పరాజయంతో ప్రారంభం | PBL Season 5: PV Sindhu Lost Match Against Chennai Super Star Team | Sakshi
Sakshi News home page

పరాజయంతో ప్రారంభం

Published Tue, Jan 21 2020 4:35 AM | Last Updated on Tue, Jan 21 2020 5:03 AM

PBL Season 5: PV Sindhu Lost Match Against Chennai Super Star Team - Sakshi

చెన్నై: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌–5)లో భాగంగా సోమవారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ 2–5తో చెన్నై సూపర్‌ స్టార్స్‌ జట్టు చేతిలో ఓడింది. సింధు మాత్రమే హైదరాబాద్‌ తరఫున గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌–జెస్సికా (చెన్నై) జోడీ 15–6, 13–15, 15–13తో ఇవనోవ్‌ –సిక్కి రెడ్డి (హైదరాబాద్‌) జంటపై గెలిచింది. తొలి పురుషుల సింగిల్స్‌లో టామీ సుగియార్తో 15–11, 15–10తో సిరిల్‌ వర్మ (హైదరాబాద్‌)పై నెగ్గాడు.

రెండో సింగిల్స్‌ చెన్నైకి ‘ట్రంప్‌’ మ్యాచ్‌ కాగా... ఇందులో లక్ష్యసేన్‌ 15–6, 13–15, 15–14తో ప్రియాన్షు (హైదరాబాద్‌)పై నెగ్గడంతో చెన్నైకు రెండు పాయింట్లు లభించాయి. దీంతో చెన్నై రెండు మ్యాచ్‌లు ఉండగానే 4–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. హంటర్స్‌ ‘ట్రంప్‌’ మ్యాచ్‌ అయిన మహిళల సింగిల్స్‌లో సింధు 15–5, 15–5తో గాయత్రిని ఓడించడంతో చెన్నై ఆధిక్యం 4–2కి తగ్గింది. అయితే పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌–సుమిత్‌ రెడ్డి (చెన్నై) ద్వయం 15–14, 11–15, 15–8తో బెన్‌లెన్‌–సియాన్‌ వెండీ (హైదరాబాద్‌) జోడీపై నెగ్గడంతో చెన్నై 5–2తో విజయం సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement