PBL
-
బెంగళూరు రాప్టర్స్దే పీబీఎల్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) చరిత్రలో టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా బెంగళూరు రాప్టర్స్ జట్టు నిలిచింది. గచ్చి బౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ జట్టు 4–2తో తొలిసారి ఫైనల్ చేరిన నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టును ఓడించింది. తొలి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ 14–15, 15–9, 15–3తో లీ చెయుక్ యియు (వారియర్స్)పై నెగ్గి బెంగళూరుకు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో బొదిన్ ఇసారా–లీ యోంగ్ డే (వారియర్స్) జంట 15–11, 13–15, 15–14తో అరుణ్ జార్జి–రియాన్ అగుంగ్ సపుత్రో (బెంగళూరు) జోడీపై గెలిచింది. ఈ మ్యాచ్‌ను వారియర్స్ ‘ట్రంప్’గా ఎంచుకోవడంతో ఆ జట్టు 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో తై జు యింగ్ (బెంగళూరు) 15–9, 15–12తో మిచెల్లి లీని ఓడించింది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో చాన్ పెంగ్ సూన్–ఎమ్ హై వన్ (బెంగళూరు) ద్వయం 15–14, 14–15, 15–12తో గారగ కృష్ణప్రసాద్–కిమ్ హా నా (వారియర్స్) జోడీపై నెగ్గింది. ఈ మ్యాచ్‌ను బెంగళూరు ‘ట్రంప్’గా ఎంచుకోవడంతో ఆ జట్టు 4–2తో ఆధిక్యంలోకి వెళ్లి విజయాన్ని ఖాయం చేసుకుంది. చివరిదైన ఐదో మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టు గెలిచినా తుది ఫలితం మారే అవకాశం లేకపోవడంతో దానిని నిర్వహించలేదు. విజేత బెంగళూరు జట్టుకు ట్రోఫీతోపాటు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. రన్నరప్ నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టుకు రూ. కోటీ 50 లక్షలు... సెమీఫైనల్స్‌లో ఓడిన పుణే సెవెన్ ఏసెస్, చెన్నై సూపర్ స్టార్స్ జట్లకు రూ. 75 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది. లీగ్ దశలో నిలకడగా ఆడిన హైదరాబాద్ హంటర్స్ క్రీడాకారిణి నేలకుర్తి సిక్కి రెడ్డికి ‘ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ పురస్కారం లభించింది. తై జు యింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డు సొంతం చేసుకుంది. హైదరాబాద్ హంటర్స్‌కే చెందిన ప్రియాన్షు రజావత్‌కు ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డు దక్కింది. -
సెమీస్‌లో బెంగళూరు రాప్టర్స్
నేడు జరిగే తొలి సెమీఫైనల్లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో చెన్నై సూపర్‌స్టార్స్ జట్టు; శనివారం జరిగే రెండో సెమీఫైనల్లో పుణే సెవెన్ ఏసెస్‌తో బెంగళూరు రాప్టర్స్ జట్టు తలపడతాయి. ఆదివారం ఫైనల్ జరుగుతుంది సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 5–0తో అవధ్ వారియర్స్‌పై ఘనవిజయం సాధించింది. గెలిచిన జట్టే ముందంజ వేసే ఈ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్, బ్రైస్ లెవెర్డెజ్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో అదరగొట్టారు. ‘ట్రంప్’ మ్యాచ్‌లో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ నెగ్గడంతో రాప్టర్స్ రెండు ‘ట్రంప్’ మ్యాచ్‌ల్లోనూ గెలిచి సెమీస్ దారిని సులభతరం చేసుకుంది. ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ వారియర్స్, చెన్నై సూపర్‌స్టార్స్, పుణే సెవెన్ ఏసెస్ సెమీస్ చేరాయి. పురుషుల డబుల్స్‌తో మొదలైన ఈ పోరులో అరుణ్ జార్జి–రియాన్ అగుంగ్ సపుట్రో (రాప్టర్స్) జోడీ 15–14, 7–15, 11–15తో సంగ్ హ్యూన్–షిన్ బెక్ చియోల్ (అవధ్) ద్వయం చేతిలో కంగుతింది. అయితే అవధ్ ‘ట్రంప్’ పోరులో జయరామ్ 9–15, 9–15తో లెవెర్డెజ్ (రాప్టర్స్) చేతిలో ఓడిపోవడంతో వచ్చిన పాయింట్ కూడా చేజారింది. మహిళల సింగిల్స్‌లో తై జు యింగ్ (రాప్టర్స్) 15–12, 15–12తో బీవెన్ జాంగ్ (అవధ్)పై నెగ్గింది. అనంతరం రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ను బెంగళూరు ‘ట్రంప్’గా ఎంచుకోగా సాయిప్రణీత్ (రాప్టర్స్) 15–11, 15–13తో విన్సెంట్ (అవధ్)ను ఓడించి జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 4–0తో అవధ్‌పై గెలుపును ఖాయం చేసుకుంది. ఇక ఆఖరి మిక్స్డ్ డబుల్స్ పోరులో చన్ పెంగ్ సూన్– ఇయోమ్ హి వోన్ (రాప్టర్స్) జోడీ 7–15, 15–12, 15–11తో సంగ్ హ్యూన్–క్రిస్టీనా పెడర్సన్ (అవధ్) జంటపై గెలిచింది. -
హైదరాబాద్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ 4–3తో ముంబై రాకెట్స్‌పై గెలి చింది. తొలుత జరిగిన పురుషుల డబుల్స్, పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఓడి 0–3తో వెనుకబడ్డ హైదరాబాద్‌కు సింధు తన విజయంతో ఊరట కలిగించింది. మహిళల సింగిల్స్‌లో సింధు 15–5, 15–10తో శ్రేయాన్షి (ముంబై)పై గెలిచింది. ఇందులో సింధు ‘ట్రంప్ కార్డు’తో ఆడటంతో జట్టుకు రెండు పాయింట్లు లభించాయి. అనంతరం పురుషుల రెండో సింగిల్స్‌లో ప్రియాన్షు (హైదరాబాద్) 15–13, 15–9తో లీ డాంగ్ కెయున్ (ముంబై)పై సంచలన విజయం సాధించడంతో... ఇరు జట్ల స్కోర్లు 3–3తో సమం అయ్యాయి. ఇక విజేతను నిర్ణయించే మిక్స్డ్ డబుల్స్‌లో ఇవనోవ్–సిక్కి రెడ్డి (హైదరాబాద్) ద్వ యం 15–8, 15–8 కిమ్ స రంగ్–పియా జెబదియా (ముంబై) జోడీపై గెలుపొంది హైదరాబాద్‌ను విజేతగా నిలిపింది. సిక్కి రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు లభించింది. -
సెమీస్‌లో నార్త్ ఈస్టర్న్, చెన్నై సూపర్ స్టార్స్
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో చెన్నై సూపర్ స్టార్స్, నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ స్టార్స్ 4–3తో అవధ్ వారియర్స్‌పై విజయం సాధించింది. దాంతో 19 పాయింట్లు సాధించిన చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు 3–3తో సమంగా ఉన్న సమయంలో... విజేతను నిర్ణయించే మ్యాచ్ అయిన మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–జెస్సికా (చెన్నై) ద్వయం 15–11, 13–15, 15–14తో క్రిస్టీనా–కొ సుంగ్ హ్యూన్ (అవధ్) జంటపై అద్భుత విజయాన్ని సాధించింది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ 5–0తో పుణే సెవెన్ ఏసెస్‌పై ఘనవిజయం సాధించింది. దాంతో 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలవడంతో పాటు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. నేటి మ్యాచ్‌లో ముంబై రాకెట్స్‌తో హైదరాబాద్ హంటర్స్ తలపడుతుంది. -
మళ్లీ ఓడిన సింధు
సాక్షి, హైదరాబాద్: సొంత గడ్డపై హైదరాబాద్ హంటర్స్ ప్లేయర్ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది. మహిళల సింగిల్స్‌లో సింధు 15–11, 13–15, 9–15తో తై జు యింగ్ (బెంగళూరు రాప్టర్స్) చేతిలో ఓడింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) సీజన్–5లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ 0–3తో బెంగళూరు రాప్టర్స్ చేతిలో ఓడింది. తొలి గేమ్‌లో సత్తా చాటిన సింధు... తర్వాతి రెండు గేమ్‌ల్లో విఫలమై పరాజయం పాలైంది. తొలుత జరిగిన పురుషుల డబుల్స్‌లో బెన్ లేన్–వ్లాదిమిర్ ఇవనోవ్ (హైదరాబాద్) ద్వయం 13–15, 15–9, 12–15తో పెంగ్ సూన్ చాన్–రియాన్ అగుంగ్ సపుర్తో (బెంగళూరు) జోడీ చేతిలో ఓడింది. అనంతరం జరిగిన పురుషుల తొలి సింగిల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో ఆడిన హైదరాబాద్ ప్లేయర్ సౌరభ్ వర్మ 12–15, 15–10, 6–15తో బ్రైస్ లెవెర్డెజ్ (బెంగళూరు) చేతిలో ఓడాడు. పీబీఎల్ నిబంధనల ప్రకారం ‘ట్రంప్ కార్డు’ వాడిన ఆటగాడు ఓడితే... అతని జట్టుకు ఒక పాయింట్‌ను పెనాల్టీగా విధిస్తారు. దాంతో హైదరాబాద్ (–1)–2తో వెనుకబడింది. మిక్స్డ్ డబుల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో బరిలో దిగిన పెంగ్ సూన్ చాన్–యోమ్ హే వోన్ (బెంగళూరు) జోడీ 13–15, 11–15తో వ్లాదిమిర్ ఇవనోవ్–సిక్కిరెడ్డి (హైదరాబాద్) ద్వయం చేతిలో ఓడింది. చివరగా జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో డారెన్ లియూ (హైదరాబాద్) 11–15, 6–15 తో సాయి ప్రణీత్ (బెంగళూరు)చేతిలో ఓడాడు. -
సింధు వర్సెస్ తై జు యింగ్
-
క్రీడాకారులకు స్పాన్సర్లు అవసరం: సింధు
హైదరాబాద్: క్రీడాకారులు పెద్ద టోర్నీల్లో మెరుగ్గా రాణించేందుకు స్పాన్సర్ల ప్రోత్సాహం అవసరమని పద్మభూషణ్, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు వ్యాఖ్యానించింది. స్థానిక రాడిసన్ హోటల్లో గురువారం జరిగిన కార్యక్రమంలో సింధు అభిబస్.కామ్ ట్రెయిన్ టికెటింగ్ సరీ్వస్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నారులు క్రీడల్లోకి వస్తారు. కానీ వారు మరింత బాగా రాణించేందుకు స్పాన్సర్లు దోహదపడతారు. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తోన్న హైదరాబాద్ హంటర్స్ జట్టుకు అభిబస్ ప్రైవేట్ లిమిటెడ్ స్పాన్సర్‌గా వ్యవహరించడం అభినందనీయం’ అని ఆమె పేర్కొంది. అభిబస్ యాప్‌ను నెలకు 5 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారని సంస్థ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోహిత్ శర్మ అన్నారు. అభిబస్.కామ్, అభిబస్ మొబైల్ యాప్ ద్వారా బస్ టికెట్‌తో పాటు దేశంలోని ఏ స్టేషన్‌కైనా రైలు టికెట్‌ను బుక్ చేసుకునే వీలుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ హంటర్స్ జట్టు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి షూటింగ్ టోర్నీ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర షూటింగ్ చాంపియన్‌షిప్ గురువారం ప్రారంభమైంది. బిగ్ బోర్ ఈవెంట్లలో జరిగే ఈ టోర్నీని తెలంగాణ రైఫిల్ సంఘం అధ్యక్షుడు అమిత్ సంఘీ ప్రారంభించారు. ఈ పోటీలకు నూతనంగా ఏర్పాటైన షూటింగ్ రేంజ్ ఆతిథ్యమిచి్చంది. రంగారెడ్డి జిల్లా సంఘీనగర్‌లో కొత్తగా నిర్మించిన ‘అమన్ సంఘీ 300మీ. బిగ్ బోర్ షూటింగ్ రేంజ్’ ఈ పోటీలకు వేదికైంది. ఇక్కడ రెండు రోజుల పాటు జరిగే ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో దాదాపు 100 మంది షూటర్లు పాల్గొంటున్నారు. ఇందులో రాణించిన వారు ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు జరిగే సౌత్‌జోన్ టోర్నీలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తారు. సింధు వర్సెస్ తై జు యింగ్ ఇద్దరు ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణులు, కోర్టులో సమఉజ్జీలు... సింధు, తై జు యింగ్. వీరిద్దరి మధ్య జరిగే సమరంపై అందరికీ ఆసక్తే. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్ మెగా టోర్నీలో తై జు యింగ్‌పై గెలుపొంది సింధు వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో భాగంగా వీరిద్దరూ నేడు మరోసారి తలపడనున్నారు. గచ్చి»ౌలిలోని ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ బెంగళూరు రాప్టర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ ఆడుతుంది. హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాభిమానులంతా మహిళల సింగిల్స్‌లో భాగంగా ప్రపంచ ఆరో ర్యాంకర్ సింధు, వరల్డ్ రెండో ర్యాంకర్ తై జు యింగ్ మధ్య నగరంలో జరిగే మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. సింధు కూడా ఈ మ్యాచ్ కోసం సన్నద్ధంగా ఉన్నానని పేర్కొం ది. ‘తై జు యింగ్ తో ఆడటం ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది. అంత సులభంగా విజయం దక్కదు. శ్రమించాల్సి వస్తుంది. సొంత ప్రేక్షకుల మధ్య ఆడనుండటం నాకు కలిసొచ్చే అంశం. మా మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం. ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా’ అని సింధు వివరించింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన బెంగళూరు ఈ సీజన్లో వెనుకబడింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బెంగళూరు బరిలో దిగుతోంది. దీనిపై స్పందిస్తూ తై జు యింగ్ ‘ఈ మ్యాచ్‌లో గెలవడం మాకు చాలా ముఖ్యం. సింధుతో నేడు జరిగే మ్యాచ్ మిగతా మ్యాచ్‌ల కంటే విభిన్నంగా ఉంటుంది. పీబీఎల్ అంటే టీమ్ గేమ్. జట్టుగా ఆడాల్సి ఉంది’ అని పేర్కొంది. -
నేటి నుంచి హైదరాబాద్‌లో పీబీఎల్ సమరం
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో ఇప్పటి వరకు హైదరాబాద్ హంటర్స్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. తొలి పోరులో చెన్నై సూపర్‌స్టార్స్ చేతిలో ఓడిన ఆ జట్టు ఆ తర్వాత అవధ్ వారియర్స్‌పై నెగ్గింది. అయితే ఓవరాల్ పాయింట్లపరంగా చూస్తే 4 పాయింట్లతో ప్రస్తుతం చివరి స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు సొంతగడ్డపై ఆ జట్టు తమ మిగిలిన మ్యాచ్‌లు ఆడనుంది. నేటి నుంచి హైదరాబాద్ అంచె లీగ్ పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. నేటి మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో హంటర్స్ జట్టు ఆడుతుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల మద్దతుతో విజయాలు సాధించి లీగ్‌లో ముందంజ వేస్తామని హంటర్స్ టీమ్ ఆత్మవిశ్వాసంతో ఉంది. మిగిలిన పీబీఎల్ మొత్తం హైదరాబాద్‌లోనే కొనసాగనుంది. ఫిబ్రవరి 6 వరకు గ్రూప్ దశ మ్యాచ్‌లు, 7, 8 తేదీల్లో సెమీఫైనల్, 9న ఫైనల్ ఇక్కడే జరుగుతాయి. ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా... సొంత వేదికపై హైదరాబాద్ హంటర్స్ మిగిలిన మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో మంగళవారం టీమ్ మేనేజ్మెంట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా టీమ్ స్టార్ షట్లర్, వరల్డ్ చాంపియన్ పీవీ సింధు మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన చిన్న చిన్న పొరపాట్లను అధిగమిస్తామని వ్యాఖ్యానించింది. ‘రెండు మ్యాచ్‌లలో కూడా మా ప్రయత్నంలో లోపం లేదు. 100 శాతం శ్రమించాం. అయితే కొంత దురదృష్టం వెంటాడింది. ఇకపై ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వం. ఏ రకంగా చూసినా సొంత మైదానంలో ప్రేక్షకుల మద్దతు మాలో ఉత్సాహం పెంచుతుంది. అభిమానులు, సన్నిహితులు, మిత్రులు ఎంతో మంది మ్యాచ్‌లు చూడటానికి వస్తారు కాబట్టి ఆ వాతావరణం ప్రత్యేకంగా ఉంటుంది’ అని సింధు అభిప్రాయ పడింది. హైదరాబాద్‌కే చెందిన డబుల్స్ స్పెషలిస్ట్ నేలకుర్తి సిక్కి రెడ్డి కూడా హంటర్స్ తరఫునే బరిలోకి దిగుతోంది. ‘పీబీఎల్ ప్రారంభమైన నాటి నుంచి సొంత టీమ్ హైదరాబాద్ తరఫున ఆడాలనేది నా కల. అది నిజమైంది. ఇప్పుడు హైదరాబాద్‌లోనే మ్యాచ్‌లు ఆడబోతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది’ అని పేర్కొంది. ఈ కార్యక్రమంలో హంటర్స్ జట్టు స్పాన్సర్స్ ‘అభీబస్’ ఎండీ సుధాకర్ రెడ్డి, ఓరియంట్ సిమెంట్స్ ప్రతినిధి మనీశ్ దువా తదితరులు పాల్గొన్నారు. నష్టాలొచ్చినా సరే... నాలుగేళ్లుగా పీబీఎల్‌లో కొనసాగుతున్నాం. ఒక్కసారి కూడా లీగ్ ద్వారా ఆర్థికపరమైన లాభాలు కళ్లచూడలేదు. విజేతగా నిలిచిన ఏడాది మాత్రం పరిస్థితి కొంత మెరుగ్గా ఉండి బ్రేక్ ఈవెన్‌కు చేరువగా వచ్చాం. ఒక రకంగా నష్టమే తప్ప లాభం మాత్రం ఎప్పుడూ రాలేదు. అయితే మేం దీనికి సిద్ధం. ఆటపై అభిమానంతోనే ఇదంతా చేస్తున్నాం. ఎక్కడో అనసరమైన చోట పెట్టుబడి పెట్టే బదులు క్రీడల్లో ఉండటం మంచిది కదా. –వీఆర్కే రావు, హైదరాబాద్ హంటర్స్ టీమ్ యజమాని -
పరాజయంతో ప్రారంభం
చెన్నై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–5)లో భాగంగా సోమవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ 2–5తో చెన్నై సూపర్ స్టార్స్ జట్టు చేతిలో ఓడింది. సింధు మాత్రమే హైదరాబాద్ తరఫున గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–జెస్సికా (చెన్నై) జోడీ 15–6, 13–15, 15–13తో ఇవనోవ్ –సిక్కి రెడ్డి (హైదరాబాద్) జంటపై గెలిచింది. తొలి పురుషుల సింగిల్స్‌లో టామీ సుగియార్తో 15–11, 15–10తో సిరిల్ వర్మ (హైదరాబాద్)పై నెగ్గాడు. రెండో సింగిల్స్ చెన్నైకి ‘ట్రంప్’ మ్యాచ్ కాగా... ఇందులో లక్ష్యసేన్ 15–6, 13–15, 15–14తో ప్రియాన్షు (హైదరాబాద్)పై నెగ్గడంతో చెన్నైకు రెండు పాయింట్లు లభించాయి. దీంతో చెన్నై రెండు మ్యాచ్‌లు ఉండగానే 4–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. హంటర్స్ ‘ట్రంప్’ మ్యాచ్ అయిన మహిళల సింగిల్స్‌లో సింధు 15–5, 15–5తో గాయత్రిని ఓడించడంతో చెన్నై ఆధిక్యం 4–2కి తగ్గింది. అయితే పురుషుల డబుల్స్‌లో సాత్విక్–సుమిత్ రెడ్డి (చెన్నై) ద్వయం 15–14, 11–15, 15–8తో బెన్లెన్–సియాన్ వెండీ (హైదరాబాద్) జోడీపై నెగ్గడంతో చెన్నై 5–2తో విజయం సాధించింది. -
హైదరాబాద్‌లో పీబీఎల్ సెమీస్, ఫైనల్స్
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట బెంగళూరు అంచె పోటీలను (ఫిబ్రవరి 5 నుంచి 6 వరకు), అనంతరం 7, 8వ తేదీల్లో రెండు సెమీఫైనల్స్‌తో పాటు 9న జరిగే ఫైనల్ పోరును బెంగళూరులోని శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియంలో జరిగేలా షెడ్యూల్‌ను తయారు చేశారు. అయితే ఆ సమయంలో స్టేడియం అందుబాటులో ఉండడం లేదని... దాంతో అక్కడ మ్యాచ్‌లను నిర్వహించడం కష్టం అంటూ బెంగళూరు రాప్టర్స్ జట్టు గురువారం ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. దీంతో బెంగళూరు అంచె మ్యాచ్‌లతోపాటు సెమీఫైనల్స్, ఫైనల్‌ను హైదరాబాద్‌కు తరలిస్తూ పీబీఎల్ నిర్వాహకులు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే జరుగుతాయి. ఫలితంగా పీబీఎల్ తాజా సీజన్లో హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చే మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. మొదట హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఉండగా... ప్రస్తుతం అది ఫిబ్రవరి 9వ తేదీ వరకు పొడిగించారు. పీబీఎల్ ఐదో సీజన్ ఈ నెల 20న చెన్నై వేదికగా ప్రారంభమవుతుంది. 24 వరకు చెన్నైలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత జనవరి 25 నుంచి 28 వరకు లక్నో అంచె పోటీలు ఉంటాయి. -
పీబీఎల్‌కు శ్రీకాంత్ దూరం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో జరిగే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో పాల్గొనడం లేదని భారత స్టార్ షట్లర్ శ్రీకాంత్ ప్రకటించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌పై, ఇతర అంతర్జాతీయ టోర్నీల మీద మరింత దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నాడు. -
జనవరిలో పీబీఎల్ ఐదో సీజన్
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఎనిమిది ఫ్రాంచైజీల మధ్య పోరు వచ్చే జనవరి 20 నుంచి జరుగుతుంది. తొలి దశలో చెన్నై, ఢిల్లీ, లక్నో, బెంగళూరు నగరాల్లో పోటీలు నిర్వహిస్తారు. టైటిల్ పోరు ఫిబ్రవరి 9న జరుగుతుంది. భారత స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు సహా ప్రపంచ మేటి షట్లర్లు ఇందులో పాల్గొంటారు. భారత్ నుంచి సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్, సౌరభ్ వర్మ తదితరులు పాల్గొంటారు. మొత్తం టోర్నీ ప్రైజ్‌మనీ రూ.6 కోట్లు. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 3 కోట్లు అందజేస్తారు. ‘బ్యాడ్మింటన్‌లో భారత్ అనూహ్య ప్రగతిని సాధించింది. పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించి చరిత్రకెక్కితే... సాయిప్రణీత్ కాంస్యంతో 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో మరో పతకం సాకారమైంది. ప్రతిభగల షట్లర్లు నిలకడైన ప్రదర్శనతో అంతర్జాతీయ టోర్నీల్లో మెరుస్తున్నారు’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు హిమంత బిశ్వశర్మ అన్నారు. 21 రోజుల పాటు జరిగే ఈవెంట్‌ను ‘స్టార్ స్పోర్ట్స్’ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఆటగాళ్ల వేలం కార్యక్రమం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ‘బాయ్’ తెలిపింది. -
హంటర్స్‌కు తొలి ఓటమి
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో హైదరాబాద్ హంటర్స్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం అవధ్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ 1–4తో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో పీవీ సింధు (హైదరాబాద్) 13–15, 8–15తో బీవెన్ జాంగ్ చేతిలో ఓడిపోవడం గమనార్హం. మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–క్రిస్టియాన్సన్ (అవధ్) జోడీ 15–12, 9–15, 15–11తో కిమ్ సా రంగ్–ఎమ్ హై వన్ (హైదరాబాద్) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో మార్క్ కాల్జూ (హైదరాబాద్) 15–10, 7–15, 15–7తో లీ డాంగ్ కెయున్‌పై; సన్ వాన్ హో (అవధ్) 15–10, 15–11తో లీ హున్‌పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో ఇసారా–కిమ్ సా రంగ్ (హైదరాబాద్) 15–9, 15–13తో యాంగ్ లీ–క్రిస్టియాన్సన్ జంటపై గెలిచింది. మరో మ్యాచ్‌లో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ 4–3తో బెంగళూరు రాప్టర్స్పై నెగ్గింది. అహ్మదాబాద్ తరఫున మిక్స్డ్ డబుల్స్లోనేలకుర్తి సిక్కి రెడ్డి–సాత్విక్ సాయిరాజ్ ద్వయం... పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ, మహిళల సింగిల్స్‌లో క్రిస్టీ గిల్మోర్ గెలుపొందారు. శనివారం పుణే వేదికగా జరిగే మ్యాచ్‌ల్లో ముంబై రాకెట్స్‌తో పుణే సెవెన్ ఏసెస్; ఢిల్లీ డాషర్స్‌తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ తలపడతాయి. -
సింధు, హైదరాబాద్ సూపర్
ముంబై: భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు జోరు లీగ్‌లోనూ కొనసాగింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో తెలుగమ్మాయి సింధుతో పాటు హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. హైదరాబాద్ తరఫున తొలిసారి బరిలోకి దిగిన ఆమె మేటి ప్రత్యర్థి కరోలినా మారిన్‌పై పైచేయి సాధించింది. ప్రత్యక్ష వీక్షకులను, టీవీ ప్రేక్షకులను ఇలా అందరి కళ్లను ఆకట్టుకున్న మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో తెలుగమ్మాయి జయకేతనం ఎగురవేసింది. శనివారం జరిగిన తొలి పోరులో హైదరాబాద్ హంటర్స్ 6–(–1)తో పుణే సెవెన్ ఏసెస్‌పై ఘనవిజయం సాధించింది. నిజానికి సింధు బరిలోకి దిగకముందే హంటర్స్ విజయం ఖాయమైంది. అయితే ఒలింపిక్ చాంపియన్ మారిన్ తన పుణే జట్టుకు ఓదార్పునిచ్చేందుకు బరిలోకి దిగినా... సింధు జోరు ముందు తలవంచింది. కడదాకా హోరాహోరీగా జరిగిన పోరులో స్టార్ షట్లర్ సింధు 11–15, 15–8, 15–13తో మారిన్‌పై విజయం సాధించింది. ఆట ఆరంభంలో మొదట మారిన్ తన ‘పవర్’ చాటింది. దీంతో తొలిగేమ్ స్పెయిన్ స్టార్ వశమైంది. సింధు పదేపదే చేసిన అనవసర తప్పిదాలు కూడా మారిన్‌కు కలిసొచ్చాయి. కోర్టులో ఇద్దరు దీటుగా స్పందించినప్పటికీ మారిన్ షాట్లు పాయింట్లను తెచ్చిపెట్టాయి. తర్వాత రెండో గేమ్‌లో మాత్రం సింధు తన ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలివ్వలేదు. ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా కష్టపడిన ఆమె ఈ గేమ్‌లో మారిన్‌ను తొందరగానే ఓడించింది. ఇక చివరి గేమ్ మాత్రం అద్భుతంగా సాగింది. గెలుపు దశలో ఒక్కో పాయింట్ ఇద్దరికీ సమాన అవకాశాలిచ్చింది. మ్యాచ్ ముగిసేదశలో ఇద్దరు పిడికిలి బిగించారు. 13–13 స్కోరుదాకా దోబూచులాడిన విజయం చివరకు తెలుగు తేజం వరుసగా రెండు పాయింట్లు గెలవడంతో సింధు పక్షాన నిలిచింది. మొదట జరిగిన పురుషుల సింగిల్స్ తొలి పోటీలో మార్క్ కాల్జో (హంటర్స్) 10–15, 15–12, 15–14తో లక్ష్య సేన్‌పై గెలిచి హైదరాబాద్‌ను 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. పురుషుల డబుల్స్‌ను పుణే ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. కానీ ఇక్కడా నిరాశ తప్పలేదు. కిమ్ సా రంగ్– బొదిన్ ఇసార (హంటర్స్) ద్వయం 13–15, 15–10, 15–13తో చిరాగ్ శెట్టి–మథియాస్ బొయె జంటపై గెలువడంతో స్కోరు మైనస్ పాయింట్‌కు చేరింది. రెండో పురుషుల సింగిల్స్‌ను హైదరాబాద్ ట్రంప్‌గా ఎంచుకొని బరిలోకి దిగింది. లీ హ్యూన్ ఇ (హంటర్స్) 15–14, 15–12తో బ్రిస్ లెవర్డెజ్‌ను చిత్తు చేశాడు. సింధు, మారిన్‌ల మ్యాచ్ తర్వాత చివరగా జరిగిన మిక్స్డ్ డబుల్స్ పోరులో ఇయోమ్ హ్యే వోన్– కిమ్ సా రంగ్ (హంటర్స్) జోడీ 15–14, 15–11తో వ్లాదిమిర్ ఇవనోవ్–లైన్ జాయెర్స్‌ఫెల్డ్ జంటపై గెలిచింది. నేడు (ఆదివారం) జరిగే పోటీల్లో ముంబై రాకెట్స్‌తో ఢిల్లీ డాషర్స్, అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ తలపడతాయి. -
పీబీఎల్ చాంప్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై, సొంత ప్రేక్షకుల మధ్య హైదరాబాద్ హంటర్స్ గర్జించింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్లో విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో హైదరాబాద్ 4–3 స్కోరుతో బెంగళూరు బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. మొదట పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో మార్కిస్ కిడో– యూ ఇయాన్ సియాంగ్ (హంటర్స్) 9–15, 10–15తో మథియాస్ బోయె– కిమ్ సా రంగ్ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్ హంటర్స్‌కు ట్రంప్ మ్యాచ్ కాగా లీ హ్యూన్ ఇల్ 15–7, 15–13తో శుభాంకర్ డేపై గెలుపొందడంతో హైదరాబాద్ 2–1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది అయితే తర్వాత రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ను బెంగళూరు ట్రంప్‌గా ఎంచుకుంది. ఈ పోరులో సాయిప్రణీత్ (హంటర్స్) 8–15, 10–15తో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో హైదరాబాద్ 2–3తో వెనుకబడింది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌లో ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ (హంటర్స్) 15–8, 15–14తో గిల్మోర్‌పై గెలుపొందడంతో స్కోరు 3–3తో సమమైంది. ఈ దశలో కీలకమైన మిక్స్డ్ డబుల్స్‌లో పియా జెబదియా–సాత్విక్ సాయిరాజ్ (హంటర్స్) 15–11, 15–12తో సిక్కిరెడ్డి–కిమ్ సా రంగ్‌పై విజయం సాధించడంతో హైదరాబాద్ పీబీఎల్‌లో తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. -
సింధు గెలిపించింది
చెన్నై: సింగిల్స్‌తో పాటు నిర్ణాయక మిక్స్డ్ డబుల్స్ పోరులోనూ చెమటోడ్చిన సింధు చెన్నై స్మాషర్స్‌ను గెలిపించింది. దీంతో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–3)లో చెన్నై రెండో విజయం సాధించింది. సొంతగడ్డపై శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 2–1తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌పై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో క్రిస్ అడ్కాక్–యంగ్ లీ (చెన్నై) 13–15, 12–15తో లీ చన్ హీ–నందగోపాల్ (అహ్మదాబాద్) చేతిలో ఓడగా, మహిళల సింగిల్స్‌లో సింధు 15–11, 10–15, 15–12తో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (అహ్మదాబాద్)పై గెలిచింది. చెన్నై పురుషుల సింగిల్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో లెవెర్డెజ్ 15–12, 14–15, 12–15తో సౌరభ్ వర్మ చేతిలో కంగుతిన్నాడు. మరో సింగిల్స్ అహ్మదాబాద్‌కు ‘ట్రంప్’ కాగా... తనోంగ్సక్ (చెన్నై) 15–10, 12–15, 15–14తో ప్రణయ్‌పై గెలుపొందాడు. స్కోరు 1–1తో సమంగా నిలిచిన ఈ దశలో సుమిత్ రెడ్డితో కలిసి సింధు మిక్స్డ్ డబుల్స్‌లో అమీతుమీకి సిద్ధమైంది. ఇందులో చెన్నై జోడీ 15–14, 15–13తో లీ చన్ హీ–కమిల్లా రైటర్ జంటను ఓడించి జట్టును గెలిపించింది. నేడు జరిగే పోరులో హైదరాబాద్ హంటర్స్‌తో అవధ్ వారియర్స్ తలపడుతుంది. -
బెంగళూరుకు షాక్
చెన్నై: పీబీఎల్‌లో ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అసాధారణ ఆటతీరు కనబరిచిన బెంగళూరు బ్లాస్టర్స్‌కు నార్త్ ఈస్టర్న్ వారియర్స్ షాకిచ్చింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ మూడో సీజన్లో శుక్రవారం జరిగిన పోరులో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ 3–2తో బ్లాస్టర్స్‌ను కంగుతినిపించింది. రెండు ట్రంప్ మ్యాచ్‌ల విజయంతో వారియర్స్ మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. టోర్నీలో హ్యాట్రిక్ పరాజయాల తర్వాత బోణీకొట్టింది. మొదట పురుషుల డబుల్స్‌లో మథియాస్ బోయె–కిమ్ సా రంగ్ (బ్లాస్టర్స్) ద్వయం 15–12, 7–15, 15–12తో కిమ్ జి జంగ్–షిన్ బెక్ చియోల్ (వారియర్స్) జోడీపై గెలిచి బెంగళూరుకు శుభారంభాన్నిచ్చింది. అయితే పురుషుల సింగిల్స్‌ను ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకున్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో కోలుకోలేకపోయింది. అజయ్ జయరామ్ (వారియర్స్) 15–8, 15–13తో చోంగ్ వీ ఫెంగ్ (బ్లాస్టర్స్)ను కంగుతినిపించాడు. దీంతో 1–0తో ఉన్న బెంగళూరు 0–1 స్కోరుతో వెనుకబడింది. తర్వాత మహిళల సింగిల్స్ నార్త్ ఈస్టర్న్‌కు ట్రంప్ మ్యాచ్ కాగా... ఇందులో మిచెల్లీ లీ (వారియర్స్) 7–15, 15–14, 15–13తో గిల్మోర్ (బ్లాస్టర్స్)పై గెలవడంతో బెంగళూరు 0–3తో పరాజయాన్ని ఖాయం చేసుకుంది. తర్వాత అక్సెల్సన్ (బ్లాస్టర్స్) 9–15, 15–13, 15–14తో వాంగ్ జు వే (వారియర్స్)పై గెలుపొందగా... మిక్స్డ్ డబుల్స్‌లో మను అత్రి–సిక్కిరెడ్డి జోడి 12–15, 15–8, 15–9తో షిన్ బెక్ చియోల్–ప్రజక్తా సావంత్ జంటపై గెలిచింది. నేడు జరిగే పోరులో చెన్నై స్మాషర్స్‌తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ తలపడుతుంది. -
ప్రణయ్ పంట పండింది!
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్ కోసం జరిగిన వేలంలో హెచ్ఎస్ ప్రణయ్ జాక్‌పాట్ కొట్టాడు. సీజన్–2లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అజేయంగా నిలవడంతో పాటు గత ఏడాది కాలంలో ఉత్తమ ప్రదర్శనతో వేగంగా దూసుకొచ్చిన ప్రణయ్‌ను కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ పెద్ద మొత్తంతో సొంతం చేసుకుంది. ప్రణయ్‌కు వేలంలో రూ. 62 లక్షలు దక్కాయి. గత సీజన్లో ప్రణయ్‌కు రూ. 25 లక్షలు మాత్రమే లభించాయి. ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా గత ఏడాది చెల్లించిన మొత్తానికి అదనంగా 25 శాతం ఇస్తూ స్టార్ ఆటగాళ్లను వివిధ జట్లు అట్టి పెట్టుకున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్ రూ. 48.75 లక్షలకు సింధును, అవధ్ వారియర్స్ రూ. 41.25 లక్షలకు సైనా నెహ్వాల్‌ను కొనసాగించగా...పురుషుల టాప్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కోసం అవధ్ రూ. 56.10 లక్షలు వెచ్చించింది. రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ కోసం రూ. 50 లక్షలు ఖర్చు చేసి హైదరాబాద్ హంటర్స్ తమతోనే ఉంచుకుంది. పురుషుల విభాగంలో వరల్డ్ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ను అతని పాత జట్టు బెంగళూరు బ్లాస్టర్స్ రూ. 50 లక్షలతో కొనసాగించగా...లీగ్‌లోకి తొలిసారి అడుగు పెట్టిన మహిళల వరల్డ్ నంబర్‌వన్ తై జు యింగ్ కోసం కూడా కొత్త టీమ్ అహ్మదాబాద్ రూ. 52 లక్షలు చెల్లించింది. మరో సింగిల్స్ స్టార్ అజయ్ జయరామ్ కొత్త జట్టు నార్త్ ఈస్టర్స్ వారియర్స్‌కు (రూ.44 లక్షలు) వెళ్లాడు. గతంతో పోలిస్తే ఈ సారి అనూహ్యంగా డబుల్స్ స్పెషలిస్ట్‌లకు కూడా భారీ మొత్తం పలకడం మరో విశేషం. వేలంలో ప్రతీ జట్టు గరిష్టంగా పదేసి మంది షట్లర్లను ఎంచుకుంది. ఇందు కోసం నిర్దేశించిన రూ. 2.40 కోట్ల గరిష్ట మొత్తంలో అత్యధికంగా హైదరాబాద్ హంటర్స్ రూ. 2.39 కోట్లను ఖర్చు చేసింది. డిసెంబర్ 22నుంచి జనవరి 14 వరకు పీబీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం రూ. 6 కోట్ల ప్రైజ్‌మనీలో విజేతకు రూ. 3 కోట్లు లభిస్తాయి. సోమవారం జరిగిన వేలం కార్యక్రమంలో పీబీఎల్ డైరెక్టర్ ప్రసాద్ మంగినపూడి, ‘బాయ్’ కార్యదర్శి (టోర్నమెంట్స్) కేసీ పున్నయ్య చౌదరి, ఫ్రాంచైజీ యజమానులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ కే మారిన్..
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్) మూడో సీజన్ వేలంలో స్పెయిన్ స్టార్, ప్రపంచ నాల్గో ర్యాంకర్ కరోలినా మారిన్ ను హైదరాబాద్ హంటర్స్ మరోసారి దక్కించుకుంది. ఆమెకు రూ.50 లక్షలు వెచ్చించి మారిన్ ను కాపాడుకుంది. మరొకవైపు రూ.52 లక్షలతో మహిళల సింగిల్స్ నంబర్‌వన్ క్రీడాకారిణి తై జు యింగ్‌ను అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ కైవసం చేసుకుంది. కాగా, భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్పను రూ.20లక్షలు వెచ్చించి ఢిల్లీ ఏసర్స్ దక్కించుకుంది. ఇక వరల్డ్ నంబర్ టూ పీవీ సింధును చెన్నై స్మాషర్స్ రూ. 48 లక్షల 75 వేలతో నిలుపుకుంది. మరొకవైపు సైనా నెహ్వాల్ కు 41 లక్షల 25 వేలతో అవేథ్ వారియర్స్ అట్టేపెట్టుకుంది. ఇక కిడాంబి శ్రీకాంత్ కు రూ.56 లక్షల 10 వేలతో అవేథ్ వారియర్స్ దక్కించుకుంది. గతేడాది వేలంలో శ్రీకాంత్ కు రూ.51లక్షల దక్కగా, ఈసారి దాదాపు పదిశాతం అధికంగా దక్కడం విశేషం. పురుషుల వరల్డ్ నంబర్ వన్ విక్టర్ అలెక్సన్ ను రూ. 50 లక్షలతో బెంగళూరు బ్లాస్టర్స్ కైవసం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంఛైజీలు పాల్గొన్నాయి. ఇందులో 133 మంది స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. దీనిలో భాగంగా రూపొందించిన మోస్ట్ ఐకానిక్ ప్లేయర్స్ లిస్ట్ లోభారత్ నుంచి కిడాంబి శ్రీకాంత్ ,పీవీ సింధు, సైనా నెహ్వాలకు చోటు లభించింది. -
వచ్చే ఏడాది ఎనిమిది జట్లు!
సాక్షి, హైదరాబాద్: క్రీడాభిమానులను ఈ సీజన్లో విశేషంగా ఆకట్టుకున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)ను మరింత విస్తరించాలని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్), పీబీఎల్ నిర్వాహకులు స్పోర్‌ట్సలైవ్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జట్ల సంఖ్యను ఆరునుంచి ఎనిమిదికి పెంచనున్నారు. రెండు నగరాల కోసం ప్రస్తుతం కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్‌ల మధ్య పోటీ నెలకొంది. టోర్నమెంట్‌ను ఈ సంవత్సరం పక్షం రోజులపాటు నిర్వహించగా, దానికి అదనంగా మరో పది రోజులు పెంచాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. అదే జరిగితే డిసెంబర్ 20 నుంచి పీబీఎల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇటీవలే జనవరి 1నుంచి 15 వరకు జరిగిన పీబీఎల్ 2కు అద్భుత ఆదరణ లభించిందని స్పోర్ట్స లైవ్ డెరైక్టర్ ప్రసాద్ మంగిపూడి ప్రకటించారు. ఇదే కారణంగా దేశవ్యాప్తంగా వివిధ నగరాలనుంచి పలువురు ప్రముఖులు లీగ్‌లో భాగం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. తమ టోర్నీ విజయవంతం కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఐదు వేదికల్లోనూ స్టేడియంలకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స తరలి రాగా, టెలివిజన్‌లో ఈ టోర్నీని 3.2 కోట్ల మంది వీక్షించినట్లు ప్రసాద్ వెల్లడించారు. మరో వైపు ఈ ఏడాది పీబీఎల్ అనేక మంది ప్రతిభావంతులను వెలుగులోకి తెచ్చిందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా సాత్విక్ సారుురాజ్, చిరాగ్ శెట్టిలాంటి కుర్రాళ్ల ఆట ప్రపంచానికి తెలిసిందని ఆయన అభిప్రాయపడ్డారు. రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ రావడం వల్ల ఈ టోర్నీకి కళ పెరిగిందనే విషయాన్ని ఆయన అంగీకరించారు. కొంత మంది చైనా షట్లర్లు కూడా ఆసక్తి చూపించినా వేర్వేరు కారణాలతో వారు పాల్గొనలేదని, వచ్చే ఏడాది కచ్చితంగా పీబీఎల్‌లో భాగం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతా ఊహించినట్లే సింధు, సైనా మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగిందని, టోర్నీలో ఎక్కువ మంది ఇదే మ్యాచ్‌ను చూసేందుకు ఆసక్తిని కనబర్చారని గోపీ విశ్లేషించారు. -
తొలి టైటిల్ లక్ష్యంగా సైనా బరిలోకి
సారావాక్ (మలేసియా): ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రూపంలో కావాల్సినంత ప్రాక్టీస్ పొందిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది తొలి టైటిల్‌పై గురి పెట్టింది. మంగళవారం మొదలయ్యే మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతోపాటు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోటీలు జరుగుతాయి. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా క్వాలిఫయర్‌తో ఆడుతుంది. సైనాతోపాటు మరో తెలుగు అమ్మాయి శ్రీకృష్ణప్రియ నేరుగా మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగింది. తొలి రౌండ్లో జిన్ వీ గో (మలేసియా)తో శ్రీకృష్ణప్రియ తలపడుతుంది. ఇతర స్టార్ క్రీడాకారిణుల గైర్హాజరీలో... పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించే క్రమంలో ఉన్న సైనా తన స్థారుుకి తగ్గ ఆటతీరు కనబరిస్తే ఈ టోర్నీలో విజేతగా నిలిచే అవకాశముంది. పురుషుల సింగిల్స్ విభాగంలో అజయ్ జయరామ్, రాహుల్ యాదవ్, సిరిల్ వర్మ, ఆదిత్య జోషి, ప్రతుల్ జోషి, అభిషేక్, హర్షీల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; కోనా తరుణ్-ఫ్రాన్సిస్; అర్జున్-రామచంద్రన్; సాత్విక్ -చిరాగ్ శెట్టి జోడీలు పోటీపడుతున్నాయి. -
చెన్నై స్మాషర్స్దే టైటిల్
ఢిల్లీ: ప్రీమియర్ లీగ్ బ్యాడ్మింటన్(పీబీఎల్) -2017టైటిల్‌ను చెన్నై స్మాషర్స్ కైవసం చేసుకుంది. నగరంలో శనివారం జరిగిన తుదిపోరులో చెన్నై స్మాషర్స్ 4-3 తేడాతో ముంబై రాకెట్స్‌ను ఓడించి టైటిల్ ను చేజిక్కించుకుంది. మహిళల సింగిల్స్ లో చెన్నై స్మాషర్స్ క్రీడాకారిణి పివి సింధు 11-8, 11-8 తేడాతో సంగ్ జి హ్యూన్ పై గెలిచి ఆ జట్టు టైటిల్ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది. అంతకుముందు పురుషుల డబుల్స్ క్రిస్ అడ్కాక్-గాబ్రియల్ అడ్కాక్ జంట 11-9,11-6 తేడాతో నిపిట్‌ఫోన్-నడిజ్డా జీబా ద్వయం గెలిచింది. ఇది చెన్నై స్మాషర్స్ కు ట్రంప్ మ్యాచ్ కావడంతో ఆ జట్టు 2-0 ఆధిక్యం సాధించింది. అనంతరం సింధు మ్యాచ్‌ను గెలవడంతో చెన్నై ముందుకు దూసుకుపోయింది. అయితే ఆ తరుణంలో ముంబై తన ట్రంప్ మ్యాచ్‌లో విజయం సాధించి చెన్నై ఆధిక్యాన్ని 3-2కు తగ్గించింది. ఆ తరువాత ముంబై రాకెట్స్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ 11-4, 8-11,11-8 తేడాతో పారుపల్లి కశ్యప్‌ను ఓడించి స్కోరును 3-3 తో సమం చేశాడు. కాగా, ముంబై రాకెట్స్ ఆటగాడు అజయ్ జయరామ్, చెన్నై స్మాషర్స్ ఆటగాడు తనోంగ్సాక్ల మధ్య ఫలితం కోసం జరిగిన పోరు ఆసక్తిగా సాగింది. ఇరువురు ఆటగాళ్లు ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. ఈ పోరులో తనోంగ్‌సాక్ 9-11, 11-7,11-3 తేడాతో అజయ్ జయరామ్‌ను ఓడించాడు. దాంతో చెన్నై స్మాషర్స్ 4-3 తేడాతో గెలిచి టైటిల్ ను సొంతం చేసుకుంది. -
ముగిసిన సందడి...
-
‘షటిల్’ సందడి
-
సైనా, సింధులను ఓడించాలంటే..
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్)లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పివి సింధులను ఓడించడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హైదరాబాద్ హంటర్స్ తరపున ఆడుతున్న కరోలినా మారిన్ స్పష్టం చేసింది. భారత్ కు చెందిన ఆ ఇద్దరు అత్యుత్తమ క్రీడాకారిణుల్ని ఓడించాలంటే తాను మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉందని మారిన్ తెలిపింది. తన పూర్తిస్థాయి ఆటను ప్రదర్శిస్తేనే వారిపై గెలుపు సాధ్యమని అభిప్రాయపడింది. 'సైనా, సింధు ఎవర్నీ తన ప్రత్యర్థి ఎంచుకున్నా వారిపై గెలవడం అంత సులభం కాదు. ఆ ఇద్దరూ కఠినమైన ప్రత్యర్థులే కాదు.. చాలా పోటీతత్వం ఉన్న క్రీడాకారిణులు. వారిని ఓడించాలంటే నా అత్యుత్తమ ఆటన ప్రదర్శించాల్సి ఉంది ' అని మారిన్ పేర్కొంది. పీబీఎల్ -2017 ఆరంభ వేడుకలు ఈరోజు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. పీబీఎల్ రెండో సీజన్ లో ఆరు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఢిల్లీ ఏసర్స్, అవేధ్ వారియర్స్, ముంబై రాకెట్స్, హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ ,చెన్నై స్మాషర్స్ ప్రాంఛైజీలు తలపడనున్నాయి. అయితే చెన్నై స్మాషర్స్-హైదరాబాద్ హంటర్స్ మధ్య నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి గం.6.30 ని.లకు తొలి మ్యాచ్ జరుగనుంది. దీనిలో భాగంగా చెన్నై స్మాషర్స్ క్రీడాకారిణి పివి సింధు, హైదరాబాద్ హంటర్స్ క్రీడాకారిణి మారిన్‌ల మధ్య మ్యాచ్ జరగనుంది. రియో ఒలింపిక్స్ లో సింధును మారిన్ ఓడిస్తే, వరల్డ్ సూపర్ సిరీస్ టోర్నీలో మారిన్‌ను సింధు ఓడించింది. దాంతో వీరిద్దరి మధ్య జరుగుతున్న మరో మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.