కిలాడీ కుమార్ తో సెల్ఫీ
హైదరాబాద్: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బాలీవుడ్ అగ్రతారలతో సెల్ఫీలు మీద సెల్ఫీలు దిగుతోంది. తాజాగా అక్షయ్ కుమార్ తో సెల్ఫీ తీసుకుని ట్విటర్ లో పోస్టు చేసింది. ఫిటెస్ట్ కిలాడీ కుమార్ తో ఫొటో దిగడం ఎంతో సంతోషంగా ఉందని, ఆయన నటించిన 'ఎయిర్ లిఫ్ట్' సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ట్వీట్ చేసింది.
దీనిపై అక్షయ్ కుమార్ స్పందించాడు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) లీగ్ లో పాల్గొంటున్న సైనాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. పీబీఎల్ లో బెస్ట్ టీమ్ టైటిల్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. పీబీఎల్ కు అక్షయ్ కుమార్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. క్రికెట్ లా బ్యాడ్మింటన్ కు ఆదరణ పెంచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని అక్షయ్ తెలిపాడు.
కాగా, అంతకుముందు షారూఖ్ ఖాన్, కాజోల్ తో పాటు 'దిల్ వాలే' సినిమా యూనిట్ తో సైనా నెహ్వాల్ సెల్ఫీలు దిగి ట్విటర్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.