దర్శకుడు సత్యసామ్రాట్ ‘గాయత్రి’ పేరుతో హర్రర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో విజి (30) అనే నటుడు దెయ్యం సీన్లో నటించాడు. నిన్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాను విజి మేనక థియేటర్లో చూస్తూ ఒక్కసారిగా హాల్లో నుంచి బయటకు వచ్చి బాల్కనీ నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని థియేటర్ యాజమాన్యం కేసీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా విజి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనతో థియేటర్ యాజమాన్యం చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. అయితే విజి ఎందుకు అలా ప్రవర్తించాడనే దానిపై స్పష్టత లేదని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పోరాడి ఓడిన గాయత్రి
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అండర్–17 బాలుర సింగిల్స్‌లో మైస్నమ్ మెరాబా రెండో రౌండ్లోకి ప్రవేశించగా... పుల్లెల గాయత్రి అండర్–17, అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో పోరాడి ఓడిపోయింది. మయన్మార్‌లో బుధవారం మొదలైన ఈ పోటీల్లో మైస్నమ్ తొలి రౌండ్లో 21–10, 21–13తో షున్ యాంగ్ లీ (మలేసియా)పై విజయం సాధించాడు. గాయత్రి అండర్–17 విభాగం తొలి రౌండ్లో 20–22, 21–18, 13–21తో యస్నితా ఎంగిరా సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో... అండర్–15 విభాగం తొలి రౌండ్లో 22–24, 21–14, 15–21తో విద్జాజా స్టెఫానీ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. అండర్–17 బాలికల సింగిల్స్ మరో మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖి 9–21, 19–21తో నూర్ స్యాజా రషీది (మలేసియా) చేతిలో ఓటమి చవిచూసింది. అండర్–17 బాలికల డబుల్స్ తొలి రౌండ్లో మోపాటి కెయుర–సెల్వం కవిప్రియ ద్వయం 21–9, 21–4తో దిల్మీ దియాస్–అనురాంగి మసకోరాలా (శ్రీలంక) జోడీపై విజయం సాధించింది. ఇదే విభాగంలో పుల్లెల గాయత్రి–సామియా ఇమాద్ ఫారూఖి జంటకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
రెండో పిజ్జా రెడీ
విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా రంజిత్ జయకోడి దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ‘పురియాద పుదిర్’. డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై ‘పిజ్జా–2’గా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను అందిస్తున్నారు నిర్మాత డి. వెంకటేశ్. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డి. వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో తెలిపే కథతో థ్రిల్లర్ జానర్లో రూపొందిందీ సినిమా. రంజిత్ జయకోడి సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని ఉత్కంఠగా సాగే కథనంతో సినిమాను నడిపించారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్ సీయస్. -
కథానాయకిగా రెడీ
తమిళసినిమా: సినీరంగంలో వారసుల తెరంగేట్రం సులభం అని చెప్పనక్కర్లేదు. ఇలాచాలా మంది నటుడిగానో, నటిగానో, ఇతర శాఖల్లోనో పరిచయం అవుతూనే ఉన్నారు. ఆ కోవలో మరో వారసురాలు కథానాయకి అయ్యే ందుకు రెడీ అంటోంది. కలైపులి ఎస్.థాను నిర్మించి సంచలన విజయం సాధించిన యార్ చిత్రం దర్శక ద్వయంలో ఒకరు కన్నన్. ఆ చిత్రం తరువాత యార్ కన్నన్‌గా ముద్రవేసుకుని పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నటుడిగా మారి పలు చిత్రాల్లో న టిస్తున్న యార్కన్నన్, జీవా దంపతుల దత్తపుత్రిక గాయత్రి కథా నాయకిగా చిత్రరంగ ప్రవేశం చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న గాయత్రిని చూసిన వాళ్లు సినిమా నటిలాగుందే అన్న మాటలతో తానూ కథానాయకి కావా లన్న కోరిక గాయత్రికి బలంగా ఏర్పడిందట. అంతే తమిళచిత్ర పరిశ్రమలో స్టిల్స్రవిగా పేరు గాంచిన ప్రముఖ ఫొటోగ్రాఫర్‌తో ఫొటోషూట్ ఏర్పాటు చేయించుకుని వివిధ భంగిమల్లో ఫొటోలు దిగేసింది. ఆ ఫొటో చూసిన వారందరూ చాలా బాగున్నావనడంతో హీరో యిన్ కావాలనే నిర్ణయానికి వచ్చేసింది. విశేషం ఏమిటంటే స్టిల్స్ రవి ఫొటో షూట్ చేసిన పలువురు ప్రముఖ నటీమణులుగా రాణిస్తున్నారు. మంచి నిర్మాణ సంస్థ, మంచి టీం అమరితే కథానాయకిగా నటించడానికి తాను రెడీ అంటోంది ఈ పదహారేళ్ల పరువాల గాయత్రి. -
గాయత్రి డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి పుల్లెల గాయత్రి సత్తా చాటింది. తమిళనాడులో జరిగిన ఈ టోర్నీలో అండర్–17 సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో ఏడో సీడ్ గాయత్రి 21–19, 15–21, 21–18తో టాప్ సీడ్ ఆకర్షి కశ్యప్‌కు షాకిచ్చింది. డబుల్స్ విభాగంలో నగరానికే చెందిన సామియా ఇమాద్ ఫరూఖితో జతకట్టిన గాయత్రి ఫైనల్లో 21–19, 17–21, 21–12తో కేయూర మోపాటి–కవిప్రియ (హైదరాబాద్) జంటపై గెలుపొందింది. మరోవైపు బాలుర సింగిల్స్ విభాగంలో ధ్రువ్ రావత్ 21–17, 21–19తో అమిత్ రాథోడ్‌పై నెగ్గి విజేతగా నిలిచాడు. డబుల్స్ ఫైనల్లో ఖదీర్ మొయినొద్దీన్ మొహమ్మద్–విష్ణువర్ధన్ గౌడ్ ద్వయం 21–15, 20–22, 21–19తో యశ్ రైక్వార్–ధ్రువ్ రావత్ జంటను ఓడించింది. అండర్–19 సింగిల్స్ విభాగంలో మాల్విక బన్సోడ్, అరింథాప్ దాస్ గుప్తా టైటిళ్లను సాధించారు. బాలికల ఫైనల్లో మాల్విక 12–21, 21–19, 21–13తో అస్మితాపై, బాలుర ఫైనల్లో అరింథాప్ 21–19, 21–16తో సంజయ్ ఠాకూర్‌పై గెలుపొందారు. బాలికల డబుల్స్ విభాగంలో రుతుపర్ణా పాండ–మిథులా ద్వయం 21–11, 21–15తో సిమ్రన్ సింఘి–రితికా ఠాకూర్ జంటను ఓడించి విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ధ్రువ్–మిథులా జోడీ 21–18, 21–19తో శ్రీకృష్ణ సాయి కుమార్–రుతుపర్ణా పాండ జంటపై నెగ్గింది. -
జయ్‌సేతుపతితో మరోసారి..
తమిళసినిమా: విజయ్‌సేతుపతితో నాల్గవసారి జత కడుతోంది నటి గాయత్రి. ఇంతకుముందు నడువుల కొంచెం పక్కత్తు కానోమ్, రమ్మీ, పురియాద పుదిర్ చిత్రాల్లో నటించారు. వీటిలో నడువుల కొంచెం పక్కత్తు కానోమ్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. రమ్మీ సుమారుగా ఆడినా, పురియాద పుదిర్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంకా తెరపైకి రాలేదు.కాగా మధ్యలో కోలీవుడ్‌లో కనిపించని నటి గాయత్రి తాజాగా ఉలా అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా విజయ్‌సేతుపతితో కలిసి మరో సారి రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యింది. వీరిద్దరు కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి ఒరు నల్ల నాళ్ పార్తు సొల్రేన్ అనే పేరును నిర్ణయించారు. 7సీ.ఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, అమ్మా నారాయణ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు ఆర్ముగకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మరో కథానాయకుడిగా గౌతమ్‌కార్తీక్ నటిస్తుండగా, ఇంకో నాయకిగా టాలీవుడ్ నటి నిహారిక కొణెదల నటిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో నాయకిగా పరిచయమైన ఈమె ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే విజయ్‌సేతుపతి ఈ చిత్రంలో ట్రైబల్ నాయకుడు యమన్‌గా వైవిధ్యభరిత పాత్రను పోషిస్తున్నారని, 8 గెటప్‌లలో కనిపించనున్నారని సమాచారం. అదే విధంగా గౌతమ్‌కార్తీక్ సిటీ యువకుడిగా నటిస్తుండగా గాయత్రి ప్రాముఖ్యత ఉన్న పాత్రను పోషిస్తోందట. ఇందులో తన ఆదివాసీ డాన్స్ హైలెట్‌గా ఉంటుందంటోంది గాయత్రి. -
చాంపియన్ గాయత్రి
బెంగళూరు: యూనియన్ బ్యాంక్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి సత్తా చాటింది. అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో గాయత్రి 13–21, 21–17, 21–14తో టాప్ సీడ్ ఆకర్షి కశ్యప్‌పై విజయం సాధించి టైటిల్‌ను దక్కించుకుంది. డబుల్స్ విభాగంలో గాయత్రి జోడీకి నిరాశ ఎదురైంది. నగరానికే చెందిన సామియా ఇమాద్ ఫరూఖితో జతకట్టిన గాయత్రి రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో గాయత్రి–సామియా జోడీ 21–17, 17–21, 17–21తో బండి సాహితి–వర్షిణి జంట చేతిలో పరాజయం పాలైంది. అంతకుముందు సెమీస్‌లో గాయత్రి– సామియా ద్వయం 21–17, 21–13తో జాహ్నవి–ఆర్య శెట్టి జంటపై గెలుపొందింది. -
సింగిల్స్ చాంప్ గాయత్రి
తిరువనంతపురం: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి పుల్లెల గాయత్రి టైటిల్‌తో మెరిసింది. అండర్–17 బాలికల సింగిల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గాయత్రి 21–12, 21–23, 21–6తో చత్తీస్‌గఢ్‌కు చెందిన టాప్ సీడ్ ఆకర్షి కశ్యప్‌పై విజయం సాధించింది. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తనయ గాయత్రికి ఒక్క రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇందులోనూ పోరాడినప్పటికీ ఆకర్షి దూకుడుకు తలవంచింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభం నుంచే చెలరేగింది. దీంతో టాప్ సీడ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అండర్–17 బాలికల టైటిల్‌ను సాహితి బండి (తెలంగాణ)–వర్షిణి (తమిళనాడు) జోడి గెలుచుకుంది. ఫైనల్లో ఈ మూడో సీడ్ జోడి 21–15, 10–21, 21–17తో కెయూర మొపతి– కవిప్రియ (తెలంగాణ) జంటను ఓడించింది. అండర్–17 బాలుర సింగిల్స్ తుదిపోరులో టాప్ సీడ్ మైస్నమ్ మిరబా 21–12, 21–12తో ధ్రువ్ రావత్‌పై నెగ్గాడు. డబుల్స్ ఫైనల్లో యశ్–ధ్రువ్ రావత్ 21–14, 10–21, 21–13తో ఎడ్విన్ జాయ్–అరవింద్ సురేశ్ జంటపై నెగ్గింది. అండర్–19 డబుల్స్ ఫైనల్లో రాహుల్ భరద్వాజ్ 21–15, 21–14తో టాప్ సీడ్ కార్తీకేయ్ కుమార్‌కు షాకిచ్చాడు. అండర్–19 బాలికల సింగిల్స్ టైటిల్ పోరులో పూర్వ బర్వే 27–25, 21–13తో అశ్విని భట్‌పై, డబుల్స్‌లో మిథుల–రుతపర్ణ పండ 21–14, 21–18తో అశ్విన్‌భట్–అపేక్ష నాయక్ జంటపై, అండర్–19 బాలుర డబుల్స్‌లో సంజయ్–సిద్ధార్థ్ 15–21, 21–12, 21–18తో సౌరభ్– రామ్‌భియా దీప్‌లపై గెలుపొందారు. -
శ్రీకాంత్ ఇంటిపై దాడి; యాదగిరిపల్లెలో ఉద్రిక్తత
యాదాద్రి: ప్రేమోన్మాది శ్రీకాంత్ ఇంటి ముందు గాయాత్రి మృతదేహంతో ఆమె బంధువులు ఆందోళనకు దిగడంతో ఆదివారం యాదగిరిపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన బంధువులు.. ఒక దశలో కోపం పట్టలేక శ్రీకాంత్ ఇంటిపై దాడిచేశారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. అప్రమత్తమైన పోలీసులు.. వారిని నిలువరించేప్రయత్నం చేశారు. ఆందోళన విరమించాలని పోలీసులు విజ్ఞప్తి చేసినప్పటికీ, శ్రీకాంత్‌ను శిక్షించే వరకూ కొనసాగిస్తామని గాయత్రి బంధువులు హెచ్చరించారు. యాదాద్రి దేవస్థానంలో మాలిగా పనిచేస్తోన్న సూదగాని సాయులు కుమార్తె గాయత్రి(20)ని యాదగిరిపల్లెకే చెందిన శ్రీకాంత్ అనే ప్రేమోన్మాది శనివారం కత్తితో పొడిచి చంపేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. డిగ్రీ పూర్తిచేసిన గాయత్రికి ఇటీవలే ఓ పెళ్లి సంబంధం కుదిరింది. త్వరలోనే నిశ్చితార్థం నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అంతలోనే అనూహ్యంగా హత్యకు గురికావడంతో ఆమె కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది. హంతకుడు శ్రీకాంత్ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. చదవండి: ప్రేమించలేదని.. పొడిచి చంపేశాడు! ఇంట్లో ఉంటే మమ్మల్నీ చంపేవాడు: గాయత్రి తండ్రి -
ప్రేమించలేదని.. పొడిచి చంపేశాడు!
- కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ గాయత్రి వెంటపడిన శ్రీకాంత్ - నిరాకరించినా వినకుండా వేధింపులు.. గ్రామ పెద్దల సమక్షంలో మందలింపు - దీనిపై కసి పెంచుకున్న శ్రీకాంత్.. ఎవరూ లేని సమయంలో గాయత్రిపై దాడి - కత్తితో విచక్షణారహితంగా పొడిచి పరారీ ప్రేమోన్మాదం కోరలు చాచింది. తన ప్రేమను నిరాకరించిందన్న ఆగ్రహంతో శ్రీకాంత్ అనే యువకుడు గాయత్రి అనే యువతిని దారుణంగా చంపేశాడు. ఎవరూ లేని సమయంలో ఇంట్లో చొరబడి కత్తితో విచక్షణా రహితంగా పొడిచి.. పారిపోయాడు. బాధతో కేకలు వేస్తూ, రక్తపు మడుగులో పడిపోయిన ఆమెను ఇరుగుపొరుగువారు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా.. మార్గమధ్యం లోనే ఆమె కన్నుమూసింది. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పరిధిలోని యాదగిరిపల్లిలో శనివారం సాయంత్రం ఈ దారుణం జరిగింది. యాదగిరిగుట్ట: యాదగిరిపల్లికి చెందిన సూదగాని సాయిలు– లక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె గాయత్రి (20). సాయిలు యాదాద్రి దేవస్థానంలో చిరుద్యోగి. భువనగిరిలోని ఓ ప్రైవేటు కళాశాలలో గతేడాది డిగ్రీ పూర్తి చేసిన గాయత్రి.. అప్పటినుంచి ఇంటి వద్దే ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడుతున్నాడు. తనకు ఇష్టం లేదంటూ పలుమార్లు శ్రీకాంత్‌కు స్పష్టం చేసిన గాయత్రి.. చివరికి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కూడా పలుమార్లు పెద్దల సమక్షంలో శ్రీకాంత్‌ను మందలించారు. అయినా శ్రీకాంత్‌లో మార్పు రాకపోవడంతో... ఇటీవల మరోసారి గ్రామ పెద్దలు, స్థానికులు తీవ్రంగా మందలించారు. మరోవైపు గాయత్రికి ఇటీవలే ఓ పెళ్లి సంబంధం కుదిరింది. త్వరలోనే నిశ్చితార్థం నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే గాయత్రి తనను ప్రేమించలేదని కసి పెంచుకున్న శ్రీకాంత్ ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. శనివారం మధ్యాహ్నం గాయత్రి తండ్రి సాయిలు విధులకు వెళ్లిపోగా, తల్లి లక్ష్మి వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లింది. గాయత్రి ఒంటరిగా ఉందని గమనించిన శ్రీకాంత్... మెల్లగా వారి ఇంట్లోకి వెళ్లి కత్తితో గాయత్రి కడుపులో విచక్షణారహితంగా పొడిచాడు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో పరారయ్యాడు. కేకలు విని సోదరుడు, ఇరుగుపొరుగు వారు వచ్చారు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న గాయత్రిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో ఆమె కన్నుమూసింది. ఘటనా స్థలాన్ని యాదగిరిగుట్ట పోలీసులు పరిశీలించి, ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. కన్నీటి సంద్రంలో కుటుంబం ఒక్కగానొక్క కుమార్తె మరణించడంతో సాయిలు కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. గాయత్రి హత్య విషయం తెలుసుకుని తల్లిదండ్రులు హతాశులయ్యారు. ఉదయం నుంచి తమతోనే ఉన్న గాయత్రి సాయంత్రం ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురవడాన్ని బంధువులు, ఇరుగుపొరుగువారు తట్టుకోలేకపోతున్నారు. గాయత్రిని దారుణంగా పొడిచి హత్య చేసిన శ్రీకాంత్‌ను వదలకూడదని, కఠినంగా శిక్షించాలని ఆమె తండ్రి సాయిలు, బంధువులు డిమాండ్ చేశారు. గాయత్రి లాంటి పరిస్థితి మరొకరికి రాకుడదంటూ పోలీసులను వేడుకున్నారు. లొంగిపోయిన ఉన్మాది? గాయత్రిని హత్య చేసిన శ్రీకాంత్ యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. యాదగిరిపల్లిలో గాయత్రిని పొడిచింది తానేనని అతను నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అంగీకరించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే నిందితుడు పరారీలోనే ఉన్నాడని, ఆచూకీ లభ్యం కాలేదని, త్వరలోనే పట్టుకుంటామని సీఐ ఆంజనేయులు చెప్పారు. -
అమ్మకు అవమానం
గాయత్రీబోస్‌కి 33 ఏళ్లు. ఇండియన్. సింగపూర్‌లో ఉంటోంది. ఇద్దరు పిల్లలు. మూడున్నరేళ్లు, ఏడున్నర నెలల పిల్లలు. గాయత్రి ట్రాన్స్పోర్ట్ కంపెనీ మేనేజర్. పని మీద ఈ మధ్య జర్మనీ వెళ్లింది. అక్కడి నుంచి ప్యారిస్ వెళ్లాలి. ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లయిట్ రెడీగా ఉంది. ఈలోపు ఆమెను సెక్యూరిటీలో ఆపేశారు. ఆమె క్యారీబ్యాగ్‌ను స్క్రీన్ చేస్తున్నప్పుడు అందులో ‘బ్రెస్ట్ పంప్’ కనిపించింది. (బిడ్డ కోసం బాటిల్లో పాలు పట్టి ఉంచడానికి వర్కింగ్ మదర్స్ అ బ్రెస్ట్ పంప్ ఉపయోగిస్తారు). ‘‘బ్రెస్ట్ పంప్ సరే, బిడ్డ ఎక్కడ?’’అని అడిగారు అధికారులు. గాయత్రీ తనతోపాటు బిడ్డను తెచ్చుకోలేదు. ‘‘బేబీ, సింగపూర్‌లో ఉంది’’ అని చెప్పింది. వాళ్లకు అనుమానం వచ్చింది. వెంటనే మహిళా సిబ్బందిని పిలిపించి ‘డీప్’గా చెక్ చెయ్యమని పురమాయించారు. చెకింగ్ కోసం లోపలికి వెళ్లిన గాయత్రీ కన్నీళ్లతో బయటికి వచ్చింది. ఏడ్చుకుంటూనే ప్యారిస్ ఫ్లయిట్ ఎక్కింది. ఇంతకీ లోపల ఏం జరిగింది? ‘ఒక్కదానివే ప్రయాణిస్తున్నావు. ఈ బ్రెస్ట్ పంప్ ఎందుకు?’ అని అడిగారు. ‘నువ్వు నిజంగానే బిడ్డ తల్లివా?’ అని అడిగారు. ‘రుజువేమిటి?’ అన్నారు. అక్కడితో ఆగలేదు. బ్లవుజ్ ఓపెన్ చెయ్యమన్నారు. బ్లవుజ్ ఓపెన్ చేశాక.. పాలు వస్తున్నాయో లేదో చూడాలి.. కొద్దిగా నొక్కి చూపించు అన్నారు. గాయత్రి వాళ్లు చెప్పినట్లే చేసింది. ఆ తర్వాత మాత్రమే వాళ్లు ఆమెను వదిలిపెట్టారు. కానీ ఆమె వాళ్లను వదిలిపెట్టదలచుకోలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ‘బ్రెస్ట్ చూపించాల్సి రావడం ఎంత అవమానం’ అని ఆవేదన చెందుతోంది గాయత్రి. ‘‘బ్రెస్ట్ పంప్ -
గాయత్రి డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సబ్‌జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పుల్లెల గాయత్రి సత్తాచాటింది. కోయంబత్తూరులో జరిగిన ఈ టోర్నీలో అండర్-15 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి టైటిల్స్‌ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో గాయత్రి 20- 22, 21- 17, 21-11తో సామియా ఇమాద్ ఫరూఖీ (తెలంగాణ)పై విజయం సాధించింది. డబుల్స్ విభాగంలో గాయత్రి-సామియా ద్వయం 21- 13, 21-16తో త్రిష జోలీ-మెహరీన్ రిజా జంటను ఓడించి విజేతగా నిలిచింది. -
అమ్మాయిలూ...జాగ్రత్త!
ప్రపంచమంతా టెక్నాలజీమయం. ఇందులో ప్లస్సులూ.. మైనస్సులూ ఉన్నాయి. ప్రతిరోజూ ప్రపంచంలో ఏదో మూలన ఏదొక సరికొత్త టెక్నాలజీ ప్రజలకు పరిచయమవుతోంది. అటువంటి ఓ ఆధునిక టెక్నాలజీ పేరుతో అమాయకపు మహిళలు, అమ్మాయిలను కొందరు యువకులు ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఓ సామాజిక సమస్య నేపథ్యంలో రూపొందిన తమిళ చిత్రం ‘పురియాద పుదిర్’. అంటే.. ‘అర్థం కాని చిక్కుముడి’ అని అర్థం. ‘పిజ్జా’ ఫేం విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా నటించారు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘పిజ్జా-2’ పేరుతో డీవీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేశ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. త్వరలో ట్రైలర్, పాటల్ని విడుదల చేయనున్నారు. ‘‘ఆద్యంతం ఉత్కంఠను కలిగిస్తూ, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. ఇదే నెలలో తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని డి. వెంకటేశ్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శామ్ సి.ఎస్. -
లోక కల్యాణార్థం..
– శ్రీశైలంలో కొనసాగుతున్న కోటి గాయత్రి, లలితానామ జపయజ్ఞ మహోత్సవం శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలోని చంద్రావతి కల్యాణమండపంలో తెనాలి శ్రీమద్భాగవత సప్తాహజ్ఞాన యజ్ఞట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి కోటి గాయత్రి, కోటి లలితానామ జపయజ్ఞ పారాయణ మహోత్సవం అత్యంతవైభవంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 7.30గంటల నుంచి 9 గంటల వరకు జపాలు, అనంతరం 12గంటల వరకు పారాయణలు, ఆ తర్వాత మహానివేదన, ప్రసాద వితరణ చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు విష్ణుభట్ల తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 21 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జగద్గురువు దివ్యాశీస్సులతో లోక కల్యాణార్థం, మానవులందరికీ సంత్పంకల్పం కలగాలంటే శ్రీగాయత్రీ మాతను సమష్టిగా కోటి సంఖ్యారూపంగా ఆరాధించి, జపించడంతో పాటు మహిళలచే కోటి లలితా నామ జప పారాయణలు జరిపించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహిస్తున్న కోటి గాయత్రి, లలితానామ జపయజ్ఞ మహోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం సమయానికి 84 లక్షలు లలితానామ జపం, 72 లక్షల గాయత్రి నామ జపం పూర్తయినట్లు తెలిపారు. ఈ మహోత్సవంలో ఉమ్మడిరాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ బి. శివ శంకరరావు పాల్గొన్నారు. వారికి ట్రస్ట్ నిర్వాహకులు ఆశీర్వచనాలను అందజేశారు. ముందుగా ఆయన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను దర్శించుకున్నారు. -
శ్రీ లక్ష్మీ గాయత్రి యాగం
భద్రాచలం టౌన్ : భద్రాచలంలోని శిల్పినగర్లోగల శ్రీ దుర్గా గాయత్రి శక్తి పీఠమ్ సర్వదేవతా సన్నిధానంలో సంతోషి మాత జయంతి, రాఖీ పౌర్ణమి సందర్భంగా గురువారం వైభవంగా శ్రీ లక్ష్మీగాయత్రి యాగాన్ని ఆలయ వ్యవస్థాపకులు కెవి.సుబ్రహ్మణ్యశర్మ నిర్వహించారు. సకల లోకం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ యాగం నిర్వహించినట్టు ఆయన చెప్పారు. -
ఘనంగా గాయత్రి ఆలయ వార్షికోత్సవం
శ్రీరమా సహిత సత్యనారాయణస్వామి వారల కల్యాణాన్ని వీక్షిస్తున్న మహిళలు ముస్తాబాద్ : తెర్లుమద్దిలోని శ్రీగాయత్రిమాత ఆలయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీరమా సహిత సత్యనారాయణస్వామి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. సముద్రాల శ్రీరామాచార్యులు, చక్రవర్తుల కృష్ణమాచారి, సముద్రాల శ్రీకాంత్‌చారి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్‌రావు, సర్పంచ్ ఈసరి కృష్ణ, సేవాలాల్‌తండా సర్పంచ్ మంగ్యానాయక్, ఎంపీటీసీ సుమలత, మాజీ సర్పంచులు కట్ట బాపురావు, మల్లెశ్యాదవ్, నాయకులు బాలమల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.