Over-the-top
-
ఓటీటీ.. బంపర్ హిట్
డిజిటల్ స్ట్రీమింగ్ మీడియా సేవల (ఓటీటీ) ముందు నేడు సినిమా థియేటర్లు, టీవీలు చిన్నవైపోతున్నాయి. ప్రేక్షకుల సందడి లేక థియేటర్లు వెలవెలబోతుంటే.. వీక్షకులను కాపాడుకునేందుకు టీవీ చానళ్లు తంటాలు పడుతున్నాయి. వీటికి అందనన్నట్టుగా ఓటీటీ వేదికలు ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకుపోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోస్టార్, యూట్యూబ్, జీ5, సోనీలివ్, ఆహా.. ఇలా ఓటీటీల జాబితా చాలా పెద్దదే. ఓటీటీ సేవలకు 4జీ టెలికం ఊతమిస్తే.. కరోనా విపత్తు ప్రేక్షకులకు మరింత చేరువ చేసిందని చెప్పుకోవాలి. బాహుబలుల కుస్తీపట్లకు వేదికైన ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్’ (డబ్ల్యూడబ్ల్యూఈ) షోలకు అమెరికా తర్వాత ఎక్కువ మంది వీక్షకులు ఉన్నది భారత్‌లోనేనని నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ వెల్లడించారు. డబ్ల్యూడబ్ల్యూఈకి చెందిన రా, ఎన్ఎక్స్టీ, స్మాక్‌డౌన్ ఇలా ప్రతి ఫార్మాట్‌కు సంబంధించి షోలు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. 2019లోనే డబ్ల్యూడబ్ల్యూఈ ఫార్మాట్లను భారత్‌లో 5 కోట్ల మంది యూజర్లు వీక్షించడం గమనార్హం. చేతిలో స్మార్ట్‌టీవీ మాదిరిగా ఓటీటీ పరిశ్రమ విస్తరిస్తోంది. విస్తరణ వ్యూహాలు.. అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ‘శివరాపల్లి’ వెబ్‌సిరీస్ అదరగొడుతోంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ షోలలో ‘పంచాయత్’ ఒకటి. మొదట హిందీలో వచ్చిన ఈ షో ఆ తర్వాత తమిళంలోకి ‘తలైవెట్టియాన్ పాళయం’పేరుతో అనువదించగా, అక్కడా దుమ్ము దులుపుతోంది. ఆ తర్వాత శివరాపల్లి పేరుతో గత నెలలో విడుదలై క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు 8,500 టైటిళ్లను ఆఫర్ చేస్తోంది. కొత్తగా విడుదలైన సినిమాలను వేగంగా ప్రైమ్‌లోకి తీసుకొచ్చేందుకు ఎంత చెల్లించడానికైనా వెనుకాడడం లేదు. సెలబ్రిటీ షోల విషయంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. సోనీ లివ్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’, ‘రాకెట్ బోయ్స్’, షార్క్ ట్యాంక్ ఇండియా, మిలియన్ డాలర్ లిస్టింగ్ తదితర పాపులర్ షోలతో తన యూజర్లను 3.3 కోట్లకు పెంచుకోవడం గమనార్హం. 5.5 కోట్ల యూజర్లు కలిగిన జియోహాట్‌స్టార్ అయితే.. రిలయన్స్ జియోకి ఉన్న 42 కోట్ల కస్టమర్లకు చేరువయ్యేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. సాధారణంగా ఒక వెబ్‌సిరీస్‌లో 6–7 షోలు ఉంటే.. 100 వరకు ఎపిసోడ్లతో సి రీస్ తీసుకురావాలని నిర్మాతలను కోరుతోంది. తద్వారా యూజర్ ఎంగేజ్మెంట్ పెంచుకోవాలని అనుకుంటోంది. విలీనాలు.. కొనుగోళ్లుభారీ మార్కెట్, అదే సమయంలో గణనీయమైన పోటీ నేపథ్యంలో ఓటీటీ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న డిస్నీ హాట్‌స్టార్.. తనకు ప్రధాన ప్రత్యర్థిగా అవతరిస్తున్న జియో సినిమాస్‌తో చేతులు కలపడం పరిశ్రమలో స్థిరీకరణ దిశగా బలమైన అడుగులు పడినట్టయింది. పరిశ్రమలో ఇప్పుడు జియోహాట్‌స్టార్ నంబర్ 1 ప్లేయర్. జీతో విలీనం అయ్యేందుకు సోనీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. పోటీ పెరగడంతో అమెజాన్ లైట్ పేరుతో ఒక్కరు/ఇద్దరు సభ్యుల కుటుంబం కోసం తక్కువ చార్జీల నమూనాను తీసుకొచ్చింది. అలాగే, 2024లో ఎంఎక్స్ ప్లేయర్‌ను కొనుగోలు చేసి.. దీనిపై ఉచిత కంటెంట్‌ను అందుబాటులో ఉంచింది.భారీగా ఆదాయం.. 2024లో ఓటీటీ సంస్థలు రూ.35,600 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. ఇందులో యూజర్ల సబ్‌్రస్కిప్షన్ చార్జీలతోపాటు ప్రకటనల ఆదాయం కలిసి ఉంది. ఇందులో 40 శాతం యూట్యూబ్‌కే రావడం గమనార్హం. 2022లో 11.2 కోట్ల ఓటీటీ యూజర్లు కాస్తా, 2023లో 9.6 కోట్లకు తగ్గారు. దీంతో మరింత కంటెంట్‌తో, చౌక ప్లాన్లతో ఓటీటీలు 2024లో యూజర్లను 12.5 కోట్లకు పెంచుకున్నాయి. కెనక్టెట్ టీవీల (ఇంటర్నెట్ అనుసంధానం కలిగినవి) కొనుగోళ్లు పెరుగుతుండడం ఓటీటీలకు మరింత డిమాండ్‌ను తెచ్చి పెడుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్‌కు బదులు పెద్ద సైజు టీవీ తెరలపై షోలను వీక్షించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పరిశ్రమ ఆదాయం 2022లో రూ.21,600 కోట్లుగా ఉంటే, 2023లో రూ.30,300 కోట్లకు, 2024లో రూ.35,600 కోట్లకు వృద్ధి చెందింది. వృద్ధికి భారీ అవకాశాలు.. 90 కోట్ల టీవీ వీక్షకులతో పోల్చి చూస్తే.. 12.5 కోట్ల వీక్షకులు కలిగిన ఓటీటీ పరిశ్రమకు మరింత మందిని చేరుకునేందుకు గణనీయమైన అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు 2024 నాటికి 65 కోట్ల మంది ఉంటారని అంచనా. 5 కోట్ల కనెక్టెడ్ టీవీలు కూడా ఉన్నాయి. ఈ పరంగా చూస్తే ఓటీటీల విస్తరణకు దండిగా అవకాశాలున్నాయన్నది విశ్లేషుకుల అభిప్రాయం. తొమ్మిదేళ్ల క్రితం ఫస్ట్ గేర్‌లోకి ప్రవేశించిన ఓటీటీ పరిశ్రమ ప్రస్తుతం పట్టణ యూజర్లకు వేగంగా చేరువ కాగా, దేశంలోని ఇతర ప్రాంతాల వారికీ తమ కంటెంట్‌ను చేరువ చేయాల్సి ఉందంటున్నారు. ఇందుకు వీలుగా ప్రకటనలతో కూడిన తక్కువ సబ్‌్రస్కిప్షన్ ప్యాక్‌లు సాయపడతాయని చెబుతున్నారు. సాక్షి, బిజినెస్ డెస్క్ -
అమ్మ కోసం చూడాల్సిన సినిమా
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం అప్పత్తా ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.నవ మాసాలు మోసి, కన్న బిడ్డపై తల్లికి జీవితాంతం మమతానురాగాలుంటాయి. కానీ అదే బిడ్డ తన తల్లిని తల్లిగా చూడక స్వార్థంతో హింసిస్తే ఆ తల్లి తిరిగి ఎలా ప్రవర్తిస్తుంది... ఇదే ఇతివృత్తంతో తీసిన సినిమా ‘అప్పత్తా’. నానమ్మ లేదా అమ్మమ్మ అని అర్థం. ఇంకా చె΄్పాలంటే ప్రేమతో పెద్దవాళ్లని పిలిచే పదం ‘అప్పత్తా’. ఇదో తమిళ సినిమా. ఈ సినిమాకి దర్శకులు ప్రియదర్శన్. ప్రముఖ నటి ఊర్వశి ఈ అప్పత్తా పాత్రలో నటించారు... కాదు కాదు జీవించారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అద్దం పట్టే ఓ ఫీల్ గుడ్ మూవీ ‘అప్పత్తా’. ఈ చిత్రకథ విషయానికొస్తే... ఓ చిన్న గ్రామంలో అప్పత్తా ఒక్కటే ఉంటుంది. ఎవరికైనా చిన్న ఇబ్బంది ఉన్నా వెంటనే తానున్నానని వాళ్లకి పరిష్కారం చూపుతూ నలుగురికీ సాయపడుతూ ఉంటుంది. అప్పత్తాకు కుక్కలంటే మాత్రం చచ్చేంత భయం. భర్తను పోగొట్టుకున్న ఈవిడ తన కష్టంతో కొడుకును చదివిస్తూ ఉంటుంది. కొడుకు పేరు శ్యామ్. అప్పత్తా ఊరగాయ పచ్చళ్లు బాగా చేస్తుంది. అప్పత్తా ఊరగాయలంటే ఆ చుట్టు పక్కల ఊళ్లల్లో బాగా ఫేమస్. ఆ ఊరగాయలతోనే తన బిడ్డను చదివించుకుంటూ ఉంటుంది. కానీ అదే ఊరగాయ వాసన, అలాగే ఆమె పేదరికం నచ్చని కొడుకు చదువు పేరుతో అప్పత్తాని వదిలి నగరానికి వెళతాడు. కానీ సిటీకి వెళ్లడానికి, అక్కడ ఉండడానికి అప్పత్తా ఇచ్చిన డబ్బులు వాడుకుంటాడు. శ్యామ్ సిటీలోనే సెటిలై ప్రేమ వివాహం చేసుకుంటాడు. కొన్నేళ్ల తరువాత సడెన్‌గా సిటీలో ఉన్న తన కొడుకు దగ్గర నుండి పిలుపు వచ్చి అప్పత్తా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న కొడుకు ఇంటికి వెళుతుంది. సిటీకి మొట్టమొదటిసారిగా వచ్చిన తన తల్లిని కనీసం తీసుకురావడానికి కూడా వెళ్లని సదరు కొడుకు అప్పత్తాని ఎందుకు పిలిచాడంటే తన ఫ్యామిలీతో హాలిడే కోసం కొన్ని రోజులు బయటకు వెళుతూ ఇంట్లో ఉన్న కుక్కని చూసుకోవడానికి మనిషి కోసం ఆమెను రప్పించుకుంటాడు. అసలే కుక్కంటే భయపడే అప్పత్తా కొడుకు ఇంట్లో ఉన్న కుక్కని ఎలా ఎదుర్కొంటుంది? అన్నదే ఈ ‘అప్పత్తా’. సినిమా మొత్తం కామెడీగా సాగిపోతూ చివర్లో చక్కటి మెసేజ్ ఇచ్చారు దర్శకుడు. మనల్ని కనడానికి మన తల్లి పడ్డ బాధ మనకు తెలియకపోవచ్చు. కానీ మనల్ని పెంచి పోషించిన తల్లిని మాత్రం ఎప్పటికీ బాధపెట్టకూడదు. అందుకే ఇది అమ్మ కోసం చూడాల్సిన సినిమా. మస్ట్ వాచ్... ఫీల్ గుడ్ మూవీ. వాచిట్ ఆన్ జియో హాట్ స్టార్.– ఇంటూరు హరికృష్ణ -
నైతిక విలువల్ని పాటించండి
న్యూఢిల్లీ: యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా వివాదాస్పద అశ్లీల వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర జోక్‌లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఓవర్ ది టాప్(ఓటీటీ)ప్లాట్‌ఫామ్‌లు నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు స్వీయ నియంత్రణ సంస్థలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఐటీ నిబంధనలు,2021లోని ‘కోడ్ ఆఫ్ ఎథిక్స్’ను పాటించాలని గురువారం కేంద్ర ప్రభుత్వం ఒక అడ్వైజరీని జారీచేసింది. నైతిక నియమాల ఉల్లంఘన జరిగితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన స్వీయనియంత్రణ సంస్థలు తగు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ వంటి ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్, సోషల్ మీడియాలో అసభ్యకర, శృంగారభరిత, బూతు సమాచారం విస్తృతంగా ప్రసారంలోకి వస్తోందని పలువురు పార్లమెంట్ సభ్యులు, కొన్ని సంస్థల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అడ్వైజరీ జారీచేసింది. -
సినిమాలు మన సంస్కృతిలో భాగమే – ఎంపీ రఘునందన్ రావు
‘‘ఎవరు ఎంత బిజీగా ఉన్నా సినిమాలు చూడటం అనేది మన సంస్కృతిలో ఓ భాగమే. కరోనా తర్వాత అందరూ ఓటీటీకి అలవాటు పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ‘కళింగ’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఈ సినిమా భారీ విజయం సాధించి, నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలి’’ అని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అన్నారు. ధృవ వాయు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కళింగ’. ప్రగ్యా నయన్ కథానాయిక. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎం.రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ధృవ వాయు మాట్లాడుతూ–‘‘కళింగ’ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ‘కాంతార, విరూ΄ాక్ష, మంగళవారం’ సినిమాల్లా ఉంటుందా? అని అడుగుతున్నారు. కానీ సరికొత్త కాన్సెప్ట్‌తో మా సినిమా రూ΄÷ందింది’’ అన్నారు. ‘‘కళింగ’ అద్భుతంగా వచ్చింది’’ అని దీప్తి కొండవీటి పేర్కొన్నారు. ‘‘మా చిత్రాన్ని అందరూ చూసి, ఆదరించాలి’’ అని పృథ్వీ యాదవ్ కోరారు. నటీనటులు ప్రగ్యా నయన్, ప్రీతి సుందర్, తిరువీర్, సంజయ్ మాట్లాడారు. -
Savi Movie Review: ఫ్రెంచ్ సావిత్రి కథ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే చిత్రాలు చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘సావి’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఓ సినిమా కథ బావుంటే ఆ కథకి ఏ భాషా హద్దు కాదు. అలాగే ఏ దేశమూ సరిహద్దు కాదు. దానికి సరైన ఉదాహరణ ‘సావి’ సినిమా. ‘సావి’ గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమాకి మూలం తెలుసుకోవడం చాలా అవసరం. 2008లో ఫ్రెంచ్ దర్శకుడు ఫ్రెడ్ కవాయే ‘ఎనీథింగ్ ఫర్ హర్’ అనే సినిమా నిర్మించారు. ఆ సినిమాను 8 మిలియన్ డాలర్లు పెట్టి తీస్తే, ఆరు మిలియన్ డాలర్ల రాబడితో సరిపెట్టుకుంది. అదే మూల కథతో సరిగ్గా రెండేళ్ళ తరువాత... అంటే 2010లో రస్సెల్ క్రోవ్ వంటి సీనియర్ నటుడుతో హాలీవుడ్ దర్శకుడు పాల్ హాగిస్ ‘ది నెక్ట్స్ త్రీ డేస్’ అనే సినిమా నిర్మించారు. ఈ సినిమాను 30 మిలియన్ డాలర్లు పెట్టి తీస్తే దాదాపు 67 మిలియన్ డాలర్లు సాధించి, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ కథ ఫ్రెంచ్‌లో ప్రారంభమై హాలీవుడ్ చుట్టి 14 ఏళ్ళ తరువాత బాలీవుడ్‌కి ‘సావి’గా అడుగుపెట్టింది. అంతలా ఈ కథలో ఏముందో చూద్దాం. అందమైన ఓ చిన్న కుటుంబం. భార్య, భర్త, ఓ చిన్న పిల్లాడు. వీరే కథకు పాత్రధారులు. అనుకోని ఓ ఘటన వల్ల ఒక హత్య కేసులో ఇరుక్కుని జీవిత ఖైదీగా శిక్ష పడుతుంది భార్యకు. దేశం కాని దేశంలో తన బిడ్డకు తల్లిని దూరం చేయలేక ఆ భర్త శిక్ష అనుభవిస్తున్న తన భార్యను జైలు నుండి తప్పించి కుటుంబమంతా ఎలా వేరే దేశం చేరుకుంటారు అనేదే కథ. ‘సావి’లో పెద్ద మార్పేంటంటే భార్య బదులు భర్తను ఖైదీగా మార్చారు. పైగా ఇండియా సెంటిమెంట్ ప్రకారం సావి అంటే సావిత్రి అని దర్శకుడు అభినయ్ డియో సినిమా ఆఖర్లో చెప్పిస్తాడు. సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అనిల్ కపూర్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో దివ్య ఖోస్లా టైటిల్ రోల్ చేశారు. థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడే వాళ్ళకు ‘సావి’ మంచి ఛాయిస్. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. – ఇంటూరు హరికృష్ణ -
ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది.. ఇంత దూరం వస్తాననుకోలేదు!
నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘రౌతు కా రాజ్’. ఆనంద్ సుర్పూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలిపారు. ఇంకా ‘సాక్షి’తో నవాజుద్దీన్ పంచుకున్న విశేషాలు. → హీరో పాత్ర, అతను ఓ కేసును పరిశోధన చేసే విధానం... ఈ రెండూ ‘రౌతు కా రాజ్’లో వీక్షకులకు కొత్తగా అనిపిస్తాయి. సినిమాలోని మర్డర్ మిస్టరీ, గ్రామీణ నేపథ్యం ఆసక్తికరంగా, సహజత్వంతో ఉంటుంది. ఈ సినిమాకు సక్సెస్ టాక్ వచ్చిందంటే ఈ ఫలితం నా ఒక్కడిదే కాదు... దర్శకుడు, ఇందులో భాగమైన నటీనటులు అందరి భాగస్వామ్యం వల్లే సాధ్యమైంది. → నేను ప్రధానంగా లీడ్ రోల్స్‌లోనే నటిస్తున్నాను. ఏదైనా కథ, అందులోని పాత్ర ఎగ్జైట్ చేసినప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాను. కథలోని నా పాత్రకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలనుకుంటాను. ఆ లక్షణాలకు నా నటన తోడైనప్పుడు ప్రేక్షకులు మెచ్చుకుంటారు. ఆడియన్స్‌ను మెప్పించే క్రమంలో నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నా ఓకే. నటుడుగా నాకెలాంటి పశ్చాత్తాపం లేదు. ఇండస్ట్రీలో ఇంత దూరం వస్తానని, ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదు. ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది. → ప్రస్తుతం కస్టమ్ ఆఫీసర్‌గా ఓ సినిమా, సెక్షన్ 108 మూవీలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను. దక్షిణాదిలో రజనీకాంత్‌గారి ‘పేటా’, వెంకటేశ్‌గారి ‘సైంధవ్’ సినిమాలో నటించాను. మళ్లీ దక్షిణాది సినిమాలు చేయాలని ఉంది. కథలు వింటున్నాను. ఇక యాక్టింగ్ కాకుండా వ్యవసాయం అంటే ఇష్టం. వీలైనప్పుడల్లా మా ఊరు వెళ్లిపోయి (ఉత్తరప్రదేశ్‌లోని బుడానా) వ్యవసాయం చేస్తుంటాను. -
Abha Sharma: పెద్ద వయసులో.. పెద్ద గుర్తింపు
చిగుళ్ల వ్యాధి వల్ల 35 ఏళ్ల వయసులో పళ్లు కోల్పోయింది అభా శర్మ. 45 ఏళ్ల వయసులో ఆమెకు అవయవాలు కంపించే అరుదైన వ్యాధి వచ్చింది. అయినా నటి కావాలన్న కోరికను ఆమె చంపుకోలేదు. నాటకాల్లో పాత్రలు వేయసాగింది. ఇప్పుడు ‘పంచాయత్ 3’ వెబ్ సిరీస్‌లో పల్లెటూరి అమ్మగా నటించి దేశం మొత్తానికి అభిమాన నటి అయ్యింది. 75 ఏళ్ల వయసులో విజయాన్ని చూసిన అభా శర్మ పరిచయం.ఉత్తర ప్రదేశ్‌లోని ‘ఫుల్వారా’ అనే పల్లెటూళ్లో ఒక ముసలామె పంచాయతీ ఆఫీస్‌కు వచ్చి– ‘నా కొడుకు నన్ను ఇంట్లోంచి తరిమి కొట్టాడు. నాకో ఇల్లు మంజూరు చేయి నాయనా’ అని పంచాయతీ ఆఫీసర్ని ప్రాధేయపడుతుంది.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ప్రకారం ఊరికి 11 ఇళ్లు మంజూరై ఉంటాయి. వాటిని ఎవరెవరికి ఇవ్వాలనేది సర్పంచ్, పంచాయతీ ఆఫీసర్ నిర్ణయించాలి. ఈ ముసలామెకు ఇల్లు మంజూరు చేద్దామా అనుకుంటాడు ఆఫీసర్. కాని పల్లెల్లో అదంత సులభం కాదు. ‘నిజంగానే ముసలామెను కొడుకు తరిమి కొట్టాడా లేదా’ అనే ఎంక్వయిరీ జరుగుతుంది. ఊరి జనం కూడా ముసలామె ఇంటి మీద నిఘా పెడతారు. కొడుకు కాపురం ఒక గదిలో ఉంటే ముసలామె వేరొక గుడిసెలో అవస్థలు పడుతూ ఉంటుంది. ఇదంతా నిజమని భావించిన ఆఫీసర్ ముసలామెకు ఇల్లు మంజూరు చేస్తాడు. కాని ఇదంతా అబద్ధమని తేలుతుంది. ‘పేదవాడైన నా కొడుక్కి ఒక ఇల్లు ఇచ్చి వెళితే వాడు సుఖపడతాడని ఈ నాటకం అంతా ఆడాను’ అంటుంది ముసలామె. కాని ‘ఇంటి కోసమని నా కొడుకు, కోడలు, మనవణ్ణి వదిలి వేరే కుంపటి పెట్టి ఎలా బతకగలను’ అని బాధ పడుతుంది.ఒక వైపు పేదరికపు దీనత్వం, మరోవైపు బాంధవ్యాల దృఢత్వం... ఇవి ‘పంచాయత్ 3’ సిరీస్‌లోని ‘ఘర్’ అనే ఎపిసోడ్లో కనిపిస్తాయి. ఈ ఎపిసోడ్‌లోని ‘అమ్మాజీ’గా నటించిన అభా శర్మ ఇప్పుడు దేశంలో చాలామందికి అభిమాన నటిగా మారింది.75 ఏళ్ల వయసులో...అభా శర్మది లక్నో. ఇప్పుడామె వయసు 75 సంవత్సరాలు. ఈ వయసులో ఆమె ఎర్రటి ఎండల్లో మధ్యప్రదేశ్‌లో ఔట్డోర్కు వెళ్లి షూట్ చేయడమే కాదు అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది. ‘నాకు చిన్నప్పటి నుంచి నటించాలనే కోరిక ఉంది. కాని మా అమ్మ పడనివ్వలేదు. నేను టీచర్‌గా పని చేస్తూ ఆ కోరికను మనసులోనే అదిమేశాను. కాని మా అమ్మ చనిపోయాక నా 47వ ఏట నటన మొదలెట్టాను. లక్నోలోని నాటక బృందాలతో నాటకాలు ఆడాను. నాకు 54 ఏళ్ల వయసున్నప్పుడు మొదటిసారి ఒక అడ్వర్టైజ్మెంట్లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాను. కాని ఇప్పుడు పంచాయత్ 3లో నేను చేసిన వేషం ప్రపంచమంతా చూసింది. నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. ఎంతో ఆనందంగా ఉంది. 75 ఏళ్ల వయసులో నేను ఇంత గుర్తింపు పొందడం చూశాక– ఎవరైనా సరే తమ కలలను చివరి వరకూ నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలని చె΄్పాలనిపించింది’ అని చెప్పింది అభా శర్మ.జీవితంలో సవాళ్లుతండ్రి చనిపోయాక అభా శర్మకు తల్లిని చూసుకునే బాధ్యత వచ్చింది. ఆమె కోసం అభా శర్మ వివాహం చేసుకోలేదు. కాని 35వ ఏట ఆమెకు చిగుళ్ల వ్యాధి వచ్చి పళ్లు ఊడిపోయాయి. అంటే కాలక్రమంలో కృత్రిమ పళ్లు పెట్టడానికి కూడా వీలు కాని స్థితి. సాధారణంగా స్త్రీలు ఇలాంటి స్థితిలో నలుగురి ముందుకు రావడానికి ఇష్టపడరు. కాని అభా ఒక వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు తల్లిని చూసుకుంది. ఆమె మరణించాక నాటకాల్లోకి వచ్చింది. అయితే ఆమెకు శరీర అవయవాలు కంపించే అరుదైన వ్యాధి కూడా వచ్చింది. దాని వల్ల ఆమె మాట్లాడే విధానం చాలా స్లో అయిపోయింది. ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ నటించాలనే పట్టుదలతో నటించి విజయం సాధించింది అభా శర్మ.పంచాయత్ అంటే...టి.వి.ఎఫ్. నిర్మాణ సంస్థ అమేజాన్ కోసం తీసిన కామెడీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’. ఇప్పటికి రెండు సిరీస్‌లు ఘన విజయం సాధించి ఇప్పుడు మూడో సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. భారతదేశంలోని చిన్న ఊళ్లలో మనుషుల అమాయకత్వం, వారి చిన్న చిన్న ఆకాంక్షలు, రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థల ద్వారా వారికి అందాల్సిన సాయాల్లో వచ్చే ఆటంకాలు... ఇవన్నీ ఈ సిరిస్‌లో సహజంగా చూపించడంతో సూపర్ హిట్ అయ్యింది. రఘవీర్ యాదవ్, నీనా గు΄్తా, జితేంద్ర కుమార్ ప్రధాన తారాగణం. -
18 ఓటీటీలపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: అసభ్యకర, అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేసినందుకుగాను 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, వాటికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయనున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, వీటికి సంబంధం ఉన్న 19 వెబ్సైట్లు, 10 యాప్‌లు, 57 సోషల్ మీడి యా ఖాతాలను దేశంలో ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండవని పేర్కొంది. తొలగించే 10 యాప్‌లలో ఏడు గూగుల్ ప్లే స్టోర్, 3 యాపిల్ యాప్ స్టోర్‌లో ఉండేవి. వేటుపడిన 18 ఓటీటీలివే.. డ్రీమ్స్ ఫిలిమ్స్, వూవీ, యెస్మా, అన్‌కట్ అడ్డా, ట్రీఫ్లిక్స్, ఎక్స్ప్రైమ్, నియోన్ ఎక్ వీఐపీ, బేషరమ్స్, హంటర్స్, రబ్బిట్, ఎక్స్‌ట్రామూడ్, న్యూఫ్లిక్స్, మూడ్ ఎక్స్, మోజోఫ్లిక్స్, హాట్ షాట్స్ వీఐపీ, ఫుగీ, చికూఫ్లిక్స్, ప్రైమ్ప్లే వంటి ఓటీటీ సోషల్ మీడియా ఖాతాలను తొలగించారు. తొలగించిన వాటిలో 12 ఫేస్బుక్ ఖాతాలు, 17 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, 16 ఎక్స్ ఖాతాలు, 12 యూట్యూబ్ ఖాతాలు సోషల్ మీడియా ద్వారా అశ్లీలతను ప్రసారం చేస్తున్నాయి. -
ఓటీటీని ఆస్వాదిస్తున్న నెటిజన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ వినియోగదార్లలో 86 శాతం మంది ఓటీటీ (ఓవర్ ది టాప్) ఆడియో, వీడియో సేవలను ఆస్వాదిస్తున్నారు. వీరిలో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారని ఓ నివేదిక వెల్లడించింది. లక్షదీ్వప్ మినహా కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన 90,000 పైచిలుకు గృహాల నుంచి సమాచారాన్ని సేకరించి నివేదికలో పొందుపరిచారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఐఎంఏ), మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ కంపెనీ కాంటార్ సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. స్మార్ట్ టీవీ, స్మార్ట్ స్పీకర్స్, ఫైర్‌స్టిక్స్, క్రోమ్కాస్ట్ల పెరుగుదల ద్వారా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సేవలు 2021తో పోలిస్తే 2023లో 58 శాతం ఎగసింది. 18.1 కోట్ల మంది సంప్రదాయ టీవీ వీక్షణ సాగిస్తే, ఇంటర్నెట్ ఆధారిత పరికరాల ద్వారా వీడియో కంటెంట్‌ను 20.8 కోట్ల మంది ఆస్వాదిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం ఇలా.. ఇంటర్నెట్ వినియోగదార్లలో కమ్యూనికేషన్స్ కోసం 62.1 కోట్ల మంది, సామాజిక మాధ్యమాలను 57.5 కోట్ల మంది వాడుతున్నారు. 2023 నాటికి యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య భారత్‌లో 82.3 కోట్లు ఉంది. జనాభాలో 55 శాతంపైగా గతేడాది ఇంటర్నెట్ వాడారు. 2022తో పోలిస్తే గతేడాది ఈ సంఖ్య 8 శాతం ఎక్కువ. మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో గ్రామీణ ప్రాంతాల వారు అత్యధికంగా 44.2 కోట్ల (53 శాతంపైగా) మంది ఉన్నారు. స్థానిక భాషల్లో కంటెంట్‌ను వీక్షించేందుకే 57 శాతం యూజర్లు మొగ్గు చూపుతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషలకు అధిక డిమాండ్ ఉంది. ఇక 2015లో మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో పురుషులు 71 శాతం కాగా, స్త్రీలు 29 శాతం నమోదయ్యారు. 2023లో పురుషుల వాటా 54 శాతానికి వచ్చి చేరింది. స్త్రీల వాటా 46 శాతానికి ఎగసింది. దేశంలోని లింగ నిష్పత్తికి దాదాపు సమంగా ఉంది. -
లావణ్య మిస్ పర్ఫెక్ట్
లావణ్యా త్రిపాఠి, అభిజీత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘న్యూ ఇయర్‌ను పర్ఫెక్ట్గా మొదలు పెట్టబోతున్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు లావణ్యా త్రిపాఠి. ‘‘ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేసే మిస్టర్ పర్ఫెక్ట్ల గురించి మాట్లాడుకుంటుంటాం. కానీ మిస్ పర్ఫెక్ట్గా ఓ అమ్మాయి ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది? ఎలా పని చేయిస్తుంది? అనే అంశాలను హిలేరియస్‌గా ఈ వెబ్ సిరీస్‌లో చూపించబోతున్నాం’’ అన్నారు విశ్వక్ ఖండేరావ్. ‘‘అనుకోకుండా ఏర్పరచుకునే కొన్ని అనుబంధాలు మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అనే ప్రేమకథతో ‘మిస్ పర్ఫెక్ట్’ని రూపొందించాం’’ అన్నారు సుప్రియ యార్లగడ్డ. ఈ సిరీస్‌కు సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, కెమెరా: ఆదిత్య జవ్వాదా. -
దూత ఓ కొత్త అనుభూతి
‘‘థ్యాంక్యూ’ సినిమా తర్వాత ‘దూత’ వెబ్ సిరీస్ గురించి నాగచైతన్యతో చెప్పాను. హారర్, థ్రిల్లర్ నేపథ్యం అంటే నాకు భయం అన్నాడు. కథ వినమన్నాను. ఆ తర్వాత కథ నచ్చడంతో చేస్తానని చెప్పాడు. సూపర్ నేచురల్, ఊహాతీతమైన అంశాలతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ అన్నారు. హీరో నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ ‘దూత’. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీశంకర్, ్రపాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శరత్ మరార్ నిర్మించిన ఈ సిరీస్ డిసెంబరు 1 నుంచి అమేజాన్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎనిమిది ఎపిసోడ్స్‌గా ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విక్రమ్ కె. కుమార్ చెప్పిన విశేషాలు. ► ‘దూత’ పూర్తిగా కల్పిత కథ. ‘దూత’ అంటే ఏదైనా సమాచారాన్ని చేరవేసేవాడు. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాగర్ పాత్రలో నాగచైతన్య అద్భుతంగా నటించాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటేనే సవాల్‌తో కూడుకున్నది. సంచలనం సృష్టించిన ఓ ఘటన తాలూకు వాస్తవాలను సాగర్ ఎలా పాఠకుల ముందు ఉంచాడు? ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి? అనేది ప్రేక్షకులు అంచనా వేయలేరు. తన కంఫర్ట్ జోన్ నుండి బయటకి వచ్చి, ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రని సవాల్‌గా తీసుకుని చేశాడు నాగచైతన్య. ►‘దూత’లో మూడు సినిమాలు తీసేంత కథ ఉంది. అందుకే వెబ్ సిరీస్‌గా తీశాం. పైగా సినిమాగా తీస్తే మన ప్రేక్షకులకు మాత్రమే చేరువ అవుతుంది. ఓటీటీలో ప్రసారం చేయడం ద్వారా ఇతర దేశాల్లోని వారు కూడా మన ఇండియన్ వెబ్ సిరీస్‌లు చూసే అవకాశం ఉంటుంది. ►షార్ట్ ఫిలిం, వెబ్ ఫిల్మ్, సినిమా.. దేని కష్టం దానికి ఉంటుంది. అయితే సినిమా తీయడం సులభమే.. కానీ, మంచి మూవీ తీయడం చాలా కష్టం. -
ఓటీటీలు డబ్బు కట్టకుండా 5జీని వాడుకుంటున్నాయ్
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థలు ఎలాంటి చెల్లింపులు చేయకుండా 5జీ నెట్‌వర్క్‌ను వాడుకుంటున్నాయని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఆరోపించారు. వాటిని వాడుకుంటున్నందుకు గాను ఆయా సంస్థలు తమకు వచ్చే లాభాల్లో కొంతైనా టెల్కోలకు చెల్లించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘టెల్కోలు తమ వాయిస్, డేటా ట్రాఫిక్ కోసం నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తాయి. అయితే, ఓటీటీ సంస్థలు మాత్రం భారీ డేటా చేరవేత కోసం ఈ నెట్‌వర్క్‌లపై పెను భారం మోపుతున్నాయి. కంటెంట్ ప్రొవైడర్స్ నుంచి తీసుకున్న డేటాను తమ ప్లాట్‌ఫాం ద్వారా యూజర్లకు చేరవేస్తాయి. ఈ ప్రక్రియలో ఉపయోగించుకునే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన సంస్థలకు మాత్రం పైసా చెల్లించడం లేదు‘ అని కొచర్ చెప్పారు. ఓవైపున 5జీ వంటి అధునాతన టెక్నాలజీ నెట్‌వర్క్‌ల ఏర్పాటు కోసం భారీగా పెట్టుబడులు పెట్టలేక టెల్కోలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మాత్రం వాటితో లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసి, నిర్వహిస్తున్నందుకు గాను టెల్కోలకు ఓటీటీలు తమకు వచ్చే లాభాల్లో సముచిత వాటాను ఇవ్వాలని కొచర్ పేర్కొన్నారు. నెట్‌వర్క్‌లు, డిజిటల్ కనెక్టివిటీ, స్మార్ట్ఫోన్ల వినియోగం మెరుగుపడిన నేపథ్యంలో భారత్‌లో వీడియో ఓటీటీ మార్కెట్ 2030 నాటికి 12.5 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీలైవ్ వంటి ఓటీటీ సంస్థలకు భారత్‌లో పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నారు. -
టెల్కోల వాయిస్ కాల్స్‌కు ఓటీటీ దెబ్బ
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో టెల్కోల ఆదాయంలో వాయిస్ కాల్స్ వాటా 80 శాతం, ఎస్ఎంఎస్ల వాటా 94 శాతం పడిపోయింది. అయితే, డేటా వాటా 10 రెట్లు పెరిగింది. ఓటీటీలను నియంత్రణ పరిధిలోకి తెచ్చే క్రమంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపొందించిన చర్చాపత్రంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2013 జూన్ త్రైమాసికం – 2022 డిసెంబర్ త్రైమాసికం మధ్య కాలంలో గణాంకాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం.. గత దశాబ్ద కాలంలో మెసేజింగ్, వాయిస్ కమ్యూనికేషన్ కోసం ఓటీటీ యాప్‌ల వినియోగం పెరగడం వల్ల అంతర్జాతీయంగా టెల్కోలకు వాయిస్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే ఆదాయాలు .. క్రమంగా డేటా వైపునకు మళ్లాయి. దేశీయంగా చూస్తే టెల్కోలకు సగటున ప్రతి యూజరుపై వచ్చే ఆదాయానికి (ఏఆర్పీయూ) సంబంధించి డేటా విభాగం తప్ప మిగతా అన్నింటి వాటా తగ్గిపోయింది. 2013 జూన్ క్వార్టర్లో టెల్కోల ఆదాయంలో డేటా వాటా 8.1 శాతంగా ఉండగా 2022 డిసెంబర్ త్రైమాసికంలో 10 రెట్లు పెరిగి 85.1 శాతానికి చేరింది. మరోవైపు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడమా లేక నిర్దిష్టంగా కొన్ని కాలింగ్, మెసేజింగ్ యాప్‌లను నిలిపివేయడమా అనే చర్చనీయాంశాన్ని కూడా చర్చాపత్రంలో ట్రాయ్ స్పృశించింది. ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్స్‌ను పూర్తిగా షట్‌డౌన్ చేయడం వల్ల ఎకానమీకే కాకుండా విద్యా, వైద్యం వంటి కీలక సేవలకు కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అల్లర్లు రేపేందుకు ఉగ్రవాదులు లేదా విద్రోహ శక్తులు ఉపయోగించే అవకాశమున్న నిర్దిష్ట ఓటీటీ యాప్‌లు, వెబ్సైట్లను మాత్రమే నిషేధించడం శ్రేయస్కరం కావచ్చని ట్రాయ్ పేర్కొంది. -
తండ్రి నిర్మాత.. కుమార్తె కథానాయిక
‘అలాంటి ఇలాంటి లాంచింగ్ కాదు.. ఓ రేంజ్లో ఉండాలి’ అన్నట్లు కుమార్తె సుహానా ఖాన్ వెండితెర అరంగేట్రానికి షారుక్ ఖాన్ రంగం సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే సుహానా నటిగా మేకప్ వేసుకుంది. జోయా అక్తర్ దర్శకత్వంలో ‘ది ఆర్చీస్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఈలోపు సుహానా వెండితెరపై పరిచయం కావడానికి ఓ సినిమా సైన్ చేసిందని సమాచారం. కుమార్తె అరంగేట్రం అట్టహాసంగా జరగాలనే ఆలోచనతో తనకు ఇటీవల ‘పఠాన్’లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాలని షారుక్ అనుకుంటున్నారట. అది మాత్రమే కాదు.. అతిథి పాత్ర కూడా చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం కథ రెడీ అవుతోందని సమాచారం. ఇంకా దర్శకుడి ఎంపిక జరగలేదని టాక్. -
నిజాలను చూడటం కష్టం!
‘‘కొన్నిసార్లు నిజాలను చూడటం చాలా కష్టం.. మరి మీరు ఆమె చీకటి ప్రపంచాన్ని చూడ్డానికి రెడీ అవుతారా?’’ అంటూ సోనమ్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘బ్లైండ్’ విడుదల తేదీని ప్రకటించారు. జూలై 7 నుంచి ఈ చిత్రం ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. కొరియన్ మూవీ ‘బ్లైండ్’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో సోనమ్ అంధురాలిగా నటించారు. ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోడానికి ఓ లేడీ పోలీసాఫీసర్ చేసే ప్రయత్నం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. బ్లైండ్ పోలీసాఫీసర్‌గా సోనమ్ అద్భుతంగా నటించారని చిత్ర యూనిట్ పేర్కొంది.. షోమ్ మఖీజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కాగా ఓటీటీ ప్లాట్ఫామ్లో సోనమ్ కనిపించనున్న తొలి చిత్రం ఇదే కాగా, తల్లయ్యాక (గత ఏడాది ఆగస్ట్ 20న ఓ బాబుకి జన్మనిచ్చారు) కనిపించనున్న చిత్రం కూడా ఇదే అవుతుంది. -
ఓటీటీ .. పరిశ్రమ సూపర్ హిట్.. ఆదాయంలో దక్షిణాది సినిమాల జోరు!
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) కంటెంట్ పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ విలువ రూ.10,000 కోట్లుగా ఉంటే, 2030 నాటికి రూ.30,000 కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2024 మార్చి నాటికి రూ.12,000 కోట్లకు చేరుకుంటుందని, ఏటా 20 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఐఎన్10మీడియా సీవోవో, సీఐఐ దక్షిణ్ స్టీరింగ్ కమిటీ సభ్యుడైన అనూప్ చంద్రశేఖరన్ తెలిపారు. ఓటీటీ పరిశ్రమపై చెన్నైలో దక్షిణాది మీడియా, ఎంటర్టైన్మెంట్ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సీఐఐ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలవుతున్న వాటితో పోలిస్తే.. వచ్చే 12 నెలల్లో దక్షిణాది భాషల్లో పెద్ద సంఖ్యలో వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి’’అని స్టార్/డిస్నీ ఇండియా బిజినెస్ హెడ్ కృష్ణన్ కుట్టి తెలిపారు. దక్షిణాది సినిమాల జోరు దేశం మొత్తం మీద దక్షిణాది సినిమాలు అత్యధిక ఆదాయాన్ని సృష్టిస్తున్నాయి. 2022లో దక్షిణాది సినిమాలు రూ.7,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. అంతకుముందు ఏడాది ఆదాయంతో పోలిస్తే రెట్టింపు అయింది. అంతేకాదు గతేడాది దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఆదాయంలో దక్షిణాది సినిమాల వాటాయే 50 శాతంగా ఉండడం గమనార్హం. ఈ వివరాలను సీఐఐ దక్షిణాది విభాగం రూపొందించిన నివేదికలో పేర్కొంది. ‘తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంతో కూడిన దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆదాయం 2022లో రూ.7,836 కోట్లుగా ఉంది. 2021లో ఆదాయం రూ.3,988 కోట్టే. 2022లో మొత్తం భారత సినీ పరిశ్రమ ఆదాయం రూ.15,000 కోట్లు. దక్షిణాదిలోనూ తమిళ సినిమా రూ.2,950 కోట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రూ.2,500 కోట్లతో తెలుగు సినీ పరిశ్రమ ఉంటే, కన్నడ పరిశ్రమ ఆదాయం రూ.1,570 కోట్లు, మలయాళ పరిశ్రమ ఆదాయం రూ.816 కోట్లు. ముఖ్యంగా కన్నడ నాట కేజీఎఫ్:చాప్టర్ 1, కాంతార సినిమాలు బంపర్ వసూళ్లతో పరిశ్రమ రూపాన్ని మార్చేశాయి’అని నివేదిక తెలిపింది. మలయాళ పరిశ్రమ స్థానికంగా, విదేశాల్లోనూ ఆదాయాన్ని పెంచుకుంది. దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ఒక్కటే రూ. 1,200 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కమల్ హాసన్ విక్రమ్, మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాలు తమిళనాట ఆదాయాన్ని పెంచాయి. 2022 లో దక్షిణాదిన 916 సినిమాలు విడుదలయ్యాయి. థియేటర్, ఓటీటీలో విడుదలైనవీ ఇందులో ఉన్నాయి. కంటెంట్‌కు డిమాండ్ స్క్రిప్ట్‌ను అందించేందుకు తాము ఒక నెల సమయం తీసుకుంటున్నామని అర్హ మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ సహ వ్యవస్థాపకుడు అజిత్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం ఏటా వివిధ ప్లాట్‌ఫామ్‌ల కోసం 60 ఒరిజినల్స్ అవసరం ఉంటోందన్నారు. నిర్మాతలు దీన్ని అవకాశంగా తీసుకోవాలని కోరారు. ‘‘తమిళం, తెలుగు ఓటీటీపైనే జీ ఓటీటీ ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించింది. ప్రస్తుతం కన్నడ ఓటీటీ మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. మలయాళం ఓటీటీ పరిశ్రమకు కావాల్సిన కంటెంట్‌ను ప్రస్తుతం నిర్మాతలు అందించే స్థితిలో ఉన్నారు’’అని జీ5 ఓటీటీ చీఫ్ క్లస్టర్ ఆఫీసర్ సిజు ప్రభాకరన్ వివరించారు. -
ఆహా సీఈవోగా రవికాంత్ సబ్నవీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ సీఈవోగా రవికాంత్ సబ్నవీస్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆ స్థానంలో ఉన్న అజిత్ ఠాకూర్ .. బోర్డ్ డైరెక్టరుగా పదోన్నతి పొందారు. సబ్నవీస్ నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఆయన అపార అనుభవం ఆహా వృద్ధికి తోడ్పడగలదని సంస్థ ప్రమోటర్ రాము రావు జూపల్లి తెలిపారు. కంపెనీకి ప్రత్యేక గుర్తింపు తేవడంలో అజిత్ కీలక పాత్ర పోషించారని, ఇకపైనా ఆహా స్టూడియో మొదలైన అంశాల్లో ఆయన మార్గదర్శకత్వం వహిస్తారని ఆహా ప్రమోటర్ అల్లు అరవింద్ పేర్కొన్నారు. విశిష్టమైన ప్రోగ్రామ్‌లతో వీక్షకులకు ఆహాను మరింత చేరువ చేసేందుకు ఆహా బృందం కృషి చేస్తుందని సబ్నవీస్ చెప్పారు. స్టార్ టీవీ, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, హెయిన్జ్ ఇండియా వంటి పలు రంగాల సంస్థల్లో వివిధ హోదాల్లో సబ్నవీస్కు 30 ఏళ్ల పైగా అనుభవం ఉంది. -
యూసేజ్ ఫీజు సహేతుకమే
న్యూఢిల్లీ: యూసేజీ ఫీజు అంశంపై ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీస్ సంస్థలు, టెల్కోల మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా ఓటీటీ సంస్థలు యూసేజీ ఫీజు కట్టాలంటూ తాము చేస్తున్న డిమాండ్ ’సముచితమైనది, సహేతుకమైనదే’ అని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ స్పష్టం చేశారు. ఇది ఎకానమీ వృద్ధికి దోహదపడుతూనే డిజిటల్ ఇన్ఫ్రాను మెరుగుపర్చుకునేందుకు కూడా తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. టెలికం సేవల వినియోగం ద్వారా యూజర్లను పొందుతున్నందున తమకు ఆదాయంలో వాటా ఇవ్వాలంటూ టెల్కోలు కోరడాన్ని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఐఎంఏఐ) తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఇది నెట్ న్యూట్రాలిటీ విధానానికి విరుద్ధమని ఏఐఎంఏఐ ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో కొచర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూసేజీ ఫీజుల అంశాన్ని కొన్ని శక్తులు స్వలాభం కోసం పక్కదారి పట్టిస్తున్నాయని ఏఐఎంఏఐ పేరు ప్రస్తావించకుండా సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కొచర్ వ్యాఖ్యానించారు. లైసెన్సింగ్ నిబంధనల ప్రకారం టెల్కోలన్నీ నెట్ న్యూట్రాలిటీకి (ఇంటర్నెట్ సేవలందించడంలో పక్షపాతం చూపకుండా తటస్థంగా ఉండటం) కట్టుబడి ఉన్నా యని ఆయన స్పష్టం చేశారు. టెలికం సంస్థలు మౌలిక సదుపాయాలు, స్పెక్ట్రం కోసం భారీగా వెచ్చిస్తాయని, రకరకాల పన్నులు చెల్లిస్తాయని, నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని కొచర్ చెప్పారు. దానికి విరుద్ధంగా భారీ విదేశీ కంపెనీలు నిర్వహించే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు టెల్కోల నెట్వర్క్ ఉచితంగా వాడుకుంటూ, యూజర్లను పెంచుకుని, ప్రకటనల ద్వారా ప్రత్యక్షంగా.. పరోక్షంగా లబ్ధి పొందుతున్నాయని ఆయన తెలిపారు. ఆయా ప్లాట్‌ఫాంలు ప్రస్తుతం టెలికం చట్ట పరిధిలో లేనందున ఆదాయాలపై భారత్‌లో పన్నులు కట్టే పరిస్థితి ఉండటం లేదని చెప్పారు. -
ఓటీటీలకు షాక్: సీవోఏఐ కొత్త ప్రతిపాదన
న్యూఢిల్లీ: ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్స్ సేవలు అందించే సంస్థలకు కూడా లైసెన్సింగ్ విధానం, తేలికపాటి నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఉండాలని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. టెల్కోల నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుని ఈ సేవలు అందిస్తున్నందున అవి నేరుగా తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. టెలికం బిల్లు ముసాయిదాలో ఓటీటీ కమ్యూనికేషన్స్ సేవలకు సంబంధించిన నిర్వచనం విషయంలో తాము ఈ మేరకు సిఫార్సులు చేసినట్లు సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. టెల్కోలకు ఓటీటీ సంస్థలు పరిహారం చెల్లించే అంశానికి సంబంధించి.. ఆదాయంలో వాటాల విధానాన్ని పరిశీలించవచ్చని ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు ఆయన వివరించారు. భవిష్యత్‌లో ఇతర ఓటీటీలకు (అన్ని కేటగిరీలు) కూడా డేటా వినియోగం ఆధారిత ఆదాయ పంపకం సూత్రాన్ని వర్తింప చేయవచ్చని కొచర్ చెప్పారు. -
అందుకే అరవై షార్ట్ ఫిలింస్ తీశా!
‘‘నేటి యువత చదువు, నా కుటుంబం, నా ఉద్యోగం, నా సంపాదన అంటూ ఉరుకులు పరుగులు పెడుతోంది. అలాంటి యువతరానికి విలువల గురించి చెప్పాలని తీసిన చిత్రం ‘కవి సమ్రాట్’. విలువల కోసం యువత పరుగులు పెడితే భారతదేశం గతం కంటే వంద రెట్లు బాగుంటుంది’’ అని ప్రముఖ రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్ అన్నారు. పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారగ్రహీత, కవి విశ్వనాథ సత్యనారాయణ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘కవి సమ్రాట్’. ఎల్బీ శ్రీరామ్ టైటిల్ రోల్లో నటించి, నిర్మించారు. సవిత్ సి. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 22 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ పంచుకున్న విశేషాలు. ► పాఠశాల స్థాయిలోనే నాటకాలు రాసి, దర్శకత్వం వహించి, నటించేవాణ్ణి. సామాజిక అంశాలపైనే నా నాటక రచనలు ఉండేవి. ఆ తర్వాత నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. అయితే నటుల మధ్య ఎక్కువ పోటీ ఉండటంతో పన్నెండేళ్ల పాటు రచయితగా చేశాను. నా గురువు ఈవీవీ సత్యనారాయణగారి వద్ద చాలా సినిమాలకు రచయితగా చేశాను. ► ఈవీవీగారి ‘చాలా బాగుంది’ నటుడిగా నాకు బ్రేక్ ఇచ్చింది. అయితే ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాలో నా పాత్ర సీరియస్‌గా ఉండటంతో అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చేవి. ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. డైరెక్టర్లు చెప్పినట్లు చేస్తే డబ్బులు వస్తాయి.. కానీ, డబ్బుకన్నా సంతృప్తి ముఖ్యం. దాంతో చాలా సినిమాలు వదులుకున్నాను. నా మనసుకు నచ్చిన, విలువలతో కూడిన అంశాలను ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను. అందుకే అరవై షార్ట్ ఫిలింస్ తీశాను. ► భారతదేశంలోని ధ్వజస్తంభాల్లాంటి మహనీయుల్లో కొందరి చరిత్రలైనా చెబుదామనిపించింది. ఈ క్రమంలో యువతని ప్రోత్సహించాలనుకున్నాను. ప్రతిభావంతులైన తొమ్మిది మందిని ఎంచుకుని, కథలు రాయమన్నాను. వాటిల్లో విశ్వనాథ సత్యనారాయణగారిపై సవిత్ సి. చంద్ర రాసిన కథ నచ్చడంతో తన దర్శకత్వంలోనే ‘కవి సమ్రాట్’ నిర్మించాను. తన తాతగారు సి. సుందరరామ శర్మగారు విశ్వనాథ సత్యనారాయణగారిపై రాసిన పుస్తకం ఆధారంగా సవిత్ ‘కవి సమ్రాట్’ కథని రాసి, అద్భుతంగా తెరకెక్కించాడు. ► విశ్వనాథ సత్య నారాయణగారి ఆశీర్వాదాలతోనే ఆయన పాత్రలో నటించి, నిర్మించాను. విశ్వనాథ సత్యనారాయణగారిపై కథ రాసుకుని నా వద్దకు వచ్చిన సవిత్కి, ఇలాంటి విలువలున్న చిత్రాన్ని ‘ఆహా’లో విడుదల చేసే అవకాశం కల్పించిన అల్లు అరవింద్‌గారికి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ► నేటి యువత తమను తాము నిరూపించుకోవాలనే ఆకాంక్షతో ఇండస్ట్రీకి వస్తున్నారు. అయితే వారు తమ ఆకాంక్షను బలమైన సంకల్పంగా మార్చుకున్నప్పుడే విజయం సాధిస్తారు. ప్రస్తుతం నా టీమ్‌లో నేను తప్ప మిగిలిన వారందరూ పాతికేళ్లలోపు కుర్రాళ్లే. వారి కొత్త ఆలోచనలకు నేను తోడుగా నిలబడి నటించడంతో పాటు నిర్మించి వారికి ధైర్యం ఇస్తున్నా. ► ముప్పై ఏళ్ల నా సినీ ప్రయాణంలో ఒక నటుడిగా ఇప్పటికీ నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలు మాత్రమే చేయాలనే ఆలోచన నాకు లేదు. అందుకే.. షార్ట్ ఫిలింస్ ద్వారా సమాజానికి ఉపయోగపడే కథలను ప్రేక్షకులకు చెబుతున్నాను. సినిమాల్లో సంపాదించిన డబ్బుని షార్ట్ ఫిలింస్‌కి ఖర్చు చేసేశాను. ఈ జర్నీలో లాభ, నష్టాల గురించి ఆలోచించను.. ఈ ప్రయాణాన్ని ఆపను. మూడు నాలుగు సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. అవి రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. మరికొన్ని కథలు వింటున్నాను. ► గతంలో నేను పోటీ పడ్డ తోటి హాస్యనటుల్లో చాలామంది ఇప్పుడు లేరు. అలాగే నాకు విరివిగా అవకాశాలు ఇచ్చి, ప్రోత్సహించిన దర్శకులు కూడా లేరు. పైగా గతంతో పోలిస్తే ప్రస్తుత సినిమాల్లో హాస్యనటులకు ప్రాధాన్యం ఉండటం లేదు.. అలా వచ్చి, వెళ్లిపోయే చిన్న చిన్న పాత్రలు రాస్తున్నారు. ఈ మధ్య నాకు వస్తున్న పాత్రలు మూస ధోరణిలో ఉండటంతో ఒప్పుకోవడం లేదు.. అందుకే నేను బిజీగా ఉండటం లేదు (నవ్వుతూ). వైవిధ్యమైన పాత్రలొస్తే నేనెప్పుడూ సిద్ధమే. -
ఓటీటీలకూ భారీ షాక్.. ఇకపై అలా కుదరదండి!
న్యూఢిల్లీ: కమ్యూనికేషన్ సేవలు అందించే సంస్థలన్నింటికీ ఒకే రకం నిబంధనలు అమలు చేయాలని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డిమాండ్ చేసింది. తమకు వర్తింపచేస్తున్న నిబంధనలను ఓటీటీ (ఓవర్–ది–టాప్) కమ్యూనికేషన్ యాప్స్‌కు కూడా వర్తింపచేయాలని కోరింది. అలా చేయని పక్షంలో తమ లైసెన్సులు, నియంత్రణపరమైన నిబంధనలనైనా సడలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అన్ని ‘ఓటీటీ కమ్యూనికేషన్ సేవల విషయంలో అన్ని టెక్నాలజీలకు సమానంగా రూల్స్‌ను అమలు చేయాలి. తద్వారా పరిశ్రమలో సముచితమైన, ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది‘ అని ఒక ప్రకటనలో సీవోఏఐ పేర్కొంది. ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసులను కూడా ఇటీవలి టెలికమ్యూనికేషన్స్ బిల్లు ముసాయిదాలో పొందుపర్చడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఈ తరహా సేవల విషయంలో ఎటువంటి గందరగోళం లేకుండా స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని కోరుకుంటున్నామని వివరించింది. టెలికం సంస్థలు స్పెక్ట్రం కొనుగోలు చేయం మొదలుకుని నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకోవడం వరకూ భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, అనేక నిబంధనలను పాటించాల్సి ఉంటోందని సీవోఏఐ తెలిపింది. మరోవైపు ఓటీటీలు మాత్రం టెలికం సర్వీసులను ఇలాంటి బాదరబందీలేమీ లేకుండా, ఎలాంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేకుండా అందించడం ద్వారా ప్రయోజనాలు పొందుతున్నాయని పేర్కొంది. సీవోఏఐలో టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొదలైనవి సభ్యులుగా ఉన్నాయి. వాట్సాప్ వంటి ఓటీటీ కమ్యూనికేషన్ యాప్‌లు .. ఇంటర్నెట్ టెక్నాలజీ ఆధారంగా టెలికం సంస్థల తరహాలోనే వాయిస్, వీడియో కాలింగ్ సేవలను అందిస్తున్నాయి. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
వీడియోలు, ఓటీటీ కంటెంట్.. 70 శాతం మంది ఆ వయసు వారే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ దైనందిన జీవితంలో భాగమైంది. ఖాళీ సమయాల్లో 63.36 శాతం మంది యువత మొబైల్ ఫోన్లతో గడుపుతున్నారని ఇన్ఫోటైన్మెంట్ యాప్ వే2న్యూస్ సర్వేలో తేలింది. ఇందులో 51 శాతం మంది వీడియోలు, 29 శాతం ఓటీటీ కంటెంట్ చూస్తున్నారు. మిగతావారు మ్యూజిక్ వింటున్నారు. ప్రజల ప్రాధాన్యతలు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేపట్టిన ఈ సర్వేలో 3,50,000 మందికిపైగా పాల్గొన్నారు. ఇందులో 88 శాతం మంది పురుషులు 12 శాతం స్త్రీలు ఉన్నారు. అభిప్రాయాలు వెల్లడించిన వారిలో 70 శాతం మంది 21–30 సంవత్సరాల లోపువారే. మొత్తంగా తెలంగాణ నుంచి 53 శాతం మంది ఉండగా మిగిలిన వారు ఏపీకి చెందినవారు. షాపింగ్ తీరుతెన్నులు ఇలా.. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో షాపింగ్ చేస్తున్నట్లు 31 శాతం మంది చెప్పారు. వస్తువులను ఆఫ్‌లైన్ స్టోర్లలో భౌతికంగా చూసి, బట్టలను ట్రయల్ చేసి, ఎలక్ట్రానిక్స్ చెక్ చేసిన తర్వాతే కొనేందుకు మొగ్గు చూపుతున్నామని 29.5 శాతం మంది తెలిపారు. కోవిడ్ 19 ఆంక్షలు, లాక్ డౌన్, ప్రజల్లోని భయాలతో విక్రయాలు తగ్గి ఇటీవలి సంవత్సరాల్లో తీవ్ర నష్టాలు చూసిన ఔట్లెట్లకు ఇప్పుడిప్పుడే వాక్–ఇన్స్ పెరుగుతుండటం ఉపశమనం కలిగించే అంశం. సొంత వాహనాల్లో.. ప్రస్తుతం దేశంలో కోవిడ్ ఆంక్షలు లేవు. దీంతో అందరూ తిరిగి ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 50.71 శాతం ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. చాలాకాలం పాటు దేశ ప్రజల ప్రయాణ ప్రాధాన్య క్రమంలో ఉన్న రైళ్ల వైపు ఇప్పుడు కేవలం 26 శాతం మంది మళ్లుతుండగా బస్సులను మరింత తక్కువగా 14 శాతం ఎంచుకుంటున్నారు. కోవిడ్ ప్రభావం గురించి ప్రజలకు అవగాహన పెరగడంతో జాగ్రత్తగా ప్రయాణాలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు దీన్నిబట్టి అర్థమవుతోంది. కాగా, తెలంగాణలో అధికంగా మహబూబ్ నగర్ నుంచి 39,073 మంది, నల్లగొండ 32,403, ఏపీలో వైజాగ్ 21,872, శ్రీకాకుళం నుంచి 20,921 మంది సర్వేలో పాలు పంచుకున్నారు. -
టెలికం పరిధిలోకి ఓటీటీ సంస్థలు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ కాలింగ్, మెసేజింగ్ వంటి సర్వీసులు అందించే ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సంస్థలను కూడా టెలికం లైసెన్సుల పరిధిలోకి తీసుకువచ్చేలా టెలికమ్యూనికేషన్ బిల్లు 2022 ముసాయిదాను కేంద్రం ఆవిష్కరించింది. దీంతో వాట్సాప్, జూమ్, గూగుల్ డ్యువో వంటి ఓటీటీ సంస్థలు ఇకపై దేశీయంగా కార్యకలాపాలు సాగించాలంటే లైసెన్సులు తీసుకోవాల్సి రానుంది. ముసాయిదా ప్రకారం, ఒకవేళ టెలికం లేదా ఇంటర్నెట్ ప్రొవైడింగ్ సంస్థలు తమ లైసెన్సులను వాపసు చేస్తే అవి కట్టిన ఫీజులను టెలికం శాఖ రిఫండ్ చేస్తుంది. సందర్భాన్ని బట్టి .. టెలికం నిబంధనల కింద నమోదు చేసుకున్న సంస్థ లేదా లైసెన్సుదారుకు సంబంధించి ఎంట్రీ ఫీజులు, లైసెన్సు ఫీజులు, రిజిస్ట్రేషన్ ఫీజులు లేదా ఇతరత్రా ఏవైనా ఫీజులు లేదా చార్జీలు, వడ్డీలు, అదనపు చార్జీలు, పెనాల్టీ మొదలైన వాటిని కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగానైనా రద్దు చేయవచ్చు. ‘ముసాయిదా టెలికం బిల్లు 2022పై అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాం‘ అంటూ టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు అక్టోబర్ 20 ఆఖరు తేదీ. పరిశ్రమలో నవకల్పనలకు మార్గదర్శ ప్రణాళిక: అశ్విని వైష్ణవ్ టెలికం పరిశ్రమ పునర్వ్యవస్థీకరణకు, నవకల్పనలను ఆవిష్కరించేందుకు కొత్త టెలికం బిల్లు స్పష్టమైన మార్గదర్శ ప్రణాళిక కాగలదని మంత్రి వైష్ణవ్ చెప్పారు. వచ్చే ఏడాదిన్నర–రెండేళ్లలో డిజిటల్ నియంత్రణ వ్యవస్థను సమూలంగా మార్చే ప్రక్రియ పూర్తి కాగలదని పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. సామాజిక లక్ష్యాలు, వ్యక్తుల బాధ్యతలు.. హక్కుల మధ్య సమతౌల్యం పాటించడం, ఎలాంటి టెక్నాలజీలకైనా వర్తించే విధానాలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. -
బబ్లీ చాన్స్ రావడం నా అదృష్టం
‘‘తెలుగు సినిమా అంటే గర్వంగా ఫీలవుతాను. ఎందుకంటే నా ప్రయాణం తెలుగు నుంచే మొదలైంది. రాజమౌళి, సుకుమార్‌గార్లతో పాటు చాలామంది దర్శకులు మన భారతీయ మూలాలకు చెందిన కథలనే తీసుకుంటుంటారు. ఇప్పటికీ మన భారతీయ సినిమాను ఎమోషన్సే నడిపిస్తున్నాయి’’ అన్నారు తమన్నా. మధూర్ భండార్కర్ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బబ్లీ బౌన్సర్’. స్టార్ స్టూడియోస్, జంగిలీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో తమన్నా మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో హరియానాకు చెందిన యువతిగా నటించాను. తొలిసారి లేడీ బౌన్సర్ కాన్సెప్ట్‌తో ఉన్న ఈ సినిమా చేసే చాన్స్ నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్లో ఇది బెస్ట్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మధూర్ బండార్కర్ చిత్రాల్లో నటించిన హీరోయిన్లకు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఉత్తరాదిలో కొంతమంది లేడీ బౌన్సర్స్ స్ఫూర్తితో ఈ సినిమా కథ రాసుకున్నాను. లేడీ బౌన్సర్‌గా తమన్నా ది బెస్ట్ అనిపించింది’’ అన్నారు మధూర్ భండార్కర్. -
మల్టీప్లెక్స్‌ను దాటనున్న ఓటీటీ
ముంబై: దేశీ ఓవర్ ది టాప్ (ఓటీటీ) మార్కెట్ త్వరలో మల్టీప్లెక్స్ పరిశ్రమను అధిగమించనుంది. 2018లో రూ. 2,590 కోట్లుగా ఉన్న ఓటీటీల మార్కెట్ 2023 నాటికి రూ. 11,944 కోట్లకు పెరగనుంది. ఏటా 36 శాతం వృద్ధి సాధించనుంది. తద్వారా ఒకప్పుడు వీసీఆర్‌లు, వీసీపీ, వీసీడీలను కనుమరుగయ్యేలా చేసిన మల్టీప్లెక్స్‌లను దెబ్బతీయనుంది. ఎస్బీఐ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 1980లలో తెరపైకి వచ్చిన వీసీఆర్, వీసీపీలు ఆ తర్వాత డీవీడీల్లాంటివి .. 2000ల తొలినాళ్లలో మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్‌లు కుప్పతెప్పలుగా వచ్చే వరకూ హవా కొనసాగించాయి. ఆ తర్వాత సాంకేతికాంశాలు, మల్టీప్లెక్స్‌ల ధాటికి అవి కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ఓటీటీల హవాతో మల్టీప్లెక్స్‌లకు కూడా అదే గండం పొంచి ఉందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. ఓటీటీలు ఇప్పటికే వినోద రంగంలో 7–9 శాతం వాటాను దక్కించుకున్నాయని, అన్ని భాషల్లోనూ ఒరిజినల్ కంటెంట్ అందిస్తూ 40 పైచిలుకు సంస్థలు నిలకడగా వృద్ధి చెందుతున్నాయని వివరించింది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం ప్రస్తుతం దేశీయంగా 45 కోట్ల పైచిలుకు ఓటీటీ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారని, 2023 ఆఖరు నాటికి ఈ సంఖ్య 50 కోట్లకు చేరవచ్చని గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. స్మార్ట్ టీవీలు, క్రోమ్‌కాస్ట్ వంటి ఆప్షన్లు సంప్రదాయ సినీ వినోదంపై గణనీయంగా ప్రభావం చూపాయని పేర్కొన్నారు. చౌక ఇంటర్నెట్ .. డిస్కౌంట్ల ఊతం.. ఇంటర్నెట్ వినియోగించే వారు పెరుగుతుండటం, చౌకగా వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ లభిస్తుండటం, డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరుగుతుండటం తదితర అంశాలు ఓటీటీల వృద్ధికి దోహదపడుతున్నాయి. ఆయా సంస్థలు డిస్కౌంటు రేటుకే సర్వీసులు అందిస్తుండటం కూడా ఇందుకు తోడ్పడుతోంది. డిస్నీ+హాట్‌స్టార్ (14 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్), అమెజాన్ ప్రైమ్ వీడియో (6 కోట్ల మంది), నెట్‌ఫ్లిక్స్ (4 కోట్లు), జీ5 (3.7 కోట్లు), సోనీలివ్ (2.5 కోట్లు) తదితర సంస్థలు అమెరికాతో పోలిస్తే 70–90 శాతం చౌకగా తమ ప్లన్స్ అందిస్తున్నాయి. వూట్, జీ5, ఆల్ట్‌బాలాజీ, హోయ్‌చోయ్ లాంటి స్థానిక, ప్రాంతీయ ఓటీటీలకు కూడా డిమాండ్ బాగా ఉంటోంది. 50 శాతం మంది ఓటీటీలను నెలకు 5 గంటల పైగా వినియోగిస్తుండటంతో ఆ మేరకు థియేటర్ల లాభాలకు గండిపడనుంది. సాంప్రదాయ విధానాల్లో సినిమాల నిర్మాణంతో పోలిస్తే ఓటీటీల కోసం స్ట్రీమింగ్ సిరీస్‌లు, సినిమాలను తీయడమే లాభసాటిగా ఉంటోందని పెద్ద నిర్మాణ సంస్థలు గుర్తించాయి. తమ సొంత ఓటీటీలు ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాయి. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా లేని విధంగా కోవిడ్ కాలంలో థియేటర్లు మూతబడటం.. ఓటీటీలకు లాభించింది. ఈ వ్యవధిలో 30 పైగా హిందీ సినిమాలు డిజిటల్ ప్రీమియర్ జరుపుకున్నాయి. ప్రస్తుతం ప్రాంతీయ వెబ్ సిరీస్‌లు, సినిమాలపై అంతర్జాతీయ సంస్థలు కూడా మరింతగా దృష్టి పెడుతున్నాయి. ►ఇప్పటికీ ఉచితంగా సర్వీసులు అందిస్తున్న ఓటీటీలే (యాడ్ ఆధారిత) ముందంజలో ఉంటున్నాయి. 2017లో వీటి వినియోగదారుల సంఖ్య 18.4 కోట్లుగా ఉండగా ఇది ఈ ఏడాది 35.1 కోట్లకు, 2027 నాటికి 46.6 కోట్లకు చేరనుంది. ►పే–పర్–వ్యూ సెగ్మెంట్లో సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 2018లో 3.5 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది 8.9 కోట్లకు, 2027లో 11.7 కోట్లకు చేరనుంది. ►రాబోయే రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫాంలు విద్య, ఆరోగ్యం, ఫిట్నెస్ తదితర రంగాల్లోకి కూడా విస్తరించనున్నాయి. తద్వారా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నాయి. ఓటీటీలతో కంటెంట్ క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి -
కథ విని ఆశ్చర్యపోయాను
హెబ్బా పటేల్, వశిష్ఠ సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో అశోక్ తేజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. దర్శకుడు సంపత్ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లేతో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో హెబ్బా పటేల్ మాట్లాడుతూ – ‘‘సంపత్ నందిగారు చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాను. నా కెరీర్లో నేను చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. సవాల్‌గా తీసుకుని చేశాను. నటిగా ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను’’ అన్నారు. ‘‘ఓదెల రైల్వేస్టేషన్’ క్రైమ్ థ్రిల్లర్. 50 రోజుల్లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినా కోవిడ్ వల్ల రిలీజ్ కాస్త ఆలస్యమైంది’’ అన్నారు రాధామోహన్. ‘‘నాకు దర్శకుడిగా చాన్స్ ఇచ్చిన సంపత్ నందిగారికి రుణపడి ఉంటాను. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వస్తుంది’’ అన్నారు అశోక్ తేజ్. ‘‘ఈ సినిమా కథ విన్నపుడు థ్రిల్ అయ్యాను. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది’’ అన్నారు వశిష్ఠ సింహ. ‘‘ఇప్పటివరకు ఎక్కువగా సాఫ్ట్ పాత్రలు చేసిన నేను ఇందులో సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా చేశాను’’ అన్నారు సాయి రోనక్. ఈ కార్యక్రమంలో ‘ఆహా’ ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
షరతులు వర్తిస్తాయి..: ఓటీటీ.. ఇంకాస్త చౌకగా!
(మంథా రమణమూర్తి) మిగిలిన దేశాలు వేరు. ఇండియా వేరు. ఇక్కడ రేటే రాజు. నాణ్యత, సర్వీసు వీటన్నిటిదీ ఆ తరువాతి స్థానమే. ధర కాస్త తక్కువగా ఉంటే... ఓ అరకిలోమీటరు నడిచైనా వెళ్లి తెచ్చుకునే మనస్తత్వం సగటు భారతీయ వినియోగదారుది. వినోదాన్ని నట్టింట్లోకి తీసుకొచ్చిన ఓటీటీ సంస్థలన్నీ ఇపుడిపుడే ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నాయి. కోవిడ్ కాలంలో వీక్షకుల సంఖ్య పెంచుకోవటమే లక్ష్యంగా ఎడాపెడా ఆఫర్లిచ్చేసి... కంటెంట్ కోసం వందల కోట్లను ఖర్చు చేసిన ఓటీటీలు... పరిస్థితులిపుడు సాధారణ స్థాయికి రావటంతో ఆదాయంపై దృష్టి పెట్టాయి. లాభాలు రావాలంటే సబ్స్క్రిప్షన్ ఫీజు మాత్రమే సరిపోదనే ఉద్దేశంతో... సినిమాలు, షోల మధ్యలో ప్రకటనలు ప్రసారం చేసి భారీ ఆదాయాన్ని ఆర్జించేలా ప్రణాళికలు వేస్తున్నాయి. దీనికోసం ఉచితం... ప్రీమియం.. పే–పర్ వ్యూ వంటి పలు మోడళ్లను వీక్షకులకు అందుబాటులో ఉంచనున్నాయి. ఇదే జరిగితే... ఓటీటీ యుగంలో మరో దశ మొదలైనట్లే. వినియోగదారులకు మరింత నాణ్యమైన కంటెంట్... మరింత తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌కు తత్వం బోధపడింది.... ప్రపంచ ఓటీటీ రారాజు నెట్‌ఫ్లిక్స్‌లో... ఎన్నటికీ ప్రకటనలు ఉండవని సీఈఓ రీడ్ హేస్టింగ్స్ కొన్నాళ్ల కిందటి వరకూ పదేపదే చెప్పారు. 2011 నుంచీ ప్రతి ఏటా రెండంకెలకు తగ్గని ఆదాయ వృద్ధి... అసలు సబ్స్క్రయిబర్లు తగ్గటమనేదే లేని చరిత్ర నెట్‌ఫ్లిక్స్‌ది. అదే ధీమాతో ఇటీవల రేట్లు పెంచేసి, పాస్వర్డ్ షేరింగ్‌కు ప్రత్యేక ఛార్జీలు విధించారు. దీంతో జనవరి–మార్చి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్‌కు 2 లక్షల మంది గుడ్‌బై కొట్టేశారు. ఇది ఊహించని షాక్. ఒక్కసారిగా షేరు పడిపోవటమే కాదు... వందల కొద్దీ ఉద్యోగాలూ పోయాయి. ఏప్రిల్– జూన్‌లోనూ ఈ షాక్ కొనసాగింది. ఏకంగా 10 లక్షల మంది మైనస్ కావటంతో సంస్థ పునరాలోచనలో పడింది. సబ్స్క్రిప్షన్ ఆదాయంపైనే ఆధారపడితే కష్టమని... అవసరమైతే చార్జీలు తగ్గించి ప్రకటనలు కూడా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ‘ప్రకటనల విషయంలో కాస్త పరిణతి ఉన్న మార్కెట్లలో ముందు మొదలుపెడతాం’ అన్నారు రీడ్. యాడ్ మార్కెట్ విషయంలో ఇండియా పరిణితి చెందిందో లేదో తెలీదు గానీ.. ఇక్కడ వచ్చే ఏడాది మొదటి నుంచీ నెట్‌ఫ్లిక్స్ తెరపైప్రకటనలు మాత్రం కనిపించబోతున్నాయి. అమెజాన్‌కు ఆ అవసరం లేదా? ప్రకటనతో కూడిన వీడియో ఆన్ డిమాండ్ (ఏవీవోడీ) సేవలపై స్ట్రీమింగ్ దిగ్గజాల్లో ఒకటైన అమెజాన్ ఇప్పటిదాకా ఏ ప్రకటనా చేయలేదు. డిస్నీ హాట్‌స్టార్ ఇప్పటికే ఏవీవోడీ మోడల్‌ను అమలు చేసి భారతీయుల మది గెలుచుకుంది. నెంబర్–1 స్థానంతో పాటు 3.6 కోట్ల యాప్ డౌన్‌లోడ్స్‌తో దేశంలో అత్యధిక వాటానూ సొంతం చేసుకుంది. ఎంఎక్స్ ప్లేయర్, జీ, ఊట్, సోనీ లివ్, సన్ నెక్స్›్ట వంటి ఇతర స్ట్రీమింగ్ సంస్థలు కూడా డిస్నీ మాదిరిగా సబ్స్క్రిప్షన్ ఆదాయం ఒక్కటే అయితే కష్టమన్న ఉద్దేశంతో ప్రకటనలకు ఎప్పుడో గేట్లు తెరిచేశాయి. యాడ్స్ ఆదాయం భారీగా వస్తుండటంతో ఇంతటి పోటీని సైతం తట్టుకోగలుగుతున్నాయి. దీనిపై ట్రస్ట్ రీసెర్చ్ అడ్వయిజరీ (ట్రా) సీఈఓ చంద్రమౌళి నీలకంఠన్‌ను ‘సాక్షి’ సంప్రతించగా.. ‘‘అవును! ధర తగ్గితే మధ్య మధ్యలో కొన్ని ప్రకటనలొచ్చినా మన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అందుకే ఓటీటీ కంపెనీలు అవసరమైన మోడళ్లను తెచ్చే పనిలోపడ్డాయి. అమెజాన్ మాత్రం తన ప్రైమ్ వీడియో తెరపై ప్రకటనలకు చోటివ్వకపోవచ్చు. ఎందుకంటే దాని ప్రధాన వ్యాపారం వీడియో కంటెంట్ కాదు. తన సభ్యులకిస్తున్న రకరకాల సర్వీసుల్లో ఇదీ ఒకటి. దానికి నిధుల కొరత కూడా లేదు’’ అని అభిప్రాయపడ్డారు. ఓటీటీ తెరపై ప్రకటనలు ఇపుడిపుడే పెరుగుతున్నాయని. వచ్చే ఏడాది కాలంలో దీనికొక రూపం రావచ్చని చెప్పారాయన. ‘‘ఇండియా మిగతా దేశాల్లాంటిది కాదు. ఇక్కడ ప్రాంతీయ భాషల బలం ఎక్కువ. వీడియో కంటెంట్‌లోనూ వాటికి ప్రాధాన్యముంది. అందుకే స్థానిక చానెళ్లు కూడా ప్రకటనల విషయంలో ఓటీటీలకు గట్టి పోటీనే ఇస్తాయి’’ అన్నారు. ఆహా... నెట్‌ఫ్లిక్స్ దారిలోనే తెలుగు కంటెంట్‌కు ప్రత్యేకమైన స్ట్రీమింగ్ సంస్థ ‘ఆహా’ కూడా ఇపుడు ఏవీవోడీ వైపు చూస్తోంది. దీనిపై సంస్థ బిజినెస్ స్ట్రాటజీ హెడ్ రామ్‌శివ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘మన మార్కెట్ చాలా భిన్నం. తక్కువ ధరకో, ఫ్రీగానో వచ్చే కంటెంట్‌లో కొన్ని యాడ్స్ ఉన్నా వీక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఇలాంటి వారి కోసం మరికొన్ని ప్లాన్లను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అన్నారాయన. ప్రీమియం కోరుకునేవారి కోసం ప్రస్తుత ప్లాన్లు యథాతథంగా ఉంటాయని స్పష్టంచేశారు. యాప్ యానీ సంస్థ 2022 నివేదికలో... దేశంలో డిస్నీ హాట్‌స్టార్‌కు 3.6 కోట్లు, అమెజాన్‌కు 1.7 కోట్ల యూజర్లు ఉన్నట్లు వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్‌కు 43–45 లక్షల సభ్యులుంటారనేది మార్కెట్ వర్గాల అంచనా. ఇది దేశీ టాప్–10లోనూ లేదు. యాడ్స్‌ను స్కిప్ చేయాలని ఉన్నా... అందుకోసం ప్రీమియం మొత్తాన్ని వెచ్చించాలంటే మాత్రం చాలా మంది వెనకాడుతున్నారని, అందుకే ఏవీవోడీ ద్వారా ఓటీటీ సంస్థలు భారీ ఎత్తున ఆదాయాన్ని ఆర్జించనున్నాయని డెలాయిట్ 2022 నివేదిక తెలిపింది. ‘‘ఏవీవోడీ మార్కెట్ మున్ముందు ఎస్వీవోడీని దాటిపోతుంది. 2021 లో 1.1 బిలియన్ డాలర్లుగా (రూ.8,800 కోట్లు) ఉన్న ఏవీవోడీ మార్కెట్ 2026 నాటికి 2.4 బిలియన్ డాలర్లకు (రూ.19,200 కోట్లు) చేరుతుంది. ఇదే సమయంలో ఎస్‌వీవోడీ మాత్రం 80 లక్షల డాలర్ల్ల (రూ.6,400 కోట్లు) నుంచి 2.1 బిలియన్ డాలర్లకు (రూ. 16,800 కోట్లు) చేరుతుంది’’ అని డెలాయిట్ అంచనా వేసింది. మొత్తంగా దేశంలో ఓటీటీ మార్కెట్ వచ్చే పదేళ్లలో 20% కాంపౌండింగ్ వృద్ధిని సాధిస్తుందని సంస్థ పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 10.2 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు ఉండగా 2026 నాటికి వీరి సంఖ్య 22.4 కోట్లకు చేరుతుందని డెలాయిట్ తెలిపింది. యాడ్స్ నుంచి ప్రీమియంవైపు కూడా...! చేతిలో కంటెంట్ ఉన్నపుడు దాన్ని యాడ్స్‌తో... యాడ్స్ లేకుండా ఎలాగైనా చూపించవచ్చన్నది ఓటీటీ సంస్థల ఉద్దేశం. అందుకే అగ్రిగేషన్ సేవలు కూడా అందిస్తూ ఏవీవోడీ మార్కెట్లో చెప్పుకోదగ్గ వాటా ఉన్న ఎంఎక్స్ ప్లేయర్.... ఇటీవలే రూ.299 వార్షిక సభ్యత్వ రుసుముతో ఎంఎక్స్ గోల్డ్ పేరిట ప్రీమియం సేవలు ఆరంభించింది. ప్రస్తుతం భారతీయ ఏవీవోడీ మార్కెట్లో ఎంఎక్స్ ప్లేయర్, యూట్యూబ్, డిస్నీ హాట్‌స్టార్‌దే హవా. ఈ 3 సంస్థలకూ ఉమ్మడిగా 65 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇవి వినోద కంటెంట్‌తో పాటు అగ్రిగేషన్, స్పోర్ట్స్ కూడా అందిస్తుండటం వీటికి కలిసొస్తోంది. నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్లేయర్లు కూడా వస్తే ఏ మార్పులొస్తాయో తెరపై చూడాల్సిందే!. -
టైటిల్ పాజిటివ్‌గా ఉంది
‘‘హైవే’ టైటిల్ పాజిటివ్‌గా ఉంది. ట్రైలర్ చూడగానే ‘ఆవారా, రాక్షసుడు’ చిత్రాలు చూసినట్టుంది. ఇలాంటి మంచి సినిమాలు తీస్తున్నందుకు నిర్మాత వెంకట్‌గారికి థ్యాంక్స్’’ అని హీరో నాగశౌర్య అన్నారు. ఆనంద్ దేవరకొండ, మానస జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హైవే’. నార్త్‌స్టార్ సమర్పణలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, వెంకట్ తలారి ప్రొడక్షన్స్‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను నాగశౌర్య విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నాకు లవర్ బాయ్ అని ప్రేక్షకులు ట్యాగ్ ఇచ్చారు. కానీ ఆనంద్కి ఎలాంటి ట్యాగ్ లేకపోవడంతో వేర్వేరు జానర్ల సినిమాలను చేస్తున్నారు.. అది చాలా గొప్ప లక్షణం’’ అన్నారు. ‘‘హైవే’ చక్కని ప్రయోగాత్మక చిత్రం’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ‘‘సరికొత్త కథాంశంతో రూపొందిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తా రని ఆశిస్తున్నాను’’ అన్నారు కేవీ గుహన్. ‘‘అద్భుతమైన థ్రిల్లర్ చిత్రం ఇది’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. ‘ఆహా’ మార్కెటింగ్ హెడ్ కార్తీక్, హీరోయిన్ మానస మాట్లాడారు. -
Azadi Ka Amrit Mahotsav 2022: వెండితెరపై వందేమాతరం
సినీ ప్రేక్షకులకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు మరో ఏడాది పాటు కొనసాగనున్నాయి. ఎలాగంటే రానున్న రోజుల్లో పలు దేశభక్తి చిత్రాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. ఓవైపు సినిమాలు.. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వేదికగా దేశభక్తి ఉప్పొంగనుంది. పలువురు స్వాతంత్య్రోద్యమ వీరుల చరిత్రలు, కాల్పనిక కథలతో దేశభక్తి చిత్రాలు రూపొందుతున్నాయి. వెండితెరపై వందేమాతరం అంటూ రానున్న ఆ ప్రాజెక్ట్స్ విశేషాలు తెలుసుకుందాం. బయోపిక్‌ల వెల్లువ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న పలువురు స్వాతంత్య్ర సమర యోధుల జీవితాల ఆధారంగా పలు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన ఖుదీరామ్ బోస్ జీవితం వెండితెరపైకి రానుంది. ‘ఖుదీరామ్ బోస్’ టైటిల్‌తో జాగర్లమూడి పార్వతి సమర్పణలో విజయ్ జాగర్లమూడి నిర్మించారు. ఖుదీరామ్ పాత్రను రాకేష్ జాగర్లమూడి పోషించారు. ఇతర పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ కనిపిస్తారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆదివారం ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. అటు హిందీలో స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక దామోదర వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా ‘స్వతంత్య్ర్ వీర్ సావర్కర్’ టైటిల్‌తో సినిమా రూపొందుతోంది. వీర్ సావర్కర్ పాత్రను రణ్‌దీప్ హుడా చేస్తున్నారు. నటుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే 1971లో భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన ఆర్మీ చీఫ్ సామ్ మానెక్ షా జీవితం ఆధారంగా సినిమా రానుంది. ‘సామ్ బహదూర్’ టైటిల్‌తో విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. 1971 భారత్ – పాక్ యుద్ధంలో పోరాడిన మరో వీర జవాను బ్రిగేడియర్ బల్‌రామ్‌సింగ్ మెహతా జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ‘పిప్పా’. బల్రామ్ సింగ్ మెహతా పాత్రను ఇషాన్ కట్టర్ చేస్తున్నారు. బల్రామ్ సింగ్ మెహతా స్వయంగా రాసిన ‘ది బర్నింగ్ చఫీస్’ పుస్తకం ఆధారంగా రాజా కృష్ణమీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. డిసెంబర్ 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలను కుంటున్నారు. 1971 యుద్ధంలోనే వీర మరణం పొందిన యువ సైనికుడు అరుణ్ ఖేతర్పాల్ జీవితంతో రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్’. ఖేతర్పాల్ పాత్రను వరుణ్ ధావన్ పోషిస్తుండగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది. జీవిత కథలు కాదు కానీ.. ఒకవైపు జీవితకథలతో సినిమాలు రూపొందుతుంటే మరోవైపు కాల్పనిక దేశభక్తి చిత్రాలు కూడా రానున్నాయి. వీటిలో ‘భారతీయుడు 2’ ఒకటి. దేశం కోసం ప్రాణాలర్పించడానికి సైతం వెనకాడని స్వాతంత్య్ర సమరయోధుడు సేనాధిపతి దేశానికి పట్టిన చీడపురుగులాంటి కన్న కొడుకుని మట్టుబెట్టే కథతో రూపొందిన చిత్రం ‘ఇండియన్’ (భారతీయుడు). కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రా నికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రానుంది. కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్లోనే సీక్వెల్ రూపొందు తోంది. అటు హిందీలో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ‘కెప్టెన్ ఇండియా’ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం. అయితే ఇది జీవిత కథ కాదు. దేశ చరిత్రలో ఓ కీలక రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీక్ పైలెట్ పాత్ర చేస్తున్నారు. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాల్లో దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘తేజస్’. కంగనా రనౌత్ లీడ్ రోల్లో సర్వేశ్ మేవారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కంగన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలెట్‌గా నటిస్తున్నారు. ‘ఆకాశాన్ని ఏలాలనుకున్న ఓ మహిళ స్ఫూర్తిదాయకమైన కథ ఇది’ అన్నారు కంగనా రనౌత్. అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఓటీటీకి గాంధీ బయోపిక్ జాతి పిత మహాత్మా గాంధీ జీవితంతో వెండితెరపై పలు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వెబ్ సిరీస్‌గా గాంధీ జీవితం రానుంది. గాంధీ దక్షణాఫ్రికాలో గడిపిన రోజులను, భారత స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాన్ని, గాంధీ జీవితంలో తెలియని కోణాలతో పలు సీజన్లుగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించనున్నారు. ఈ సిరీస్‌లో గాంధీ పాత్రను ప్రతీక్ గాంధీ పోషించనున్నారు. ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ రచించిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’, ‘గాంధీ: ద ఇయర్స్ దట్ ఛేంజ్డ్ ద వరల్డ్’ పుస్తకాల ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఇంకా పలు దేశభక్తి చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రానున్నాయి. -
కృష్ణవంశీ, క్రిష్, విక్రమ్ కె. కుమార్, హను రాఘవపూడి వెబ్ సిరీస్‌లివే!
ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అంటే గతంలో థియేటరే.. కానీ, ప్రస్తుతం బుల్లితెర కూడా ఇంటిల్లిపాదికీ వినోదం పంచుతోంది. పైగా కరోనా లాక్డౌన్లో ప్రేక్షకులకు ఓటీటీలు మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యాయి. ఇంట్లో కూర్చునే అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్‌లు, షోలు చూస్తున్నారు. వెబ్ సిరీస్‌లకు ఆదరణ బాగా ఉండటంతో సినిమా దర్శకులు సైతం ‘ఓటీటీకి సై’ అంటూ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు ఓటీటీలోకి ఎంటర్ కాగా తాజాగా ఈ జాబితాలోకి కృష్ణవంశీ, క్రిష్, విక్రమ్ కె. కుమార్, హను రాఘవపూడి వంటి దర్శకులు చేరారు. ఈ దర్శకుల ఓటీటీ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్షన్, యాక్షన్, లవ్, ఫ్యామిలీ.. ఇలా ఏ జోనర్ సినిమా అయినా తన మార్క్ చూపించారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఆయన దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. తదుపరి ప్రాజెక్ట్‌గా దాదాపు రూ. 300 కోట్లతో ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు ఈ మధ్యనే ప్రకటించారు కృష్టవంశీ. తెలంగాణ సాయుధ పోరాటాన్ని వెబ్ సిరీస్‌గా మలచనున్నట్లు తెలిపారాయన. ఒక్కో సీజన్‌కు 10 ఎపిసోడ్స్ చొప్పున 5 సీజన్స్‌గా ఈ సిరీస్‌ని రూపొందించనున్నారట. ఇక సమాజంలోని వాస్తవ అంశాలను, నవలలను, చారిత్రక అంశాలను కథలుగా మలిచి వెండితెరపైకి తీసుకురావడంలో క్రిష్ జాగర్లమూడిది ప్రత్యేక శైలి. ఇప్పటికే ‘మస్తీస్, 9 అవర్స్’ వంటి వెబ్ సిరీస్‌లకు షో రన్నర్‌గా వ్యవహరించిన ఆయన తొలిసారి ఓ వెబ్ సిరీస్‌ని డైరెక్ట్ చేయనున్నారని టాక్. ఒక వేశ్య జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా ‘హరి హర వీర మల్లు’ షూటింగ్లో బిజీగా ఉన్న క్రిష్ ఆ తర్వాత ఈ వెబ్ సిరీస్‌ను పట్టాలెక్కిస్తారని భోగట్టా. కాగా ‘కన్యాశుల్కం’ నవలను కూడా వెబ్ సిరీస్‌గా తీయాలనుకుంటున్నార ట క్రిష్. మరో దర్శకుడు విక్రమ్ కె. కుమార్ వినూత్న కథాంశాలతో ‘24’, ‘మనం’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ప్రేమ కథలతో యువతని, కుటుంబ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసిన విక్రమ్ కె. కుమార్ బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టనున్నారు. తొలిసారి ఆయన ‘దూత’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ ద్వారా హీరో నాగచైతన్య ఫస్ట్ టైమ్ డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ‘మనం, థ్యాంక్యూ’ చిత్రాల తర్వాత చైతన్య–విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘దూత’ హారర్, థ్రిల్లర్ జానర్లో ఉంటుందని సమాచారం. నాగచైతన్య పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ఇందులో హీరోయిన్లు పార్వతి, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఓ ప్రముఖ ఓటీటీలో ‘దూత’ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘అందాల రాక్షసి’ వంటి ప్రేమకథా చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, గత శుక్రవారం విడుదలైన ‘సీతారామం’ వరకూ ప్రేమకథా చిత్రాలను తెరకెక్కిస్తూ లవ్‌స్టోరీస్ స్పెషలిస్టు అనిపించు కున్నారు హను రాఘవపూడి. ప్రేమకథలకు సెంటిమెంట్, భావోద్వేగాలను జత చేసే ఆయన తొలిసారి ఓ వెబ్ సిరీస్‌కి పచ్చజెండా ఊపారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సిరీస్‌లోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివ రాలు అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఓటీటీ ప్రాజెక్ట్స్ ప్రకటించినవారిలో దర్శకుడు తేజ ఉన్నారు. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు ఆ మధ్య ప్రకటించారాయన. అయితే ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలియాల్సి ఉంది. కొందరు యువదర్శకులు కూడా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘పిట్ట కథలు’లో ఓ ఎపిసోడ్‌కి దర్శకత్వం వహించారు. తాజాగా సోనీ లివ్ కోసం ఓ వెబ్ సిరీస్ కమిట్ అయ్యారు. అలాగే ‘బెస్ట్ యాక్టర్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, వజ్ర కవచధర గోవింద’ వంటి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ పవార్ ‘బిగ్ బాస్’ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘అసుర’ మూవీ డైరెక్టర్ కృష్ణ విజయ్ కూడా ‘పరంపర’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. గోపీచంద్ హీరోగా ‘పంతం’ సినిమాని తెరకెక్కించిన కె. చక్రవర్తి రెడ్డి ‘పులి–మేక’ అనే ఓ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఆది సాయికుమార్, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ సిరీస్ షూటింగ్ జరుపుకుంటోంది. వీరితో పాటు మరికొందరు దర్శకులు వెబ్ సిరీస్‌ల కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నారు. -
కట్టె కొట్టె తెచ్చే...మెచ్చే!
ఓటీటీ బడిలో సృజనాత్మక పాఠాలు నేర్చుకుంటున్న యువతరం... దృశ్యలోకంలోనే ఉండిపోవడం లేదు. పుస్తక ప్రపంచం వైపు కూడా తొంగిచూస్తోంది. గంటల కొద్దీ సమయం పుస్తకాలు చదివే ఆసక్తి లేకపోయినా, రకరకాల జానర్స్‌లోని పుస్తక సాహిత్యాన్ని సంక్షిప్త రూపంలో అందిస్తున్న డిజిటల్ వేదికలు యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి... ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు యూత్ మహారాజ పోషకులు అనే సత్యాన్ని రకరకాల సర్వేలు ఎప్పటికప్పుడు బలపరుస్తున్నాయి. కరోనా లాక్డౌన్ తరువాత ఓటీటీ వేదికల వైపు ఆకర్షితులవుతున్న యువతరం శాతం పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఈ ధోరణి మంచికా? చెడుకా? అనే చర్చలో ‘ఓటీటీ వల్ల యువత కోల్పోతుందా? నేర్చుకుంటుందా?’ అనే ప్రధాన ప్రశ్న ముందుకు వచ్చింది. ‘నేర్చుకున్నదే ఎక్కువ’ అనేది చాలామంది అభిప్రాయంగా వినబడుతుంది. ‘లాక్డౌన్ టైమ్‌కు ముందు ఓటీటీ గురించి వినడం తప్ప పెద్దగా తెలియదు. అయితే అందులోకి వెళ్లాక మైండ్‌బ్లోయింగ్ అనిపించే ఎన్నో చిత్రాలను చూశాను. మూడు ఫైట్లు, ఆరు పాటలు చూసీచూసీ మొహం మొత్తిన ప్రేక్షకులకు ఓటీటీ కంటెంట్ పెద్ద మార్పు అని చెప్పవచ్చు. ఇలా కూడా సినిమా తీయవచ్చా, ఇలాంటి సబ్జెక్ట్‌తో కూడా తీయవచ్చా! అని ఎన్నోసార్లు అనిపించింది’ అంటుంది కోల్‌కతాకు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ నిఖిల. పుస్తకాలు చదవడం వల్ల సృజనాత్మకత పదును తేరుతుంది. కొత్త సబ్జెక్ట్‌లు రాసుకోవడానికి వీలవుతుంది. కొత్త సబ్జెక్ట్‌లకు ఓటీటీ ఓకే అంటుంది. అయితే ఈ ఎస్ఎంఎస్ల కాలంలో పేజీలకు పేజీలు చదివే ఓపిక యూత్‌కు ఉందా? ఇప్పుడు మనం అనుష్క శెట్టి(బెంగళూరు)ని పరిచయం చేసుకుందాం (హీరోయిన్ కాదు) ఒకప్పుడు అనుష్క శెట్టి పుస్తకాల పురుగు. ఎన్నో పుస్తకాలు చదివింది. అయితే తాను సైతం మొబైల్ ఫస్ట్–జెనరేషన్లో భాగం కావడానికి ఎంతకాలం పట్టలేదు. సోషల్ మీడియా, టెక్ట్సింగ్ యాప్స్ పైనే ఎక్కువ సమయాన్ని కేటాయించేది. ఈ నేపథ్యంలో ‘యూత్–బుక్‌రీడింగ్’ గురించి ఆలోచించగా, ఆలోచించగా ఆమెకు ఒక ఐడియా తట్టింది. అదే..ప్లాప్ స్టోరీస్! ‘ఎడ్యుటెయిన్’ నినాదంతో రంగంలోకి దిగిన ఈ గ్లోబల్ ఇంటరాక్షన్ ఫిక్షన్ ఎంటర్ టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ బైట్–సైజ్డ్ ఫిక్షన్‌ను యూత్‌కు చేరువ చేస్తుంది. ‘యువతరాన్ని ఆకట్టుకోవడానికి పబ్లిషింగ్ ఇండస్ట్రీలో వినూత్న ప్రయత్నాలు జరగడం లేదు. కిండిల్ డిజిటల్ రీడింగ్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, అది పేపర్ డిజిటలైజేషన్ మాత్రమే. ఈ నేపథ్యంలో పుస్తకపఠనాన్ని ప్లాప్ రూపంలో పునరావిష్కరించాం. టెక్ట్స్, వీడియో, ఆడియోల రూపంలో తక్కువ టైమ్‌లో యూత్‌కు సాహిత్యాన్ని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాం’ అంటుంది ప్లాప్ స్టోరీస్ కో–ఫౌండర్ అనుష్క షెట్టి. ‘రీడింగ్ ట్రెండింగ్ అగేన్’ అనుకునే మంచి రోజులు రావాలని ఆశిస్తుంది అనుష్క. క్రియేటర్స్‌గా రాణించడానికి సినిమాలు ఎంత ఉపయోగపడుతాయో, పుస్తక సాహిత్యం కూడా అంతే ఉపయోగపడుతుంది. అయితే పుస్తకాలు చదవడానికి గంటలకొద్దీ సమయాన్ని కేటాయించడానికి యువత సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో తక్కువ టైమ్‌లో పుస్తక సారాంశాన్ని తెలుసుకునే వేదికకు రూపకల్పన చేశాం. ట్రెయిలర్ నచ్చితే ఎలాగైనా సినిమా చూడాలనుకుంటాం. ఒక పుస్తకం లేదా నవల, కథ గురించి క్లుప్తంగా తెలుసుకున్నవారు మూలం చదివే ప్రయత్నం చేస్తారు అనేది మా నమ్మకం. – అనుష్క శెట్టి, ప్లాప్ స్టోరీస్, కో–ఫౌండర్ -
అలా భయపెట్టడం ఇష్టం: రాజమౌళి
‘‘హారర్ జానర్లో రెండు టైప్స్. ఒకటి ఐడియాతో భయపెట్టడం. మరోటి సడన్‌గా ఎవరో వెనకనుంచి రావడం లేదా సౌండ్‌తో భయపెట్టడం. నాకు ఐడియాతో భయపెట్టడం ఇష్టం. ‘అన్యా’స్ ట్యుటోరియల్ చూసినవారు ఎందుకు మాయం అవుతున్నారనే ఐడియా ఇంట్రెస్టింగ్గా ఉంది. పల్లవి, సౌమ్యల ఫ్రెష్ వర్క్, కొత్త ఐడియాలజీ, ఉత్సాహం బాగున్నాయి’’ అన్నారు దర్శకుడు రాజమౌళి. రెజీనా, నివేదితా సతీష్ ముఖ్య తారలుగా పల్లవి గంగిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘అన్యా’స్ ట్యుటోరియల్’. ఆర్కా మీడియా, ఆహా నిర్మించిన ఈ సిరీస్ జూలై 1 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్ లాంచ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాజమౌళి. ‘‘అన్యా’స్ ట్యుటోరియల్’ కథను నిర్మాత అల్లు అరవింద్‌గారికి చెప్పాను. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ చెప్పాను. ‘మొదటిసారి నువ్వు చెప్పిన సీన్ ఎందుకు తీసేశావు? అని అడిగారు’. ఎన్నో కథలు వినే ఆయన ఓ చిన్న సీన్‌ను ఎలా గుర్తుపెట్టుకున్నారా? అని ఆశ్చర్యం వేసింది. ఇదే ఆయన సక్సెస్‌కు ఓ సీక్రెట్ కావొచ్చు’’ అన్నారు పల్లవి గంగిరెడ్డి. ‘‘ఆహా’ టీమ్‌తో కలిసి ఇలాంటి కాన్సెప్ట్‌తో వస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు శోభు యార్లగడ్డ. -
అలా చేస్తే చేటు తప్పదు
‘‘ఈ మధ్య నిర్మాతలు త్వరగానే సినిమాలను ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు. ఇలా చేస్తే చేటు తప్పదేమో. మా ‘పక్కా కమర్షియల్’ చిత్రం మాత్రం ఆలస్యంగానే ఓటీటీకి వస్తుంది’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘టి. కృష్ణ (హీరో గోపీచంద్ తండ్రి) గొప్ప దర్శకులు. ఆయనతో మా బ్యానర్లో ఓ సినిమా తీయాలనుకున్నాను. కుదర్లేదు. ఇప్పుడు వారి అబ్బాయి గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’ సినిమా తీసినందుకు సంతోషంగా ఉంది. గోపీచంద్‌లో ఉన్న కామెడీని దర్శకుడు మారుతి బాగా బయటకు తీశారు. ఈ సినిమాను బాగా ఖర్చు పెట్టి తీశాం’’ అన్నారు. ‘‘రణం’, ‘లౌక్యం’ తర్వాత మళ్లీ అంత ఫన్ ఉన్న సినిమా చేశాను. ‘పక్కా కమర్షియల్’ కథలో హ్యూమర్‌కు మంచి స్కోప్ ఉంది. మారుతి రాసిన కథకు న్యాయం చేశాననే అనుకుంటున్నాను’’ అన్నారు గోపీచంద్. ‘‘నా నుంచి ప్రేక్షకులు ఆశించే కామెడీకి ఇతర అంశాలు జోడించి తీసిన చిత్రం ‘పక్కా కమర్షియల్’’ అన్నారు మారుతి. ‘‘ఎంటర్ టైన్మెంట్కు మంచి యాక్షన్ కుదిరిన చిత్రం ఇది’’ అన్నారు బన్నీ వాసు. ‘‘ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ‘ప్రతిరోజూ పండగ’ చిత్రంలో నేను చేసిన ఏంజెల్ ఆర్నా పాత్రకు రెండు రెట్ల వినోదం ఈ సినిమాలో ఉంటుంది’’ అన్నారు రాశీ ఖన్నా. సహనిర్మాత ఎస్కేఎన్ పాల్గొన్నారు. -
Panchayat season 2: మంచి మనుషులకు గట్టి దెబ్బలు
కోట్లాది అభిమానులు ఎదురు చూస్తూ వచ్చిన పంచాయత్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ వచ్చేసింది. ‘ఫులేరా’ అనే పల్లెటూళ్లో పంచాయతీ ఆఫీసులో ఆ ఆఫీసు ఉద్యోగికి, ఊళ్లోని వారికి మధ్య స్నేహంతో మొదటి సీజన్ సాగితే ఇప్పుడు ముఖ్యపాత్రలకు గట్టి విరోధులు ఈ సీజన్లో కనిపిస్తారు. సహజత్వం, హాస్యం, అనుబంధంతో ఆకట్టుకుంటున్న ఈ సిరీస్ అమేజాన్‌లో మళ్లీ ఒకసారి ప్రేక్షకులను బింజ్ వాచింగ్ చేయిస్తోంది. 8 ఎపిసోడ్ల సెకండ్ సీజన్ పరిచయం ఈ ఆదివారం. అదే ఊరు. అదే పంచాయతీ ఆఫీసు. వేరే గది తీసుకోకుండా ఆ పంచాయతీ ఆఫీసులోనే నివసించే ఉద్యోగి అభిషేక్. అతన్ని అభిమానంగా చూసుకునే పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఆఫీసు అసిస్టెంట్ వికాస్... 2020లో ‘పంచాయత్’ వెబ్ సిరీస్ వచ్చినప్పుడు పాత దూరదర్శన్ సీరియల్స్‌లా అనిపించి దేశమంతా చూసింది. పంచాయత్ వెబ్ సిరీస్‌కు విపరీతంగా అభిమానులు ఏర్పడ్డారు. సెకండ్ సీజన్ కోసం విన్నపాలు, ఒత్తిళ్లు తెచ్చారు. లాక్డౌన్ వల్ల ఆ పనులన్నీ ఆగిపోయి ఇప్పుడు పూర్తయ్యి ‘పంచాయత్ సీజన్ 2’ స్ట్రీమ్ అవుతోంది. మళ్లీ అభిమానులను అలరిస్తోంది. ఫులేరాలో ప్రత్యర్థులు ఉత్తరప్రదేశ్‌లోని ‘ఫులేరా’ అనే కల్పిత ఊరిలో జరిగినట్టుగా చెప్పే ఈ కథలో అందరూ మంచివాళ్లే. అమాయకులే. ఒకరికొకరు సాయం చేసుకునేవారే. కాని ఆ ఊరికి గ్రామ సచివాలయ ఉద్యోగిగా వచ్చిన అభిషేక్‌కు ఎం.బి.ఏ చదివి వేరే ఉద్యోగం చేయాలని ఎంట్రన్స్ టెస్ట్‌కు ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఈ లోపల అతనికి ఆ ఊరి సర్పంచ్‌తో, ఉప సర్పంచ్‌తో, అసిస్టెంట్‌తో మంచి స్నేహం ఏర్పడుతుంది. నిజానికి ఆ ఊరి సర్పంచ్ స్త్రీ (నీనా గుప్తా) అయినా సర్పంచ్ భర్త (రఘువీర్ యాదవ్) వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. అభిషేక్ (జితేంద్ర కుమార్) వారి ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. మొదటి సిరీస్‌లో సర్పంచ్ కూతురు ఉంటుంది కాని ఎక్కడా కనిపించదు. కాని ఈ సిరీస్‌లో ఆ కూతురు కనిపిస్తుంది. అభిషేక్‌తో స్నేహం చేస్తుంది. అయితే ఊరన్నాక ఒకరో ఇద్దరో ప్రత్యర్థులు ఉండకపోరు. ఈ ఊళ్లో కూడా ఒక ప్రత్యర్థి తయారవుతాడు. అతడే ఆ ఊరి టెంట్ హౌస్ ఓనర్. రాబోయే ఎన్నికలలో తన భార్యను నిలబెట్టి సర్పంచ్ భర్తగా చలాయించాలనుకుంటున్న ఆ టెంట్ హౌస్ ఓనర్ సర్పంచ్‌ను, సచివాలయ ఉద్యోగులను పరేషాన్ చేస్తుంటాడు. మరోవైపు ఆ నియోజక వర్గ ఎం.ఎల్.ఏ కూడా సర్పంచ్‌ని అవమానిస్తుంటాడు. సర్పంచ్ తన కుమార్తె కోసం సంబంధం చూస్తే ఆ పెళ్లికొడుకు సైకోలాగా మారి ఆ అమ్మాయికి తెగ ఫోన్లు చేస్తుంటాడు. వీళ్లందరూ ప్రత్యర్థులే అయినా అభిషేక్, సర్పంచ్, ఉప సర్పంచ్, అసిస్టెంట్ నలుగురూ కలిసి ఆ సమస్యలను ఎలా దాటారు అనేవే ఈ ఎపిసోడ్స్. నవ్వొచ్చే ఎపిసోడ్స్ గత సిరీస్లోలానే ఈ సిరీస్‌లో కూడా నవ్వొచ్చే ఉదంతాలు ఎన్నో ఉంటాయి. ఊరికి మరుగుదొడ్లు అలాట్ అయినా కొందరు ఉదయాన్నే బయటకు వెళుతుంటారు. అలా కనిపిస్తే ఊరుకునేది లేదని కలెక్టర్ విజిట్‌కు వస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ముందు ఊరి సర్పంచ్‌ను ఎలాగైనా బద్నామ్ చేయాలని టెంట్ హౌస్ ఓనర్ ఒకతణ్ణి నువ్వు ఎలాగైనా చెంబు పట్టుకుని పొద్దున్నే కలెక్టరుకు కనిపించు అంటాడు. కలెక్టరు విజిట్‌కు వస్తే కనిపించాలని అతను, అతణ్ణి ఎలాగైనా ఆపాలని మిత్రబృందం చేసే ప్రహసనాలు చాలా నవ్వు తెప్పిస్తాయి. గుడిలో టెంట్ హౌస్ ఓనర్ భార్య చెప్పులను పొరపాటున సర్పంచ్ భార్య తొడుక్కుని ఇంటికి వస్తుంది. తన చెప్పులు కనిపించని టెంట్ హౌస్ ఓనర్ భార్య సిసి టీవీలో చూసి సర్పంచ్ భార్యే దొంగ అని తెలుసుకుని పోలీస్ కేస్ పెడతానంటుంది. ఆ చెప్పులు ఆమె ఇంట్లో పడేయడానికి హీరో నానా విన్యాసాలు చేస్తాడు. అదీ నవ్వే. ఊరి రోడ్డు కోసం నిధులకు ఎంఎల్ఏ దగ్గరకు వెళితే ఆ ఎంఎల్ఏ ముందు ఎక్స్‌ప్రెస్ రైలును ఆపడానికి ధర్నా చేయమని పంపిస్తాడు. అక్కడ సర్పంచ్‌ను, ఉపసర్పంచ్‌ను పోలీసులు పట్టుకెళతారు. అదంతా చాలా సరదాగా ఉంటుంది. హీరోయిన్ను పెళ్లికొడుకు వేధిస్తూ ఉంటే ఆమె హీరో సాయం కోరుతుంది. అలాగే హీరోయిన్, హీరో పరిచయం పెంచుకునే సన్నివేశాలు గిలిగింతలు పెడతాయి. గంభీరమైన ముగింపు సాధారణంగా పంచాయత్ ఎపిసోడ్స్ అన్నీ సరదాగా ఉంటాయి. కాని ఈ సిరీస్‌లో చివరి ఎపిసోడ్‌ను ఒక ఉదాత్త సన్నివేశంతో గంభీరం చేశాడు దర్శకుడు. ఆ సన్నివేశంతో ప్రేక్షకులందరూ కన్నీరు కారుస్తారు. మనసులు బరువెక్కుతాయి. సంతోషంతోపాటు దుఃఖమూ మనుషుల జీవితాల్లో ఉంటుందని చెప్పడానికి కాబోలు. ఇంకా పాత్రలు, వాటి గమ్యం పూర్తిగా తేలకుండానే ఈ సిరీస్ కూడా ముగుస్తుంది. అంటే సీజన్ 3కు కథ మిగిలించుకున్నారన్న మాట. ‘పంచాయత్’ బలం అంతా దాని సహజత్వం. సున్నితత్వం. హాస్యం. మానవ నిజ ప్రవర్తనలు. వీటిని దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా, రచయిత చందన్ కుమార్ గట్టిగా పట్టుకోవడంతో సిరీస్ నిలబడింది. కథ ఉత్తరప్రదేశ్‌లో జరిగినా లొకేషన్ అంతా భొపాల్కు దగ్గరగా తీశారు. ఆ ఊరి వాతావరణమే సగం ఆకట్టుకుంటుంది. థియేటర్ చేసిన నటులు కావడం వల్ల అందరూ పాత్రలను అద్భుతంగా పండిస్తారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతం. ఇలాంటి జీవితాలు, పాత్రలు తెలుగు పల్లెల్లో ఎన్నెన్నో ఉంటాయి. గతంలో తెలుగులో కూడా మంచి సీరియల్స్ వచ్చేవి. ఇలాంటి కథలతో తెలుగులో కూడా వెబ్ సిరీస్ వస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. పంచాయత్ చూడని వాళ్లు మొదటి సిరీస్, రెండో సిరీస్ హాయిగా చూడొచ్చు. హిందీలో మాత్రమే లభ్యం. -
నెట్‌ఫ్లిక్స్‌కు యూజర్ల షాక్!!
శాన్ ఫ్రాన్సిస్కో: స్ట్రీమింగ్ సేవల దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ షేరు బుధవారం భారీగా పతనమైంది. ఒక దశలో ఏకంగా 39 శాతం క్షీణించి 212.51 డాలర్ల స్థాయికి పడిపోయింది. దీంతో మార్కెట్ విలువ దాదాపు 60 బిలియన్ డాలర్ల మేర క్షీణించింది. దశాబ్ద కాలంలోనే తొలిసారిగా ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో యూజర్లపరంగా భారీ ఎదురుదెబ్బ తగలడం ఇందుకు కారణం. సమీక్షాకాలంలో కొత్తగా 25 లక్షల మంది యూజర్లు చేరతారని అంచనా వేసుకోగా .. దానికి విరుద్ధంగా నికరంగా 2,00,000 మంది సబ్‌స్క్రయిబర్స్‌ను నెట్‌ఫ్లిక్స్ పోగొట్టుకుంది. ఉక్రెయిన్‌పై దాడులకు నిరసనగా రష్యా మార్కెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో మరో 20 లక్షల మంది దాకా యూజర్లను కోల్పోయే అవకాశం ఉందన్న నెట్‌ఫ్లిక్స్ అంచనాలు.. షేర్హోల్డర్లను కలవరపరుస్తున్నాయి. దీంతో షేరు భారీగా పతనమైంది. కంపెనీ పనితీరుపై సందేహాలతో గత నాలుగు నెలల్లో 150 బిలియన్ డాలర్ల మేర షేర్‌హోల్డర్ల సంపద కరిగిపోయింది. మార్చి ఆఖరు నాటికి కంపెనీ యూజర్ల సంఖ్య 22.16 కోట్లుగా ఉంది. -
సండే సిరీస్..: ఏది నేరం? ఏది పాపం?
పాపం చేస్తే అంతర్లోకం కల్లోలం అవుతుంది. నేరం చేస్తే చట్టం వెంటబడి జీవితం బందీ అవుతుంది. అన్నీ బాగుంటే నేరం ఎందుకు చేస్తారు? అన్నీ బాగున్నా పాపం ఎందుకు చేస్తారు? మనిషి వీలైనంత వరకు నేరం, పాపం చేయకుండా ఉండటానికే ప్రయత్నిస్తాడు. కాని నేరమో, పాపమో చేసే పరిస్థితులు వస్తే? జీ ఫైవ్‌లో తాజాగా విడుదలైన 7 ఎపిసోడ్ల ‘గాలివాన’ జీవితంలో ఎదురయ్యే అనూహ్య ప్రహేళికలను ఆసక్తికరంగా చూపిస్తుంది. నేరం చేస్తే చట్టం శిక్షిస్తుంది. పాపం చేస్తే అంతరాత్మ శిక్షిస్తుంది. కాని పాపాన్ని ఆపబోయి నేరం చేస్తే? ‘గాలివాన’ కథ ఇదే. జీవితంలో కొన్ని ఎప్పటికీ జరక్కూడదు. కాని జరిగినప్పుడు వాటిని ఆచితూచి ఎదుర్కొనాలి. ఆ నష్టాన్ని నివారించాలి తప్ప ఆ నష్టానికి విరుగుడుగా మరిన్ని నష్టాలు తెచ్చే పని చేయకూడదు. ఉద్వేగాలు చాలా ప్రమాదకరమైనవి. అందుకే ఏ నిర్ణయమైనా స్థిమితంగా, ఆలోచనతో, వాస్తవిక అవగాహనతో చేయాలి. లేకుంటే చాలా ప్రమాదం. అవును... చాలా ప్రమాదం. జీ 5లో ప్లే అవుతున్న వెబ్ సిరీస్ ‘గాలివాన’ కథ ఏమిటి? ఒక గాలివాన రోజు. రాకపోకలకు వీలు లేని రాజోలు దగ్గర ఉన్న ఒక లంక దీవి. రెండు పెద్ద పెద్ద ఇళ్లు. ఆ ఇళ్లలోని ఒక ఇంటి అమ్మాయి, మరో ఇంటి అబ్బాయికి కొత్తగా పెళ్లయ్యింది. తర్వాత వాళ్లు హనీమూన్‌కు వైజాగ్ వెళ్లారు. వాన కురుస్తున్న రోజు అది. వైజాగ్‌లో అమ్మాయి, అబ్బాయి ఆ రాత్రికి హనీమూన్ జరుపుకోవాలి. ఇక్కడ అబ్బాయి ఇంటి వాళ్లు, అమ్మాయి ఇంటి వాళ్లు రొటీన్ పనుల్లో మునిగి ఉంటారు. కాని హటాత్తుగా వైజాగ్‌లో ఉన్న కొత్త జంటను ఒక దుండగుడు దారుణంగా హత్య చేస్తాడు. వధువు ఒంటి మీదున్న నగలను దొంగిలిస్తాడు. వాటిని అమ్మి దారిన పోయే కారును దొంగిలించి ఆ వానలో అదే లంక దీవి వైపు వస్తూ యాక్సిడెంట్ అయ్యి అబ్బాయి ఇంటి ముందు కారుతో సహా బోర్లా పడతాడు. అప్పటికే దుర్వార్త ఆ రెండు ఇళ్లకు చేరింది. వధూవరులు హత్యకు గురయ్యారు. వాళ్లను చంపిన హంతకుణ్ణి టీవీలో చూపిస్తున్నారు. ఆ శోకంలో ఉన్న అబ్బాయి కుటుంబం వారు తమ ఇంటి బయట యాక్సిడెంట్‌కు గురైన కారు దగ్గరకు వస్తారు. తమ వాళ్లను హత్య చేసింది ఆ కారు నడుపుతున్నవాడే అని తెలియక ఇంట్లోకి తెచ్చి వైద్యం చేస్తారు. అమ్మాయి ఇంటి వారు కూడా హెల్ప్ చేయడానికి వస్తారు. అప్పుడే ఆ ఆగంతకుడే హంతకుడు అని తెలుస్తుంది. అంటే తమ ఇంటి ముక్కుపచ్చలారని జంటను చంపింది ఇతడేనన్న మాట. వీణ్ణి కాపాడాలా? చంపేయాలా? అందరి భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. ఏం చేయాలన్న నిర్ణయాన్ని పోస్ట్‌పోన్ చేసి హంతకుణ్ణి గొడ్ల చావిడిలో పెడతారు. రాత్రి సమయం అది. గాలివాన. కాని తెల్లారే సరికి హంతకుడు చచ్చిపడి ఉంటాడు. ఎవరో అతణ్ణి చంపేసి ఉంటారు. ఆ చంపింది ఎవరు? అమ్మాయి తరఫు కుటుంబ సభ్యుల్లోని ఒకరా? అబ్బాయి తరపు కుటుంబ సభ్యుల్లోని ఒకరా? ఎవరు చంపారు? కాని అసలు ప్రశ్న తర్వాత వస్తుంది. అది– ఎందుకు చంపారు? బిబిసి వారు 2016లో తీయగా విపరీతమైన జనాదరణ పొందిన వెబ్ సిరీస్ ‘ఒన్ ఆఫ్ అజ్’కు తెలుగు రూపాంతరం ఈ సిరీస్. స్కాట్లాండ్లోని పర్వత ప్రాంతంలో జరిగినట్టుగా ఉండే ఒరిజినల్ కథను మన లంక దీవికి మార్చి తీశారు. హత్యకు గురైన వరుడి తల్లిగా రాధిక, వధువు తండ్రిగా సాయి కుమార్ కీలకమైన పాత్రలు. మిగిలిన పాత్రల్లో చాందినీ, చైతన్య కృష్ణ, నందిని రాయ్, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. బిబిసి, జీ 5 కలిసి ఈ నిర్మాణం చేశాయి. రచన చంద్ర పెమ్మరాజు. దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి. 7 ఎపిసోడ్ల ‘గాలివాన’ దాదాపు మూడున్నర గంటల నిడివి ఉంది. మర్డర్ మిస్టరీ కనుక ఆసక్తి సహజం. అందులో ఉప కథలు కూడా ఉండటంతో వేదికలు మారుతూ కథ ముందుకు కదులుతుంది. హంతకుణ్ణి చంపాక తమలో ఎవరో ఒకరు చంపారు అని అందరికీ తెలుసు. కాని అందరూ అందరినీ కాపాడుకోవాలనే చూస్తారు. కాని వ్యక్తులు నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో కూడా వారిని పీక్కు తిని లబ్ధి పొందాలని చూసే వారుంటారు. బ్లాక్మెయిల్ చేసి ఇంకా టెన్షన్ ఇస్తారు. అలా టెన్షన్ పెట్టే పాత్రలు కూడా ఉన్నాయి. అంటే పరిస్థితులను బట్టి మనిషి నీచుడా, గొప్పవాడా అనేది తేలుతుంది. అదే సమయంలో నేరం, పాపం అనే చర్యల చర్చ కూడా ఉంటుంది. మన కుటుంబ సభ్యులను చంపినవాడిని చంపడం నేరం ఎలా అవుతుంది? అని అందరూ అనుకుంటారు. కాని అలా చంపడం పాపం కదా. అలాగే తల్లిదండ్రులు చేసే తప్పులు, పాపాలు పిల్లలను ఎలా వెంటాడుతాయో ఈ కథలో ఉంటుంది. పెళ్లికి ముందు ప్రేమలు, పెళ్లి తర్వాత విడాకులు అవి ఎక్కడికీ పోవు. తర్వాతి తరాలకు శాపాలుగా మారే అవకాశం ఉంటుందని చూపుతారు. అసలు కథేమిటంటే వీరిలో ఒకరు ఆ హంతకుణ్ణి చంపారు. నిజానికి వీరిలో ఒకరు ఆ కొత్త వధువరులను చంపడానికి కూడా కారకులయ్యారు. ఆ ఒకరు ఎవరు అనేదే కథ. ఖర్చుకు వెనుకాడకుండా రాధిక, సాయికుమార్ వంటి సీనియర్లను పెట్టి తీయడం వల్ల సిరీస్ నిలబడింది. కొడుకును కోల్పోయిన దుఃఖం, ఉన్నవారిని కాపాడుకోవాలనే తపన రాధికలో అలవోకగా పలికింది. సాయికుమార్ తన గొంతుతోనే సగం ఎఫెక్ట్ తీసుకు వచ్చాడు. సిరీస్‌కు మరో కీలకపాత్ర అయిన చాందిని తన శక్తికి మించి రక్తి కట్టించింది. నందిని రాయ్‌కు మంచి పాత్ర. కాని చివరి ఎపిసోడ్లు మరింత బాగుండాల్సింది. నేరం జరిగినా, పాపం జరిగినా అందుకు బదులుగా చేసే పని ఏదైనా కావచ్చుగాని ప్రాణం తీసేది మాత్రం కాకూడదు. మనిషి ప్రాణం తీస్తే అది ఏక కాలంలో నేరం, పాపం. రోజూ పేపర్లలో ఎన్నో క్షణికావేశాల చర్యలు కనిపిస్తాయి. వాటి నుంచి బయటపడి జీవితాలను కాపాడుకోవాలని ఈ సిరీస్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏప్రిల్ 14న విడుదలైంది. జీ5లో చూడండి. -
ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోను
‘‘సినిమాల్లో మహిళల పాత్రలకు ప్రాధాన్యం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాంగ్స్, డ్యాన్స్, రొమాన్స్ మాత్రమే కాదు.. కథ పరంగా సినిమాల్లోని మహిళల పాత్రలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇది చాలా మంచి విషయం’’ అని ప్రియమణి అన్నారు. ప్రియమణి నటించిన ‘భామాకలాపం’ చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ‘‘భామాకలాపం’కు మంచి స్పందన లభిస్తోంది’’ అని ప్రియమణి అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రియమణి చెప్పిన విశేషాలు. ► ‘భామా కలాపం’ కథను దర్శకుడు అభిమన్యు చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. నాకెలా చెప్పారో అలానే తీశారు. స్ట్రయిట్ ఫార్వార్డ్, బోల్డ్, ఫైర్ బ్రాండ్... ఇలాంటి క్యారెక్టర్స్ చేశాను కానీ అనుపమలాంటి పాత్రను ఇప్పటివరకూ చేయలేదు. రియల్ లైఫ్‌లో నేను అనుపమ అంత అమాయకంగా ఉండనని నా బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమవుతుంది. కొంతమంది మధ్యతరగతి గృహిణులను స్ఫూర్తిగా తీసుకుని నేనీ పాత్ర చేశాను. బాగా వచ్చింది. ప్రేక్షకులు మెచ్చుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ► సినిమాలో అనుపమ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. కానీ రియల్ లైఫ్‌లో నేనంతగా జోక్యం చేసుకోను. నాలుగేళ్లుగా నా పక్కింట్లో ఎవరు ఉంటున్నారో కూడా నాకు తెలియదు.. ఈ మధ్యే తెలిసింది. వ్యక్తిగతంగా కూడా తోటివారి జీవితాల్లో అనవసరంగా జోక్యం చేసుకోను. ► నా భర్త (ముస్తఫా) ‘భామాకలాపం’ చూసి, అభినందించారు. ‘అనుపమ పాత్ర బాగా చేశావ్. చీరలో అందంగా కనిపిస్తున్నావు. కామెడీ పాత్రలకు బాగా సూట్ అవుతావనిపిస్తోంది. ఇలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేయి’ అన్నారు. ఇంకా కొత్త కొత్త పాత్రలు చేయాలని ఉంది. ముఖ్యంగా ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చేయాలని ఉంది. ► తెలుగులో ‘విరాటపర్వం’, హిందీలో అజయ్ దేవగన్ ‘మైదాన్’, కన్నడలో డాక్టరు 56, తమిళంలో ‘కొటేషన్ గ్యాంగ్’, ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్.. ఇలా నావి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘భామా కలాపం’లో అనుపమ వంట బాగా చేస్తుంది. నిజజీవితంలో వంటలో నా ప్రావీణ్యత జీరో. తింటాను.. కానీ వంట చేయలేను. నా భర్త వండుతారు. నేను తింటాను. ఆయన నాకు ఇది చేసిపెట్టు అని అడగలేదు. నాకూ చేయాలనిపించలేదు. సో.. నేను వెరీ వెరీ లక్కీ. నాకోసం ప్రేమతో ఆయన చేసిన హోమ్ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. -
అతడు ఆమె ఫోన్
స్త్రీ పురుష సంబంధాలు ఎంత ఆకర్షణీయమైనవో అంత లోతైనవి. సామాజిక సూత్రాలకు, నైతిక విలువలకు ఎడంగా జరిగి స్త్రీ పురుషుల మధ్య బంధం ఏర్పడితే అది ఏ ఒడ్డుకు చేరుస్తుందో చెప్పలేము. ఆగి, ఆలోచించుకునే వాస్తవిక స్పృహ ఇవ్వకుండా స్త్రీ పురుషుల అనంగీకార అనుబంధాలకు ఎడతెగని వాహికగా ఉంటున్న స్మార్ట్ ఫోన్ మన జీవితాలను ఎటు తీసుకెళుతోంది అని కూడా ఆలోచింపచేస్తున్న సినిమా ‘గెహరాయియా’. అమేజాన్‌లో తాజా విడుదల. స్త్రీ, పురుషులు ఒకరికొకరు కట్టుబడి ఉండటం ఈ సమాజం కొన్ని వందల ఏళ్లుగా ఏర్పరుచుకున్న విలువ. ఆ విలువకు బయట జరిగి ‘అనంగీకార’ అనుబంధాలకు వెళ్లిన జంటలు ఎక్కువగా కష్టాలనే ఎదుర్కొన్నారు, సమాజపు దృష్టిలో దోషులుగానే నిలుచున్నారు. భారతీయ సమాజంలో అయితే ప్రేమలోగాని, వివాహంలోగాని జీవిత భాగస్వామిని వంచన చేసి మరొకరితో బంధంలో ఉండటం పూర్తి అనైతికంగా పరిగణించబడుతుంది. కాని ఎల్లకాలం ఎల్లవేళలా ఇరుపక్షాల మనసు అన్ని రకాల కట్టుబాట్లకు లొంగదు. అది ఒక్కోసారి ‘ఇదే నాకు కావలసింది’ అనుకుంటుంది. ‘ఉన్నది సరి కాదు... ఇది సరిౖయెనది’ అనుకుంటుంది. ‘ఉన్నది ఉండగా... ఇది కూడా ఉంటే ఏమవుతుంది?’ అనుకోనూవచ్చు. ‘ఇది ఒక చిన్న సరదా... ఎవరికి తెలుస్తుందిలే’ అని భావించవచ్చు. స్త్రీ, పురుషుల అంచనాలు కేవలం అంచనాలు మాత్రమే. ఒకసారి రంగంలోకి దిగాక పరిణామాలు అంచనాలకు తగినట్టుగా ఉండవు. సంక్షోభాలు తెచ్చిపెడతాయి. అశాంతి, ప్రమాదం, హింస, పగ, పరారీ... ఏమైనా జరగొచ్చు. ఒకప్పుడు ఈ పరిణామాలు వేగంగా జరిగే అవకాశం తక్కువ కమ్యూనికేషన్ పరిమితుల వల్ల. ఇవాళ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. అది అనుక్షణ ప్రసారానికి సంభాషణకి వీలు కల్పిస్తోంది. దీని వల్ల ఎలాంటి మంచి జరుగుతున్నదో కాని పత్రికలలో చెడు పరిణామాల వార్తలే చూస్తూ ఉంటాం. ఈ సినిమా కథ ఏమిటి? రెండు జంటలు. దీపికా పడుకోన్– ధైర్య కరవా... సిద్ధాంత్ చతుర్వేది– అనన్యా పాండే. రెండు జంటలూ లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాయి. రెండు జంటలూ పెళ్లి ఆలోచనల్లో కూడా ఉంటాయి. దీపికా యోగా ఇన్స్ట్రక్టర్. ఆమె బాయ్‌ఫ్రెండ్ ధైర్య కరవా రచయితగా స్ట్రగుల్ అవుతుంటాడు. అనన్యా పాండే శ్రీమంతురాలు. ఆమె బోయ్‌ఫ్రెండ్ సిద్ధాంత్ చతుర్వేది కార్పొరేట్ దిగ్గజం. దీపికా, అనన్యా కజిన్స్ అవుతారు కనుక ఈ నలుగురూ చాలా రోజుల తర్వాత కలుస్తారు. అది కూడా అత్యంత విలాసవంతమైన చిన్న పడవ మీద... సముద్రంలో ప్రయాణిస్తూ. కాని దీపికా పట్ల సిద్ధాంత్ ఆకర్షితుడవుతాడు. ఇద్దరూ తమ లివ్ ఇన్ పార్ట్నర్లను చీట్ చేస్తూ రిలేషన్లోకి వెళతారు. తాను చేస్తున్న వెంచర్ పూర్తయితే దానికి అందాకా ఆర్థికంగా మద్దతుగా ఉంటున్న అనన్యతో తెగదెంపులు చేసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని దీపికతో చెబుతాడు సిద్ధాంత్. వారిద్దరూ అలాంటి అంచనాతో తమ రహస్య బంధాన్ని కొనసాగిస్తారు. కాని అంచనా తప్పుతుంది. సిద్ధాంత్ వెంచర్ నిధుల గోల్‌మాల్‌లో మునుగుతుంది. మరోవైపు దీపిక గర్భవతి అవుతుంది. ఇంకో వైపు అనన్యకు తన బోయ్‌ఫ్రెండ్ ఎవరితోనైనా అఫైర్‌లో ఉన్నాడా అని అనుమానం వస్తుంది. ప్రేమ, రిలేషన్ ఉండాల్సిన చోట ఊపిరాడనితనం, అసహనం, దీని నుంచి ఎలాగైనా బయటపడాలన్న క్రైమ్ ఆలోచనలు... అన్నీ ఈ ‘రహస్యం’గా ఉంచాల్సిన ‘బంధం’ వల్ల ఏర్పడతాయి. స్త్రీ పురుషులు తమ పాత బంధాల నుంచి ఓపెన్‌గా, చట్టబద్ధంగా విడిపోయి కొత్త బంధాల్లోకి వెళ్లొచ్చు. కాని ఉన్న బంధాల్లో ఉంటూ రహస్య బంధం కొనసాగించాల్సి వచ్చినప్పుడు, లేదా ఉన్న బంధాన్ని సరిగ్గా ముగించకుండా కొత్త బంధాల్లో మునిగినప్పుడు పరిణామాలు భయానకం అవుతాయి. ఈ సినిమా కూడా అలాగే ముగుస్తుంది. పైపై ఆకర్షణల లోతు ఎంత అగాధంగా ఉంటుందో ‘గెహరాయియా’ (అగాధాలు) చెబుతుంది. ఫోన్ ఒక పాత్రధారి ఫోన్ ఒక కమ్యూనికేషన్ మాధ్యమం. అదే సమయంలో ఇవాళ స్త్రీ,పురుష బంధాలకు ఒక ప్రధాన వాహిక. ఒకప్పుడు అబ్బాయి. అమ్మాయిల ప్రేమ దగ్గరి నుంచి వివాహేతర రహస్య బంధాల వరకూ కమ్యూనికేషన్ ఒక దుస్సాధ్యంగా ఉండేది. కాని స్మార్ట్‌ఫోన్ వల్ల ఆ సమస్య అవసరమైన దాని కంటే ఎక్కువే అయిందని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. ఇందులో సినిమా అంతా పాత్రలు మాట్లాడినంత ఫోన్ మాట్లాడుతుంది. దీపిక, సిద్ధాంత్‌ల మధ్య రహస్య బంధం పూర్తిగా వాట్సప్ చాట్ వల్ల బలపడుతుంది... ముందుకు పోతుంది... చివరకు విషాద పరిణామమూ తీసుకుంటుంది. బంధం ఏర్పడేంత వరకూ ‘కిక్’ ఇచ్చే వాట్సప్ సంభాషణలు బంధం ఏర్పడ్డాక ‘అనుక్షణం వెంటాడే’ సంభాషణలుగా మారతాయి. స్త్రీగాని, పురుషుడు గాని ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌లో ఉన్న ఈ ఎడతెగని చాటింగ్ ‘మతి’ని గతి తప్పేలా చేస్తున్నదేమోనని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. డిస్ట్రబ్ చేసే మూవీ వివాహేతర బంధాలు ఎంత డిస్ట్రబ్ చేస్తాయో అంత డిస్ట్రబ్ చేసే మూడ్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. దర్శకుడు షకున్ బాత్ర ఆ జాగ్రత్త తీసుకున్నాడు. కాని ఒక విలువను ఆపాదించడం లేదా ఆరోగ్యకరమైన అర్థవంతమైన ముగింపును ఇవ్వకపోవడంతో ప్రేక్షకుడికి ఒక డిస్ట్రబెన్స్ భావన మాత్రమే కలుగుతుంది. ఉన్న బంధాలు అన్నీ ఏవో కొద్ది ఇష్టాయిష్టాలతోనే ఉంటాయి. సమస్యలు లేని బంధాలు ఉండవు. అవి మరీ ఘోరంగా ఉంటే కొత్తబంధాల్లోకి వెళ్లడం పట్ల సమాజానికి అభ్యంతరం ఉండదు. కాని దూరపు కొండలు నునుపు అనే భావనతో బాధ్యతలు అధిగమించే ఆకర్షణల్లో పడటం పట్ల మాత్రం ఈ సినిమా కచ్చితంగా ఒక హెచ్చరికే. దీపిక మంచి నటనకు ఈ సినిమా చూడొచ్చు. లేదంటే చదివిన ఈ రివ్యూ సరిపోతుంది. -
ఆమె ఏ భాషకైనా సరిపోతారు: విజయ్ దేవరకొండ
‘‘ప్రియమణిగారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఏ భాషలో చేసినా ఆ భాషకి సరిపోతారు. ఇప్పుడు ఆమె చేస్తున్న ‘భామా కలాపం’ అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ప్రియమణి నటించిన ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘భామా కలాపం’. అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించారు. ‘డియర్ కామ్రేడ్’ చిత్రదర్శకుడు భరత్ కమ్మ ఈ షోకి రన్నర్. ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై సుధీర్ ఈదర, భోగవల్లి బాపినీడు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 11 నుంచి∙‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ‘భామా కలాపం’ ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నలభై ఏళ్లుగా ఇండస్ట్రీలో అందరూ నన్ను ఆదరించారు.. ఇప్పుడు మా అబ్బాయి బాపినీడు, సుధీర్ తీసిన ఈ వెబ్ సిరీస్‌ని కూడా ఆదరించాలి’’ అన్నారు. ‘‘భామా కలాపం’లో అనుపమ అనే చాలా అమాయకమైన గృహిణి పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు ప్రియమణి. ‘‘మేము అనుకున్న దాని కంటే అభిమన్యు బాగా డైరెక్ట్ చేశాడు’’ అన్నారు భరత్ కమ్మ. ‘‘ఏడాది క్రితం సరదాగా రాసుకున్న కథ ఇక్కడివరకు రావడం హ్యాపీ’’ అన్నారు అభిమన్యు తాడిమేటి. -
వెబ్‌సిరీస్‌లు చేయడానికి నేను సిద్ధంగానే!
‘‘ఆసక్తిగా సాగే వినోదాత్మక కథలకు వ్యూయర్స్ నుంచి ఎప్పుడూ మంచి స్పందన ఉంటుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల ఇలాంటి కథలకు మరింత ఆదరణ పెరిగింది’’ అని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అంటున్నారు. ఈ విషయంపై రకుల్ మాట్లాడుతూ– ‘‘కొంతకాలం క్రితం ప్రాంతీయ సినిమాల రిలీజ్లు, ప్రేక్షకుల ఆదరణ కొంత వరకే పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల మంచి ప్రాంతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా వ్యూయర్స్ చూసే అవకాశం కలుగుతోంది. మంచి కథలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఇటు పాన్ ఇండియన్ మూవీ బిజినెస్ విషయంలో ‘బాహుబలి’ అన్ని కోణాల్లో కొత్త దారులను చూపించింది. ఇప్పుడు సినిమాల మధ్య ఉన్న భాషా పరమైన హద్దులూ చెరిగిపోయాయి. మంచి కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో షో లేదా వెబ్‌సిరీస్‌లు చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఆ స్టోరీ నన్ను ఎగ్జైట్ చేయడంతో పాటు నా పాత్ర కథను నడిపించే లా ఉండాలి’’ అని పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు ఇదివరకే తెలిపారు రకుల్. వీరి పెళ్లిపై త్వరలో ఓ స్పష్టత రానుంది. -
చండీగఢ్ కరే ఆషికీ..ఈ కథకు ధైర్యం ఎక్కువ
‘నాకు కొడుకువైనా కూతురివైనా నువ్వే’ అని సాధారణంగా అంటూ ఉంటారు. కాని కొడుకు కూతురిగానో కూతురు కొడుకుగానో నిజంగా మారిపోతే? ‘దేవుడు తప్పు చేశాడు... ఆమె సరిదిద్దుకుంది’ అంటుంది ఈ సినిమాలో డాక్టర్. బాలీవుడ్లో విడుదలైన తాజా సినిమా ‘చండీగఢ్ కరే ఆషికీ’ (చండీగఢ్ ప్రేమ). ఇది ‘ట్రాన్స్ గర్ల్’ లవ్ స్టోరీ. అమ్మాయిగా మారిపోయిన అబ్బాయి తన ప్రేమను గట్టి వ్యక్తిత్వంతో సాధించుకున్న కథ. ఇలాంటి కథకు సాహసం కావాలి. దీనిని చర్చకు పెట్టేందుకు మనసు కావాలి. జనవరి 7న ఓటిటిలో విడుదలైన వెంటనే అత్యధిక వ్యూయర్షిప్ పొందిన ఈ సినిమా పరిచయం. దేవుడు నిజంగానే ఒక్కోసారి తప్పు చేస్తాడు. అమ్మాయిని అబ్బాయిగానూ అబ్బాయిని అమ్మాయిగానూ పుట్టిస్తాడు. కాని లోక ఆచారం ప్రకారం ఒక్కసారి అబ్బాయిగా పుట్టాక చచ్చినట్టు అబ్బాయిగా బతకాల్సిందే. అమ్మాయిగా పుట్టాక అమ్మాయిగా జీవించాల్సిందే. ‘మా శరీరాలు తప్పుగా ఉన్నాయి. లోపల మా భావాలు వేరుగా ఉన్నాయి. మమ్మల్ని మాలాగా మేము కోరుకున్నలాగా మారనివ్వండి’ అనంటే సమాజం ఊరుకోదు. తల్లిదండ్రులు ఒప్పుకోరు. కాని ట్రాన్స్‌జెండర్స్ ధైర్యంగా ముందుకు వస్తున్నారు. తాము కోరుకున్న రూపాలను పొందుతున్నారు. తమ హక్కులను కోర్టులకు వెళ్లి సాధించుకుంటున్నారు. ఇప్పుడు తమ కలలను ఆకాంక్షలను కౌటుంబిక జీవనాన్ని కూడా సాధించే ప్రయత్నాల్లో పడుతున్నారు. అందుకు సంఘాన్ని సిద్ధం చేస్తున్నారు. ‘చండీగఢ్ కరే ఆషికీ’ ఈ ప్రస్తావన చేస్తోంది. ఆ అంశంతో సినిమా గా ముందుకు వచ్చింది. నిజానికి సినిమా అంటే వ్యాపారం. ‘సెంటిమెంట్’ బెడిసి కొడితే అసలుకే ఎసరు వస్తుంది. కాని ఈ సినిమాలో చాలా సున్నితంగా గౌరవంతో సమస్యను చర్చించారు. అందుకే ప్రేక్షకులు కూడా గౌరవిస్తున్నారు. ఏంటి కథ? చండీగఢ్‌లో ఒక దివాలా తీసిన జిమ్‌ను నడుపుతుంటాడు ఆయుష్మాన్ ఖురానా. తను స్వయంగా బాడీ బిల్డర్ అయినా ప్రతి ఏటా చండీగఢ్‌లో జరిగే ‘బలసంపన్నుల పోటీ’లో ఛాంపియన్‌గా నిలువలేక నంబర్ 2లో వస్తున్నా అతని జిమ్‌కు గిరాకీ ఉండదు. ఆ సమయంలో వాణి కపూర్ ఆ జిమ్‌కు జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా వస్తుంది. ఆమె రాకతో జిమ్‌కు కళ వస్తుంది. అమ్మాయిలు చేరడంతో అబ్బాయిలూ రావడం మొదలెడతారు. క్రమంగా ఆయుష్మాన్ ఖురానా, వాణి కపూర్ ప్రేమలోనూ ఆ తర్వాత శారీరక సంబంధంలోనూ వెళతారు. ‘ఇక మనం పెళ్లి చేసుకుందాం’ అంటాడు ఆయుష్మాన్. అప్పుడు వాణి కపూర్ అతి కష్టం మీద తానెవరో చెబుతుంది. ‘నేను అబ్బాయిగా పుట్టాను. అమ్మాయిగా మారాను. నేనొక ట్రాన్స్గర్ల్ని’ అంటుంది. ఆయుష్మాన్‌కు చాలా పెద్ద దెబ్బగా ఇది అనిపిస్తుంది. తనను వాణికపూర్ వంచించినట్టుగా భావిస్తాడు. పైగా ‘సంప్రదాయ ఆలోచన’ ల ప్రకారం తాను సృష్టి విరుద్ధ శృంగారంలో పాల్గొన్నట్టుగా భావించి తనను తాను అసహ్యించుకుంటాడు. వాణికపూర్ను అవమానిస్తాడు. అతడిని మిత్రులు అవమానిస్తారు. ఊరు అవమానిస్తుంది. కాని ఆయుష్మాన్‌లో ఆమె పట్ల ప్రేమ పోదు. ఆమెకు అతని పట్ల కూడా. కాని ఇది ఓడిపోయే ప్రేమ కథ. ఇన్నాళ్లు విన్నటువంటి ప్రేమ కథ కూడా కాదు. చివరకు ప్రేమ గెలుస్తుంది. నిజమైన శౌర్యం ఏమిటి? సినిమాలో ఆయుష్మాన్ వెయిట్ లిఫ్టర్. తన శౌర్యం నిరూపించుకోవాలనుకుంటాడు. కాని నిజమైన శౌర్యం ఏమిటి? సమాజానికి వెరవకపోవడం... తన ప్రేమలోని నిజాయితీని స్వీకరించడం... వాణికపూర్ మారిన అస్తిత్వాన్ని గౌరవించడం. ‘నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. తొందరగా ఇలాంటివి అర్థం కావు. టైమ్ పడుతుంది’ అంటాడు పశ్చాత్తాపంతో వాణికపూర్‌తో. అతనే కాదు... ట్రాన్స్‌జెండర్స్ విషయంలో కుటుంబాలు ఎంత కఠినంగా ఉంటాయో ఎన్నో ఉదంతాలు ఉంటాయి. సినిమాలో అబ్బాయిగా పుట్టిన వాణి కపూర్ సర్జరీ చేయించుకుని పూర్తిగా అమ్మాయిగా మారుతుంది. దీనిని తండ్రి అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తాడు కాని తల్లి అస్సలు సహించదు. చండీగఢ్‌లో ఆయుష్మాన్‌తో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టాక స్నేహితురాలు ‘నువ్వు ఊరు విడిచి నాలుగురోజులు ఎటైనా పోరాదూ’ అంటుంది. దానికి వాణి కపూర్ ‘నా ఇంట్లో అవమానిస్తున్నారని ఇల్లు వదిలాను. ఊళ్లో అవమానిస్తున్నారని నా ఊరైన అంబాలాను విడిచి పెట్టి ఇక్కడకు వచ్చాను. ఇక్కడ అవమానిస్తున్నారని ఎక్కడకు వెళ్లాలి’ అంటుంది. ‘నా తప్పు ఏమిటి? నేను చిన్నప్పటి నుంచి నన్ను నేను అమ్మాయిగా భావించాను. నాకిష్టం వచ్చినట్టు మారాను’ అంటుంది వాణి కపూర్. కుటుంబం, సమాజం అర్థం చేసుకోవాల్సింది ఈ మానసిక శారీరక అవస్థనే. అందరూ పుట్టినట్టే ట్రాన్స్‌జెండర్స్ కూడా పుడతారు. కాని వారిని హిజ్రాలంటూ గేలి చేసే దుర్మార్గ సంస్కృతి సమాజంలో ఉంది. వారు తాము కోరుకునే అస్థిత్వంతో ప్రేమ, వివాహం, జీవితం సోకాల్డ్ ‘నార్మల్’ వ్యక్తులతో పొందడానికి ఎన్నో అడ్డంకులు. భేషజాలు. అపోహలు. వాటన్నింటిని మెల్లగా దాటాలి అని చెబుతుంది ఈ సినిమా. ‘జెండర్ ఇన్‌క్లూజివిటీ’... అంటే అన్ని జెండర్ల వాళ్లను సమాజం అంతర్భాగం చేసుకోవాలనే సందేశం ఇవ్వడానికే ఈ సినిమా తీశారు. దర్శకుడిదే ఘనత ఈ సినిమా ఇంత సున్నితంగా, ఆలోచనాత్మకంగా, ఒప్పుకోలుగా ఉండటానికి కారణం దర్శకుడు అభిషేక్ కపూర్ తీసిన పద్ధతి. దానికి హీరో హీరోయిన్లు సపోర్ట్ చేసిన పద్ధతి. ఈ సబ్జెక్ట్ చేయడం ఆయుష్మాన్‌కు సాహసం కాదు కాని వాణి కపూర్‌కు సాహసమే. తనను తాను ట్రాన్స్గర్ల్గా బిలీవ్ చేసి ఆ పాత్ర ఆత్మాభిమానం తాలూకు డిగ్నిటీని ప్రదర్శించింది ఆమె. మధ్య మధ్య చెణుకులతో ఈ సినిమా నవ్విస్తుంది. కాని ఈ సమస్యను చాలా సీరియస్‌గా తీసుకోమంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది చూడండి. -
కోవిడ్ పూర్వ స్థాయికి మీడియా, వినోదం
న్యూఢిల్లీ: దేశీ మీడియా, వినోద రంగం నెమ్మదిగా కోవిడ్ పూర్వ స్థాయికి కోలుకుంది. 10–12% వార్షిక వృద్ధితో 2030 నాటికి 55–70 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీ, గేమింగ్, యానిమేషన్, వీఎఫ్ఎక్స్ మొదలై నవి గణనీయంగా వృద్ధి చెందుతుండటం ఇందుకు ఊతంగా నిలవనుంది. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిజిటల్ వీడియోల వినియోగం మిగతా విభాగాలన్నింటినీ మించి భారీ స్థాయిలో పెరుగుతోందని నివేదిక పేర్కొంది. చైనాతో పాటు అంతర్జాతీయంగా అత్యధికంగా వృద్ధి నమోదు చేస్తున్న మార్కెట్లలో ఒకటిగా దేశీ మీడియా, వినోద రంగం కూడా ఒకటని తెలిపింది. ‘టీవీల్లో ప్రకటనల పరిమాణాలు మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి పుంజుకున్నాయి. భవిష్యత్ లో కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రాంతీయ చానళ్లలో అడ్వర్టైజింగ్ పెరగడం, కొత్తగా వచ్చే ప్రకటనకర్తల సంఖ్య వృద్ధి చెందనుండటం ఇందుకు దోహదపడగలవు‘ అని నివేదిక వివరించింది. చౌక డేటాతో అందుబాటులోకి ఓటీటీలు.. డేటా ధరలు మరింతగా తగ్గిపోవడంతో ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ చెల్లింపుల విధానాలు గణీయంగా పెరిగాయని నివేదిక తెలిపింది. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫాంలు, డిజిటల్ వీడియోలు కూడా అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. వివిధ రకాల కంటెంట్ అందిస్తున్న 40 పైచిలుకు సంస్థలతో తీవ్రమైన పోటీ నెలకొన్న వర్ధమాన మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఉందని వివరించింది. గత కొన్నేళ్లుగా ఎస్‌వీవోడీ (సబ్స్క్రిప్షన్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్)లకు డిమాండ్ బాగా పెరిగిందని.. రాబోయే రోజుల్లో ఇది ఏవీవోడీ (అడ్వర్టైజింగ్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్)ని మించిపోగలదని పేర్కొంది. యూజర్ల సంఖ్యను పెంచుకునేందుకు సంస్థలు .. ధరల విషయంలో వినూత్న విధానాలు పాటించడం, కంటెంట్‌పై భారీగా పెట్టుబడులు పెట్టడం మొదలైనవి ఇందుకు దోహదపడుతున్నాయని నివేదిక తెలిపింది. గేమింగ్ వృద్ధికి మరింతగా అవకాశం.. గేమింగ్ విషయానికొస్తే.. అమెరికా, చైనాతో పోల్చినప్పుడు ప్రస్తుతం తక్కువగానే ఉన్నప్పటికీ మొబైల్ వినియోగం పెరిగే కొద్దీ ఇది పటిష్టంగా వృద్ధి కనపర్చవచ్చని వివరించింది. ‘భారత్ ప్రతిభావంతులకు హబ్‌గా మారుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో గేమింగ్ కంపెనీల సంఖ్య పది రెట్లు పెరిగింది. గత కొన్నాళ్లుగా ఈ రంగంలో వెంచర్ క్యాపిటల్ సంస్థల పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి‘ అని సీఐఐ, బీసీజీ నివేదిక తెలిపింది. -
కళాకాంతులు.. వారి హృదయానికి కళ్లున్నాయి..
వెండితెర, బుల్లితెరపై అంధపాత్రలు ధరించి ఎంతోమంది నటీనటులు ప్రేక్షకుల ప్రశంసలు పొందడం మనకు తెలిసిందే! మరి ఏ భావోద్వేగాలు పలికించలేరనుకునే అంధులే నటిస్తే... ‘అలాంటి వారు కూడా ఉన్నారా!’ అనే ఆశ్చర్యానికి సమాధానంగా బబిత, హేమేంద్రలు అంధ కళాకారులుగా రాణిస్తున్నారు. ప్రపంచంలో అందమైన దృశ్యాన్ని చూడటానికి వారికి కళ్లు లేవు. అయితేనేం, వారి కళా నైపుణ్యం కారణంగా ప్రపంచమే ఇప్పుడు వారివైపు చూస్తోంది. అంధులైనప్పటికీ రంగుల తెరపై తమదైన ముద్ర వేస్తున్న వీరి నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే! నా దారిని నేను వెతుక్కోగలను.. ముంబైలో ఉంటున్న 24 ఏళ్ల బబిత సరోజ్ మరాఠీ ఫీచర్ ఫిల్మ్ ‘ద్రిశాంత్’లో నటిస్తోంది. దుఃఖం, గాంభీర్యం, కోపం.. ఈ భావాలను పలికించడానికి భయం అక్కర్లేదు. ఏదైనా చేయాలనే తపన, క్లిష్ట పరిస్థితుల్లోనూ పట్టు వీడకుండా ప్రతి ఒక్కరూ తమ కలలను నెరవేర్చుకోగలరనే నమ్మకం ఉంటే చాలని తాను ఎన్నుకున్న దారి ద్వారా సమాధానం చెబుతుంది బబిత. ‘ఇదెలా సాధ్యం..?’ అని అడిగిన వారిపై ‘అంధులు తమంతట తాముగా ఏమీ చేయలేరని, ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేరని అనుకుంటారు. ఆలోచించే మెదడు, మాట్లాడే నాలుక ఉన్నప్పుడు ఎవరి సాయం లేకుండానే నడవగలను. నా ఆలోచనా శక్తితో నా దారిని నేను వెతుక్కోగలను. అలాంటప్పుడు నేను ఎందుకు నటించలేను’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. త్వరలో విడుదల కానున్న దృష్ట్ సినిమా షూటింగ్ సన్నివేశంలో బబిత బబిత తన గురించి మరిన్ని వివరాలు చెబుతూ –‘2009లో అనారోగ్యం కారణంగా నా కంటి చూపును కోల్పోయాను. కానీ, నటనపై ఉన్న ఇష్టం నా మనస్సులో అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత మూడేళ్లకు నా జీవితానికి ఆధారమైన నాన్న దూరమయ్యారు. దీంతో నా చిన్న అవసరాలు కూడా తీర్చుకోవడానికి చాలా కష్టపడేదాన్ని. రోజుల తరబడి ఏడుస్తూనే కూర్చున్నాను. కానీ, ఒక రోజు నా పనులన్నీ నేనే చేసుకోవాలి, ఇలా దుఃఖిస్తూ కూర్చుంటే బతకలేను అని అర్ధమైంది. ఈ ఆలోచన నా మార్గం నన్ను చూసుకునేలా చేసింది. స్నేహితులు, తెలిసిన వారి ద్వారా చాలా టీవీ సీరియల్స్, సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చాను. రోజూ స్టూడియోల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. చివరికి ఓ రోజు నా కష్టానికి ఫలితం దక్కింది. మరాఠీ బుల్లితెరపై నడిచే సీరియల్, షార్ట్ ఫిల్మ్‌లో హీరోయిన్గా అవకాశం వచ్చింది. షూటింగ్ సమయంలో అడుగుల లెక్కింపుతో కెమెరాను సమన్వయం చేసుకుంటాను. ఇది కష్టమైనప్పటికీ కొన్ని రోజుల సాధనతో సాధించగలిగాను. దర్శకుడు చెప్పిన దాని ప్రకారం నా పని నేను పూర్తి చేస్తాను. సెట్స్‌లో అంధురాలిగా అస్సలు భావించను. ఎలాంటి పాత్ర చేసినా ముందుగా నన్ను నేను సిద్ధం చేసుకుంటాను. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక బలహీనత ఉంటుంది. దానిని దాచడం వల్ల ప్రయోజనం లేదు, దానిని బహిర్గతం చేసి అధిగమించడమే మనముందున్న సవాల్. నాకు కావల్సింది నేను పొందాలనుకున్నప్పుడు వెనుకంజ వేసేది లేదు అని ఆత్మవిశ్వాసంతో చెప్పే బబిత న టించిన ‘దృష్ట్’ సినిమా కూడా త్వరలో విడుదల కానుంది. చీకటిని తొలగించే మార్గం... వారణాసిలో ఉంటున్న 25 ఏళ్ల హేమేంద్ర తన మనసులోని చీకటిని తొలగించే మార్గాన్ని కనుక్కొన్న వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఓటీటీ ఫిల్మ్ ‘మిస్టరీ థ్రిల్లర్ బ్రీత్ ఇన్ టు ది షాడోస్’ మూడవ సీజన్లో హేమేంద్ర సైబర్ క్రైమ్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ‘అంధాధున్’ సినిమా సమయం లో నటుడు ఆయుష్మాన్ ఖురానాకు దృష్టిలోపం ఉన్నవారు ఎలా జీవిస్తారో హేమేంద్ర స్వయంగా నేర్పించాడు. అదే సమయంలో ‘శుభో బిజోయ్’ చిత్రానికి నటుడు గుర్మీత్చౌదరి అంధుడి పాత్రకు హేమేంద్ర నుంచే శిక్షణ తీసుకున్నాడు. 17 ఏళ్ల వయసులో ఆప్టిక్ న్యూరైటిస్ అనే వ్యాధి కారణంగా కంటి చూపు కోల్పోయిన హేమేంద్ర ‘ఆత్మహత్య చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నాను. అయితే, నేను ఎందుకు రాణించలేను అని నాకు నేను ప్రశ్న వేసుకుని ఆ తర్వాత నిరంతర సాధనతో ఈ స్థాయికి చేరుకోగలిగా’’ అని తెలియజేస్తాడు. ‘చూపు కోల్పోవడంతో నా కలలన్నీ కల్లలయ్యాయి. ఈ షాక్‌ని భరించడం చాలా కష్టమైంది. కానీ, నా కుటుంబ సభ్యులు మాత్రం నాలో ధైర్యాన్ని నింపారు. నా భవిష్యత్తును నేను ప్రకాశవంతం చేసుకోవాలనుకున్నాను. అందుకోసం కష్టపడటం మొదలుపెê్టను. ఈ ప్రయత్నంలో భాగంగా ముంబైలో దృష్టిలోపం ఉన్నవారికోసం పనిచేస్తున్న ఒక సంస్థను కలిశాను. అక్కడ అంధులైన పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను. అటు తర్వాత పరిచయమైనవారి ద్వారా కళారంగంవైపుగా అడుగులు వేశాను. షూటింగ్ సమయంలో కెమరాను ఫేస్ చేయడం చాలా కష్టం. అయితే, యాక్టింగ్, ఎమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. కొన్నిసార్లు అడవి, సముద్రం వంటి ప్రదేశాల్లోనూ షూటింగ్స్ జరుగుతాయి. అలాంటి చోట అనుకోకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో నేను నా చుట్టూ ఒక సర్కిల్ గీసుకొని, దానిలోపలే ఉంటూ పని పూర్తిచేస్తుంటాను’ అని వివరిస్తాడు హేమేంద్ర. సాధించాలనే తపనకు అవయవలోపం అడ్డంకి కానేకాదు అని నిరూపిస్తున్న ఈ యువ కళాకారులు ‘మేమూ సాధించగలం’ అనే స్ఫూర్తిని తమలాంటి వారెందరిలోనూ నింపుతున్నారు. -
‘బ్లాక్‌చెయిన్’పై తాన్లా దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ సీపాస్ (కమ్యూనికేషన్ ప్లాట్‌ఫాం యాజ్ ఏ సర్వీస్) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్.. కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేకంగా బ్లాక్‌చెయిన్, ఆర్టీఫిషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీ న్ లెర్నింగ్ (ఎంఎల్), క్రిప్టోగ్రఫీ తదితర అంశాల్లో ఆవిష్కరణల కోసం దీన్ని ఉపయోగించనుంది. సుమారు 92,000 చ.అ. విస్తీర్ణంలో దాదాపు రూ. 70 కోట్లతో ఈ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు క్యూ2 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ వ్యవస్థాపక చైర్మన్, సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. దీనికోసం 300 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్న ట్లు, మార్చి నాటి కల్లా ఇది అందుబాటులోకి రానున్నట్లు ఆయన చెప్పారు. అలాగే, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో కలిసి అందిస్తున్న వైజ్లీ ప్లాట్‌ఫామ్‌ను నాలుగో త్రైమాసికంలో అంతర్జాతీయ మార్కెట్లలో పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోందని ఉదయ్ రెడ్డి వివరించారు. దీనికి సంబంధించి ఒక అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ అడ్వైజరీ సర్వీసులు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గేమింగ్, ఫిన్‌టెక్‌తో సీపాస్కు ఊతం.. కొన్నాళ్లుగా నెలకొన్న పరిస్థితులతో డిజిటలైజేషన్ జోరందుకుందని, దీంతో సీపాస్ విభాగానికి మరింత ఊతం లభిస్తోందని ఉదయ్ రెడ్డి తెలిపారు. బ్యాంకింగ్, బీమా, ఎడ్టెక్, గేమింగ్, ఫిన్‌టెక్ తదితర విభాగాలు ఇందుకు గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ మొదలైన వాటి రూపంలో వినియోగదారులకు కంపెనీలు సందేశాలు పంపేందుకు అవసరమైన సీపాస్ సర్వీసులకు డిమాండ్ భారీగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఆటో–డెబిట్ నిబంధనల్లో మార్పులు వంటి నియంత్రణ సంస్థలపరమైన చర్యలు, వాట్సాప్ లాంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌లకు కావాల్సిన సర్వీసులు మొదలైనవి సంస్థ వ్యాపార వృద్ధికి దోహదపడుతున్నాయని ఉదయ్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో తాన్లా అవకాశాలను అందిపుచ్చుకుని, వేగంగా వృద్ధి చెందుతోందని ఉదయ్ రెడ్డి చెప్పారు. దేశీ రెవెన్యూ మార్కెట్లో తమ వాటా 45 శాతం పైగా ఉందని ఆయన వివరించారు. కోవిడ్ టీకాల విషయంలో ఓటీపీలు మొదలైనవి పంపేందుకు సంబంధించి ప్రభుత్వానికి కూడా తమ సంస్థ సరీ్వసులు అందిస్తోందని పేర్కొన్నారు. క్యూ2లో లాభం 67% జూమ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తాన్లా ప్లాట్‌ఫామ్స్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 67% ఎగిసి రూ. 136 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం రూ. 81 కోట్లు. ఆదాయం 44% వృద్ధితో రూ. 842 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 583 కోట్లు. ప్రస్తుత కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్ల చేరిక, మార్కెట్ వాటా పెంచుకోవడం తదితర అంశాల ఊతంతో ఇది సాధ్యపడిందని ఉదయ్ రెడ్డి వివరించారు. సమీక్షాకాలంలో కొత్తగా 87 కస్టమర్లు జతయ్యారని ఆయన పేర్కొన్నారు. క్యూ4లో 111 మంది ఉద్యోగులు చేరారు. పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ (ఈఎస్జీ) లక్ష్యాలకు సంబంధించి తెలంగాణ విద్యా శాఖతో తాన్లా ఫౌండేషన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
సరోగసీలో కొత్త సమస్య..ఆ బిడ్డను ఏం చేయాలి?
శ్రీమంతులు, సంతానం కలగడం వీలులేని వారు సరొగసీ ద్వారా తల్లిదండ్రులు కావడం తెలుసు. గర్భాన్ని అద్దెకి ఇచ్చినవారు బిడ్డను కని ఇక ఆ బిడ్డను మర్చిపోవాల్సిందే. అయితే బిడ్డను కనడానికి డబ్బు తీసుకుని నెలలు నిండాక ఆ డబ్బు ఇచ్చినవారు బిడ్డ మాకు వద్దు అనంటే గర్భాన్ని అద్దెకు ఇచ్చిన స్త్రీ ఏం చేయాలి? కడుపులో ఉన్న బిడ్డ ఏం కావాలి? ఈ సమస్యతో ఈ ఒక సినిమా త్వరలో వస్తున్నా ఈ సమస్య కొత్త ప్రశ్నను లేవదీస్తున్నదనేది వాస్తవం. స్త్రీ సమస్య స్త్రీకే అర్థమవుతుంది. ప్రసిద్ధ మరాఠి నటి, దర్శకురాలు సమృద్ధి పోరే 2011లో ఒక సినిమా తీసింది మరాఠిలో. పేరు ‘మాలా ఆయీ వాయ్చే’ (నాకు తల్లి కావాలని ఉంది). అందులో అమెరికా నుంచి వచ్చిన మేరీ అనే మహిళ మహరాష్ట్రలోని హీరోయిన్ను అద్దె గర్భం ద్వారా బిడ్డను కని ఇవ్వమని అడుగుతుంది. హీరోయిన్ అందుకు సమ్మతిస్తుంది. కాని గర్భంలో బిడ్డ ఎదిగాక పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ పుట్టబోయే బిడ్డ కొన్ని అవకరాలతో (వికలాంగ సమస్యతో) పుట్టే అవకాశం ఉందని మేరీకి చెబుతారు. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఎదురు చూస్తున్న మేరీకి ఈ వార్త పెద్ద దెబ్బగా తాకుతుంది. ఆమె ఆ బిడ్డను వద్దనుకుని అమెరికా వెళ్లిపోతుంది. కాని ఇక్కడ గర్భంలో ఉన్న బిడ్డను మోస్తున్న తల్లి దానిని వద్దనుకోగలదా? ఇప్పుడు ఆ బిడ్డ ఉనికి ఏమిటి? అది ఆ సినిమా కథ. ఇప్పుడు ఇదే సమస్యను తీసుకుని హిందీలో తీసిన ‘మిమి’ జూలై 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అద్దెగర్భం–పెద్ద వ్యాపారం గత రెండు దశాబ్దాలుగా భారతదేశంలో సరొగసి ఒక పెద్ద ధోరణిగా సక్రమమైన విషయాలకు అక్రమమైన విషయాలకు కూడా వార్తల్లో ఉంది. ప్రస్తుతం దేశంలో సంవత్సరానికి 25,000 మంది పిల్లలు సరొగసి ద్వారా పుడుతున్నారని అంచనా. సరొగసి చుట్టూ దాదాపు 3000 కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఉన్న 3000 ఫర్టిలిటీ సెంటరల్లో కొన్ని ఈ సరొగసి పనిలో ఉన్నాయి. పది లక్షల రూపాయల నుంచి పాతిక లక్షల రూపాయలు ఒక్క సరొగసికి మొత్తం ప్యాకేజీ లెక్కన క్లినిక్‌లు మాట్లాడుకుంటున్నాయని తెలుస్తోంది. విదేశీ జంటలు భారతదేశానికి వచ్చి సరొగసి ద్వారా పిల్లల్ని పొందడం వల్ల కావచ్చు, భారతదేశంలో కూడా సబబైన కారణాల వల్ల గాని, కెరీర్లో ఉన్న శ్రీమంతులు గాని సరొగసి ద్వారా బిడ్డలను కనాలనుకోవడం వల్ల ఈ ‘ఇండస్ట్రీ’ బయటకు కొంత తెలిసి, కొంత తెలియక విజయవంతంగా సాగుతోంది. సరొగసి క్రమబద్ధీకరణ కోసం, కమర్షియల్ సరొగసిని నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2019 బిల్లు ఇంకా రాజ్యసభ అనుమతి పొందాల్సి ఉంది. ఈలోపు సరొగసితో ముడిపడిన సమస్యలు ప్రసార మాధ్యమాలకు, వినోద మాధ్యమాలకు మంచి ముడిసరుకు అవుతున్నాయి. ఎన్నో సమస్యలు సరొగసిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అద్దె గర్భం ఇచ్చే స్త్రీకి సాధారణ గర్భంలో ఉండే అన్ని రిస్కులతో పాటు భావోద్వేగాల సమస్యలు ఉంటాయి. కృత్రిమ పద్ధతిలో గర్భం ధరిస్తుంది కనుక ఆ పరీక్షల కోసమని, హార్మోన్ల కోసమని, ఫలదీకరణ కోసం చేసే రిపీటెడ్ తంతు ఆమె శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అద్దె గర్భం ప్రసవంలో కూడా చనిపోయిన తల్లులు ఉన్నారు. ఇక పుట్టిన బిడ్డ ‘జాతీయత’ పెద్ద సమస్య అవుతోంది. ఇక్కడ పుట్టిన బిడ్డను తమ దేశానికి తీసుకెళ్లాలనుకునే విదేశీ జంటలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బిడ్డను వద్దనుకుంటే పంకజ్ త్రిపాఠి, క్రితి సనాన్ నటించగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ‘మిమి’ సరొగసిలోని ఈ సమస్యనే చర్చించనుంది. అవివాహిత అయిన హీరోయిన్ను ఆమె మిత్రుడు సరొగసిలో మంచి డబ్బు ఉందని ఒప్పిస్తాడు. విదేశీ జంట నుంచి 20 లక్షల రూపాయలకు డీల్ కుదురుతుంది. ఆ గర్భం దాల్చి బిడ్డను ఇవ్వడంలో భాగంగా ఆమె ఊరు విడిచి ఇంకో కొత్త ప్రాంతానికి వెళ్లి మిత్రుడిని భర్తగా చెప్పి నివాసం ఉంటుంది. అంతా బాగానే ఉందనుకున్న సమయాన డబ్బు ఇచ్చిన విదేశీ జంట తమకు ఆ బిడ్డ వద్దని చెబుతుంది. ఇప్పుడు బిడ్డను ఏం చేయాలి? గర్భాన్ని మోస్తున్న హీరోయిన్ను ఆమె తల్లిదండ్రులు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని నిలదీస్తారు? కన్నాక ఆ బిడ్డ భవిష్యత్తు ఏమిటి... తల్లి ఎవరు తండ్రి ఎవరు అనేది ఒక సమస్య... వీటన్నింటికీ జవాబు వెతికే ప్రయత్నం ‘మిమి’ చేస్తుంది. గర్భం దాల్చడం భారతీయ సమాజంలో పుణ్యకార్యం. గర్భంతో ఉన్న స్త్రీకి దక్కే గౌరవం, మర్యాద... పిల్లలున్న తల్లికి ఇచ్చే విలువ... వాటి చుట్టూ ఉండే కథలు, గాథలు అందరికీ తెలిసినవే. అద్దె గర్భమే అయినా ఇక్కడి స్త్రీ ఆ గర్భసమయంలో పొందే భావోద్వేగం వేరు. అలాంటిది ఆ బిడ్డకు అసలు హక్కుదారులు తప్పించుకుంటే తాను ఆ బిడ్డను సులువుగా వదులుకునే వీలు ఉండదు. ఈ సెంటిమెంటే ఇప్పుడు ‘మిమి’ సినిమా కథగా చర్చకు వస్తోంది. -
‘అక్టోబరు 30లోపు ఓటీటీకి సినిమాలు అమ్ముకోవద్దు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఫిల్మ్‌చాంబర్ ప్రతినిధులు శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ క్రమంలో.. నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫాంకి ఇవ్వొద్దని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. లాక్డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో... జూలై చివరినాటికి థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉన్నందున అక్టోబర్ 30 వరకు ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని పేర్కొన్నారు. తొందరపడి సినిమాలను అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా... నిర్మాతలు సినిమాలను థియేటర్లో విడుదల చేయకుండా ఓటీటీలో ప్రదర్శించడం అంటే సినీ ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన విభాగాన్ని దెబ్బతీయడమేనని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అభిప్రాయపడింది. తమ విజ్ఞప్తిని ఖాతరు చేయని నిర్మాతల పట్ల భవిష్యత్తులో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూలై 7న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ బాడీ సమావేశం జరపాలని నిర్ణయం తీసుకుంది. సినీ పరిశ్రమ విస్తృత ప్రయోజనాల రీత్యా నిర్మాతలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. -
ఆ మ్యాజిక్ అలాగే ఉంటుంది
డిజిటల్ ఎంటర్టైన్ స్పేస్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ హవా వల్ల నటీనటులకు, దర్శకులకు అవకాశాలు పెరుగుతున్నాయని అంటున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ఈ విషయంపై రకుల్ ఇంకా మాట్లాడుతూ – ‘‘కోవిడ్ కారణంగా థియేటర్స్‌లో ఎంటర్టైన్మెంట్ అందుబాటులో లేకపోవడంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని కంటెంట్ వైపు ప్రేక్షకులు దృష్టి పెట్టారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని మన సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూస్తున్నారు. మంచి కంటెంట్‌ను ప్రశంసిస్తున్నారు. పెద్ద తెరపై సినిమాలను చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేసే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. అలానే ఇప్పుడు ఓటీటీ కంటెంట్‌ను కూడా ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు. అయితే ఒక్కటి మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్స్ ఎన్ని ఉన్నా బిగ్ స్క్రీన్ సినిమా మ్యాజిక్ అలాగే ఉంటుంది. అయితే సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి దిశగా ముందడుగులు వేస్తే చాలా గొప్పగా ఉంటుంది. అటు సినిమాలతో పాటు ఇటు డిజిటల్ వల్ల అవకాశాలు పెరుగుతున్నాయి’’ అన్నారు. -
రాణీ కశ్యప్ కథేంటి?
ఓ హత్య జరిగింది. కానీ ఈ మర్డర్ ఎలా? ఎందుకు జరిగింది? కథేంటి అనేది తాను నటించిన హిందీ చిత్రం ‘హసీన్ దిల్రుబా’లో చూడమని చెబుతున్నారు తాప్సీ. ఈ చిత్రానికి వినిల్ మ్యాథ్యూ దర్శకత్వం వహించారు. విక్రాంత్ మెస్సీ, హర్షవర్థన్ రాణే కీలక పాత్రలు పోషించారు. మర్డర్ మిస్టరీగా రూపొందిన ఈ చిత్రం జూలై 2 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. నిజానికి గత ఏడాది ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ‘‘ఇందులో రాణీ కశ్యప్ పాత్రలో కొత్తగా కనిపిస్తాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుంది’’ అన్నారు తాప్సీ. -
Divi Vadthya: గుర్తింపు పెరిగింది... కష్టం తగ్గింది
‘‘బిగ్‌బాస్ షోతో నాకు మంచి గుర్తింపు లభించింది. అవకాశాల కోసం నేను పడుతున్న కష్టం తగ్గింది. పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అని బిగ్‌బాస్ ఫేమ్ దివీ వైద్య అన్నారు. దివి, గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్, శ్రీహాన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘క్యాబ్ స్టోరీస్’. కేవీఎన్ రాజేష్ దర్శకత్వంలో ఎస్. కృష్ణ నిర్మించారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్పార్క్‌లో ‘క్యాబ్‌స్టోరీస్’ ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దివి మాట్లాడుతూ – ‘‘ఇందులో నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని షాలిని పాత్ర చేశాను. ఓ క్యాబ్ ఎక్కే క్రమంలో షాలిని పొరపాటు చేస్తుంది. ఆ పొరపాటు కథలోని మిగతా పాత్రలపై ప్రభావితం చూపుతుంది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి కంటెంట్‌కు వ్యూయర్షిప్ బాగానే ఉంది. ‘క్యాబ్‌స్టోరీస్’ ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘డైరెక్షన్, ప్రొడక్షన్, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ఇలా 24 క్రాఫ్ట్స్‌లో ఏ విభాగంలోనైనా పని చేస్తాను. డైరెక్షన్ ఆలోచన ఉంది. చిరంజీవిగారు హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో కీలక పాత్ర చేయనున్నాను. ఇటీవలే ‘లంబసింగి’ ప్రాజెక్ట్ పూర్తి చేశాను. ‘ఘర్షణ’ వెబ్ సిరీస్‌లో ఓ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
Nayanthara: నయనతార 'నిళల్' మూవీ రివ్యూ
చిత్రం: ‘నిళల్’ (మలయాళం) తారాగణం: నయనతార, కుంచాకో బోబన్; సంగీతం: సూరజ్ ఎస్. కురూప్ కెమేరా: దీపక్ డి ఎడిటింగ్: అప్పు ఎన్. భట్టాత్రి, అరుణ్ లాల్ దర్శకత్వం: అప్పు ఎన్. భట్టాత్రి నిడివి: 124 నిమి ఓటీటీ: అమెజాన్ దేశంలోని ఎక్కడెక్కడి వాళ్ళకూ ఇప్పుడు మలయాళం సుపరిచితం. కారణం.... కరోనా దెబ్బతో ఓటీటీలో మలయాళం సినిమాలు పెద్ద హల్చల్. లేటెస్ట్గా అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతున్న మలయాళ చిత్రం – నయనతార ‘నిళల్’ (అంటే ‘నీడ’ అని అర్థం). మిస్టరీ థ్రిల్లర్ కోవకు చెందిన చిత్రమిది. కాకపోతే, ఇప్పటికే మంచి మలయాళ సినిమాలెన్నో చూశాక, ఈ మిస్టరీ వాటితో పోలిస్తే అంతగా ఆనుతుందా? కథేమిటంటే..: ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జాన్ బేబీ (కుంచాకో బోబన్). కారు ప్రమాదంలో గాయపడ్డ అతనికి లేని వర్షం పడుతోందన్న భ్రమ లాంటివి కలుగుతుంటాయి. ఇంతలో, చైల్డ్ సైకాలజిస్ట్ అయిన డాక్టర్ ఫ్రెండ్ షాలిని (దివ్య ప్రభ) ద్వారా ఎనిమిదేళ్ళ చిన్న స్కూలు పిల్లాడు నితిన్ గురించి తెలుస్తుంది. మర్డర్ స్టోరీలు చెప్పే ఆ కుర్రాడి గురించి, అతని తల్లి షర్మిల (నయనతార) గురించి హీరో ఆరా తీస్తాడు. చూడడానికి మామూలుగా ఉండే ఆ కుర్రాడు కథలో చెప్పే ప్రాంతాలకు వెళితే, నిజంగానే అక్కడ అస్తిపంజరం బయటపడుతుంది. పిల్లాడు చెబుతున్న కథలు ఒక్కొక్కటీ వాస్తవ మని తేలడంతో మిస్టరీ పెరుగు తుంది. దాన్నిఛేదించడానికి హీరో, ఆ పిల్లాడి తల్లి ఏం చేశారు? తండ్రి లేని ఆ పిల్లాడిని తల్లి అసలు ఎలా పెంచింది? ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి లాంటివి చివరలో ముడి వీడతాయి. ఎలా చేశారంటే..: సగటు తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ సినిమాలో బాగా తెలిసిన ముఖం నయనతార ఒక్కరే! పిల్లాడి తల్లి పాత్రలో ఆమె చేయడానికి ఈ కథలో పెద్దగా ఏమీ కనపడదు. కథలో తొలిసారి కనిపించే లాంటి కొన్నిచోట్ల మేకప్ కూడా ఎక్కువవడంతో నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక, కథానాయకుడైన మేజిస్ట్రేట్ పాత్రలో కుంచాకో బోబన్ ఫరవాలేదనిపిస్తారు. కేరళలోని తొలి స్టూడియో అయిన ‘ఉదయ’ ఓనర్ల కుటుంబానికి చెందిన అతను ఒకప్పుడు బాల నటుడు. ఇప్పుడు పలు చిత్రాల హీరో, నిర్మాత, వ్యాపారవేత్త. లేటెస్ట్ మలయాళ థ్రిల్లర్ ‘నాయట్టు’ (వేట)లోనూ ఇతనే హీరో. సినిమా చివరలో మలయాళ దర్శక, నటుడు లాల్ కాసేపు కనిపిస్తారు. ఎలా తీశారంటే..: మొదట కాసేపు బాగా నిదానించినా, అరగంట తర్వాత కథలోని మిస్టరీ ఎలిమెంట్ ప్రేక్షకులను కూర్చోబెడుతుంది. కాకపోతే, ఆ ఆసక్తిని కొనసాగించడంలోనే దర్శక, రచయితలు విఫలమయ్యారు. ఎంచుకున్న ఇతివృత్తం బాగున్నా, దాన్ని ఆసక్తిగా చెప్పడంలోనే ఇబ్బంది పడ్డారు దర్శకుడు. ప్రాథమికంగా ఎడిటరైన ఆయనకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. హీరో లవ్ ఫెయిల్యూర్ స్టోరీ, హీరోయిన్ చిన్నప్పటి కష్టాలు, క్లైమాక్స్‌లో వచ్చే అసలు కథ – ఇలా బోలెడు అంశాలున్నాయి కానీ, అన్నిటినీ కలిపి కథగా చెప్పలేకపోయారు. కథారంభంలో వేసుకున్న ముడులు సంతృప్తి కలిగేలా విప్పలేదనిపిస్తుంది. కేరళలోని అందమైన లొకేషన్లతో పాటు కర్ణాటక హొగెనెకల్ జలపాతం దాకా సినిమా తిరుగుతుంది. అయితే సీన్లకు సీన్లు జరుగుతున్నా కథ ముందుకు నడిచేది తక్కువ. పైగా పాత్రలూ ఎక్కువే. కథ కన్నా కెమేరా వర్క్, ఆర్.ఆర్. మీద ఎక్కువ ఆధారపడ్డారా అని అనుమానం కలుగుతుంది. సినిమాలోని రెండు పాటలూ లేకున్నా ఫరవాలేదు. వర్షం పడడం లాంటి అతని భ్రమలకు కారణం ఏమిటన్నది సినిమా చివరి దాకా చూసినా అర్థం కాదు. నయనతార పాత్ర, ఆ పాత్ర ప్రవర్తన కూడా ఓ పట్టాన అంతుచిక్కదు. పిల్లాడి కథకూ, తన కథకూ ఏదో ముడి ఉందని భావించిన హీరో దానికి ముగింపు చెప్పలేదు. అతీంద్రియ శక్తుల కథ అనే ఫీల్ ఇచ్చి, ఆఖరుకు తుస్సుమనిపించారు. వెరసి, మలయాళ సిన్మా కదా అని... నయనతారపై ఆశలు పెట్టుకొని ఈ ‘నిళల్’ చూస్తే, ఆశాభంగం తప్పదు. అటు నయనతార, ఇటు సినిమా – ఎవరూ మెప్పించరు. ఇంగ్లీష్ సబ్ టైటిల్సున్న ఈ సినిమా... లాక్డౌన్ టైమ్‌లో మరీ... ఖాళీగా ఉంటే చూడవచ్చు. లేదంటే, స్కిప్ చేసినా మీరేమీ మిస్ కారు. బలాలు: సస్పెన్స్ కథాంశం, నయనతార స్టార్ వ్యాల్యూ బలహీనతలు: స్లో నేరేషన్, నీరసింపజేసే క్లైమాక్స్, కథను మించి రీరికార్డింగ్ హంగామా, కథన, దర్శకత్వ లోపాలు కొసమెరుపు: స్టార్లు ఉన్నంత మాత్రాన... సినిమాలు బాగుండవు! – రెంటాల జయదేవ -
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
‘ప్లాన్ పేరు ‘టీ అండ్ ఎఫ్’ అంటే ట్యూస్ డేస్ అండ్ ఫ్రైడేస్.రూల్ నంబర్ వన్.. ఇద్దరం ప్రతి మంగళ, శుక్రవారాల్లో మాత్రమే కలుసుకోవాలి.రూల్ నంబర్ టూ.. మిగిలిన వారాల్లో ఎవరి ఇష్టం వారిది. నువ్వు వేరే అమ్మాయి తో డేట్ చేసినా.. నేను ఇంకో అబ్బాయితో డేట్ చేసినా నిలదీయొద్దు.రూల్ నంబర్ త్రీ.. థర్డ్ డేట్ వరకు నో కిసెస్, నో హగ్స్..ఇద్దరిలో ఎవరికిది వర్కవుట్ కావట్లేదు అనిపించినా తప్పుకోవచ్చు. ఎలాంటి సంజాయిషీలు, ప్రశ్నలు ఇచ్చిపుచ్చుకోవడాలు లేకుండా. తర్వాత ఎవరిదారి వారిది’ అంటూ అబ్బాయికి డేటింగ్ ప్లాన్ వినిపిస్తుంది అమ్మాయి. వెంటనే ఒప్పుకోవడానికి కాస్త తటపటాయించినా తర్వాత ఒప్పుకుంటాడు అబ్బాయి. ఆమె పేరు.. సియా (ఝటాలేకా), అతని పేరు వరుణ్ (అన్మోల్ టకారియా థిల్లాన్). సినిమా .. టీ అండ్ ఎఫ్. భన్సాలీ ప్రొడక్షన్స్ (సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణ సారథ్యం). దర్శకుడు.. తన్వీర్ సింగ్. ప్రేమ, పెళ్లి పట్ల మిల్లేనియల్స్ ఆలోచనల తీరు, భద్రతాభద్రతల భావనలు, నమ్మకం– అపనమ్మకాల ప్రయాణాన్ని చూపించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.కథ.. సియా.. వృద్ధిలోకి వస్తున్న న్యాయవాది. వరుణ్.. ఔత్సాహిక రచయిత. అతను రాసిన నవల సినిమా హక్కుల వివాదంలో ఒకరికొకరు పరిచయం అవుతారు. ఇద్దరి తల్లిదండ్రులు విడాకులతో వేరవుతారు. ఆ ఇద్దరూ తల్లుల దగ్గరే పెరుగుతారు. అయితే తన తల్లిదండ్రుల విడాకులతో ప్రేమ, పెళ్లి విషయంలో వరుణ్ ప్రతికూల అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటాడు. సియా.. కొంత ఆశావాహ ధోరణిలో ఉంటుంది. ప్రేమ, పెళ్లి తన తల్లిదండ్రుల విషయంలో విఫలమైనంత మాత్రాన అందరికీ అదే ఎదురవుతుందనే ఆలోచనలో ఉండడం తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్.తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్.తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్.తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్.ప్రేమ, పెళ్లికి సంబంధించిన అనుబంధానికి ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుందనేది అతను ఏర్పర్చుకున్న నమ్మకం. అది ఏడు వారాల తర్వాత బీటలు వారి గొడవలతో సమాప్తం అవుతుందని అతనికున్న అభద్రత. అందుకే సియా అంటే ఇష్టం ఉన్నా ఆ రిలేషన్ ఏడువారాలే సాగాలని.. జీవితాంతం తోడు అనే కాన్సెప్ట్‌తో ఆమెకు దగ్గరై.. తర్వాత గొడవలతో ఆమెకు దూరమయ్యే బాధను భరించలేనంటాడు. అతని ఆ దృక్పథాన్ని మార్చాలని.. ఒకరిపట్ల ఒకరు గౌరవంతో ఉంటే ఏ అనుబంధమైనా పదికాలాపాటు పదిలంగా ఉంటుందని అతనికి చెప్పే ప్రయత్నం చేస్తుంది.అందులో భాగమే ఆ ‘టీ అండ్ ఎఫ్’ డేటింగ్ ప్లాన్. ట్యూస్ డేస్ అండ్ ఫ్రైడేస్ ప్లాన్‌తో సియాను వదులుకోలేనంత ప్రేమలో కూరుకుపోతాడు వరుణ్. అయినా గొడవలతో విడిపోతామేమోనన్న అభ్రదత, భయంతో సియాను దూరం చేసుకుంటాడు. విపరీతమైన మానసిక సంఘర్షణ తర్వాత సియాతో జీవితాంతం ఉండిపోవడానికి సిద్ధమవుతాడు. ఏడు వారాల కాన్సెప్ట్ మళ్లీ అతని మెదడును వెతుక్కోకుండా ఉండడానికి ఏడాది గడువిచ్చి.. ఆ ఏడాది డేటింగ్లో వరుణ్ అభద్రతను, ప్రేమ, పెళ్లి పట్ల ఉన్న అపనమ్మకాన్ని పూర్తిగా పోగొట్టి.. పెళ్లికి ఓకే అంటుంది సియా.కామెంట్..కొత్త కథాంశాన్ని తీసుకున్నా కథనంలో భిన్నత్వాన్ని చూపించలేకపోయింది. మహిళా సాధికారతను స్పృశించినా ఫోకస్ చేయలేకపోయింది. కథకు మించిన పాత్రలతో కొంత గందరగోళానికి గురి చేసింది. హీరోహీరోయిన్లూ కొత్తవాళ్లే. అందంతో ఆకట్టుకుంటారు తప్ప నటనతో కాదు. అన్నట్టు హీరో అన్మోల్ .. బాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ పూనమ్ థిల్లాన్ కొడుకు. -
స్టార్ హీరో సినిమా: థియేటర్లో, ఓటీటీలో ఒకేసారి!
‘రాధే’ అనుకున్నట్టుగానే రంజాన్‌కు థియేటర్స్‌లో సందడి చేయనున్నాడు. అయితే ఈ నెల 13న ఒకేసారి ఇటు థియేటర్స్‌లో అటు ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది ‘రాధే’. ఓటీటీ డీల్ దాదాపు 230 కోట్లు ఉంటుందని బాలీవుడ్ టాక్. సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. గత ఏడాది కరోనా సమయంలో కూడా ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్ వచ్చినా ముంబయ్ థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అభ్యర్ధనల మేరకు సల్మాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఒకేసారి ఓటీటీ, థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తున్నారు. ముంబయ్‌లో థియేటర్స్ మూతబడటం, ఇంకా ఉత్తర, దక్షిణాదిన కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీటింగ్ వంటివి ‘రాధే’ సినిమాను ఇలా థియేటర్, ఓటీటీలో రిలీజ్ చేయడానికి కారణం అయ్యుంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చదవండి: ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్: చిట్టిబాబు చింపేశాడుగా -
గంగూబాయి చూపు ఓటీటీ వైపు?
ఆలియా భట్ టైటిల్ రోల్లో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమాను ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే కరోనా ప్రభావంతో ప్రస్తుతం ముంబయ్‌లో థియేటర్స్ క్లోజ్ చేసి ఉండటం, ఒకవేళ మళ్లీ తెరచినా థియేటర్స్‌లో సీటింగ్ సామర్థ్యం యాభై శాతమే ఉండే అవకాశం కనిపించడంతో భన్సాలీ ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరి.. గుంగూబాయి దారి థియేటర్వైపా? ఓటీటీవైపా? అనేది వేచి చూడాల్సిందే. చదవండి: ఫేషియల్ చేయమంటే నటిని అందవిహీనంగా మార్చిన డాక్టర్ -
బాలీవుడ్ హీరోతో రాశీ ఖన్నా రొమాంటిక్ పాటలు!
సెట్లో పాటలు పాడుకుంటున్నారు హీరోయిన్ రాశీ ఖన్నా, షాహిద్‌కపూర్. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఓ వెబ్ సిరీస్‌లో షాహిద్ కపూర్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం షాహిద్, రాశీ కాంబినేషన్లోని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఇద్దరిపై రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలిసింది. సన్నివేశాలతో పాటు పాటలు కూడా చిత్రీకరిస్తున్నారట. వచ్చే ఏడాది ఈ వెబ్‌సిరీస్ ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... రాశీ ఖన్నా నటిస్తున్న తొలి వెబ్‌సిరీస్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు రాశీఖన్నా. లొకేషన్లో షాహిద్ కపూర్‌తో... -
కేంద్ర నిర్ణయంపై రాధికా ఆప్టే ఫైర్
ఈ మధ్యకాలంలో ఓటీటీ వినియోగం బాగా పెరిగింది. చిన్న సినిమాలు మొదలుకొని స్టార్ నటీనటులు కూడా ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్నారు. అయితే సినిమాల్లో ఉన్నట్లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై నియంత్రణ లేదు. దీంతో ఓటీటీ(ఓవర్ ద టాప్) పేరిట అశ్లీలం నేరుగా ప్రజల నట్టింట్లోకి చేరుతోందన్న ఆందోళనలు పెరిగిపోతుండడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన నిబంధనావళిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓటీటీ కంటెంట్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గైడ్‌లైన్స్‌పై నటి రాధికా ఆప్టే అభ్యంతరం వ్యక్తం చేసింది. 'ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ట్రెండ్ నడుస్తుంది. దీన్ని వల్ల ఎన్నో కొత్త ఆలోచనలు ప్రేక్షకులకు చేరుతున్నాయి. అంతేకాకుండా ఓటీటీ వల్ల చాలా మంది ఉపాధి అవకాశాలు లభించాయి. గత కొన్నాళ్లుగా ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. ఇదా చాలా అద్భుతమైన ప్లాట్పామ్. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన నిబంధనలు భయానకంగా ఉన్నాయి. మున్ముందు ఇంకెన్ని మార్పులు వస్తాయో చూడాలి' అని అసహనం వ్యక్తం చేసింది. కాగా అందాల ఆరబోతకు వెనకాడని రాధికా ఆప్టే ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య రాధికా ఆప్టే బాత్రూం సీన్లలో కనిపించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. చదవండి : ఓటీటీలపై నిఘా పెళ్లి ఇష్టం లేదు, కానీ దానికోసమే చేసుకున్నా -
నాకు అదే సులభం!
‘‘నేను చాలా షోస్‌కి గెస్ట్‌గా వెళ్లాను. హోస్ట్‌గానూ చేశాను. గెస్ట్‌గా ఉన్నప్పుడు ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే, గెస్ట్‌గా ఉండడం కంటే హోస్ట్‌గా ఉండడమే సులభమని అర్థమైంది’’ అని హీరో రానా అన్నారు. ఆయన వ్యాఖ్యాతగా చేస్తున్న ‘నెం.1 యారీ’ గేమ్ 3వ సీజన్ ఓటీటీ వేదిక ‘ఆహా’లో సందడి చేయనుంది. విలేకరుల సమావేశంలో రానా మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు చేసిన సీజన్స్‌కు డిఫరెంట్‌గా, కొత్తగా మూడో సీజన్ ఉంటుంది. ట్రంప్ కార్డ్ గేమ్ షోను సినీ స్టార్స్‌తో ఆడనున్నాం’’ అన్నారు. -
‘డైరెక్ట్‌గా పోర్న్ వీడియోలను చూపిస్తున్నారు’
న్యూఢిల్లీ: కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పోర్నోగ్రఫీ కంటెంట్‌ని డైరెక్ట్‌గా ప్రసారం చేస్తున్నాయని.. కేంద్రం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయిన పొలిటికల్ డ్రామా ‘తాండవ్’లో కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి.. వాటిని తొలగించాలంటూ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తొలుత అలహాబాద్ హై కోర్టు తాండవ్ మేకర్స్‌కి, అమెజాన్ ప్రైమ్ ఇండియా ఉన్నత ఉద్యోగి అపర్ణ పురోహిత్‌కి నోటీసులు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ అపర్ణ పురోహిత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో జస్టిస్ అశోక్ భూషన్ అధ్వర్యంలోని బెంచ్ గురువారం ఈ పిటిషన్‌ని విచారించింది. ఈ సందర్భంగా అశోక్ భూషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమాలు, వెబ్ సిరీస్ చూడటం సర్వసాధారణం అయ్యింది. కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు డైరెక్ట్‌గా పోర్న్ కంటెంట్ ఉన్న వీడియోలను ప్రసారం చేస్తున్నాయి. వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది’’ అని తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్ విచారణ కన్నా ముందే కేంద్రం తాజాగా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలను, నేరపూరిత సమాచారాన్ని కట్టడి చేసేందుకు విడుదల చేసిన మార్గదర్శకాలను తమ ముందు ఉంచాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ఆదేశించింది. చదవండి: ఓటీటీకి కూడా సెన్సార్ సోషల్ మీడియాకు కళ్లెం -
ఓటీటీలో ‘క్రాక్’ సత్తా; 25 కోట్ల నిమిషాలకు పైగా
మాస్ మహారాజా రవితేజకు పూర్వవైభవం తీసుకువచ్చిన మూవీ ‘క్రాక్’. గోపీచంద్ మలినేని- రవితేజ కాంబోలో రూపొందిన ఈ హ్యాట్రిక్ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వసూళ్ల వర్షం కురిపించింది. ఇక సంక్రాంతి కానుకగా విడుదలై అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ‘క్రాక్’ ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. తెలుగు వారి ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఈ సినిమా ఫిబ్రవరి 5 నుంచి ఈ సినిమా స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటికి 250 మిలియన్ నిమిషాల వ్యూయర్ షిప్ సాధించి ‘ఆహా’ పాత రికార్డులను బద్దలుగొట్టాడు పోతరాజు వీరశంకర్. ఈ విషయాన్ని ఆహా టీం అధికారికంగా వెల్లడించింది. బ్లాక్‌బస్టర్ కంటిన్యూస్ అంటూ ఇప్పటివరకు 25 కోట్ల నిమిషాల పాటు స్ట్రీమ్ అయ్యిందంటూ హర్షం వ్యక్తం చేసింది. ఇక అంతకుముందు ఆహాలో హైయ్సెస్ట్ వ్యూస్ రికార్డు కలర్ ఫొటో సినిమా పేరిట ఉండేది. ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన క్రాక్ ఓటీటీలోనూ రికార్డుల వేట కొనసాగిస్తోందంటూ రవితేజ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. చదవండి: రేటు పెంచేసిన మాస్ మహారాజా.. నిర్మాతలకు షాకే! Blockbuster run continues 🔥#KrackOnAHA crosses 250 million viewing minutes of all your love!@RaviTeja_offl @shrutihaasan @megopichand @MusicThaman @TagoreMadhu @TheKrackMovie pic.twitter.com/XoRufQNoR8 — ahavideoIN (@ahavideoIN) February 26, 2021 -
అత్తగారికి అభద్రత.. అమ్మలో ఆందోళన
కోడలు గృహప్రవేశం చేయబోతోందంటే అత్తగారికి అభద్రత. కూతురు ఓ ఇంటిదవుతోందని అమ్మ ఆనందపడుతున్నా... మనసులో ఏ మూలో బెంగ.. అత్తింట్లో బిడ్డ జీవితం ఉంటుందోనని. అమ్మాయికీ ఆందోళనే.. కట్టుకునేవాడు సమభాగస్వామ్యం ఇస్తాడా? లేక తల్లి మాటకు విలువిస్తాడా? అని. ఈ ఇన్సెక్యూరిటీస్ను స్త్రీ కోణంలోంచే చిత్రీకరించినా ఆ సీరియస్‌నెస్‌ను కామెడీగానే చూపించిన ఇంగ్లిష్ సినిమా ‘కందస్వామీస్ వెడ్డింగ్’. దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్‌లో స్థిరపడ్డ భారతీయ వలస కుటుంబాల కథ. దక్షిణాఫ్రికా.. భారతీయ వలసలు అనగానే ‘వీరయ్య’ తెలుగు నవల జ్ఞాపకం వస్తుంది. సబ్జెక్ట్ అది కాకపోయినా ఆ కుతూహలాన్ని, ఉత్సాహాన్ని ఏమాత్రం నీరుగార్చదు ‘కందస్వామీస్ వెడ్డింగ్’. తమిళ కందస్వామి ఫ్యామిలీ తెలుగు నాయుడు ఫ్యామిలీతో వియ్యం అందుకునే స్టోరీ ఇది. యూరప్, అమెరికా నేపథ్యంలో వచ్చిన బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో పోలిస్తే కందస్వామీస్ వెడ్డింగ్ దక్షిణ ఆఫ్రికాలో దక్షిణ భారతీయ బ్యాక్‌గ్రౌండ్, అక్కడి జీవన శైలితో కొత్తగా అనిపిస్తుంది. ఆసక్తినీ కలిగిస్తుంది. కథ, కథనం సింప్లీ సూపర్బ్. దర్శకత్వం జయన్ మూడ్లే. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా. క్లాప్ కొడితే... శాంతినాయుడు, ప్రెగ్గీ నాయుడుల కొడుకు ప్రిషేన్.. డాక్టర్. జెన్నిఫర్ కందస్వామి, ఎల్విస్ కందస్వామిల కూతురు జోడీ.. బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్.. ఈ ఇద్దరివీ పక్కపక్క ఇళ్లే. ప్రిషేన్, జోడీ ప్రేమించుకుంటారు. వాళ్ల పెళ్లికి పెద్దలూ అంగీకరిస్తారు. పెళ్లి ముహూర్తాలూ తీసుకొని, పెళ్లికి అయిదు రోజుల ముందు నుంచి సినిమా మొదలవుతుంది. శాంతినాయుడు తమ ఇంటి ఆచారాల ప్రకారం పెళ్లికి ముందు జరగవలసిన పూజలతో గాబరా పడుతుంటే అటు జెన్నిఫర్ పెళ్లి ఏర్పాట్ల హడావిడిలో ఉంటుంది. ఇక్కడే చిక్కొచ్చి పడుతుంది. జెన్నిఫర్ ఓకే చేసిన వాటిని శాంతి నాట్ ఓకే అంటుంది. తన కొడుకు ప్రిషేన్.. జోడీ చెప్పినవాటికి తలాడించడాన్ని చూసి కంగారు పడుతుంటుంది. పెళ్లికాకముందే అమ్మ మాటను బేఖాతరు చేస్తే ఇక పెళ్లయ్యాక అమ్మనేం పట్టించుకుంటాడు అని. ఆమె అనుకున్నట్టుగానే పెళ్లయ్యాక డర్బన్‌లో ఉండకుండా కేప్ టౌన్లో కాపురం పెట్టేందుకు వీలుగా అక్కడే డాక్టర్ కొలువు వెదుక్కుంటాడు. ఈ విషయం పెళ్లికొడుకును చేసే తంతు రోజు’ తెలుస్తుంది అతని ప్రొఫెసర్ ద్వారా శాంతికి. అవాక్కవుతుంది. ఆ నిర్ణయం జోడీదే అయ్యుంటుందని గట్టిగా నమ్మడమే కాదు కొడుకును అడుగుతుంది కూడా. ‘కాదు.. కలిసి తీసుకున్న నిర్ణయం’ అని ప్రిషేన్ చెప్పినా సమాధానపడదు శాంతి. ఆ క్షణం నుంచి కొడుకును గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తూంటుంది. జోడీతో కలిసి గుడికి, షాపింగ్‌కి, రెస్టారెంట్లో లంచ్‌కి, సంగీత్ కోసం డాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్లేలా కొడుకు చేసుకున్న ప్లాన్స్ అన్నిటికీ అంతరాయం కల్పించి ఆ సమయాలు ప్రిషేన్ తనతో మార్కెట్‌కు వచ్చేలా, ఇతరత్రా పనుల్లో సహాయంగా ఉండేలా చేస్తుంది శాంతి. ఈ విషయం ప్రిషేన్, జోడీలకు అర్థమై... జోడీ అసహనపడుతుంటే ఓపికపట్టమని కోరతాడు ప్రిషేన్. ఇటు.. జెన్నిఫర్ కందస్వామికీ కూతురు ప్రవర్తన ప్రశ్నార్థకంగా అనిపిస్తుంది. డర్బన్‌లో మంచి ఉద్యోగం వస్తే వదులుకుందని తెలుస్తుంది. కాబోయే భర్త కోసమే డర్బన్‌లోని తన కెరీర్‌ను త్యాగం చేసింది తన కూతురు అనే అభిప్రాయం తో ఉంటుంది జెన్నిఫర్. తనే తప్పయితే చేసిందో ఆ తప్పు తన కూతురు చేయకూడదని, ఆర్థిక స్వాతంత్య్రంతో కుటుంబంలో నిర్ణయాత్మక శక్తిగా తన బిడ్డ ఉండాలని కలలు కంటుంది. ఆ ఉద్యోగాన్ని వదులుకోవడంతో తన కలలను కల్లలు చేస్తోంది జోడీ అని మథన పడుతూంటుంది. దీనికి ప్రిషేనే కారణమని సందర్భం చూసుకొని ప్రిషేన్ ముందు జోడీ జాబ్ ప్రస్తావన తెస్తుంది జెన్నీఫర్. ఆ విషయం అసలు తనకు తెలియదని.. జోడీ కోసం తనేమైనా చేస్తానని.. డర్బన్ లో ఉండిపోవడానికీ సిద్ధమేననీ జెన్నిఫర్‌కు ప్రామిస్ చేస్తాడు ప్రిషేన్. నిశ్చింత చెందిన జెన్నిఫర్ మళ్లీ కూతురికి ఆ ఉద్యోగం వచ్చేలా చేస్తుంది జోడీకి తెలియకుండా. అయితే ఆ సత్యం సంగీత్ రోజు జోడీ చెవిన పడుతుంది. ‘ఎందుకలా చేశావ్?’ అని తల్లిని నిలదీస్తుంది జోడీ. ప్రిషేన్ అంగీకారంతోనే చేశానని చెబుతుంది తల్లి. అంతే! మొత్తం సీన్‌ను అపార్థం చేసుకుంటుంది జోడీ. సంగీత్ అయిన వెంటనే ఇంటికి వచ్చేసి రోడ్డు మీద ప్రిషేన్ను నిలదీస్తుంది.. ‘మీ అమ్మకోసమే డర్డన్ వదిలి రాకుండా ఉండడానికి నా ఉద్యోగాన్ని ఓ సాకులా చూపించ దలచావ్ కదా’ అంటూ. హతాశుడవుతాడు ప్రిషేన్. ‘కాదు.. నీ కెరీర్ కోసమే’ అని చెప్పినా వినదు జోడీ. నువ్వు నా కన్నా మీ అమ్మకే ఇంపార్టెన్స్ ఇస్తున్నావ్... చూస్తూనే ఉన్నా. ఆమె ఏం చెబితే దానికి తలాడిస్తున్నావ్’అంటూ పెళ్లి పనులు, పెళ్లి పందిరి మొదలు హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లాలో వరకు అన్నిట్లో అత్తగారు జోక్యం చేసుకున్న తీరును దుయ్యబడుతుంది. అమ్మ కూచి అంటూ వెక్కిరిస్తుంది. ఇటు కూతురికి సపోర్ట్‌గా జెన్నిఫర్, అటు కొడుకుకు సపోర్ట్‌గా శాంతి చేరి ఆ గొడవను పెద్దది చేస్తారు నాయుడు, కందస్వామి సర్దిచెప్తున్నా వినకుండా. స్త్రీ మనసు అర్థమవుతుంది ఇద్దరికీ తెల్లవారి జరగవలసిన పెళ్లి.. జరుగుతుందా లేదా అన్న మీమాంసలో పడిపోతారు చుట్టాలు. ఇంట్లోకి వెళ్లాక ఇటు జెన్నిఫర్‌కు, అటు శాంతికి ఇద్దరికీ తమ బిడ్డల సహజీవనంలో ఆ తల్లుల జోక్యం ఎంతుందో వివరించే ప్రయత్నం చేస్తారు పిల్లల తండ్రులు. అప్పుడు తన అభద్రతను బయటపెడుతుంది శాంతి. ఇటు జెన్నిఫర్ కూడా భర్త కోసం, ఆ ఇంటి కోసం తనను తాను కోల్పోయిన తీరును, వెనకే ఉండిపోయిన బాధను వెళ్లగక్కుతుంది. జోడీ, ప్రిషేన్ కూడా జరిగిందాన్ని చర్చిస్తారు. ఆ రెండిళ్ల మగవాళ్లకూ స్త్రీ మనసు అర్థమవుతుంది. సమస్య పరిష్కారమవుతుంది. ఇది ఓ కొలిక్కి రావడానికి జెన్నిఫర్ అత్తగారి పాత్ర కీలకం. ఆమె గృహహింస బాధితురాలు. భర్తను వదిలేసి సింగిల్ పేరెంట్‌గా కొడుకును పెంచుతుంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తూ అసలు కథను నడిపిస్తుంది. మొత్తానికి ప్రిషేన్ నాయుడు, జోడీ కందస్వామి వివాహంతో కథ సుఖాంతమవుతుంది. -
దేశవ్యాప్తంగా చర్చ రేపుతున్న ‘గ్రేట్ ఇండియన్ కిచెన్’ రివ్యూ
వంట గదిలో పొయ్యి వెలుగుతూ ఉండాలి. వెలిగించే పని ఆమెదే. సింక్‌లో గిన్నెలు పడుతూ ఉండాలి. కడిగే పని ఆమెదే. మనిషికో కూర కావాలి. అమర్చే పని ఆమెదే. ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి... ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి... ఏళ్లకు ఏళ్లు... ఎవరికో ఒకరికి విసుగు పుడుతుంది. తీసి మురికినీళ్లు కుమ్మరించాలనిపిస్తుంది. ఆ కోడలు అదే పని చేసింది. దేశవ్యాప్తంగా చర్చ రేపుతున్న మలయాళ సినిమా ‘గ్రేట్ ఇండియన్ కిచెన్’ రివ్యూ ఇది. ఒక ప్రయోగం చేసి చూద్దాం. ఈ పూట భర్తకు నాలుగు ఉల్లిపాయలు ఇచ్చి ‘సరదాగా తరగరాదూ’ అని భార్య అనేలా చేద్దాం. ‘ఓ’ అని సరదాగా టీవీ చూస్తూ తరుగుతాడు. ఏదైనా జోక్ కూడా వేస్తాడు. అయిపోతుంది. మధ్యాహ్నం అవుతుంది. ‘ఇదికో ఈ రెండు బీరకాయలు తొక్క తీసి ఇవ్వరాదూ’ అని భార్య చేత ఇచ్చేలా చేద్దాం. ‘బీరకాయలా?’ అని ఎగాదిగా చూస్తాడు. ఈసారి జోకులేయడు. తొక్క తీసి ఇచ్చేస్తాడు. రాత్రవుతుంది. వంట చేసే వేళవుతుంది. ‘ఇదిగో... నిన్నే... ఈ ఆలుగడ్డ కొంచెం వొలిచీబ్బా’ అని భార్య భర్తతో అనాలి. అప్పుడు భర్త ఏం చేస్తాడు? ఒక్కరోజుకే. ఆహా... ఇల్లు నెత్తికెత్తుకుంటావేం. మరి రోజూ.. రోజూ.. రోజూ.. నెలలు... సంవత్సరాలు.. మూడు పూట్లా ఆమె వొలుస్తూ... తరుగుతూ.. కోస్తూ.. వేయిస్తూ.. ఉడకబెడ్తూ.. దించుతూ.. ఎక్కిస్తూ... చేయి కాల్చుకుంటూ పని చేస్తూ ఉందే... ఆమె ఎందుకు ఇల్లును గిరాటు వేసి వెళ్లకూడదు? వంట ఎవరిది? ఈ ఆదిమ ప్రశ్నకు సమాధానంగా పురుషుడు అనాదిగా స్త్రీ వైపు వేలు చూపిస్తూ వచ్చాడు. స్త్రీ ఇంట్లో ఉండాలి. ఉత్తినే ఉండకూడదు.. వంట చేస్తూ ఉండాలి. పురుషుడు ఇంటికొచ్చే వేళకు ఆమె భోజనం సిద్ధం చేయాలి. పురుషుడు కూడా తెలివైనవాడు. అందుకు బదులుగా ఆమెకు ఒక నగ చేయిస్తాడు. ఒక చీర కొనిపెడతాడు. ‘నేనేమైనా వంట గదిలోకి వస్తున్నానా? అక్కడి పెత్తనమంతా నీదేగా’ అని ఇంట్లో మూలగా ఉండే వంట గదిని ఆమెకు రాసిస్తాడు. ఆ పనిలో ఎప్పటికీ సాయం చేయడు. అది తన పని కాదు. అది ఆమెదే. కిచెన్ కే సైడ్ ఎఫెక్ట్స్ వంట అంటే కేవలం వంటేనా? పొయ్యి మీద నుంచి దించడమేనా? కాదు... కాదు.. వంట అంటే కప్‌బోర్డ్‌లో సరుకులు ఉన్నాయో లేవో చూసుకుంటూ ఉండాలి.. ఫ్రిజ్‌లో పాలున్నాయో లేవో చూసుకుంటూ ఉండాలి... గిన్నెలు శుభ్రంగా ఉన్నాయో లేవో చూసుకుంటూ ఉండాలి... మిగిలినవి పారబోయకుండా వాటిని మళ్లీ ఎలా వాడాలా చూసుకుంటూ వుండాలి... మూడు పూట్లా తిన్నాక పడే ముప్పై అంట్లను తిరిగి తోమితోమి మర్నాటికి సిద్ధం చేసుకుంటూ ఉండాలి... ఇంట్లో వాళ్లకు ఏం కావాలన్నా మనమే వొండాలి. మనకు ఏం కావాలన్నా మనమే వొండిపెట్టుకోవాలి. ఇంతా అయ్యాకా? ‘ఇంకొంచెం ఉడకనివ్వాల్సింది’... ‘కొంచెం కారం తక్కువైంది’.. ‘మా అమ్మైతే ఇలా చచ్చినా చేయదు’... ‘ఏనాడు సరిగ్గా వొండావు కనుక’... ‘ఒక్క కూరే తగలడ్డావేం’.. ఇలాంటి మాటలు వినాలి. వినాలి. వినాలి. వింటూ ఉండటమేనా పని. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ ‘నేను వినను’ అనుకుంది ఆ ఇంటి కోడలు. ‘నేను వినదలుచుకోలేదు’ అని కూడా అనుకుంటుంది గట్టిగా ఆ సినిమాలో. చదువుకున్న అమ్మాయి తను. డాన్సర్. సరే అందరూ పెళ్లి చేసుకోవాల్సిందే కనుక పెళ్లి చేసుకుంది. పెళ్లి ఎందుకు చేసుకుంది. జీవించడానికి. జీవితంలో వంట ఉంటుందని ఆమెకు కూడా తెలుసు. కాని అతనికి మాత్రం వంట మధ్య ఆమె ఉంటుంది. ఉదయం లేస్తే మావగారికి, భర్త గారికి వొండి వొండి ఆమెకు సరిపోతూ ఉంటుంది. మామగారు కట్టెల మీద ఉడికించిన అన్నాన్నే తింటారు. భర్త గారు మధ్యాహ్నం మిగిలిన అన్నం ఉందిరా మగడా అంటే ‘రాత్రయితే నేను చపాతీయే తింటాను’ అంటాడు. మిక్సీలో పచ్చడి వేయకూడదట. రోటి పచ్చడి చేయాలట. రాత్రి మిగిలిన కూరను పొద్దునకు వేడి చేసి పెట్టకూడదట. ఫ్రెష్‌గా చేయాలట. అంట్లు సింకులో ఇన్నిన్ని. దానికి లీకేజీ ప్రాబ్లమ్. ‘ప్లంబర్ని పిలువు తండ్రీ’ అని భర్తతో అంటే అదేమైనా పెద్ద సమస్యా పట్టించుకోవడానికి? ఆమెకు కలలో, శృంగారం లో కూడా అంట్లే గుర్తుకొస్తుంటాయి. ఇంట్లో అత్తగారు లేరా? ఉంది. ఆమె చేసి చేసి చేసి సున్నమై ఉంది. ఆమెను వొదులుతారా? కూతురు కడుపు తో ఉంటే అల్లుడిగారికి అన్నీ వొండి పెట్టడానికి పిలిపిస్తారు. ప్రతి ఇంట్లో పొయ్యి మండుతూ ఉండాలి. ఇల్లాలి చెమట కారుతూ ఉండాలి. ఎంత కాలం? ప్రతిఘటన ఇంతలో భర్త, మామగారు అయ్యప్ప మాల వేస్తారు. ఆ మాల వేసినప్పటి నుంచి ఆమెకు టెన్షన్. ఎదురు పడకూడదు. పొరపాటున కూడా భర్తను తాకకూడదు. బహిష్టు అయితే గదిలో దాక్కుని ఉండాలి. స్త్రీల గర్భం నుంచే లోపలి మలినాన్ని చీల్చుకునే పుడతారు అందరూ. కాని ఆమెకు మలినం ఉండే రోజులను లెక్కగడతారు. ఉన్న ఇద్దరికి వొండలేక కోడలు సతమతమవుతుంటే ఈ అయ్యప్ప భక్తుల రాకపోకలు, పూజలు దానికి సంబంధించిన వంట చాకిరి... ఆమె విసిగిపోతుంది. నిజమే. ఇంట్లో పనులు చేయదగ్గ శక్తి ఉంటే చేయొచ్చు. కాని ఆ పనిలో భాగస్వామ్యం అక్కర్లేదా? తోడు అక్కర్లేదా? ఏం చేస్తావులే.. ఈ పూటకు రెస్ట్ తీసుకో అనే మాట అక్కర్లేదా... ఎలాగోలా వండుతున్నావో అదే పదివేలు అనే కృతజ్ఞత అక్కర్లేదా? లోకంలో వంట మనిషితో మర్యాదగా వ్యవహరిస్తారు జనం ఎక్కడ మానేస్తుందో అని. ఈమె కోడలు? ఎక్కడకు పారిపోతుంది? తాగిన టీ కప్పు అయినా కడిగి పెట్టరా గాడిదా అని భర్త గురించి ఆమె మనుసులో అనుకుంటూ ఉంటుందో లేదోకాని ప్రేక్షకులకు అనిపిస్తూ ఉంటుంది. చివరకు ఆమె క్లయిమాక్స్‌లో తీవ్రంగా విసిగిపోతుంది. భర్త మీద, మామగారి మీద మురికి నీళ్లు పోసి ఆ ఇంటి నుంచి శాశ్వతంగా బయటపడుతుంది. ఇది ఈ సమస్యకు పరిష్కారమా? అంటే కాకపోవచ్చు. ఇది ఈ సమస్యను ముఖాన గుద్ది చూపిన ఒక ప్రతిఘటన అనుకోవాలి. తెలుగు సాహిత్యంలో ఎన్నో కథలు వంట బాధతో అల్లాడే స్త్రీల వ్యధను చెప్పాలి. ఇవాళ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ చాలా శక్తిమంతంగా స్త్రీ వేదనను చూపింది. వంటలో ఉండే శ్రమ, వొత్తిడి, పురుషుడి యజమాని పాత్ర ఎంత అమానమీయమైనవో ఈ సినిమా చూపుతుంది. ఇంట్లో స్త్రీ పురుషులు ఇద్దరూ ఉన్నప్పుడు వంట పని స్త్రీది మాత్రమే ఎలా అవుతుంది? వంట మీద వ్యతిరేకత కాదు ఈ సినిమా. వంటకు సంబంధించిన శ్రమలో విభజన, మానవీయత అవసరం గురించి మాట్లాడటమే ఈ సినిమా. కట్టెల పొయ్యి వెళ్లి గ్యాస్ స్టౌ వచ్చి ఉండొచ్చు. కాని ఏ ఇంటిలో అయినా స్త్రీ ఆ గ్యాస్ స్టౌ ఎదుట రోజూ ఎన్ని గంటలు నిలుచుంటున్నదో లెక్క వేసుకుంటే అలా నిలుచోబెట్టడం ఎంత న్యాయమైన పనో ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది. సినిమా క్లయిమాక్స్‌లో ‘ఏరా.. నీ నీళ్లు నువ్వు తాగలేవా’ అని తమ్ముణ్ణి తిడుతుంది అక్క, అత్తారింటి నుంచి పారిపోయి వచ్చాక, వాడు చెల్లెల్ని నీళ్లు అడుగుతుంటే. ఇంట్లో ఉండే అబ్బాయిలకు ముందు నుంచి ఈ సంస్కారం నేర్పిస్తే వంట గదులు ఇద్దరూ కలిసి పని చేసే గదులు అవుతాయి. ఆ రోజు రావాలని హెచ్చరించే సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ జనవరి 15న ‘నీస్ట్రీమ్’ అనే ఓటిటి ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదలైన మలయాళ సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’. జో బేబీ దీని దర్శకుడు. నిమిష సజయన్, సూరజ్ వంజర మూడు నటించారు. సినిమా అంతా కేవలం ఒక ఇంట్లో జరుగుతుంది. దాదాపుగా ఇన్‌డోర్‌లో ఎక్కువగా కిచెన్‌లో జరుగుతుంది. క్లయిమాక్స్‌లో మాత్రమే ఒక్కసారి ఔట్‌డోర్ కనిపిస్తుంది. దర్శకుడు ఈ సినిమాలో స్త్రీలు వంట చేయడానికి పడే శ్రమను వారి అప్రమత్తతను శక్తిమంతంగా చూపిస్తాడు. వండకపోయినా కనీసం టేబుల్ మేనర్స్ కూడా పాటించని మగవాళ్లను ఈసడించుకునేలా చేస్తాడు. తిన్నాక మిగిలిన దానిని డస్ట్‌బిన్‌లో వేసి కంచం శుభ్రం చేసి పెట్టే పని కూడా చేయని మగవారు ఉంటే ఆ ఇంటి ఆడవాళ్లు ఆ రోతను ఎలా భరిస్తూ వెళతాడో చూపిస్తాడు. వంట పనిని ఆడవాళ్లకు అప్పజెప్పడంలో ఏ కులమూ ఏ మతమూ వెనుకాడలేదు. ఫలానా మతంలోకి మారితే వంట పని ఉండదు అనంటే ఈ దేశంలో బహుశా ప్రపంచమంతా ఆ మతంలోకి ఆడవారు మారిపోతారని నిర్వివాదాంశంగా చెప్పవచ్చు. వంట గురించి స్త్రీల మొత్తుకోళ్లు సాగుతూనే ఉంటాయి. ఇది మాత్రం మాడుకోలు. అంటే మగవారి మాడును పగలగొట్టిన సినిమా అని మాత్రం చెప్పక తప్పదు. – సాక్షి ఫ్యామిలీ -
కనుక్కోండి చూద్దాం
2020లో కొన్ని నెలల పాటు ప్రపంచాన్ని లాక్ చేసింది కరోనా. థియేటర్లు లాక్ అవ్వడంతో ఓటీటీలో సినిమాలు విడుదలయ్యాయి. ఈ కరోనా లాక్డౌన్లో విడుదలైన ఆ చిత్రాల్లో కొన్నింటి గురించి క్విజ్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1481339603.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1491339603.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటీటీలో బెల్ బాటమ్?
కోవిడ్ వల్ల థియేటర్స్‌లో రిలీజ్ కావాల్సిన సినిమాలు ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది బాలీవుడ్లో ఓటీటీలో విడుదలైన తొలి పెద్ద స్టార్ హీరో సినిమా అక్షయ్ కుమార్‌దే. ఆయన నటించిన ‘కాంచన’ హిందీ రీమేక్ ‘లక్ష్మీ’ను డిస్నీ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల చేశారు. తాజాగా అక్షయ్ కుమార్ కొత్త చిత్రం ‘బెల్‌బాటమ్’ కూడా ఓటీటీలోనే విడుదల కానుందని బాలీవుడ్ టాక్. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు చర్చలు జరుగుతున్నాయట. థియేటర్లు మళ్లీ ప్రారంభమైనప్పటికీ ఓటీటీలో రిలీజ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారనే చర్చ బాలీవుడ్లో సాగుతోంది. లాక్డౌన్ తర్వాత చిత్రీకరణ ప్రారంభించిన హిందీ చిత్రాల్లో ‘బెల్‌బాటమ్’ ముందుంటుంది. ఈ సినిమాలో డిటెక్టివ్ పాత్రలో కనిపిస్తారు అక్షయ్ కుమార్. -
మొబైల్ యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్
న్యూఢిల్లీ: దేశీయంగా మొబైల్ యూజర్ల కోసం అమెజాన్ ప్రత్యేకంగా ప్రైమ్ వీడియో ప్లాన్లను ప్రవేశపెట్టింది. నెలకు రూ. 89 నుంచి ఇవి ప్రారంభమవుతాయి. ముందుగా భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది. 30 రోజుల ఉచిత ట్రయల్ తర్వాత 6 జీబీ డేటాతో 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 89 ప్లాన్‌ను యూజర్లు ఎంచుకోవచ్చని వివరించింది. కేవలం మొబైల్ యూజర్ల కోసమే అమెజాన్ ఇలాంటి ప్లాన్లను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఒక్క యూజర్‌కి మాత్రమే పరిమితమయ్యే ఈ ప్లాన్‌లో స్టాండర్డ్ డెఫినిషన్ నాణ్యతతో ప్రసారాలు పొందవచ్చని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్ గౌరవ్ గాంధీ తెలిపారు. బహుళ యూజర్ల యాక్సెస్, హెచ్డీ/అల్ట్రా హెచ్డీ కంటెంట్, ప్రైమ్ మ్యూజిక్, అమెజాన్‌డాట్‌ఇన్ ద్వారా ఆర్డర్ల వేగవంతమైన డెలివరీ తదితర సర్వీసుల కోసం 30 రోజుల అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని రూ. 131తో పొందవచ్చు. ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు రీచార్జ్ పాయింట్లలో దీన్ని రీచార్జ్ చేయించుకోవచ్చు. ప్రస్తుతం నెలకు రూ. 129, వార్షికంగా రూ. 999 చార్జితో అందిస్తున్న అమెజాన్ ప్రైమ్ ఆఫర్ కూడా యథాప్రకారం అందుబాటులో ఉంటుందని గాంధీ పేర్కొన్నారు. దేశీ ఓవర్ ది టాప్ (ఓటీటీ) మార్కెట్లో డిస్నీప్లస్‌హాట్‌స్టార్, జీ5, నెట్‌ఫ్లిక్స్ తదితర సంస్థలతో కంపెనీ పోటీపడుతోంది. నెట్‌ఫ్లిక్స్ గతేడాదే మొబైల్ యూజర్ల కోసం రూ. 199 సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. -
మా స్నేహం అలానే ఉంది
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మెయిల్’. ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో స్వప్నా సినిమాస్ పతాకంపై స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మించారు. ఈ నెల 12న ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నేను, అశ్వినీదత్ గారు సినిమా పరిశ్రమకు వచ్చి 40 ఏళ్లు అవుతోంది. మాతో పాటు వచ్చిన వాళ్లలో ఇంకా సినిమాలు తీస్తున్నది మేం మాత్రమే. ఇది మా గొప్పతనం అనటం కంటే మా పిల్లలు మా నుండి వస్తున్న దాన్ని అందుకోవటం వల్లే మాకు ఉత్సాహం వచ్చింది. మేమిద్దరం కలిసి ఏడు సినిమాలు చేశాం. సినిమాలు వచ్చాయి.. పోయాయి. మా స్నేహం మాత్రం అలానే ఉంది. స్వప్నను పిలిచి ఆహా కోసం వెబ్ సిరీస్ చేయమన్నాను. ఉదయ్‌తో చేస్తున్న ప్రాజెక్ట్ రష్ చూపించింది. నాకు నచ్చింది.. త్వరలోనే ఆహాలో వస్తుంది’’ అన్నారు. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘నాకు పరిశ్రమలో ఎవరు ఆత్యంత ఆప్తులు అంటే ముగ్గురు పేర్లు చెప్తాను. చిరంజీవిగారు, అల్లు అరవింద్, కె.రాఘవేంద్రరావు. అరవింద్ గారు పిలిచి వెబ్ సిరీస్ చేయమన్నారని మా అమ్మాయి స్వప్న చెప్పింది. అప్పుడు నేను నీకిది గోల్డెన్ చాన్స్ అని చెప్పాను’’ అన్నారు. స్వప్నాదత్ మాట్లాడుతూ– ‘‘పార్టనర్షిప్ గురించి నాన్నతో మాట్లాడితే ‘నేను, అరవింద్ ముప్ఫై ఏళ్లుగా సినిమాలు చేశాం. హిట్స్ తీశాం, ఫ్లాపులు తీశాం. ఏ రోజూ ఒక్క మాట అనుకోలేదు. అదీ నిజమైన పార్టనర్షిప్ అంటే’ అన్నారు. మా హృదయానికి దగ్గరైన కథ ఇది. ఎంతో హాయిగా ఇంట్లోనే అందరూ కూర్చుని చూసే సినిమా’’ అన్నారు. ఉదయ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథను నేను ఇండిపెండెంట్‌గా చేద్దామనుకుంటున్న సమయంలో స్వప్నగారు కథ విని ఓకే చేశారు. మాపై ఎలాంటి ప్రెషర్ లేకుండా చిత్రీకరణకు సపోర్ట్ చేశారు’’ అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘ఎంతో పెద్ద లెగసీ ఉన్న అరవింద్‌గారు, అశ్వనీదత్‌గారితో సినిమా చేయటం ఆనందంగా ఉంది. వరల్డ్ సినిమా స్టైల్లో ఉదయ్ ‘మెయిల్’ను తెరకెక్కించారు’’ అన్నారు. -
థియేటర్స్‌లోకి రా భాయ్
ప్రస్తుతం సినిమా థియేటర్స్ పరిస్థితి కాస్త సందిగ్ధంలో ఉంది. ఏదైనా పెద్ద సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారని ఓ వాదన. ప్రేక్షకులు వచ్చేలా ఉంటేనే పెద్ద సినిమా తీసుకొద్దాం అనేది మరో వాదన. సల్మాన్ లాంటి స్టార్ సినిమా అయితే ప్రేక్షకులు తప్పకుండా వస్తారని బాలీవుడ్ థియేటర్ యాజమాన్యం భావిస్తోంది. సల్మాన్ ఖాన్ నటించిన తాజా మాస్ ఎంటర్టైనర్ ‘రాధే’ రైట్స్‌ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ‘రాధే’ను థియేటర్స్‌లోనే విడుదల చేయమంటూ ఓ లేఖ ద్వారా కోరింది. ఇలాంటి కష్టసమయంలో థియేటర్స్ బిజినెస్‌కు సహాయంగా నిలబడాలని, సల్మాన్ చిత్రం అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఉంటాయని, ప్రేక్షకులను మళ్లీ థియేటర్స్‌కి తీసుకొచ్చే స్టామినా ఉన్న స్టార్ సల్మాన్ అనేది ఈ లేఖ సారాంశం. ఈ ఈద్‌కి మీ సినిమాను థియేటర్స్‌కు తీసుకురండి భాయ్ అని సల్మాన్‌ని కోరారు. మరి భాయ్ సినిమా థియేటర్స్‌లో వస్తుందా? వేచి చూడాలి. -
ఓటీటీలో నాగార్జున కొత్త సినిమా.. నో రిస్క్
టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కతున్న తాజా చిత్రం వైల్డ్ డాగ్. ఇన్వెస్టిగేషన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ మొదటి వారంలోనే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోంటుంది. ఇవి కూడా పూర్తి కావొస్తుండటంతో వైల్డ్ డాగ్ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీనితోపాటు ఏ ప్లాట్ఫామ్లో మూవీ రిలీజ్ కానుందనే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటీటీ వేదికగా సినిమాలు రిలీజ్ అయ్యియి. అయితే ప్రస్తుతం థియేటర్లు పునఃప్రారంభం అవ్వడంతో మెల్లమెల్లగా పెద్ద స్క్రీన్‌పై సినిమాలు విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. చదవండి: మొక్కలు నాటిన టాలీవుడ్ కింగ్ తాజాగా నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రం డైరెక్టుగా ఓటీటీలోనే రిలీజ్ అవ్వనున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం థియేటర్లకు వచ్చి సినిమా చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి కనబర్చకపోవడంతో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సేఫ్ ట్రాక్‌లో వెళ్లేందుకు చిత్రయూనిట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాప్ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు ఈ సినిమాకు చెందిన హక్కులను విక్రయించినట్లు సమాచారం. మొత్తం 27 కోట్లకు వైల్డ్ డాగ్ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అహిషోర్ సోలోమాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారి విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. కాగా ‘మనం’ తర్వాత నాగార్జునకు ఈ సినిమా అతిపెద్ద హిట్ కానుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. నాగ్‌తో పాటు బాలీవుడ్ నటి దియా మిర్జా, సయామి ఖేర్, అలీరెజా ముఖ్యపాత్రల్లో నటించారు. చదవండి: సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. ఇక రచ్చ రచ్చే -
2020 ఇంట్లో కూడా సినిమా చూపించింది
ఈ సంవత్సరం మనకు అన్ని సినిమాలూ పడ్డాయి కరోనా వల్ల. బయట లాక్డౌన్ సినిమా. హాస్పిటల్స్‌లో వెంటిలేటర్ల సినిమా. వ్యాన్లొచ్చి పట్టుకెళ్లే క్వారంటైన్ సినిమా. మాస్క్ సినిమా. కాఫ్ సినిమా. కోల్డ్ సినిమా...అన్నీ పడ్డాయి. వాటితో పాటు ఇంట్లో కూడా సినిమాలు పడ్డాయి. ఆ సినిమాల నుంచి ఉపశమనం కోసం ఓటిటి ప్లాట్‌ఫామ్స్ తెలుగు సినిమాలు విడుదల చేశాయి. 2020లో దాదాపు 20 సినిమాలు ఓటిటిల ద్వారా విడుదలయ్యాయి. కొన్ని నచ్చాయి. కొన్ని నొచ్చాయి. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పాలి. దానికి ముందు వీటికి థ్యాంక్స్ చెప్పాలి. ఓటీటీ సినిమాలు ఈ సండే స్పెషల్. ఉదయం 11 వరకూ పనులు చేసుకుని ఇంకేం తోచక ‘సినిమా చూద్దాం’ అని కుటుంబం అంతా ఇంట్లో సినిమాకు కూచునే వింత 2020లోనే జరిగింది. దానికి కారణం కరోనా తెచ్చిన లాక్డౌన్. రాత్రి భోజనం చేశాక సినిమా చూసి పడుకోవడం కూడా కరోనా వల్లే సాధ్యమైంది. థియేటర్లకు వెళ్లే అవసరం లేకుండా (అవి మూతపడ్డాయి కనుక) ఇళ్లకే కొత్త కొత్త సినిమాలు ఓటిటి ప్లాట్‌ఫామ్స్ తెచ్చాయి. గతంలో కుదరని పని రెండు మూడేళ్ల క్రితం కమల హాసన్ తన కొత్త సినిమాను థియేటర్ల ద్వారా కాకుండా ‘డైరెక్ట్ టు హోమ్’ పద్ధతిలో విడుదల చేస్తానంటే అక్కడి ఎగ్జిబిటర్స్ అందరూ పెద్ద నిరసన వ్యక్తం చేశారు. నిన్న మొన్న నటుడు సూర్య తన భార్య జ్యోతిక ముఖ్యపాత్రధారిగా నటించిన సినిమా ‘పొన్మగల్ వందాల్’ను ఓటిటి (ఓవర్ ది టాప్) ద్వారా విడుదల చేస్తానంటే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు మళ్లీ పేచీ పెట్టారు. అతడు హీరోగా నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఓటిటి విడుదలకు కూడా ఇవే సమస్యలు. నిజమే. సినిమా అనేది లక్షల మందికి సినిమా థియేటర్ల ద్వారా ఉపాధి కల్పిస్తుంది. అసలు ఆ మాధ్యమం పెద్ద తెర మీద వీక్షించేందుకే తయారైనది. అయినప్పటికీ ఇప్పుడు 2020లో కథంతా మారిపోయింది. అనివార్యంగా చిన్న తెర మీద, థియేటర్ల ద్వారా కాకుండా నేరుగా ఇంటికే సినిమాలు ఓటిటి ప్లాట్‌ఫామ్స్ మీద విడుదల అవుతున్నాయి. ఈ పరిస్థితికి కరోనా లాక్డౌన్ ఒక పెద్ద అవకాశాన్ని కల్పించింది. అమేజాన్ ఉందా? 1990లో డిష్ కనెక్షన్ ఉందా అని అడిగేవారు. దానికి కాస్త ముందు వీడియో పార్లర్లో మెంబర్ షిప్ ఉందా అని అడిగేవారు. ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫామ్ సబ్స్క్రిప్షన్ ఉందా అని అడుగుతున్నారు. మూడూ దాదాపు ఒకటే. మనం డబ్బు కడితే ‘వాళ్ల దగ్గర ఉన్న’ సినిమాలు చూపిస్తారు. ‘మనం కోరుకున్న సినిమాలన్నీ’ అవి చూపవు. అయితే మనం విసుగొచ్చి సబ్స్క్రిప్షన్ రెన్యువల్ చేయించుకోవడం మానేయకుండా ఈ ప్లాట్‌ఫామ్స్ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు కొని విడుదల చేస్తూ ఉంటాయి. అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, జీ 5, ఆహా... ఇవన్నీ ఇప్పుడు నేరుగా సినిమాలను కొని నేరుగా ఇంట్లోనే చూపిస్తున్నాయి. ఇవి కాకుండా ఏ.టి.టి (ఎనీ టైమ్ థియేటర్) యాప్ ద్వారా కూడా సినిమాలు విడుదల చేస్తున్నాయి. బంధనాలు తెంచుకున్న తెలుగు సినిమా భారతదేశంలో బాలీవుడ్ తర్వాత తెలుగు సినిమా మార్కెట్ పెద్దది. తెలుగులో సినిమా ఒక్కటే వినోద సాధనం. ఇది ఇప్పటికీ సంప్రదాయ రిలీజు వ్యవస్థనే విశ్వసిస్తోంది. అయినప్పటికీ 2020 తెలుగు సినిమా పరిశ్రమను తన పాత బంధనాలు తెంపుకునేలా చేసింది. థియేటర్లు పూర్తిగా తెరుచుకునే వరకు సినిమాలను మురగబెట్టకుండా ధైర్యం చేసి ఓటిటి ద్వారా సినిమాలు విడుదల చేసుకునేందుకు ఉత్సాహపరిచింది. ఈ సంవత్సరం ఓటిటి ద్వారా 20 సినిమాల వరకూ విడుదల అయ్యాయి. ప్రేక్షకులు వీటిని బాగా చూశారు. లాక్డౌన్ వల్ల కోట్లాది మంది ఇళ్లలోనే ఉండిపోవడం వల్ల ఇరవై ముప్పై శాతం ఇళ్లల్లో నెట్ ఉండటం వల్ల కొత్త సబ్స్క్రిప్షన్ తీసుకుని మరి చూశారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ సినిమాల పై అభిప్రాయాలు వ్యక్తం అయ్యేప్పుడు కొన్ని థియేటర్లలో విడుదలైతే ఫ్లాప్ అయి ఉండేవని అన్నారు. మరికొన్నింటిని థియేటర్లలో రిలీజైతే ఇంపాక్ట్ బాగుండేదనీ నిరాశ పడ్డారు. రెండు రకాల ఫలితాలు చూశాయి ఈ సినిమాలు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య 2020లో విడుదలైన ఓటిటి సినిమాలు మధ్యతరగతి కథలతో ఆకట్టుకున్నాయి. అమేజాన్‌లో విడుదలైన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అరకులో సాగిన ఒక అందమైన మధ్యతరగతి పౌరుషాన్ని చూపింది. సత్యదేవ్ ఈ సినిమాతో ఇంటింటి స్టార్ అయ్యాడు. ‘ఆహా’లో విడుదలైన ‘భానుమతి–రామకృష్ణ’ కూడా ఒక సంపన్న అమ్మాయికి ఒక మధ్యతరగతి అబ్బాయికి మధ్య సాగిన ప్రేమ కథగా ఆకట్టుకుంది. నవీన్ చంద్ర ఈ సీజన్లో ఒక హిట్‌ను మూటగట్టుకున్నాడు. ‘ఆహా’లోనే విడుదలైన ‘కలర్ ఫొటో’ రూపానికి సంబధించి, రంగుకు సంబంధించి ఒక సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చింది. కామెడీ నటుడు సుహాస్ ఈ సినిమాతో కొత్త ప్రతిభను నిరూపించుకున్నాడు. నటి చాందిని చౌదరి కూడా మంచి మార్కులు పొందింది. ఇక ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’ అయితే ఓటిటిలో పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రశంసలు అందుకుంది. గుంటూరు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా అక్కడి భాషను, ఆత్మను సమర్థంగా పట్టుకుంది. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ కొత్త జంటగా ప్రేక్షకులకు నచ్చారు. ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా హీరో రాజ్‌తరుణ్ ను ప్రేక్షకులు మర్చిపోకుండా చేసింది. ఈ వరుసలోనే ‘అమృతారామమ్’, ‘ఐఐటి కృష్ణమూర్తి’, ‘మా వింతగాధ వినుమా’ సినిమాలను చెప్పుకోవచ్చు. వి– నిశ్శబ్దం 2020 పెద్ద సినిమాలను కూడా తీసుకొచ్చింది. సాధారణంగా థియేటర్ల లో రిలీజైతే పెద్ద హంగామాగా ఉండే నాని సినిమా ‘వి’ అమేజాన్‌లో విడుదలైంది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. సుధీర్‌బాబు మరో ముఖ్యపాత్ర. ఇద్దరు హీరోలు ఉన్న ఈ సినిమా చిన్నతెర వల్ల చూపాల్సినంత ఇంపాక్ట్ చూపలేదనే టాక్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ థియేటర్ రిలీజ్ అవుతోంది ఇది. నాని ‘సైకో’లా కనిపించినా ఆ స్వభావాన్ని ‘జస్టిఫై’ చేయడంతో కథ దుష్టశిక్షణగా మారింది. ఇక రిలీజ్ అవుతుందా అవదా అంటూ టెన్షన్ పెట్టిన అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా ఆశించిన టాక్‌ను సాధించలేదు. అనుష్క ను ముందు పెట్టి కథను ఆమె ప్రాముఖ్యం లేకుండా నడిపారనే టాక్ వచ్చింది. సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ తన భారీతనానికి తగ్గట్టుగా హిట్ అయ్యింది. దర్శకురాలు సుధా కొంగర పెద్ద హిట్ కొట్టినట్టు లెక్క. పెద్ద స్క్రీన్ మీద ఈ సినిమా కథ వేరేగా ఉండేది. కీర్తి సురేశ్ నటించిన ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ రెండూ నిరాశ పరిచాయి. పెంగ్విన్‌లో డార్క్ కంటెంట్ పెరగడం ఒక కారణమైతే మిస్ ఇండియాలో కథ శక్తివంతంగా లేకపోవడం కారణం. ‘మహానటి’ సినిమాతో అలరించిన కీర్తి సురేశ్ మిస్ ఇండియాలో లుక్స్ పరంగా కూడా ఆకట్టుకోలేకపోయిందని ఇళ్లలో ఈ సినిమా చూసిన గృహిణులు అభిప్రాయ పడ్డారు. మొత్తం మీద రాబోయే సంవత్సరం థియేటర్లు యథావిథిగా కళకళలాడినా బిజినెస్‌పరంగా ఓటిటిల ఆఫర్లు బాగుంటే అక్కడా సినిమాలు రిలీజవుతాయనడంలో సందేహం లేదు. ఇటు ఇంటా అటు బయటా తెలుగు సినిమాలు కళకళలాడాలని కోరుకుందాం. అనగనగా ఓ అతిథి ఓటిటిల మీద విడుదలైన సినిమాల్లో ‘ఆహా’ ద్వారా విడుదలైన ‘అనగనగా ఒక అతిథి’ ఒక భిన్నమైన గుర్తింపు పొందింది. దాదాపు మూడు నాలుగు ముఖ్యపాత్రలతో నడిచిన ఈ సినిమా ఒక కన్నడ నాటకం ఆధారంగా మొదట కన్నడంలో సినిమాగా వచ్చి తెలుగులో రీమేక్ అయ్యింది. పాయల్ రాజ్‌పుత్, చైతన్యకృష్ణ, ఆనంద్ చక్రపాణి తదితరులు నటించిన ఈ సినిమా దురాశ దుఃఖానికి చేటు అని చెబుతుంది. సినిమా అంగీకరించని కథలు ఓటిటిల ద్వారా అంగీకారం పొంది రిలీజవుతాయని ఈ సినిమా ద్వారా తెలుస్తోంది. – సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: సినిమా డెస్క్ -
రాముడు... రావణుడు కాదు!
‘‘నాది హైదరాబాద్. హిందీలో పలు సీరియల్స్, వెబ్ సిరీస్‌లు చేశాను. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశాను. నేను నటించిన ‘థింకిస్థాన్’ వెబ్ సిరీస్ చూసి ‘డర్టీ హరి’ చిత్రం కోసం ఎం.ఎస్. రాజుగారు నన్ను తీసుకున్నారు’’ అని శ్రవణ్ రెడ్డి అన్నారు. శ్రవణ్ రెడ్డి హీరోగా, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ సినిమా ఫ్రైడే మూవీస్ అనే ఏటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నేటి తరానికి కనెక్ట్ అయ్యే చిత్రం ‘డర్టీ హరి’. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. వాటివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్నదే కథ. మనుషుల్లో అంతర్లీనంగా దాగి ఉండే చెడు, పశుప్రవృత్తిని ఎలాంటి నాటకీయత లేకుండా వాస్తవిక కోణంలో చూపించారు రాజుగారు. ఇందులో నా పాత్ర రాముడిలా, రావణుడిలా కాకుండా మధ్యస్తంగా ఉంటుంది. కథలో భాగంగా రొమాన్స్ ఉంటుందే కానీ, సినిమా మొత్తం బోల్డ్‌గా ఉండదు. మా సినిమా ట్రైలర్, నా పాత్ర తీరును చూసి చాలా మంది ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో పోలుస్తున్నారు. ఆ చిత్రానికి, మా సినిమాకి ఎటువంటి పోలిక ఉండదు. నేను హీరోగానే చేయాలనుకోవడం లేదు. క£ý , పాత్ర నచ్చితే సహాయ నటుడిగా కనిపించడానికి కూడా అభ్యంతరం లేదు. ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నా’’ అన్నారు. -
థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ విడుదల
హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదిలో తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేయడంతోపాటు అదే రోజు హెచ్‌బీఓ మ్యాక్స్‌లో స్ట్రీమ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ‘వండర్ ఉమెన్’ థియేటర్స్‌లోనూ, హెచ్‌బీఓ మ్యాక్స్‌లోనూ ఒకేరోజు విడుదల కానుంది. అదే పద్ధతిని వచ్చే ఏడాది సినిమాలకు కూడా పాటించనున్నారు. ‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సినిమాను థియేటర్స్‌లోనే ప్రదర్శించాలని అందరికీ ఉంటుంది. కానీ వచ్చే ఏడాది మొత్తం సగం సీటింగ్ కెపాసిటీతోనే థియేటర్స్ నడుస్తాయి. సో... ఏ విధంగా వీలుంటే ఆ విధంగా (ఇంట్లోనో, థియేటర్లోనో) సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని వార్నర్ బ్రదర్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది వార్నర్ బ్రదర్స్ విడుదల చేసే సినిమాల్లో ‘డ్యూన్, మ్యాట్రిక్స్ 4, టామ్ అండ్ జెర్రీ, గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్, ది కంజ్యూరింగ్, ది సూసైడ్ స్క్వాడ్’ వంటి సినిమాలు ఉన్నాయి. -
ఇది ఓ సిల్లీ రోబో!
చిత్రం: ‘బొంభాట్’; తారాగణం: సాయిసుశాంత్ రెడ్డి, చాందినీ చౌదరి, ప్రియదర్శి, శిశిర్ శర్మ, తనికెళ్ళ భరణి; సంగీతం: జోష్ బి.; నిర్మాత: విశ్వాస్ హన్నూర్కర్; దర్శకత్వం: రాఘవేంద్ర వర్మ ఇందుకూరి; ఓ.టి.టి: అమెజాన్ ప్రైమ్. సైన్స్ ఫిక్షన్ సినిమా, అందులో మనిషికీ, మర మనిషికీ మధ్య ఓ ప్రేమ. ఈ కాన్సెప్ట్ వింటుంటే, ఎక్కడో విన్నట్టు, చూసినట్టు అనిపిస్తోందా? తాజాగా రిలీజైన కొత్త తెలుగు సినిమా ‘బొంభాట్’ అచ్చం ఇలాంటిదే. కాకపోతే, ఇటు ప్రేమకథకూ, అటు సైన్స్ ఫిక్షన్కూ మధ్య ఇరుక్కుపోయి, కథాకథనం ఎటూ కాకుండా పోవడమే విషాదం. కథేమిటంటే..: లైఫ్‌లో ఎప్పుడూ ఏ మంచీ జరగని కుర్రాడు విక్కీ (సాయిసుశాంత్ రెడ్డి). ఏ కొద్ది మంచి జరిగినా, ఆ వెంటనే చెడు జరిగిపోతుంటుంది. ఇలాంటి అన్‌లక్కీ హీరోకు, చైత్ర (చాందినీ చౌదరి) అనే అమ్మాయితో ప్రేమ. హీరోకి చిన్నప్పటి నుంచి అనుకోకుండా కాలేజీ ప్రొఫెసర్ ఆచార్య (శిశిర్ శర్మ)తో అనుబంధం ఏర్పడుతుంది. పెరిగి పెద్దయిన తరువాత కూడా ఆ ప్రొఫెసర్‌తో హీరో బంధం కొనసాగుతుంటుంది. అనుకోని ఓ ప్రమాదంలో ప్రొఫెసర్ చనిపోతాడు. చనిపోవడానికి రెండు రోజుల ముందు విదేశాల్లోని తన కుమార్తెలానే కనిపించే, ప్రవర్తించే ఓ హ్యూమనాయిడ్ రోబోను ప్రొఫెసర్ తయారుచేస్తాడు. ప్రొఫెసర్ కూతురు మాయ (సిమ్రాన్ చౌదరి) కోసం వెతుకుతూ ఉంటాడు మరో వెర్రి సైంటిస్ట్ సాహెబ్ (మకరంద్ దేశ్‌పాండే). ఇంతకీ, ఈ ఇద్దరు సైంటిస్టుల మధ్య గొడవేంటి, మిగతా కథేమిటన్నది చివరి అరగంటలో చూస్తాం. ఎలా చేశారంటే..: గతంలో ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో కనిపించిన హీరో సాయిసుశాంత్ రెడ్డి, తాజా ‘కలర్ ఫోటో’ ఫేమ్ చాందినీ చౌదరి ఈ స్క్రిప్టులోని పాత్రచిత్రణకు తగ్గట్టు తెరపై కనిపించడానికి బాగానే శ్రమపడ్డారు. సిమ్రాన్ చౌదరి ఓకె. హీరో ఫ్రెండ్‌గా ప్రియదర్శిది కాసేపు కామెడీ రిలీఫ్ వేషం. మన కంటికి కనిపించని అదృష్టంగా హీరో సునీల్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమాలోని ఇద్దరు శాస్త్రవేత్తల పాత్రలకూ సీనియర్ నటుడు ‘శుభలేఖ’ సుధాకర్ అద్భుతంగా గొంతునివ్వడం విశేషం. ఆ పాత్రలు ఎంతో కొంత బాగున్నాయంటే, ఆ వాచికానికే ఎక్కువ మార్కులు పడతాయి. ఎలా తీశారంటే..: రజనీకాంత్ ‘రోబో’ మొదలు అనేక చిత్రాల నుంచి దర్శక, రచయిత తీసుకున్న అంశాలు ఈ సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇది ప్రేమకథో, సైంటిఫిక్ సినిమానో తెలియనివ్వకుండా మొదటి గంట సేపు సాగదీతతో, కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. సుదీర్ఘమైన సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఓ కీలక మలుపు దగ్గర ఇంటర్వెల్ అయ్యాక, సెకండాఫ్ కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందనుకుంటాం. ఆ పైన కూడా అసలు కథను ఒక పట్టాన ముందుకు సాగనివ్వకుండా పక్కన చెవిటి దాదా (వినీత్ కుమార్) కథ సహా అనేకం పక్కనే నడుస్తుంటాయి. హీరోతో హీరోయిన్ ఎందుకు, ఎలా ప్రేమలో పడిందో అర్థం కాదు. దానికి బలమైన రీజనింగూ కనిపించదు. ప్రొఫెసర్‌తో అంతకాలంగా అనుబంధం ఉన్నా సరే, హీరోకు ఆ ప్రొఫెసర్ అసలు సంగతి ఎందుకు చెప్పడో అర్థం కాదు. సినిమా దాదాపు చివర ముప్పావుగంటకు వచ్చేసినా, వెర్రి సైంటిస్టుకూ, ప్రొఫెసర్‌కూ మధ్య గొడవేమిటో దర్శకుడు చెప్పడు. ప్రియదర్శి లవ్ ట్రాక్ సినిమాకు మరో పానకంలో పుడక. రోబో తాలూకు ప్రేమ, తదితర ఫీలింగ్స్‌కు సరైన ఎస్టాబ్లిష్మెంటూ కనిపించదు. ఈ సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది – బాణీలు, రీరికార్డింగ్ విషయంలో ప్రత్యేకత చూపిన సంగీత దర్శకుడి ప్రతిభ. నాలుగు పాటలనూ నాలుగు విభిన్న పంథాల్లో అందించడం విశేషం. సినిమా మొదట్లో వచ్చే పాట సంగీత దర్శకుడి శాస్త్రీయ సంగీత నైపుణ్యాన్ని తెలియజేస్తూ, వినడానికి బాగుంది. అలాగే హీరోయిన్ జెలసీతో పాడే ‘చుప్పనాతి..’ పాట మరో డిఫరెంట్ కాన్సెప్టుతో, డిఫరెంట్ సౌండ్‌తో వినిపిస్తుంది. నిర్మాణవిలువలు, అక్కడక్కడా డైలాగులు కూడా ఆకట్టుకుంటాయి. ఇలాంటి కొన్ని పాజిటివ్ పాయింట్లున్నా, అక్కడక్కడే అనేక సీన్లుగా సుదీర్ఘమైన సినిమాగా సా...గుతూ ఉంటే, ప్రేక్షకులు భరించడం కష్టమే. అందులోనూ ప్రేక్షకుడి చేతిలో రిమోట్ చేతిలో ఉండే ఓటీటీ షోలలో మరీ కష్టం. కొసమెరుపు: రెండోసారి రెండు గంటల రోబో వెర్షన్! బలాలు: ► కెమెరా వర్క్, నిర్మాణ విలువలు ► సంగీత దర్శకుడి ప్రతిభ ► శుఖలేఖ సుధాకర్ డబ్బింగ్ బలహీనతలు: ► కలవని ప్రేమ, సైన్స్ ఫిక్షన్ స్టోరీ ► సాగదీత కథనం, పండని ఎమోషన్లు ► అతకని సీన్లు, లాజిక్కు అందని పాత్రచిత్రణ – రెంటాల జయదేవ -
అగ్ర దర్శకుడికి బేతాళప్రశ్న!
చిత్రం: ‘రాంగ్ గోపాల్ వర్మ’; తారాగణం: షకలక శంకర్, ప్రభు, కత్తి మహేశ్; కెమెరా: బాబు; కాన్సెప్ట్, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం: జర్నలిస్ట్ ప్రభు; రిలీజ్: డిసెంబర్ 4; ఓ.టి.టి: శ్రేయాస్. నిజజీవిత వ్యక్తుల జీవితాన్నీ, ప్రవర్తననూ ఆధారంగా చేసుకొని, వారి మీద వ్యంగ్య బాణాలు, విమర్శలు సంధిస్తూ సినిమాలు తీయడం ఓ ప్రత్యేకమైన జానర్. మిగిలిన ప్రాంతీయ భాషా సినీ సీమల్లో కన్నా తెలుగులో ఈ కోవ చిత్రాలు కాస్తంత ఎక్కువే! 1980లలోనే పెద్ద ఎన్టీఆర్ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ‘మండలాధీశుడు’, ‘గండిపేట రహస్యం’ లాంటి వ్యంగ్యాత్మక సినీ ప్రయత్నాలు జరిగాయి. ఈ ఫిక్షనల్ రియాలిటీ చిత్రాలకు పరాకాష్ఠ – ఇటీవల కరోనా కాలంలో హీరో పవన్ కల్యాణ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘పవర్ స్టార్’. దానికి పోటీగా వర్మపై షకలక శంకర్ హీరోగా వచ్చిన ‘పరాన్నజీవి’. ఈ పర్సనల్ ట్రోలింగ్ సినిమాల మధ్య రచయిత జొన్నవిత్తుల తీస్తానని ప్రకటించిన ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లే వాడు) చిత్రం ఇంకా తయారీలో ఉంది. ఇంతలో తాజాగా సీనియర్ సినీ జర్నలిస్టు ప్రభు రూపొందించిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. కథేమిటంటే..: పబ్లిసిటీ కోసం, నాలుగు డబ్బుల కోసం రాజ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) అనే ఓ అగ్ర దర్శకుడు విపరీత ధోరణులకు పాల్పడుతుంటారు. ఆ ధోరణిని అతని అసిస్టెంట్లు (కత్తి మహేశ్ వగైరా) ప్రశ్నిస్తారు. దానికి ఆర్జీవీ తనదైన జవాబిస్తారు. కానీ, చివరకు ఆర్జీవీని అంతరాత్మే నిలదీస్తుంది. దానికి ఆయన రియాక్షన్ తెరపై చూడాలి. సినిమా టైటిల్‌ను బట్టి, టైటిల్ రోల్ నటుడి హావభావాలను బట్టి, అంశాలను బట్టి ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి తీసిన ఫిక్షనల్ రియాలిటీయో ఇట్టే అర్థమైపోతుంది. ‘ఎ రైట్ డైరెక్టర్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్’ అంటూ టైటిల్‌కు పెట్టిన ట్యాగ్ లైన్‌తోనే సినిమాలో తాను ఏం చెప్పదలుచుకున్నదీ, ఏం చూపించదలుచుకున్నదీ ఈ చిత్రదర్శకుడు తేల్చేశారు. ఎలా తీశారంటే..: ఆర్జీవీని అనుకరించడంలో దిట్ట అయిన షకలక శంకర్ ఆ హావభావాలనూ, డైలాగ్ డెలివరీనీ యథోచితంగా మెప్పించారు. దర్శకుడు ప్రభు సినిమాలో తన నిజజీవిత జర్నలిస్టు పాత్రలో కనిపిస్తారు. మిగిలిన పాత్రధారులు, పరిమిత సాంకేతిక విభాగాల పనితనం అంతే పరిమితం. దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ప్రభుది. ఆయన తన గురువును ఆదర్శంగా తీసుకొని, ఈ 42 నిమిషాల సినిమాకు తానే కాన్సెప్ట్, మాటలు, పాటలు, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. 32 ఏళ్ళుగా సినీ జర్నలిజమ్‌లో అబ్బిన ప్రశ్నించే లక్షణాన్ని ఈసారి కలంతో కాక కెమేరాతో ఆయన వ్యక్తం చేశారనుకోవాలి. ఆర్జీవీకి వ్యతిరేకంగా ఈ సినిమా తీయడానికి వివిధ మెగా సినీ వర్గాల నుంచి ప్యాకేజీలు అందాయని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నంపై పరిశ్రమలో ఓ చిన్న ఆసక్తి నెలకొంది. ఆ గాలివార్తలను కొట్టిపారేసిన దర్శకుడు సినీ పరిశ్రమలోని అవాంఛనీయ ధోరణిని ప్రశ్నించడమే ఈ సినిమా లక్ష్యమని తేల్చారు. అదే సమయంలో ఎవరినో కించపరచాలనే ఉద్దేశంతో కాక, ఆవేదనతో ఈ ప్రయత్నం చేసినట్టు సినిమా చివర చెప్పుకొచ్చారు. మొత్తం మీద కొత్త తరహా సినిమా టేకింగ్, ఆలోచనలతో ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన ఓ అగ్ర దర్శకుడు ఇప్పుడు బూతు సినిమాలు, ఫిక్షనల్ రియాలిటీ పేరుతో ట్రోలింగ్ సినిమాలు తీసే స్థాయికి దిగజారిపోవడాన్ని ఈ సినిమా చర్చకు పెడుతుంది. ఆత్మవిమర్శతో పంథా మార్చుకుంటే, ఇప్పటికీ ఆస్కార్ అందుకొనే ప్రతిభ ఆ దర్శకుడికి ఉందని అంటుంది. ‘నా జీవితం, నా సినిమా, నా పోర్న్ కాలక్షేపం, నా ఓడ్కా, నా ట్వీట్లు... నా ఇష్టం’ అనే ఆర్జీవీకి ఇలాంటి సద్విమర్శలూ, సలహాలూ కొత్త కావు. కానీ, సెన్సార్ అవసరం లేని ఓటీటీల పుణ్యమా అని ఆర్జీవీతో సహా పలువురు తీస్తున్న కంటెంట్‌ను చూసినప్పుడు చాలామందిలో కలిగిన ఆవేదనకు తెర రూపం – ఈ లేటెస్ట్ సినిమా. అంతమాత్రాన ఈ తాజా సినిమాతో ఆర్జీవీ సహా అసలు ఎవరైనా మారిపోతారనుకోవడమూ అత్యాశే. అయినా సరే, సినీ రంగంలో ఉంటూ కూర్చున్న చెట్టుకే చేటు తెస్తున్నారన్న వాదనతో ప్రభు ఈ చిరుప్రయత్నం చేశారు. దీనిలో సగటు సినిమా లక్షణాలు వెతుక్కోవడం వేస్ట్. పరిమితమైన బడ్జెట్లో, అతి పరిమితమైన వనరులు, సాంకేతిక సౌలభ్యాలతో తీసిన ఈ కొత్త గిల్లుడు సినిమా పే పర్ వ్యూ పద్ధతిలో ఓటీటీ వేదికలో ఎంత మందికి చేరుతుందో చెప్పలేం. ఎంతమందిని ఆకట్టుకుంటుందో కూడా చెప్పలేం. కాకపోతే, గొప్ప సినీ ప్రయత్నం కాకున్నా... ధర్మాగ్రహంతో వేసిన ఓ ఆవేదనాభరిత ప్రశ్నగా ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ మిగిలిపోవచ్చు. కొసమెరుపు: అగ్రదర్శకుడిపై కలం చూపిన కెమేరా ఆగ్రహం. బలాలు: సినీసీమలో అవాంఛనీయ ధోరణిపై ఆగ్రహం వర్మ చుట్టూ ఉన్న వివాదాలు గడచిన ‘గిల్లుడు సినిమా’ల్లోని అంశాల ప్రస్తావన బలహీనతలు: విడిగా కథంటూ ఏమీ లేకపోవడం విమర్శలు, విశ్లేషణలతోనే మొత్తం సినిమా సాగడం పరిమిత బడ్జెట్, పరిమిత టెక్నికల్ సహకారం – రెంటాల జయదేవ -
ఇండస్ట్రీలోకి దిల్‌రాజు సతీమణి..!
కరోనా వైరస్ విజృంభణతో చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. తొమ్మిది నెలల విరామం అనంతరం ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నా.. ప్రేక్షకుడు మాత్రం ఆ వైపుకు కన్నెత్తికూడా చూడటంలేదు. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ భయం దర్శక, నిర్మాతలను తీవ్రంగా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో నిర్మించబోయే సినిమాలను ఓటీటీని వేదికగా చేసుకుని విడుదల చేయాలనే ఆలోచనలో పడ్డారు. దీనికి అనుగుణంగానే కథలను సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త ఆలోచనలకు పదునుపెడుతూ.. ఓటీటీ దిశగా అడుగులు వేస్తున్నారు. (కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నా) ఈ క్రమంలో టాలీవుడ్ బడా నిర్మాత దిల్‌రాజు సైతం ఓటీటీకి తగ్గకథల కోసం వెతుకులాట ఆరంభించారు. అయితే భర్త కోసం తన సతీమణి తేజస్వీని స్వయంగా ఓ కథను సిద్ధం చేశారని చిత్రపరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఆమె కొత్త కథలపై దృష్టిసారించారని, ఓటీటీకి అనుగుణంగా సృజనాత్మకతతో కూడిన ఓ కథను భర్తకు బహుమతిగా ఇచ్చారని సమాచారం. భార్య స్టోరీకి ఫిదా అయిన దిల్‌రాజు.. ఆ కథకు మరింత మెరుగులు దిద్దేందుకు ఆమెకు సహాయంగా ఓ రచనా బృందాన్ని ఏర్పాటు చేశాడని తెలిసింది. (దిల్‌రాజుకు షాకిచ్చిన వరుణ్, వెంకీ..!) ఓటీటీ విస్తరిస్తున్న నేపథ్యంలో భార్య రూపొందించిన కథాంశాన్ని తెరక్కించాలని నిర్ణయించినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అనుకున్నట్లు కథ కార్యరూపం దాల్చితే తేజస్వీని సైతం చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దిల్‌రాజు ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఎఫ్3 మూవీ నిర్మాణ బాధ్యతల్లో బిజిబిజీగా ఉన్నారు. కాగా దిల్’రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం హైదరాబాద్‌కు చెందిన తేజస్విని (వైఘా రెడ్డి)ని గత మార్చిలో వివాహం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్‌పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. -
సినిమా చూపించలేం మావా!
స్టార్ హీరోల కటౌట్లతో కళకళలాడిన థియేటర్ అది వందల సినిమాలను చూపించిన తెర అది హౌస్‌ఫుల్ బోర్డ్‌తో ఆనందించిన స్క్రీన్ అది గల్లాపెట్టె గలగలు విన్న చోటు అది తెగిన టికెట్లు, విసిరిన పూలతో మురిసిన ప్రాంగణం అది కానీ ఇక ఇవేవీ కనబడవు. స్టార్ల కటౌట్ల స్థానంలో ఆఫర్ల హోర్డింగులు అగుపించనున్నాయి పెళ్లి భజంత్రీలు మోగనున్నాయి రెస్టారెంట్లు కనపడబోతున్నాయి. భాగ్యనగరంలో పలు సింగిల్ థియేటర్లు మూతపడబోతున్నాయి. కొన్నేళ్లుగా ‘సినిమా చూపిస్త మావా’ అంటూ కొన్ని వందల సినిమాలు చూపించాయి. ఇక ‘సినిమా చూపించలేం మావా’ అంటున్నాయి. హైదరాబాద్‌లో ఫేమస్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కొన్ని మూతపడనున్నాయని తెలిసింది. హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్‌కు పాపులర్ జంక్షన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా ఆడేదాన్ని బట్టి హిట్, ఫ్లాప్ డిసైడ్ చేయొచ్చు అంటారు సినిమా పండితులు. సంధ్య, సుదర్శన్, దేవి, శ్రీమయూరి, సప్తగిరి, ఉష మయూరి... ఈ ఏరియాలో చాలా ముఖ్యమైన థియేటర్లు. ఈ థియేటర్స్‌లో శ్రీ మయూరి 70 ఎంఎంని త్వరలోనే మూసేయాలనుకుంటున్నారట. అలానే హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో ఉండే ఫేమస్ సింగిల్ స్క్రీన్లు కూడా మూతబడనున్నాయని తెలిసింది. టోలీచౌకి ఏరియాలోని ‘గెలాక్సీ’, నారాయణగూడలోని ‘శాంతి’ థియేటర్, బహదూర్‌పురలోని ‘శ్రీరామా’, మెహదీపట్నంలోని ‘అంబ’, సికింద్రాబాద్ ఏరియాలోని ‘టివోలీ’, ఎల్బీ నగర్‌లోని ‘సుష్మ’ థియేటర్స్ కూడా మూతపడనున్నాయని సమాచారం. కరోనా వల్ల థియేటర్స్ పరిశ్రమకు పూర్తిస్థాయిలో దెబ్బ పడింది. ఎనిమిదిన్నర నెలలు అయింది థియేటర్స్‌లో బొమ్మ పడి... కౌంటర్ దగ్గర టికెట్స్ తెగి. అయితే ఇలా థియేటర్స్‌ను మూసివేయడం సినిమా ప్రేమికులకు పెద్ద దెబ్బే. కానీ కోవిడ్ కంటే ముందు నుంచి కూడా సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి బాలేదు. థియేటర్లు నిండకపోవడం, టికెట్ రేట్లు, రెంటల్ చార్జీలు, కరెంట్ బిల్లులు, యూఎఫ్ఓ (ప్రొజెక్టర్‌కి సంబంధించినవి) బిల్లులు.. ఈ లెక్కల్లో లాభం చూడటం గగనం అనే పరిస్థితులే థియేటర్లు మూసేద్దాం అనే నిర్ణయం వెనక బలమైన కారణం అని తెలిసింది. కరోనా వల్ల పరిస్థితి ఇంకా దారుణం అయింది. సినిమా పరిశ్రమ కోలుకోవాలని ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా థియేటర్ల యాజమాన్యాలకు అనేక రాయితీలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రకటన తర్వాత సినిమాహాళ్లు త్వరలోనే తెరచుకుంటాయి అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇలా పలు థియేటర్లకు శాశ్వతంగా తాళాలు పడబోతున్నాయనేది ఆయా థియేటర్లలో సినిమాలు చూసి ఆనందించిన ప్రేక్షకులకు చేదు వార్తే. ఈ సింగిల్ స్క్రీన్స్‌ను ఫంక్షన్ హాలులా, సూపర్ మార్కెట్లలా, షాపింగ్ మాల్స్‌లా మార్చబోతున్నారని తెలిసింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ సంఖ్య చాలా ఎక్కువ. అలానే మన తెలుగులో విడుదలయ్యే సినిమాల సంఖ్య కూడా అంతే. మరి థియేటర్స్ ఒక్కొక్కటిగా మూతపడితే థియేటర్స్ సిస్టమ్ కచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టే. ఆల్రెడీ ఓటీటీ వర్సెస్ థియేటర్స్ డిబేట్ ఓవైపు నడుస్తూనే ఉంది. ప్రేక్షకుడిని థియేటర్స్‌వైపు వచ్చేలా చేస్తూనే, ఆల్రెడీ ఉన్న థియేటర్స్‌ను కమర్షియల్ స్పేస్లా మార్చేయకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. ఎందరో సూపర్స్టార్లు పుట్టిన సింగిల్ స్క్రీన్లు తన శోభ కోల్పోకూడదు. థియేటర్లు మూతపడటానికి ప్రధాన కారణం గురించి థియేటర్ యాజమాన్యాల ప్రతినిధిగా సదానందం మాట్లాడుతూ – ‘‘లాభం లేకుండా ఏ వ్యాపారమూ చేయలేం. గవర్నమెంట్ నుండి మాకు రావాల్సిన రాయితీలు అన్నీ ఇచ్చామంటున్నారు. కానీ, పన్నెండేళ్లుగా రావాల్సిన థియేటర్ మెయింటినెన్స్ ఛార్జీలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇంతవరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. (ప్రతి సినిమా టిక్కెట్‌కు 3 రూపాయలు గవర్నమెంట్ చెల్లించాలి). అలాగే రెండేళ్లనుండి థియేటర్లో ఫ్రీ పార్కింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో పార్కింగ్‌కు డబ్బులు లేక థియేటర్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దానికి తోడు కరోనా కారణంగా సినిమాల ప్రొడక్షన్ తగ్గటం వంటి ఎన్నో కారణాలతో ఈ థియేటర్లు మూతపడుతున్నాయి. ఈ థియేటర్లన్నీ ప్రైమ్ ఏరియాల్లో ఉండటంతో వాటిని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు ఉపయోగించుకునే ఆలోచనలతో యాజమాన్యాలు ఉన్నాయి’’ అన్నారు. -
నిర్భయపై వెబ్ సిరీస్‌కు అంతర్జాతీయ అవార్డ్
‘ఢిల్లీ క్రైమ్’... ఇప్పుడు మీడియా అంతా పలవరిస్తున్న వెబ్ సిరీస్. సాక్షాత్తూ హీరో మహేశ్‌బాబు సహా పలువురు సినీ తారలు అభినందిస్తున్న వెబ్ సిరీస్. కారణం... తాజాగా 48వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల్లో బెస్ట్ డ్రామా సిరీస్‌గా ‘ఢిల్లీ క్రైమ్’కు దక్కిన అపూర్వ గౌరవం. ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్ ఇండియా’ నిర్మించిన ఒరిజినల్ సిరీస్ ఇది. ఈ క్రైమ్ డ్రామా యాంథాలజీకి భారతీయ – కెనడియన్ అయిన రిచీ మెహతా రచన, దర్శకత్వ బాధ్యతలు వహించారు. సరిగ్గా ఏణ్ణర్ధం క్రితం గత ఏడాది మార్చి ద్వితీయార్ధంలో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ విడుదలైంది. ఏడు ఎపిసోడ్ల తొలి సీజన్ రిలీజ్ సమయంలోనే పలువురి దృష్టిని ఆకర్షించింది. తాజాగా దక్కిన అవార్డుతో మరోసారి మళ్ళీ అందరూ ‘ఢిల్లీ క్రైమ్’ గురించి మాట్లాడుకుంటున్నారు. అమెరికా బయట నిర్మాణమై, ప్రసారమైన ఉత్తమ టీవీ కార్యక్రమాలకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ అకాడెమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డులను ప్రకటిస్తుంది. 1973లో మొదలైన ఈ అవార్డుల ప్రదానోత్సవం ఏటా నవంబర్‌లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరుగుతుంది. కరోనా దెబ్బతో ఈసారి ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆన్ లైన్లో వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. ‘ఢిల్లీ క్రైమ్’ కథ ప్రాథమికంగా దేశరాజధాని ఢిల్లీ నగరంలో ఎనిమిదేళ్ళ క్రితం 2012 డిసెంబర్లో ఓ రాత్రి వేళ నడుస్తున్న బస్సులో ఓ అమ్మాయిపై జరిగిన సామూహిక అత్యాచార సంఘటన ఆధారంగా తీసిన వెబ్ సిరీస్. ప్రపంచవ్యాప్తంగా సంచలనమై, ‘నిర్భయ’ ఉదంతం పేరుతో ఆ సంఘటన కొన్ని నెలల పాటు పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. అప్పట్లో ఢిల్లీ పోలీస్ శాఖలో డి.సి.పి. అయిన ఛాయా శర్మ అనే అధికారిణి మూడు రోజుల్లోనే ఆ దారుణమైన గ్యాంగ్ రేప్ కేసును ఛేదించారు. ఆ నిజజీవిత సంఘటనలనూ, పాత్రలనూ తీసుకొని, ‘ఢిల్లీ క్రైమ్’ వెబ్ సిరీస్‌ను అల్లుకున్నారు. సినిమాలో వార్తికా చతుర్వేది అనే పేరుతో ఆ మహిళా పోలీసు అధికారిణి పాత్రను చూపించారు. నటి షెఫాలీ షా తెరపై ఆ పాత్రకు జీవం పోశారు. బాధాకరమైన నిర్భయ ఉదంతాన్ని సున్నితంగా తెరపై చూపడంతో ‘ఢిల్లీ క్రైమ్’ ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్‌లో నటించిన రసికా దుగాల్, అదిల్ హుస్సేన్, రాజేశ్ తైలాంగ్ల నటనను అందరూ అభినందించారు. సరిగ్గా మహిళలపై హింసా నిర్మూలన కోసం ఉద్దేశించిన అంతర్జాతీయ దినోత్సవానికి (నవంబర్ 25) ముందు ఢిల్లీ క్రైమ్‌కు అవార్డు దక్కడంతో రిచీ మెహతా కూడా ఉద్వేగానికి లోనవుతున్నారు. ‘‘మగవాళ్ళు తమపై జరుపుతున్న హింసను సహించడమే కాక, చివరకు ఆ సమస్యను పరిష్కరించే బృహత్ కార్యాన్ని కూడా భుజానికెత్తుకున్న మహిళలందరికీ ఈ తాజా ఎమ్మీ అవార్డు అంకితం’’ అని అవార్డు అందుకుంటూ రిచీ వ్యాఖ్యానించారు. హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ, దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, నవాజుద్దీన్ సిద్దిఖీ, సోనాలీ బేంద్రే, అదితీ రావు హైదరీ, దియా మిర్జా, కరణ్ జోహార్ సహా పలువురు ప్రముఖులు తాజా అవార్డుతో ‘ఢిల్లీ క్రైమ్’ టీమ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘నిర్భయ ఉదంతం జరిగినప్పుడు అందరం ఆగ్రహానికీ, ఆవేశానికీ గురయ్యాం. ఆ భావోద్వేగమే తరువాత ఈ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు తెరపై కనిపించింది. అదే ఇప్పుడు అందరి అభినందనలకూ, అవార్డుకూ కారణమైంది. అందుకే, మిగిలిన ప్రాజెక్టుల కన్నా మాకు ఇది ఎంతో స్పెషల్’’ అని ‘ఢిల్లీ క్రైమ్’లో మరో కీలక పాత్రధారి అయిన రాజేశ్ తైలాంగ్ అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడీ ఎమ్మీ అవార్డు కేవలం ఒక ఓటీటీకో, ఒక వెబ్ సిరీస్‌కో దక్కిన గౌరవం అనలేం. ఇండీ కంటెంట్ అందించే ప్రతి ఒక్కరికీ గర్వకారణం. పైపెచ్చు, సినిమాలకు సంబంధించి ఆస్కార్ అవార్డు ఎలాంటిదో, టీవీ సిరీస్‌లకు ఎమ్మీ అవార్డు అలాంటిది. అందుకే, ఇప్పుడు ‘ఢిల్లీ క్రైమ్’కు దక్కిన పురస్కారం అందరికీ ఆనందం కలిగిస్తోంది. -
ఆరు ఎపిసోడ్లు.. తొంభై కోట్లు
వెబ్ సిరీస్‌లు, వెబ్ షోలకు బాగా ఆదరణ పెరగుతోంది. దీంతో టాప్ స్టార్స్‌ను కూడా ఓటీటీ మీడియమ్‌లోకి తీసుకురావడానికి ఆయా సంస్థలు కృషి చేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఓ వెబ్ షో చేయబోతున్నారని టాక్. ఇందుకోసం ఆయనకు భారీ పారితోషికం కూడా అందబోతోందని సమాచారం. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ యాక్షన్ నిండిన ఓ వెబ్ సిరీస్ చేయబోతోందట. ఇందులో హృతిక్ లీడ్ రోల్లో కనిపిస్తారని భోగట్టా. ఆరు ఎపిసోడ్లతో సాగే ఈ సిరీస్‌కుగాను హృతిక్ సుమారు 90 కోట్లు తీసుకోనున్నారట. భారతీయ భాషలన్నింట్లోనూ ఈ సిరీస్ విడుదల కానుందని టాక్. ఈ సిరీస్‌లో హృతిక్ సరసన దిశా పటానీ కథానాయికగా నటిస్తారట. ఈ ఏడాది చివర్లో ఈ సిరీస్‌కు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. -
'అనగనగా ఓ అతిథి' సినిమా రివ్యూ
చిత్రం: ‘అనగనగా ఓ అతిథి’ తారాగణం: పాయల్, చైతన్యకృష్ణ; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దయాళ్ పద్మనాభన్; రిలీజ్: నవంబర్ 20; ఓ.టి.టి: ఆహా. దురాశ దుఃఖానికి హేతువు! ఈ పెద్దబాలశిక్ష సూక్తికి వెండితెర రూపం ‘అనగనగా ఓ అతిథి’. అయితే చిన్న పాయింట్ చుట్టూ కథను అటూ ఇటూ తిప్పి, గంటాముప్పావు చిత్రం తీశారు. కథేమిటంటే..: బీద రైతు కుటుంబం అన్నపూర్ణ, సుబ్బయ్యలది (వీణా సుందర్, ఆనంద్ చక్రపాణి). ఈడొచ్చినా... వయసు, మనసు తొందరపెట్టే కోరికలేవీ తీరక వేగిపోతున్న పెళ్ళీడు కూతురు మల్లిక (పాయల్ రాజ్‌పుత్). జంగమ దేవర భిక్షాటనకు వచ్చి, వాళ్ళింటికి మహాలక్ష్మి వస్తుందని జోస్యం చెబుతాడు. అనుకోకుండా పెట్టె నిండా నగలు, డబ్బుతో ఓ దేశసంచారి శ్రీనివాస్ (చైతన్య కృష్ణ) ఆ ఇంటికి అతిథిగా వస్తాడు. ఆ రాత్రికి అక్కడే ఉంటానంటాడు. మనుషుల్లో ఉండే కామం, దురాశ, కోరిక, పైశాచికత్వం అనుకోకుండా ఆ రాత్రి మేల్కొంటాయి. అప్పుడు జరిగిన రకరకాల సంఘటనలే మిగతా కథ. ఎలా చేశారంటే..: ఈ సినిమాకు ప్రధాన బలం కీలక పాత్రధారిణి పాయల్ రాజ్‌పుత్. ‘ఆర్.ఎక్స్ 100’ లాంటి చిత్రాల్లో బొద్దుగా, పూర్తి గ్లామర్‌గా కనిపించిన పాయల్ ఈసారి నాజూకు దేహంతో, డీ గ్లామరైజ్డ్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో ప్రత్యక్షమయ్యారు. కానీ, తన హావభావాలతో, అభినయించే కళ్ళతో కథలోని తన పాత్ర ప్రవర్తనకు తగ్గట్టు ఎన్నో భావాలు పలికించారు. తల్లి పాత్రలో కన్నడ నటి వీణా సుందర్ జీవించారు (తెలుగుకు తొలి పరిచయం. కన్నడ మాతృకలోనూ ఆమె ఇదే పాత్ర చేశారు). పత్తి ఏకుతున్నప్పుడూ, సారాయి దుకాణంలో షాకింగ్ తెలిసినప్పుడూ తండ్రి పాత్రలో ఆనంద్ చక్రపాణిని మర్చిపోయి, ఆ పాత్రనే చూస్తాం. ఎలా తీశారంటే..: చిన్న బడ్జెట్ చిత్రాలను వరుసగా ఓ.టి.టిలో వదులుతున్న వేదిక ‘ఆహా’. ట్రెండ్ లౌడ్ సంస్థతో కలసి, ఈ ‘అనగనగా ఓ అతిథి’ని నిర్మించింది. కన్నడంలో సక్సెసై, అక్కడి కర్ణాటక సర్కారు నుంచి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి (వీణా సుందర్) అవార్డులు అందుకున్న ‘ఆ కరాళ రాత్రి’ (2018) చిత్రానికి ఇది రీమేక్. ఓ ప్రసిద్ధ పాశ్చాత్య రచన ఆధారంగా వచ్చిన కన్నడ నాటకం ఆ కన్నడ చిత్రానికి ఆధారం. కన్నడంలో డైరెక్ట్ చేసిన తెలుగు – తమిళుడు దయాళ్ పద్మనాభన్ ఇప్పుడీ రీమేక్‌తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. నాలుగే పాత్రల చుట్టూ, ఒకే ఇంట్లో తిరిగేలా ఓ పూర్తి నిడివి సినిమా తీయడం కొంత సాహసమే. కథలో ఊహించని ట్విస్టు పెట్టడమూ బాగుంది. కానీ, కన్నడంలో 18 చిత్రాల అనుభవంతో 17 డేస్‌లోనే, రూ. 2.30 కోట్ల తక్కువ బడ్జెట్లో సినిమా తీసిన దర్శకుడు ఈ కథను నడిపించడంలో ఇబ్బంది పడ్డాడు. సినిమాలోని పాత్రల ప్రవర్తన కొన్నిసార్లు లాజిక్కు అందదు. ముఖ్యంగా, ఓ కీలక నిర్ణయం సమయంలో ప్రధాన పాత్రలు తీసుకొనే నిర్ణయానికి హేతువు కనిపించదు. పోస్టర్లలో ఫోటోలకూ, కథకూ సంబంధం లేకపోవడమూ కన్ఫ్యూజింగ్ పబ్లిసిటీ ట్యాక్టిక్స్. అలాంటి తప్పులనూ, కన్నడ ఛాయలనూ, తగ్గిన వేగాన్నీ పట్టించుకోకపోతే, టికెట్ కొనకుండా ఇంట్లోనే చూస్తున్నాం గనక ఈ మాత్రం చాలు లెమ్మని సరిపెట్టుకుంటాం. కొసమెరుపు: సినిమా చూస్తున్నా... సీరియల్ ఫీలింగ్! బలాలు: ఊహించని ట్విస్టున్న కథ పాత్రధారుల నటన, రీరికార్డింగ్ చివరి ముప్పావుగంట సినిమా బలహీనతలు సీరియల్లా సాగే కథనం ఆర్టిఫిషియల్ డైలాగ్స్ లాజిక్కు అందని పాత్రల ప్రవర్తన – రెంటాల జయదేవ -
ఎంటర్టైనింగ్ రియలిజమ్
చిత్రం: ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’; తారాగణం: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ; నిర్మాత: వి. ఆనందప్రసాద్; ద ర్శకత్వం: వినోద్ అనంతోజు; రిలీజ్: నవంబర్ 20; ఓ.టి.టి: అమెజాన్. కథకైనా, కళకైనా మధ్యతరగతి జీవితం ఎప్పుడూ మంచి ముడిసరుకు. ఆ జీవితాలను వాస్తవికంగా చూపిస్తూనే, వినోదం పంచే నిజా యతీ నిండిన ప్రయత్నం ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. కథేమిటంటే..: ఇది కొన్ని మిడిల్ క్లాస్ కుటుంబాల కథ. గుంటూరుకు కాస్తంత దూరంలో ఉండే కొలకలూరు గ్రామంలో ఓ చిన్న హోటల్ నడుపుతుంటారు కొండలరావు, అతని భార్య (గోపరాజు రమణ, సురభి ప్రభావతి). వాళ్ళ ఒకే ఒక్క కొడుకు రాఘవ (ఆనంద్ దేవరకొండ). తల్లి దగ్గర నేర్చిన బొంబాయి చట్నీ స్పెషల్‌తో పక్కనున్న గుంటూరు పట్నంలో హోటల్ పెట్టి, పైకి రావాలని హీరో తపన. ఇంటర్ చదివే రోజుల్లోనే సంధ్య (వర్ష బొల్లమ్మ)తో ప్రేమ. హీరో గుంటూరు వెళతాడు. తల్లీతండ్రి పొలం అమ్మి ఇచ్చిన సొమ్ముతో హోటల్ పెడతాడు. తరువాత ఏమైంది, ప్రేమ ఎలా గెలిచిందన్నది మిగతా కథ. ఎలా చేశారంటే..: హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, కన్నడిగురాలు వర్ష బొల్లమ్మ ఇద్దరూ పాత్రలే కనిపించేలా చేశారు. ఈ సినిమాకు హీరో కాని హీరో మాత్రం కథానాయకుడి తండ్రి పాత్రధారి గోపరాజు రమణ. రంగస్థల నటుడిగా ప్రసిద్ధుడై, టీవీ సీరియల్స్, కొన్ని సినిమాలతో తెర పరిచితుడైన రమణ ఈ తండ్రి పాత్రధారణతో సినిమాకు ప్రాణం పోశారు. ఈ పాత్ర ఆయన కెరీర్‌కు కచ్చితంగా ఓ మలుపు. సురభి జమునా రాయలు లాంటి రంగస్థల కళా కారులే అత్యధికులు నటించారీ సినిమాలో! అందుకే, హీరో, హీరోయిన్ల మాటెలా ఉన్నా... చుట్టుపక్కల కనిపించే తల్లితండ్రులు, స్నేహితుల మొదలు తాగుబోతు తండ్రితో వేగలేక మొబైల్ ఫోన్ల షాపులో పనిచేసే అమ్మాయి (దివ్య శ్రీపాద), మనవరాలి చదువు కోసం తపిస్తూ పాలు అమ్మే అంజయ్య (కట్టా ఆంటోనీ) దాకా చాలామందితో ఐడెంటిఫై అవుతాం. ప్రతి ఒక్కరితో ప్రేమలో పడతాం. అలాంటి పాత్రల రూపకల్పన దర్శక, రచయితల జీవితానుభవ ప్రతిభ. అతిథి పాత్రలో ‘పెళ్ళిచూపులు’ తరుణ్ భాస్కర్ కనిపిస్తారు. ఎలా తీశారంటే..: మధ్యతరగతి జీవితం, సాహితీ వాసనలతో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి, షార్ట్ ఫిల్మ్‌ల మీదుగా సినిమాల్లోకి వచ్చిన కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు తొలి ప్రయత్నం ఈ చిత్రం. ఈ గుంటూరు కుర్రాడు మొట్టమొదటి గృహప్రవేశం సీన్ నుంచే సినిమాకు ఓ టోన్ సెట్ చేశాడు. జనార్దన్ పసుమర్తి రాసిన కథ, మాటలు చూస్తే అచ్చంగా ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడి సంబోధనలు, సామెతల మొదలు తిట్ల దాకా అన్నీ వినోదం పంచుతాయి. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ స్వీకర్ అగస్తి బాణీల్లో ‘సంధ్యా’, ‘గుంటూరు’ పాటల లాంటివి బాగు న్నాయి. గుంటూరు వాతావరణం, అక్కడి ఫేమస్ ఫుడ్ జాయింట్ల పాట (రచన – కిట్టు విస్సాప్రగడ, గానం – అనురాగ్ కులకర్ణి) కొన్నేళ్ళు ఆ ప్రాంతవాసుల థీమ్ సాంగ్‌గా నిలబడిపోతుంది. ఇక, విక్రమ్ ఇచ్చిన నేపథ్య సంగీతం మరో ఆయువుపట్టు. దేవుణ్ణి నమ్మని హీరో – జాతకాల పిచ్చి ఉన్న అతని స్నేహితుడు, డబ్బున్న పెద్ద సంబంధంతో కూతురి జీవితాన్ని కట్టేయాలనుకొనే ఓ నాన్న – ఆటోవాడికైనా కూతురినిచ్చి పెళ్ళి కానిచ్చేసి తన తాగుడుకు ఢోకా లేకుండా చూసుకోవాలనుకొనే మరో తండ్రి, తండ్రీ కొడుకుల మధ్య సయోధ్యకు ప్రయత్నించే ఓ తల్లి – దురాశతో అయిన సంబంధాన్ని వద్దనుకున్న భర్తకు నచ్చజెప్పే ఓ భార్య... ఇలా చాలా పాత్రలు జీవితంలో నుంచి తెర మీదకు వచ్చాయి. జీవితంలోనూ, మనుషుల్లోనూ సింప్లిసిటీ ఎంత ఆనందాన్నిస్తుందో ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది. అయితే, రెండుంబావు గంటల కథాకథనంలో హీరో– హీరోయిన్ల ఇంటర్ ప్రేమకథ పర్యవసానాలను తెరపై పూర్తిగా చూపించలేదు. చెట్టు మీద నుంచి మామిడికాయ పడే దాకా బొంబాయి చట్నీలో నిపుణుడైన హీరోకు ఆ వంటలో మామిడి వాడాలనేది తెలీదంటే నమ్మలేం. రెసిపీ మార్చాడందామంటే, ఆ స్పష్టతా లేదు. పాలు పోసే అంజయ్య, చిట్ ఫండ్ డబ్బులతో ఊరికి రోడ్డు వేయించి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న అతి మంచితనపు పెదనాన్న పాత్ర లాంటి సెంటిమెంట్, ఎమోషన్లను మరింతగా తెరపై చూపించి ఉంటే, సినిమా వేరే స్థాయికి వెళ్ళేది. అలాగే, సాగదీత తగ్గించి, క్లైమాక్స్ ముందర కథనం పేస్ పెంచి, మరింత పట్టుగా రాసుకోవాల్సింది. హఠాత్తుగా సినిమా అయిపోయిందన్న ఫీలింగ్ రాకుండా చూడాల్సింది. అయితే, సినిమా మొత్తం మీద అందించిన ఫీలింగ్‌తో పోలిస్తే, కొత్త కుర్రాళ్ళ తొలి యత్నంగా అవన్నీ క్షమించేయవచ్చు. వెరసి, ఇదో రియలిస్టిక్ లైఫ్ ఎక్స్ పీరియన్స్ ఉన్న ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఇరవై ఏళ్ళ క్రితం దర్శకులు నాగేశ్ కుకునూర్ ‘హైదరాబాద్ బ్లూస్’, శేఖర్ కమ్ముల ‘డాలర్ డ్రీమ్స్’ మొదలు ఇటీవలి ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘పలాస’ లాంటి ప్రయత్నాలకు కొనసాగింపు ఇప్పుడీ లేటెస్ట్ ఫిల్మ్ అనుకోవచ్చు. ట్రైలర్లోనే అంతా చెప్పేసి, సినిమాలో సర్ ప్రైజులు లేకుండా చేసిన దర్శక, రచయితల తొలి ప్రయత్నంలో ఎత్తుపల్లాలున్నా... ఈ చిత్రాన్ని ఇంటిల్లపాదీ కలసి ఇంట్లోనే ఓటీటీలో చూడవచ్చు. కొసమెరుపు: చివరలో టేస్టు తగ్గినా... (అభి)రుచికరమైన బొంబాయి చట్నీ! బలాలు: కథలో నేటివిటీ మనల్ని మనకు గుర్తుచేసే పాత్రలు స్టేజ్ ఆర్టిస్టుల సినీ నటన గుంటూరు యాస, పాటలు నేపథ్య సంగీతం. బలహీనతలు: ముగింపు తెలిసే సింపుల్ స్టోరీలైన్ చివరలో సడలిన కథ, కథనం ర్ధంతర ముగింపు వినోదానికి దీటైన సెంటిమెంట్ లేమి – రెంటాల జయదేవ -
వైరల్: ‘సామ్ జామ్’లో మెరిసిన మెగాస్టార్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత వ్యాఖ్యాతగా ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో ప్రసారమవుతున్న టాక్ షో ‘సామ్ జామ్’. ‘ఆహా’ తన సబ్స్రైబర్లను పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా సమంతతో కొత్తగా ఈ షో చేయిస్తున్నారు. కరోనా కారణంగా ఎలాగూ సినిమా షూటింగ్‌లకు బ్రేక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయాన్ని క్యాష్ చేసుకునేందుకు సమంత కూడా ఇలా డిజిటల్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఇక సామ్‌జామ్ షోలో సినీ సెలబ్రిటీలను తీసుకొచ్చి వారితో జనాలకు వినోదాన్ని పంచనున్నారు. కాగా పూర్తిస్థాయిలో ఓ షోకు సమంత్ హోస్ట్‌గా చేయడం ఇదే తొలిసారి. నవంబర్13న ఈ షో లాంఛనంగా ప్రారంభమవ్వగా.. మొదటి ఎపిసోడ్లో అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ సెలబ్రిటీగా వచ్చారు. చదవండి: టాక్ షో: సమంతకు భారీ పారితోషికం! మున్ముందు ఎపిసోడ్లలో తమన్నా, రష్మిక మందన, సైనా నెహ్వాల్, కశ్యప్ పారుపల్లి, అల్లు అర్జున్ కూడా సమంత షోలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సామ్‌జామ్‌లో ఓ ఎపిసోడ్లో మెగాస్టార్ చిరంజీవి కూడా రానున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆహా అధినేత అయిన అల్లు అరవింద్‌కు చిరంజీవి స్వయానా బావ అవడంతో ఆయన ఈ షోలో పాల్గొనే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అన్నట్లుగానే తాజాగా చిరంజీవి సామ్‌జామ్ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాత బీఏ రాజు తన ట్విటర్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఎపిసోడ్ త్వరలోనే ఆహాలో ప్రసారం కానుంది. మీరు మాకు స్ఫూర్తి.. హ్యాపీ బర్త్ డే: సమంత Pictures of MegaStar @KChiruTweets @Samanthaprabhu2 from #SamJam shoot pic.twitter.com/TmP9DWy5kG — BARaju (@baraju_SuperHit) November 19, 2020 -
అనగనగా ఓ అతిథిలో ‘పాయల్’
‘ఆర్ఎక్స్ 100, ఆర్డీఎక్స్ లవ్, డిస్కోరాజా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. చైతన్య కృష్ణ, ఆనంద్ చక్రపాణి, వీణ సుందర్ కీలక పాత్రల్లో నటించారు. దయాల్ పద్మనాభన్ దర్శకత్వం వహించారు. రాజా రామామూర్తి, చిందబర్ నటీశన్ నిర్మించిన ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీలో ఈ నెల 20న విడుదల కానుంది. రాజా రామామూర్తి, చిందబర్ నటీశన్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. అనుకోని పరిస్థితుల్లో అర్ధరాత్రి ఓ ఇంటికి వచ్చిన అతిథి కారణంగా ఎదురయ్యే సమస్యలు ఏంటి? అనే కథాంశంతో దయాల్ అత్యంత ఉత్కంఠ కలిగేలా తెరకెక్కించాడు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: రాకేష్ బి, సంగీతం: ఆరోల్ కోరెల్లి. -
టాక్ షో: సమంతకు భారీ పారితోషికం!
బిగ్‌బాస్ సీజన్ 4లో దసరా ఎపిసోడ్లో తళుక్కున మెరిసిన సమంత అక్కినేని మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఆహా’ తన సబ్స్రైబర్లను పెంచుకునేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. విభిన్న షోలను ప్రవేశ పెడుతూ సబ్స్రైబర్లను ఆకర్షించే పనిలో పడింది. ఇందులో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ సమంతతో ‘సామ్‌జామ్’ అనే కొత్త టాక్ షోను ప్రారంభించింది. ప్రస్తుతం టాలీవుడ్లో సామ్ అగ్ర హీరోయిన్గా కొనసాగుతుండటంతో ఆమెతో ఈ టాక్ షో చేయించడం వల్ల తమ ప్లాట్‌ఫామ్‌కు మంచి మెంబర్షిప్ వస్తుందని ‘ఆహా’ భావిస్తోంది. చదవండి: సమంత జ్యువెలరీ ఖరీదెంతో తెలుసా సామ్‌జామ్ షోలో సెలబ్రిటీలను తీసుకొచ్చి వారితో వినోదాన్ని పంచనున్నారు. నవంబబర్13న ఈ షో లాంఛనంగా ప్రారంభమవ్వగా.. మొదటి ఎపిసోడ్లో అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ సెలబ్రిటీగా వచ్చారు. కాగా సామ్‌జామ్‌కు అక్కినేని వారి కోడలు పెద్ద మొత్తంలో పారితోషికం అందుకుంటున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కేవలం 10 ఎపిసోడ్లకు ఏకంగా 1.5 కోట్లు తీసుకోనుందని పుకార్లు వ్యాపించాయి. అయితే ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తెలిసి రావాలి. ఇదిలా ఉండగా ఈ షోకు త్వరలో మెగాస్టార్ చిరంజీవి కూడా రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనతోపాటు మున్ముందు తమన్నా, రష్మిక మందన, సైనా నెహ్వాల్, కశ్యప్ పారుపల్లి, అల్లు అర్జున్ కూడా సమంత షోలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: చాలెంజ్‌గా తీసుకొని పని చేశాను ఈ షో గురించి ఇటీవల సమంత మాట్లాడుతూ.. ‘‘సామ్‌జామ్ టాక్ షో కాదు. ఈ షోలో సమాజంలోని సమస్యల గురించి మాట్లాడతాం. టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తాం. ఈ షో నాకు చాలా పెద్ద చాలెంజ్. దీంతో పోల్చుకుంటే సినిమా యాక్టింగ్ చాలా సులభం అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ షో చేయటం ముఖ్యమనిపించింది. అందుకే చాలెంజ్‌గా తీసుకుని ఈ షో చేశాను’’ అన్నారు. మరోవైపు సమంత మొదటి సారి 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ద్వారా ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
ఓటీటీ తీసుకురావడం గర్వంగా ఉంది
‘‘ఇప్పుడు టీవీ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీలా డిజిటల్ ఇండస్ట్రీ కూడా ఒకటి.. దాన్ని తెలుగుకు తీసుకొచ్చినందుకు, అది కూడా పూర్తిగా తెలుగు భాషలో తీసుకురావడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు హీరో అల్లు అర్జున్. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ‘ఆహా’ ఓటీటీ గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘రెండు మూడేళ్ల కిందట.. రాత్రి ఒంటి గంట, రెండు గంటలైనా నాన్న (అల్లు అరవింద్) టీవీ షోలు చూస్తుండేవారు. ఈ మధ్య మీరు సినిమాలకంటే టీవీ షోలే ఎక్కువగా చూస్తున్నారు? అంటే.. బాగుంటున్నాయి.. వీటిని తెలుగుకి తీసుకురావాలి అన్నారు?. తెలుగులో ఓటీటీ కల్చర్ సాధ్యపడుతుందా? అన్నాను. కొన్ని రోజుల తర్వాత.. ‘మై హోమ్’ గ్రూప్ రామ్ జూపల్లిగారు ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్నారని తెలిసింది.. తను నాకు మంచి ఫ్రెండ్. మేమందరం కలిసి మాట్లాడుకున్నప్పుడు ఓటీటీ ఐడియా వచ్చింది. నేను చాలా గర్వపడాల్సిన సమయమిది.. మా నాన్నగారు ఐదు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో హిట్స్ సాధించారు.. అయితే ఈ ఓటీటీ మాత్రం చాలా ప్రత్యేకం. ఈ ప్లాట్‌ఫామ్ కంటెంట్‌కి సంబంధించింది.. అందుకే ఇండస్ట్రీలో కంటెంట్‌పై బాగా పట్టున్న ‘దిల్’ రాజుగారితో భాగస్వామ్యం అయ్యాం. ఓటీటీ అంటే యంగ్ మైండ్‌సెట్ ఉండాలి, యంగ్‌స్టర్ ఉండాలనుకున్నప్పుడు నాకు విజయ్ దేవరకొండ గుర్తొచ్చాడు.. తనతో మాట్లాడాం. భాగస్వామ్యం అయ్యాడు. ‘ఆహా’ తెలుగులో నంబర్ వన్ కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఫిబ్రవరి 8న ‘ఆహా’ని లాంచ్ చేశాం. ఉగాది నుంచి ఉగాది వరకు సుమారు 50షోలు చేయాలనుకున్నాం. ‘ఆహా’లో ‘కంటెంట్ మేనేజ్మెంట్ బోర్డ్’ చీఫ్ క్రియేటివ్ అడ్వైజర్‌గా వంశీ పైడిపల్లిని తీసుకున్నాం. ‘సామ్ జామ్’ అనే ఆసక్తికరమైన షోని సమంత చేస్తున్నారు.. ఈ షోకి అన్నీ తానై దర్శకురాలు నందినీరెడ్డి వెనకుండి నడిపిస్తున్నారు. ఈ దీపావళికి మరో మూడు షోలు రానున్నాయి’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘జూపల్లి రామేశ్వరరావుగారు, అరవింద్‌గారు, రామ్.. ‘ఆహా’లో నన్నూ భాగస్వామ్యం కావాలని కోరారు. సినిమాలతో నేను తీరిక లేకుండా ఉంటున్నాను. దీంతో నా కుమార్తె, నా అల్లుడు ‘ఆహా’లో జాయిన్ అయ్యారు. ‘ఆహా’ స్టార్ట్ అయిన తొమ్మిది నెలల్లో కోవిడ్ టైమ్‌లోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లను అలరిస్తోంది. అరవింద్‌గారు ఏది మొదలు పెట్టినా దాన్ని సాధించే తీరుతారు. ఈ ‘ఆహా’ ద్వారా తెలుగును భారతదేశం మొత్తం తీసుకెళతారనడంలో సందేహం లేదు’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హద్దులు చెరిపిన ఆకాశం
చిత్రం: ఆకాశం నీ హద్దురా; తారాగణం: సూర్య, అపర్ణా బాలమురళి, పరేశ్ రావల్, మోహన్ బాబు; మాటలు: రాకేందు మౌళి; సంగీతం: జి.వి. ప్రకాశ్ కుమార్; కెమెరా: నికేత్ బొమ్మిరెడ్డి; నిర్మాత: సూర్య; రచన – దర్శకత్వం: సుధ కొంగర; రిలీజ్ తేదీ: నవంబర్ 12; ఓటీటీ వేదిక: అమెజాన్; ఏ రంగంలో పైకి రావాలన్నా, ఏ కొత్త ఆలోచనైనా జనామోదం పొందాలన్నా ఎన్నో కష్టనష్టాలు తప్పవు. ఆ పురిటినొప్పులు భరిస్తేనే అంతిమ విజయం వరిస్తుంది. పౌర విమానయాన రంగంలో సామాన్య పౌరుడికి కూడా విమానంలో చౌకధరకు చోటివ్వాలని తపించిన ఓ మంచి మనిషి కథ ఇది. ‘ఎయిర్ దక్కన్’ ఫౌండర్ కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా, సినిమాటిక్ కల్పనలు జోడించి మహిళా దర్శకురాలు సుధ కొంగర చేసిన స్ఫూర్తిదాయక ప్రయత్నం – ‘ఆకాశం నీ హద్దురా’. కథేమిటంటే..: చుండూరు అనే చిన్న ఊళ్ళో మాస్టారు రాజారావు కొడుకు చంద్రమహేశ్ (సూర్య). నిమ్న వర్గానికి చెందినవాడైనా ఆ ఊరికి కరెంట్ తెప్పించడంలో, చివరకు రైలు హాల్టు వచ్చేలా కృషి చేయడంలో రాజారావు ఎంతో కృషి చేస్తాడు. అహింస, అర్జీ పద్ధతుల్లో సాగే రాజారావు పోరాటాన్ని తరాల అంతరంతో కొడుకు హర్షించడు. తల్లి పార్వతి (ఊర్వశి) సయోధ్యకు ప్రయత్నించినా, కొడుకు వినడు. నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో చదువుకొని, ఎయిర్ ఫోర్స్ లో చేరతాడు. అంతిమ ఘడియల్లో ఉన్న తండ్రిని చూడడానికి విమానంలో వద్దామన్నా, డబ్బు చాలక టైమ్‌కి రాలేకపోతాడు హీరో. ఆ బాధతో ఎలాగైనా సామాన్యమైన ఊరి జనం మొత్తానికీ చౌకధరకు విమానయానం అందుబాటులోకి తేవాలనుకుంటాడు. ఆ క్రమంలో అతనికి చిన్నస్థాయి నుంచి పైకి ఎదిగిన జాజ్ ఎయిర్ లైన్స్ అధిపతి పరేశ్ గోస్వామి (పరేశ్ రావల్) ప్రేరణ అవుతారు. తీరా అదే పరేశ్ అసూయతో, అహంకారంతో హీరో ప్రయత్నానికి అడుగడుగునా అడ్డుపడతాడు. చివరకు హీరో ఎలా తన కలను నిజం చేసుకున్నాడో మిగతా కథ. ఎలా చేశారంటే..: కుగ్రామంలో పుట్టి, ఎడ్లబండి మీద తిరిగిన కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ జీవిత అనుభవాల ఆత్మకథ ‘సింప్లీ ఫ్లయ్’ ఈ సినిమాకు ప్రధాన ఆధారం. వరుసగా ఫ్లాపులతో ఉన్న హీరో సూర్య ఆ పాత్రను ఆవాహన చేసుకొని, అభినయించారు. ఆర్థిక స్వావలంబన, అదే సమయంలో భర్తకు అన్నిఅండగా నిలిచే మనస్తత్వం కలిసిన బలమైన హీరోయిన్ పాత్రలో అపర్ణ మనసుకు హత్తుకుంటారు. హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాలు, సంభాషణలు చూస్తే, మంచి మణిరత్నం సినిమా చూస్తున్నామనిపిస్తుంది. విలన్‌గా పరేశ్ రావల్ తక్కువ మాటలతో, ఎక్కువ భావాలు పలికిస్తూ బాగున్నారు. వైమానికదళ అధికారి పాత్రలో మోహన్ బాబు బాగున్నారు. కానీ, ఆ పాత్ర రూపకల్పన, కథ చివరకు వచ్చేసరికి దక్కిన ప్రాధాన్యం ఆశించినంత బలంగా లేవు. హీరో తల్లితండ్రుల మొదలు స్నేహితులు, గవర్నమెంట్ ఆఫీసు అధికారుల దాకా చాలా పాత్రలు నిడివితో సంబంధం లేకుండా మనసుపై ముద్ర వేస్తాయి. ఎలా తీశారంటే..: మణిరత్నం వద్ద పనిచేసిన డైరెక్టర్ సుధ కొంగరపై తన గురువు సినిమా టేకింగ్ ప్రభావం బలంగా ఉన్నట్టు తెరపై కనిపిస్తుంది. సినిమా ఫస్ట్ సీన్ నుంచి ప్రేక్షకులు కథలో ఇన్ వాల్వ్ అయిపోతారు. పాత్రలనూ, సన్నివేశాలనూ, బలమైన సంఘటనలనూ కథకు తగ్గట్టు వాడుకున్నారు. లో కాస్ట్ ఎయిర్ లైన్స్ లాంటి టెక్నికల్ అంశాన్ని సైతం అందరికీ అర్థమయ్యేలా, ఎమోషనల్ గా చూపించడం విశేషం. కొన్ని చోట్ల కంటతడి పెట్టకుండా ఉండలేం. అందుకే, భావోద్వేగాలను ఇష్టపడేవారికి కచ్చితంగా నచ్చే సినిమా ఇది. అయితే, అక్కడక్కడా బాగున్న ఎమోషనల్ సీన్లను కూడా పరిమితికి మించి కొనసాగించడంతో మెలోడ్రామా మితిమీరింది. తండ్రి చనిపోయాక ఇంటికొచ్చిన హీరోతో తల్లి వాదన సీన్, పోస్టాఫీస్‌లో ఊరి జనం హీరోతో ఫోన్లో మాట్లాడే సీన్ లాంటివి బాగున్నా, కొద్దిగా కత్తెరకు పదును పెట్టి ఉండాల్సింది. అలాగే, లల్లాయి లాయిరే అంటూ మొదలయ్యే పాట మినహా మిగిలినవేవీ గుర్తుండేలా లేకపోవడం చిన్న లోటే. అయితే, ఇలాంటి లోటుపాట్లన్నీ బిగువైన కథాకథనంలో కొట్టుకుపోతాయి. శాలినీ ఉషాదేవితో కలసి దర్శకురాలు రాసుకున్న స్క్రీన్ ప్లే, సినిమా నిర్మాణ విలువలు, రీరికార్డింగ్, కెమెరా పనితనం ప్రధాన బలాలయ్యాయి.. గోపీనాథ్ జీవితకథతో పాటు చౌకధరలో విమానయానమనే విభాగంలో జరిగిన అనేక నిజజీవిత సంఘటనలను కూడా కలగలిపి, ప్రధాన పాత్రల స్వరూప స్వభావాలను పకడ్బందీగా రాసుకున్నారు సుధ కొంగర. రాసుకోవడంతో స్క్రిప్టు ఆసక్తిగా తయారైంది. ఇప్పటి వరకు స్పోర్ట్స్ డ్రామాలు, సినిమా యాక్టర్లు, పొలిటీషియన్ల బయోపిక్‌లకే పరిమితమైన చోట తెలుగు మహిళ సుధ కొంగర చేసిన ఈ ప్రయత్నం అందుకే ఆనందం అనిపిస్తుంది. హీరోకూ, ప్రత్యర్థికీ మధ్య వ్యాపార పోరాటం సహా, కథలో అడుగడుగునా హీరోకు ఎదురయ్యే సవాళ్ళు ప్రేక్షకుల ఆసక్తిని చివరికంటా నిలుపుతాయి. సినిమా క్లైమాక్స్ లో ఎలాగైనా హీరోనే గెలుస్తాడని తెలిసినా, రెండున్నర గంటలూ ఆపకుండా చూసేలా చేస్తుంది. ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ కంటెంట్ కావడంతో, కరోనా వేళ ఇటీవల రిలీజైన సినిమాల్లో ఇది ఫస్ట్ బిగ్ ఓటీటీ హిట్‌గా నిలిచే సూచనలూ ఉన్నాయి. కొసమెరుపు: ఇటీజ్ నాట్ ఎ ‘భయో’పిక్! బలాలు ► స్ఫూర్తిదాయక కథ ► బిగి సడలని కథనం ► దర్శకత్వ ప్రతిభ ► పాత్రల రూపకల్పన, నటన ► సీన్లలోని ఎమోషన్ బలహీనతలు ► అక్కడక్కడ అతి మెలోడ్రామా ► డబ్బింగ్ సినిమా వాసనలు ► ఆకట్టుకోని పాటలు ► క్లైమాక్స్ లో కాస్తంత తికమక – రెంటాల జయదేవ -
ఓటీటీలపై నిఘా
సాక్షి, న్యూఢిల్లీ: ఓటీటీ(ఓవర్ ద టాప్) పేరిట అశ్లీలం నేరుగా ప్రజల నట్టింట్లోకి చేరుతోందన్న ఆందోళనలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసే చర్యలు ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తదితర ఓటీటీ వేదికలను, ఇతర డిజిటల్ న్యూస్ వెబ్సైట్లు, కరెంట్ అఫైర్స్ కంటెంట్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ ద్వారా ప్రసారమయ్యే డిజిటల్ కంటెంట్‌పై ప్రస్తుతం దేశంలో ఎలాంటి నిఘా లేదు. నియంత్రణకు విధానాలు, నిబంధనలు లేవు. నెట్లో ప్రసారమయ్యే అశ్లీల, అనుచిత అంశాలపై కన్నేసి ఉంచేందుకు, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చట్టం గానీ, స్వతంత్ర సంస్థ గానీ లేవు. అందుకే కేంద్ర సర్కారు ఇలాంటి వ్యవహారాలపై నిఘా పెట్టే అధికారాన్ని సమాచార, ప్రసార శాఖకు కట్టబెట్టింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ మంగళవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి కోవింద్ సంతకం చేశారు. కోర్టు వివరణ కోరిన నెల రోజుల్లోపే... ఓటీటీలపై నిఘా కోసం కేంద్ర ప్రభుత్వం ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) రూల్స్–1961’లో సవరణలు చేసింది. దీన్ని ఇకపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) 357వ అమెండ్మెంట్ రూల్స్–2020గా వ్యవహరిస్తారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. అశ్లీలంపై చర్యలు తీసుకొనే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 క్లాజ్(3) ప్రకారం కేంద్రానికి సంక్రమించింది. ఆన్లైన్ వేదికలపై లభ్యమయ్యే న్యూస్, ఆడియో, విజువల్ కంటెంట్, సినిమాలకు సంబంధించిన నియంత్రణ విధానాలను రూపొందించే అధికారం సమాచార, ప్రసార శాఖకు దక్కింది. ఓటీటీలు, డిజిటల్ మీడియా వేదికలపై నియంత్రణ కోసం ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు శశాంక్ శంకర్ జా, అపూర్వ అర్హతియా ఇటీవలే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం వివరణ కోరిన నెల రోజుల్లోనే కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. -
ఓటీటీకి కూడా సెన్సార్
సాధారణంగా సినిమాలైతే సెన్సార్ అవ్వకపోతే విడుదల చేయలేరు. సినిమా తయారైన తర్వాత ఎవరెవరు ఆ సినిమా వీక్షించవచ్చో సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇస్తుంది. అయితే ఓటీటీ (నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, జీ5 మొదలైనవి) ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలయ్యే కంటెంట్‌కు సెన్సార్ లేదు. కానీ ఇకనుంచి ఓటీటీ కంటెంట్‌కి కూడా కత్తెర తప్పదని సమాచార మరియు ప్రసారశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక పై ఆన్లైన్లో ప్రసారమయ్యే కంటెంట్ కూడా ప్రభుత్వం గమనిస్తుంటుందని పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని డిజిటల్ మాధ్యమాల్లో సినిమా, సిరీస్‌లు, వెబ్‌సిరీస్‌లు చేస్తున్న పలువురు దర్శక–నిర్మాతలు వ్యతిరేకించారు. -
‘గతం’... గుర్తు పెట్టుకోలేం! అలాగని మరిచిపోలేం!
ఓ.టి.టిలో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ తరహా కంటెంట్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఆ నమ్మకంతో రిలీజైన ఫిల్మ్ ‘గతం’. ఎన్నారైలైన ఐ.టి. ఉద్యోగులే నటిస్తూ, సమష్టిగా నిర్మిస్తూ చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. కథేమిటంటే..: ఆస్పత్రి మంచం మీద కోమాలో నుంచి లేచి, గతం మర్చిపోయిన ఓ అబ్బాయి (రిషి పాత్రలో రాకేశ్). అతని ప్రియురాలిగా గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించే ఓ అమ్మాయి (పూజిత). గతాన్ని తెలుసుకోవడానికంటూ వారిద్దరూ కారులో బయలుదేరతారు. మార్గమధ్యంలో, చిమ్మచీకటిలో కారు ఆగిపోతే, అపరిచిత వ్యక్తి అర్జున్ (భార్గవ పోలుదాసు) తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. ఆ ఇంట్లోకి వెళ్ళాక ఆ జంటకు ఎదురైన విచిత్రమైన అనుభవాలు ఏమిటి, మర్చిపోయిన ఆ గతం ఏమిటి, ఆ గతానికీ ఈ వ్యక్తులకూ సంబంధం ఏమిటన్నది కథ. ఎలా చేశారంటే..: ‘‘ప్రతి మనిషిలోనూ ఓ సైకోపాత్ ఉంటాడు’’ అంటూ ఔత్సాహికులు చేసిన ఈ సినిమాలో నటీనటులంతా కొత్తవాళ్ళే. అపరిచిత ముఖాలే. అయినా, వెండితెరపై విలన్ పాత్రలకు సరిపోయే అర్జున్ పాత్రధారి భార్గవ ఆకట్టుకుంటారు. రిషి పాత్రధారి రాకేశ్ గొంతు, ఉచ్చారణ కళ్ళు మూసుకొని వింటే, హీరో విజయ్ దేవరకొండ గుర్తుకొస్తారు. ‘మాయాబజార్’ దర్శకులు కె.వి. రెడ్డికి ముని మనుమరాలైన పూజితారెడ్డి పాత్ర పరిధిలో ఉన్నంత మేరకు చేశారు. మిగిలిన పాత్రలన్నీ కథలో భాగంగా వచ్చిపోయేవి. ఎలా తీశారంటే..: మొత్తం అమెరికా నేపథ్యంలోనే సాగే ఈ చిత్రంలో మనోజ్ రెడ్డి కెమెరాలో అమెరికాలో మంచుతో నిండిన లొకేషన్లు తెరపై అందంగా కనిపించాయి. సినిమాకు మరో ప్రధాన బలం శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం. థ్రిల్లర్ కథనూ, సన్నివేశాలనూ బలంగా చెప్పడంలో చరణ్ పనితనం బాగా ఉపయోగపడింది. షార్ట్ ఫిల్ముల నుంచి దర్శకుడిగా మారిన అమెరికన్ ఐ.టి. ఉద్యోగి కిరణ్ రెడ్డి మంచి పాయింట్‌ను ఎంచుకున్నారు. కానీ, అంతకు తగ్గ పటిష్ఠమైన కథనం అల్లుకోలేదనిపిస్తుంది. ఇన్ని నేరాలు జరుగుతున్నా ప్రధాన పాత్రధారి తప్ప పోలీసులెవరూ పరిశోధిస్తున్నట్టు కనపడరు. కొడుకు చేసే ఘోరాలకు తండ్రి ఎందుకు సహకరిస్తున్నాడన్న దానికీ పెద్దగా లాజిక్ లేదు. కథనంలో కొన్ని సన్నివేశాలు ముందుగా ఊహించేసే తీరులో ఉండడమూ మరో బలహీనత. సినిమా ఫస్టాఫ్ స్లోగా సాగుతుంది. అసలు కథ మొదలైన సెకండాఫ్ చివరికొచ్చే కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. కానీ, అప్పటికే ఆలస్యమైపోయిందని వీక్షకులు భావిస్తేనే కష్టం. అయితే, ఐ.టి. ఉద్యోగులు తమ ఉద్యోగాలు చేసుకుంటూనే, క్రిస్మస్ సెలవుల్లో, వీకెండ్స్ లో తీస్తూ, వీలైనంత తక్కువ బడ్జెట్లో, అతి తక్కువ యూనిట్‌తో చేసిన ప్రయత్నంగా కథలోని చాలా లోపాలను క్షమించ బుద్ధేస్తుంది. కమర్షియల్ లెక్కలతో కాకుండా, ప్రేమతో ప్రవాస భారతీయులు చేసిన ప్రయత్నంగా ‘గతం’ను అభినందించాలని అనిపిస్తుంది. కానీ, గ్రిప్పింగ్‌గా ఉన్న ట్రైలర్‌కు భిన్నంగా స్లోగా సాగే ఈ నూటొక్క నిమిషాల కథాకథనాన్ని అందరూ ఆనందించగలరా? కొసమెరుపు: ‘గతం’... గుర్తు పెట్టుకోలేం! అలాగని మరిచిపోలేం! బలాలు: ► నేపథ్య సంగీతం ► క్రై మ్, ఇన్వెస్టిగేషన్ అంశం ► సినిమా చివరి అరగంట ► భార్గవ అభినయం. బలహీనతలు: ∙ ► అంతా కొత్తవాళ్ళే కావడం ► సీన్లలోని ప్రిడిక్టబిలిటీ ► ఫస్టాఫ్‌లోని స్లో నేరేషన్ ► కథ నడిపిన విధానం. – రెంటాల జయదేవ -
చాలెంజ్‌గా తీసుకుని చేశాను
‘‘సామ్‌జామ్ షో నాకు చాలా పెద్ద చాలెంజ్. దీంతో పోల్చుకుంటే సినిమా యాక్టింగ్ చాలా సులభం అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ షో చేయటం ముఖ్యమనిపించింది. అందుకే చాలెంజ్‌గా తీసుకుని ఈ షో చేశాను’’ అన్నారు సమంత. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ‘సామ్‌జామ్’ అనే షోతో ఈ నెల 13నుండి ప్రేక్షకుల ముందుకు రానున్నారు సమంత. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమంత మాట్లాడుతూ– ‘‘సామ్‌జామ్ టాక్ షో కాదు. ఈ షోలో సమాజంలోని సమస్యల గురించి మాట్లాడతాం. టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తాం. నేను బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా చేయటం నాగ్‌మామ నిర్ణయం. ఆ షో చేసే టైమ్‌లో పెద్దగా నిద్ర పట్టలేదు. చాలా హార్డ్‌వర్క్ చేశాను’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఆహా’ను ఫిబ్రవరిలో లాంచ్ చేశాం. ఈ ప్లాట్‌ఫామ్‌ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడానికి సమంతగారితో ఓ పెద్ద షో చేయాలనుకున్నాం. ఇది నార్మల్ షో కాదు. నందినీరెడ్డి ఈ షోను తన భుజాలపై మోస్తున్నారు’’ అన్నారు. నందినీరెడ్డి మాట్లాడుతూ– ‘‘కాఫీ విత్ కరణ్’, ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ షోలు చేసిన టీమ్‌తో పని చేయటం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు. -
యాక్షన్ మోడ్
‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ సూపర్ సక్సెస్‌తో ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు షాహిద్ కపూర్. వెంటనే మరో తెలుగు చిత్రం ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు షాహిద్. తెలుగు దర్శక ద్వయం రాజ్, డీకే ఓ యాక్షన్ ప్రధానమైన వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారట. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ కనిపిస్తారని సమాచారం. థ్రిల్లర్ జానర్లో ఈ సిరీస్ రెండు సీజన్లుగా తెరకెక్కనుంది. ఆల్రెడీ ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో సూపర్ సక్సెస్‌లో ఉన్నారు దర్శకులు రాజ్, డీకే. వచ్చే ఏడాదిలో షాహిద్‌తో చేయబోయే వెబ్ సిరీస్ సెట్స్ మీదకు వెళ్లనుంది. -
అందరికీ కనెక్ట్ అయ్యే కథ
‘‘నా సొంత అనుభవాల నుంచి నేను తయారు చేసుకున్న కథే ‘కలర్ ఫొటో’. 1990 – 97 ప్రాంతంలో జరిగిన ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇంటర్నెట్ లేని టైమ్‌లో ప్రేమలు ఎలా ఉన్నాయి? అనే అంశాన్ని ఈ సినిమాలో చెప్పాం’’ అని నిర్మాత సాయి రాజేష్ నీలం అన్నారు. హాస్యనటుడు సుహాస్ హీరోగా, చాందీని చౌదరి హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘కలర్ ఫొటో’. సునీల్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు. సందీప్ దర్శకత్వం వహించారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని, అమృత ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రవణ్ కొంక నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న ‘ఆహా’ ఓటీటీలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిరాజేష్ నీలం మాట్లాడుతూ– ‘‘గతంలో నిర్మించిన ‘హృదయ కాలేయం, కొబ్బరిమట్ట’ రెండూ కమర్షియల్ హిట్స్ అయినప్పటికీ, మా బ్యానర్‌కి రావాల్సిన గౌరవం రాలేదనుకుని, ‘కలర్ ఫొటో’ నిర్మించాను. ఈ చిత్రం టీజర్‌తోనే నాకు, నా బ్యానర్‌కి మంచి గుర్తింపు, గౌరవం వచ్చాయి. రంగు వివక్ష గురించి ఈ సినిమాలో నిజాయతీగా చెప్పడానికి ప్రయత్నించాం. అలా అని ఇదేదో సీరియస్ సబ్జెక్ట్ కాదు.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం, భావోద్వేగాలుంటాయి. ఈ కథకి తగిన హీరోగా సుహాస్ సూట్ అవుతాడని తీసుకున్నాం. సునీల్‌గారు ఈ సినిమాలో హీరోయిన్ అన్న పాత్రలో ఒక పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. కాలభైరవ సంగీతం ఓ ప్లస్ పాయింట్’’ అన్నారు. -
అమ్మవారు ఓటీటీలోకి వస్తున్నారు
నయనతార అమ్మవారి పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘మూకుత్తి అమ్మన్’. ముక్కుపుడుక అమ్మవారు అని అర్థం. ఆర్జే బాలాజీ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ చిత్రాన్ని డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. భూమి మీదకు వచ్చిన అమ్మవారికి, ఓ సాధారణ మనిషికి మధ్య జరిగే సంఘటనలే ఈ చిత్రకథాంశం. అమ్మవారి పాత్ర కోసం షూటింగ్ జరిగినన్నాళ్లూ నయనతార పూర్తి శాకాహారిగా మారిపోయారు. అమ్మవారి పాత్రలో ఆమె లుక్‌కి మంచి స్పందన కూడా వచ్చింది. -
పవర్ఫుల్ రోల్
‘అందాలరాక్షసి’ (2012) సినిమాతో తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చారు ఉత్తరాది భామ లావణ్యా త్రిపాఠి. ఈ ఏడాది లావణ్య ఓటీటీలోకి ఆరంగేట్రం చేస్తున్నారని సమాచారం. కరోనా వల్ల థియేటర్లు మూతపడిన కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ఆదరణ పెరిగింది. అందుకే రమ్యకృష్ణ, ప్రియమణి, సమంత, నిత్యామీనన్ వంటి స్టార్స్ సైతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌వైపు మొగ్గుచూపారు. ఇప్పుడు లావణ్యా త్రిపాఠి ఈ జాబితాలో చేరబోతున్నారు. లావణ్య కెరీర్లో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ఒక చిత్రం ‘భలే భలే మగాడిబోయ్’. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందన్ను వెబ్ సిరీస్‌లోనే లావణ్యా త్రిపాఠి నటించనున్నారని తెలిసింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ వెబ్ సిరీస్‌లో ప్రస్తావిస్తారని టాక్. ఇందులో లావణ్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. ఇక సినిమాల విషయానికి వస్తే.. కార్తికేయ హీరోగా రూపొందుతున్న ఓ చిత్రంతో పాటు మరో చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు లావణ్యా త్రిపాఠి. -
శ్రుతీ నాగ్ ఓ వెబ్ ఫిల్మ్?
ప్రస్తుతం స్టార్స్ అందరూ ఓటీటీ బాటపట్టారు. ఓటీటీలకు షోలు, సిరీస్‌లు, వెబ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. తాజాగా ఓ వెబ్ ఫిల్మ్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్, హీరోయిన్ శ్రుతీహాసన్ కలిసారని సమాచారం. శ్రుతీహాసన్ లీడ్ రోల్లో ఓ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభించారట నాగ్. నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న ఈ సినిమా నిడివి 30 నుంచి 40 నిమిషాల మధ్యలో ఉంటుందని టాక్. వారం రోజుల్లోనే చిత్రీకరణను దాదాపుగా పూర్తి చేయడం విశేషం. ఈ వెబ్ ఫిల్మ్ కోసం ప్రత్యేకంగా ఓ స్టూడియో సెట్‌ను నిర్మించారని టాక్. ఓ బలమైన పాయింట్‌ను ఈ వెబ్ ఫిల్మ్‌లో చర్చించారట నాగ్ అశ్విన్. ఈ సినిమా త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా కాకుండా ప్రభాస్‌తో చేయబోయే భారీ బడ్జెట్ సినిమా ప్రీ – ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్. అలానే ‘క్రాక్, వకీల్‌సాబ్’ చిత్రాలతో శ్రుతీహాసన్ బిజీగా ఉన్నారు. -
పిజ్జా 2
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉండగా తాజాగా ‘ఫిలిమ్’ పేరుతో మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ రాబోతోంది. విజయదశమి ముందు లాంచ్ కానున్న ఈ ఫిలిమ్ ఓటీటీలో విడుదల కానున్న తొలి చిత్రం విజయ్ సేతుపతి నటించిన ‘పిజ్జా 2’. ‘‘ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 13న విడుదలైంది. అయితే సినిమా రిలీజైన వెంటనే లాక్ డౌన్ మొదలయింది. దీంతో ఈ చిత్రాన్ని ఇప్పుడు ఫిలిమ్ ఓటీటీలో నేరుగా విడుదల చేస్తున్నాం. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ‘పిజ్జా 2’ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత డి. వెంకటేష్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గాయత్రి కథానాయికగా నటించారు. -
ఆస్కార్స్‌కు ప్రియాంక?
ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయిలో పాపులర్ చేస్తున్న నటీనటుల్లో ప్రియాంకా చోప్రా ఒకరు. గతంలో ఓసారి ఆస్కార్ అవార్డులకు అతిథిగా వెళ్లారామె. తాజాగా ఆస్కార్‌ను ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నారని సమాచారం. ప్రియాంకా చోప్రా నటిస్తున్న తాజా చిత్రం ‘ది వైట్ టైగర్’. ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం ఈ సినిమా చేస్తున్నారామె. వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్ వేడుకలో ఈ చిత్రం తరఫున ఉత్తమ సహాయ నటి విభాగంలో ప్రియాంక చోటు దక్కించుకునే అవకాశం ఉందని టాక్. ఈ లిస్ట్‌లో ఆల్రెడీ హాలీవుడ్ స్టార్స్ మెరిల్ స్ట్రీప్స్, క్రిస్టిన్ స్కాట్ థామస్, ఒలీవియా కోల్మన్ ఉండొచ్చని తెలిసింది. మరి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను ప్రియాంక గెలుచుకుంటారా? వేచి చూడాలి. ఇండో–ఆస్ట్రేలియన్ రచయిత అరవింద్ అడిగి రచించిన ‘ది వైట్ టైగర్స్’ నవలను అదే పేరుతో సినిమాగా రూపొందిస్తున్నారు. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం విడుదలవుతుంది. -
ఫలితాన్ని దాచలేం: కోన వెంకట్
‘‘ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూడటం ఒక కిక్. అలా కుదరకపోతే టీవీలో చూస్తాం. కరెంట్ పోతే ఫోన్లో చూస్తాం. కానీ ఉత్కంఠ ఒక్కటే. ఎమోషన్ కనెక్ట్ అయితే ఏ స్క్రీన్ అయినా ఒక్కటే. సినిమా కూడా అంతే’’ అన్నారు రచయిత కోన వెంకట్. అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించాయి. ఈ సినిమా అక్టోబర్ 2న అమేజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రచయితగా, నిర్మాతగా వ్యవహరించిన కోన వెంకట్ ‘సాక్షి’కి చెప్పిన విశేషాలు. మూకీ టు టాకీ ‘నిశ్శబ్దం’ని ముందు మూకీ సినిమాగా అనుకున్నాం. స్క్రీన్ ప్లే కూడా పకడ్బందీగా ప్లాన్ చేశాం. కానీ అనుష్క పాత్ర ఒక్కటే వినలేదు... మాట్లాడలేదు.. మిగతా పాత్రలు ఎందుకు సైలెంట్‌గా ఉండాలి? అనే లాజికల్ క్వశ్చన్‌తో మూకీ సినిమాను టాకీ సినిమాగా మార్చాం. రచయితగా నాకూ సవాల్ దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ కథ ఐడియా చెప్పగానే నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఐడియాను కథగా మలిచి స్క్రీన్ ప్లే చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. మేమిద్దరం మంచి మిత్రులం కావడంతో వాదోపవాదనలు చేసుకుంటూ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచాం. షూటింగ్ ఓ పెద్ద ఛాలెంజ్ ఈ సినిమా మొత్తాన్ని అమెరికాలోనే పూర్తి చేశాం. అది కూడా కేవలం 60 రోజుల్లోనే. కానీ అలా చేయడానికి చాలా ఇబ్బందులుపడ్డాం. థ్రిల్లర్ సినిమా షూట్ చేయడానికి వాతావరణం కీలకం. అమెరికాలో శీతాకాలంలో తీయాలనుకున్నాం. మా అందరికీ వీసాలు వచ్చేసరికి అక్కడ వేసవికాలం వచ్చేసింది. రోజూ ఉదయాన్నే రెండుమూడు గంటలు ప్రయాణం చేసి లొకేషన్స్‌కి వెళ్లి షూట్ చేశాం. వేరే దారిలేకే ఓటీటీ ‘నిశ్శబ్దం’ చిత్రం రిలీజ్ ఫి్ర» వరి నుంచి వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో అయోమయం. మరీ ఆలస్యం చేస్తే కొత్త సినిమా చుట్టూ ఉండే హీట్ పోతుంది. అది జరగకూడదని ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఓటీటీకి వెళ్లకూడదని చాలా విధాలుగా ప్రయత్నించాం. ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇలా చేస్తున్నాం. కచ్చితంగా థియేటర్ అనుభూతి ఉండదు. కానీ సినిమా తీసిందే ప్రేక్షకుల కోసం. వాళ్లకు ఎలా అయినా చూపించాలి కదా. ఓటీటీలో ‘నిశ్శబ్దం’ మొదటి బ్లాక్‌బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. ఫలితాన్ని దాచలేం థియేట్రికల్ రిలీజ్ అయితే కలెక్షన్స్‌ని బట్టి సినిమా హిట్, ఫ్లాప్ చెప్పొచ్చు. ఓటీటీలో అలా ఉండదు. ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెప్పేస్తారు. బావుంటే అభినందనలు ఉంటాయి. లేదంటే చీల్చి చండాడేస్తారు. ఈ లాక్‌డౌన్‌ను నేను ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఉపయోగించుకున్నాను. లాక్డౌన్ తర్వాత మనం చెప్పే కథల్లో చాలా మార్పు ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. కచ్చితంగా కొత్త ఐడియాలు మన తెలుగులోనూ వస్తాయి. ‘నిశ్శబ్దం’ కూడా అలాంటి సినిమాయే అని నా నమ్మకం. కోన 2.0 వస్తాడు ► లాక్డౌన్లో కొన్ని కథలు తయారు చేశాను ► లాక్డౌన్ తర్వాత అందరిలోనూ కొత్త వెర్షన్ బయటకి వస్తుంది అనుకుంటున్నాను. అలానే కోన వెంకట్ 2.0 కూడా వస్తాడు ► కరణం మల్లీశ్వరి బయోపిక్ సినిమా బాగా ముస్తాబవుతోంది ► దేశం మొత్తం ఆశ్చర్యపడే కాంబినేషన్ ఒకటి ఓకే అయింది. ఆ వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను ► సంక్రాంతికి థియేటర్స్ ఓపెన్ అయి, ప్రేక్షకులందరూ తండోపతండాలుగా థియేటర్లకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. -
నిశ్శబ్దం కూడా...
ఇప్పటికే పలు చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు ‘నిశ్శబ్దం’ కూడా విడుదల కానుంది. అనుష్క, మాధవన్ జంటగా అంజలి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ సహకారంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తెలుగులో ‘నిశ్శబ్దం’, తమిళ, మలయాళ భాషల్లో ‘సైలె¯Œ ్స’ పేరుతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ‘‘సస్పె¯Œ ్స, థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మాటలు రాని మరియు వినికిడి లోపం ఉన్న కళాకారిణిగా అనుష్క నటించారు’’ అన్నారు హేమంత్ మధుకర్. ‘‘భారతదేశంతో పాటు 200 దేశాల్లో మా సినిమా విడుదల కానుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. అనుష్క మాట్లాడుతూ– ‘‘నేనిప్పటివరకు చేసిన అన్ని పాత్రలతో పోలిస్తే ఈ చిత్రంలోని సాక్షి పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. నా కంఫర్ట్ జోన్ నుండి నన్ను బయటకు నెట్టివేసిన పాత్ర’’ అన్నారు. -
ఓటీటీలోనే మారా!
మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘మారా’. నూతన దర్శకుడు దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘చార్లీ’ చిత్రానికి ఇది రీమేక్. దుల్కర్ సల్మాన్ చేసిన పాత్రను మాధవన్ చేశారు. హీరోయిన్ పార్వతి పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. లాక్డౌన్ ముందే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కూడా నేరుగా ఓటీటీలో విడుదల కానున్నట్టు సమాచారం. ఆల్రెడీ ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో ఈ చిత్రబృందం ఒప్పందం కుదుర్చుకుందట. ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది. -
రణసింగం నేరుగా ఓటీటీకే
విజయ్ సేతుపతి, ఐశ్వర్యా రాజేశ్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘క పే రణసింగం’. విరుమాండి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రైతుల పోరాటం నేపథ్యంలో ఉంటుంది. హీరోహీరోయిన్ రైతుల వైపు నిలబడి ఎలాంటి పోరాటం చేశారన్నది కథాంశం. లాక్డౌన్ వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను నేరుగా ఓటీటీలో(జీ ఫ్లెక్స్) విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది జీ సంస్థ. పేఫర్ వ్యూ (డబ్బు కట్టి వీక్షించడం) పద్ధతిలో ఈ సినిమా విడుదల కానుంది. విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. -
డీల్ కుదిరింది
లాక్డౌన్ వల్ల థియేటర్స్ మూతబడటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు పాపులారిటీ మరింత పెరిగింది. సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. చాలా మంది స్టార్స్ వెబ్ సిరీస్‌లోనూ నటించడానికి సై అంటున్నారు. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో మూడు సినిమాల డీల్ కుదుర్చుకున్నారని తెలిసింది. ఈ డీల్‌లో భాగంగా షాహిద్ నటించబోయే మూడు సినిమాలు నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోనే విడుదలవుతాయి. ప్రస్తుతం ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు షాహిద్. ఈ సినిమా తర్వాత చేయబోయే ‘ఆపరేషన్ క్యాక్టస్’ చిత్రం నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది. భారీ బడ్జెట్‌తో నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఆ తర్వాత ఈ ప్లాట్‌ఫామ్ కోసం మరో రెండు సినిమాలు చేయబోతున్నారు షాహిద్. -
ఓటీటీలో ఓనమ్
కేరళ పెద్ద పండగ ఓనమ్. మలయాళ సినిమాకి ప్రియమైన పండగ. ప్రతీ ఏడాది కనీసం నాలుగు కొత్త సినిమాలు ఓనమ్ స్పెషల్‌గా థియేటర్లోకి వస్తాయి. అయితే ప్రతీ ఏడాది పండగ థియేటర్స్‌లో జరిగేది. ఈ ఏడాది ఇంట్లోనే జరగనుంది. పని ఆగిపోయుండొచ్చు. కానీ పండగ ఆగకూడదు. సంబరం అస్సలు ఆగకూడదు. తాజాగా మూడు మలయాళీ సినిమాలు ఓనమ్ స్పెషల్‌గా ఇంటికి (ఓటీటీ)లోకి వస్తున్నాయి. ‘ఓటీటీలో ఓనమ్’ విశేషాలేంటో చూద్దాం. కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ టోవినో థామస్ హీరోగా జో బేబీ దర్శకత్వం వహించిన చిత్రం ‘కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్’. కేరళ టూరిజమ్‌ని ఆస్వాదించడానికి వచ్చిన ఓ విదేశీ అమ్మాయికి కేరళను పరిచయం చేసే పాత్రలో టోవినో పాత్ర ఉంటుంది. ఇదో రోడ్ మూవీ. హీరో హీరోయిన్ తమ బైక్ మీద కేరళను ఎలా చుట్టేస్తారనేది కథలో ముఖ్యభాగం. హీరోగా నటించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించారు టొవినో. ఈ చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. అంతే కాదు ఆగస్ట్ 31న ఈ చిత్రాన్ని నేరుగా టీవీలోనూ (ఏషియానెట్ ఛానెల్) ప్రసారం చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. సీ యూ సూన్ లాక్డౌన్ వల్ల సినిమా పరిశ్రమ స్తంభించిపోయింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఓ కొత్త ఛాలెంజ్ స్వీకరించారు ఫాహద్ అండ్ టీమ్. లాక్డౌన్ నిబంధనలు అనుసరిస్తూ ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించారు. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలో ఫాహద్, రోషన్ మాథ్యూ, దర్శన ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘సీ యూ సూన్’. ఈ చిత్రాన్ని చాలా శాతం వరకూ ఐ ఫోన్లోనే చిత్రీకరించారు. తప్పిపోయిన స్నేహితుడి గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటర్నెట్ సహాయంతో ఎలా వెతికి పట్టుకున్నారన్నది కథాంశం. 98 నిమిషాలు నిడివి ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. మణియరాయిలే అశోకన్ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవలే నిర్మాతగానూ మారారు. ఆయన నిర్మాణంలో వస్తున్న మరో సినిమా ‘మణియరాయిలే అశోకన్’. జాకోబ్, అనుమపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి షామ్జూ జేబా దర్శకత్వం వహించారు. అనుపమ హీరోయిన్గా నటించడం మాత్రమే కాకుండా ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగానూ పని చేశారు. ‘‘ఇలాంటి ముద్దొచ్చే ప్రేమకథను నిర్మించడం చాలా గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు నటుడు దుల్కర్. ఈ సినిమాలో దుల్కర్ ఓ అతిథి పాత్ర చేశారని కూడా టాక్. ఈ చిత్రం నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. -
ఓటీటీకే ఓటు
థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అనిశ్చితిలో దక్షిణాదిన ఓటీటీ బాట పట్టిన తొలి సినిమా సూర్య నిర్మించిన ‘పొన్ మగళ్ వందాళ్’. జ్యోతిక లీడ్ రోల్లో నటించారు. ఈ నిర్ణయం వల్ల తమిళ డిస్ట్రిబ్యూటర్స్ సంఘం నుంచి సూర్యకు బెదిరింపులు ఎదురయ్యాయి. ఇకపై సూర్య నటించే సినిమాలను థియేటర్స్‌లో ప్రదర్శించమన్నారు. ఇది జరిగి ఆల్రెడీ మూడు నెలలయింది. కానీ ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు ఓటీటీలో విడుదలకు రెడీ కావడంతో పంపిణీదారుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదనే చెప్పాలి. మీడియమ్ బడ్జెట్ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఇప్పుడు పెద్ద బడ్జెట్ చిత్రాలు కూడా రాబోతున్నాయి. థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారు? తెరిస్తే ప్రేక్షకులు థియేటర్స్ వరకూ వస్తారా? రారా అన్నది ఇంకా ప్రశ్నార్థకమే. అందుకే సూర్య మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నటించిన పెద్ద బడ్జెట్ సినిమా ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’) చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సూర్య బాటలోనే పలువురు తమిళ స్టార్ హీరోలు తమ సినిమాలు కూడా ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారని టాక్. విజయ్ నటించిన ‘మాస్టర్’, విశాల్ నటించిన ‘చక్ర’, ధనుష్ ‘జగమే తందిరం’, ‘జయం’ రవి ‘భూమి’ కూడా ఓటీ టీలో విడుదలవుతాయని టాక్. ఈ చిత్రాల వివరాలు చూద్దాం. మాస్టర్ తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్’. లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. ఈ సినిమాలో కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో నటించారు విజయ్. ఆ మధ్య ‘మాస్టర్’ ఓటీటీలో వస్తోందనే వార్తలను ఈ చిత్రనిర్మాత గ్జేవియర్ బ్రిట్టో కొట్టిపారేశారు. ‘మాస్టర్’ కచ్చితంగా థియేటర్స్‌లోనే వస్తాడని స్పష్టం చేశారు. కానీ ఈ సినిమా ఓటీటీలోనే విడుదల కానుందనే వార్త మరోసారి ప్రచారంలోకి వచ్చింది. మరి.. ‘మాస్టర్’ ప్లాన్ ఏంటో చూడాలి. జగమే తందిరం ధనుష్ హీరోగా నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘జగమే తందిరం’. తెలుగులో ‘జగమే తంత్రం’గా విడుదల కానుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. యస్. శశికాంత్ నిర్మాత. ఈ చిత్రం మే 1న విడుదల కావాలి. అయితే కరోనా వల్ల వాయిదా పడింది. మీకు ఇబ్బంది అయితే ఓటీటీలో అయినా విడుదల చేసుకోండి అని ధనుష్ తన నిర్మాతలకు చెప్పినట్టు చిత్రబృందం ఆ మధ్య తెలిపింది. భూమి ‘జయం’ రవి, నిధీ అగర్వాల్ నటించిన చిత్రం ‘భూమి’. రైతుల సమస్యల కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం కూడా మే 1న విడుదల కావాలి. కానీ వాయిదా సూరరై పోట్రు సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా విడుదలవుతుంది. పైలట్ కావాలని కలలుకనే వ్యక్తిగా సూర్య కనిపించనున్నారు. ఆయన గురువుగా మోహన్‌బాబు నటించారు. సూర్య సొంత బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాను అమేజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు సూర్య. ‘‘సినిమాను ప్రేక్షకుల వద్దకు సరైన సమయంలో తీసుకెళ్లడం నిర్మాత పని. ఈ నిర్ణయాన్ని నటుడిగా కాదు.. నిర్మాతగా తీసుకున్నాను. మళ్లీ థియేటర్స్ ప్రారంభం అయి అందరూ సంతోషంగా థియేటర్స్‌కి వెళ్లే సమయానికి మరో సినిమాతో సినిమా హాళ్లలో వినోదం అందిస్తాను’’ అన్నారు సూర్య. అలాగే కోవిడ్ కోసం కష్టపడుతున్న వారికి 5 కోట్లు విరాళాన్ని (ఈ చిత్రం రిలీజ్ ఖర్చులలో నుంచి) కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. చక్ర విశాల్ హీరోగా నటించి, నిర్మించిన యాక్షన్ చిత్రం ‘చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కథానాయికలు. ఆన్లైన్ మోసాల నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుంది. యంయస్ ఆనందన్ దర్శకుడు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల విడుదలయిన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం కూడా ఓటీటీలోనే రిలీజ్ అని సమాచారం. థియేటర్స్ ఓపెన్ అయ్యేవరకూ వేచి చూడటం కన్నా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఓటీటీయే బెస్ట్ అనే ఆలోచనతో ఓటీటీకే స్టార్స్ ఓటు వేస్తున్నారని ఊహించవచ్చు. నిర్మాతకు లాభసాటిగా ఉంటే ఓటీటీయే బెస్ట్ అని అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. మళ్లీ థియేటర్స్‌కి వెళ్లడం సాధారణం అయ్యాక సినిమాలను ఎప్పటిలానే నేరుగా థియేటర్స్‌లోనే విడుదల చేస్తారు. ఎందుకంటే ‘బిగ్ స్క్రీన్’లో సినిమా చూస్తే ఆ అనుభూతే వేరు. ఇది మొత్తం సినిమా పరిశ్రమ అంటున్న మాట. -
వి ఇంటికి వస్తోంది
‘‘పన్నెండేళ్లుగా నా కోసం మీరు థియేటర్‌కు వచ్చారు. ఇప్పుడు నేను మీ కోసం, మీకు ధన్యవాదాలు చెప్పేందుకు మీ ఇంటికే వస్తున్నాను. మీ స్పందన తెలుసుకోవాలనే ఉత్సుకతతో పాటు.. ‘వి’ సినిమా రిలీజ్ విషయంలో కొంచెం నెర్వస్‌గానూ అనిపిస్తోంది’’అంటూ హీరో నాని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. సుధీర్‌బాబు, నాని, నివేదా థామస్, అదితీ రావ్ హైదరి ముఖ్య పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వి’. ‘దిల్’రాజు, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా థియేటర్లో విడుదలవుతుందా? ఓటీటీలోనా? అనే సందిగ్ధం చాలా రోజులుగా ఉండేది. అయితే ‘వి’ సినిమా సెప్టెంబరు 5న ఓటీటీలోనే (అమెజాన్ ప్రైమ్) విడుదల కానున్నట్లు నాని స్పష్టం చేశారు. తన సోషల్ మీడియాలో నాని ఓ లేఖను షేర్ చేశారు.. దాని సారాంశం ఇలా... ‘‘నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన 25వ చిత్రం డిజిటల్ ఫార్మెట్లో విడుదలవుతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇలా డిజిటల్ ఫార్మెట్లో విడుదల కావడం నాకు గొప్ప మధురానుభూతిగా మిగిలిపోయేలా సెలబ్రేట్ చేసుకుందాం (అభిమానులను ఉద్దేశించి). థియేటర్లు తెరుచుకోగానే ‘టక్ జగదీశ్’ సినిమాతో సిద్ధంగా ఉంటా.. ఒట్టు’’ అని నాని పేర్కొన్నారు. -
ఓటీటీలో విడుదల
థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. ఒకవేళ ఓపెన్ అయినా ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా? అనేది పెద్ద డౌట్. ఆల్రెడీ చిన్న సినిమాలు మెల్లిగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. హిందీలో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టాయి. కానీ తెలుగులో పెద్ద సినిమా ఏదీ ఓటీటీలో విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం నేరుగా ఓటీటీలో (అమెజాన్ ప్రైమ్) విడుదల కానున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే వారం రానుందని తెలిసింది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించారు. దాదాపు 35 కోట్ల వ్యయంతో ఈ సినిమా రూపొందినట్టు సమాచారం. సౌత్ లో ఇంత వ్యయంతో రూపొంది, ఓటీటీలో విడుదలవుతున్నతొలి భారీ చిత్రమిదే అవుతుంది. అదితీ రావ్ హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నాని విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇది ఆయన కెరీర్ లో 25వ చిత్రం. -
పదకొండు భాషల్లో థ్రిల్లర్
థియేటర్స్ లేకపోవడంతో సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఓటీటీల కోసమే సినిమాలు తయారు చేస్తున్నారు. లాక్ డౌన్ సమయం నుంచి పలు సినిమాలను ‘పే అండ్ వ్యూ’ (ఆన్లైన్లో డబ్బు చెల్లించి సినిమా చూసే విధానం) పద్ధతిలో విడుదల చేస్తున్నారు. తాజాగా ‘థ్రిల్లర్’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్సరా రాణి, రాకీ కచ్చి జంటగా నటించిన ఈ సినిమా ఆర్జీవీ వరల్డ్, శ్రేయాస్ ఈటీ ద్వారా ఆగస్ట్ 14 రాత్రి 9 గంటలకు విడుదల కానుంది. 200 రూపాయిలు చెల్లించి ఈ సినిమాను చూడొచ్చు. 11 భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, భోజ్ పురి, గుజరాతి, ఒడియా తదితర భాషలు) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ –‘ఒక ఇంట్లోనే జరిగే కథతో తీసిన సినిమా ‘థ్రిల్లర్’. ఎరోటిక్ జానర్ లో కొన్ని చిత్రాలు చేయాలని ప్లాన్ చేశాను. అందులో ఒకటి ఈ ‘థ్రిల్లర్’ చిత్రం. ఒక రాత్రి ఓ పెద్ద బంగ్లాలో ఓ అమ్మాయికి ఎదురయ్యే సంఘటనలే ఈ చిత్ర కథాంశం. నేను అనుకున్న పాత్రకు అప్సరా రాణి చక్కగా సరిపోయింది’’ అన్నారు. అలాగే వర్మ నుంచి ‘డేంజరస్లీ క్రై ం’, అర్నబ్, అల్లు’ అనే చిత్రాలు రానున్నాయి. ‘‘పవర్ స్టార్, అల్లు, అర్నబ్’ చిత్రాలు ఆయా వ్యక్తులను ప్రొవోక్ (రెచ్చగొట్టే విధంగా) చేయడానికేనా’’ అని అడిగితే ‘కచ్చితంగా అందుకే’ అన్నారు వర్మ. -
ఓటీటీలో సడక్ 2
ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సడక్ 2’. ఆదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్, పూజా భట్ కీలక పాత్రలు చేశారు. తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో తొలిసారి ఆలియా నటించిన చిత్రమిది. 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘సడక్’కి ఇది సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఆలియా, సంజయ్ దత్ లుక్స్‌ను విడుదల చేశారు. నేడు ‘సడక్ 2’ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూతపడటం, ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు యూనిట్ మొగ్గుచూపింది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈనెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
ప్రేమలో థ్రిల్
‘ఈ రోజుల్లో’ ఫేమ్ శ్రీ మంగం, శశాంక్ హీరోలుగా అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రణవం’. కుమార్ జి. దర్శకత్వంలో చరిత అండ్ గౌతమ్ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై తనూజ. ఎస్ నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా తనూజ ఎస్. మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కుమార్‌కి ఇది తొలి సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల ఆలోచనా విధానానికి తగ్గట్టుగా తెరకెక్కించారు. సంగీతం, నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి. పద్మారావ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. చాలా కాలం తర్వాత ఆర్.పి. పట్నాయక్, ఉష కలిసి మా చిత్రంలో ఓ పాటను పాడారు. సునీత, అనురాగ్ కులకర్ణి పాడిన పాటలకూ మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మార్గల్ డేవిడ్, సహ నిర్మాతలు: వైశాలి, అనుదీప్. -
కథ విని ఎగ్జయిట్ అయ్యాను
‘‘నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఆసక్తి. కానీ మాది బిజినెస్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ మెంబర్స్‌ని కన్వి¯Œ ్స చేసి ఈ రంగంలోకి వచ్చాను. నటన నాకు ఇష్టమైన పని కావడంతో సంతృప్తినిస్తోంది’’ అని రూపేష్ కుమార్ చౌదరి అన్నారు. ఆయన హీరోగా నటిస్తోన్న చిత్రం ‘22’. దర్శకులు పూరి జగన్నాథ్, వీవీ వినాయక్, మారుతిల వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన శివకుమార్ బి. తెరకెక్కిస్తున్నారు. మా ఆయి ప్రొడక్ష¯Œ ్స పతాకంపై సుశీలా దేవి నిర్మిస్తున్నారు. రూపేష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘శివ చెప్పిన ‘22’ కథ విని ఎగ్జయిట్ అయ్యాను. మొదటి సినిమాలోనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడం గర్వంగా ఉంది. ‘టెంపర్’లో ఎన్టీఆర్, ‘గబ్బర్‌సింగ్’లో పవన్ కల్యాణ్ చేసిన పోలీస్ క్యారెక్టర్లతో పాటు కొంత మంది రియల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్‌ని స్ఫూర్తిగా తీసుకుని నటించాను. మమ్మల్ని సపోర్ట్ చేసిన వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, సాయితేజ్, వి.వి. వినాయక్, సి. కల్యాణ్, పూరి జగన్నాథ్, మారుతిగార్లకు థ్యాంక్స్. బి.ఎ రాజుగారి వల్లే ఈ సినిమాకు అంత హైప్ వచ్చింది. మా సినిమా ఓటీటీ, హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం కూడా సంప్రదిస్తున్నారు. కానీ థియేటర్లు ప్రారంభం కాగానే సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. -
దిల్ కొల్లగొట్టింది
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచారా’ అందరి çహృదయాల్ని కొల్లగొట్టింది. కేవలం హృదయాలనే కాదు పలు రికార్డులనూ కొల్లగొట్టిందని లెక్కలు చెబుతున్నాయి. ముఖేశ్ చాబ్రా దర్శకత్వంలో సుశాంత్ సింగ్, సంజనా సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘దిల్ బేచారా’. కరోనా కారణంగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. పోయిన వారం ఈ చిత్రం హాట్‌స్టార్ లో రిలీజ్ అయింది. తొలి రోజు సుమారు 95 మిలియన్ వ్యూస్ సాధించిందట ‘దిల్ బేచారా’. అంటే.. సుమారు తొమ్మిదిన్నర కోట్లు. ఒకవేళ ఇది థియేట్రికల్ బిజినెస్‌లో లెక్కకట్టి చూస్తే... ప్రస్తుతం మన దగ్గర టికెట్ ధర 150 ఉంది అంటే ఈ సినిమా తొలి రోజే 1500 కోట్లు బిజినెస్ చేసినట్టు. ప్రస్తుతం ఒక్కో సినిమా వంద కోట్లు వసూళ్లను చేరుకోవాలంటే సుమారు 4 రోజులు పడుతుంది. కానీ ‘దిల్ బేచారే’ని తొలిరోజే తొమ్మిదిన్నర కోట్ల మంది వీక్షించడం రికార్డే. సుశాంత్ చివరి చిత్రం కావడం తో తప్పక చూడాలని ప్రేక్షకులు అతనికి ప్రేమగా ఇచ్చిన నివాళి ఇది. హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ తో సంబంధం లేకుండా ఈ చిత్రాన్ని అందరికీ అందుబాటులో ఉంచారు. అలాగే మొదటిరోజు ఎక్కువ మంది చూస్తూ ఉండటంతో హాట్‌స్టార్ క్రాష్ అయిందని కూడా వార్తలు వచ్చాయి. -
సహాయం కోసం నాన్నకు ఫోన్ చేశా!
ఒక్కో పాత్రలోకి వెళ్లడానికి ఒక్కో విధంగా వర్క్ చేస్తుంటారు నటీనటులు. రీసెర్చ్ చేయడం, సంబంధిత మనుషులతో మాట్లాడటం, డైలీ రొటీన్ మార్చడం వంటి ఎంతో కృషి ఒక పాత్ర వెనక ఉంటుంది. ‘‘సుకన్య పాత్ర కోసం చాలా రీసెర్చ్ చేశాను అంటున్నారు’’ శ్రుతీహాసన్. ఆమె నటించిన హిందీ చిత్రం ‘యారా’ ఓటీటీలో విడుదల కానుంది. విద్యుత్ జమాల్ హీరో. ఈ చిత్ర కథాంశం 1970లోజరుగుతుంది. ‘‘అప్పటి పాత్రలోకి వెళ్లడానికి మా నాన్న(కమల్ హాసన్) ఇచ్చిన సూచనలు ఉపయోగపడ్డాయి’’ అన్నారు శ్రుతి. దాని గురించి మాట్లాడుతూ – ‘‘ఏ పాత్రని అయినా నా స్టయిల్ లో చేయాలనుకుంటాను. నా పాత్రల గురించి నాన్నతో పెద్దగా చర్చించను. కానీ ‘యారా’లో సుకన్య పాత్ర ఎలా చేయాలో అర్థం కాలేదు. అందుకే సహాయం కోసం నాన్నకు ఫోన్ చేశాను. ‘మనకు పెద్దగా పరిచయం లేని పాత్రలు చేస్తున్నప్పుడు ఆ పాత్రను ముందు అర్థం చేసుకోవాలి. కట్టూబొట్టూ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ఆ పాత్ర గురించి తెలిసినవాళ్లు ఇలా ఉంది ఏంటి అనుకోకుండా చేయాలి అంటూ నాన్న చాలా సూచనలు ఇచ్చారు. అవి చాలా ఉపయోగపడ్డాయి. ఇలాంటి పాత్రలు పోషించినప్పుడు ‘బాగానే చేసింది’ అనేది కూడా పెద్ద ప్రశంసలాగా ఉంటుంది’’ అని శ్రుతీహాసన్ పేర్కొన్నారు. -
నువ్వా? నేనా?
ఓటీటీలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటంతో సినిమా ఇండస్ట్రీ దృష్టి ఇప్పుడు వాటిపై పడింది. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్లు, ప్రముఖ దర్శకులు, పేరున్న నిర్మాణ సంస్థలు సైతం డిజిటల్ వేదికవైపు అడుగులేస్తున్నారు. సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లు ఇప్పటికే వెబ్ సిరీస్‌లకు సై అన్నారు. ఈ జాబితాలోకి తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ చేరనున్నారని సమాచారం. ఆమె ఓ వెబ్ సీరీస్‌లో నటించేందుకు పచ్చజెండా ఊపారని టాక్. ఇందులో రకుల్ ద్విపాత్రాభినయం చేయనున్నారట. అది కూడా కవలలుగా నటించనున్నారని తెలిసింది. ప్రతి విషయంలోనూ ఈ కవలలు నువ్వా? నేనా? అన్నట్టు ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారని, ఆ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా సాగుతాయని టాక్. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ రకుల్ డబుల్ రోల్ చేయలేదు. సో.. ఆమె రెండు పాత్రల్లో కనిపిస్తే అభిమానులకు పండగలా ఉంటుంది. -
వదలను
నటుడు భానుచందర్ ప్రధానపాత్రలో జంగాల నాగబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వదలను’. అమీర్ సమర్పణలో మహమ్మద్ ఖలీల్ నిర్మించిన ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కావాల్సింది. ‘‘కరోనా కారణంగా థియేటర్స్ మూత పడటంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నాం. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. మా సినిమా రష్ చూసిన ఓ ఓటీటీ సంస్థ విడుదల చేయడానికి ముందుకు వచ్చింది’’ అన్నారు మహమ్మద్ ఖలీల్. -
నిర్మాతగా సుష్మిత
‘రంగస్థలం, సైరా నరసింహారెడ్డి’ సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల నిర్మాతగా మారారు. భర్త విష్ణుప్రసాద్‌తో కలసి ఆమె ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. విష్ణు ప్రసాద్, సుష్మితాలతో కలిసి జీ5 సంస్థ ఓ వెబ్ సిరీస్‌ని నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్‌కి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ‘ఓయ్’ ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుష్మితా కొణిదెల మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లోని ఓ పోలీస్, కొంతమంది కరుడుగట్టిన నేరస్తుల కథల ఆధారంగా ఈ సిరీస్ ఉంటుంది. మా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో నిర్మిస్తున్న తొలి వెబ్ సిరీస్ కోసం ఓటీటీ వేదిక ‘జీ5’తో అసోసియేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సిరీస్ షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు. -
ఓటీటీ హోటల్ ఫుడ్లాంటిది
‘‘ఎన్ని టెక్నాలజీలు వచ్చినా చిత్రపరిశ్రమకు ఏమీ కాదు. థియేటర్స్ మూసి ఉన్నాయి కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం ప్రేక్షకులు ఓటీటీవైపు మొగ్గు చూపుతున్నారు. కరోనా పరిస్థితులు పోయి మామూలు స్థితి రాగానే జనం థియేటర్స్‌కి వస్తారు. థియేటర్ అంటే ఒక ఎమోషన్. ఎన్ని మాధ్యమాలు వచ్చినా థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వలేవు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు హోటల్ ఫుడ్లాంటివి. థియేటర్లో సినిమా అమ్మ చేతివంట, భార్య చేతివంట లాంటిది’’ అన్నారు ఎస్కేఎన్. విజయ్ దేవరకొండ హీరోగా నిర్మించిన ‘టాక్సీవాలా’తో సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ఎస్కేఎన్. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎస్కేఎన్ విలేకరులతో మాట్లాడుతూ – ‘‘టాక్సీవాలా’ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో ‘బన్నీ’ వాస్ నిర్మాతగా వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించటం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆదే ఉత్సాహంతో మారుతి దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాను. ఆ సినిమాలో ఓ పెద్ద హీరో నటిస్తున్నారు. మారుతి పర్యవేక్షణలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం ఓ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాను. ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా, డైరెక్టర్ సాయి రాజేశ్ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అల్లు శిరీష్ హీరోగా రాబోతున్న సినిమాకి కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాను’’ అన్నారు. -
ప్లాట్‌ఫామ్ ఏదైనా కథ బాగుంటే చూస్తారు
‘‘థియేటర్ లేదా ఓటీటీ.. ప్లాట్‌ఫామ్ ఏదైనా కంటెంట్ ఆసక్తికరంగా ఉంటే ప్రేక్షకాదరణ తప్పకుండా ఉంటుంది’’ అన్నారు నవీన్‌చంద్ర. ఎన్. శ్రీకాంత్ దర్శకత్వంలో నవీన్ చంద్ర, సలోని లూథ్రా జంటగా నటించిన చిత్రం ‘భానుమతి రామకృష్ణ’. ఆహా ప్లాట్ఫామ్లో వచ్చే నెల 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నవీన్‌చంద్ర చెప్పిన విశేషాలు. ► ఈ చిత్రంలో 30 ఏళ్ల వయసుదాటి పెళ్లి కాని రామకృష్ణ పాత్రలో నటించాను. ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తిత్వం రామకృష్ణది. కష్టాల్లో ఉన్నా నవ్వుతూ ఉంటాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే తెనాలి అబ్బాయి, విజయవాడ అమ్మాయి మధ్య సాగే లవ్‌స్టోరీ ఆసక్తిగా ఉంటుంది. బైక్ రైడింగ్, కిస్‌లు, హగ్స్ లాంటి సీన్స్ ఉండే లవ్‌స్టోరీ కాదిది. సహజత్వానికి దగ్గరగా ఈ సినిమా కథనం సాగుతుంది. ఒక మనిషి తనకు పూర్తిగా తెలియని ఓ మనిషి గురించి ఎలా ఆలోచిస్తున్నాడు? అతన్ని ఏ కోణంలో చూస్తాడు? అనే వాస్తవిక భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు సినిమాలో ఉంటాయి. ► ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా దర్శకుడు శ్రీకాంత్ పరిచయం అయ్యారు. ఓ సందర్భంలో ‘భానుమతి రామకృష్ణ’ కథ చెప్పారు. డైరెక్షన్ చేయమని నేనే చెప్పాను. బట్టతల, కొంచెం బొద్దుగా ఉండటం, తెనాలి యాస ఇలా.. రామకృష్ణ పాత్రను ఊహించుకున్నారు శ్రీకాంత్. నా ఊహల్లో ఉన్న రామకృష్ణ గురించి శ్రీకాంత్‌కు చెప్పాను. ఇద్దరం మాట్లాడుకుని ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యే రామకృష్ణను రెడీ చేశాం. ► ఈ సినిమాను ఏ ప్లాట్ఫామ్లో విడుదల చేయాలో ముందుగా ప్లాన్ చేయలేదు. ప్రస్తుతం థియేటర్స్ లేవు. ఓటీటీ బాగుందని ఈ ప్లాట్ఫామ్లో విడుదల చేస్తున్నాం. భవిష్యత్‌లో ఓటీటీల హవా పెరగవచ్చు. థియేటర్స్ ఉన్నప్పుడు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఒక సినిమా ప్రేక్షకుడికి నచ్చి ఆ సినిమాను మళ్లీ చూడాలనుకున్నప్పుడు థియేటర్లో అయితే టికెట్ కొనాలి. అదే ఓటీటీలో మళ్లీ టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. అయితే ఓ ఐదొందల మంది మధ్యలో థియేటర్లో వినోదాన్ని ఆస్వాదించే అనుభూతి ఎప్పుడూ బాగుంటుంది. అదొక ఫెస్టివల్లాంటిది. కరోనా వల్ల పరిస్థితులు బాగాలేవు. మునుపటి సాధారణ రోజులు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఈ లాక్‌డౌన్‌ని టీవీ చూడటం, ఇల్లు శుభ్రం చేయడం, వార్తలను ఫాలో కావడం, వర్కవుట్ చేయడం, కొత్త విషయాలను నేర్చుకోవడానికి కేటాయించాను. ► తెలుగులో రానా ‘విరాటపర్వం’, కీర్తీ సురేష్ ‘మిస్ ఇండియా’ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నాను. అలాగే వరుణ్ తేజ్ సినిమాలో బాక్సర్‌గా కనిపిస్తాను. దర్శకులు మంచి పాత్రలతో నన్ను అప్రోచ్ అవుతుండటం సంతోషంగా ఉంది. తమిళంలో ధనుష్ నటించిన ‘పటాస్’ (తెలుగులో ‘లోకల్‌బాయ్’)లో విలన్‌గా చేశాను. ఆ సినిమా తర్వాత తమిళంలో నాకు మంచి ఆఫర్సే వచ్చాయి. కాకపోతే లాక్డౌన్ వల్ల కథలు వినడం కుదరలేదు. -
ఎనీ టైమ్ థియేటర్
‘‘థియేటర్లు తాత్కాలికంగా మూతబడటంతో ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల హవా నడుస్తోంది. తాజాగా మేం ప్రవేశపెడుతున్న ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్) ప్లాట్‌ఫామ్‌కు కూడా ప్రేక్షకాదరణ ఉంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రేయాస్ శ్రీనివాస్. శ్రేయాస్ఈటీ అనే యాప్ ద్వారా ఏటీటీ (ఎనీటైమ్ థియేటర్) అనే ఆన్లైన్ థియేటర్ మల్టీప్లెక్స్‌ను స్టార్ట్ చేశారు శ్రీనివాస్. ఈ సందర్భంగా శ్రీనివాస్ విలేకర్లతో మాట్లాడుతూ – ‘‘ఏటీటీలో కొన్ని స్క్రీన్స్ ఉంటాయి. ఇటీవలే ఓ స్క్రీన్ (ఆర్జీవీవరల్డ్)లో రామ్‌గోపాల్‌వర్మగారి ‘క్లైమాక్స్’ చిత్రం విడుదలైంది. కంటెంట్ క్రియేటర్స్‌కు, చిన్న సినిమాల నిర్మాతలకు ఈ ఏటీటీ ప్లాట్‌ఫామ్ బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి మా ఏటీటీ ప్లాట్ఫామ్లో పది నుంచి 15 స్క్రీన్స్‌ను తెలుగుకి, పది స్క్రీన్స్‌ను కన్నడ, మలయాళం, తమిళ చిత్రాలకు ఐదు చొప్పున కేటాయించాం. వచ్చే ఏడాది మార్చికల్లా యాభై స్ట్రయిట్ సినిమాలను మా ఏటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదల చేయాలన్నదే మా టార్గెట్. థియేటర్లో చూసే పెద్ద సినిమాల ఎక్స్‌పీరియన్స్‌లో ఉండే కిక్కే వేరు. ఇదివరకు మా గుడ్సినిమాస్ గ్రూప్ బ్యానర్లో ‘ఈ రోజుల్లో’ , ‘రోజులుమారాయి’, ‘రొమాన్స్’, ‘వెంకటాపురం’ వంటి సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఐదు సినిమాలు మా ప్రొడక్షన్లో ఉన్నాయి’’ అన్నారు. -
ఇది అన్యాయం
‘‘ఇలా జరగడానికి వీల్లేదు. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలంటే, అతనికి నిజమైన నివాళి ఇవ్వాలంటే ‘దిల్ బేచారా’ సినిమాని థియేటర్లో విడుదల చేయాల్సిందే. లేకపోతే తనకు అన్యాయం చేసినవాళ్లు అవుతారు’’ అంటూ పలువురు నెటిజన్లు ‘దిల్ బేచారా’ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ సింగ్ నటించిన చివరి సినిమా ఇది. ఈ చిత్రాన్ని జూలై 24న ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నిర్ణయం సుశాంత్ అభిమానులను నిరుత్సాహపరిచింది. ‘‘సుశాంత్‌ని చివరిసారిగా బిగ్ స్క్రీన్ మీద చూసే అవకాశాన్ని మాకు ఇవ్వండి. ఇది మా విన్నపం’’ అంటున్నారు ఫ్యాన్స్. ‘ఫాక్ప్ స్టార్ స్టూడియోస్’ నిర్మించిన ఈ చిత్రాన్ని డిస్నీ, హాట్‌స్టార్ విడుదల చేయనున్నాయి. మరి.. ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంపట్ల సుశాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి, సంస్థ అధినేతలు నిర్ణయాన్ని మార్చుకుంటారా? వేచి చూడాలి. సుశాంత్ గత చిత్రం ‘డ్రైవ్’ కూడా ఓటీటీలోనే విడుదలైంది. -
తమన్నా ఆహా
తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళుతున్నారు తమన్నా. కేవలం కథానాయికగానే కాదు.. అతిథి పాత్రల్లో, ప్రత్యేక పాటల్లోనూ మెరుస్తున్నారీ మిల్కీ బ్యూటీ. తెలుగులో ఆమె నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, బాలీవుడ్లో నటించిన ‘బోలే చుడియా’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌తో కలిసి ‘సీటీమార్’ చిత్రంలో నటిస్తున్నారు తమన్నా. అయితే ‘ది నవంబర్స్ స్టోరీ’ అనే తమిళ వెబ్ సిరీస్‌తో డిజిటల్ మాధ్యమంలోనూ ఎంట్రీ ఇస్తున్నారు తమన్నా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక నిర్మాత అల్లు అరవింద్ స్టార్ట్ చేసిన తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో తమన్నా మెరవనున్నారట. ‘ఆహా’లో ఓ స్పెషల్ టాక్ షోను ప్లాన్ చేశారని, ఆ షోకి తమన్నా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారని సమాచారం. -
తను నీడలో ఉంది
‘అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నిత్యా మీనన్. అంతేకాదు.. తన నటనతో మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ ప్రేక్షకుల హృదయాల్లోనూ చోటు సంపాదించుకున్న ఈ మలయాళ బ్యూటీ తొలిసారి ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. మాధవన్, అమిత్ సాధ్ నటించిన సూపర్ హిట్ ‘బ్రీత్’ వెబ్ సిరీస్‌కి ఇది రెండవ సీజన్. రెండో సీజన్లో అమిత్ సాధ్ కూడా కీలక పాత్రలో నటించారు. జూలై 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ ప్రసారం కానుంది. కాగా అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్‌లకు ఇది తొలి వెబ్ సిరీస్ కావడం విశేషం. ‘తను నీడలో ఉంది... కనుగొనబడటానికి వేచి చూస్తోంది’ అంటూ ఈ సిరీస్ తొలి పోస్టర్ని విడుదల చేశారు. -
అది ఆర్జీవీ సీక్రెట్!
‘‘ఆర్జీవీ వరల్డ్’లో నా అభిరుచికి తగ్గ సినిమాలే ఉంటాయి. చూడాలనుకున్నవాళ్లే చూస్తారు. నా సినిమాలతో ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచాలనే ఉద్దేశం నాకు లేదు. ఇంటిల్లిపాదీ చూడదగ్గ చిత్రా లు నేను తీయను. ఇంట్లోనే ఒక్కొక్కరు వేరు వేరు గదుల్లో ఒంటరిగా చూసే సినిమాలు తీస్తాను’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆర్జీవీ వరల్డ్’ అనే ఓ యాప్‌ను సిద్ధం చేస్తున్నారు రామ్‌గోపాల్‌వర్మ. ‘క్లైమాక్స్’ చిత్రం ఈ యాప్‌లో విడుదల కానుంది. అలాగే వర్మ నేతృత్వంలోని మరో చిత్రం ‘కరోనా వైరస్’ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కాబోతుంది. ‘ఆర్జీవీ వరల్డ్ యాప్’, ఓటీటీ ప్లాట్ఫామ్స్ల హవా వంటి విషయాలపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడారు. ఆ విశేషాలు.. ► నాటకాల నుంచి సినిమాలు వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమాలు వచ్చాయి. నాలుగేళ్ల క్రితం నుంచీ వెబ్‌సిరీస్ అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడిదో (డిజిటల్ ప్లాట్‌ఫామ్) ప్యారలల్ ఇండస్ట్రీ అయిపోయింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్వంటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో వ్యూయర్షిప్ పెరుగుతుందంటే ఆడియన్స్ చూస్తున్నట్లేగా. ఓటీటీ ప్లాట్ఫామ్స్వారు కంటెంట్ కోసం కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ► ఇండస్ట్రీలో 90శాతం ఫ్లాప్‌లు ఉంటాయి. ఒక సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమాకు వీకెండ్ ఓపెనింగ్స్ రావాలి. దీని పబ్లిసిటీ కోసం నిర్మాతలు డబ్బు ఖర్చు పెడతారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, థియేటర్స్ ఇలా మరికొన్ని పనులను చక్కబెట్టుకోవాలి. ఇంతా చేసిన తర్వాత ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా? రారా? అనే టెన్షన్. మొబైల్లో సినిమా చూసినప్పుడు థియేటర్ ఫీల్‌ని మిస్ అవుతాం అనే ఫీల్‌ని పక్కనపెడితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ వల్ల పబ్లిసిటీ ఖర్చు తగ్గుతుంది. కొందరు నిర్మాతలకు ఇది ప్లస్. ► పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలు, ‘బాహుబలి’ వంటి విజువల్ వండర్ సినిమాలయితే థియేటర్లో చూడటానికి బాగుంటాయి. కానీ కొన్ని స్టోరీ బేస్డ్, కంటెంట్ ఉన్నవి ఓటీటీలో వర్కౌట్ అవుతాయి. అలాగే ఫీచర్ ఫిల్మ్ అంటే కనీసం రెండు గంటల నిడివి ఉండాలన్న కండీషన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉండదు. నా ‘క్లైమాక్స్’ మూవీ నిడివి 55నిమిషాలు మాత్రమే. ► ‘ఆర్జీవీ వరల్డ్’ ఐడియా నాకు ఎప్పటినుంచో ఉంది. ఇందులో ‘పే ఫర్’ వ్యూ విధానంలో చూడొచ్చు. చూసిన ప్రతిసారీ చార్జ్ చేస్తాం. ► కమల్‌హాసన్ ‘డైరెక్ట్ హోమ్’ ఫార్మట్‌లో ‘విశ్వరూపం’ విడుదల ప్లాన్ చేశారు. అప్పుడు సెటప్ బాక్స్‌లు అందరికీ లేవు. కానీ ఈ నిర్ణయాన్ని చివరి నిమిషంలో విరమించుకున్నారు. అయితే ఇప్పుడు మాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే థియేటర్స్ ఓపెన్ చేసి లేవు. ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా తెలియదు. ► నేను తీసిన తొలి కుటుంబ కథాచిత్రం ‘కరోనా వైరస్’. ఇది నా దృష్టిలో ఒక హారర్ ఫిల్మ్. దెయ్యం బదులు వైరస్ ఉంది. అంతే తేడా. ఇన్ని దశాబ్దాల తర్వాత ఎవరో దగ్గుతున్నారని మనం భయపడుతున్నామంటే అది హారర్ సినిమాయే కదా! యాక్చువల్లీ ఇప్పుడు ప్రపంచం అంతా ఓ హారర్ ఫిల్మ్‌లా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను పాటిస్తూనే ‘కరోనావైరస్’ చిత్రాన్ని చేశాం. ఆర్టిస్టులను ఒక చోటుకు చేర్చి సినిమాను ఎలా పూర్తి చేశానన్నది ఆర్జీవీ సీక్రెట్. ► ఫిల్మ్‌మేకింగ్ అనేది టీమ్ ఎఫర్ట్ అని నమ్ముతాను. అయితే సినిమాకు ఎవరు రూపకల్పన చేస్తారనేది ముఖ్యం. మా దగ్గర నేను చేస్తాను. ఎవరు ఎక్కువ కష్టపడితే వారికి క్రెడిట్ ఇస్తాను. ‘కరోనా వైరస్’ సినిమాకు అగస్త్య మంజు డైరెక్టర్. ఆలోచన నాది. ఈ సినిమా ఓటీటీలోనే విడుదలవుతుంది. ► జబ్బు, తుఫాన్, యాక్సిడెంట్... ఇలా ఏ కారణంతో అయినా మనకు చావు రావొచ్చు. ఈ జాబితాలో కరోనా వైరస్ కూడా చేరింది. కరోనా వైరస్ వెళ్లేట్లు లేదు. ఇంకేం చేస్తాం? దానితో కలిసి ఉండటమే. లాక్డౌన్ సమయంలో ‘క్లైమాక్స్, కరోనా వైరస్’ చిత్రాల పనులు చూసుకున్నాను. నేను తాత (వర్మ కుమార్తె రేవతి ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చింది)ను అయ్యానని తెలిసినప్పుడు నాకేం అనిపించలేదు. చచ్చినట్లు కరోనా వైరస్‌ను భరించాలి. నేను తాతను అయ్యానన్నది భరించాలి. ► ‘కరోనా వైరస్’ ట్రైలర్ చివర్లో ఉన్న రెండు డైలాగ్స్ సెటైర్స్ కాదు. నా సినిమాకి నప్పుతాయని పెట్టాను. డొనాల్డ్ ట్రంప్ నుంచి చైనా వరకు కరోనా విషయంలో అందరూ చేయాల్సింది చేస్తున్నారు. అందుకే నేను ఎవరిపైనా సెటైర్ వేయలేదు. ఆ అమ్మాయంటే ఇష్టం చాలామంది పోర్న్‌స్టార్స్ ఉన్నప్పటికీ ‘జీఎస్టీ’, ‘క్లైమాక్స్’ కోసం మియా మాల్కొవానే ఎందుకు తీసుకున్నానంటే ఆ అమ్మాయి అంటే నాకిష్టం. అమెరికన్ కపుల్ ఓ టూర్‌కి వెళతారు. అక్కడి వారి అనుభవాల ఆధారంగా ‘క్లైమాక్స్’ చిత్రం ఉంటుంది. హారర్, యాక్షన్ అంశాలు ఉన్నాయి. ‘ఎంటర్ ద గాళ్ డ్రాగన్’ చిత్రం షూటింగ్ ఇంకా నాలుగు రోజులు చేయాల్సి ఉంది. చైనా షూట్‌ను కంప్లీట్ చేశాం. మేం చైనా నుంచి వచ్చిన నాలుగు రోజులకు అక్కడ తొలి కరోనా కేసు నమోదైంది. -
సినిమాకి సినిమా కష్టాలు వచ్చాయి
‘‘సాధారణంగా ఎవరికైనా ఊహించని కష్టమొస్తే ‘సినిమా కష్టాలొచ్చాయి’ అంటారు. ప్రసుత్తం కరోనా వల్ల సినిమాకి, సినిమావాళ్లకి నిజంగానే సినిమా కష్టాలు వచ్చాయి’’ అన్నారు దర్శకుడు వైవీఎస్ చౌదరి. ‘సీతయ్య, దేవదాసు, లాహిరి లాహిరి లాహిరిలో’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన వైవీఎస్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వైవీఎస్ మాట్లాడుతూ– ‘‘సినిమాకు కష్టాలు రావడం కొత్తేం కాదు. కేబుల్ టీవీ, సీడీ, డీవీడీ ప్లేయర్స్, సీరియల్స్, గేమ్ షోస్, క్రికెట్, ఐపీఎల్, యూట్యూబ్, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్. వీటన్నింటినీ తట్టుకొని సినిమా థియేటర్లో నిలబడుతూనే ఉంది. నిశ్చింతగా, నిశ్చలంగా ఉండటం సినిమాకి చేతకాదు. సముద్రపు అలలాగా పడినా పైకి లేవడం సినిమాకి తెలుసు. కోవిడ్ కాదు దానికంటే ప్రమాదకరమైనది వచ్చినా థియేటర్లో సినిమా చూడాలనే ప్రేక్షకుడి కాంక్షను ఆపలేదు. థియేటర్లో సినిమా చూసే అనుభూతికి మరేదీ సాటిరాదు. కోవిడ్ వల్ల ఒంటరితనాన్ని అనుభవిస్తున్న థియేటర్లు త్వరలోనే జన సమూహాలతో ప్రకాశవంతం చెందాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
ఇప్పటికి ఇదే మంచి నిర్ణయం
సినిమా కథను పూర్తి స్థాయిలో మోసేవారే హీరోలయితే ప్రస్తుతం జ్యోతిక, విద్యాబాలన్ సూపర్ హీరోలయ్యారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సిద్ధమయ్యారు ఈ హీరోయిన్లు. జ్యోతిక ముఖ్య పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పొన్ మగళ్ వందాళ్’. విద్యాబాలన్ లీడ్ రోల్లో గణితశాస్త్రవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా రూపొందిన హిందీ సినిమా ‘శకుంతలా దేవి’. ఈ రెండు సినిమాలు వేసవిలో విడుదల కావాలి. లాక్డౌన్ కారణంగా విడుదల కాకపోవడంతో నేరుగా డిజిటల్ (అమేజాన్ ప్రైమ్‌లో) రిలీజ్ చేస్తున్నారు. డిజిటల్లో రిలీజ్ అవుతున్న తొలి తమిళ సినిమా ‘పొన్ మగళ్ వందాళ్’ అయితే హిందీలో డిజిటల్ రిలీజ్ అవుతున్న తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘శకుంతలా దేవి’. ఈ సినిమాలు ఓటీటీలో విడుదలవ్వడంతో థియేటర్‌ను ఓటీటీ దెబ్బ తీస్తుందా? అనే ప్రశ్నకు ఈ ఇద్దరూ ఈ వి«ధంగా సమాధానమిచ్చారు. విద్యాబాలన్ మాట్లడుతూ – ‘‘సినిమాలను ఓటీటీలలో విడుదల చేస్తున్నందుకు సినిమా థియేటర్స్వాళ్లు అసహనానికి గురవుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల సినిమాను థియేటర్లో విడుదల చేసే అవకాశం లేదు. దాంతో మరోదారి లేక ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని థియేటర్స్ యజమానులు అర్థం చేసుకుంటే బావుంటుంది. మళ్లీ థియేటర్స్ ప్రారంభమయ్యాక అంతా ఎప్పటిలానే ఉంటుంది. సినిమాలు థియేటర్‌కే వస్తాయి. కానీ ఇలాంటి చిత్రమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఓటీటీ లాంటివి ఉండటం మంచి పరిణామం’’ అన్నారు. జ్యోతిక మాట్లాడుతూ – ‘‘ఓటీటీలో సినిమా విడుదల చేయడమనేది కేవలం తాత్కాలికమైనది. పరిస్థితుల దృష్ట్యా అలా చేయాల్సి వచ్చింది. ఆర్టిస్టులకు లేదా దర్శకులకు థియేటర్లలో ప్రేక్షకుల కేరింతలు, చప్పట్లు మించిన గొప్ప ఆనందం మరొకటి ఉండదు. దానికి సరితూగే ఆనందం మరెందులోనూ లేదు. మరికొన్ని రోజుల్లో అంతా సవ్యంగా ఉన్నప్పుడు థియేటర్సే మన ఎంటర్టైన్మెంట్కి ప్రధాన ఎంపిక అవుతాయి. కష్టసమయాల్లో ఓటీటీలాంటి ప్లాట్‌ఫామ్స్ ఉండటం బావుంది. ఇప్పటికి ఇదే మంచి నిర్ణయం’’ అన్నారు. ‘పొన్ మగళ్ వందాళ్’ మే 29నుంచి ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ‘శకుంతలా దేవి’ తేదీని ప్రకటించలేదు. -
డ్రైవ్–ఇన్–సినిమా?
థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఎప్పటికప్పుడు తగ్గుతుందనే మాట వినిపిస్తూనే ఉంది. తాజాగా కరోనా వల్ల థియేటర్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు. దాంతో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో (అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటివి) విడుదలకు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పలువురి అభిప్రాయం. ఆడియన్స్‌ని ఎలా రప్పించాలి అని ఆలోచిస్తున్నారు దర్శక–నిర్మాతలు. ఈ విషయమై ‘ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి’ చిత్రాల దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీటర్ లో తన అభిప్రాయాలను పంచుకుంటూ, నెటిజన్ల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ‘‘థియేటర్స్ లో కుడా మద్యం అనుమతి ఇస్తే ఎక్కువ మంది థియేటర్ కి వస్తారా?’’, ‘డ్రైవ్ ఇన్స్ లో సినిమా ఐడియా ఎలా ఉంటుంది. బయటే అందరూ కార్లు, బైక్‌లు పార్క్ చేసుకొని సినిమా చూడొచ్చు. పాత కాలం టూరింగ్ టాకీస్ లాగా?’’ అని ట్వీట్ చేశారు నాగ్ అశ్విన్. మద్యం అనుమతి అనే ఆలోచనకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఏది ఏమైనా లాక్ డౌన్ పూర్తయ్యాక ఎలా ఉంటుందో? ఆడియన్స్ ను థియేటర్ కి ఎలా రప్పించాలో అని కొత్త కొత్త ఆలోచనలతో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. -
ఆ రియాక్షన్ మాకు ఆక్సిజన్
‘‘సినిమాలను థియేటర్స్‌లోనే చూడటం ఉత్తమం’’ అంటున్నారు రచయిత, నిర్మాత కోన వెంకట్. ‘‘మేం (సినిమా పరిశ్రమకు చెందిన అందరూ) ఎన్నో కష్టాలకు ఓర్చి, ఎంతో ఇష్టంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాం. సినిమా చూస్తున్నప్పుడు థియేటర్స్‌లో ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనే మేం చేసే పనికి స్ఫూర్తి, మాకు ఆక్సిజన్. థియేటర్స్‌లో సినిమాను చూసే అనుభూతిని ఏదీ (డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను ఉద్దేశించి కావొచ్చు) భర్తీ చేయలేదు. సినిమా అంటే సినిమా హాల్లోనే చూడాలి’’ అని ఆదివారం ట్వీట్ చేశారు కోన వెంకట్. ఈ సంగతి ఇలా ఉంచితే అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడసన్ ప్రధాన తారాగణంగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కోన వెంకట్ ఇలా స్పందించడంతో ‘నిశ్శబ్దం’ చిత్రం థియేటర్స్‌లోనే విడుదలవుతుందని ఊహించవచ్చు. -
ఓవర్ ది టాప్
‘సృష్టిలో స్థిరమైనది మార్పు మాత్రమే’ అన్నది గ్రీకు ఫిలాసఫీ. ‘సినిమా’ రంగంలో మార్పు గమనిస్తే... మూకీ సినిమా మాటలు నేర్చుకుంది. బ్లాక్ అండ్ వైట్ స్టయిలుగా రంగులేసుకుంది. రీలును చుట్టి చిప్‌లో పెట్టారు. ఇది సినిమా తయారవడంలో వచ్చిన మార్పు. సినిమా ఎన్నో సవాళ్లను చూస్తూ వస్తోంది. సినిమా మొదలయినప్పుడు నాటకం నడక వేగం తగ్గిందన్నది నిజం. ఆ తర్వాత కేబుల్ టీవీ వచ్చింది. బుల్లితెరకు అంటుకుపోతున్నవాళ్లను పెద్ద తెరకు తీసుకురావడం కొంచెం కష్టం అవుతోంది. ఇప్పుడు ఓటీటీ (ఓవర్ ది టాప్) ప్లాట్‌ఫామ్స్ (అమేజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్, హాట్‌స్టార్, జీ5 వంటివి) వచ్చాయి. ఓవర్ ది టాప్ అంటూ దూసుకొచ్చిన ఈ మాధ్యమం సినిమా బిజినెస్‌ని అధిగమిస్తుందా? ఇప్పుడు సినిమాకు పెద్ద సవాల్ ఈ ఓటీటీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడే వరకే ఓటీటీ ప్రత్యామ్నాయమా? భవిష్యత్తులో థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌ను ఓటీటీ ఆపేస్తుందా? లేదంటే ఓటీటీయే భవిష్యత్తా? ఓటీటీకి అందరం అలవాటు పడాలా? ప్రస్తుతం అన్నీ ప్రశ్నలే. ప్రస్తుతం కరోనా వల్ల ప్రపంచం స్తంభించింది. సినిమాకు సంబంధించిన పనులన్నీ ఆగిపోయాయి. షూటింగ్ నుంచి విడుదల వరకూ అన్నీ బంద్. విడుదలకు సిద్ధమైన సినిమాలు పలు కారణాలతో ప్రత్యామ్నాయంగా ఓటీటీలో విడుదలకు సిద్ధపడ్డాయి. ఇదో సంచలనాత్మకమైన మార్పు. సినిమాను థియేటర్లో విడుదల చేయకుండా ఓటీటీలో విడుదల చేయడం సరికాదని పలు మల్టీప్లెక్స్ చైన్ల అధినేతలు, కొందరు పంపిణీదారులు, థియేటర్ అధినేతలు అభిప్రాయపడుతున్నారు. థియేటరా? ఓటీటీయా? సినిమాను థియేటర్లో చూడాలా? ఎవరింట్లో వాళ్లు ఓటీటీలో చూసుకోవాలా? సినిమా చూడటం అనేది ఓ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. థియేటర్లో ఒక రెండు వందల మంది సినిమాలోని ఒక ఎమోషన్ని సమానంగా ఫీలవడం. ‘సినిమాను సినిమాలాగా చూడటం థియేటర్లోనే జరుగుతుంది. సినిమాను థియేటర్లోనే అనుభూతి చెందాలి’ అని ఒక వాదన. మరోవైపు ‘ప్రతీ సినిమాను థియేటర్లో చూడలేం. పెరిగే టికెట్ రేట్లను ఫ్యామిలీ అందరం భరించలేం. ఓటీటీలో అయితే అందరూ ఇంట్లోనే వీలున్నప్పుడు చూసుకోవచ్చు. థియేటర్లో చూడదగ్గ సినిమా అయితే థియేటర్‌కి వస్తాం కదా?’ అనేది మరో వాదన. అభిప్రాయాలతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ‘ఖచ్చితంగా ఇదే కరెక్ట్’ అని ఏదీ చెప్పలేం. ప్రేక్షకుడు సినిమాను థియేటర్లో నలుగురితో చూడాలా? ఏకాంతంగా తన ల్యాప్టాప్లోనా, టీవీలోనా? అనేది తన నిర్ణయం. ప్రస్తుతానికి మాత్రం ఏడు సినిమాలు ‘ఓటీటీ’కి రావడానికి రెడీ అయ్యాయి. ఓటీటీకే మా ఓటు లాక్డౌన్ వల్ల విడుదల ఆగిపోయిన పలు సినిమాలు మా ఓటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కే అని డిజిటల్ రిలీజ్‌కి రెడీ అయ్యాయి. ఆ చిత్రాల వివరాలు.. పొన్ మగళ్ వందాళ్: ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు మొదట ప్రకటించబడిన తమిళ సినిమా జ్యోతిక నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’. సూర్య నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ విడుదల నిర్ణయం పట్ల డిస్ట్రిబ్యూటర్స్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సూర్య–జ్యోతిక సినిమాలు థియేటర్స్‌లో ప్రదర్శించం అని స్టేట్మెంట్లు విడుదల చేశారు. అయితే మే 29 నుంచి ఈ సినిమా ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది. గులాబో సితాబో: అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ముఖ్య పాత్రల్లో సూజిత్ సర్కార్ తెరకెక్కించిన హిందీ సినిమా ‘గులాబో సితాబో’. ఈ సినిమా జూన్ 12 నుంచి ప్రైమ్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ విషయం గురించి అమితాబ్ మాట్లాడుతూ –‘‘నా కెరీర్లో ఎన్నో మార్పులు, సవాళ్లు చూస్తూ వచ్చాను. డిజిటల్ రిలీజ్ అనేది మరో కొత్త సవాల్’’ అన్నారు. పెంగ్విన్: కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన సినిమా ‘పెంగ్విన్’. ఈ సినిమాలో గర్భిణి పాత్రలో కనిపిస్తారు కీర్తి. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్‌ను జూన్ 19 నుంచి చూడొచ్చు. కన్నడ చిత్రాలు ‘లా, ఫ్రెంచ్ బిర్యానీ’ జూన్ 26, జూలై 24వ తేదీలనుంచి లభ్యమవుతాయి. ఈ రెండు చిత్రాలకు ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ నిర్మాత. గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా విద్యా బాలన్ టైటిల్ రోల్లో నటించిన హిందీ చిత్రం ‘శకుంతలా దేవి’. జయసూర్య, అదితీరావ్ హైదరీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘సూఫీయుమ్ సుజాతయుమ్’. ఈ రెండు చిత్రాలు కూడా అందుబాటులోకి రానున్నట్టు ప్రైమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ విడుదల తేదీలు ప్రకటించలేదు. మార్పు మొదలైన వెంటనే భవిష్యత్తు ఇదే అని తుది నిర్ణయానికి రావడం అన్నిసార్లూ సరి కాదు. సాంకేతికత పెరిగేకొద్దీ సినిమా థియేటర్‌కి వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఓటీటీ కూడా థియేట్రికల్ బిజినెస్‌కి ఇబ్బంది అవుతుందేమోననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా మీడియమ్ మారబోతోందా? సినిమాల మీద ఓటీటీ ప్రభావం చూపిస్తుందా? సమాధానాల కోసం వెతకడం కంటే వేచి చూడటమే కొన్నిసార్లు ఉత్తమమేమో? పెద్ద తెర అనుభూతి వేరు – ఎఫ్డీసీ చైర్మన్ పి. రామ్మోహన్రావు ► ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీల వినియోగం బాగా పెరిగింది. స్మార్ట్ టీవీ 65 ఇంచెస్ ఉన్నప్పటికీ థియేటర్లో పెద్ద తెర మీద సినిమాను వీక్షిస్తే ప్రేక్షకులకు కలిగే ఆ అనుభూతి వేరు. థియేటర్లో దాదాపు 20–40లక్షల ఖర్చుతో ఉన్న సౌండింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలను వీక్షిస్తే ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంతగా కలగకపోవచ్చు. ► నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అమ్మకపోవడమే ఉత్తమమని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకసారి సినిమా థియేట్రికల్ రిలీజై హిట్ సాధిస్తే మంచి వసూళ్లు వస్తాయి. ఈ వసూళ్ల రూపంలో వచ్చేంత డబ్బును ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నిర్మాతలకు చెల్లించలేవు. ► కరోనా ప్రభావం వల్ల షూటింగ్‌లు క్యాన్సిల్ అయ్యాయి. భవిష్యత్‌లో థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు ప్రేక్షకులు సినిమాలు చూడటానికి వస్తారో? రారో? అనే భయంతో కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఇచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నాగచైతన్యతో తీస్తున్న ‘లవ్‌స్టోరీ’కి నేను ఒక నిర్మాతను. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు మా సినిమాని రిలీజ్ చేస్తాం కానీ ఓటీటీలకు అమ్మాలనుకోవడం లేదు. ► ఈ క్లిష్టపరిస్థితుల్లో ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా ఉండాలి. షూటింగ్, సినిమాల విడుదల, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వంటి విషయాలపై ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఒకసారి థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత మొదటి మూడు నెలల్లో విడుదయ్యే సినిమాలకు ప్రభుత్వం ఏదైనా రాయితీ ఇవ్వాలి. జీరో ట్యాక్సేషన్, పార్కింగ్ ఫీజు వసూలు చేయడం వంటి వాటి పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే మల్టీప్లెక్స్వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. షూటింగ్‌లు మొదలుపెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టుకోవచ్చని అధికారికంగా ప్రభుత్వం చెబితే, అప్పుడు తక్కువమందితో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేసుకుంటాం. ప్రభుత్వ స్పందన కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. నా సపోర్ట్ థియేటర్స్‌కే – నిర్మాత అల్లు అరవింద్ ► అమితాబ్ బచ్చన్ వంటి బిగ్ స్టార్ నటించిన సినిమా నుంచి స్టార్ ఆర్టిస్ట్‌లు జ్యోతిక, కీర్తీ సురేష్ వంటి వారు నటించిన సినిమాలు డిజిటల్ రిలీజ్‌కి రెడీ అయ్యాయి.. ఈ ప్లాట్ఫామ్లో విడుదల చేయడం పై మీ ఒపీనియన్? ఎవరైనా థియేటర్లో విడుదలకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొందరు ఓటీటీవైపు మొగ్గు చూపుతున్నారు. చాలా సినిమాలు విడుదల వాయిదా పడుతుండటంతో ఒకేసారి విడుదల చేస్తే థియేటర్లు దొరుకుతాయో? లేదో? పైగా అప్పులపై వడ్డీలు పెరిగిపోతుంటాయి కదా? ఈ కారణాల వల్ల డిజిటల్ రిలీజ్ బెటర్ అనుకునే అవకాశం ఉంది. ► ‘ఆహా’తో మీరూ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టారు. మరి.. మీరు డిజిటల్ రిలీజ్‌కి ఓకే అంటారా? థియేటర్లు ఓపెన్ అయ్యేవరకూ ఆగేవాళ్లు ఆగుతారు. నా సపోర్ట్ మాత్రం థియేటర్స్‌కే. అయితే ఓటీటీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. ► పెద్ద బడ్జెట్ చిత్రాలేమైనా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు మీ దృష్టికి వచ్చిందా? నాకు తెలిసి లాక్‌డౌన్‌కి ముందు రిలీజ్ కావడానికి పెద్ద సినిమాలేవీ రెడీగా లేవు. నాలుగైదు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయేమో.. మరికొన్ని చిన్న చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఓ బడా నిర్మాత సినిమా విడుదలకు రెడీ అయింది. లాక్డౌన్ వల్ల అది ఆగింది. ఆ సినిమాకి కూడా ఓటీటీ వాళ్లతో చర్చలు జరిగాయి.. కానీ ‘పెద్ద మొత్తం’ ఇవ్వడానికి ఓటీటీ వాళ్లు సిద్ధంగా లేరు. అందుకే వడ్డీ భారం ఉన్నా కూడా థియేటర్లోనే విడుదల చేద్దామని ఆ నిర్మాత ఆగారు. ► తక్కువ మందితో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చని తమిళ ఇండస్ట్రీకి ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి అనుమతులు ఇంకా రాలేదు కదా? అనధికారికంగా కొందరు తక్కువమందితో జాగ్రత్తలు పాటిస్తూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారు. అయితే అధికారికంగా ప్రకటిస్తే కొంచెం రిలీఫ్‌గా పని చేసుకుంటారు. ► షూటింగ్స్ ఎప్పటి నుంచి మొదలవుతాయనుకుంటున్నారు? ఆగస్టు నుంచి మొదలవుతాయనుకుంటున్నాను. అయితే గతంలా ఉండకపోవచ్చు. తక్కువ మందితో షూటింగ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల చాలా మంది కార్మికులకు పని లేకుండా పోతుంది. అలాంటివాళ్లను ఆదుకోవడానికి ఏదోటి చేయాలి. ► గీతా ఆర్ట్స్ బ్యానర్లోని ప్రస్తుత సినిమాల పరిస్థితేంటి? ప్రస్తుతం మా బ్యానర్లో మూడు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ‘జెర్సీ’ హిందీ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తయి ఆగిపోయింది. తెలుగులో అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ 75 శాతం షూటింగ్ అయింది. కార్తికేయతో తీస్తున్న ‘చావు కబురు చల్లగా’ సినిమా 25 శాతం చిత్రీకరణ జరిగింది. లాక్డౌన్ ముగిశాక ఈ షూటింగ్స్ మొదలుపెట్టడమే. ఒకరి మీద ఒకరం ఆధారపడ్డాం పలు సినిమాలు ఓటీటీని ఆశ్రయించడంతో ప్రముఖ థియేటర్ చైన్ సంస్థ ఐనాక్స్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘‘థియేటర్స్– సినిమా నిర్మించేవాళ్లు ఒకరి మీద ఒకరు ఆధారపడ్డవాళ్లం. ఇలాంటి కష్టకాలంలో రెండు పార్టీలు లబ్ధి పొందే పద్ధతిని కాదనుకుని ఒక పార్టనర్ వేరే పద్ధతిని అనుసరించడం సరికాదనిపిస్తోంది. కష్ట సమయంలో అనుబంధాన్ని వదిలి, ప్రత్యామ్నాయాన్ని ఆశ్రయించినవాళ్లను భవిష్యత్తులో ఆప్తమిత్రుల్లా చూడటానికి లేదు. థియేటర్లో సినిమాను విడుదల చేసే విధానాన్ని మరువకండి. ఎప్పటిలానే కలసి ప్రయాణిద్దాం’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్మాతలు అలా ఆలోచించడం సహజం – ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో తమ సినిమాలను విడుదల చేయడానికి అంగీకరించిన నిర్మాతలను ఉద్దేశిస్తూ ఎగ్జిబిటర్ సెక్టార్‌లోని మా సహచరులు కొందరు కటువుగా మాట్లాడటం బాధగా ఉంది. ఇప్పట్లో దేశవ్యాప్తంగా సినిమాలు ప్రదర్శితం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అప్పటి వరకు తమ సినిమాల విడుదల కోసం నిర్మాతలు ఎదురుచూడటం అంటే వారు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. తిరిగి థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ థియేటర్స్ ప్రేక్షకులతో నిండకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మార్గాల ద్వారా తమ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి నిర్మాతలు ఆలోచిస్తారు. అది సహజం. అయితే సినిమాల థియేట్రికల్ రిలీజ్‌నే ప్రొడ్యూసర్స్ గిల్డ్ సపోర్ట్ చేస్తుంది. దేశవ్యాప్తంగా సినిమా థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు ఎగ్జిబిటర్ సెక్టార్‌కు మేం తప్పక సహకారం అందిస్తాం. అలాగే పెద్ద సంఖ్యలో థియేటర్స్‌కు ప్రేక్షకులను రప్పించేందుకు మా వంతుగా మేం చేయాల్సింది అంతా చేస్తాం. -
టెల్కోల రాబడులకు గండే
ముంబై: వాట్స్‌యాప్, ట్విట్టర్, గూగుల్, స్కైప్ వంటి ఓవర్-ద-టాప్(ఓటీటీ) ఆపరేటర్ల కారణంగా అంతర్జాతీయ టెలికం కంపెనీల రాబడులకు గండి పడుతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ శుక్రవారం హెచ్చరించింది. వాట్స్‌యాప్‌ను ఇటీవలే ఫేస్బుక్ కొనుగోలు చేయడం తెలిసిందే. వాయిస్ కాల్స్ రంగంలోకి రావాలని ఫేస్బుక్, తదితర ఓటీటీలు ప్రయత్నాలు చేస్తుండడం అంతర్జాతీయ టెలికం కంపెనీలపై తీవ్రంగానే ప్రభావం పడుతుందని ఫిచ్ పేర్కొంది. అయితే సమీప భవిష్యత్తులో భారత టెలికం కంపెనీలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. ఫిచ్ వెల్లడించిన వివరాల ప్రకారం..., వాట్స్‌యాప్, ట్విట్టర్, గూగుల్, స్కైప్ వంటి ఓవర్-ద-టాప్(ఓటీటీ) సంస్థలు టెలికాం ఆపరేటర్ల కంటే చౌకగా మెసేజ్, వాయిస్ సర్వీసులందజేస్తున్నాయి. ఇక డేటా వినియోగం పెరిగినంతగా ఆ రంగం నుంచి రాబడులు పెరగలేదు. ఇతర సర్వీసులతో పోల్చితే టెలికం కంపెనీలకు డేటా సర్వీసుల్లో మార్జిన్లు తక్కువగా ఉంటాయి. మరోవైపు ఇతర సంప్రదాయ సర్వీసుల నుంచి వచ్చే ఆదాయం ఈ కంపెనీలకు తగ్గుతుంది. భారత్, ఇండోనేషియా, శ్రీలంక దేశాల్లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వాయిస్, టెక్స్ట్ సర్వీసుల ధరలు తక్కువగా ఉండడం, స్మార్ట్ఫోన్ల వినియోగం కూడా తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల ఈ దేశాల్లోని టెలికం కంపెనీలపై ప్రభావం పెద్దగా ఉండదు. కాల్స్, టెక్స్ ట్, డేటాలన్నింటికి కలిపి ఒకే టారిఫ్‌ను నిర్ణయించడం ద్వారా ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి గట్టెక్కె ప్రయత్నాలు చేయవచ్చు. ఇక భారత్ విషయానికొస్తే, భారీ పెట్టుబడులు ఉన్న రిలయన్స్ జియో సంస్థ వాయిస్, డేటా రంగాల్లోకి వస్తుండటంతో దేశీయ టెలికాం కంపెనీలకు ఇబ్బంది తప్పదు. ఈ కంపెనీ అత్యంత చౌక టారిఫ్‌లను అందించే అవకాశాలున్నాయి.