Nawazuddin Siddiqui
-
ఇంతవరకు దీపికా పదుకొణె సినిమాలు చూడలేదు: ప్రముఖ నటుడు
నవాజుద్దీన్ సిద్ధిఖి బాలీవుడ్లో బడా నటుడు. రెండున్నర దశాబ్దాలుగా తన నటనతో హిందీ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ మధ్యే సైంధవ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యాడు. ప్రస్తుతం అతడు యాక్ట్ చేసిన 'సైయాన్ కీ బందూక్' సాంగ్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.దీపిక సినిమాలు చూడలేదుబాలీవుడ్ సెలబ్రిటీల గురించి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అలా హీరోయిన్ దీపికా పదుకొణె గురించి అడగ్గా ఆమె గురించి నాకు పెద్దగా తెలియదు, తన సినిమాలేవీ చూడలేదు అని బదులిచ్చాడు. అలాగే సెన్సేషనల్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి కూడా తనకు తెలియదన్నాడు. టికు వెడ్స్ షెరు మూవీలో అవనీత్ కౌర్‌తో నవాజుద్దీన్ సిద్ధిఖిత్వరలో చూస్తాపోనీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విధ్వంసం సృష్టించిన స్త్రీ 2 సినిమా గురించి తెలుసా? అని యాంకర్ ప్రశ్నించాడు. ఇప్పటివరకు సినిమా చూడలేదని, కానీ తప్పకుండా చూస్తానని నవాజుద్దీన్ చెప్పాడు. టికు వెడ్స్ షెరు మూవీలో తనతో కలిసి నటించిన యంగ్ హీరోయిన్ అవనీత్ కౌర్ గురించి మాట్లాడుతూ.. ఆమె సొంతకాళ్లపై నిలబడే వ్యక్తి. అద్భుతమైన నటి కూడా అని ప్రశంసించాడు.ఓటీటీ..కాగా నవాజుద్దీన్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ అద్భుత్ ఆదివారం (సెప్టెంబర్ 15న) ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో రిలీజైంది. ఈ మూవీలో డయానా పెంటీ, శ్రేయ ధన్వంతరి, రోహన్ మెహ్రా కీలక పాత్రలు పోషించారు.చదవండి: సోనియాని ఏకిపారేసిన యష్మి.. నామినేషన్లో ఎవరున్నారంటే? -
Nawazuddin Siddiqui: సౌత్ సినిమాలు అందుకే చేస్తున్నా..
పాన్ ఇండియా సినిమాలతో భాషా సరిహద్దులు చెదిరిపోయాయి. హీరోలను, ఇతర నటీనటులను అన్ని భాషల వారు అక్కున చేర్చుకుంటున్నారు. అలా సౌత్‌లో బాలీవుడ్ నటుల హవా కూడా పెరుగుతోంది. ఇటీవల వచ్చిన సైంధవ్ సినిమాతో హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు.డబ్బులిస్తున్నారని నటిస్తున్నాతాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను డబ్బు కోసం సినిమాల్లోకి రాలేదు. ఇష్టంతో ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. రామన్ రాఘవ్ వంటి సినిమాలు చేసినప్పుడు ఆ పాత్రకు సంబంధించిన ఎమోషన్స్, ఆలోచనలపై నాకు పూర్తి పట్టు ఉంటుంది. కానీ దక్షిణాది చిత్రాల వరకు వచ్చేసరికి ఆ పట్టు అలాగే ఉంటుందని కచ్చితంగా చెప్పలేకపోతున్నాను. సౌత్‌లో నాకు మంచి పారితోషికం ఇస్తారు. వాళ్లు డబ్బు ఇవ్వగానే ఆయా పాత్రల్లో నటిస్తున్నాను. పాత్రపై ఎమోషన్స్ ఉండట్లేకానీ ఆ పాత్రలపై పట్టు కోల్పోతుండటంతో షూటింగ్‌కు ముందు ఎవరో ఒకరు.. నేనేం చేయాలి? ఏ డైలాగ్స్ చెప్పాలనేది నాకు వివరించాల్సి వస్తోంది. కొన్నిసార్లు అక్కడేం జరుగుతుందనేది అర్థం కావడం లేదు. ఏదో యాడ్ షూటింగ్ అన్నట్లుగా పని కానిచ్చేస్తున్నాను. డబ్బులిస్తున్నారు, నటిస్తున్నానంతే అన్నట్లుగా ఉంటున్నాను. కానీ ఆ పాత్రపై ఎటువంటి ఎమోషన్స్ పెంచుకోవట్లేదు. అందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా నవాజుద్దీన్ సిద్దిఖి ఇటీవల రౌతు కా రాజ్ అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.చదవండి: జైలు తిండి పడట్లేదు, ఇంటి భోజనం కావాలన్న దర్శన్ -
ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది.. ఇంత దూరం వస్తాననుకోలేదు!
నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘రౌతు కా రాజ్’. ఆనంద్ సుర్పూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలిపారు. ఇంకా ‘సాక్షి’తో నవాజుద్దీన్ పంచుకున్న విశేషాలు. → హీరో పాత్ర, అతను ఓ కేసును పరిశోధన చేసే విధానం... ఈ రెండూ ‘రౌతు కా రాజ్’లో వీక్షకులకు కొత్తగా అనిపిస్తాయి. సినిమాలోని మర్డర్ మిస్టరీ, గ్రామీణ నేపథ్యం ఆసక్తికరంగా, సహజత్వంతో ఉంటుంది. ఈ సినిమాకు సక్సెస్ టాక్ వచ్చిందంటే ఈ ఫలితం నా ఒక్కడిదే కాదు... దర్శకుడు, ఇందులో భాగమైన నటీనటులు అందరి భాగస్వామ్యం వల్లే సాధ్యమైంది. → నేను ప్రధానంగా లీడ్ రోల్స్‌లోనే నటిస్తున్నాను. ఏదైనా కథ, అందులోని పాత్ర ఎగ్జైట్ చేసినప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాను. కథలోని నా పాత్రకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలనుకుంటాను. ఆ లక్షణాలకు నా నటన తోడైనప్పుడు ప్రేక్షకులు మెచ్చుకుంటారు. ఆడియన్స్‌ను మెప్పించే క్రమంలో నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నా ఓకే. నటుడుగా నాకెలాంటి పశ్చాత్తాపం లేదు. ఇండస్ట్రీలో ఇంత దూరం వస్తానని, ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదు. ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది. → ప్రస్తుతం కస్టమ్ ఆఫీసర్‌గా ఓ సినిమా, సెక్షన్ 108 మూవీలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను. దక్షిణాదిలో రజనీకాంత్‌గారి ‘పేటా’, వెంకటేశ్‌గారి ‘సైంధవ్’ సినిమాలో నటించాను. మళ్లీ దక్షిణాది సినిమాలు చేయాలని ఉంది. కథలు వింటున్నాను. ఇక యాక్టింగ్ కాకుండా వ్యవసాయం అంటే ఇష్టం. వీలైనప్పుడల్లా మా ఊరు వెళ్లిపోయి (ఉత్తరప్రదేశ్‌లోని బుడానా) వ్యవసాయం చేస్తుంటాను. -
'అత్యంత చెత్త గ్లామర్ నాదే'.. సైంధవ్ నటుడి షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తెలుగువారికి కూడా సుపరిచితమే. ఈ ఏడాది వెంకటేశ్ నటించిన సైంధవ్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నవాజుద్దీన్ నటించిన 'రౌతు కా రాజ్' సినిమా జీ5లో జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన ముఖం చూసి నిరుపేద అనుకుంటారని అన్నారు. అంతే కాకుండా ఇండస్ట్రీలో అత్యంత అగ్లీయస్ట్ నటుడిని తానేనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ మాట్లాడుతూ..'కొంతమంది మన రూపాన్ని ఎందుకు ద్వేషిస్తారో నాకు తెలియదు. బహుశా మనం అంత అందంగా కనిపించకపోవడం వల్లే కావొచ్చు. నేను కూడా నన్ను నేను అద్దంలో చూసుకుంటా. నేను అందంగా లేకపోయినా సినిమా పరిశ్రమలోకి ఎందుకు వచ్చానా అని ప్రశ్నించుకుంటా. బాలీవుడ్లో శారీరకంగా.. అత్యంత అంద విహీనంగా కనిపించే నటుడిని నేనే. ఈ విషయం నాకు తెలుసు. అయితే చిత్ర పరిశ్రమపై నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. నా కెరీర్లో వైవిధ్యమైన పాత్రలను పోషించే అవకాశం ఇచ్చినందుకు ఇండస్ట్రీకి నా కృతజ్ఞతలు' అని అన్నారు.కాగా.. నవాజుద్దీన్ చివరిసారిగా హడ్డీలో కనిపించాడు. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో విడుదలైంది. అతని ఇటీవల విడుదలైన రౌతు క రాజ్ జూన్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆనంద్ సురపూర్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ చిత్రంలో అతుల్ తివారీ, రాజేష్ కుమార్, నారాయణి శాస్త్రి కూడా నటించారు. -
నా ముఖం చూసి నిరుపేద అనుకుంటారు.. కానీ..: బాలీవుడ్ నటుడు
నన్ను చూసి చాలామంది పేదవాడిని అనుకుంటారు, కానీ అది నిజం కాదు అంటున్నాడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి. తన కుటుంబం దగ్గర బతకడానికి సరిపోయేంత డబ్బు ఉందని పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ సిద్దిఖి మాట్లాడుతూ.. 'నేను పేద కుటుంబం నుంచి రాలేదు. నా తల్లిదండ్రులు మరీ అంత ధనవంతులు కాకపోయినా జీవించేందుకు సరిపోయేంత డబ్బు ఉండేది. అయితే నటుడిగా కెరీర్ ఆరంభించడానికి ముందు ఇక్కడ వాచ్‌మెన్‌గా పని చేశాను. పేరెంట్స్ దగ్గర డబ్బు ఆశించకూడదనే ఆ ఉద్యోగం చేశాను. నీకేదైనా సమస్య ఉంటే చెప్పు.. మనీ పంపిస్తాం. నువ్వు ఏదీ చెప్పకపోతే అసలు ఏం చేస్తున్నావో మాకెలా తెలుస్తుంది? అని పేరెంట్స్ అంటూ ఉండేవారు.సినిమాలో ఛాన్స్ వచ్చేంతవరకు వారికేదీ చెప్పకూడదనుకున్నాను. అలా మొదట్లో చిన్నాచితకా పాత్రలు చేశాను. చిన్న సినిమాల్లోనూ యాక్ట్ చేశాను' అని చెప్పుకొచ్చాడు. కాగా నవాజుద్దీన్ నటించిన 'రౌతు కా రాజ్' సినిమా జీ5లో నిన్నటి (జూన్ 28) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.చదవండి: కల్కిపై తారల రివ్యూ.. నాగ్, రజనీ, దేవరకొండ ఏమన్నారంటే? -
పెళ్లి తర్వాత ప్రేమ ఉండదు.. భార్యతో సంతోషం కూడా..: నటుడు
ఆలూమగల మధ్య కొట్లాటలు సహజమే.. కానీ కొన్ని జంటల మధ్య గొడవలు, భేదాభిప్రాయాలు తారాస్థాయిలో ఉంటాయి. కొందరైతే ఇదంతా భరించలేక విడాకులు తీసుకుంటారు. బాలీవుడ్ జంట నవాజుద్దీన్ సిద్దిఖి- ఆలియా కూడా అదే పని చేద్దామనుకున్నారు. అత్తింట్లోకి రానివ్వడం లేదని, తనను వేధిస్తున్నారంటూ ఆలియా రోడ్డుపై నానా రచ్చ చేసింది. కట్ చేస్తే.. కూతురి క్షేమం కోసం దంపతులిద్దరూ విడాకుల ఆలోచన విరమించుకుని కలిసిపోయారు.పెళ్లెందుకు దండతాజాగా నవాజుద్దీన్ ఓ ఇంటర్వ్యూలో పెళ్లి బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పెళ్లి చేసుకోవడం దండగ అని మాట్లాడాడు. ప్రేమలో ఉన్నప్పుడు పెళ్లెందుకు అని ప్రశ్నించాడు. 'మీరు నిజంగా ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వివాహం చేసుకోకుండా కూడా ఆ ప్రేమను కొనసాగించవచ్చు కదా! మ్యారేజ్ వల్ల ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చూపిస్తారు. భార్య వల్ల సంతోషం..అదే ఈ పెళ్లి గోల లేకపోతే ఇద్దరూ అలాగే ప్రేమగా, ఆప్యాయంగా గడిపేయొచ్చు. అలా కాదని వైవాహిక బంధంలోకి అడుగుపెడితే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కూడా రానురానూ కరిగిపోతూ ఉంటుంది. భార్య మనకు సంతోషాన్నిస్తుందని మొదట్లో అనుకుంటాం. కానీ రానురానూ మన ఉద్యోగం, చేసే పని వల్లే ఎక్కువ సంతోషంగా ఉంటాం' అని చెప్పుకొచ్చాడు. కాగా ఆలియా, నవాజుద్దీన్ సిద్దిఖి ఇటీవలే 14వ పెళ్లి రోజు జరుపుకున్నారు.చదవండి: 'కల్కి' గెస్ట్ రోల్స్‌లో మరో ఐదుగురు.. ఎవరూ ఊహించని పేర్లు -
నా కూతురు తట్టుకోలేదు, అందుకే ఈ నిర్ణయం: నటుడి భార్య
బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖిపై అతడి భార్య ఆలియా గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది. తనను, తన పిల్లల్ని నడిరోడ్డున పడేశాడంటూ విడాకులకు దరఖాస్తు చేసింది. అటు నవాజుద్దీన్ కూడా.. ఆమె తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరిస్తోందని కోర్టుకెక్కాడు. కోర్టు విడాకులు మంజూరు చేయకపోయినా ఇద్దరూ నానా రచ్చ చేసి విడిపోయినంత పని చేశారు. ఆ మధ్య ఆలియా.. 'ఒక బంధం నుంచి బయటపడేందుకు 19 ఏళ్లు పట్టింది. స్నేహం కన్నా ముఖ్యమైన బంధంలో ఉన్నాను' అంటూ పోస్ట్ పెట్టడంతో తను మరొకరితో ప్రేమలో ఉందని వార్తలు వైరలయ్యాయి. మంచి కూడా చెప్పుకోవాలి కట్ చేస్తే బద్ధ శత్రువుల్లా విరోధం పెంచుకున్న నవాజుద్దీన్ సిద్దిఖి, ఆలియా కలిసిపోయారు. ఈ విషయాన్ని ఆలియా వెల్లడించింది. మా వైవాహిక బంధానికి 14 ఏళ్లు నిండాయంటూ రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి అందరినీ సర్ప్రైజ్ చేసింది. దీని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఈ మధ్య నా జీవితంలో కొన్ని మార్పులు జరిగాయి. మనకు జరిగిన చేదు అనుభవాల గురించి అందరితో పంచుకున్నప్పుడు మంచి జరిగినప్పుడు కూడా చెప్పుకోవాలి. పిల్లలతో కలిసి నవాజుద్దీన్, నేను.. మా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం. పిల్లల కోసం ఆలోచించి.. మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి దూరడంతో అన్ని గొడవలు జరిగాయి. మా మధ్య ఏర్పడిన మనస్పర్థలు అన్నీ తొలగిపోయాయి. పిల్లల కోసం మేము కలిసుండాలనే నిర్ణయించుకున్నాం. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. ఇప్పుడు మేము విడిపోవడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే నవాజ్.. షోరా(కూతురు)తో ఎంతో క్లోజ్‌గా ఉంటాడు. మా మధ్య ఏం జరిగినా అది పిల్లల్ని మానసికంగా దెబ్బ తీస్తుంది. షోర అస్సలు తట్టుకోలేదు. అందుకే ఇకమీదట మేము పోట్లాడకూడదని, ప్రశాంతంగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం' అని చెప్పుకొచ్చింది. పిల్లల కోసం కలిసిపోవాలనుకున్నందుకు నెటిజన్లు ఈ దంపతులను ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Aaliya Anand pandey (@aaliya_anand_pandey_) చదవండి: ట్రోలింగ్‌కు బాధపడుతున్న అనుపమ.. అందుకే డుమ్మా! -
ఒక్కో హీరో కోట్లు తీసుకుంటున్నాడు, మాకు పెంచమని అడిగితే..
కథలో దమ్మున్నా సినిమా క్వాలిటీగా రావాలంటే నిర్మాతలు డబ్బులు ధారపోయాల్సిందే! అయితే సినిమా తీయడానికంటే అందులో నటించినవారి కోసమే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఆ రేంజులో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ పెరిగిపోయింది. హిట్టు పడ్డేకొద్దీ వారు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తూ పోతున్నారు. సినిమా ఫలితాలను బట్టి కొందరు పారితోషికం వెనక్కు ఇచ్చేస్తారు, లేదంటే కొంత కోతలు పెడుతుంటారు. మరికొందరు మాత్రం రిజల్ట్ ఎలా ఉన్నా పూర్తి మొత్తం ముట్టాల్సిందేనని కరాఖండిగా చెప్తారు. ఎంత తీసుకుంటారు? తాను మాత్రం అలా చేయనంటున్నాడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతడు బాలీవుడ్లో నటీనటులు, చిన్నపాటి హీరోలు అందుకుంటున్న పారితోషికం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ నటులు సుమారు ఎంత పారితోషికం తీసుకుంటారు? అన్న ప్రశ్నకు నవాజుద్దీన్ స్పందిస్తూ.. చాలా ఎక్కువగా తీసుకుంటారని చెప్పాడు. పది కోట్ల పైనే ఉండొచ్చా? అని యాంకర్ అడగ్గా.. పదికోట్లకు అటుఇటుగా తీసుకుంటారని బదులిచ్చాడు. ఎక్కువ అడిగామంటే అంతే.. రెమ్యునరేషన్ విషయంలో బేరాలడతారా? అన్న ప్రశ్నకు తానైతే అలా చేయనని చెప్పాడు. ఇక్కడ నటుల టాలెంట్‌ను బట్టి వారికి ఎంత ఇవ్వాలనుకుంటే అంతే ఇస్తారు. లేదు, మాకింకా ఎక్కువ కావాలని అడిగితే.. ఏంటి? మేము చెప్పిన అమౌంట్ కన్నా ఎక్కువ తీసుకునే అర్హత నీకుందా? అని మొహం మీదే అనేస్తారు. అందుకే నేను ఎక్కువగా డిమాండ్ చేయను, ఇచ్చిందే తీసుకుంటాను. కొన్ని సినిమాలు డబ్బుల కోసమే చేశాను. మరికొన్ని పైసా తీసుకోకుండా ఫ్రీగా చేశాను. రూ.25 కోట్లు ఇచ్చినా చేయను నేను చిన్నాచితకా పాత్రలు చేయడం మానేశాను. నాకు రూ.25 కోట్లు ఇస్తామన్నా సరే అటువంటి పాత్రలు చేయను. ఇప్పటికే నా కెరీర్లో చాలా సినిమాల్లో చిన్న రోల్స్ చేశాను. ఇక చాలు. ఇకమీదట అలాంటి పాత్రలు చేయాలనుకోవడం లేదు అని చెప్పుకొచ్చాడు. కాగా నవాజుద్దీన్ సిద్ధిఖి ఇటీవలే సైంధవ్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సెక్షన్ 108 సినిమా చేస్తున్నాడు. చదవండి: ఫలించిన నిరీక్షణ.. డైహార్ట్ ఫ్యాన్‌కు క్షమాపణ చెప్పిన కీర్తీసురేష్ విడాకులపై నిహారిక కామెంట్లు.. ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ భర్త చైతన్య -
Saindhav Pre-Release Event: వెంకటేశ్ ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఆయన బయోపిక్‌లో నటించాలని ఉంది
తెలుగులోకి రావడానికి సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూశాను. అది ‘సైంధవ్’తో కుదిరింది. వెంకటేశ్‌గారితో కలిసి పని చేయడం ఎవరికైనా ఓ డ్రీమ్గానే ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో చాలావరకూ ఆయన డూప్ లేకుండా చేశారు. సెట్స్‌లో ఎప్పుడూ కూల్‌గా, చాలా సహనంతో ఉంటారు. వెంకటేశ్‌గారి నుంచి ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఆయన చేసిన ఫ్యామిలీ సబ్జెక్ట్ మూవీస్ చూశాను. వెంకటేశ్‌గారి ‘అనారి’ (‘చంటి’) చిత్రం కూడా చూశాను. ‘సైంధవ్’లో కొంత తెలుగు, కొంత హిందీ మాట్లాడే ఓ హైదరాబాదీ పాత్ర నాది. సెట్స్‌లో నా తొలి రోజు చిత్రీకరణ యాక్షన్‌తో మొదలు కావడం కాస్త సవాల్‌గా అనిపించింది. ఇక బెస్ట్ మూమెంట్స్ అంటే.. శ్రీలంక షెడ్యూల్ మర్చిపోలేను. సముద్రంలో యాక్షన్ సీక్వెన్స్ కోసం బోట్ పై స్పీడ్‌గా వెళుతున్నాను. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. దాంతో ఒక్కసారి బోట్ వదిలేసి అలతో పాటు పైకి ఎగిరాను. అదృష్టవశాత్తు.. మళ్ళీ బోట్లోనే ల్యాండ్ అయ్యాను (నవ్వుతూ). ఆ సీన్ సినిమాలో ఉంటుంది. నా నటనకు మరొకరు డబ్బింగ్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎంత కష్టమైనా డైలాగ్స్ నేర్చుకుని ఆ భాషలో డబ్బింగ్ చెప్పడమే ఇష్టం. అప్పుడే నా పాత్రలో ఉన్న ఇంటెన్స్, డెప్త్ తెలుస్తాయి. శైలేష్ చాలాప్రోఫెషనల్ డైరెక్టర్. నటుడిగా నాది సుధీర్ఘమైన ప్రయాణం. శైలేష్ ఇండస్ట్రీకి వచ్చి తక్కువ సమయమే అవుతోంది. అయితే ఫిల్మ్ మేకింగ్ పరంగా అతనికి ఎంతో విషయ పరిజ్ఞానం, ఉందనిపించింది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ప్రోఫెషనల్ ప్రోడక్షన్ హౌస్. ∙టాలీవుడ్ చాలాప్రోఫెషనల్. ఇక రజనీకాంత్‌గారి ‘పేట’ (2019) సినిమా తర్వాత తమిళ, తెలుగు నుంచి నాకు అవకాశాలు వచ్చాయి.. కానీ కుదర్లేదు. అప్పుడు ‘పేట’లా ఇప్పుడు ‘సైంధవ్’ సంక్రాంతికే విడుదలవుతుండటం హ్యాపీ. ఇక ఓషోగారి పాత్ర చేయాలన్నది నా డ్రీమ్. అవకాశం వస్తే ఆయన బయోపిక్‌లో నటిస్తాను. -
అవకాశం వస్తే ఆయన బయోపిక్‌లో నటిస్తా: నవాజుద్దీన్ సిద్ధిఖీ
ప్రతి నటుడు ఒక మంచి కథ కోసం ఎదురుచూస్తాడు. నేను కూడా అలా సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ‘సైంధవ్’ కథ వచ్చింది. చాలా ఆసక్తికరమైన కథ ఇది. ఇలాంటి మంచి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాను. ఈ చిత్రంలో నా పాత్ర చాలా యూనిక్‌గా ఉంటుంది. వెంకటేశ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దాన్ సిద్ధిఖీ. విక్టర్ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న 75వ సినిమా ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటించాడు. సంక్రాంతి కానుకగా జవవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నవాజుద్దీన్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఓ మంచి కథతో టాలీవుడ్ ఎంట్రీ ఇద్దామనుకున్నాను. 'సైంధవ్’ అది కుదిరింది. ఈ చిత్రం కోసం దాదాపు 40 రోజులు పని చేశాను. నా పాత్ర పట్ల చాలా తృప్తితో ఉన్నాను. చాలా మంచి క్యారెక్టర్. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ►నేను ఎప్పుడూ విలన్, హీరో పాత్ర అని చూడను. పాత్ర ఆసక్తికరంగా ఉందా లేదా అనేదే చూస్తాను. కొన్ని సార్లు పాజిటివ్ రోల్స్ కంటే నెగిటివ్ రోల్స్ లో పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సైంధవ్ లో దర్శకుడు శైలేష్ చాలా యూనిక్ రోల్ ని డిజైన్ చేశారు. నటించడానికి చాలా అవకాశం ఉన్న పాత్ర. ► ఈ సినిమాలోని నా పాత్రకు నేను తెలుగు డబ్బింగ్ చెప్పాను. ఈ విషయంలో దర్శకుడు శైలేష్ ప్రేరణ ఇచ్చారు. నా నటనకు వేరే ఎవరో డబ్బింగ్ చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. పాత్రలో ఆ డెప్త్ రాదు. ఇందులో నాది హైదరాబాది పాత్ర. హిందీ, కొంచెం తెలుగు రెండూ మాట్లాడే పాత్ర. ఆ పాత్రకు నేను డబ్బింగ్ చెబితేనే న్యాయం జరుగుతుంది. భాషని, భావాన్ని అర్ధం చేసుకొని చెప్పాను. ► షూటింగ్ సమయంలో వెంకటేశ్ గారిని చూసి చాలా నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. లొకేషన్ కి వచ్చిన ముందే డైలాగ్స్ అన్నీ నేర్చుకొని వస్తారు. యాక్షన్ సీన్స్ లో చాలా రిస్క్ లు తీసుకున్నారు. ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ చేశారు. ఇందులో ఆయనది చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. ఈ ప్రయాణంలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆయనకి సహనం ఎక్కువ. అది ఆయన నుంచి తప్పకుండా నేర్చుకోవాలి. ► దర్శకుడు శైలేష్ చాలా ప్రొఫిషనల్ డైరెక్టర్. తనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఎడిటింగ్ కూడా తన మైండ్ లో ఉంటుంది. ఎంత షూట్ చేయాలనేది తనకు పూర్తి క్లారిటీ ఉంటుంది. నా క్యారెక్టర్ ని చాలా ఇంప్రవైజ్ చేశాడు. అవకాశం ఉన్న ప్రతి చోట మెరుగుపరిచాడు. తను కథ చెప్పినప్పుడే ఇది తప్పకుండా పెద్ద విజయం సాధించే చిత్రం అవుతుందనే నమ్మకం కలిగింది. కథని ఎంత అద్భుతంగా చెప్పాడో అంతే అద్భుతంగా చిత్రాన్ని తీశాడు. తను చిత్ర పరిశ్రమలోకి వచ్చి కేవలం ఐదేళ్ళు అవుతుంది. కానీ చాలా అపూర్వమైన అనుభవం అతనిలో కనిపిస్తుంది. అన్ని విషయాలపై తనకి సంపూర్ణమైన స్పష్టత వుంటుంది. ► ఈ సినిమా షూటింగ్ సమయంలో చిన్న ప్రమాదం జరిగింది. శ్రీలంక షెడ్యూల్లో ఈ ప్రమాదం జరిగింది. సముద్రంలో బోట్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నాం. బోట్ పై స్పీడ్ గా వెళుతున్నాను. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. దీంతో ఒక్కసారి బోట్ వదిలేసి అలతో పాటు పైకి లేచాను. అదృష్టవశాత్తు.. మళ్ళీ బోట్ లోనే ల్యాండ్ అయ్యాను. ఆ సీన్ సినిమాలో ఉంటుంది. ఆ సీక్వెన్స్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ► టాలీవుడ్లో వర్కింగ్ స్టైల్ బాగుంది. ఇక్కడ వర్క్ చాలా ప్రొఫెషనల్ గా ఉంది. సమయపాలన చక్కగా ఉంది.నాని, రానా నాకు మంచి స్నేహితులు. వారితో కలసినప్పుడు నటన గురించి చాలా అంశాలని పంచుకున్నాం. ► ఓషో పాత్ర చేయాలని నా కోరిక. అవకాశం వస్తే ఆయన బయోపిక్‌లో నటిస్తాను. -
Saindhav: వెంకటేశ్ ‘సైంధవ్’ మూవీ స్టిల్స్
-
వెంకటేశ్ ‘సైంధవ్’ మూవీ టీజర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
వారివల్లే ఈ ప్రయాణం సాధ్యమైంది
‘‘నా మొదటి సినిమా(కలియుగ పాండవులు) నుంచి ఇప్పుడు 75వ సినిమా ‘సైంధవ్’ వరకూ నన్ను ఎంతగానో ప్రేమించి, ఆదరించి, అభిమానిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత వల్లే ఈ ప్రయాణం సాధ్యపడింది. ఇందుకు ప్రేక్షకులకు, నా అభిమానులకు, చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సైంధవ్’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ‘సైంధవ్’ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘బలమైన భావోద్వేగాలు, యాక్షన్‌కి అవకాశం ఉన్న కథ ‘సైంధవ్’. కుటుంబ ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుంది. ఇందులో నన్ను కొత్తగా చూస్తారు. గతంలో నా సినిమాలు ‘చంటి, కలిసుందాం రా, లక్ష్మి’ సంక్రాంతికి వచ్చి, హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘సైంధవ్’ వస్తోంది. సంక్రాంతి రోజు ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూడబోతున్నారు’’ అన్నారు. ‘‘ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ‘‘వెంకటేశ్‌గారి ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘వెంకటేశ్‌గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. -
ఫీమేల్ గెటప్‌లో మెప్పించేందుకు ప్లాన్ చేస్తున్న హీరోలు
క్యారెక్టర్ డిమాండ్‌ని బట్టి గెటప్ మారుతుంది. ఒక్కోసారి మేల్ ‘ఫీమేల్’గా మారాల్సి వస్తుంది. ఫీమేల్ ‘మేల్’గా మారాల్సి వస్తుంది. అలా క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఇద్దరు హిందీ హీరోలు ఫీమేల్ గెటప్‌లోకి మారారు. ఇటు సౌత్‌లో ఇద్దరు హీరోలు లేడీ గెటప్స్‌లోకి మారనున్నారు. ఆ ఫీ‘మేల్’ విశేషాలు... ఆయుష్ఉమన్ ‘‘అయ్య బాబోయ్.. స్త్రీ పాత్ర చేయడం అంత ఈజీ కాదండోయ్’’ అంటున్నారు ఆయుష్మాన్ ఖురానా. ‘డ్రీమ్ గర్ల్ 2’లో తను చేసిన పూజ పాత్ర గురించే ఆయన అలా అన్నారు. ‘అంధాధున్’లో అంధుడిగా, ‘బాలా’లో బట్టతల ఉన్న యువకుడిగా.. ఇలా వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన ఆయుష్మాన్ ‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్రంలో కరణ్వీర్ అనే యువకుడిగా, పూజ అనే యువతిగా కనిపించనున్నారు. 2019లో ఆయుష్మాన్ హీరోగా నటించిన ‘డ్రీమ్ గర్ల్’కి ఇది సీక్వెల్. తొలి భాగాన్ని తెరకెక్కించిన రాజ్ షాండిల్యానే మలి భాగానికి కూడా దర్శకత్వం వహించారు. ఫస్ట్ పార్ట్‌లోనూ పూజ పాత్రలో కనిపించిన ఆయుష్మాన్ సెకండ్ పార్ట్‌లోనూ ఆ పాత్ర చేశారు. ఓ చిన్న పట్టణానికి చెందిన కరణ్ తన తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి కష్టాలుపడుతుంటాడు. అతని ప్రేయసి పరీ (అనన్యా పాండే). అయితే ఆమెను పెళ్లాడటానికి పరీ తండ్రి కరణ్‌కి కొన్ని నిబంధనలు పెడతాడు. తన ముందున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి పూజాగా మారతాడు కరణ్. ఇలా కష్టాల కరణ్‌గా, నవ్వులు పూయించే పూజాగా ఆయుష్మాన్ నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ ఈ నెల 25న విడుదల కానుంది. కాగా.. ‘‘స్త్రీ వేషం చాలా సవాల్‌గా అనిపించింది. ముఖ్యంగా ఎండల్లో విగ్ పెట్టుకుని నటించడం కష్టంగా అనిపించింది. ఈ ఆయుష్‘మాన్’ చేసిన ఆయుష్‘ఉమన్’ని ఇష్టపడతారని ఆశిస్తున్నాను’’ అన్నారు ఆయుష్. అమ్మాయిగా ఆలోచించాలి ‘‘ఫీమేల్ ఆర్టిస్టులు వ్యానిటీ వేన్ నుంచి బయటకు రావడానికి అన్నేసి గంటలు ఎందుకు పడుతుందో నాకిప్పుడు అర్థమైంది. మేల్ ఆర్టిస్ట్‌ల మేకప్‌తో పోల్చితే ఫీమేల్‌కి చాలా ఎక్కువ టైమ్ పడుతుంది. నేను చేసిన స్త్రీ పాత్ర మేకప్‌కి మూడు గంటలు పట్టేది’’ అని నవాజుద్దీన్ సిద్ధిఖీ అంటున్నారు. ‘హడ్డీ’ చిత్రంలో తాను చేసిన లేడీ క్యారెక్టర్ గురించే నవాజుద్దీన్ ఈ విధంగా అన్నారు. అక్షయ్ అజయ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఓ చిన్న పట్టణానికి చెందిన హరి అనే యువకుడికి అమ్మాయిగా మారాలనే ఆకాంక్ష ఉంటుంది. లింగ మార్పిడి గురించి ఈ చిత్రంలో చూపించారు. ‘‘అమ్మాయి పాత్ర చేయడానికి అమ్మాయిలా మేకప్ వేసుకుంటే చాలదు.. అమ్మాయిలానే ఆలోచించాలి. నేను అలానే చేశాను’’ అంటూ ఈ పాత్రలో తానెంతగా లీనమయ్యారో చెప్పారు నవాజుద్దీన్. ఇదిలా ఉంటే... వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’లో ఆయన విలన్‌గా నటిస్తున్నారు. తెలుగులో నవాజుద్దీన్‌కి ఇది తొలి చిత్రం. పదిహేనేళ్ల తర్వాత... వైవిధ్యమైన పాత్రలకు చిరునామా కమల్‌హాసన్. ఫిజికల్లీ చాలెంజ్డ్, చిన్న వయసులో వృద్ధుడిగా, ఎత్తు పళ్లు, వృద్ధురాలిగా.. ఇలా క్యారెక్టర్ డిమాండ్ మేరకు మౌల్డ్ అవుతారు కమల్‌హాసన్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లోనే వచ్చిన ‘ఇండియన్’ (1996) చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో కమల్ యువకుడిగా, వృద్ధుడిగా కనిపించనున్నారని తెలిసిందే. కొన్ని సన్నివేశాల్లో స్త్రీగానూ కనిపించనున్నారన్నది తాజా సమాచారం. ఇదే నిజమైతే పదిహేనేళ్ల తర్వాత కమల్ స్త్రీ వేషంలో కనిపించినట్లు అవుతుంది. గతంలో కమల్‌హాసన్ ‘భామనే సత్యభామనే’ (1996), ‘దశావతారం’ (2008)లో లేడీ గెటప్‌లో కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ‘ఇండియన్ 2’ విషయానికి వస్తే.. ఓ సమస్య పరిష్కారానికి కమల్ స్త్రీ వేషంలోకి మారతారని టాక్. లేడీ గెటప్ పై ఫోకస్ విశ్వక్ సేన్లో మంచి నటుడు–దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. ఆ తర్వాత ‘హిట్’, ‘పాగల్’... ఇలా హీరోగా ఒకదానికి ఒకటి పోలిక లేని చిత్రాలు చేస్తున్న విశ్వక్ ఆ మధ్య ఓ సినిమా ప్రమోషన్ సమయంలో తాను ఒక సినిమాలో లేడీ గెటప్‌లో కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అయితే జస్ట్ కొన్ని సన్నివేశాల్లో అలా కనిపించి మాయం కాకుండా సినిమా సెకండాఫ్ మొత్తం ఆ గెటప్‌లోనే కనిపించనున్నారని సమాచారం. అందుకే ఈ చిత్రానికి ‘లీల’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని భోగట్టా. ఈ చిత్రం గురించి, ఈ పాత్ర గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం విశ్వక్ ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గామి’తో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నారు. మరి.. వీటిలో ఏదైనా సినిమాలో లేడీ గెటప్ ఉంటుందా? లేక వార్తల్లో ఉన్న ప్రకారం ‘లీల’ అనే సినిమా ఉంటుందా? అనే క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
త్వరలో ఫైనల్ మిషన్
మిషన్‌ను పూర్తి చేయడానికి వెంకటేశ్ రెడీ అవుతున్నారు. వెంకటేశ్ హీరోగా ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘సైంధవ్’. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్లుగా నటిస్తున్నారు, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా కీలక షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో ముగిసింది. ప్రధానంగా వెంకటేశ్, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్ ΄ాల్గొనగా ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలోనే ఈ సినిమా ఫైనల్ మిషన్ (ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ) ఆరంభం కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది. వెంకటేశ్ కెరీర్లో 75వ చిత్రంగా రూ΄÷ందుతున్న ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు. -
టూమచ్ ఓవరాక్షన్ అని చెడామడా తిట్టాడు, రాత్రంతా నిద్రపోలే: నటుడు
సినీప్రియులకు ఫేవరెట్ హీరోలుంటారు. అలాగే ఆ హీరోలు కూడా కొంతమంది స్టార్స్‌ను ఇష్టపడతారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖికి కూడా హాలీవుడ్ స్టార్స్ రాబర్ట్ డి నిరో, అల్ పాసినో అంటే ఎంతో ఇష్టం. వారిని చూసి ఇన్స్పైర్ అయిన అతడు అచ్చం వారిలాగే ఉండేందుకు ప్రయత్నించాడట. నడక, మాటతీరు ఆఖరికి నిద్రించే భంగిమలో కూడా సదరు స్టార్స్‌నే అనుకరించాడట! అయితే దీనివల్ల ఓసారి డైరెక్టర్‌తో నానామాటలు పడ్డాడంటున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను హాలీవుడ్ హీరోలను అనుకరిస్తుంటే మా టీచర్ వద్దని వారించింది. అయినా నేను పట్టించుకోలేదు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమా మొదటి రోజు షూట్లో నేను అల్ పాసినోలా స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్లాను. అతడిలాగే మాట్లాడాను. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌కు నా తీరు ఏమాత్రం నచ్చలేదు. పొద్దునంతా ఓపిక పట్టిన ఆయన రాత్రి నన్ను చెడామడా తిట్టాడు. నువ్వు అల్ పాసినోలా ప్రవర్తిస్తూ చాలా టూమచ్ ఓవరాక్షన్ చేస్తున్నావు అని ఫైర్ అయ్యాడు. నాకు తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. అవమానంతో రాత్రంతా సరిగా నిద్ర కూడా పట్టలేదు. తెల్లారి సెట్స్‌కు నేను పూర్తిగా నవాజ్‌లాగే వెళ్లాను' అని చెప్పుకొచ్చాడు నవాజుద్దీన్ సిద్దిఖి. ఇతడు చివరిసారిగా టికు వెడ్స్ షెరు చిత్రంలో నటించాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం అతడు జోగిరా సారా రారా, అఫ్వాహ్ సినిమాలు చేస్తున్నాడు. చదవండి: చవక రేటుకే ఆదిపురుష్ 3D టికెట్లు -
రొమాన్స్‌కు వయసుతో పనేంటి?.. ట్రోల్స్‌పై హీరో స్ట్రాంగ్ కౌంటర్
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ జంటగా నటించిన చిత్రం టిక్కు వెడ్స్ షేరు. ఈ చిత్రానికి సాయి కబీర్ దర్శకత్వం వహించగా.. కంగనా రనౌత్ నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే ట్రైలర్లో హీరోయిన్ను నవాజుద్దీన్ కిస్ చేయడంపై విమర్శలొచ్చాయి. 50 ఏళ్ల నటుడితో 21 ఏళ్ల అమ్మాయికి రొమాంటిక్ సీన్స్ ఏంటని కొందరు ట్రోల్స్ చేశారు. తాజాగా ఆ సీన్‌పై వస్తున్న విమర్శలకు నవాజుద్దీన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇటీవల మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవాజుద్దీన్ విమర్శలపై స్పందించారు. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి! ) నవాజుద్దీన్ మాట్లాడుతూ..'హీరో, హీరోయిన్లకి ఏజ్ గ్యాప్ అనేది పెద్ద సమస్య కాదు. రొమాన్స్‌కు వయసుతో సంబంధం లేదు. ముఖ్యంగా ఇప్పుడున్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇప్పటికీ రొమాంటిక్ రోల్స్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ హీరోలు పనికిరాని వారు కాబట్టే. వారికేదో రొమాన్సే తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లవ్, బ్రేకప్ అన్నీ వాట్సాప్‌లోనే జరుగుతున్నాయి. దీని వెనుక ఓ కారణం ఉంది. జీవితంలో రొమాన్స్ ఎవరైతే చేస్తారో.. వాళ్లు మాత్రమే ఇలాంటి సీన్స్ చేయగలరు.' అని కాస్తా గట్టిగానే కౌంటరిచ్చారు. కాగా.. టికు వెడ్స్ షేరు మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23న విడుదల కానుంది. నవాజుద్దీన్ ప్రస్తుతం వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సైంధవ్‌లో విలన్‌గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో వికాస్ మాలిక్‌గా కనిపించనున్నారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో ఉండాలని రాలేదు.. స్టార్ డైరెక్టర్ సంచలన నిర్ణయం.!) -
ఇప్పటి హీరోలు అందుకు పనికి రారు.. మా కాలంలో అయితే..: నటుడు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నిర్మిస్తున్న చిత్రం టీకూ వెడ్స్ షెరు. ఇందులో దాదాపు 50 ఏళ్ల వయసున్న సీనియర్ హీరో నవాజుద్దీన్ సిద్దిఖి 21 ఏళ్ల కుర్ర హీరోయిన్ అవనీత్ కౌర్‌తో జంటగా నటించాడు. వీళ్లిద్దరి మధ్య వయసు వ్యత్యాసం దాదాపు 29 ఏళ్లుగా ఉంది. ఇకపోతే టీకూ వెడ్స్ షెరులో హీరోహీరోయిన్స్ రెచ్చిపోయి మరీ లిప్‌లాక్స్ ఇచ్చుకున్నారు. ఈ ట్రైలర్ చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు. సగటు సినీప్రేక్షకుడు ఈ సన్నివేశాలను జీర్ణించుకోలేకపోయారు. కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ చేయడానికి సిగ్గనిపించడం లేదా? అని నటుడిని తిట్టిపోస్తున్నారు. తాజాగా ఈ విమర్శలపై నవాజుద్దీన్ సిద్దిఖి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'అసలు మీ సమస్యేంటి? రొమాన్స్‌కు వయసుతో సంబంధమేంటి? మా కాలంలో రొమాన్స్‌ను స్పెషల్‌గా చూసేవాళ్లం. సంవత్సరాల తరబడి ప్రేమలో మునిగి తేలేవాళ్లం. ఇప్పటితరానికి రొమాన్స్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడున్న హీరోలు అలాంటి పాత్రలు చేయడానికి కూడా పనికి రారు. అందుకే షారుక్ ఖాన్ ఇప్పటికీ రొమాంటిక్ రోల్స్ చేస్తున్నారు. అయినా ఇప్పుడు ప్రేమ, బ్రేకప్.. వంటిదంతా వాట్సప్‌లోనే జరిగిపోతోంది. ఇంక నిజమైన రొమాన్స్‌కు చోటెక్కడుంది?' అని ప్రశ్నించారు. కాగా టీకూ వెడ్స్ షెరు చిత్రంలో నవాజ్ జూనియర్ ఆర్టిస్ట్‌గా, అవనీత్ కౌర్ నటి కావాలన్న యువతి పాత్రలో నటిస్తున్నారు. మణికర్ణిక ఫిలింస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం జూన్ 23న విడుదల కానుంది. చదవండి: రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన తొలి చిత్రం? -
నటుడితో విభేదాలు.. మరొకరితో లవ్‌లో పడ్డ నవాజుద్దీన్ భార్య!
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి- ఆలియాలు ఏదో ఒక వివాదంతో గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. విడాకులు, ఆస్తుల విషయంలో వీరి మధ్య వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే! తనను, తన పిల్లలను రోడ్డున వదిలేశాడని ఆలియా, ఆమె తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందంటూ నవాజుద్దీన్ కోర్టు మెట్లెక్కారు. వీరిద్దరూ విడిపోయారే కానీ ఇంతవరకు అధికారికంగా విడాకులు మంజూరు కాలేదు. అయితే ఆలియా అప్పుడే తన జీవితంలో మరో అడుగు ముందుకు వేసినట్లు కనిపిస్తోంది. తన లైఫ్‌లోకి ఓ ముఖ్యమైన వ్యక్తిని స్వాగతించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'ఒక బంధం నుంచి బయటపడటానికి 19 ఏళ్లు పట్టింది. కానీ నా జీవితంలో అందరికంటే నా పిల్లలకే తొలి ప్రాధాన్యతనిస్తాను. నేనిచ్చే ప్రాధాన్యతలో ఎటువంటి మార్పు లేదు. కానీ కొన్ని బంధాలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి స్నేహం కన్నా ఎక్కువైనవి. ప్రస్తుతం నేను అదే బంధంలో మునిగి తేలుతున్నాను. అందుకు చాలా సంతోషంగానూ ఉంది. ఈ హ్యాపీనెస్‌ను మీతో పంచుకోవాలనుకున్నాను. నాకు ఆనందంగా ఉండే హక్కు లేదంటారా? చెప్పండి..' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది ఆలియా. ఇది చూసిన నెటిజన్లు 'ఇప్పటికైనా సంతోషంగా ఉన్నావు, అది చాలు', 'ఇక మీదట నీ జీవితప్రయాణం సుఖసంతోషాలతో సాగాలని కోరుకుంటున్నాను' అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin) చదవండి: గ్రాండ్‌గా సీనియర్ నటి సుమలత తనయుడి వివాహం, పెళ్లి ఫోటోలు వైరల్ -
దీర్ఘాలోచనలో శ్రద్ధా శ్రీనాథ్.. డిసెంబర్ 22న తెలుస్తుంది
క్యాబ్‌లో వెళుతోంది మనోజ్ఞ. కారులోనే లంచ్ ముగించాలనుకుంది. బాక్స్ ఓపెన్ చేసింది కానీ ఏదో దీర్ఘాలోచనలో పడింది. ఏ విషయం గురించి మనోజ్ఞ ఆలోచిస్తోందో ‘సైంధవ్’ చిత్రంలో తెలుస్తుంది. వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె పాత్ర పేరు మనోజ్ఞ. ఈ పాత్రను పరిచయం చేస్తూ, శనివారం లుక్‌ని విడుదల చేశారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతోంది. ‘‘ఇప్పటివరకూ శ్రద్ధా శ్రీనాథ్ చేసిన పాత్రల్లో మనోజ్ఞ బెస్ట్ అని చెప్పొచ్చు. నటనకు పూర్తిగా అవకాశం ఉన్న పాత్ర ఆమెది’’ అని చిత్రబృందం పేర్కొంది. హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగు తెరకు పరిచయంకానున్న ఈ చిత్రం దక్షిణాది భాషల్లోను, హిందీలోనూ డిసెంబర్ 22న విడుదల కానుంది. -
యాక్షన్ ఎంటర్టైనర్గా 'సైంధవ్'.. తొలి షెడ్యూల్ పూర్తి
వెంకటేశ్ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సైంధవ్’. ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. ఈ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు, ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు వెంకటేశ్ పాల్గొనగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ మంగళవారం వెల్లడించింది. ఓ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్‌ను కూడా వేశారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగుకి పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: ఎస్. మణికందన్, సహనిర్మాత: కిషోర్ తాళ్లూరు. -
మాజీ భార్యపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన నటుడు
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ తన మాజీ భార్య ఆలియాపై పరువు నష్టం దావా వేశారు. ఇటీవలి కాలంలో నవాజుద్దీన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరికి విడాకులు, ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఆలియా అయితే సోషల్ మీడియా వేదికగా నవాజుద్దీన్‌పై పలుమార్లు ఆరోపణలు చేసింది. అయితే అసత్యాలు ప్రచారం చేస్తూ,తన పరువుకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ నవాజుద్దీన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మాజీ భార్య ఆలియాతో పాటు సోదరుడు షంసుద్దీన్పై కూడా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలాగే తన పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టకుండా నిలువరించాలని పిటిషన్లో కోరారు. 2008 నుంచి తన దగ్గర మేనేజర్‌గా పనిచేస్తున్న తన సోదరుడు షంసుద్దీన్ ఆ సమయంలో క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్వర్డ్లు తీసుకొని తనను ఆర్థికంగా మోసం చేసి అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశాడని పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు ఆలియాను సైతం ఉసిగొల్పాడని నవాజ్ తెలిపాడు. -
భార్య, పిల్లలను ఇంట్లో నుంచి గెంటేసిన స్టార్ హీరో
నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. బాలీవుడ్ నటుడిపై అతని భార్య ఆలియా సంచలన కామెంట్స్ చేశారు. తనను , పిల్లలను ఇంటినుంచి గెంటేశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత కొంత కాలంగా వీరిద్దరికి విడాకులు, ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. కాగా.. ఇటీవల నవాజుద్దీన్ అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కలవడానికి ముంబైలోని వెర్సోవాలోని తన బంగ్లాకు చేరుకున్నాడు. అయితే అక్కడ ఇంట్లోకి రాకుండా సోదరుడు ఫైజుద్దీన్ అడ్డుకున్నాడని నవాజుద్దీన్ ఆరోపించారు. తాజాగా అతని భార్య ఆలియా బంగ్లా బయట నుంచి ఓ వీడియోను షేర్ చేసింది. అక్కడ ఆమె కుమార్తె షోరాను లోపలికి అనుమతించలేదని ఆ వీడియోలో ఏడుస్తూ కనిపించింది. నవాజుద్దీన్ భార్య ఆలియా మాట్లాడుతూ..' తన పిల్లలను కూడా విడిచిపెట్టని నవాజుద్దీన్ సిద్ధిఖీ నైజం ఇదే. 40 రోజుల పాటు ఇంట్లో ఉన్న నేను వెర్సోవా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. కానీ నేను తిరిగి వచ్చాక నవాజుద్దీన్ సిద్ధిఖీ మమ్మల్ని లోపలికి రానివ్వకుండా చాలా మంది కాపలాదారులను నియమించాడు.. నన్ను, నా పిల్లలను నడిరోడ్డుపై వదిలేశాడు.. తన సొంత తండ్రి తనతో ఇలా చేస్తాడని నా కుమార్తె నమ్మలేకపోయింది. రోడ్డుపై ఏడుస్తున్న మమ్మల్ని నా బంధువుల్లో ఒకరు ఇంటికి తీసుకువెళ్లారు. నా పిల్లలను ఇంట్లో నుంచి తరిమి రోడ్లపై నిలబెట్టిన వ్యక్తి నవాజుద్దీన్ సిద్ధిఖీ. అతని అసలు రూపం ఇదే. నవాజుద్దీన్ మీరు నన్ను మా నా పిల్లలను విచ్ఛిన్నం చేయలేరు. నేను న్యాయం జరిగే పోరాడుతూనే ఉంటానంటూ వీడియోలను షేర్ చేశారు. View this post on Instagram A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin) -
నా భర్త నాపై అత్యాచారం చేశాడు, సాక్ష్యం ఉంది: నటుడి భార్య
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖిపై అతడి భార్య ఆలియా మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. తన పిల్లలను తనక్కాకుండా చేయాలని కుట్రచేస్తున్నారంటూ బోరున విలపించింది. ఈ వీడియోను ఆలియా శుక్రవారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. 'నా పిల్లలకు అతడు ఎప్పటికీ తండ్రి కాలేడు. వాళ్లు ఎలా ఉన్నారని ఏరోజూ పట్టించుకోలేదు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడేదో మంచి తండ్రి అని నిరూపించుకునేందుకు నా పిల్లలను లాక్కోవాలని చూస్తున్నాడు. ఈ పిరికివాడు తన అధికారం చెలాయించి తల్లి నుంచి పిల్లలను వేరు చేయాలని చూస్తున్నాడు. డబ్బుతో మనుషులను కొనుక్కోగలవేమో కానీ నా పిల్లల్ని లాక్కోలేవు. అసలు వారిని ఎక్కడ ఉంచాలనుకుంటున్నావు? నీతో ఉంటారనుకుంటున్నావా? తండ్రి అంటే ఏంటో కూడా వారికి తెలియదు' అని ఏడ్చేసింది. 'నా పిల్లలను అక్రమం సంతానం అని నీ తల్లి నానా మాటలు అన్నప్పుడు నోరెత్తకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయావు. ఇప్పుడేమో గొప్ప మనిషివని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు... మహానటుడివి. సాక్ష్యాలతో సహా నాపై అత్యాచారం చేశావని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా. ఏం జరిగినా సరే మనసు లేని కర్కోటకుల చేతిలోకి నా పిల్లలను చేరనివ్వను' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది ఆలియా. కాగా తనకు సరైన తిండి పెట్టడం లేదని, కనీసం బాత్రూమ్ కూడా వినియోగించుకోవడం లేదని ఇదివరకే ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే! ఈ వ్యవహారంపై అటు ఆలియా, ఇటు నవాజుద్దీన్ కుటుంబం కోర్టు మెట్లెక్కారు. View this post on Instagram A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin) చదవండి: హైదరాబాద్‌లో చెప్పులు లేకుండా.. అమెరికాలో షూలతో -
నటుడి ఇంట్లో పనిమనిషి.. ఆహారం లేక అవస్థలు..!
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇంటి పనిమనిషి దుబాయ్‌లో అవస్థలు పడుతోంది. తినడానికి ఆహారం లేక దుర్భరమైన జీవితం అనుభవిస్తోంది. ఈ విషయాన్ని నవాజుద్దీన్ భార్య ఆలియా తరఫు న్యాయవాది తన ట్విటర్లో షేర్ చేశారు. సప్నా ఏడుస్తూ చెబుతున్న వీడియోను షేర్ చేస్తూ.. ఆమె ప్రస్తుతం దుబాయ్‌లో చిక్కుకుపోయిందని పేర్కొన్నారు. దుబాయ్‌లో నవాజుద్దీన్ ఇంటిలో అతని పిల్లలను చూసుకునేందుకు సప్నా అనే అమ్మాయిని నవంబర్‌లో 2022లో నియమించుకున్నారు. అయితే ట్విటర్లో సప్నా నియామకానికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఉంది. వీసా ఫీజుల పేరుతో నవాజుద్దీన్ ఆమెకు కనీసం జీతం కూడా ఇవ్వడం లేదని ఆలియా తరఫున న్యాయవాది ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సప్నా దగ్గర తినడానికి తిండి, డబ్బు లేదని వివరించారు. సప్నాను ఓ కెంపెనీలో సేల్స్ మేనేజర్‌గా నియమించుకున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలికను ఇండియాకు రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది రిజ్వాన్ అధికారులను కోరారు. నవాజుద్దీన్‌తో సప్న దిగిన ఫోటోను కూడా పంచుకున్నారు. సప్నా తనకు పెండింగ్‌లో ఉన్న జీతం చెల్లించాలని.. భారతదేశానికి తిరిగి వచ్చేలా ఏర్పాటు చేయాలని నవాజుద్దీన్‌ను వీడియోలో కోరింది. కాగా.. నవాజుద్దీన్ భార్య ఆలియా, అతని పిల్లలు షోరా, యాని 2021లో దుబాయ్‌కి వెళ్లారు. అయితే ఈ ఏడాది జనవరిలో ఆలియా భారతదేశానికి తిరిగి వచ్చారు. అతని అంధేరి బంగ్లాలో ఉంటున్నారు.మరోవైపు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన భార్య ఆలియాతో న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవలే దుబాయ్ నుంచి తిరిగొచ్చిన ఆలియా తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. The video & my statement speaks for itself. Govt authorities are requested to urgently rescue the house help of @Nawazuddin_S from Dubai where the girl is in a state of Solitary Confinement@cgidubai @UAEembassyIndia @LabourMinistry @HRDMinistry@MEAIndia @CPVIndia @OIA_MEA pic.twitter.com/EyQ8DiHPG2 — Advocate Rizwan Siddiquee (@RizwanSiddiquee) February 19, 2023 -
అతను పట్టించుకోలేదు.. డెలీవరీ ఖర్చుల కోసం ప్లాట్ అమ్మేశా: ప్రముఖ నటుడి భార్య
బాలీవుడ్ జంట నవాజుద్దీన్ సిద్దిఖి-ఆలియాల మధ్య విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా నవాజుద్దీన్‌కు దూరంగా ఉంటున్న ఆలియా.. మీడియా వేదికగా నవాజుద్దీన్‌పై విరుచుపడింది. అతను మంచి వాడు కాదని, మానసికంగా తనను వేధింపులకు గురి చేశాడని గతంలో చెప్పింది. తాజాగా ఆలియా ఓ వీడియోని షేర్ చేసింది. అందులో నవాజుద్దీన్‌కు, ఆమెకు మధ్య గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. *నేనంటే విలువలేని ఓ మనిషి కోసం నా జీవితంలో 18 ఏళ్లు కేటాయించినందుకు చింతిస్తున్నాను. 2004లో మొదటిసారి సిద్ధిఖీ కలిశాను. అప్పట్లో నేనూ, నవాజ్, ఆయన సోదరుడు చిన్న ఇంట్లో ఉండేవాళ్లం. కొంతకాలానికి నేను, నవాజుద్దీన్ చాలా దగ్గరయ్యాం. తను నన్ను ప్రేమిస్తున్నాడని, జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడని నమ్మాను. ఇద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆ సమయంలో నవాజ్‌కు సంపాదన లేదు. దాంతో నేనూ, ఆయన సోదరుడు కలిసే ఖర్చులన్నీ చూసుకునేవాళ్లం. 2010లో పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఏడాదికి ఓ బిడ్డకు జన్మనిచ్చాను. డెలీవరీ ఖర్చుల కోసం మా అమ్మ ఇచ్చిన ప్లాట్ అమ్మాను. అతనికి ఓ కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చాను. కానీ ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు. మానవత్వం లేని వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. నిజం చెప్పాలంటే అతడేమీ మంచి వాడు కాదు. పిల్లల్ని కూడా సరిగ్గా చూడడు. ఇంతకాలం తర్వాత ఇప్పుడు నాపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాడు. మొదటి సంతానం తర్వాత నాకు విడాకులు ఇచ్చేశానని ప్రచారం చేశాడు. అతని మాటలు మానసికంగా ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నాయి’ అని ఆలియా రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin) -
భార్యకు వేధింపులు.. ఇంటికి రాకుండా హోటల్లోనే నటుడు!
బాలీవుడ్ జంట నవాజుద్దీన్ సిద్దిఖి- ఆలియా ఇంటి రచ్చ రోడ్డుకెక్కిన విషయం తెలిసిందే! కొంతకాలంగా నవాజుద్దీన్‌కు దూరంగా ఉంటున్న ఆలియా పాస్‌పోర్టు సమస్యలతో దుబాయ్ వెళ్లలేక నవాజుద్దీన్ ఇంటికి తిరిగొచ్చింది. కానీ తనకు ఇంట్లో ఉండే అర్హత లేదంటూ అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు విడాకులు మంజూరు కాలేదని, అలాంటప్పుడు ఇంట్లో ఉండే అర్హత తనకెందుకు లేదని తిరిగి ప్రశ్నించింది ఆలియా. అంతేకాకుండా సిద్దిఖి తల్లి తనను వేధింపులకు గురి చేస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత ఆలియాను ఇంట్లోకి రానిచ్చినప్పటికీ సరిగా తిండి పెట్టకుండా, వాష్‌రూమ్‌కు వెళ్లనివ్వకుండా వేధిస్తున్నారని, తను ఉన్న హాలులో సీసీ కెమెరాలను అమర్చారంటూ ఆమె తరపు న్యాయవాది సంచలన ఆరోపణలు చేశాడు. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న సమయంలో సిద్దిఖి కీలక నిర్ణయం తీసుకున్నాడట. ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చేదాకా అతడు హోటల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సిద్దిఖి స్నేహితుడు వెల్లడించాడు. చదవండి: హీరోయిన్ ఇంట మోగిన పెళ్లి బాజాలు -
కనీసం వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనివ్వట్లేదు.. నటుడిపై సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, తన భార్య ఆలియా సిద్ధిఖీతో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పాస్‌పోర్ట్ సమస్యలతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆలియా ముంబయి బాంద్రాలోని సిద్ధిఖీ ఇంటికి తిరిగొచ్చింది. అయితే ఆమెకు ఇక్కడ ఉండే అర్హత లేదంటూ నవాజుద్దీన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తనను ఇంట్లో వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆలియా ఆరోపించింది. కనీసం అన్నం కూడా తిననివ్వడం లేదని.. వాష్‌రూమ్‌కు వెళ్లనివ్వట్లేదని వాపోయింది. తాజాగా తన లాయర్‌తో ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. అయితే నవాజుద్దీన్ సిద్ధిఖీ దాదాపు రెండేళ్లుగా తన భార్య ఆలియా సిద్ధిఖీతో విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఆలియా తరఫు న్యాయవాది రిజ్వాన్ స్టేట్మెంట్ సంచలనంగా మారింది. ఆలియా న్యాయవాది స్టేట్మెంట్లో రాస్తూ..' నా క్లైంట్‌ను అవమానిస్తున్నారు. ఆమెకు ఆహారం తిననివ్వడం లేదు. వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనివ్వట్లేదు. ఆమె చుట్టూ బాడీగార్డ్స్‌ను ఉంచారు. ఆస్తి విషయంలో కావాలనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టు చేయిస్తామని బెదిరించారు. ప్రతి రోజూ పోలీసులకు ఫోన్ చేస్తున్నారు. నవాజుద్దీన్, అతని కుటుంబ సభ్యులు గత ఏడు రోజులుగా నా క్లయింట్‌కు ఆహారం లేదు. ఆమె ఉన్న హాలులో సీసీ కెమెరాలను అమర్చారు. ఆమె ఇద్దరు పిల్లలు కూడా మైనర్లు.' అంటూ రిలీజ్ చేశారు. నవాజుద్దీన్-ఆలియాల వివాహం నవాజుద్దీన్, ఆలియా 2009లో వివాహం చేసుకున్నారు. వారికి కుమార్తె షోరా, కుమారుడు యాని సిద్ధిఖీ ఉన్నారు. 2021లో ఆలియా నవాజుద్దీన్ విడాకుల నోటీసులు పంపించింది. తమ 11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది. లాక్డౌన్ సమయంలో ఇది ఒక అవకాశంగా భావించానని ఆమె వెల్లడించింది. నవాజుద్దీన్, అతని కుటుంబం గృహ హింసకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. -
అన్నం కూడా తిననివ్వట్లేదు.. హీరో భార్య సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య సంచలన ఆరోపణలు చేసింది. ఆస్తి వివాదంలో ఆమెపై పోలీసులకు నవాజుద్దీన్ తల్లి మెహ్రునిసా సిద్ధిఖీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అతని భార్య ఆలియా కీలక వ్యాఖ్యలు చేసింది. తనను ఇంట్లో చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఆహారం తినేందుకు వెళ్తే వంటగదిలోకి కూడా రానివ్వడం లేదని వాపోయారు. కనీసం ఫుడ్ డెలీవరి ఏజెంట్లను సైతం ఇంట్లోకి అనుమతించలేదని తెలిపింది. అయితే అయితే పాస్‌పోర్ట్ సమస్యల కారణంగా ఆలియా ఇటీవలే తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆంధేరిలోని భర్త ఇంటికి తిరిగొచ్చింది. ఆలియా మాట్లాడుతూ.. 'నన్ను వంటగదిలోకి కూడా అనుమతించలేదు. రూమ్ సోఫాలోనే నా బెడ్‌ను తయారు చేసుకున్నా. ఆహారం పంపే నా స్నేహితులను లోపలికి రానివ్వలేదు. నేను బయటకు వెళ్లడానికి భయపడుతున్నా. కనీసం ఆహారం తీసుకునేందుకు గేటు వద్దకు వెళ్లలేకపోతున్నా. నా గది తలుపులు మూసి ఉంచారు. ఈ విషయంలో పోలీసులకు తన స్టేట్మెంట్ను నమోదు చేయడానికి రాలేదు. దీంతో తన లాయర్ ద్వారా దానిని పూర్తి చేయగలిగా. నాకు దశాబ్ద కాలంగా నవాజ్ తెలుసు. అందుకే అతనిని పెళ్లి చేసుకున్నా. కాబట్టి అతని భార్యగా నేను ఇంట్లో ఎందుకు ఉండకూడదు? డెలివరీ ఏజెంట్లను కూడా ఇంట్లోకి అనుమతించడం లేదు. న్యాయబద్ధంగా ఇంట్లో ఉండేందుకు నాకు హక్కుంది.' అని అన్నారు. (ఇది చదవండి: అతియా శెట్టి-కేఎల్ రాహుల్‌కు ఖరీదైన బహుమతులు...!) కాగా.. ఆలియా నవాజుద్దీన్ సిద్ధిఖీ రెండో భార్య. నవాజుద్దీన్, ఆలియా పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఏడాది క్రితమే వీరు విడిపోయారు. 2020లో ఆలియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నవాజ్ సోదరుడు శారీరక హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆ తర్వాత 2021లో నవాజుద్దీన్‌తో విడాకులు తీసుకోవాలనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. దుబాయ్ నుంచి ఆలియా తిరిగి రావడంతో నవాజుద్దీన్ తల్లి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంధేరి బంగ్లాలో ఆలియా ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అయితే ఆలియా ఆరోపణలపై నవాజుద్దీన్ సిద్ధిఖీ స్పందించలేదని తెలుస్తోంది. ఈ విషయంలో చట్టపరమైన మార్గంలో వెళ్లాలని అతను యోచిస్తున్నట్లు సమాచారం. -
అత్త, ఆడపడుచు ఇంట్లోకి రానివ్వట్లేదు: ఏడ్చేసిన నటుడి భార్య
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, భార్య ఆలియా సిద్దిఖీ మధ్య గతంలో విభేదాలు తలెత్తాయి. విడాకుల దాకా వెళ్లిన ఈ జంట చివరి నిమిషంలో పిల్లల కోసం ఆలోచించి మనసు మార్చుకున్నారు. అయితే కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న ఆలియా ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో చివరికి భర్త గూటికి చేరాలని నిర్ణయించుకుంది. కానీ ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదని అతడి తల్లి అడ్డు చెప్తోందని బోరున ఏడ్చేసింది ఆలియా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నా ఆర్థిక పరిస్థితి ఏమీ బాలేదు. కనీసం దుబాయ్‌కు వెళ్లడానికి కూడా పాస్‌పోర్ట్ లేదు. అందుకని అర్ధరాత్రి దిక్కుతోచని స్థితిలో నా భర్త ఇంటికి వెళ్లాను. కానీ అత్తయ్య మెహ్రునిసా, ఆడపడుచు శాబా.. నన్ను ఇంట్లో అడుగుపెట్టనివ్వలేదు. బయటకు వెళ్లిపోమని గొడవ చేశారు. పోలీసులను పిలిపించి నన్ను గెంటేయడానికి ప్రయత్నించారు. రాత్రిపూట నాకు ఒక దుప్పటి కూడా ఇవ్వలేదు. నేను నవాజ్ విడాకులు తీసుకున్నామని, నా రెండో బిడ్డ అతడికి పుట్టలేదంటూ అతడి తల్లి దారుణంగా మాట్లాడింది. పైగా ఇప్పుడు నామీదే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవాజుద్దీన్‌తో మాట్లాడదామంటే అతడు ఫోన్ కలవట్లేదు. నేను దుబాయ్ నుంచి వచ్చాక మా ఫ్రెండ్స్ రూమ్‌లో ఉన్నాను. నాకు అపెండెక్స్ ఆపరేషన్ జరిగి ఆస్పత్రిలో ఉంటే చూడటానికి కూడా ఎవరూ రాలేదు' అని వాపోయింది ఆలియా. కాగా ఆలియా తమ ఇంట్లోకి చొరబడటమే కాక బెదిరింపులకు పాల్పడిందంటూ నవాజుద్దీన్ సిద్దిఖీ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆమెకు సోమవారం ఉదయం సమన్లు జారీ చేశారు. చదవండి: పెళ్లిపీటలెక్కనున్న సీరియల్ నటి పారిపోయి పెళ్లి చేసుకున్నాం.. బతికున్నాడో, లేదో కూడా తెలీదు: నటి -
మూడు గంటల్లో ట్రాన్స్‌జెండర్‌గా మారిన బాలీవుడ్ నటుడు..ఎందుకంటే?
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెకుతున్న చిత్రం 'హడ్డీ'. ఈ సినిమాలో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, ఆనందితా స్టూడియోస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2023లో జీ స్టూడియోస్‌లో విడుదల కానుంది. 'హడ్డీ'లో ట్రాన్స్‌జెండర్ లుక్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తీవ్రంగా శ్రమించారు. దాదాపు మూడు గంటల పాటు మేకప్ కోసం కేటాయించాడు. ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్ధిఖీ న్యూ ట్రాన్స్‌జెండర్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జీ స్టూడియోస్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ట్రాన్స్‌జెండర్ మేకప్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తన కుర్చీకి దాదాపు మూడు గంటల పాటు అతుక్కుపోయారని వెల్లడించింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ..'నిపుణుల సమక్షంలో నేను కుర్చీలో దాదాపు మూడు గంటలు కూర్చోవడం నా కెరీర్లో ఇదే మొదటిసారి. ఈ పాత్రను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి కొత్త లుక్ నాకు శక్తినిచ్చింది. దీనిపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూసేందుకు నేను ఇక వేచి ఉండలేను' అని అన్నారు. View this post on Instagram A post shared by Zee Studios (@zeestudiosofficial) -
స్టార్ నటుడి భార్యపై కేసు.. రూ. 31 లక్షలు తిరిగి ఇవ్వట్లేదని ఫిర్యాదు
Nawazuddin Siddiqui Wife Aaliya Siddiqui: విలక్షణ పాత్రలతో బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. పాజిటివ్, నెగెటివ్ అన్న తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో అలరిస్తున్నాడు. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. సీరియస్ మెన్ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఎమ్మీ అవార్డ్‌కు సైతం నామినేట్ అయిన నవాజుద్దీన్.. థాక్రే, మాంటో, గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, భజరంగీ భాయిజాన్, బదలాపూర్, మాన్సూన్ షూట్ అవుట్ వంటి తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా నవాజుద్ధీన్ భార్య ఆలియా సిద్దిఖీపై కేసు నమోదైంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రస్తుతం 'హోలీ కౌ' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి నవాజుద్దీన్ సతీమణి ఆలియా సిద్దిఖీ నిర్మాతగా వ్యవహరిస్తోంది. మంజు అగర్వాల్ అనే యువతి నుంచి ఆలియా రూ. 31 లక్షలను అప్పుగా తీసుకుందని, తర్వాత అడిగితే సరిగ్గా స్పందింట్లేదని తెలుస్తోంది. దీంతో జూన్ 20న అంబోలి పోలీస్ స్టేషన్లో మంజు అగర్వాల్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ''ఆలియాతో నాకు 2005 నుంచి పరిచయముంది. మేమిద్దరం మంచి స్నేహితులం. ఆమె చాలా కాలం నుంచి నిర్మాతగా మారాలని ఎదురుచూస్తోంది. ఇక పరిస్థితులు అనుకూలించడంతో 'హోలీ కౌ' చిత్రంతో నిర్మాతగా మారింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన క్రియేటివ్ పనులు చూసుకోమ్మని, ఆర్థిక విషయాలను ఆమె చూసుకుంటానని చెప్పింది. దీంతో నటీనటుల విషయాలను నేను చూసుకున్నాను. కానీ వారికి చెల్లించాల్సిన చెక్కులు కొంతకాలానికే బౌన్స్ అయ్యాయి. దీంతో ఆలియాకు కొంచెం డబ్బులు అవసరం కావడంతో మా నాన్నను అడిగింది. ఉజ్జయినిలోని ఓ ఇంటిని అమ్మి ఆమెకు డబ్బు ఇచ్చారు మా నాన్న. నెల రోజుల్లోనే తిరిగి ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా ఆమె డబ్బు తిరిగి ఇవ్వలేదు'' అని మంజు అగర్వాల్ పేర్కొంది. -
ఇంతవరకు నేను సౌత్ సినిమాలే చూడలేదు: బాలీవుడ్ నటుడు
Actor Nawazuddin Siddiqui About South India Movies: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ల మధ్య నెలకొన్న ట్విటర్ వార్ గురించి తెలిసిందే. ఈ వార్ మధ్యలోకి ఆర్జీవీ దూరి బాలీవుడ్‌కు చురకలు అట్టించారు. దీంతో ఈ వివాదం మరింత ముదురింది. ఈ నేపథ్యంలో దీనిపై వరుసగా బాలీవుడ్, సౌత్ స్టార్స్ స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్, మనోజ్ బాజ్‌పాయి వంటి అగ్ర నటులు ఈ వివాదంపై స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి స్పందించారు. చదవండి: షాకింగ్: కెమెరామెన్‌పై తైమూర్ ఎలా అరిచాడో చూడండి తాజాగా ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో దక్షిణాది సినిమాలు ‘పుష్మ: ది రైజ్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీయఫ్ 2’లు బాలీవుడ్లో భారీ విజయం సాధించడంపై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. ‘నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నేను ఏ దక్షిణాది సినిమాలు చూడలేదు. సౌత్ సినిమాలనే కాదు, కమర్షియల్ సినిమాలంటే నాకు పెద్దగా ఆసక్తి ఉండదు. అందుకే అలాంటి సినిమాలు చూడను. అంతేగాక ప్రస్తుతం నాకు అంత సమయం కూడా లేదు. కాబట్టి నేను వీటి సక్సెస్‌పై ఎలాంటి కామెంట్ చేయలేను’ అని బదులిచ్చారు. అనంతరం తాజాగా పరిశ్రమలో నెలకొన్న హిందీ భాష వివాదం, బాలీవుడ్‌పై వస్తున్న విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. లాక్డౌన్ నుంచి సినిమాలపై ప్రేక్షకుడి అభిరుచి మారిందని ఆయన అన్నారు. ‘ఒక సినిమా హిట్ అయితే అంతా కలిసి దాన్ని ఆకాశానికెత్తడం. అంతగా కలెక్షన్స్ రాకుంటే వెంటనే విమర్శలు గుప్పించడం సాధారణమైంది. ఇప్పుడిదో ఫ్యాషన్ అయిపోంది. ఈ ట్రెండ్ కూడా పరిస్థితులను బట్టి మారుతోంది. బాలీవుడ్‌కు ఒక్క బ్లాక్‌బస్టర్ పడితే అంతా సర్దుకుంటుంది’ అన్నారు. చదవండి: Vishwak Sen: అంతా ఓకే అనుకునేసరికి ఆమె నన్ను వదిలేసిన విషయం తెలిసింది అలాగే లాక్డౌన్లో అంతర్జాతీయ సినిమాలు చూసిన ప్రేక్షకుడి అభిరుచిలో మార్పు వస్తుందని తాను ముందుగానే ఊహించానన్నారు. కానీ ఈ మార్పు అంత మంచిది కాదన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రేక్షకులు మసాలా కంటెంట్‌తో వస్తున్న సినిమాలనే ఎక్కువగా ఆదిరిస్తున్నారన్నారని ఆయన అభిప్రాయ పడ్డారు. ఇక తాము కూడా హీరో పంటి-2 వంటి కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, అవి కలెక్షన్ల పరంగా తమ సినిమాలు భారీ వసూళ్లు సాధించాలని కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1711356039.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'నటుడిగా పనికిరావు, పోయి ఇంకేదైనా పని చూసుకో అని హేళన చేశారు'
మనసుకు నచ్చిన పాత్రలతో పాటు వైవిధ్యానికి ఆస్కారమున్న రోల్స్ మాత్రమే చేసే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి. వందల అవకాశాలు తలుపు తట్టినా అందులో తనకు నచ్చిన నాలుగైదు ఆఫర్లకు మాత్రమే ఓకే చెప్పి, నచ్చనివాటన్నింటికీ నిర్మొహమాటంగా నో చెప్తాడు. అయితే నవాజుద్దీన్‌కు స్టార్డమ్ అంత ఈజీగా ఏం రాలేదు. మొదట్లో తనను చూసి అసలు నటుడిగానే లేవని, యాక్టింగ్‌కు నువ్వేం పనికి వస్తావని అనేవారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'నేనెక్కడికి వెళ్లినా ఒకటే అనేవారు.. నేను నటుడిగా పనికిరానని, ఇంకేదైనా పని చూసుకుంటే బెటర్ అని చెప్పేవారు. యాక్టర్స్ అసలు నీలా ఉండరు, నువ్వు ఎప్పటికీ నటుడివి కాలేవు. ఎందుకు సమయం వృధా చేస్తున్నావు? ఇంకేదైనా పని చూసుకో అని సలహాలిచ్చేవారు. ఏ ఆఫీస్ మెట్లెక్కినా ఇదే రిపీట్ అవుతూ ఉండేది. ఫైనల్‌గా ఓ పదేళ్లకు నన్ను నేను నటుడిగా నిరూపించుకోగలనన్న ధైర్యం వచ్చింది. ఎందుకంటే సరిగ్గా అప్పుడే రియలిస్టిక్ సినిమాలు తీసే డైరెక్టర్లు ఇండస్ట్రీకి వచ్చారు. మేము వారితో కలిసి పనిచేశాం. ఆ సినిమాలు పెద్దగా వర్కవుట్ అవలేవు కానీ వాటికి ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రశంసలు మాత్రం దక్కేవి' 'అది చూసిన కమర్షియల్ దర్శకులు మమ్మల్ని సినిమాల్లోకి తీసుకున్నారు. ఇక టీవీలో పని అడిగితే.. నిన్ను మేము తీసుకోలేము. ఎందుకంటే నీతో షూట్ చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ లైట్స్ వాడాలి. సాధారణంగా ఒకరోజులో ఒక ఎపిసోడ్ షూట్ చేస్తాం. కానీ నిన్ను తీసుకుంటే అది కాస్తా ఒకటిన్నర రోజు పడుతుంది. నీవల్ల మేము చాలా నష్టపోతాము. నువ్వు ఇంకెక్కడైనా చూసుకో అని హేళన చేశారు. అప్పుడు నేనిక సినిమాలే చేయాలని డిసైడ్ అయ్యాను. మొదట్లో నాకు కేవలం ఒకటీ రెండు నిమిషాల నిడివి ఉన్న పాత్రలే ఇచ్చేవారు. ఐదారేళ్లపాటు ఇదే కొనసాగింది. ఆ తర్వాత ఓ రెండు సన్నివేశాల్లో కనిపించే ఛాన్స్ ఇచ్చారు. ఈ ధోరణి మరో ఐదేళ్లపాటు సాగింది. పదేళ్ల కష్టం తర్వాతే నాకంటూ గుర్తింపునిచ్చే పాత్రలు వచ్చాయి' అంటూ తాను ఇండస్ట్రీలో పడ్డ కష్టాలను వివరించాడు నవాజుద్దీన్ సిద్ధిఖి. చదవండి: దీపికాకు అరుదైన గౌరవం, జ్యూరీ మెంబర్‌గా మన హీరోయిన్! సెల్ఫీ దర్శకుడికి బంపరాఫర్, స్టేజీపైనే రూ.10 లక్షల చెక్ -
3 నెలల్లో 200ల సినిమాల్లో అవకాశం.. 'నో' చెప్పిన నటుడు
Nawazuddin Siddiqui Reveals He Was Offered 200 Scripts In 3 Months: హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా తన విలక్షణమైన నటనతో దూసుకుపోతున్నాడు బీటౌన్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ. థాక్రే, మాంటో, గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, భజరంగీ భాయిజాన్, బదలాపూర్, మాన్సూన్ షూట్ అవుట్ వంటి తదితర చిత్రాలతో అలరించాడు. వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నవాజుద్దీన్ తాజాగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వద్దకు 3 నెలల్లో 200 స్క్రిప్ట్‌లు వచ్చాయని తెలిపాడు. కానీ వాటన్నింటికి 'నో' చెప్పి కేవలం ఐదింటికి మాత్రమే ఓకే చెప్పినట్లు పేర్కొన్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఎందుకంటే తాను కీర్తి, డబ్బు కోసం సినిమాలు ఒప్పుకోనని వివరించాడు. ఇప్పుడు తాను అంగీకరించిన చిత్రాల్లో విభిన్నమైనవి కాబట్టే ఒప్పుకున్నట్లు తెలిపాడు నవాజుద్దీన్. ఈ సినిమాల్లో ప్రయోగాలు చేసేందుకు అవకాశం ఉందని పేర్కొన్నాడు. కంటెంట్ లేని కథ అయిన సరే పాత్ర విభిన్నంగా, అద్భుతంగా ఉంటే చేస్తాని చెప్పుకొచ్చాడు. ముందుగా ఒక లైన్లో కథ వింటానని, అది ఆసక్తికరంగా ఉంటేనే పూర్తి కథ చెప్పమంటానని తెలిపాడు. 'చాలామంది బాలీవుడ్ తారలు విరామం కోసం దేశవిదేశాలకు వెళ్తుంటారు. కానీ నాకు మాత్రం సినిమాలు చేస్తుంటూనే రిలాక్స్‌గా ఉంటుంది.' అని నవాజుద్దీన్ సిద్ధిఖీ పేర్కొన్నాడు. ప్రస్తుతం 'హీరోపంతి 2', 'టికు వెడ్స్ షెరు' చిత్రాలలో నటించాడు. -
మూడేళ్ల కష్టం, బాలీవుడ్ నటుడి డ్రీమ్ హౌస్ చూశారా?
వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖి. తాజాగా అతడు ముంబైలో తన డ్రీమ్ హౌస్‌ను నిర్మించుకున్నాడు. దీనికి అతడే ఇంటీరియర్ డిజైనర్‌గా మారడం విశేషం. గ్రామంలో తన బాల్యాన్ని గడిపిన ఇంటిని గుర్తుకు తెచ్చేలా ఈ కొత్త బంగ్లాను నిర్మించాడట నవాజుద్దీన్. తండ్రి నవాబుద్దిన్ సిద్ధిఖి గుర్తుగా ఈ భవంతికి నవాబ్ అని నామకరణం చేశాడు. తన కలల సౌధాన్ని కళ్ల ముందు నెలకొల్పడానికి ఆయనకు మూడేళ్లు పట్టింది. ఈ మధ్యే ఈ డ్రీమ్ హౌస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడీయన. 'మంచి నటుడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. ఎందుకంటే లోపలున్న మనిషి ఎప్పుడూ మంచి పనులను చేయమని పురమాయిస్తుంటాడు' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. కాగా నవాజుద్దీన్ సిద్ధిఖి ఆ మధ్య బాలీవుడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే! చిత్ర పరిశ్రమలో నెపోటిజం కంటే కూడా ఎక్కువగా రేసిజం(జాత్యంహకారం) సమస్య ఉందని పేర్కొన్నాడు. పరిశ్రమలో పక్షపాతాలు పోవాలని, ఇప్పటికే దానివల్ల ఎంతోమంది గొప్ప నటులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ప్రస్తుతం ఆయన చేతిలో ఐదు సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui) -
బాలీవుడ్లో నెపోటిజం కాదు.. జాత్యాహంకారం ఉంది: నటుడు
వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్న నటడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఆయన ఇటీవల సుధీర్ మిశ్రా దర్శకత్వంలో చేసిన ‘సీరియస్ మెన్’లో తన నటనకు గానూ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు నామినేషన్ పొందాడు. ఈ తరుణంలో ఆయన బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్ర పరిశ్రమలో నెపోటిజం (బంధుప్రీతి) కంటే ఎక్కువగా రేసిజం (జాత్యాహంకారం) సమస్య ఉందని ఓ ఇంటర్వూలో తెలిపాడు. నవాజ్ మాట్లాడుతూ.. ‘సీరియస్ మెన్’ తర్వాత మరో మంచి సినిమాలో లీడ్ రోల్ వస్తే అదే ఇందిరా తివారికి విక్టరీ అని చెప్పాడు. అంతేకాకుండా..‘ బాలీవుడ్లో తెల్లగా ఉండేవాళ్లతో పాటు నల్లగా ఉండేవారు కూడా హీరోయిన్లు చేయాలని కోరుకుంటున్నా. మంచి సినిమాలు రావాలంటే ఇదే కాకుండా పరిశ్రమలో ఉన్న పక్షపాతాలు అన్ని పోవాలి. నేను చాలా సంవత్సరాలుగా దానికి వ్యతిరేకంగా పోరాడాను. ఎందుకంటే నేను పొట్టిగా ఉంటాను. నా పరిస్థితి బానే ఉంది కానీ ఈ రకమైన భేషజాల వల్ల ఎంతో మంది గ్రేట్ యాక్టర్స్ బలైపోయారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఆయన నటించిన ‘సీరియస్ మెన్’లో లీడ్ రోల్లో నటించిన ఇందిరా తివారి పొట్టిగా, నల్లగా ఉంటుంది. ఈ తరుణంలో ఆయన బాలీవుడ్ గురించి చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చదవండి: ఇప్పటికీ కుల వివక్షకు గురవుతున్నా! -
ఏడేళ్ల తర్వాత సోనాక్షి, తొలిసారి నవాజుద్దీన్
దాదాపు ఏడేళ్ల తర్వాత బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా సౌత్‌లో ఓ సినిమా ఒప్పుకున్నారు. అది కూడా తెలుగు సినిమా కావడం విశేషం. చిరంజీవి సరసన జోడీ కట్టనున్నారామె. 2014లో రజనీకాంత్ సరసన చేసిన ‘లింగా’ తర్వాత దక్షాణాదిన సోనాక్షి చేయనున్న సినిమా ఇదే కావడం విశేషం. మరో విశేషం ఏంటంటే... ఈ సినిమాలో చిరంజీవికి విలన్‌గా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించనున్నారు. రజనీ ‘పేట’ తర్వాత దక్షిణాదిన నవాజుద్దీన్ చేయనున్న సినిమా ఇదే. చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఓ సినిమా తెరకెక్కించనుంది. ఈ సినిమాతో సోనాక్షీ కథానాయికగా, నవాజుద్దీన్ ప్రతినాయకుడిగా తెలుగులోకి మెగా ఎంట్రీ ఖరారైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు చిరంజీవి. మలయాళ హిట్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్, మెహర్ రమేశ్ సినిమాలు కూడా లైనప్‌లో ఉన్నాయి గనక చిరంజీవి–బాబీ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి కాస్తంత సమయం పట్టేలా ఉంది. చదవండి: అందుకే విడాకులు రద్దు చేసుకుంటున్నాను: నటుడి భార్య -
ఆ సినిమాకు హీరో ఒక్క రూపాయి తీసుకున్నాడంతే!
ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్ హాసన్ మాంటో జీవిత కథ ఆధారంగా వచ్చిన చిత్రం "మాంటో". బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించాడు. నటి, దర్శకురాలు నందితా దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రిషి కపూర్, రన్వీర్ షోరే, జావేద్ అక్తర్, పరేష్ రావల్, దివ్యా దత్త కీలక పాత్రల్లో నటించారు. అయితే వీరందరూ ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా నటించారట. ఈ విషయాన్ని గతంలో నందితా దాస్ స్వయంగా మీడియాకు వెల్లడించింది. డబ్బుకు కాకుండా స్క్రిప్ట్‌కు విలువిచ్చి వారంతా పైసా తీసుకోలేదని పేర్కొంది. మరి ఈ సినిమాలో హీరోగా నటించిన నవాజుద్దీన్ ఎంత తీసుకున్నారనుకుంటున్నారు? అక్షరాలా ఒక్క రూపాయి. అవును, ఆశ్చర్యంగా ఉన్నా అదే నిజం. "మాంటో సినిమా ద్వారా నా ఆలోచనలను, ఆశయాలను వ్యక్తీకరించాలనుకున్న నేను నందిత దగ్గర నుంచి డబ్బులు ఆశించానంటే అంతకన్నా అపరాధం మరొకటి ఉండదు. కానీ ప్రొఫెషనల్ నటుడిగా ఒక్క రూపాయి మాత్రం తీసుకున్నాను" అని నవాజుద్దీన్ చెప్పుకొచ్చాడు. చదవండి: రూ. 175 కోట్ల బంగ్లాలో హీరోయిన్ సహజీవనం సౌత్ నిర్మాత తన గదిలోకి రమ్మన్నాడు: సీనియర్ నటి -
అందుకే విడాకులు రద్దు చేసుకుంటున్నాను: నటుడి భార్య
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య అలియా విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేశారు. పిల్లల భవిష్యత్ కోసం, తన కోసం తన భర్తతో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు.. ఈ క్రమంలో తమ వివాహ బంధానికి మరోక అవకాశం ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మీడియాకు వెల్లడించారు అలియా. గత ఏడాది మే నెలలో భర్త నవాజుద్దీన్‌పై అలియా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పదేళ్ల వివాహబంధంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. అలాగే నవాజుద్దీన్ సోదరుడు కూడా తనని వేధించినట్లు ఆరోపించారు. ఈ క్రమంలో నవాజుద్దిన్ నుంచి విడాకులు కోరుకుంటూ వాట్సాప్, ఈమెయిల్ ద్వారా ఆయనకు నోటీసులు కూడా పంపారు. కరోనా రాకపోయి ఉంటే.. ఈ జంట ఈ పాటికి విడాకులు పొందేవారు. అయితే దాదాపు ఏడాది తరువాత అలియా తన మనసు మార్చుకున్నారు. కోవిడ్ తన కళ్ళు తెరిపించిందని.. కష్ట సమయాల్లో తన భర్త నవాజుద్దిన్ పిల్లలతో పాటు తనని కూడా ఆదుకున్నారు అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను కోవిడ్ బారిన పడ్డ సమయంలో నా భర్త నాతో పాటు పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. నేను ఒత్తిడిలో ఉన్న ప్రతిసారి ఆయన తోడుగా నిలిచారు. మా పిల్లలకు మేము కావాలి, మేము కలిసి ఉండడమే వారికి సంతోషం. అందుకే మా మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నాం. మా వివాహ బంధానికి మరో అవకాశం ఇవ్వాలని భావించాను. అందుకే విడిపోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను’’ అన్నారు. ఇక ఇదే విషయంపై నవాజుద్దీన్ సైతం స్పందించారు. ‘‘పిల్లలు యాని, శోరా భవిష్యత్తే నా ప్రాధాన్యత. ఇప్పటికీ అలియా వాళ్ళ అమ్మనే. అలాగే మేము కలిసి పదేళ్లు కాపురం చేశాం. విషయం ఏదైనా నా సపోర్ట్ ఆమెకు ఎప్పుడూ ఉంటుంది. మా మధ్య ఉన్న విభేదాల వల్ల పిల్లలు బాధపడకూడదు. వారే నా మొదటి ప్రాధాన్యత’’ అన్నారు. అందుకే కలిసి ఉండడానికి ఇద్దరూ సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరి పెళ్లి బంధం కొనసాగుతుందని తెలుస్తోంది. చదవండి: ఇప్పటికీ కుల వివక్షకు గురవుతున్నా! ‘త్వరలోనే చాలా విషయాలు తెలుస్తాయి’ -
ఇప్పటికీ కుల వివక్షకు గురవుతున్నా!
ఢిల్లీ: నవాజుద్దీన్ సిద్దిఖీ... దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న నటుడు. వైవిద్యమైన పాత్రలతో బాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. పాత్ర ఏదైనా సరే, దానికి అనుగుణంగా నటించగలిగే సామర్థ్యం అతడి సొంతం. అలాంటి వ్యక్తి కూడా కుల వివక్షకు గురయ్యాడంటే నమ్మగలమా. కానీ తన స్వగ్రామంలో ఇంకా కుల వివక్షకు గురవుతున్నానని నవాజుద్దీన్ వెల్లడించాడు. ' నేను నటనతో ఫేమస్ అయినప్పటికీ మా గ్రామంలో నన్ను ఇంకా తక్కువ కులం వాడిలాగే చూస్తారు. కులం అనేది వారి నరనరాల్లో పాకి ఉంది. అది వారు గర్వంగా చెప్పుకుంటారు. మా అమ్మమ్మ తక్కువ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి మమ్మల్ని ఎప్పటికీ వారు అంగీకరించరు' అని సిద్దిఖీ పేర్కొన్నాడు. లాక్డౌన్ కారణంగా గత కొన్ని నెలలుగా సిద్దిఖీ తన స్వగ్రామంలోనే సమయం గడిపాడు. ఇటీవలే సుధీర్ మిశ్రా దర్శకత్వంలో 'సీరియస్ మెన్' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ఈ సినిమాలో సిద్దిఖీ ఒక దళితుని పాత్రలో నటించాడు. మనూ జోసెఫ్ రచించిన సీరియస్ మెన్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీయడం విశేషం. (ఇదీ చదవండి: ఒకానొక సమయంలో ఆత్మహత్యకు సిద్ధపడ్డాను) -
మరోసారి స్టేట్మెంట్ ఇచ్చిన సిద్దిఖీ భార్య
లక్నో : బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య అలియా ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బుధాన పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. గతంలో ఆమె తన కుటుంబంపై ముంబై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఆ తరువాత సాంకేతిక కారణాలతో ఆ కేసును పోలీసులు బుధాన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీసుల పిలుపు మేరకు ఆదివారం అక్కడకు చేరుకుని తన వాగ్మూలం నమోదు చేశారు. కాగా నవాజుద్దీన్ సిద్దిఖీ నుంచి విడిపోవాలని కోరుకుంటు అలియా ఇది వరకే విడాకుల నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సిద్దిఖీతో తనకున్న మనస్పర్ధాలతో పాటు ఆయన సోదరుడు షామాస్, కుటుంబ సభ్యులు కూడా కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు మే 7న నోటీసులు పంపినట్లు అలియా తరఫు లాయర్ అభయ్ తెలిపారు. విడిపోయిన అనంతరం అలియాకు చెల్లించాల్సిన భరణం గురించి కూడా ఇందులో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగానే నవాజుద్దీన్, ఆయన కుటుంబంపై అలియా తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఆకట్టుకుంటున్న ‘రాత్ అకేలి హై’ ట్రైలర్
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, హీరోయిన్ రాధిక ఆప్టే కలిసి నటించిన చిత్రం ‘రాత్ అకేలి హై’. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘రాత్ అకేలి హై’లో నవాజుద్దీన్ ఓ పవర్ఫుల్ ఇన్స్పెక్టర్ జతిల్ యాదవ్ పాత్రలో కనిపించగా, రాధిక నిందితురాలిగా కనిపిస్తారు. ఓ సంపన్న రాజకీయ నాయుడి హత్య కేసు దర్యాప్తు నేపథ్యంతో ఈ సినిమా కొనసాగుతుంది. ‘రాత్ అకేలి హై’కి కాస్టింగ్ డైరెక్టర్ హనీ ట్రెహన్ దర్శకత్వం వహించారు. అతనికి ఇది మొదటి సినిమా. ఈ చిత్రంలో నవాజుద్దీన్, రాధిక ఆప్టేతో పాటు ఆదిత్య శ్రీవాస్తవ, శ్వేతా త్రిపాఠి, ఇలా అరుణ్, ఖలీద్ త్యాబ్జీ, శివాని రఘువంశి, టిగ్మాన్షు ధులియా నటించారు. ఈ చిత్రం జూలై 31న నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది. (అలా అయితే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా : కంగన) ‘అత్యంత శక్తివంతమైనవారు సాధారణంగా చీకటి రహస్యాలను దాచిపెడతారు. చాలా పలుకుబడి ఉన్న స్థానిక రాజకీయ నాయకుడి కేసును విచారించడానికి ఒక చిన్న పట్టణ పోలీసుకు అప్పగించినప్పుడు ఏం జరుగుతుంది. అతను కేసును విచారించటంలో ఎంత మేరకు సిద్ధంగా ఉన్నాడు. సత్యం కోసం వెతకడానికి చీకటిలోకి వెళ్లాలి. కుటుంబానికి చెందిన వారే అనుమానితులుగా ఉన్న ఈ రహస్య హత్యలో ఇన్స్పెక్టర్ జతిల్ యాదవ్ కేసును ఏలా చేధిస్తారనేది సినిమాలో చూడాలని చిత్ర నిర్మాతల్లో ఒకరు పేర్కొన్నారు. -
భార్యకు నవాజుద్దీన్ లీగల్ నోటీసులు
ముంబై: బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన భార్య అలియాకు లీగల్ నోటీసులు పంపించినట్లు అతడి తరపు న్యాయవాది అద్నాన్ షేక్ తెలిపారు. అలియా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగిస్తుందని నవాజుద్దీన్ నోటీసులో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. మే 6న అలియా విడాకులు కోరుతూ నవాజుద్దీన్‌కు తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ నోటీసులో మెయింటెనెన్స్ కింద నెల నెల డబ్బులు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే దీనిపై నవాజుద్దీన్ ఇంతవరకు స్పందించలేదని, అతడు డబ్బులు పంపించకపోవడం వల్ల పిల్లల స్కూలు ఫీజులు చెల్లించలేకపోతున్నాని ఆమె మీడియా ఎదుట వాపోయారు. (‘త్వరలోనే చాలా విషయాలు తెలుస్తాయి’) దీనిపై నవాజుద్దీన్ న్యాయవాది అద్నాన్ షేక్ మాట్లాడుతూ.. ‘తన నోటిసుకు నవాజుద్దీని సకాలంలోనే స్పందించాడు. తను నోటీసులో పేర్కొన్నట్లుగానే నెలవారి భత్యం చెల్లిస్తున్నాడు. చెల్లింపుకు సంబంధించిన వివరాలు, స్క్రీన్షాట్లు కూడా ఉన్నాయి. పిల్లలకు సంబంధించిన ఖర్చులన్నింటినీ లాక్‌డౌన్‌కు ముందే అలియాకు చెల్లించాడు’ అని చెప్పుకొచ్చాడు. అయిన నవాజుద్దీన్‌కు అతడి కుటుంబానికి పరువు నష్టం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా అలియా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అందుచేతనే నవాజుద్దీన్, అలియాకు లీగల్ నోటీసులు పంపించాడని తెలిపారు. (పొలం పనుల్లో బిజీ అయిన స్టార్ నటుడు) ఇక నుంచి తనపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని, ఇటీవల చేసిన వ్యాఖ్యలకు వ్రాతపూర్వక వివరణ ఇవ్వాలని నవాజుద్దీన్ నోటీసులో పేర్కొన్నట్లు అద్నాన్ చెప్పారు. నవాజుద్దీన్, అలియాల విడాకుల విచారణపై ఆయన స్పందిస్తూ.. అలియా పంపించిన విడాకుల నోటిసుపై ఇప్పటికే మేము స్పందించామన్నాడు. ఇప్పుడు తమ నోటీసులకు అలియా సమాధానం ఇవ్వాలన్నారు. అలియా, నవాజుద్దీన్ ఆయన కుటుంబానికి పరువు నష్టం కలిగేలా ప్రచారం చేస్తున్నారని, ఇక మీదట అలాంటి ఆరోపణలు చేస్తే తనపై చట్టబద్దమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (రూ.30 కోట్లు అడగలేదు: నటుడి భార్య) -
పొలం పనుల్లో బిజీ అయిన స్టార్ నటుడు
లక్నో: కరోనా లాక్‌డౌన్‌తో ఇంటికి పరిమితమైన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ రైతుగా మారారు. తన సొంత ఊరిలో వ్యవసాయం చేస్తున్నారు. అతనికి వ్యవసాయమంటే చాలా ఇష్టమట. తన వ్యవసాయ క్షేత్రంలోని పచ్చని పొలాల్లో పనిచేసిన సిద్ధిఖీ, కాలువలోని నీటితో చేతులు శుభ్రం చేసుకుంటూ కనిపించారు. తలకు కండువా కట్టుకుని.. భుజంపై పార పెట్టుకుని ఉన్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సిద్ధిఖీ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఈరోజుకి పని పూర్తయింది..’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. (చదవండి: ‘సుశాంత్ ఈ లోకాన్ని విడిచి వారం గడిచింది’) కాగా, నవాజుద్దీన్ సిద్దిఖీ సొంతూరు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్. అతడి సోదరి ఇటీవల మరణించడంతో ప్రభుత్వ అనుమతులు తీసుకుని అంత్యక్రియలకు హాజరయ్యాడు. అనంతరం 14 రోజుల క్వారైంటన్ పూర్తి చేసుకుని సొంతూరిలో రైతుగా మారిపోయాడు. తన తల్లి కోసమే ప్రస్తుతం అక్కడ ఉంటున్నట్టు సిద్ధిఖీ ఇదివరకే తెలిపారు. కాగా, భార్య ఆలియా అతనికి విడాకుల నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే దానిపై అతను ఇంకా స్పందించలేదు. (చదవండి: కేసు వాపసు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు) -
నవాజుద్దీన్ సిద్ధిఖీ కుటుంబం నుంచి బెదిరింపులు
బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తమ్ముడు తనను లైంగికంగా వేధించాడంటూ సిద్ధిఖీకి వరసకు కూతురయ్యే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని నవాజుద్దీన్ కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని ఆమె మీడియా ముందు వాపోయారు. కేసు వాపసు తీసుకోకుంటే తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తామంటున్నారని, ఈ విషయం గురించి తనకు ఆందోళనగా ఉందని ఆమె పేర్కొంది. కాగా ఐదేళ్లలో మొదటిసారి నవాజుద్దీన్ తనను పిలిచి మాట్లాడారని తెలిపింది. (‘అతను నీ చిన్నాన్న, అలా ఎప్పుడూ చేయడు’) "మంగళవారం రాత్రి పెద్దనాన్న(నవాజుద్దీన్ సిద్ధిఖీ) పిలిచి నువ్వు నా కూతురు లాంటి దానివి. నువ్వుంటే నాకెంతిష్టమో నీకూ తెలుసు. ఈ గొడవలన్నీ నాకు తెలియదు, నీకెప్పుడు సాయం కావాలన్నా నేను ఉన్నానంటూ మాట్లాడాడు" అని పేర్కొంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కుటుంబం తనను పూర్తిగా బహిష్కరించిందని తెలిపింది. తనపై కేసు పెట్టడమే కాక తన అత్తగారి పైనా బెదిరింపులకు పాల్పడ్డారంది. కాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ తమ్ముడు తొమ్మిదేళ్ల వయసులోనే తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ కుటుంబ సభ్యులకు చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. (‘త్వరలోనే చాలా విషయాలు తెలుస్తాయి’) -
తమ్ముడిపై ఫిర్యాదు.. నటుడి స్పందన
బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కుటుంబం గత కొద్ది రోజులుగా వార్తల్లో ఉంటుంది. ముందుగా నవాజుద్దీన్‌పై ఆయన భార్య అలీయా సిద్ధిఖీ పలు ఆరోపణలు చేసింది. తాజాగా ఆయన తమ్ముడు ..తనను లైంగికంగా వేదించాడంటూ కూతురు వరసయ్యే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాల గురించి నవాజుద్దీన్‌ను ప్రశ్నించగా.. ‘నా గురించి, నా కుటుంబం గురించి ఆందోళన పడుతున్నందుకు ధన్యవాదాలు. దీని గురించి నేను ఏం మాట్లాడదల్చుకోలేదు’ అన్నారు. ఆయన తమ్మడు షమాస్ సిద్ధిఖీ మాత్రం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘కొందరు చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రెండేళ్ళ క్రితం ఇచ్చిన స్టేట్మెంట్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ పేరు లేదు. కాని ఢిల్లీ పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్లో కొత్తగా చేర్చారు. ఈ అసత్య ప్రచారాలని మీడియాలో ప్రచారం చేయడం వెనుక ఓ వ్యక్తి ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. త్వరలో నిజం బయటపడుతుంది’ అంటూ షమాస్ ట్వీట్ చేశారు.(నటుడి తమ్ముడిపై లైంగిక వేధింపుల కేసు) It clearly indicates the motive and the person behind publicising this fake things in media. Truth will be uncovered soonest. @CPDelhi #NawazuddinSiddiqui — Shamas Nawab Siddiqui (@ShamasSiddiqui) June 3, 2020 ఇదిలా ఉండగా కేసు విత్‌డ్రా చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందంటూ సిద్ధిఖీ కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారని సదరు మహిళ ఆరోపించింది. సిద్ధిఖీ బంధువు ఒకరు తనకు ఫోన్ చేసి కేస్ వాపస్ తీసుకోవాలని.. లేకపోతే కుటుంబం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటారని బెదిరించాడని తెలిపింది. (‘త్వరలోనే చాలా విషయాలు తెలుస్తాయి’) -
‘త్వరలోనే చాలా విషయాలు తెలుస్తాయి’
బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తమ్ముడు.. తొమ్మిదేళ్ల వయసులో తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని వరసకు కూతురు అయ్యే ఓ యువతి ఢిల్లీ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై నవాజుద్దీన్ భార్య అలియా సిద్ధిఖీ స్పందించారు. ‘ఇది ఆరంభం మాత్రమే. ఇప్పటికే దేవుడు నాకు ఎంతో మద్దతిచ్చాడు ధన్యవాదాలు. తెలియాల్సినవి చాలా ఉన్నాయి. ఇన్నాళ్లు నాలానే మౌనంగా బాధపడిన వారిని చూసి ప్రపంచం షాక్‌కు గురవుతుంది. డబ్బు నిజాన్ని ఎంతవరకు కొనగలదో.. వారు ఎవరెవరికి లంచం ఇస్తారో చూడాలి’ అంటూ ట్వీట్ చేశారు. This is just the beginning. Thanking God for sending so much support already. Lot will be revealed, shocking the world as I am not the only one who suffered in silence. Let's see how much of TRUTH money can buy & who all would they continue to BRIBE.https://t.co/15swqg4Tv5 — AaliyaSiddiqui2020 (@ASiddiqui2020) June 2, 2020 వివాహం అయిన దశాబ్దం తర్వాత అలీయా విడాకులు కోరారు. పెళ్లైన ఏడాది నుంచే నవాజ్ కుటుంబం తనను శారీరక, మానసిక వేధింపులకు గురి చేసిందని ఆలియా పేర్కొన్నారు. అంతేకాక డబ్బు, అధికారం ఉపయోగించి తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. (రూ.30 కోట్లు అడగలేదు: నటుడి భార్య) -
నటుడి తమ్ముడిపై లైంగిక వేధింపుల కేసు
న్యూఢిల్లీ : బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తమ్ముడు.. తొమ్మిదేళ్ల వయసులో తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని వారి కూతురు(వరుసకు) పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని జమీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘‘ నాకు రెండేళ్లు ఉన్నపుడు మా అమ్మానాన్న విడిపోయారు. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులో మా చిన్నాన్న( నవాజుద్దీన్ తమ్ముడు)నన్ను లైంగికంగా ఇబ్బంది పెట్టారు. నేను ఎంతో హింసకు గురయ్యాను. నాకప్పుడు ఆ విషయం అర్థం అయ్యేది కాదు. పెద్దయ్యాక అతడి చేష్టలను గుర్తించాను. పెళ్లైన తర్వాత కూడా వారి(నటుడి కుటుంబం) వేధింపులు తగ్గలేదు. మా అత్తింటి వారిపై తప్పుడు కేసులు పెట్టి హింసించేవారు. (రూ.30 కోట్లు అడగలేదు: నటుడి భార్య) ఓ రోజు పెదనాన్న(నవాజుద్దీన్) నన్ను ‘నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు?’ అని అడిగారు. అప్పుడు నేను, నాపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పాను. మానసికంగా బాగా కృంగిపోయానని అన్నాను. ఆయన మాత్రం అలా ఏం జరిగి ఉండదన్నారు. ‘అతను నీ చిన్నాన్న, అలా ఎప్పుడూ చేయడు’ అన్నారు. కనీసం పెదనాన్న అయినా నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను. కానీ అలా జరగలేదు ’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ( అందుకే విడిపోవాలనుకుంటున్నా: అలియా ) -
రూ.30 కోట్లు అడగలేదు: నటుడి భార్య
ముంబై: తన భర్త నుంచి భరణం కింద రూ. 30 కోట్లు, నాలుగు గదుల ఫ్లాట్ డిమాండ్ చేసినట్టు వచ్చిన వార్తలను నవాజుద్దీన్ సిద్దిఖీ అలియా సిద్ధిఖీ శుక్రవారం ఖండించారు. ఇటీవల నవాజుద్దీన్ నుంచి విడాకులు కోరుతూ తన న్యాయవాది ద్వారా అలియా నోటిసులు పంపించిన విషయం తెలిసిందే. నోటీసులో దాదాపు రూ. 30 కోట్లు డిమాండ్ చేశారని, తమ పిల్లల పేరు మీద రెండు ఫిక్స్డ్ డిపాజిట్లు.. నాలుగు గదుల ఫ్లాట్ ఇవ్వాల్సిందిగా పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. (నాకు ఎవరితోనూ సంబంధం లేదు: అలియా) My Advocates are receiving calls from media houses, who claim to have a copy of my notice. Upon verification it appears that the said Notice is a "fabricated copy" Who would be behind this? It is obviously a PR exercise to save someone from disgrace. A lot will unfold now. — AaliyaSiddiqui2020 (@ASiddiqui2020) May 28, 2020 అవి చూసిన అలియా ట్విటర్ ద్వారా స్పందించారు. ‘నకిలీ నోటీసు కాపీతో ఈ ప్రచారం సాగిస్తున్నారు. ఆ తర్వాత దీని వెనక ఎవరు ఉన్నారు, ఎవరిని కాపాడాలని ఇలాంటి వార్తలు పుట్టించారో త్వరలో బహిర్గతం అవుతుంది’ అంటూ ట్వీట్ చేశారు. కాగా పెళ్లైన ఏడాది నుంచే తమ వివాహ జీవితంలో కలతలు మొదలయ్యాయని దీంతో నవాజుద్ధీన్‌తో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు అలియా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మే 7వ తేదీన ఈమెయిల్, వాట్సప్ ద్వారా నవాజుద్దీన్‌కు లీగల్ నోటీసులు పంపించినట్లు ఆమె తరపు న్యాయావాది అభయ్ సహే ప్రకటించిన విషయం తెలిసిందే. రంజాన్ సందర్భంగా యూపీలో తన స్వగ్రామానికి వెళ్లిన నవాజుద్దీన్ ప్రస్తుతం అక్కడే బంధువులతో ఉన్నట్లు సమాచారం. (అందుకే విడిపోవాలనుకుంటున్నా: అలియా) -
ఆ వార్తలన్నీ అసత్యాలు: నవాజుద్దీన్ భార్య
‘‘నేను అలియా సిద్ధిఖీ. నా గురించి నిజాలు చెప్పాలనుకుంటున్నాను. అపార్థాలకు తావివ్వదలచుకోలేదు. నిశ్శబ్దాన్ని దుర్వినియోగం చేసి.. అసత్యాలు ప్రచారం చేసే అవకాశం ఇవ్వకూడదు’’అంటూ బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య అలియా తాను ట్విటర్ ఖాతా తెరిచిన విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. తనకు ఎవరితోనూ అఫైర్ లేదని.. అలాంటి వదంతులకు చెక్ పెట్టేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ అయినట్లు పేర్కొన్నారు. పెళ్లయిన తొలి ఏడాది నుంచే తమ కాపురంలో కలతలు చెలరేగాయంటూ భర్త కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసిన అలియా.. ఆయనకు విడాకుల నోటీసులు పంపించి ఇటీవల వార్తల్లో నిలిచారు. (నవాజుద్దీన్ సిద్దిఖీకి విడాకుల నోటీసులు) కాగా వయాకామ్ ఎగ్జిక్యూటివ్ పీయూష్ పాండేతో అలియా ప్రేమలో ఉన్నట్లు గతంలో రూమర్లు ప్రచారమయ్యాయి. దీంతో కొన్ని నెలల క్రితం నవాజుద్దీన్ తన భార్య మీద డిటెక్టివ్‌లను నియమించాడన్న వార్త గుప్పుమంది. ఈ విషయంపై స్పందించిన అలియా.. వాటిని ఖండించింది. తన భర్త అలాంటి పనులు చేయడని.. వైవాహిక బంధంలో తాము సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా భర్తకు ఆమె విడాకుల నోటీసుల పంపిన నేపథ్యంలో.. పీయూష్- అలియాల రిలేషన్షిప్ మరోసారి తెరమీదకు వచ్చింది.(అందుకే విడిపోవాలనుకుంటున్నా: అలియా) ఈ క్రమంలో బుధవారం ట్విటర్ అకౌంట్ తెరిచిన అలియా.. ‘‘నాకు ఎవరితో సంబంధం లేదు. తనతో నేను కలిసి ఉన్నట్లుగా ఫొటోను మీడియా సృష్టించింది. ప్రస్తుత పరిణామాలను పక్కదోవ పట్టించుకునేందుకు దానిని వినియోగిస్తోంది. అందుకే స్పష్టతనివ్వాలనుకుంటున్నాను’’అంటూ ఆ వార్తలను కొట్టిపారేశారు. తన కోసం, తన పిల్లల క్షేమం కోసం దృఢంగా నిలబడేందుకు తాను సంసిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎవరేమనుకున్నా తనకు ఇబ్బంది లేదని.. ఎవరినో కాపాడేందుకు తన వ్యక్తిత్వాన్ని కించపరచడంలో అర్థం లేదంటూ మండిపడ్డారు. డబ్బుతో నిజాలను కొనలేరంటూ పరోక్షంగా భర్తను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. (విడాకుల కేసులో ఉత్తమ నటుడు) I am now learning to stand up & speak for myself, be strong, for the sake of my children I have not done any wrong till date & therefore I am not worried However I do not appreciate anyone harming my reputation or character to save someone else. Money can't buy truth. — AaliyaSiddiqui2020 (@ASiddiqui2020) May 20, 2020 -
విడాకుల కేసులో ఉత్తమ నటుడు
లాక్డౌన్ సమయం కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను పెంచుకోవడానికే కాదు వారితో ఉన్న విభేదాలను కూడా తరచి చూసుకోవడానికి ఉపయోగపడుతున్నట్టు తెలుస్తోంది. సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీకి ఈ పరిస్థితి ఎదురైంది. అతని భార్య ఆలియా అతనికి విడాకుల నోటీసు పంపింది. ‘కారణాలు చాలా ఉన్నాయి. అవి తీవ్రమైనవి. బయటకు చెప్పేవి కావు’ అని ఆమె మీడియాకు తెలియచేసింది. ‘పెళ్లయిన మరుసటి సంవత్సరం నుంచే మా కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఎలాగో ఉగ్గబట్టుకుని ఇన్నాళ్లూ నెట్టుకొచ్చాను. ఇప్పుడు అసంభవం అనిపిస్తోంది. లాక్డౌన్ టైమ్‌లో నా జీవితాన్ని తరచి చూసుకునే వీలు కలిగింది. తక్షణమే అతనికి విడాకుల నోటీసు పంపాను’ అని ఆమె చెప్పింది. మే 7న వాట్సాప్ ద్వారా, ఈ మెయిల్ ద్వారా సిద్దిఖీకి ఆమె నోటీసు పంపింది. నేరుగా పంపడానికి పోస్టల్ సర్వీసులు అందుబాటులో లేవన్న సంగతిని గుర్తు చేసింది. కాగా ఈ విషయంపై నవాజుద్దీన్ సిద్దిఖీ స్పందించాల్సి ఉంది. పదేళ్ల కాపురం నవాజుద్దీన్ సిద్దిఖీకి, ఆలియాకు సుదీర్ఘకాలంగా స్నేహం ఉంది. ఇద్దరూ ముంబైలో సినిమా రంగంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. ఆ తర్వాత విభేదాలు వచ్చి ఆమె అతని నుంచి విడిపోయింది. ఆ సమయంలో తల్లిదండ్రులు చూసిన ఒక అమ్మాయిని నవాజుద్దీన్ పెళ్లి చేసుకున్నాడని అయితే ఆ పెళ్లి ఎక్కువ రోజులు నిలబడలేదని, అందుకు కారణం బావమరిది జోక్యం అధికంగా ఉండటమేనని ఒక కథనం ఉంది. ఆ తర్వాత ఆలియా మళ్లీ నవాజుద్దీన్ సిద్దిఖీకి సన్నిహితమయ్యింది. ఈసారి పెళ్లి ప్రస్తావన చేసింది. 2010లో వారు వివాహం చేసుకున్నారు. ఆలియా అసలు పేరు అంజనా ఆనంద్ కిశోర్. పెళ్లి తర్వాత ఆలియాగా మారింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇన్నాళ్ల తర్వాత విడాకులకు సిద్ధపడింది. ‘మా నోటీసుకు స్పందిస్తే సరే. లేకుంటే కోర్టులు తెరుచుకోగానే విడాకుల పిటిషన్ దాఖలు చేస్తాం’ అని ఆలియా లాయర్ తెలియచేశాడు. ప్రస్తుతం ఆమె మెయిన్టెనెన్స్ డిమాండ్ చేస్తోంది. వివాదాలు తొలి రోజుల్లో చిన్న వేషాలు వేసిన నవాజుద్దీన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసెపూర్’, ‘బజరంగీ భాయ్‌జాన్’, ‘బద్లాపూర్’ వంటి సినిమాలతో ఊహించలేనంత పెద్ద స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాత ‘రామన్ రాఘవ్’, ‘ఫ్రీకీ అలీ’, ‘థాకరే’ తదితర సినిమాలతో హీరో అయ్యాడు. ఈ క్రమంలోనే ఆటోబయోగ్రఫీ వెలువరించి అందులో తన ప్రేమ సంబంధాలన్నీ రాసుకొచ్చాడు. అది వివాదాస్పదం కావడంతో ఆ ఆటోబయోగ్రఫీని వెనక్కు తీసుకున్నాడు. కొన్ని నెలల క్రితం సిద్దిఖీ తన భార్య మీద డిటెక్టివ్‌లను నియమించాడన్న వార్త గుప్పుమంది. అయితే కొన్నాళ్ల తర్వాత ఆలియా వాటిని ఖండించింది. సిద్దిఖీ అలా చేయడని, ప్రస్తుతం తన కాపురం హాయిగా సాగుతోందని తెలిపింది. అయితే ఆమె తాజా నిర్ణయం వీటన్నింటి కొనసాగింపు అని అనుకోవాల్సి వస్తోంది. నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రస్తుతం తన సొంత ఊరు ముజఫర్ నగర్లో ఉన్నాడు. అతడి సోదరి ఇటీవల మరణించడంతో ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఆమె అంత్యక్రియలకు హాజరయ్యి క్వారంటైన్లో ఉన్నాడు. ‘నా తల్లిని చూసుకుంటున్నాను’ అని ట్విటర్లో షేర్ చేశారు. ఆలియా నోటీసుకు గానీ, ఆమె ఆరోపణలకు గానీ అతను ఇంకా స్పందించలేదు. త్వరలో అతని వివరణ రావచ్చని ఆశిస్తున్నారు. -
అందుకే విడిపోవాలనుకుంటున్నా: అలియా
ముంబై: బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీతో విడిపోవడనికి గల కారణాలను ఆయన భార్య అలియా సిద్దిఖీ వెల్లడించారు. నవాజుద్దీన్‌తో విడాకుల విషయంపై ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ... తను విడాకులు తీసుకోవడానికి ఆయన సోదరుడు షామాస్ కూడా కారణమని పేర్కొన్నారు. “నేను ఇప్పటికీ చాలా విషయాలు బహీర్గతం చేయాలనుకోవడం లేదు. అయితే ఆయనతో విడిపోవాలనీ మాత్రం కోరుకుంటున్న. నవాజు, నేను దశాబ్దం క్రితం పెళ్లి చేసుకున్నాం. మా వివాహం అయిన ఎడాది నుంచే మా వైవాహిక బంధంలో సమస్యలు వచ్చాయి. అంతేగాక ఈ రెండు నెలల లాక్డౌన్లో తనతో విడిపోవాలా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవడానికి నాకు చాలా సమయం దొరికింది. వివాహంలో ఆత్మగౌరవం చాలా ముఖ్యం. కానీ అది నా ఉనికిలో లేకుండా పోయింది. ఎప్పుడూ నేను ఒంటరినని, నాకు ఎవరూ లేరనే భావనతోనే ఉన్నాను. మా సమస్యలకు నవాజు సోదరుడు షమాస్ కూడా ఒక కారణం’ అని చెప్పుకొచ్చారు. (నటుడికి షాకిచ్చిన భార్య.. లీగల్ నోటీసులు) అంతేగాక “ఆయనతో విడిపోవడానికి ఒక్క సమస్యే కారణం కాదు.. ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నీ కూడా భరించలేనివి. మా పెళ్లైనా ఎడాది నుంచే మా మధ్య సమస్యలు మొదలయ్యాయి కానీ ఇంతకాలం వాటిని భరించాను. ఇక అవి భరించిలేనంత తీవ్రమయ్యాయి. అందుకే ఆయనతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నా. అంతేకాదు ఇక నేను నా అసలు పేరు అంజనా కిషోర్ పాండేను తిరిగి పొందాలనుకుంటున్న. ఎందుకంటే ఇక నుంచి నవాజు భార్యగా గుర్తింపును పొందాలనుకోవడం లేదు. మా వివాహం అనంతరం ఆయన గుర్తింపును కానీ, జ్ఞాపకాలను కానీ నా వెంట ఉంచుకోవాలనుకోవడం లేదు. నా నిర్ణయం ప్రకారమే విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. ఇకపై ఈ బంధాన్ని కొనసాగించాలనుకోవడం లేదు. భవిష్యత్తును గురించిన ఆలోచన కూడా లేదు. నా నిర్ణయాన్ని మార్చుకునే ఉద్దేశమే లేదు. ఇక పిల్లలను నేనే పెంచాను వారి బాధ్యత కూడా నాదే’’ అని ఆమె స్పష్టం చేశారు. (రెండు వారాల పాటు క్వారంటైన్లో నటుడు) కాగా నవాజు నుంచి విడిపోవాలని కోరుకుంటు అలియా నోటీసులు ఇచ్చినట్లు ఆమె తరపు న్యాయవాది మంగళవారం వెల్లడించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఈ-మెయిల్, వాట్సాప్‌ల ద్వారా ఆమె మే 7న నోటీసులు పంపినట్లు అలియా లాయర్ అభయ్ తెలిపారు. విడిపోయిన అనంతరం అలియాకు చెల్లించాల్సిన భరణం గురించి కూడా ఇందులో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. నవాజుద్దీన్, ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని... లీగల్ నోటీసులకు నవాజుద్దీన్ ఇంతవరకు స్పందించ లేదని ఆయన తెలిపారు. -
నటుడికి షాకిచ్చిన భార్య.. లీగల్ నోటీసులు
ముంబై: బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నుంచి విడాకులు కోరుతూ అతడి భార్య అలియా సిద్దిఖీ లీగల్ నోటీసులు పంపించారు. కోవిడ్-19 కారణంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇ-మెయిల్, వాట్సాప్‌ల ద్వారా ఈ మేరకు మే 7న నోటీసులు పంపినట్లు అలియా తరఫు లాయర్ అభయ్ తెలిపారు. విడిపోయిన అనంతరం అలియాకు చెల్లించాల్సిన భరణం గురించి కూడా ఇందులో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. నవాజుద్దీన్, ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని... లీగల్ నోటీసులకు నవాజుద్దీన్ ఇంతవరకు స్పందించ లేదని తెలిపారు.(రెండు వారాల పాటు క్వారంటైన్లో నటుడు) కాగా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మే 12న నవాజుద్దీన్ ముంబై నుంచి స్వస్థలం బుధానా(ఉత్తరప్రదేశ్)కు వెళ్లారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనల ప్రకారం అతడిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. ఈ విషయం గురించి నవాజుద్దీన్ మాట్లాడుతూ.. నిబంధనల మేరకు తమ కుటుంబమంతా నిర్బంధంలోనే ఉంటామని, ఎవరినీ కలిసే ప్రయత్నం చేయమని స్పష్టం చేశారు. ఇక సొంతింటికి చేరుకున్న అనంతరం.. ‘‘ మా చెల్లి మరణించిన తర్వాత మా అమ్మ అనారోగ్యం పాలైంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బుధానాలో మేం హోంక్వారంటైన్లో ఉంటాం’’ అని సోమవారం ట్వీట్ చేశారు. కాగా నవాజుద్దీన్, అలియా 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. నవాజుద్దీన్ గతంలో షీబాను పెళ్లి చేసుకుని ఆమె నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. (వలస కార్మికుల కోసం సోనూసూద్.. హ్యాట్సాఫ్) -
రెండు వారాల పాటు క్వారంటైన్లో నటుడు
ముంబై: నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీని తన స్వస్థలమైన బుధానాలో 14 రోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాలని అధికారులు సూచించారు. రంజాన్ సందర్భంగా తన కుటుంబంతో కలిసి ముంబాయి నుంచి తన స్వస్థలం బుధానాకు శనివారుం వెళ్లారు. ఈ క్రమంలో ఆయనను రెండు వారాల పాటు గృహ నిర్భంధంలో ఉండాలని అక్కడి అధికారులు సూచించారు. అయితే లాక్డౌన్లో ఆయన తన స్వస్థలానికి వెళ్లాడానికి అధికారుల వద్ద అనుమతి పొందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మహరాష్ట్ర(రూరల్) ఎస్పీ నేపాల్ సింగ్ మాట్లాడుతూ.. నవాజుద్ధీన్ తన కుటుంబంతో కలిసి బుధానాకు ప్రయాణించడానికి అనుమతి పొందారని స్పష్టం చేశారు. అంతేగాక ఆయనకు, కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివి వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారంతా క్వారంటైన్ ఉన్నారని ఆయన ధృవీకరించారు. (కోలీవుడ్ టు బాలీవుడ్) చదవండి: ఇండియాలోనే తెలియనివారు ఎవరూ లేరు.. ఇక నవాజుద్దీన్ సోదరుడు అయజుద్దీన్ మాట్లాడుతూ.. ‘ఇది రంజాన్ పండుగ మాసం కావున నవాజుద్దిన్ బుధానాకు రావడం ముఖ్యం. అంతేకాదు లాక్డౌన్లో షూటింగ్‌లు కూడా లేకపోవడంతో నవాజుద్దీన్ బుధానాకు రావాలని నిర్ణయించుకున్నాడు. మా సోదరి మరణించి కూడా 4 నెలలు గడిచింది. ఈద్ పండుగ కూడా వచ్చింది. ప్రస్తుత పరిస్థితిలో నవాజుద్ధీన్ మా కుటుంబంతో గడిపితే అందరం సంతోషిస్తాం. అయితే ఈ ఏడాది మేము రంజాన్ పండుగ జరుపుకోనప్పటికీ నవాజుద్దీన్ ఈ సమయంలో ఇంట్లో ఉండటం అవసరం’ అని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా అధికారుల ఆదేశం మేకు, లాక్డౌన్ నిబంధనలకు కట్టుబడి తాను, తన కుటుంబం క్వారంటైన్‌లోనే ఉంటామని, ఎవరినీ కలిసే ప్రయత్నం చేయమని నవాజుద్దీన్ అధికారులు తెలిపాడు. కాగా ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్దిఖీ మోటిచూర్ చక్నాచూర్‌లో నటించాడు. తాజాగా ఆయన నటించిన ‘ఘూమ్‌కేటు’ మే 22 న ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో విడుదలకు సిద్ధంగా ఉంది. (క్యాన్సర్‌తో హీరో సోదరి మృతి) -
కోలీవుడ్ టు బాలీవుడ్
ప్రాంతీయ భాషల్లో హిట్ అయిన సినిమాలు హిందీలో రీమేక్ అవడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా అదే జాబితాలో తమిళ చిత్రం ‘ఒత్తా సెరుప్పు సైజ్ 7’ కూడా చేరనుంది. ఈ సినిమా త్వరలో హిందీలో రీమేక్ కానుంది. కేవలం ఒకే ఒక్క పాత్రతో రూపొందిన ‘ఒత్తా సెరుప్పు సైజ్ 7’లో నటించడమే కాకుండా, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు తమిళ దర్శకుడు పార్తిబన్. హిందీ రీమేక్‌లో ఆ పాత్రను నవాజుద్దీన్ సిద్ధిఖీ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఇండియాలోనే తెలియనివారు ఎవరూ లేరు..
సినిమా: నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరని చెప్పుకొచ్చింది నటి తమన్నా. తన గురించి తాను అలా చెప్పుకోవడంలో తప్పులేదనుకుంటా. ఎందుకంటే తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కథానాయకిగా తనకుంటూ ఒక గుర్తింపు పొందిన నటి తమన్నా. నటిగా దశాబ్దన్నర అనుభవాన్ని గడించిన ఈ బ్యూటీ మొదట్లో అందరి మాదిరిగానే అందాలారబోతకే పరిమితం అయినా, బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించి శభాష్ అనిపించుకుంది. ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్లో నటిస్తోంది. ఈ మిల్కీబ్యూటీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తనకంటే అదృష్టవంతురాలు ఎవరూ ఉండరని అంది. అన్ని భాషల్లోనూ నటించానని, ఇండియాలోనే తనను తెలియనివారు ఎవరూ ఉండే అవకాశం లేదని అంది. అంతగా పాపులర్ అయ్యానని చెప్పింది. అంతగా పేరు, ప్రఖ్యాతలు లభించడం సంతోషంగా ఉందని అంది. తెలుగులో బాహుబలి 1, 2 చిత్రాల్లో నటించానని, ఆ చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందానని అంది. ఇంతకు ముందే హిందీ చిత్రాల్లో నటించానని, ప్రస్తుతం మళ్లీ నటిస్తున్నానని చెప్పింది. ఇప్పుడు నవాజుద్దీన్ సిద్ధిక్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. ఇది చాలా మంచి అవకాశంగా భావిస్తున్నానని చెప్పింది. కాగా ప్రేక్షకులు తనను కొత్తగా నటించడానికి వచ్చిన నటిగా చూడాలని, అప్పుడే తానూ ఇంతకు ముందు నటించినదంతా మరచి కొత్తగా పరిచయం అయిన నటిగా నటించగలనని అంది. ఇకపోతే తన సౌందర్య రహస్యం గురించి అడుగుతున్నారని, అందుకు తన ఆహారపు అలావాట్లే కారణం అని చెప్పుకొచ్చింది. తన ఆహార నియమావళి గురించి చెప్పాలంటే ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగుతానని చెప్పింది. ఆ తరువాత నానబెట్టిన బాదంపప్పును కొంచెం తింటానని చెప్పింది. ఆ తరువాత ఇడ్లీ, దోశ, ఓట్స్ వంటి వాటిలో ఒక దాన్ని స్పల్పాహారంగా తీసుకుంటానని చెప్పింది. ఇకపోతే మధ్యాహ్నం ఒక కప్పు అన్నంతో ఎక్కువ కాయగూరలు తీసుకుంటానని చెప్పింది. రాత్రికి మాత్రం ప్రోటీన్లు అధికంగా ఉండే గుడ్డు, చికెన్ వంటిని భుజిస్తానని తెలిపింది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతిరోజూ యోగా, ఎక్సర్సైజులు క్రమం తప్పకుండా చేస్తానని చెప్పింది. ఇవే తన అందానికి, ఆరోగ్యానికి సూక్తులు అని తమన్నా పేర్కొంది. -
క్యాన్సర్‌తో హీరో సోదరి మృతి
ముంబై: బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సోదరి స్యామా తామ్షీ సిద్ధిఖీ(26) మృతి చెందారు. గత కొద్ది కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె శనివారం మరణించినట్లు సిద్ధిఖీ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా పద్దెమినిదేళ్ల వయస్సులోనే స్యామా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని నవాజుద్దీన్ గతేడాది సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. స్యామా 25వ పుట్టినరోజు సందర్భంగా... చిన్న వయస్సు నుంచే తన చిట్టి చెల్లెలు చావుతో ధైర్యంగా పోరాడుతోందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా దాదాపు ఏడేళ్లుగా స్యామాకు చికిత్స చేస్తున్న డాక్టర్లకు కృతఙ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఆమె మరణంతో నవాజుద్దీన్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇక స్యామా అంత్యక్రియలు సిద్ధిఖీ కుటుంబ స్వగ్రామమైన బుధానా(ఉత్తరప్రదేశ్)లో ఆదివారం నిర్వహించినట్లు సమాచారం. కాగా నవాజుద్దీన్ ఇటీవల ‘మోతీచూర్ చక్నాచూర్’ సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే సాక్రెడ్ గేమ్స్, యూకే సిరీస్ మెక్మాఫియా యూనిట్ తరఫున గత నెలలో జరిగిన ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యాడు. ప్రస్తుతం.. బంగ్లాదేశీ ఫిల్మ్‌మేకర్ సర్వార్ ఫరూఖీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నో ల్యాండ్స్ మ్యాన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికాలో షూటింగ్ జరుగుతుండగానే చెల్లెలి మృతి విషయం తెలియడంతో ఇండియాకు వచ్చినట్లు సమాచారం. My sister ws diagnosed of advanced stage #breastcancer @ 18 bt it ws her will power & courage dat made her stand agnst all d odds she turns 25 2day & still fighting M thankful 2 Dr.@koppiker & @Lalehbusheri13 fr motivating her & m rly grateful 2 @resulp Sir fr introducng me 2 dem pic.twitter.com/xHsBK8uJDP — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) October 13, 2018 -
అవార్డు నిల్... ఆకర్షణ ఫుల్
‘ఎమ్మీ అవార్డులకు నామినేషన్ దక్కించుకున్నానోచ్’ అంటూ ఇటీవల రాధికా ఆప్టే ప్రకటించారు. నామినేషన్ పత్రాన్ని అందుకుని, రాధిక న్యూయార్క్ వెళ్లారు. అక్కడే 47వ ‘ఎమ్మీ’ అవార్డుల వేడుక జరిగింది. టీవీ షోలు, సీరియల్స్‌కి అవార్డుల ప్రదానం చేస్తుంటుంది ‘ఎమ్మీ’. ‘లస్ట్ స్టోరీస్’కి గాను ఉత్తమ నటన విభాగంలో రాధికా ఆప్టేని నామినేట్ చేశారు అవార్డు సంస్థ ప్రతినిధులు. ఇంకా మన దేశం నుంచి సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ‘సేక్రెడ్ గేమ్స్’, మరో సిరీస్ ‘ది రీమిక్స్’ నామినేషన్ దక్కించుకున్నాయి. ‘లస్ట్ స్టోరీస్’ దర్శకులు కరణ్ జోహార్, జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, దిబాకర్, నటి రాధికా ఆప్టే ఈ అవార్డు వేడుకకు హాజరయ్యారు. అలాగే ‘సేక్రెడ్ గేమ్’ నుంచి, ‘ది రీమిక్స్’ నుంచి కొందరు అవార్డు వేడుకకు వెళ్లారు. మొత్తం 21 దేశాల నుంచి 11 విభాగాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు నామినేట్ అయ్యారు. మనదేశం నుంచి నామినేట్ అయినవాటికి అవార్డులు నిల్ కానీ అవార్డు వేడుకలో రాధికా ఆప్టే అట్రాక్షన్ మాత్రం ఫుల్ అని నెటిజన్లు పేర్కొన్నారు. అయితే నవాజుద్దీన్ నటించిన ‘మెక్ మాఫియా’ అనే ఇంగ్లిష్ టీవీ సిరీస్‌కి అవార్డు దక్కింది. -
విలక్షణ నటుడి సరికొత్త అవతారం!
ముంబై : బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘బోలే చుడియాన్’. నవాజ్ సోదరుడు షమాస్ నవాబ్ సిద్దిఖీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో మిల్క్ బ్యూటి తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. గాజులు అమ్మే వ్యక్తికి, పల్లెటూరి అమ్మాయికి మధ్య సాగే ప్రేమ కథగా ‘బోలే చుడియాన్’ను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో పడ్డారు మూవీ యూనిట్. సినిమాకు హైప్ క్రియేట్ చేసే క్రమంలో నవాజుద్దీన్ రాపర్‌గా అవతారమెత్తాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఓ పాట పాడాడు. ఈ పాట టీజర్‌ను సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. తమన్నాతో కలిసి తన మార్కు స్టైల్లో స్వాగే చూడియాన్ అంటూ పాట పాడిన నవాజ్.. ‘మొదటిసారి పాడిన ర్యాప్ సాంగ్ టీజర్‌ను విడుదల చేస్తుంన్నందుకు సంతోషంగా ఉందంటూ వీడియోను షేర్ చేశాడు. కాగా ఈ పాట గురించి షమాస్ మాట్లాడుతూ..‘మొదట నవాజ్‌ను రాప్ పాడమని అడిగినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని, కానీ సంగీత దర్శకుడితో కలిసి సాధన చేసిన తర్వాత గాడిలో పడ్డాడు. ఇప్పటికే చాలామంది నటులు తమ సినిమాల కోసం పాటలు పాడుతున్నారు. అందుకే నవాజ్‌తో ఒక పాట పాడిస్తే బాగుంటుందని అనిపించి ఇలా చేశామని చెప్పాడు. ఇక సినిమా గురించి తమన్నా మట్లాడుతూ..బాహుబలి సినిమా తన కెరీర్లో పెద్ద సినిమానే అయినప్పిటికీ, బోలే చూడియాన్’ సినిమా తనకెంతో ముఖ్యమని తెలిపారు. ఈ సినిమాలో భాగమవడం తన అదృష్టమని, ఇందులో ప్రేక్షకులకు కొత్తగా కనిపించనునట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరో నవాజ్ నటన చూసి ఆశ్యర్యపోయానని, సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యే సరికి నవాజ్ నటన రహస్యం తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు మిల్క్ బ్యూటీ. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా భావోద్వేగమైన క్యారెక్టర్లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. View this post on Instagram Excited to share the teaser of my first ever Rap song #Swaggychudiyan with @tamannaahspeaks for #BoleChudiyan directed by @shamasnawabsiddiqui . thank u team @woodpeckermv @zaverikiran9 #rajeshbhatia, @zeemusiccompany @kumaarofficial @anuragbedi A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui) on Jul 14, 2019 at 11:33pm PDT -
అందుకోసం ఆశగా ఎదురుచూస్తున్నా!
నటుడు రజనీకాంత్ విలన్‌తో మిల్కీబ్యూటీ తమన్నా రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ అమ్మడికి ఇటీవల సరైన హిట్స్ లేవనే చెప్పాలి. తెలుగులో వెంకటేష్‌తో జతకట్టిన ఎఫ్ 2 చిత్రమే ఈ తమన్నాకు చివరి సక్సెస్ఫుల్ చిత్రం. ఆ తరువాత కోలీవుడ్‌లో ప్రభుదేవాకు జంటగా నటించిన దేవి–2 ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్‌లో ఈ బ్యూటీ సరైన సక్సెస్‌ను చూసి చాలా కాలమైంది. ఆ మధ్య ఉదయ*నిధి స్టాలిన్‌తో నటించిన కన్నె కలైమానే చిత్రం నటిగా ప్రశంసలను అందించిందిగానీ చిత్రం ఆడలేదు. ప్రస్తుతం కోలీవుడ్‌లో విశాల్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ అమ్మడు హిందీలో నటించిన హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రం ఖామోషి డిజాస్టర్‌గా నిలిచింది. అయినా లక్కీగా బాలీవుడ్లో మరో అవకాశం తమన్నాను వరించిందన్నది తాజా వార్త. అవును హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్‌తో రొమాన్స్ చేసే అవకాశం తమన్నా ఇంటి తలుపుతట్టింది. నవాజుద్దీన్ సిద్ధిక్ తమిళంలో రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో విలన్‌గా పరిచయమైన విషయం తెలిసిందే. ఈయన తాజాగా హిందీలో హీరోగా నటించనున్న చిత్రంలో నటి తమన్నా హీరోయిన్గా నటించనుంది. ఈ మూవీకి బోలే చుడియాన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీనికి కొత్త దర్శకుడు శ్యామ్స్ నవాబ్ సిద్ధిక్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్‌కు సోదరుడు ఈ దర్శకుడే తన చిత్రంలో నటి తమన్నా హీరోయిన్గా నటించనున్న విషయాన్ని సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీనికి స్పందించిన తమన్నా తాను బోలే చుడియన్ చిత్రంలో ఒక భాగం కానుండడం చాలా సంతోషంగా ఉందని, ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ అమ్మడికి బాలీవుడ్లో ఇప్పటి వరకూ సరైన హిట్ తగల్లేదు. ఈ కొత్త చిత్రం అయినా మంచి సక్సెస్‌ను అందిస్తుందేమో చూడాలి. -
నవాజ్ కోసమే నటిస్తున్నా
దర్శకుడిగా హిందీలో ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్, దేవ్ డి, మన్మర్జియా’ వంటి సూపర్‌హిట్ సినిమాలను అందించారు అనురాగ్ కశ్యప్. 2017లో యాక్టర్‌గా ‘ఇమైక్క నొడిగళ్’ అనే తమిళ చిత్రంలో నటించారు. తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా రూపొందుతున్న ‘బోలే చుడియా’లోనూ యాక్ట్ చేయనున్నారట. ఈ సినిమా ద్వారా నవాజుద్దీన్ సిద్ధిఖీ తమ్ముడు నవాబ్ సిద్దిఖీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో నటించడం గురించి అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ – ‘‘నన్ను ఇప్పటివరకూ నవాజుద్దీన్ ఏదీ అడగలేదు. తొలిసారి ఈ సినిమాలో యాక్ట్ చేయమని అడిగారు. అందుకే చేస్తున్నాను’’ అన్నారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నవాజుద్దీన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్, రమన్ రాఘవన్’ సినిమాల్లో నటించారు. -
పిచ్చి అభిమానానికి ఇదే పరాకాష్ట!
తమ హీరోలు బయట కనిపిస్తే.. ఫ్యాన్స్‌కు పండగే. కానీ, ఆ హీరోలకు మాత్రం చేదు సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. మొన్నీమధ్య విజయ్ సేతుపతి ఇలాగే అభిమాన గణం మధ్యలో ఇరుక్కుపోయాడు. అయినా సరే ఫ్యాన్స్ కోరినన్ని సెల్ఫీలు ఇచ్చాడు. అయినా ఫ్యాన్స్ మాత్రం చుట్టుముట్టేసి వదల్లేదు. మెల్లగా ఏదోలా అక్కడి నుంచి బయటపడ్డాడు. ఇదొక రకమైన సంఘటన అనుకుంటే.. తాజాగా విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీకి చేదు సంఘటన ఎదురైంది. నవాజుద్దీన్ బయట కనిపించేసరికి ఫ్యాన్స్ ఎగబడిపోయారు. చుట్టూ సెక్యురిటీ ఉన్నా.. ఓ ఆకతాయి మాత్రం అమాంతం నవాజుద్దీన్‌ను వెనక్కు లాగేసి మరి.. సెల్ఫీ తీసుకోబోయాడు. వెంటనే సెక్యురిటీ అప్రమత్తమై ఆయన్ను ముందుకు తీసుకెళ్లారు. ఇలాంటి చర్యలు అభిమానంతో చేస్తారో.. లేక సెల్ఫీల పిచ్చితో చేస్తారో అంటూ నెటిజన్లు సదరు వ్యక్తికి చీవాట్లు పెడుతున్నారు. -
నవాజుద్దీన్ తీరుకి షాకయ్యా
నవాజుద్దిన్ సిద్ధిఖీ.. ప్రస్తుతం బాలీవుడ్లో వెర్సటైల్ యాక్టర్. నవాజుద్దిన్ సినిమా ఓకే చేశాడంటే ఆ సినిమాలో ఎదో స్పెషాలిటీ ఉన్నట్టే అనే పేరు తెచ్చుకున్నారు. ఇటీవలే రచయిత ‘మంటో’ పాత్ర పోషించి చప్పట్లు కొట్టించుకున్నారు. తాజాగా ఈ నటుడిపై వేధింపుల ఆరోపణలు చేశారు మాజీ మిస్ ఇండియా నిహారికా సింగ్. ఆల్రెడీ నవాజుద్దిన్ సిద్ధిఖీ తన ఆటోబయోగ్రఫీ ‘యాన్ ఆర్డినరీ లైఫ్’ లో నిహారికా సింగ్‌తో ఉన్న సంబంధం గురించి రాసుకొచ్చారు. ఇంకా మరో ఇద్దరు ముగ్గురి గురించి కూడా ఈ పుస్తకంలో ఆయన ప్రస్తావించారు. దాంతో మా అనుమతి లేకుండా పుస్తకంలో మా గురించి రాశారని సంబంధిత వ్యక్తులు పేర్కొనడంతో అప్పటికే స్టాల్స్‌కి వెళ్లిన ఆ పుస్తకాలను పబ్లిష్ చేసిన సంస్థ వెనక్కి తెప్పించింది. ఇప్పుడు జరుగుతున్న ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా తన కథను చెప్పుకొచ్చారు నిహారికా సింగ్. చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న అనుభవాలను విశ్లేషిస్తూ రాసుకొచ్చారు. అందులోని సారాంశం ఏంటంటే.. ‘‘బాలీవుడ్లో నటిగా ఎదుగుదాం అనుకున్న రోజుల్లో ‘మిస్ లవ్లీ’ అనే సినిమా అవకాశం వచ్చింది. నవాజుద్దిన్ అనే నటుణ్ణి అప్పుడే ఫస్ట్ టైమ్ కలిశాను. తను గొప్ప నటుడు అనుకోలేదు. తను నటించిన షార్ట్ ఫిల్మ్ సీడీ నాకు ఇచ్చాడు. అప్పటి నుంచి ఆయన మీద ఒకలాంటి గౌరవం ఏర్పడింది. మరుసటిరోజు నన్ను భోజనానికి ఆహ్వానించాడు. ఫిల్మీ ప్రపంచంలో ఆయనతో మాట్లాడుతుంటే చాలా నిజమైన వ్యక్తిగా తోచాడు. కొన్ని రోజుల తర్వాత షూటింగ్ నిమిత్తం మా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చానని ఆయన మెసేజ్ చేయడంతో మా ఇంటికి ఆహ్వానించాను. ఇంటికి రావడంతోనే నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. నేను షాకయ్యా. తనని వెనక్కి తోసేయాలనుకున్నా కూడా అది విఫల ప్రయత్నమే అయింది. ‘పరేశ్ రావల్, మనోజ్ బాజ్పాయిలా మిస్ ఇండియానో, హీరోయిన్నో పెళ్లి చేసుకోవాలనుంది’ అన్నాడు నవాజుద్దిన్. అప్పటికి తను ఇన్సెక్యూర్డ్గా ఉండేవాడు. తన లుక్స్, స్కిన్ కలర్, ఇంగ్లీష్ చూసి ఇండస్ట్రీ ఏమంటుందో అని బాధపడేవాడు. అందులో నుంచి బయటకు రావడానికి నేను కొంత సాయం చేశాను. మెల్లిగా అతను చెబుతున్నవన్నీ అబద్ధాలని తెలియడం మొదలైంది. కేవలం నాతోనే కాదు చాలా మంది స్త్రీలతో రిలేషన్షిప్లో ఉన్నాడనీ, ఒక అమ్మాయిని వివాహం కూడా చేసుకున్నాడని తెలుసుకున్నాను. కట్నం కోసం వేధిస్తున్నాడని వాళ్లు విడిపోయారు. నేను అతన్ని నిజాయతీగా ఉండమన్నాను. అలా ఉండేంతవరకూ నిన్ను కలవనని కూడా చెప్పాను. ఆ తర్వాత మేం నటించిన ‘మిస్ లవ్లీ’ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక అయింది. మళ్లీ మూడేళ్లకు అప్పుడే కలుసుకున్నాం. తను ప్రవర్తించిన తీరుకు పశ్చాత్తాపపడ్డాడు. ఆ తర్వాత ‘అన్వర్ కా అజాబ్ కిస్సా’ అనే చిత్రంలో నాకో పాత్ర రికమెండ్ చేశాడు. ఆ సమయంలో మళ్లీ నాతో కనెక్ట్ అవ్వాలని ప్రయత్నించాడు. తనతో ఉండమని బతిమాలాడు. కానీ ఫ్రెండ్‌లా అయితే ఉంటానని చెప్పాను. ఆ సినిమా రిలీజ్ కాలేదు. నేనంత గొప్ప నటి కాదని అందరితో చెప్పడం మొదలెట్టాడు. నా అవకాశాలు తగ్గాయి. మమ్మల్ని సంప్రదించకుండానే తన పుస్తకంలో తనకు నచ్చినట్టుగా మా గురించి రాసుకొచ్చాడు’’ అని పేర్కొన్నారు నిహారికా సింగ్. -
రాత్రి ఒంటరిగా ఉంది!
బాలీవుడ్లో ప్రస్తుతం మంచి స్పీడ్‌తో దూసుకెళ్తోన్న యాక్టర్స్‌లో నవాజుద్ధీన్ సిద్ధిఖీ ఒకరు. హీరోగాను, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించడానికి ఆలోచించరు నవాజ్. కథే అయనకు ముఖ్యం. ఇప్పుడు ఆయన హీరోగా ఓ హిందీ చిత్రం తెరకెక్కనుంది. హనీ తెహ్రాన్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాకు ‘రాత్ అఖేలీ హై’ (రాత్రి ఒంటరిగా ఉంది) అనే టైటిల్‌ను అనుకుంటున్నారని టాక్. ఇంతకు ముందు విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మక్బూల్, ఓమ్కార, సాథ్ ఖూన్ మాఫ్’ సినిమాలకు సహాయ దర్శకునిగా పనిచేశారు హనీ. అలాగే ఈ సినిమాలో కథానాయిక పాత్రకు రాధికా ఆప్టేను తీసుకున్నారు. మూడేళ్ల క్రితం నవాజ్, రాధిక కలిసి ‘మాంఝు: ది మౌంటెన్ మ్యాన్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా కోసం జత కట్టారు రాధిక, నవాజ్. ప్రస్తుతం సౌత్‌లో రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న ‘పేట్టా’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు నవాజ్. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
లవ్‌స్టోరీ వివాదం.. నటుడి కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: తన జ్ఞాపకాలను పుస్తకంగా రాస్తే దానిలో అభూత కల్పనలే ఉంటాయని బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అన్నారు. ‘ఆన్ ఆర్డినరీ లైఫ్’ పేరిట గతేడాది తాను రాసిన ఆత్మకథలో ఐదు పేజీలు తన ప్రేమాయణం గురించి రాయడంపై విచారం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో తమ కలను సాకారం చేసుకునేందుకు చిన్న పట్టణాల నుంచి వచ్చే వారికి ప్రేరణగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకం రాసినట్టు ‘బాలీవుడ్ హంగామా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 209 పేజీలున్న ఈ పుస్తకంలో 5 పేజీలు మాజీ ప్రియురాళ్లు నిహారిక సింగ్, సునీత రాజ్వర్లతో సాగించిన ప్రేమాయణం గురించి నవాజుద్దీన్ పూసగుచ్చారు. సిద్ధిఖీ మొత్తం అబద్ధాలే చెప్పాడంటూ అతని మాజీ ప్రేయసిలు అతనిపై తీవ్ర విమర్శలు చేస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో ఈ పుస్తకాన్ని రద్దు చేస్తున్నట్లు గతేడాది అక్టోబర్‌లో ప్రకటించారు. అంతేకాదు క్షమాణలు కూడా చెప్పారు. ఈ వివాదం జరిగి ఏడాదైన సందర్భంగా మాట్లాడుతూ.. ‘పుస్తకంలో మొత్తం 209 పేజీలున్నాయి. కేవలం 5 పేజీల కారణంగా నా ప్రయత్నాన్ని వృధా చేస్తారా? నా ప్రేమకథను బయపెట్టినందుకు వివాదం చెలరేగుతుందని ఊహించలేదు. వాస్తవాలను చెప్పాలని మాత్రమే అనుకున్నాను. ఎవరి జీవితంలోనైనా వాస్తవం అనేది కథలా ఉండద’ని నవాజుద్దీన్ అన్నారు. ఇక ముందు తన జీవిత చరిత్ర రాస్తే అందులో అబద్దాలే ఉంటాయని చెప్పారు. -
స్త్రీల కోసం చిందిన సిరా చుక్క
చాలా పాత మొహల్లా అది.టాంగాలు నడుస్తున్నాయి. తాగుబోతులు తిరుగాడుతున్నారు. స్త్రీలను వేటాడేవారు జుబ్బాల జేబుల్లో చిల్లర పడేసుకొని కొనడానికి తిరుగుతున్నారు. ‘సార్.. అమ్మాయి కావాలా సార్’ అడిగాడతను ఒక పెద్దమనిషిని. ‘రండి సార్.. పైనే ఉంది’ తీసుకెళ్లాడు. మురికిగా ఉన్న మహల్ అది. చిన్న చిన్న గదులు. మురికి పనుల కోసంగా ఉన్న గదులు. మురికి సమయాలలో రద్దీగా ఉండే గదులు. మెట్ల మీదుగా నడిపించుకుంటూ తీసుకెళుతున్నాడు. ‘ఇటు... ఇటు..’గడప దగ్గర నిలబెట్టి లోపలికెళ్లాడు. కొద్దిగా తెరిచిన తలుపు నుంచి లోపల ఏముందో కనిపిస్తూ ఉంది.కుక్కి మంచం. దాని మీద ఒక ప్రాణం లాంటి ప్రాణం. స్త్రీ ప్రాణం.‘లెయ్వే... లెయ్... గిరాకీ వచ్చింది లెయ్’ లేవలేదు. నిద్రపోతూ ఉంది. మొద్దుగా నిద్ర పోతూ ఉంది. శవంలా నిద్రపోతూ ఉంది. ‘లెయ్మంటున్నానా’ నీళ్లు మొహాన కొట్టి బలవంతంగా లేపాడు. ‘వద్దు.. ఓపిక లేదు... పంపించెయ్’ ‘ఇదే ఆఖరు... ఆ తర్వాత నిద్ర పోదూగానీ’ ‘అయ్యో.. నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా. నేను నిద్రపోయి ఎంత కాలం అయ్యింది. నాకు నిద్ర వస్తోంది.దండం పెడతాను. పంపించేయ్’ ‘ఇదొక్కటే అన్నానా. ఏం తమాషాగా ఉందా’ జుట్టు పట్టుకున్నాడు. స్త్రీ. నలిగి నలిగిపోయి ఉన్న స్త్రీ. నలిపి వేయబడిన స్త్రీ. శవంలా జీవచ్ఛవంలా మారిన స్త్రీ. ఏమడుగుతోంది. మణులా మాణిక్యాలా. నిద్ర. గుక్కెడు నిద్ర. బాధల్ని క్షోభల్ని కాసేపైనా మర్చిపోయేలా చేయగలిగే నిద్ర. ఇవ్వట్లేదే రాక్షసుడు. ‘చెప్పినమాట వింటావా లేదా’ ఛెళ్లున కొట్టాడు.‘ఒరేయ్ రాక్షసుడా’ కాళి అయ్యింది. అపరకాళిలా తిరగబడింది. రక్కింది. ముఖాన పీకింది. తల మంచానికేసి బాదింది. కింద పడ్డాడు. పోయాడు. ఊపిరి తీసుకునే వ్యవధి కూడా లేనట్టుగా పోయాడు. శవం. కాని అదంతా ఆమెకు ఎందుకు. ఆమెకు కావలసింది నిద్ర. హాయిగా పట్టే నిద్ర. అప్పుడిక ఆమె ఆ కుక్కిమంచం మీద, మగాళ్లు నిద్రపోనివ్వని మంచం మీద, దారుణ ఆక్రమణల మంచం మీద తన కోసం తాను తన కోసంగా తాను నిద్ర పోయింది.మంటో రాసిన కథ ఇది. ఇప్పుడు కాదు 60 ఏళ్ల క్రితం. దేశ విభజన జరిగింది. ఇరు ప్రాంతాల వాళ్లు కత్తులు ఝళిపిస్తున్నారు. నెత్తురు చిందిస్తున్నారు. శవానికి శవంతో జవాబు చెబుతున్నారు. ద్వేషాన్ని ద్వేషంతో నూరుతున్నారు. తలల్లో స్పృహ లేదు. చేతుల్లో కత్తులు మాత్రమే ఉన్న కాలం అది. పురుషుడు దొరికితే సంహరించు. స్త్రీ దొరికితే చెరిచెయ్.అలాంటి సమయంలో సరిహద్దు మీద ఒక తండ్రి వెతుకులాడుతున్నాడు. కూతురుని. కన్నకూతురిని. ‘నా కూతురుని చూశావా బాబూ’‘నీ కూతురు ఎలా ఉంటుంది ముసలాయనా?’‘ఎర్రగా తామరపువ్వులా ఉంటుంది. కురులు విప్పితే అప్సరసలా ఉంటుంది. బుగ్గన పెద్ద పుట్టుమచ్చ. అందమైన కూతురు. అమాయకమైన కూతురు. పదహారేళ్ల కూతురు...నాకూతురుని చూశారా బాబూ’...బిడారుల్లో ఏడుపులు... శిబిరాల్లో శోకాలు... వలస పోయేవాళ్ల ఏడ్పులు... వలస వస్తున్నవాళ్ల ఆర్తనాదాలు... కూతురు కనిపించడం లేదే...ఎక్కడో ఒక మూలన ఆ అమ్మాయి కనిపించిందని ఎవరో చెప్పారు.తండ్రి పరిగెత్తాడు. పరిగెత్తి కూతురిని చూశాడు. గుండెలకు హత్తుకుంటూ చూశాడు. కన్నీళ్లను ఆ అమ్మాయి గొంతులోకి ఒంపుతూ ప్రాణాలు దక్కించుకోవడానికి చూశాడు. భుజాల మీద వేసుకొని హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు. హాస్పిటల్ బెడ్ మీద కూతురు పడి ఉంది. కొనఊపిరితో ఉంది. ‘డాక్టర్ సాబ్... నా కూతురిని బతికించండి డాక్టర్ సాబ్’ పరిగెత్తుకుంటూ వెళ్లి డాక్టర్‌ను తీసుకొచ్చాడు.డాక్టర్ వచ్చి నాడీ పట్టుకుని చూశాడు. పేరు పెట్టి పిలిచాడు. కదలిక లేదు. కేసు అర్థం కావడం లేదు. పరికించి చూద్దామంటే గది చీకటిగా ఉంది. గాలాడక చిరాగ్గా ఉంది. పక్కనే ఉన్న కిటికీ రెక్కను చూపిస్తూ ‘విప్పు’ అన్నాడు. తండ్రికి సరిగ్గా వినపడలేదు. ‘దానిని విప్పు’ అన్నాడు.అప్పుడు అనూహ్యంగా ఒకటి జరిగింది.ఆ మాటకు ఆ అమ్మాయిలో కదలిక వచ్చింది. మెల్లగా చేతులు రెంటిలోనూ సత్తువ తెచ్చుకుని వణుకుతూ భయం భయంగా తన పైజామా బొందును ‘విప్పడం’ మొదలుపెట్టింది.కథ ముగిసింది.ఇది కూడా మంటో రాసిన కథే. మంటోగా పిలువబడే ప్రపంచాన ప్రసిద్ధమైన ‘సాదత్ హసన్ మంటో’ స్త్రీల కోసం రాశాడు. స్త్రీ దుఃఖాన్ని లోకానికి చెప్పడానికి రాశాడు. స్త్రీ నిజమైన వేదనను చూస్తే షాక్ అవుతారని చెప్తూ షాకయ్యే పద్ధతిలో రాసి నేల కదిలిపోయేలా చేశాడు. స్వాతంత్య్రం వచ్చే సమయాన బాంబే (ముంబై)లో ఉన్న మంటో అక్కడి వేశ్యల జీవితాల్ని పరిశీలించాడు. అప్పటి వరకూ ఉర్దూ కథా సాహిత్యంలో మర్యాదకరమైన కథలు వస్తున్న సమయంలో వారి జీవితాన్ని కథా వస్తువుగా తీసుకుని లోకాన్ని హడలెత్తించాడు. అందుకు కేసులు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరిగాడు. అయినా భయపడలేదు. ‘వేశ్యల దగ్గరకు వెళ్లడానికి మనకు పర్మిషన్ ఉందిగానీ వారి జీవితాన్ని రాయడానికి పర్మిషన్ లేదా’ అని మంటో ప్రశ్నించాడు. ‘దేశభక్తి కథలు, కార్మికుల కథలు రాయమని అందరూ నన్ను అడుగుతుంటారు. కాని వేశ్యావాటికలో మూసిన తలుపుల వెనుక ఉన్న హింసకు మించిన వస్తువు నా వద్ద లేదు. వాళ్లు మన సమాజంలో భాగం. వారి గురించి రాయాలి’ అన్నాడు మంటో. ఆ రోజులలోనే ఆయన బాంబే శ్రీమంతులు తమ లైంగిక విశృంఖలత్వం కోసం నిరుపేద పసిపిల్లలను ఎలా ఉపయోగించుకునేవారో రాసి సమాజపు పైపై పూతల పరదాలను చీలికలు పీలికలు చేశాడు. అమృత్‌సర్‌లో పుట్టిన సాదత్ హసన్ మంటో భారతదేశాన్ని అందునా బాంబేని విపరీతంగా ప్రేమించాడు. ఆరాధించాడు. బాంబేలో హీరో అశోక్ కుమార్ కీలకపాత్ర పోషించిన ‘బాంబే టాకిస్’ స్టుడియోలో స్క్రిప్ట్ రైటర్‌గా ఉండేవాడు. కాని దేశ విభజన సమయంలో ‘ముస్లిం ఉద్యోగులు’ ఎక్కువ మంది బాంబే టాకిస్లో పని చేస్తున్నారు కనుక ఆ స్టుడియోను తగులబెడతాం అని ఆ రోజులలో బెదిరింపులు ఎక్కువయ్యాయి. అవి విని మంటో కలత చెందాడు. అంతేకాదు ‘హృదయంలో ఉండవలసిన మతం తలకెక్కి’ విషం చిమ్ముతున్న సమయాలను చూసి విషాదపడ్డాడు. ‘నా దేశం పాకిస్తానా?’ అనే ప్రశ్నతో అతడు లాహోర్ చేరుకున్నాడు. కాని అక్కడకు వెళ్లినా అతడు అనుక్షణం బాంబేను కలవరిస్తూ బతికాడు. 1948లో మంటో పాకిస్తాన్ వెళితే ఆ దేశంలో అతను కేవలం ఏడేళ్లే జీవించగలిగాడు. ‘నా తల్లిదండ్రులు ఖననమైన మట్టి భారతదేశంలో ఉంది. నన్ను ముక్కలు చేసి ఇచ్చిన ఈ స్వాతంత్య్రం శోకమే మిగిల్చింది’ అన్న మంటో 1955లో మరణించాడు. ∙∙ మంటో రాసిన కథల్లో ‘ఠండా గోష్’ (చల్లటి మాంసం) అతడికి విశేషమైన పేరును, కీర్తిని, పీడకలలను మిగిల్చిన కోర్టు కేసులను ఇచ్చింది. ఆ కథలో అతడు వాడిన భాష, తీసుకున్న కథాంశం ఇప్పటికీ యథాతథంగా ప్రచురించడం కష్టం– మెయిన్‌స్ట్రీమ్ పత్రికలలో. మానవ ప్రవర్తనలోని పశుత్వాన్ని, కర్కశత్వాన్ని, స్వార్థాన్ని, పర్వెర్షన్ను మంటో చెప్తూ వెళ్లాడు. నగ్నంగా చూపుతూ వెళ్లాడు. ‘ఇలా రాయడం తప్పు కాదా... రచయితకు బాధ్యత ఉండక్కర్లేదా’ అనంటే ‘వేపాకులు చేదుగానే ఉంటాయి. కాని అవి రక్తాన్ని శుభ్ర పరుస్తాయి’ అని జవాబు చెప్పాడు. అతడి ఒక కథలో ఒక ముసలి దంపతుల ఇంట్లో ఒక వేరే మతస్తుడు శరణుజొచ్చుతాడు. ఆ ముసలి దంపతులు చాలా మంచివాళ్లు. చీమకు కూడా అపకారం తలపెట్టరు. కాని తమ ఇంట్లో శరణుజొచ్చింది అన్య మతస్తుడు. అప్పుడు వాళ్లు బాగా ఆలోచించి తాము మంచివారం గనక ఒక నిర్ణయం తీసుకుంటారు. ‘మనకెందుకు ఆ పక్కింటి వాళ్లకు ఇతణ్ణి అప్పజెబుదాం. వాళ్లయితే రోజుకొరిని చంపుతున్నారు. ఇతడి సంగతి వాళ్లే చూసుకుంటారు’.ఇలా చెంపకు పట్టి కొట్టినట్టు అతడు కథలు రాశారు.అతడి కథల్లో ఇవాళ్టి మనుషులు కనిపిస్తారు. రేపటి మనుషులు కనిపిస్తారు. నైచ్యం వదులుకోని మనిషి ఉన్నంత కాలం మంటో కథ ఉంటుంది. ‘మంటో’ మీద అనేక నాటకాలు, వ్యాసాలు వచ్చాయి. భారతదేశంలో సినిమా రావడం ఇదే మొదటిసారి. సుప్రసిద్ధ నటి, దర్శకురాలు నందితా దాస్ ‘మంటో’ జీవితకథను తెరకెక్కించింది. మంటో మీద ఉన్న గౌరవంతో నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కేవలం ఒక్క రూపాయి రెమ్యూనరేషన్‌తో ఈ సినిమాలో నటించాడు. ఒక రచయిత జీవితం, సత్యం పలకాలనుకున్న ఒక రచయిత జీవితం, సత్యానికి నిలబడి సమాజపు నిర్దాక్షిణ్యతను చవి చూసిన ఒక రచయిత జీవితం, తన నేలకు దూరమయ్యి అస్థిమితత్వం పొందిన రచయిత జీవితం ఈ జీవితాన్ని మాత్రమే కాదు... దేశ విభజన ఈ దేశ ప్రజల మీద ఎటువంటి గాయాన్ని కలిగించిందో కూడా ఈ సినిమా చూపుతుంది.మనిషి కోసం మాట్లాడే రచయితలకు బెదిరింపులు, మరణ సందేశాలు వస్తున్న ఇవాళ్టి రోజులలో, ఏ ఉన్మాదాన్నైనా ఖండించాల్సిందే అని కలం పట్టుకునేవారి నోళ్లు మూయించాలనుకుంటున్న ఈ రోజులలో, ప్రజల మధ్య ద్వేషాన్ని కడిగిపారేయడానికి సిరాను నింపుకునేవాళ్ల కలాల ములుకు విరగ్గొడుతున్న ఈ రోజులలో మంటో అవసరం ఉంది.వంద మంటోల అవసరం ఉంది. వేయి మంటోలు ప్రభవించాల్సిన అవసరం ఉంది.సినిమా థియేటర్స్‌లో ఉంది. వెళ్లి మంటోతో పాటు ఒక కథకు కన్నీరు కార్చండి. ఒక కథకు దగ్ధమవ్వండి. నందితా దాస్ ఇచ్చిన మరో కానుక స్త్రీల కోసం రాసిన రచయిత జీవితాన్ని ఒక మహిళా డైరెక్టర్ తెర మీదకు అనువదించడం విశేషమైన అంశం. మంటో జీవిత కథను తెరకెక్కించడానికి నటి, దర్శకురాలు నందితా దాస్ దాదాపు నాలుగు సంవత్సరాలు వెచ్చించారు. రీసెర్చ్ చేశారు. పాకిస్తాన్ వెళ్లి మంటో ముగ్గురు కుమార్తెలను, స్నేహితులను కలిసి మంటో జీవితాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మంటో జీవితం గురించి చూపుతూనే ఆయనకు విశేషమైన పేరు తెచ్చిన కథలకు ఈ సినిమాలో చోటిచ్చారు. ‘ఖోల్దో’, ‘టొబా టేక్సింగ్’, ‘ఠండా గోష్’ కథలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇది పిరియడ్ ఫిల్మ్. ఆ కాలం వాతావరణం కల్పించడానికి 1950ల నాటి బాంబే, లాహోర్ల వాతావరణం సృష్టించడానికి నందితా అథెంటిక్ బ్యాక్‌గ్రౌండ్‌ను సృష్టించడంలో ప్రతిభ చూపారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల మంటోతో పాటు నందితాకు కూడా ఆలింగనం ఇస్తారు. – ఖదీర్ -
మైమరపించిన ‘మాంటో’
-
ఆకట్టుకుంటున్న ‘మాంటో’ ట్రైలర్
సాక్షి, ముంబై: ప్రముఖ నటి, రచయిత, దర్శకురాలు తెరకెక్కించిన మాంటో ట్రైలర్ దూసుకుపోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటోంది. కథా రచయిత సాదత్ హసన్ మాంటో జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో మాంటోగా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించగా, మాంటో భార్యగా రసికా దుగ్గల్ నటించారు. ఇంకా రిషి కపూర్, పరేష్ రావల్, ఇలా అరుణ్ గురుదాస్ మ్యాన్ , పరేష్ రావల్, దివ్య దత్తా, ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. జావేద్ అఖ్తర్ తొలిసారిగా ఈ సినిమాలో నటించారు. కాగా ఈ ఏడాది పోటీపడబోతున్న కేన్స్ 21 చిత్రాల్లో నందితా దాస్ తెరకెక్కించిన ‘మాంటో’ కూడా ఉండటం విశేషం. విడుదలైన కొన్ని గంటల్లోనే 10లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించింది. దీనిపై చిత్ర దర్శకురాలు నందితా దాస్ స్పందించారు. తమ ట్రైలర్‌కు లభిస్తున్నభారీ మద్దతుపై సంతోషం వ్యక్తం చేస్తూ ఫేస్బుక్లో ధన్యవాదాలు తెలిపారు. ముంబైలో కథా రచయితగా మాంటో కథలకు మంచి ఆదరణ లభిస్తుంది. కానీ దేశంలో హింసాకాండ కారణంగా అతికష్టంమీద ముంబై వీడి లాహోర్ పోవాలనే నిర్ణయం తీసుకుంటారు మాంటో. అలా భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఆయన నాలుగేళ్ల జీవితంలో రేగిన కల్లోలాన్ని, అత్యంత గందరగోళ పరిస్థితులను పట్టి చూపిస్తుందట ఈ సినిమా. -
‘మాంటో’ ట్రైలర్ విడుదల
-
తలైవా సినిమా; అదృష్టం అంటే వారిదే
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే చాన్స్ కోసం అన్ని ఇండస్ట్రీల వాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ‘కాలా’ తర్వాత రజనీకాంత్ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించిన నాటి నుంచి సూపర్ స్టార్‌తో జోడి కట్టే అదృష్టం ఎవరిని వరిస్తుందా అని రజనీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. వారి ఎదురుచూపులకు సమాధానం దొరికింది. రజనీకాంత్ సరసన నటించబోయే ఆ అదృష్టం ఒకనాటి అందాల తార సిమ్రాన్‌ను వరించింది. ఇంకా పేరు ఖరారు కానీ ఈ చిత్రంలో సిమ్రాన్ రజనీతో జత కట్టనుంది. అంతే కాక ఈ సినిమాలో మరో విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా సన్ పిక్చర్స్ సంస్థ ప్రకటించింది. దాంతో రజనీ సినిమాలో సిమ్రాన్, నవాజుద్దీన్ సిద్దఖీల అధికారిక ప్రవేశం కన్ఫామ్ అయ్యింది. సిమ్రాన్ దక్షిణాది పరిశ్రమకు సుపరిచితురాలే. ఒకప్పుడు ఈ హీరోయిన్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలందరితో జత కట్టారు. వివాహం చేసుకున్న తర్వాత కొన్నాళ్లపాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యే తమిళ డైరెక్టర్ పొణరామ్ దర్శకత్వంలో శివకార్తికేయన్, సమంత ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సినిమా ద్వారా సిమ్రాన్ తమిళ పరిశ్రమలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ఇంకా సెట్స్‌పై ఉండగానే ఇప్పుడు ఏకంగా రజనీకాంత్‌తో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా నవాజుద్దీన్ సిద్దిఖీకి ఇదే తొలి తమిళ చిత్రం. ఇంతవరకూ బాలీవుడ్‌కే పరిమితమయిన ఈ నటుడు ఇప్పుడు రజనీ సినిమాతో దక్షిణాదిలో అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్దిఖీ అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన సాక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించారు. ఈ వెబ్‌సిరీస్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీ ముంబైకి చెందిన గ్యాంగ్‌స్టర్ గణేష్ గైతొండే పాత్రలో నటించారు. -
‘బోర్‌కొట్టినప్పుడు విడాకులు తీసుకుంటాం
దర్శకుడు అనురాగ్ కశ్యప్, విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీలది హిట్ పెయిర్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘దేవ్ డీ’, ‘బ్లాక్ ఫ్రైడే’, ‘రామన్ రాఘవ్ 2.0’ మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ తీసిన ‘సాక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌లో నవాజుద్దీన్ ప్రధాన ప్రాతలో నటించారు. అయితే నవాజుద్దీన్‌తో కలిసి పనిచేయడం గురించి అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. ‘నేను చేసే పనిలో కొత్తదనం ఉంటేనే నవాజ్‌ను సంప్రదిస్తాను. ఇప్పటి వరకూ మేము చేసిన వాటిల్లో ఒక్కటి కూడా పునరావృతం కాలేదు. ఇప్పటి వరకూ మా ఇద్దరి కాంబినేషన్లో ఏం వచ్చాయి అనే దాని గురించి మాకు ఒక అవగాహన ఉంది. కొత్తగా చెప్పడానికి నా దగ్గర ఏం లేకపోతే ఖాళీగా ఉంటాను, తప్ప రొటీన్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించను’ అన్నారు. అంతేకాక.. ‘మా ఇద్దరి కాంచినేషన్ ఎంత కాలం కొనసాగుతుందో చెప్పడం కష్టం. మా ఇద్దరికి ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు విడాకులు తీసుకుంటాం. కలిసి పనిచేయం’ అన్నారు. నవాజుద్దీన్ గురించి మాట్లాడుతూ ‘నవాజుద్దీన్ ఎంత గొప్ప నటుడో మొత్తం ఇండస్ట్రీకి తెలుసు. అతనికి తన పని అంటే ప్రాణం.. సినిమా కోసం ఎంతైనా కష్టపడతారు. ఇప్పుడు నేను నవాజుద్దీన్‌ను కొత్తగా చూపకపోతే నాకు, మిగితా వారికి తేడా ఉండదు. ఈ పరిశ్రమలో నటులైన, సంగీత దర్శకులైన ఒక్కసారి విజయం సాధిస్తే ఇక మిగతా వారు కూడా వారిని అలానే చూపిస్తుంటారు. ఇక వారు జీవితాంతం అలాంటి పాత్రలకే పరిమితం అవ్వాల్సి వస్తుంది. నేను మాత్రం ఇలా చేయలేను. విసుగ్గా ఉంటుంది’ అన్నారు. అందుకే ‘అతన్ని ఒకే రకం పాత్రలకు పరిమితం చేయలేను’ అన్నారు. స్వాతంత్ర్యానంతరం జరిగిన రాజకీయ పరిణమాలు ఫలితంగా మొదలైన ముంబై అండర్ వరల్డ్ ఇతివృత్తంగా ‘సాక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్ సత్రాజ్ సింగ్ అనే నిజాయితి గల పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా, నవాజుద్దీన్ సిద్దిఖి అండర్ వరల్డ్ డాన్ గణేష్ గేంతోడ్ పాత్రలో నటిస్తున్నారు. -
న్యూడ్ సీన్ పలుమార్లు తీస్తే ఏడ్చేశా!
ముంబై : ‘నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావ్ అని నాకు తెలుసు. కానీ అలా చేయవద్దు. సీన్ మరింత బాగా రావడానికి మరోసారి న్యూడ్(నగ్నం)గా కనిపించాలని’ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పలుమార్లు చెప్పారని నటి కుబ్రా సైత్ అన్నారు. హాలీవుడ్లో విజయవంతమైన వెబ్ సిరీస్‌ల బాటలో ఇటీవల టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ కొందరు దర్శకులు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో వచ్చిన బాలీవుడ్ వెబ్ సిరీసే సాక్రిడ్ గేమ్స్. జాతీయ మీడియా ‘టైమ్స్ నౌ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుబ్రా సైత్ మాట్లాడుతూ.. ‘నేను ఈ వెబ్ సిరీస్‌లో కుక్కూ అనే ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషించాను. కొన్ని సీన్లలో నేను నగ్నంగా కనిపించాల్సి ఉంటుందని దర్శకుడు అనురాగ్ కశ్యప్, కో డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానీ ముందుగానే చెప్పారు. అయితే వచ్చిన చిక్కేంటంటే.. నగ్నంగా నటించిన సన్నివేశాన్ని పలుమార్లు చిత్రీకరించేవారు. సీన్ ముగిసిన ప్రతిసారి మరో టేక్ చేద్దామనేవారు. ఇలా కనీసం 7సార్లు అలాంటి సీన్లు చిత్రీకరించారు. ఆ సమయంలో నేను దాదాపు ఏడ్చేశాను. ఆ సీన్లు పలుమార్లు తీస్తున్నానని తప్పుగా భావించవద్దని, సీన్ మరింత అందంగా, ఆకర్షణీయంగా రావడానికి అలా చేయాల్సి వచ్చిందని కశ్యప్ చెప్పేవారు. నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావని తెలుసునని, అయితే దయచేసి ఆ పని చేయవద్దని కశ్యప్ పదే పదే నన్ను అడిగేవారు. వెబ్ సిరీస్ విడుదలయ్యాక ఆ సీన్లు చూసి చాలా బాగా తీశారు. న్యూడ్ సీన్లను కూడా చాలా అందంగా చిత్రీకరించారు. మంచి టీమ్‌తో పని చేశానని మీరు భావిస్తారని’ అనురాగ్ కశ్యప్ తనతో చర్చించేవారని నటి కుబ్రా సైత్ వివరించారు. 1980, 90 దశాబ్దాలలో ముంబైలో గ్యాంగ్స్టర్స్, పోలీసుల మధ్య జరిగే దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. సాక్రిడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కుబ్రా సైత్ల నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వెబ్ సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. -
నటుడి సోదరుడిపై కేసు!
మీరట్ : హిందువులు ఆరాధించే పరమశివుడి ఫొటోను కించపరిచే రీతిలో ఫేస్బుక్లో పోస్టు చేసిన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ సోదరుడు అయాజుద్దిన్ సిద్ధిఖీపై కేసు నమోదైంది. అయాజుద్దీన్ పోస్టుపై హిందూ యువవాహిని (హెచ్‌వైవీ) కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేయడంతో మీరట్‌లోని బుధానా పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐపీసీ సెక్షన్ 153ఏ (మతం, జాతి, ప్రాంతం ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం) కింద ఆయనపై పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. శివుడి ఫొటోను అభ్యంతరకర రీతిలో పోస్టు చేసిన అయాజుద్దీన్ వెంటనే అరెస్టు చేయాలని హెచ్‌వైవీ నేత భరత్ ఠాకూర్ డిమాండ్ చేస్తున్నారు. అయితే, నిజానికి శివుడి పట్ల అభ్యంతరకర పోస్టును ఖండిస్తూ.. అయాజుద్దీన్ ఫేస్బుక్లో పోస్టు పెట్టారని, అయితే, శివుడి అభ్యంతరకర ఫొటోను ఆయన కాపీ చేసి.. తన పోస్టులో పెట్టడంతో హెచ్‌వైవీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ముజఫర్‌నగర్ డీఎస్పీ హరిరామ్ యాదవ్ తెలిపారు. ఆయన పోస్టు ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని, ఫేస్బుక్లో ఇలాంటి అభ్యంతకరమైన ఫొటోలు షేర్ చేయకూడదని, అలాంటి వాటిని తాను తిరస్కరిస్తున్నానని ఆయన తన పోస్టులో పేర్కొన్నారని డీఎస్పీ చెప్పారు. ‘శివుడిపై ఓ వ్యక్తి అభ్యంతరకరమైన పోస్టు పెట్టారు. దానిపై నేను అతడితో పోట్లాడాను. మత మనోభావాలు దెబ్బతీసే ఇలాంటి పోస్టులు పెట్టకూడదని కోరుతూ నేను పోస్టు పెట్టాను. కానీ నాపైనే కేసు నమోదు చేశారు’ అని అయాజుద్దీన్ సిద్ధిఖీ మీడియాకు తెలిపారు. -
టాలీవుడ్ నటి ఆరోపణలు.. చిక్కుల్లో సిద్ధిఖీ
సాక్షి, ముంబై : కాల్ డేటా రికార్డ్ స్కామ్(సీడీఆర్)లో నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన భార్యపై ప్రైవేట్ డిటెక్టివ్‌తో నిఘా వేయించి, ఆమె కాల్ డేటా సేకరించాడనే ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనకు సహకరించిన లాయర్ రిజ్వాన్ సిద్ధిఖీని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఈ కేసులో రిజ్వాన్‌పై టాలీవుడ్ నటి ఒకరు సంచలన ఆరోపణలు దిగారు. రిజ్వాన్ తన కాల్ డేటాను కూడా దొంగిలించాడని నటి ఆకృతి నాగ్‌పాల్ ఆరోపిస్తున్నారు. తెలుగులో చిన్న చిన్న పాత్రలు, బాలీవుడ్లో చిత్రాలతోపాటు మోడల్‌గానూ ఆమె గుర్తింపు పొందారు. సోమవారం థానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె రిజ్వాన్‌కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు తన వైవాహిక జీవితం నాశనం కావటానికి రిజ్వాన్ కూడా ఓ కారణమని ఆమె అంటున్నారు. అనిల్ మిస్త్రీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఆకృతి.. కాపురంలో కలతలు రేగటంతో 2014లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అనిల్‌కు స్నేహితుడు అయిన రిజ్వాన్ తన కాల్ డేటాను దొంగిలించి తన భర్తకు అందజేసి ఉంటాడని ఆమె అనుమానిస్తున్నారు. ‘నా వైవాహిక జీవితం నాశనం కావటానికి రిజ్వాన్ కారణం. అతను అనిల్‌కు చిన్ననాటి స్నేహితుడు. పైగా విడాకుల సమయంలో ప్రొత్సహించి మరీ మరో యువతితో అనిల్‌కు మరో సంబంధం కుదిర్చాడు. సీడీఆర్ వ్యవహారం వెలుగులోకి రావటంతో నా అనుమానాలు నిజమనే భావిస్తున్నా. రిజ్వాన్‌కు అండగా ఉంటున్నవారిని కూడా విడిచిపెట్టకండి’ అని ఆకృతి చెబుతున్నారు. రిజ్వాన్ ఓ ప్రముఖ బాలీవుడ్ నటి డేటాను ఆమె భర్తకు అప్పగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పుడు ఆకృతి ఆరోపణలతో కాల్ రికార్డింగ్ డేటా స్కామ్ పెద్ద వ్యవహారమే అయి ఉంటుందని థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. రిజ్వాన్ పాత్ర గనుక నిజమని తేలితే నవాజుద్దీన్‌కు కూడా కష్టాలు తప్పకపోవచ్చు. ఇప్పటికే ఈ స్కామ్‌లో పలువురి వీఐపీల హస్తం ఇందులో ఉందని చెబుతున్న పోలీసులు.. వారి పేర్లు వెల్లడించేందుకు సుముఖత వ్యక్తం చేయటం లేదు. -
నా భర్త మంచోడు.. అనుమానాల్లేవ్!
సాక్షి, ముంబై : కాల్ రికార్డ్ డేటా స్కామ్‌లో అడ్డంగా బుక్కైన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీకి ఊరట లభించింది. తన భర్త చాలా మంచోడని.. ఎలాంటి అనుమానాలు లేవని సిద్ధిఖీ భార్య అంజలి(ఆలియా సిద్ధిఖీ) చెబుతున్నారు. సీఆర్డీ స్కామ్‌కు ఆయనకు సంబంధం లేదని ఆమె వాదిస్తున్నారు. ‘నా భర్త ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. ఆయనో సెలబ్రిటీ. అందుకే ఆయన పేరును ఇలా బద్నాం చేస్తున్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి మన్స్పర్థలు లేవు. అనవసరంగా ఆయన్ని స్కామ్‌లో ఇరికిస్తున్నారు. గతంలో కూడా మా వైవాహిక జీవితం గురించి రకరకాల కథనాలు వచ్చాయి. కానీ, అవి ఉత్తవేనని తర్వాత తేలింది. ఇప్పుడు కూడా అంతే. ఆయన నిర్దోషిగా బయటపడతారన్న నమ్మకం ఉంది.’ అని ఆలియా తన ఫేస్ బుక్‌లో ఓ సుదీర్ఘ పోస్టును ఉంచారు. కాగా, భార్యపై అనుమానంతో డిటెక్టివ్‌ను నియమించిన సిద్ధిఖీ.. ఆమె కాల్ డేటాను సేకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో థానే పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేశారు. మరోవైపు సిద్ధిఖీ కూడా ఈ వ్యవహారాన్ని కుట్రగా కొట్టేశాడు. మరోవైపు ఈ స్కామ్‌లో పలువురు ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. -
స్కామ్‌లో ఇరుకున్న నటుడు
సాక్షి, ముంబై : కాల్ డేటా రికార్డ్ స్కామ్‌లో బాలీవుడ్ నటుడికి పోలీసులు సమన్లు జారీ చేశారు. విలక్షణ నటుడిగా గుర్తింపుపొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీ, తన భార్య అంజలిపై అనుమానంతో ఓ డిటెక్టివ్‌ను నియమించాడని.. ఆమె కాల్ డేటాను సేకరించాడని ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత కాల్స్‌ను ట్రాప్ చేస్తున్నారంటూ కొందరు ఫిర్యాదులు రావటంతో థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం చిన్నది కాదని తేల్చిన పోలీసులు.. కాల్ డేటా రికార్డ్ స్కామ్ పేరిట దీని దర్యాప్తు చేపట్టారు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేయగా.. అందులో ప్రైవేట్ డిటెక్టివ్లు కూడా ఉన్నారు. నవాజ్ తన భార్యపై అనుమానంతో నిఘా వేయించాడని, కాల్ డేటా సేకరించాడని ఓ డిటెక్టివ్ వెల్లడించాడు. అందుకు గానూ నవాజ్ తనకు రూ. 50 వేల దాకా చెల్లించాడని అతను చెప్పాడు. దీంతో విచారణకు సహకరించాల్సిందిగా నవాజుద్దీన్ పోలీసులు కోరారు. అయినా ఎటువంటి స్పందన లేకపోవటంతో థానే పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇక ఈ వ్యవహారంపై నవాజుద్దీన్ ట్విట్టర్లో స్పందించాడు. తన కూతురు స్కూల్ ప్రాజెక్టు కోసం హాజరయ్యానని చెబుతూ.. అసత్య ఆరోపణలపై మీడియా తనను ప్రశ్నించటం దిగ్భ్రాంతి కలగజేస్తోందని అంటున్నాడు. Last evening, I was helping my daughter to prepare her school project Hydroelectric Power Generator & went to her school this morning for Project Exhibition. To my surprise the media had questions about some random allegations on me #Disgust pic.twitter.com/APPaEK373q — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) 10 March 2018 -
డెవిల్ ఈజ్ బ్యాక్
యస్.. డెవిల్ ఈజ్ బ్యాక్. మరోసారి డెవిల్‌గా వచ్చే ఏడాది క్రిస్మస్కు థియేటర్స్‌లో డబుల్ కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు సల్మాన్ ఖాన్. ఆల్మోస్ట్ నాలుగేళ్ల క్రితం సాజిద్ నాడియాడ్వాలా తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘కిక్’. తెలుగులో రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్’ చిత్రానికి రీమేక్ ఇది. హిందీ చిత్రంలో సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రణ్‌దీప్ హుడా, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించారు. దేవీలాల్ సింగ్ (డెవిల్) పాత్రలో సల్మాన్ నటించి, బాక్సాఫీసును కొల్లగొట్టారు. అంతేకాదు దర్శకత్వం వహించిన తొలి సినిమానే 200 కోట్ల క్లబ్లో చే ర్చిన ఘనత సాజిద్‌కు దక్కింది. బుధవారం ‘కిక్’కి సీక్వెల్‌గా ‘కిక్ 2’ చిత్రాన్ని ఎనౌన్స్ చేశారాయన. ‘‘వెయిట్ ఈజ్ ఓవర్.. డెవిల్ ఈజ్ బ్యాక్. ‘కిక్ 2’ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయనున్నాం’’ అని పేర్కొన్నారు సాజిద్. ఇందులో సల్మాన్ డ్యూయెల్ రోల్ చేయనున్నారన్న వార్తలు బీటౌన్‌లో జోరందుకున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది తన ఫేవరెట్ ఫెస్టివల్ రంజాన్‌కు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘భరత్’ మూవీకి రెడీ అవుతున్నారు సల్మాన్. ఈ ఏడాది రంజాన్‌కు సల్మాన్ ‘రేస్ 3’ విడుదల కానున్న సంగతి తెలిసిందే. గతేడాది క్రిస్మస్కు సల్మాన్ ౖ‘టెగర్ జిందాహై’ చిత్రం రిలీజై మంచి వసూళ్లను రాబట్టింది. సో.. ఈ సెంటిమెంట్‌ను కొనసాగించడానికే సల్మాన్ వచ్చే ఏడాది క్రిస్మస్కు ‘కిక్ 2’ ప్లాన్ చేశారని బాలీవుడ్ టాక్. -
బాల్‌ఠాక్రే సమాధి నుంచి లేచొస్తారు!
సాక్షి, న్యూఢిల్లీ : శివసేన వ్యవస్థాపక నాయకుడు బాల్ ఠాక్రే నిజ జీవితం ఆధారంగా తీస్తున్న ‘బాల్ ఠాక్రే’ సినిమాలో టైటిల్ పాత్రను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముస్లిం నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ పోషించడం పట్ల ఇప్పుడు వివాదం రాజుకుంటోంది. హిందూ సంప్రదాయాలకు కట్టుబడి ముస్లిం మైనారిటీలను వ్యతిరేకించిన బాల్ ఠాక్రే పాత్రలో ఓ ముస్లింను ఎలా తీసుకున్నారని ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఈ విషయం బాల్ ఠాక్రేకే తెలిస్తే ఆయన సమాధి నుంచి లేచొస్తారని మరి కొందరు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో మరాఠీలకే ఉపాధి అవకాశాలు ఉండాలంటూ పోరాడిన బాల్ ఠాక్రే యూపీ, బిహార్ రాష్ట్రాల నుంచి ముంబై నగరానికి ప్రజల వలసలను, ముఖ్యంగా మైనారిటీల వలసలను వ్యతిరేకించారని, అలాంటి వ్యక్తి జీవిత కథను తెరకెక్కిస్తూ ఓ మైనారిటీ ముస్లింను, అందులోనూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన నటుడిని తీసుకోవం ఏమిటని వారు విమర్శించారు. మరాఠీ నటులను ఎందుకు ఎంపిక చేయలేదని వారు ప్రశ్నించారు. యూపీ, బీహార్ నుంచి ప్రజల వలసలను వ్యతిరేకిస్తూ బాల్ ఠాక్రే కొన్నిసార్లు విధ్వంసకర ఆందోళనలకు కూడా దిగారు. హిందూ ఛాందసవాద నాయకుడి పాత్రకు ఓ ముస్లిం నటుడిని తీసుకోవడం పట్ల కొందరు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఠాక్రే పాత్రలో ముస్లిం చూపించడం ఎంత చల్లని మాటని కొందరంటే ‘ఆహా! ఏమి వైరుధ్యవైవిధ్యము’ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఠాక్రే పాత్ర కోసం యూపీ నుంచి సిద్దిఖీని తీసుకున్నట్టే బీహార్ నుంచి రవి కిషన్‌ను తీసుకుంటే తానింకా ప్రశాంతంగా మరణిస్తానని ఒకరు వ్యాఖ్యానించారు. ఠాక్రేను తెరపై చూపించడం ఇదే మొదటిసారి కాదని, ఓ ముస్లింను ఆయన పాత్రలో చూపించడం ఇదే మొదటిసారని, దాన్ని తాను హదయపూర్వకంగా హర్షిస్తున్నానని మరొకరు వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయ్‌జాన్’ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ తన జర్నలిస్ట్ పాత్ర ద్వారా ప్రేక్షకులను విశేషంగా మెప్పించిన విషయం తెల్సిందే. ఇప్పుడు సిద్దిఖీ ‘బాల్‌ఠాక్రే’ చిత్రంలో ఠాక్రేగానే కాకుండా దేశ విభజన సందర్భంగా జరిగిన సంఘటనలపై గుండెలను మండించే కథలను రాసిన ‘సాదత్ హసన్ మంటో’ బయోపిక్‌లో కూడా మంటోగా నటిస్తున్నారు. ‘బాల్ ఠాక్రే’ సినిమా షూటింగ్ మొన్న అంటే, గురువారం సాయంత్రం బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఠాక్రే కుమారుడు ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ సినిమాకు శివసేన పార్లమెంట్ సభ్యుడు సంజయ్ రౌత్ స్క్రీన్‌ప్లే రచించగా, 2014లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొద్దకాలంపాటు నవ నిర్మాణ సేనలోకి వెళ్లి వచ్చిన శివసేన సభ్యుడు అభిజిత్ ఫాన్సే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. -
పులి రెడీ అవుతోంది
మూడు గంటలు చాలవని అమితాబ్ బచన్ అంటున్నారు. దేనికి మూడు గంటలు? బాల్ థాకరే జీవిత చరిత్రను సినిమాగా తియ్యడానికట. ‘థాకరే’ మూవీ టీజర్‌ని రిలీజ్ చేస్తూ అమితాబ్ ఈ మాట అన్నారు. సినిమాలో థాకరే పాత్రను పోషిస్తున్నది మాత్రం అమితాబ్ కాదు. నవాజుద్దీన్ సిద్ధిఖీ! స్క్రిప్టు ఎవరో తెలుసా? శివసేన ఎంపీ సంజయ్ రౌత్. డైరెక్షన్ అభిజిత్. ‘అసలు ఇలాంటి ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరిగంతేస్తారు’ అని టీజర్ లాంచ్‌లో ఎగ్జయిట్ అయ్యాడు సిద్ధిఖీ. ‘‘ఎవరికైనా డౌట్ వస్తుంది. ఇతడు మరాఠీ ఎలా మాట్లాడగలడు? అది కూడా థాకరే స్టైల్లో.. అని. కానీ థాకరే నన్ను పైనుంచి బ్లెస్ చేస్తారని నా నమ్మకం’’ అన్నాడు సిద్ధిఖీ ఎంతో కాన్ఫిడెంట్‌గా. ఇక అమితాబ్ అన్న మాట దగ్గరికి వద్దాం. థాకరే జీవితాన్ని మూడు గంటల్లో ఎందుకు చూపలేమంటే.. ఆయన వ్యక్తిత్వం, జీవితం సినిమాకు అందనివి. బాల్ థాకరే బర్త్‌డే జనవరి 23న. ఆ రోజు ఈ బయోపిక్‌ని రిలీజ్ చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘శివసేన’ పార్టీని స్థాపించి, మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన థాకరే 86 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆయన లైఫ్ అంతా పరవళ్లు తొక్కిన ప్రవాహం. మరి ఆ వేగాన్ని నవాజుద్దీన్ íసిద్ధిఖీ తన నటనతో అందుకోగలడా? సిద్ధికీ అందుకోలేడంటే.. కనుచూపు మేరలో ఇంకెవరూ అందుకోలేరనే అనుకోవాలి. హి ఈజ్ ద బెస్ట్ చాయిస్. -
క్రైమ్‌కి ఓకే!
అవును... తమన్నా నేరంతో నేస్తం చేయబోతున్నారట. ఆ నేరం పేరు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఆ మధ్య విడుదలైన ‘మామ్’లో డిటెక్టివ్‌గా నటించిన నవాజూద్దీన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్’గా బాలీవుడ్లో దూసుకెళుతోన్నారు. ఈయనతో తమన్నా ఎందుకు చేతులు కలిపారంటే? ఓ హిందీ సినిమా కోసం. నవాజుద్దీన్ ముఖ్య పాత్రలో ఓ క్రైమ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. ఈ చిత్రంలో తమన్నా నటించనున్నారని బీ–టౌన్ టాక్. కథ వినగానే ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి తమన్నా ఓకే అన్నారట. అయితే ఆమె నటించనున్నది నవాజుద్దీన్ సరసన కాదు. ఓ కీలక పాత్ర అట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఏడేళ్ల క్రితం వివేక్ ఒబెరాయ్‌తో ‘ప్రిన్స్’ చిత్రాన్ని తెరకెక్కించిన కూకీ వి. గులాటీ ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి దర్శకుడు. ప్రస్తుతం హిందీ ‘క్వీన్’ తెలుగు రీమేక్‌లో తమన్నా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫ్రాన్స్‌లో జరుగుతోంది. ఇన్సెట్లో ఇసుక మీద హాయిగా సేద తీరుతున్న తమన్నా ఫొటో అక్కడిదే. ఈ ఫొటో చూసి... సముద్ర తీరంలో తమన్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నారా? అదేం కాదు. బాగా ఎక్సర్సైజ్ చేసి, అలసిపోయారు. మామూలుగా ఇక్కడ ఉంటే ఇన్‌డోర్‌లో జిమ్‌లో వర్కవుట్స్ చేసేవారు. ఫ్రాన్స్‌లో మాత్రం అవుట్డోర్ వర్కవుట్స్ చేశారట. అలసిపోయే రేంజ్లో వ్యాయామాలు చేసి, ఇదిగో ఇలా ఇసుక మీద సేద తీరుతున్నారు. ‘‘అవుట్డోర్ ట్రైనింగ్ చాలా బాగుంది’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో తమన్నా పేర్కొన్నారు. -
అబద్ధాలకోరు... సారీ చెప్పాడు
సాక్షి, సినిమా : విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎట్టకేలకు వివాదాలకు పుల్‌స్టాప్ పెట్టాడు. తన ఆత్మకథ పుస్తకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. పుస్తకంలో సిద్ధిఖీ మొత్తం అబద్ధాలే చెప్పాడంటూ అతని మాజీ ప్రేయసిలు అతనిపై తీవ్ర విమర్శలు చేస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ట్విట్టర్లో సిద్ధిఖీ స్పందించాడు. క్షమాపణలు తెలియజేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ‘‘నా జ్ఞాపకాలు(పుస్తకం) ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించండి. నా పుస్తకాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నా’’ అని ప్రకటించాడు. ఆన్ ఆర్డినరీ లైఫ్ పేరిట సిద్ధిఖీ రాసిన పుస్తకంపై ఆయన మాజీ ప్రియురాళ్లు నిహారిక సింగ్, సునీత రాజ్‌వర్‌లు మండిపడ్డారు. పుస్తకం అమ్ముడు పోయేందుకు సిగ్గు లేకుండా కల్పితాలతో అబద్ధపు కథనాలు రాశాడంటూ తీవ్రంగా విమర్శించారు. నిహారిక అయితే ఓ అడుగు ముందుకేసి నటుడిపై జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో నవాజుద్దీన్ పుస్తకాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. సిద్ధిఖీ పిచ్చి ఆలోచనలను భరించలేకే అతనికి దూరమైనట్లు మొదటి ప్రేయసి సునీత చెప్పటం విశేషం. I m apologising 2 every1 who's sentiments r hurt bcz of d chaos around my memoir #AnOrdinaryLife I hereby regret & decide 2 withdraw my book — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) 30 October 2017 -
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌కు ఈడీ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : నల్లధనం కేసులో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం సమన్లు జారీ చేసింది. గతంలో సిద్ధిఖీ దగ్గర ఖాతాల్లోకి రాని రూ. 1.15 కోట్ల ధనాన్ని ఈడీ గుర్తించింది. సోషల్ వెబ్సైట్ అయిన వెబ్‌వర్కర్స్ లిమిటెడ్ నుంచి సిద్ధిఖీ ఖాతాల్లోకి రాని ఈ నల్లధాన్ని తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ డబ్బుకు సంబంధించి ఈడీ.. సిద్ధిఖిని విచారిస్తోంది. వెబ్‌వర్కర్స్ లిమిటెడ్ వెబ్‌సైట్‌కు సిద్ధిఖీగా ప్రచారకర్తగా వ్యవహరించినందుకు సదరు సంస్థ ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. -
కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని నిలిచింది
సాక్షి, ముంబై : బాలీవుడ్లో విలక్షణ నటుడిగా నవాజుద్దీన్ సిద్ధిఖీ మంచి పేరుంది. 1999లో అమీర్‌ఖాన్ సర్పరోష్ లో చిన్నపాత్ర ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధిఖీ ఓ మారుమూల పల్లెటూరి నుంచి వచ్చాడన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. థియేటర్ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టి కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను ఆయన ఎదుర్కున్నాడు. తన ఎదుగుదలలో తల్లి పాత్ర చాలా కీలకం అని ఆయన చాలాసార్లు చెప్పుకునేవారు. అందుకేనేమో బీబీసీ ప్రపంచంలో అత్యంత స్ఫూర్తిదాయక, ప్రభావశీలురైన మహిళల జాబితాలో మెహరున్నీసా సిద్ధిఖీకి చోటుదక్కింది. ‘ఓ మారుమూల పల్లెటూరిలో సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఓ మహిళ కష్టాలను ధైర్యంగా ఎదుర్కుని నిలిచింది’ అంటూ తన తల్లితో కలిసి దిగిన ఓ ఫోటోను నవాజుద్దీన్ షేర్ చేశాడు. బీబీసీ 2017కి గానూ విడుదల చేసిన ఈ టాప్–100 ప్రభావవంతమైన జాబితాలో ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్, సామాజిక వేత్త ఊర్వశి సాహ్ని, మహిళా ఉద్యమ కార్యకర్త నిత్యా తుమ్మలచెట్టికి చోటు దక్కింది. వచ్చే నెల ‘బీబీసీ 100 విమెన్ చాలెంజ్’ పేరుతో భారత్‌లోని వివిధ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వీళ్లు సాధించిన విజయాల గురించి చర్చించనున్నారు. -
'అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటుడ్ని నేనే'
బాలీవుడ్ విలక్షణ నటుడిగా అనతికాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.. గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్, ద లాంచ్బాక్స్, రమణ్‌రాఘవ్ 2.0 వంటి సినిమాలతో సంక్లిష్టమైన పాత్రలను కూడా తనదైన శైలిలో రక్తి కట్టించగలడని ఆయన నిరూపించుకున్నాడు. తాజాగా ఇండియా టీవీ నిర్వహించే 'ఆప్ కి అదాలత్'లో పాల్గొన్న నవాజుద్దీన్ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. నటనపరంగా బాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడిని తానేనని చెప్పాడు. ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వాలని తాను అడుగకపోయినా, నిర్మాతలే తనకు అధికమొత్తంలో చెల్లిస్తున్నారని తెలిపాడు. ప్రస్తుతం బాలీవుడ్ నటులకు హాలీవుడ్ మోజు ఎక్కువైనట్టు కనిపిస్తున్నదని, తమ కన్నా అగ్రస్థానంలో ఉన్నవారిని చూసినప్పుడు ఇలాంటి నూన్యతభావం కలుగడం సహజమని ఆయన చెప్పాడు. కానీ కంటెంట్‌పరంగా బాలీవుడ్లో మంచి సినిమాలు వస్తున్నాయని, ఈ విషయంలో మనమంతా గర్వపడాలని ఆయన తెలిపాడు. -
కేసీఆర్ పాత్రలో బాలీవుడ్ స్టార్..?
తెలంగాణ ఉద్యమనాయకుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి కావటంతో ప్రస్తుతం నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టారు చిత్రయూనిట్. ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమాలో కేసీఆర్‌గా బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు నటించనున్నాడన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా నవాజుద్ధీన్ సిద్ధీఖీ పేరు తెరమీదకు వచ్చింది. బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న నవాజుద్ధీన్ పాత్రల ఎంపికలోనూ వైవిధ్యం చూపిస్తున్నాడు. క్యారెక్టర్ కోసం ఫిజికల్ కూడా ఎలాంటి మార్చులు చేసేందుకైన సిద్ధపడే నవాజ్ అయితే కేసీఆర్ పాత్రకు పూర్తి న్యాయం చేయగలడని భావిస్తున్నారు. -
కేసీఆర్ పాత్రలో బాలీవుడ్ స్టార్..?
-
48 కట్స్‌ను 8 కి తగ్గించారు..!
నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బాబు మొషాయ్ బందూక్ బాజ్' సినిమాకు గతంలో సెన్సార్ బోర్డ్ 48 కట్స్ సూచించిన సంగతి తెలిసిందే. నిబందనల పట్ల కఠినంగా వ్యవహరించిన అప్పటి సెన్సార్ బోర్డ్ చైర్మన్ పంకజ్ నిహ్లానీ రక్తపాతం, శృంగారభరిత సన్నివేశాలకు వీలైనంతగా కత్తెర వేశారు. దీంతో బాబు మొషాయ్ టీం డైలామాలో పడింది. సెన్సార్ బోర్డ్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన చిత్రయూనిట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ నుంచి బాబు మొషాయ్ చిత్రానికి రిలీఫ్ లభించింది. సెన్సార్ బోర్డ్ 48 కట్స్ సూచించిన ఈ సినిమాకు రివ్యూ కమిటీ కేవలం 8 కట్స్ మాత్రమే సూచించటం విశేషం. సెన్సార్ క్లియరెన్స్ లభించిన ఆనందంలో బాబు మొషాయ్ టీం మరో సాంగ్ ను రిలీజ్ చేసింది. -
మరో సినిమాకు సెన్సార్ షాక్: 48 కట్స్
సెన్సార్ బోర్డ్ మరో బాలీవుడ్ సినిమాకు షాక్ ఇచ్చింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బాబు మొషాయ్ బందూక్ బాజ్' సినిమాకు ఏకంగా 48 కట్స్ తో ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ప్రస్తుత సెన్సార్ బోర్డ్ చైర్మన్ పంకజ్ నిహ్లానీ నిబందనల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. రక్తపాతం, శృంగారభరిత సన్నివేశాలకు వీలైనంతగా కత్తెర వేస్తున్నారు. దీంతో సెన్సార్ దెబ్బకు బాబు మొషాయ్ టీం డైలామాలో పడింది. కేవలం అభ్యంతరకర షాట్స్ మాత్రమే తొలగించమని సూచించామని, సీన్స్ ను తీసివేయలేదని సెన్సార్ బోర్డ్ చెపుతున్నా.. చిత్ర దర్శక నిర్మాతలు మాత్రం ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.' సినిమాలోని కళాత్మక కోణాన్ని పట్టించుకోకుండా, పదుల సంఖ్యలో కట్ చెప్పడం కరెక్ట్ కాదని, అలా చేస్తే సినిమా తీయటం ఎందుకు' అంటున్నారు. మరి 'బాబు మొషాయ్ బందూక్ బాజ్' టీం కూడా సెన్సార్ బోర్డ్ పై యుద్ధం ప్రకటిస్తుందేమో చూడాలి. -
‘నేను మహిళల చిత్రాలకు అనుకూలం’
న్యూఢిల్లీ: తాను మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకే ఎక్కువ అనుకూలంగా ఉంటానని బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ అన్నారు. ఆయన తాజా చిత్రం మామ్‌లో శ్రీదేవీతో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీదేవి ఓ శక్తిమంతమైన పాత్రను పోషించారు. ‘నేను మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు సానుకూలంగా ఉంటాను. ఎందుకంటే ఈరోజుల్లో ప్రతి రంగంలో మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అది విద్య కావొచ్చు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కావొచ్చు, క్రీడలు కావొచ్చు. ఈ మార్పును ప్రతి ఒక్కరూ ఆహ్వానించాల్సిందే’ అని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు మహిళలను సినిమాల్లో ఒక వస్తువులుగా చూపించారు.. కానీ, ఇప్పుడు మాత్రం సినిమాలు వారి పైనే వస్తున్నాయి. మనం తప్పక స్వాగతించాలి’ అని ఆయన అన్నారు. గతంలో నవాజుద్దీన్ విద్యాబాలన్ నటించిన కహానీ చిత్రంలో పవర్ఫుల్ దర్యాప్తు అధికారిగా కనిపించిన విషయం తెలిసిందే. -
డీఎన్ఏ టెస్టు చేయించుకున్నా.. నేనెవరంటే!
-
డీఎన్ఏ టెస్టు చేయించుకున్నా.. నేనెవరంటే!
బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన లౌకికవాదాన్ని తెలియజెప్పేందుకు ఓ మంచి ప్రయత్నం చేశాడు. దేశ ప్రజలందరికీ తాను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడు. ఒక చిన్న వీడియో రూపొందించి.. దాని ద్వారా తన మతం ఏంటో అందరికీ తెలియజేశాడు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. ఆ వీడియోకు 16.66 అనే టైటిల్ పెట్టాడు. తనది ఏ మతమో తెలుసుకోడానికి తాను డీఎన్ఏ టెస్టు్ చేయించుకున్నానని ముందుగా అందులో చెబుతాడు. వీడియోలో ఎక్కడా నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడని నవాజుద్దీన్.. అన్నింటినీ తెల్లటి ప్లకార్డుల మీద నల్లటి మార్కర్‌తో రాసి వివరిస్తాడు. ''హాయ్ నేను నవాజుద్దీన్ సిద్దిఖీని. నేను డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నా. దాని రిపోర్టు వచ్చింది. అందులో నేను ఎవరని ఉందంటే..'' అంటూ మొదలుపెడతాడు. అప్పటివరకు మామూలు ప్యాంటు, షర్టులలో ఉన్న నవాజ్.. ఆ తర్వాతి నుంచి ఒక్కో డ్రస్ మారుస్తుంటాడు. తెల్లటి కుర్తా పైజమా ధరించి, నుదుటన సింధూరం పెట్టుకుని, భుజం మీదుగా కాషాయ వస్త్రం ఒకటి కప్పుకొని.. తాను 16.66% హిందువునని చెబుతాడు. ఆ తర్వాతి షాట్లో నల్లటి బంద్గలా సూట్ వేసుకుని, తలమీద తెల్లటి ఫర్టోపీ పెట్టుకుని తాను 16.66% ముస్లింనని అంటాడు. ఆపై గెడ్డం, మీసాలు, తలమీద ఎర్రటి తలపాగాతో కనిపించి 16.66% సిక్కునని వివరిస్తాడు. అంతేకాదు, తెల్లగా పైనుంచి కింది వరకు ఒకటే డ్రస్ వేసుకుని, మెడలో శిలువ చైన్ ధరించి తాను 16.66% క్రిస్టియన్ అని కూడా చెబుతాడు. ఆ తర్వాత బౌద్ధులు ధరించే కాషాయ దుస్తులు ధరించి, తాను 16.66% బౌద్ధుడినంటాడు. మిగిలిన 16.66% ప్రపంచంలో మిగిలిన అన్ని మతాలు కలిసి ఉన్నాయంటాడు. చివరగా.. తన తన ఆత్మను కనుగొన్నప్పుడు మాత్రం, తాను నూటికి నూరుశాతం కళాకారుడినని స్పష్టం చేస్తాడు. దేశంలో లౌకివాదం మీద పెరుగుతున్న చర్చ నేపథ్యంలో అందరూ సమానమేనని చెప్పడానికి నవాజుద్దీన్ తనదైన శైలిలో ఇలా ఒక ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం నవాజ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. మున్నా మైఖేల్, మంటో, మామ్, బాబుమొషాయ్ బందూక్‌బాజ్ సినిమాల్లో అతడు నటిస్తున్నాడు. Sixteen Point Six Six...https://t.co/MKS9gBY6R1 — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) 24 April 2017 -
రాయిస్ మూవీ స్టిల్స్
-
ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్న హీరో!
ముంబై: సినిమాల్లో హీరోలకు పారితోషికం కోట్ల రూపాయల్లో ఉంటుంది. చిన్నపెద్దా తేడా లేకుండా కథానాయకులు కోట్లలో పారితోషికం తీసుకుంటున్న రోజులివీ. అలాంటి పారితోషికం లేకుండా ఓ హీరో సినిమా నటించాడంటే ఆశ్చర్యమే. ఇటీవల విడుదలైన 'హరాంకోర్' హిందీ సినిమాలో హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీ రెమ్యునరేషన్ తీసుకోకుండానే నటించాడట. ఒక్క రూపాయి టోకెన్ ఎమౌంట్ మాత్రమే తీసుకున్నాడని దర్శకుడు శ్లోక్ శర్మ తెలిపాడు. ‘నవాజ్ తో పాటు ఈ సినిమా కోసం పనిచేసిన వారిలో చాలా మంది పారితోషికం తీసుకోలేదు. కొంతమంది తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు. ప్యాషన్ తో ఈ సినిమా చేశాం. నవాజ్ కు ఈ సినిమా కథ బాగా నచ్చింది. బడ్జెట్ లిమిటేషన్స్ దృష్టిలో పెట్టుకుని అతడు సహకరించాడు. నిజంగా చెప్పాలంటే ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాడు. అతడి సహకారం లేకపోతే ఈ సినిమా తీయలేకపోయే వాళ్లమ’ని శ్లోక్ శర్మ పేర్కొన్నాడు. గునీత్ మెంగా, అనురాగ్ కశ్యప్ నిర్మించిన 'హరాంకోర్' టీచర్, స్టుడెంట్ ప్రేమకథతో తెరకెక్కింది. -
ఆన్లైన్లో ‘లైలా’ దుమ్మురేపుతోంది!
-
ఆన్లైన్లో ‘లైలా’ దుమ్మురేపుతోంది!
బాలీవుడ్ శృంగార భామ సన్నీ లియోన్.. ’లైలా మై లైలా’ అంటూ ఉర్రూతలూగిస్తోంది. తొలిసారి షారుఖ్‌తో కలిసి ఆడిపాడిన ఈ అమ్మడు.. అదరగొట్టే స్టెప్పులు, టీజింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. షారుఖ్‌ఖాన్ తాజా చిత్రం ’రాయిస్’లో ఓ స్పెషల్ ఐటెం సాంగ్‌లో నర్తించిన సన్నీ.. ఊహించినట్టే తన అందచందాలతో మతిపోగోడుతోంది. ఇటీవల ఆన్లైన్లో విడుదల చేసిన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. షారుఖ్ గంభీరమైన లుక్ కనిపించగా.. ఐటెం సాంగ్‌కు కావాల్సిన ఘాటైన హుషారెత్తించే డ్యాన్స్‌లతో సన్నీ అలరించింది. కొంత కాలంగా భారీ బ్లాక్ బస్టర్స్ అందించటంలో ఫెయిల్ అవుతున్న షారూఖ్ 80వ దశకంనాటి కథతో 'రాయిస్'గా ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గుజరాత్‌కు చెందిన స్మగ్లర్‌గా కనిపించనుండగా.. అతని ఆట కట్టించేందుకు ప్రయత్నించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ గులామ్ పటేల్ పాత్రగా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తున్నాడు. రాహుల్ దోలాఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షారూఖ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. 2017 జనవరి 26న రిలీజ్ అవుతున్న ఈ సినిమా హృతిక్ హీరోగా తెరకెక్కిన కాబిల్తో పోటిపడుతోంది. -
రాయిస్ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్
-
రాయిస్ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్
కొంత కాలంగా భారీ బ్లాక్ బస్టర్స్ అందించటంలో ఫెయిల్ అవుతున్న షారూఖ్, ఓ పీరియాడిక్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 80ల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్, గుజరాత్లో స్మగ్లింగ్ చేసే రాయిస్ అలాంగా కనిపిస్తున్నాడు. షారూఖ్ ఆట కట్టించేందుకు ప్రయత్నించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ గులామ్ పటేల్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ కనిపిస్తున్నాడు. రాహుల్ దోలాఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షారూఖ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను ఈ ఏడాది రంజాన్‌కే రిలీజ్ చేయాలని భావించినా.., అదే సమయంలో సల్మాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ రిలీజ్ ఉండటంతో వాయిదా వేశారు. ప్రస్తుతం 2017 జనవరి 26న రిలీజ్ అవుతున్న ఈ సినిమా హృతిక్ హీరోగా తెరకెక్కిన కాబిల్తో పోటిపడుతోంది. భారీ అంచనాలున్న రాయిస్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. షారూఖ్ మాస్ లుక్‌లో ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. -
కట్నం కోసం మరదలిపై నటుడి దాడి!
లక్నో: కట్నం కోసం సోదరుడి భార్యపై దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ స్పందించారు. పబ్లిసిటీ కోసమే ఆమె తనపై ఆరోపణలు చేసినట్టు ఆయన చెప్పారు. గత నెల 28న తన తమ్ముడి భార్య ఆఫ్రిన్‌ను నవాజుద్దీన్ వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. కట్నం కోసం అతను తనను వేధించినట్టు ఆఫ్రిన్ పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను నవాజుద్దీన్ సిద్ధిఖీ తోసిపుచ్చారు. తనను సాఫ్ట్ టార్గెట్‌గా భావించి ఉద్దేశపూరితంగానే ఆమె ఈ ఆరోపణలు చేసిందని, తాను నటుడిని కావడంతో ఈ ఆరోపణలు చేయడం ద్వారా టీవీల్లో, పత్రికల్లో వెలుగులోకి రావొచ్చునని ఆమె భావించిందని చెప్పారు. కట్నం కోసం తన మరదల్ని ఎప్పుడూ వేధించలేదని తెలిపారు. నిజానికి ఆఫ్రిన్ మామే తన తమ్ముడు మినాజుద్దీన్ డబ్బు కోసం నిత్యం వేధించేవాడని చెప్పారు. సెప్టెంబర్ 28న తాను తీవ్ర జ్వరంతో ఉన్నానని, ఆఫ్రిన్ అత్త, మామ డబ్బు దొంగలించాలనే ఉద్దేశంతో ఆ రోజు తమ ఇంటికి వచ్చి గలాటా సృష్టించారని, అయినా తాను కొట్టడంగానీ, కనీసం ఆమెను తాకడం కానీ చేయలేదని, ఇందుకు సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలు కూడా ఉన్నాయని వివరించారు. -
'నాతో సినిమా చేస్తే రజనీకాంత్ ఛాన్స్ ఇస్తాడు'
విలక్షణ పాత్రలతో బాలీవుడ్ సినీ అభిమానులను ఆకట్టుకుంటున్న నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా హీరోగా కూడా అలరిస్తున్న ఈ గ్రేట్ యాక్టర్, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఆస్తకికర వ్యాఖ్యలు చేశాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ లీడ్ రోల్లో నటించిన ఫ్రీకీ అలీ ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగం నవాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తనతో పాటు హీరోయిన్గా నటించిన భామలకు నెక్ట్స్ సినిమానే రజనీకాంత్ ఛాన్స్ ఇస్తున్నాడన్నాడు నవాజ్. అందుకు ఉదాహరణలు కూడా చెప్పాడు. తన సరసన మాంజీ సినిమాలో హీరోయిన్గా నటించిన రాధికా ఆప్టే వెంటనే రజనీ కాంత్ కబాలీలో నటించింది. ప్రస్తుతం తన ఫ్రీకీ అలీలో హీరోయిన్గా నటించిన అమీజాక్సన్ రజనీ నెక్ట్స్ సినిమా రోబో సీక్వల్లో హీరోయిన్గా నటిస్తోంది అంటూ అదంరికీ షాక్ ఇచ్చాడు. తన సినిమా ప్రమోషన్ కోసం సరదాగా నవాజుద్దీన్ చేసిన ఈ కామెంట్స్‌కు హాట్ బ్యూటి అమీ జాక్సన్ కూడా వంత పాడింది. -
చార్మినార్ వద్ద చెడ్డీలు అమ్మిన నటుడు!
సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయ్ జాన్' సినిమా చూసినవారందరికీ నవాజుద్ధీన్ సిద్ధిఖీ సుపరిచితుడే. ఆ సినిమాలో అతడు చేసిన 'రిపోర్టర్' పాత్ర అంత తేలికగా మరచిపోయేది కాదు. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, తలాష్, కిక్ లాంటి సినిమాల్లో కూడా తనదైన నటనతో మెప్పించాడు సిద్ధిఖీ. అయితే తాజాగా అతడు చార్మినార్ సెంటర్లో చెడ్డీలు అమ్ముతూ కెమెరా కంటపడ్డాడు. కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు.. తన సినిమా ప్రమోషన్ కోసం పడిన ప్రయాసే అది. బాలీవుడ్ తీరే వేరు. సినిమాను ప్రమోట్ చేయడానికి విభిన్న మార్గాలను ఎంచుకుంటారు నటీనటులు. అవసరమైతే ఉన్నట్టుండి జనాల మధ్యలో ప్రత్యక్షమవుతారు కూడా. అచ్చంగా అలానే చేశాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫ్రీకీ అలీ' సినిమాలో సిద్ధిఖీ హీరోగా నటించిన విషయం తెలిసిందే. సినిమాలో తన పాత్ర మాదిరిగా రోడ్డెక్కి చెడ్డీలు అమ్మాడు. చెడ్డీల వ్యాపారం సాగినంతసేపు ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. ఇక 'ఫ్రీకీ అలీ' కథ విషయానికొస్తే.. రోడ్డు పక్కన పేవ్మెంట్ మీద చెడ్డీలు అమ్ముకుంటూ ఉంటాడు అలీ అనే కుర్రాడు. పార్ట్ టైం జాబ్‌గా ఓ రౌడీ దగ్గర పని చేస్తూ అతడితో కలిసి మామూళ్ల వసూళ్లకు వెళ్తుంటాడు. అలానే ఓ వ్యక్తి వద్ద వసూళ్ల కోసం గోల్ఫ్ కోర్టుకి వెళతాడు. అక్కడ జరిగిన ఓ చిన్న సంఘటన అతనిలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. అతనికో ఆశయాన్ని తెచ్చిపెడుతుంది. పేవ్మెంట్ చెడ్డీల వ్యాపారి.. ఆ తర్వాత పెద్ద గోల్ఫ్ క్రీడాకారుడు ఎలా అయ్యాడనేదే కథ. సెప్టెంబరు 9 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్ కోసం గురువారం హైదరాబాద్‌కు విచ్చేసింది చిత్ర యూనిట్. గోల్ఫ్ క్రీడాకారుడు కావడానికి అలీ పడిన పాట్లు హాస్యంతో కూడుకున్నవై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చెబుతుంది మూవీ టీం. అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. సల్మాన్ మరో సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. -
సైలెంట్‌గా సినిమా పూర్తి చేశారు!
ఎప్పుడు ప్రారంభమైందో... ఎక్కడ షూటింగ్ చేశారో... ఉలుకూ లేదు, ఓ పలుకూ లేదు. చడీచప్పుడు లేకుండా చిత్రీకరణ పూర్తి చేశారు. అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్రధారిగా ఆమె భర్త బోనీ కపూర్ ఓ చిత్రం నిర్మించారు. ప్రముఖ హిందీ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ ప్రత్యేక అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘మామ్’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు బాలీవుడ్ టాక్. వాస్తవానికి శ్రీదేవి ‘మామ్’ పేరుతో ఓ సినిమా చేయనున్నారనే వార్త వచ్చింది కానీ, ఎప్పుడు ప్రారంభమైందనే విషయం బయటకు రాలేదు. ఈలోపు చిత్రీకరణ పూర్తయిందనే వార్త వచ్చింది. పబ్లిసిటీకి దూరంగా ఈ సినిమా చేయాలని శ్రీదేవి భావించారట. సతీమణి కోరుకుంటే భర్త కాదంటారా? అందుకే ఈ చిత్రం గురించిన వార్తలు బయటకు రానివ్వకుండా షూటింగ్ పూర్తి చేసేశారు బోనీ కపూర్. విడుదలకు దగ్గరయ్యే సమయానికి పబ్లిసిటీ మొదలుపెడతారట. కమ్‌బ్యాక్ మూవీ ‘ఇంగ్లీష్ వింగ్లీష్’లో తల్లిగా, భార్యగా.. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే మహిళగా అద్వితీయ నటన కనబరిచిన శ్రీదేవి, ‘మామ్’లో మరోసారి తల్లిగా కనిపించనున్నారట. ఇది కూడా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ.. స్టోరీ, జోనర్ డిఫరెంట్‌గా ఉంటాయట. ఈ చిత్రంతో రవి ఉద్యావర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. -
మైనస్ ఏడు డిగ్రీల చలిలో షూటింగ్
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన దక్షిణాది భామ శ్రీదేవి, రీ ఎంట్రీ లో కూడా అదే జోరు చూపిస్తోంది. హీరోయిన్ గా చేసిన సమయంలో ఏ స్థాయిలో కష్టపడిందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో కష్టపడుతోంది. పెళ్లి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అతిలోక సుందరి ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ అయినా శ్రీదేవి రీ ఎంట్రీ పై ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత దక్షిణాదిలో చేసిన పులి డిజాస్టర్ కావటంతో ఆలొచనలో పడ్డ శ్రీదేవి, ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమా మామ్ లో కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం అమెరికాలోని జార్జీయాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితుల్లో షూటింగ్ చేస్తోంది. అంత చలిలో ఒక్కోసారి షూటింగ్ ఆలస్యం అయి రాత్రి 8.30 అయినా ఎలాంటి విసుగు లేకుండా శ్రీదేవి షూటింగ్ కు సహకరించటం అందరికీ ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి ఉద్యావర్ దర్శకుడు. ప్రముఖ పాకిస్థాని నటుడు అద్నాన్ సిద్దికీ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కన్నా, అభిమన్యూ సింగ్, నవాజుద్దీన్ సిద్ధిఖీలు అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. -
8 ఏళ్ల నాటి మిస్టరీని తాత ఛేదిస్తాడా?
థ్రిల్లింగ్‌గా సాగిన 'తీన్' టీజర్ ఎనిమిదేళ్ల కిందట ఒకానొక రోజు తన మనవరాలు ఏంజెలా అదృశ్యమైంది. వృద్ధాప్యం మీద పడినా.. అంతుచిక్కని ఈ మిస్టరీని ఛేదించడానికి తాతా జాన్ బిశ్వాస్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. పోలీసు అధికారిణి, చర్చి ఫాదర్ ఆయనకు సహకరిస్తున్నారు. ఆ తాత ఈ మిస్టరీని ఛేదించాడా? ఈ మిస్టరీ తరహాలోనే తాజాగా వచ్చిపడిన సమస్య ఏమిటి? దీనిని ఈ ముగ్గురు ఎలా ఛేదించారు?.. స్థూలంగా ఇది 'తీన్' సినిమా ట్రైలర్.. అత్యంత గ్రిప్పింగ్‌గా, థ్రిల్లర్ మూవీ తరహాలో 'తీన్' సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రిబూ దాస్‌గుప్తా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రానికి నిర్మాత సుజయ్ ఘోష్. 'తీన్' సినిమాలో తాత పాత్రలో బిగ్ బీ, పోలీసు అధికారిణిగా విద్యా బాలన్, చర్చి ఫాదర్‌గా నవాజుద్దీన్ నటిస్తున్నారు. 2.23 నిమిషాల నిడివి ఉన్న 'తీన్' టీజర్.. క్రైమ్ థ్రిల్లర్ తరహాలో ఈ సినిమా ఉంటుందని చాటుతోంది. గతంలో విద్యాబాలన్, సుజయ్ ఘోష్ కలయికలో రూపొందిన 'కహానీ' ఛాయలు కూడా కనిపిస్తున్నాయి. గ్రిప్పింగ్ టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన 'తీన్' సినిమా జూన్ 10న విడుదల కానుంది. -
రామన్ రాఘవ్ ఏం చేశాడు?
ముంబై: విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, విక్కీ కౌశల్ ప్రధానపాత్రల్లో నటించిన 'రామన్ రాఘవ్ 2.0' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోమవారం విడుదలైంది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన ట్విటర్ పేజీలో ఈ పోస్టర్ ను పెట్టారు. చేతివేళ్లను గుండ్రంగా మడిచి ఎర్రటి కళ్లతో చూస్తున్న నవాజుద్దీన్ వెనుక రక్తంతో తడిసిన ఇనుప రాడ్లు ఉన్నట్టుగా ఫొటోలో చూపించారు. మొత్తం పోస్టర్ నీలం రంగులో ఉంది. క్రైమ్ థిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ నోటోరియస్ సీరియల్ కిల్లర్ గా నటిస్తున్నాడు. మసాన్ ఫేమ్ విక్కీ కౌశల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. 1960 దశకంలో ముంబైని గడగడలాడించిన సీరియల్ కిల్లర్ రామన్ రాఘవ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. 1960లో 23 మందిని, 1968లో డజను మందిని హత్య చేసినట్టు పోలీసులకు పట్టుబడినప్పుడు అతడు అంగీకరించాడు. అయితే అతడు చేసిన హత్యలు ఇంకా ఎక్కువే ఉంటాయని పోలీసులు అనుమానించారు. ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజర్ పోస్టర్లను అనురాగ్ కశ్యప్ ఆదివారం విడుదల చేశారు. 69వ కేన్స్ అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్ లో 'డాక్టర్స్ ఫోర్ట్ నైట్' విభాగంలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. తెరపై రామన్ రాఘవ్ ఏం చేశాడో చూడాలంటే చిత్రం జూన్ 24 వరకు ఆగాల్సిందే. -
'ఆమె దేశంలోనే గొప్ప నటి'
విలక్షణ పాత్రలతో బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ. పాజిటివ్, నెగెటివ్ అన్న తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో అలరిస్తున్న నవాజ్, ఇప్పుడో స్టార్ హీరోయిన్ తో కలిసి నటించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన నవాజ్, ఆమె దేశంలోనే గొప్పనటి అంటూ కీర్తించాడు. 80, 90 దశకాలలో వెండితెరను శాసించిన స్టార్ హీరోయిన్ శ్రీదేవి, తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని, నాలుగేళ్ల క్రితం ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ సీనియర్ హీరోయిన్ మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతుంది. 'మామ్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు నవాజుద్ధీన్ సిద్దిఖీ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా నవాజ్, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'పది రోజుల క్రితం నేనో సినిమా అంగీకరించాను. థ్రిల్లింగ్ స్క్రిప్ట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తుంది. నేను అతిథి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎక్కవ శాతం శ్రీదేవిగారితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాను. నా దృష్టిలో దేశంలోనే ఆమె గొప్ప నటి' అంటూ కామెంట్ చేశాడు నవాజ్. -
'ఆమెను ఎప్పుడూ చూడలేదు'
ముంబై: మహిళపై దాడి చేశారని తనపై వచ్చిన ఆరోపణలను బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తోసిపుచ్చాడు. తనపై ఫిర్యాదు చేసిన హీనా షేక్ అనే మహిళ గురించి తనకు తెలియదని, ఆమెనెప్పుడూ హౌసింగ్ సొసైటీలో చూడలేదని తెలిపాడు. ఫిర్యాదుపై జోహ్రా అగధి నగర్ హౌసింగ్ సొసైటీ సభ్యులెవరూ సంతకాలు చేయలేదని వెల్లడించాడు. తాను ఈజీ టార్గెట్ గా మారినట్టు భావిస్తున్నానని, వాస్తవాలు వెల్లడించేందుకే మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. మహిళను దూషించి, చేయి చేసుకున్నానని తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కుట్రపూరితంగా ఇదంతా చేశారని ఆరోపించారు. జోహ్రా అగధి నగర్ హౌసింగ్ సొసైటీలో పార్కింగ్ వద్ద వివాదం తలెత్తడంతో సిద్దిఖీ తమపై దౌర్జన్యం చేశాడని వెర్సోవా పోలీసుస్టేషన్ లో హీనా షేక్ ఈనెల 17న ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా నవాజుద్దీన్ భార్య ఆలియా రెండు రోజుల తర్వాత అదే పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. తనపై ఐదుగురు వ్యక్తులు దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. -
పార్కింగ్ స్థలం కోసం మహిళపై నటుడి దాడి
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్కింగ్ స్థలం విషయమై ఆయన తనపై భౌతికంగా దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించినట్టు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబైలోని యారి రోడ్డులో ఉన్న జోహ్రా అఘాది నగర్ హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. నవాజుద్దీన్‌తోపాటు ఫిర్యాదుదారు కూడా ఇదే సొసైటీలో నివాసం ఉంటున్నారు. ఏడాది కిందట ఈ హౌసింగ్ సొసైటీలోకి మకాం మార్చిన నవాజుద్దీన్ సిద్దిఖీ పార్కింగ్ స్థలాన్ని పూర్తిగా ఆక్రమించారని, ఈ విషయమై ఆదివారం మధ్యాహ్నం వాగ్వాదం జరుగడంతో అతను, అతని సోదరుడు, సిబ్బంది తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించి, తోసేశారని సొసైటీ చైర్మన్ సోనా దండేకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 354 (మహిళపై దాడి, నేరపూరిత బలప్రయోగం) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ సినిమా బిగ్ హిట్ కావాలి
ముంబైః భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన బాలీవుడ్ మూవీ 'మాంఝీ -ద మౌంటెన్ మ్యాన్'పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై అభినందనల వర్షం కురిపించారు. ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలని కోరుకున్నారు. ముఖ్యంగా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటన బాగుందని ప్రశంసించారు. సినిమా టీం మొత్తానికి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్లో కామెంట్ పోస్ట్ చేశారు. బీహార్ జిల్లా గయలో జరిగిన నిజజీవిత గాధకు దృశ్యరూపం ఈ సినిమా. రోడ్డు లేకపోవడంతో కనీస వైద్య సదుపాయాలు అందక అల్లాడుతున్న ప్రజల కోసం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చేసిన సాహసానికి ప్రతిరూపం ఈ సినిమా. కేతన్ మెహతా దర్శకత్వ ప్రతిభకు, నవాజుద్దీన్ నటనకు విమర్శకులు నీరాజనాలు పడుతున్నారు. గాంగ్స్ ఆఫ్ వాసీపూర్ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులకు దడ పుట్టించిన నవాజుద్దీన్, సల్మాన్ బిగ్గెస్ట్ హిట్ కిక్, భజరంగీ భాయిజాన్ సినిమాల్లో కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. -
అతనితో కెమిస్ట్రీ గురించి భయపడ్డా!
నవాజుద్దీన్ సిద్దిఖీ...వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్. ఏ పాత్రనైనా మంచి నీళ్లు తాగినంత ఈజీగా చేస్తారని విమర్శకులు, ప్రేక్షకుల అభిప్రాయం. అలాంటి నవాజ్ ఇటీవల ఓ చిత్రం షూటింగ్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డారట. నవాజుద్దీన్, రాధికా ఆప్టే కలిసి నటిస్తున్న చిత్రం ‘మాంఝీ’. తన భార్యలాగే ఇంకెవరూ చనిపోకూడదన్న కారణంతో కేవలం ఓ సుత్తితో 22 ఏళ్ల పాటు కొండను తవ్వి రోడ్డును నిర్మించిన దశరథ్ మాంఝీ అనే వ్యక్తి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రొమాన్స్‌కు చాలా ప్రాధాన్యం ఉందట. దర్శకుడు కేతన్ మెహతా ఈ రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించే సమయానికి నవాజ్ చాలా సెలైంట్ అయిపోయేవారట. ఈ విషయమై రాధికా ఆప్టే మాట్లాడుతూ -‘‘రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో మాకు దూరంగా ఒంటరిగా కూర్చునేవారు. నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పటివరకూ బాగానే ఉన్నారు. సడన్‌గా ఏమైందా...? అని. నాకేమో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుందా లేదా అని భయం. కానీ యాక్షన్ చెప్పగానే సీన్లో లీనమైపోయేవారు’’ అని చెప్పారు. -
నాకు ఈ సినిమాతో మరింత 'కిక్'!
ముంబై: ఈ మధ్యనే బాలీవుడ్ లో విడుదలై రికార్డులు సృష్టిస్తున్న కిక్ చిత్రంలో విలన్ గా నటించిన నవాజుద్దీన్ సిద్ధిఖి తన సినీ భవిష్యత్తుపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో తనకు మరిన్ని అవకాశాలు కల్పిస్తోందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించినా ఈ చిత్ర విజయం మాత్రం కచ్చితంగా తన రాబోయే చిత్రాలపై ప్రభావం చూపుతుందన్నాడు.'నేను నటుడిగా చాలా చిత్రాలు చేశాను. ఇది నిజంగా ఒక సవాల్ గా భావించి చేశాను.అది నాకు కచ్చితంగా లాభిస్తుంది'అని తెలిపాడు. కహానీ, మిస్ లవ్లీ చిత్రాల్లో నటించిన సిద్ధిఖి చేతిలో ప్రస్తుతం ఏడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టిస్తూ కిక్కెక్కిస్తోంది. షారుక్ ఖాన్ నటించిన 'జబ్ తక్ హై జాన్', సల్లూభాయ్ నటించి 'దబాంగ్2' చిత్రం వసూళ్లను 'కిక్' అధిగమించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డును తిరగరాస్తోంది. -
'మిస్ లవ్లీకి సెన్సార్ బోర్డు 157 కట్స్'
అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్న 'మిస్ లవ్లీ' చిత్రానికి సెన్సార్ బోర్డు 157 కట్స్ ను సూచించిందని ఆ చిత్ర దర్శకుడు ఆశీమ్ అహ్లూవాలియా తెలిపారు. భారత దేశంలో మిస్ లవ్లీ చిత్రాన్ని ప్రదర్శించాలంటే 157 సీన్లను తొలగించాల్సిందేనని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు ఈ చిత్రం ఏ సర్టిఫికెట్ తో విడుదలకు సిద్ధమవుతోంది. నవాజుద్దీన్ సిద్దిఖీ, నిహారికా సింగ్ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం 2012 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అన్ సర్టెన్ రిగార్డ్ సెక్షన్ లో గట్టిపోటి ఇచ్చింది. భారతీయ సెన్సార్ బోర్డును ఒప్పించడానికి, ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏడాది కాలం పట్టింది అని అహ్లువాలియా తెలిపారు. సెన్సార్ బోర్డు నాలుగుసార్లు సమీక్షించిన తర్వాత వచ్చే సంవత్సరం జనవరి 17 తేదిన విడుదల చేసేందుకు సిద్దమయ్యాం అని అన్నారు. '157 కట్స్ అంటే సినిమాను చంపేయడమే, ఇక చిత్రాన్ని విడుదల చేయాల్సిన అవసరం లేదు' అని సోమవారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. సెన్సార్ బోర్బును ఒప్పించడం చాలా కష్టమైంది అని అన్నారు. అయితే మా చిత్రం పక్కా సీ గ్రేడ్ చిత్రం..కుటుంబ పరమైన భాష మాట్లాడటానికి అవకాశమే లేదు అని అన్నారు. అయినా కొన్ని సీన్లను తొలిగించాడనికి ఒప్పుకోవడంతో ప్రేక్షకుల ముందుకు 'మిస్ లవ్లీ' వస్తోంది అని అన్నారు. ఈ చిత్ర విజయానికి ఎలాంటి ట్రిక్స్ ప్రదర్శించడం లేదు అని.. కేవలం ప్రస్తుత ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నాం అని అహ్లూవాలియా తెలిపారు.