హంటర్స్ చీఫ్ కోచ్‌గా ఫెర్నాండో రివస్ | fernando rivas as coach of hyderabad hunters in pbl | Sakshi
Sakshi News home page

హంటర్స్ చీఫ్ కోచ్‌గా ఫెర్నాండో రివస్

Published Mon, Dec 19 2016 12:05 PM | Last Updated on Fri, Sep 7 2018 4:33 PM

హంటర్స్ చీఫ్ కోచ్‌గా ఫెర్నాండో రివస్ - Sakshi

హంటర్స్ చీఫ్ కోచ్‌గా ఫెర్నాండో రివస్

హైదరాబాద్: రియో ఒలింపిక్స్ చాంపియన్లు కరోలినా మారిన్, వీ కియాంగ్ తాన్‌లతో కూడిన హైదరాబాద్ హంటర్స్ జట్టు... మరో దిగ్గజ కోచ్ రాకతో పటిష్టంగా మారింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్‌లో హైదరాబాద్ హంటర్స్‌కు చీఫ్ కోచ్‌గా ఫెర్నాండో రివస్... కోచ్‌గా రాజేంద్ర జక్కంపూడి వ్యవహరించనున్నట్లు జట్టు యాజమాన్యం ఆదివారం ప్రకటించింది. జూనియర్, సీనియర్ స్థాయిలో అపార అనుభవమున్న రివస్ రాకతో తమ జట్టు  దుర్భేద్యంగా మారిందని హైదరాబాద్ హంటర్స్ గ్రూప్ సీఈవో శ్యామ్ పేర్కొన్నారు.

 

ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్‌కు ఆయన గురువు. ఆమె చాంపియన్‌గా ఎదగడంలో ఫెర్నాండో కీలకంగా వ్యవహరించారు. ఈ సీజన్ హైదరాబాద్ హంటర్స్ జట్టులో బి. సాయి ప్రణీత్, సమీర్ వర్మ, రాజీవ్, కరోలినా మారిన్, కృష్ణ ప్రియ, వీ కియాంగ్ తాన్, సాత్విక్ సాయిరాజ్, చౌ హో వా, మేఘన ఉన్నారు. జనవరి 1నుంచి పీబీఎల్ పోటీలు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement