
ట్రంప్ మ్యాచ్ కోచ్‌లకు సవాల్
► పీబీఎల్‌పై శ్రీకాంత్ వ్యాఖ్య.
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్తగా ప్రవేశపెట్టిన ట్రంప్ మ్యాచ్ నిబంధన కోచ్‌లకు సవాల్‌గా నిలుస్తుందని కిదాంబి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ఇది జట్టు ఫలితాలను ఏ రీతిలోనైనా ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నాడు. ‘ఇలాంటి నిబంధనలతో మేమిప్పటిదాకా మ్యాచ్‌లు ఆడలేదు. చాలా ఉత్సుకతగా ఉంది. దీనికోసం చాలా వ్యూహాలు రచించాల్సి ఉంది. ఏ కోచ్‌కైనా ఈ నిబంధన సవాల్‌గానే ఉండబోతోంది’ అని తమ జట్టు బెంగళూరు టాప్ గన్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాంత్ తెలిపాడు.