
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ తన మాజీ భార్య ఆలియాపై పరువు నష్టం దావా వేశారు. ఇటీవలి కాలంలో నవాజుద్దీన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరికి విడాకులు, ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.
ఆలియా అయితే సోషల్ మీడియా వేదికగా నవాజుద్దీన్‌పై పలుమార్లు ఆరోపణలు చేసింది. అయితే అసత్యాలు ప్రచారం చేస్తూ,తన పరువుకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ నవాజుద్దీన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మాజీ భార్య ఆలియాతో పాటు సోదరుడు షంసుద్దీన్‌పై కూడా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలాగే తన పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టకుండా నిలువరించాలని పిటిషన్‌లో కోరారు.
2008 నుంచి తన దగ్గర మేనేజర్‌గా పనిచేస్తున్న తన సోదరుడు షంసుద్దీన్ ఆ సమయంలో క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్‌వర్డ్‌లు తీసుకొని తనను ఆర్థికంగా మోసం చేసి అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశాడని పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు ఆలియాను సైతం ఉసిగొల్పాడని నవాజ్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment