హైదరాబాద్‌ గెలుపు | Hyderabad Hunters Win Against Mumbai Rockets In PBL | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ గెలుపు

Feb 3 2020 2:18 AM | Updated on Feb 3 2020 2:18 AM

Hyderabad Hunters Win Against Mumbai Rockets In PBL - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ 4–3తో ముంబై రాకెట్స్‌పై గెలి చింది. తొలుత జరిగిన పురుషుల డబుల్స్, పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో ఓడి 0–3తో వెనుకబడ్డ హైదరాబాద్‌కు సింధు తన విజయంతో ఊరట కలిగించింది. మహిళల సింగిల్స్‌లో సింధు 15–5, 15–10తో శ్రేయాన్షి (ముంబై)పై గెలిచింది. ఇందులో సింధు ‘ట్రంప్‌ కార్డు’తో ఆడటంతో జట్టుకు రెండు పాయింట్లు లభించాయి.

అనంతరం పురుషుల రెండో సింగిల్స్‌లో ప్రియాన్షు (హైదరాబాద్‌) 15–13, 15–9తో లీ డాంగ్‌ కెయున్‌ (ముంబై)పై సంచలన విజయం సాధించడంతో... ఇరు జట్ల స్కోర్లు 3–3తో సమం అయ్యాయి. ఇక విజేతను నిర్ణయించే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఇవనోవ్‌–సిక్కి రెడ్డి (హైదరాబాద్‌) ద్వ యం 15–8, 15–8 కిమ్‌ స రంగ్‌–పియా జెబదియా (ముంబై) జోడీపై గెలుపొంది హైదరాబాద్‌ను విజేతగా నిలిపింది. సిక్కి రెడ్డికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌’ అవార్డు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement