న్యూఢిల్లీ: స్టార్ ఆటగాళ్లున్నా... ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో బెంగళూరు టాప్‌గన్స్ జట్టు ఖాతాలో మరో ఓటమి చేరింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు టాప్ గన్స్‌పై ఢిల్లీ ఏసర్స్ జట్టు విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో అజయ్ జయరామ్ (ఢిల్లీ) 15-11, 15-12తో సమీర్ వర్మ (బెంగళూరు)పై గెలిచాడు. దాంతో ఢిల్లీ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
‘ట్రంప్ మ్యాచ్’ పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో కూ కీట్ కీన్-తాన్ బూన్ హింగ్ (ఢిల్లీ) ద్వయం 15-9, 15-10తో హూన్ థిన్ హౌ-ఖిమ్ వా లిమ్ (బెంగళూరు) జోడీపై నెగ్గింది. దాంతో ఢిల్లీ ఆధిక్యం 3-0కు చేరుకుంది. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో రాజీవ్ ఉసెఫ్ (ఢిల్లీ) 4-15, 15-11, 15-9తో ప్రపంచ పదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ (బెంగళూరు)పై సంచలన విజయం సాధించ ాడు.
దాంతో ఢిల్లీ 4-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ లీగ్‌లో బెంగళూరు జట్టుకిది నాలుగో పరాజయం కావడం గమనార్హం. దాంతో మిక్స్‌డ్ డబుల్స్, మహిళల సింగిల్స్ మ్యాచ్‌లు నామమాత్రమయ్యాయి. శనివారం జరిగే మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ జట్టు తలపడుతుంది.
బెంగళూరుకు మరో ఓటమి
Published Sat, Jan 9 2016 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM
Advertisement
Advertisement