
విజయ్ సేతుపతి, గాయత్రి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉండగా తాజాగా ‘ఫిలిమ్’ పేరుతో మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ రాబోతోంది. విజయదశమి ముందు లాంచ్ కానున్న ఈ ఫిలిమ్ ఓటీటీలో విడుదల కానున్న తొలి చిత్రం విజయ్ సేతుపతి నటించిన ‘పిజ్జా 2’. ‘‘ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 13న విడుదలైంది. అయితే సినిమా రిలీజైన వెంటనే లాక్ డౌన్ మొదలయింది. దీంతో ఈ చిత్రాన్ని ఇప్పుడు ఫిలిమ్ ఓటీటీలో నేరుగా విడుదల చేస్తున్నాం. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ‘పిజ్జా 2’ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత డి. వెంకటేష్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గాయత్రి కథానాయికగా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment