నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘రౌతు కా రాజ్’. ఆనంద్ సుర్పూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలిపారు. ఇంకా ‘సాక్షి’తో నవాజుద్దీన్ పంచుకున్న విశేషాలు.
→ హీరో పాత్ర, అతను ఓ కేసును పరిశోధన చేసే విధానం... ఈ రెండూ ‘రౌతు కా రాజ్’లో వీక్షకులకు కొత్తగా అనిపిస్తాయి. సినిమాలోని మర్డర్ మిస్టరీ, గ్రామీణ నేపథ్యం ఆసక్తికరంగా, సహజత్వంతో ఉంటుంది. ఈ సినిమాకు సక్సెస్ టాక్ వచ్చిందంటే ఈ ఫలితం నా ఒక్కడిదే కాదు... దర్శకుడు, ఇందులో భాగమైన నటీనటులు అందరి భాగస్వామ్యం వల్లే సాధ్యమైంది.
→ నేను ప్రధానంగా లీడ్ రోల్స్‌లోనే నటిస్తున్నాను. ఏదైనా కథ, అందులోని పాత్ర ఎగ్జైట్ చేసినప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాను. కథలోని నా పాత్రకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలనుకుంటాను. ఆ లక్షణాలకు నా నటన తోడైనప్పుడు ప్రేక్షకులు మెచ్చుకుంటారు. ఆడియన్స్‌ను మెప్పించే క్రమంలో నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నా ఓకే. నటుడుగా నాకెలాంటి పశ్చాత్తాపం లేదు. ఇండస్ట్రీలో ఇంత దూరం వస్తానని, ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదు. ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది.
→ ప్రస్తుతం కస్టమ్ ఆఫీసర్‌గా ఓ సినిమా, సెక్షన్ 108 మూవీలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను. దక్షిణాదిలో రజనీకాంత్‌గారి ‘పేటా’, వెంకటేశ్‌గారి ‘సైంధవ్’ సినిమాలో నటించాను. మళ్లీ దక్షిణాది సినిమాలు చేయాలని ఉంది. కథలు వింటున్నాను. ఇక యాక్టింగ్ కాకుండా వ్యవసాయం అంటే ఇష్టం. వీలైనప్పుడల్లా మా ఊరు వెళ్లిపోయి (ఉత్తరప్రదేశ్‌లోని బుడానా) వ్యవసాయం చేస్తుంటాను.
ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది..ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదు!
Published Thu, Jul 11 2024 4:16 AM | Last Updated on Thu, Jul 11 2024 3:10 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment