అమ్మాయిలూ...జాగ్రత్త! | Puriyatha Puthir Movie will release in this month | Sakshi
Sakshi News home page

అమ్మాయిలూ...జాగ్రత్త!

Published Sat, Nov 5 2016 6:25 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

అమ్మాయిలూ...జాగ్రత్త!

అమ్మాయిలూ...జాగ్రత్త!

ప్రపంచమంతా టెక్నాలజీమయం. ఇందులో ప్లస్సులూ.. మైనస్సులూ ఉన్నాయి. ప్రతిరోజూ ప్రపంచంలో ఏదో మూలన ఏదొక సరికొత్త టెక్నాలజీ ప్రజలకు పరిచయమవుతోంది. అటువంటి ఓ ఆధునిక టెక్నాలజీ పేరుతో అమాయకపు మహిళలు, అమ్మాయిలను  కొందరు యువకులు ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఓ సామాజిక సమస్య నేపథ్యంలో రూపొందిన తమిళ చిత్రం ‘పురియాద పుదిర్’. అంటే.. ‘అర్థం కాని చిక్కుముడి’ అని అర్థం. ‘పిజ్జా’ ఫేం విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా నటించారు.

రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘పిజ్జా-2’ పేరుతో డీవీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేశ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. త్వరలో ట్రైలర్, పాటల్ని విడుదల చేయనున్నారు. ‘‘ఆద్యంతం ఉత్కంఠను కలిగిస్తూ, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. ఇదే నెలలో తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని డి. వెంకటేశ్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శామ్ సి.ఎస్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement