Defamation suit
-
‘ఈనాడు, ఆంధ్రజ్యోతి’పై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రచురించిన తప్పుడు, దురుద్దేశపూర్వక కథనాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. తప్పుడు కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్, దాని ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్, దాని ఎడిటర్ ఎన్.రాహుల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. తనపై ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, పోస్టులను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ అనుబంధ పిటిషన్లో కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అంతేకాక ఇకపై అలాంటి తప్పుడు కథనాలు ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఆ మేరకు ఈనాడు, ఆంధ్రజ్యోతికి నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇస్తూ జారీ చేసిన ఈ ఉత్తర్వుల తరువాత మీరు ఏ కథనాలు ప్రచురించినా, ప్రసారం చేసినా వాటిని కోర్టు ఉత్తర్వుల గురించి తెలిసీ ప్రచురించినట్లుగానే భావిస్తామని ఈనాడు, ఆంధ్రజ్యోతికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమోణియమ్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు.రూ.100 కోట్లకు పరువు నష్టం దావాసౌర విద్యుత్ ఒప్పందం కొనుగోళ్లలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు, అసత్య కథనాలపై వైఎస్ జగన్ ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు. తనపై ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, పోస్టులను తొలగించేలా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశించాలని దావాలో కోరారు. తనకు కలిగిన పరువు నష్టానికి రూ.వంద కోట్లు చెల్లించేలా ఆదేశించాలని కోరారు. ఇకపై తన విషయంలో ఎలాంటి తప్పుడు, అసత్య, దురుద్దేశపూర్వక కథనాలు ప్రచురించకుండా, ప్రకటనలు ఇవ్వకుండా, నిందారోపణలు చేయకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశిస్తూ శాశ్వత నిషేధ ఉత్తర్వులు జారీ చేయాలని దావాలో కోర్టును అభ్యర్థించారు. తనపై తప్పుడు కథనాలను ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ, దానిని ప్రముఖంగా ప్రచురించేలా, ప్రసారం చేసేలా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశించాలని దావాలో హైకోర్టును అభ్యర్థించారు. తనపై ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలు, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, ట్వీట్లు, ఇతర లింకులను గూగుల్ దృష్టికి తెచ్చిన వెంటనే వాటిని తొలగించేలా ఆ సంస్థకు సైతం ఆదేశాలు జారీ చేయాలని కోరారు.జగన్ ప్రస్తావన ఎక్కడా లేదుఈ పరువు నష్టం దావాపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, న్యాయవాదులు అమిత్ అగర్వాల్, సాహిల్ రావిన్, రాహుల్ కుక్రేజా వాదనలు వినిపించారు. సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో జగన్మోహన్రెడ్డికి ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలు నిరాధారమైనవన్నారు. రాజకీయ కారణాలతో ఉద్దేశపూర్వకంగా ఈ తప్పుడు కథనాలను ప్రచురించారన్నారు. యూఎస్ కోర్టులో దాఖలు చేసిన నేరారోపణలను ఉటంకిస్తూ తప్పుడు కథనాలను ప్రచురించారని తెలిపారు. ఆ నేరారోపణల్లో ఎక్కడా జగన్మోహన్రెడ్డి ప్రస్తావన గానీ, ఆయనకు ముడుపులు ఇచ్చినట్లుగానీ, ఆయన తీసుకున్నట్లుగా గానీ లేనే లేదని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వ్యవహారంలో యూఎస్ కోర్టు నుంచి జగన్ ఎలాంటి నోటీసు అందుకోలేదని తెలిపారు. అయినా కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ కథనాల్లో జగన్మోహన్రెడ్డి ప్రస్తావన తెస్తూ తప్పుడు కథనాలు ప్రచురించాయని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమోణియమ్ ప్రసాద్... తప్పుడు కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతికి సమన్లు జారీ చేశారు.దావాలో వైఎస్ జగన్ ఏమన్నారంటే..కేంద్ర ప్రభుత్వ చొరవతోనే సెకీతో ఒప్పందం..ఈ మొత్తం వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించినది. వాస్తవానికి ఈ ఒప్పందం కేంద్ర ప్రభుత్వం చొరవతో జరిగింది. ఇందులో మూడో పార్టీ ప్రమేయం లేదు. సెకీ స్వయంగా 15.9.2021న ఈ ఒప్పందం ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఇందులో సెకీ క్రియాశీలకంగా వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీగా లబ్ధి పొందేందుకు సెకీ అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. సెకీ ఆఫర్ వల్ల రాష్ట్రానికి కలిగే లాభాలు ఏమిటంటే... రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పటి వరకు కొన్న సౌర విద్యుత్ ధరల కంటే సెకీ అందించే విద్యుత్ ధరే అతి తక్కువగా ఉంది. అంతేకాకుండా ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీ (ఐఎస్‌టీసీ)లను కూడా ప్రత్యేక ప్రోత్సాహం కింద 25 ఏళ్ల పాటు మినహాయించింది. దీనివల్ల ఏటా రూ.4,420 కోట్ల చొప్పున 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకుపైనే ఆదా అవుతుంది.ఆ తప్పుడు కథనాల వెనుక టీడీపీ రాజకీయ ప్రయోజనాలు..నేను ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకున్నా. వాస్తవాలను వక్రీకరిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి నవంబర్ 21 నుంచి తప్పుడు కథనాలు వెలువరించడం మొదలుపెట్టాయి. అమెరికా కోర్టులోని ప్రొసీడింగ్స్‌లో.. నాకు ముడుపులు ఇచ్చినట్లు, నేను తీసుకున్నట్లు పేర్కొన్నారని, సెకీ అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీలను మినహాయించలేదని, సెకీతో ఒప్పందాన్ని హడావుడిగా 7 గంటల్లోనే పూర్తి చేశామంటూ తప్పుడు కథనాలను వండి వార్చారు. వాస్తవానికి సెకీతో ఒప్పందంలో ఎలాంటి నేరం జరగలేదు. అమెరికా కోర్టుల్లో దాఖలు చేసిన నేరారోపణలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఆ కోర్టుల్లో జరుగుతున్న ప్రొసీడింగ్స్‌లో ఎక్కడా కూడా నాకు లంచాలు ఇచ్చినట్లుగానీ, నేను తీసుకున్నట్లు గానీ లేదు. అలాగే అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీలను సెకీ మినహాయించలేదన్న వాటి కథనాలు అసత్యం. నాపై మోపిన నిందారోపణలు, సాగిస్తున్న దుష్ప్రయోజనాల వెనుక తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. ఆ తప్పుడు కథనాలపై సామాజిక మాధ్యమాల వేదికగా వైఎస్సార్సీపీ ఖండన కూడా ఇచ్చింది.రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం..అది రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం. అందులో ఏపీ ప్రభుత్వం, డిస్కంలు, సెకీ మినహా మరెవరూ లేరు. రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత లబ్ధి చేకూర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అందించిన అవకాశాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా విస్మరిస్తుందా? వదులుకుంటుందా? ఒకవేళ ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అలాంటి అవకాశాన్ని వదులుకుంటే అది కచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమే అవుతుంది. అంతేకాక అలా వదులుకుంటూ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రావా? దురుద్దేశాలు ఆపాదించరా? సెకీతో ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదనను అధికారుల కమిటీ క్షుణ్నంగా అధ్యయనం చేసిన అనంతరం సమర్పించిన నివేదిక ప్రకారం మంత్రిమండలి 28.10.2021న ఆమోదించింది. 11.11.2021న ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సైతం తన ఆమోదాన్ని తెలిపింది. ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ప్రోత్సాహకం కింద అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీలను మినహాయించాలని కేంద్ర విద్యుత్ శాఖ 30.11.2021న కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలికి ఆదేశాలిచ్చింది. ఆ తరువాతే 1.12.2021న సెకీతో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో సెకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రమే ఉన్నాయి. ఈ మూడూ మినహా ఈ ఒప్పందంలో మరెవరూ లేరు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్లే ఈ ఒప్పందం కుదిరింది.టీడీపీ హయాంలో యూనిట్ గరిష్టంగా రూ.6.99నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సౌర విద్యుత్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నా. ఈ విషయం ఈనాడు, ఆంధ్రజ్యోతిలతో పాటు అందరికీ తెలుసు. 2014–19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో సౌర విద్యుత్ యూనిట్ ధర రూ.6.99 వరకు ఉంది. టీడీపీ హయాంలో డిస్కంలు చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల వల్ల పవన విద్యుత్ యూనిట్ ధర రూ.4.70 నుంచి రూ.4.84 వరకు ఉండేది. నేను సీఎం అయిన తరువాత ఈ ధరలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకున్నా. అందులో భాగంగానే రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సౌర విద్యుత్ కొనుగోలు విషయంలో సెకీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం వల్ల యూనిట్ రూ.2.49కే అందే అవకాశం కలిగింది.యూనిట్ రూ.2.49కే అందించేందుకు సెకీ ముందుకొచ్చింది...రాష్ట్రంలో రైతాంగానికి నిరాటంకంగా 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్తు అందించేందుకు వీలుగా సౌర విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. అయితే దానిపై న్యాయ వివాదం నెలకొంది. దీనిపై మేం న్యాయ పోరాటాలు చేశాం. మేం న్యాయ పోరాటంలో ఉండగానే 2021 సెప్టెంబర్ 15న సెకీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర చరిత్రలో తక్కువ ధరకే సౌర విద్యుత్‌ను యూనిట్ రూ.2.49కే అందించేందుకు సెకీ ముందుకొచ్చింది. ఇçప్పటి వరకు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కెల్లా ఇదే అతి తక్కువ ధర. దీనివల్ల వచ్చే 25 ఏళ్ల పాటు నిరాటంకంగా సౌర విద్యుత్ అందుతుంది. రాష్ట్రంలో రైతులకు మేలు చేస్తూ దూరదృష్టితో ప్రభుత్వం చేపట్టిన చర్యలను అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం సైతం లేఖ రాసింది.వారు రాసినవేవీ యూఎస్ కోర్టు నేరారోపణల్లో లేవు...యూఎస్ కోర్టులో జరిగిన లీగల్ ప్రొసీడింగ్స్‌ను ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరించి నాపై తప్పుడు, అవాస్తవ కథనాలను ప్రచురించాయి. నాపై తప్పుడు నిందారోపణలు మోపారు. వారు రాసిన తప్పుడు కథనాల్లోని అంశాలేవీ యూఎస్ కోర్టులో దాఖలైన నేరారోపణల్లో లేవు.నా కుటుంబం పట్ల వారి శతృత్వ భావాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయిఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు, అసత్య కథనాలు నా పట్ల, నా కుటుంబం పట్ల వారికున్న శతృత్వ భావాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. గత 20 ఏళ్లుగా వారు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రయోజనాలను కాపాడుతూ వస్తున్నారు. ఇదే సమయంలో నా పట్ల ఎలాంటి దాపరికం లేని తీవ్ర వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన వాస్తవాలు ప్రజా బాహుళ్యంలో ఉన్నప్పటికీ వారు అసత్యాలు, నిరాధార ఆరోపణలతో తప్పుడు కథనాలు ప్రచురించారు. వీటి వెనుక విస్తృత రాజకీయ అజెండా ఉండేందుకు ఆస్కారం ఉంది. వారికి ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా ఇచ్చా. బేషరతుగా క్షమాపణలు చెబుతూ, మొదటి పేజీలో దానిని ప్రముఖంగా ప్రచురించాలని సూచించినా వారు తప్పుడు కథనాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇతరుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరికీ హక్కు లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ టుడే నెట్వర్క్ తప్పుడు కథనాలను ప్రచురించడం, ప్రసారం చేయడం ద్వారా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులకు విఘాతం కలిగించాయి. ఆ కథనాలు నా జీవితానికి, హుందాతనానికి భంగం కలిగించాయి.సమగ్ర అధ్యయనం తర్వాతే ఒప్పందంరూ.2.49కే యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామని 2021 సెప్టెంబర్ 15న సెకీ నుంచి లెటర్ వచ్చింది. ముందే నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 16న కేబినెట్ మీటింగ్ ఉన్నందున సెకీ ప్రతిపాదనను టేబుల్ అజెండాగా చేర్చి మంత్రివర్గ సహచరులతో చర్చించారు. అయితే ఆ కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయాలేమీ తీసుకోలేదు. ఆమోదాలు తెలపలేదు. కేవలం సెకీ నుంచి వచ్చిన లెటర్లో పేర్కొన్న అంశాలపై లోతుపాతులను అధ్యయనం చేసి వచ్చే కేబినెట్ సమావేశం నాటికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారుల కమిటీ ఏకంగాæ 40 రోజుల పాటు అధ్యయనం చేసిన అనంతరం 2021 అక్టోబర్ 25వ తేదీన నివేదిక సమర్పించింది. అక్టోబర్ 28న కేబినెట్ దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏపీఈఆర్సీ నుంచి కూడా ఆమోదం తీసుకోవాలని సూచిస్తూ తీర్మానం చేసింది. నవంబర్ 11న ఏపీఈఆర్సీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో డిసెంబర్ 1వ తేదీన సెకీతో ఒప్పందంపై ఏపీ ప్రభుత్వం, డిస్కమ్‌లు సంతకాలు చేశాయి. ఎక్కడా థర్డ్ పార్టీ ఎవరూ లేరు. ఇది కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన పవర్ సేల్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ 3.2 క్లాజ్‌లో 25 ఏళ్లపాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీలు నుంచి మినహాయింపు వర్తిస్తుందని స్పష్టంగా ఉంది. -
కేటీఆర్‌పై పరువునష్టం కేసు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పరువునష్టం కేసు దాఖలైంది. తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వ్యాపారవేత్త సూదిని సృజన్‌రెడ్డి శనివారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వచ్చే వారం జడ్జి ముందుకు వచ్చే అవకాశం ఉంది.షోధా కన్స్ట్రక్షన్ కంపెనీతో తనకు లింక్ చేస్తూ కేటీఆర్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంతర్‌రెడ్డి తన సొంత బావ అని, అందుకే షోధా కంపెనీకి రూ.2 కోట్ల లాభాన్ని ఇచ్చారని, అర్హతలేని కాంట్రాక్టులను పొందానని కేటీఆర్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆ కంపెనీలో తనకు ఎలాంటి షేర్లు లేవని, తాను ఆ సంస్థకు డైరెక్టర్‌ను కూడా కాదని చెప్పారు. ఈ సంస్థకు ఎండీగా కందాల దీప్తిరెడ్డి ఉన్నారని సృజన్‌రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ పేరుతో రూ.1,137.77 కోట్ల ప్రజా ధనాన్ని వృ«థా చేశారంటూ కేటీఆర్ తప్పుడు ప్రకటనలు చేశారన్నారు. -
టీడీపీ నేతలు, ఎల్లో మీడియాపై సజ్జల పరువునష్టం దావా
-
అసత్య కథనాలపై ఆగ్రహం.. ఎల్లోమీడియాపై సజ్జల పరువు నష్టం దావా
సాక్షి, అమరావతి : టీడీపీ నేతలు, ఎల్లోమీడియాపై వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పరువు నష్టం దావా వేశారు. ‘ముంబై నటికి వేధింపులు. సజ్జల సహాయం’ పేరుతో ఎల్లోమీడియా అసత్య కథనాలు ప్రచురించడమే కాకుండా, టీవీ ఛానల్స్‌లోనూ దుష్ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియా అసత్య కథనాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఈనాడుతో పాటు, ఆ కథనం ఆధారంగా టీడీపీ ఆఫీసులో మాట్లాడిన వర్ల రామయ్యపై సజ్జల పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే అందరికీ లీగల్ నోటీసులు పంపించారు. -
అసోం సీఎం భార్య పై ఆరోపణలు..పరువు నష్టం దావా
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌పై.. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ ఏకంగా రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగాయంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆమె గొగోయ్‌కు నోటీసులు పంపారు. కామ్రూప్ మెట్రోపాలిటన్‌లోని సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం కేసు దాఖలు చేశామని, ఇది సెప్టెంబర్ 26న విచారణకు రానుందని భుయాన్ తరఫు న్యాయవాది దేవజిత్ సైకియా చెబుతున్నారు. సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ ద్వారా పలు ట్వీట్ల ద్వారా గౌరవ్ గొగోయ్ తన క్లయింట్ రినికి భుయాన్ శర్మకు నష్టం కలిగించారని, అందుకే రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశామని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ తన క్లయింట్ రినికికి చెందిన కంపెనీ ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కాగా, ఓ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందడం కోసం అవకతవకలకు పాల్పడ్డారని గొగోయ్ ఆరోపించారు. అయితే.. తన భార్యపై వస్తున్న ఆరోపణలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పొందినట్లు ఆధారాలు చూపిస్తే ప్రజా జీవితం నుంచి విరమణ పొందుతానని సవాల్ విసిరారు. అంతేగాక ఎలాంటి శిక్షనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టారు. The reply itself clarifies the fact that the Government of India has not released any funds to the mentioned company. I want to emphasize once again that neither my wife nor the company she is associated with has received or claimed any amount from the Government of India. If… https://t.co/70zQ1DGHTe — Himanta Biswa Sarma (@himantabiswa) September 14, 2023 -
ఈనాడుపై పరువు నష్టం దావాకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనాడు పత్రికపై ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్‌పై తప్పుడు రాతలు రాసినందుకు పరువు నష్టం దావా వేయాలని ఆదేశించింది. అయితే, మే 12వ తేదీన పోలవరంపై ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు రాసుకొచ్చింది. ఈనాడు కథనాలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఈనాడు ఎండీ, జర్నలిస్టుల క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఆఫ్ డిఫమేషన్ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ఇక, పోలవరంపై ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ ఈనాడు తప్పుడు కథనాలు సృష్టించడం పట్ల ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది కూడా చదవండి: పోలవరంపై కేంద్ర జలశక్తి శాఖ హైలెవల్ మీటింగ్ -
నిర్భయంగా వచ్చి ఓటేయాలని ఓటర్లకు పిలుపు
-
వరంగల్ సీపీ రంగనాథ్ పై బండి సంజయ్ పరువునష్టం దావా
-
మాజీ భార్యపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన నటుడు
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ తన మాజీ భార్య ఆలియాపై పరువు నష్టం దావా వేశారు. ఇటీవలి కాలంలో నవాజుద్దీన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరికి విడాకులు, ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఆలియా అయితే సోషల్ మీడియా వేదికగా నవాజుద్దీన్‌పై పలుమార్లు ఆరోపణలు చేసింది. అయితే అసత్యాలు ప్రచారం చేస్తూ,తన పరువుకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ నవాజుద్దీన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మాజీ భార్య ఆలియాతో పాటు సోదరుడు షంసుద్దీన్పై కూడా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలాగే తన పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టకుండా నిలువరించాలని పిటిషన్లో కోరారు. 2008 నుంచి తన దగ్గర మేనేజర్‌గా పనిచేస్తున్న తన సోదరుడు షంసుద్దీన్ ఆ సమయంలో క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్వర్డ్లు తీసుకొని తనను ఆర్థికంగా మోసం చేసి అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశాడని పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు ఆలియాను సైతం ఉసిగొల్పాడని నవాజ్ తెలిపాడు. -
సంచలన తీర్పు.. బోరున ఏడ్చేసిన హీరోయిన్
ఆసక్తికరమైన వ్యవహారంలో తీర్పు వెలువడింది. హాలీవుడ్ మాజీ జంట జానీ డెప్-అంబర్ హర్డ్ పరువు నష్టం దావా వ్యవహారంలో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జానీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పాటు అంబర్ హర్డ్‌కు జరిమానా విధించింది కోర్టు. పైగా ఆమె ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేసింది కోర్టు. వర్జీనీయాలోని ఫెయిర్‌ఫ్యాక్స్ కౌంటీ కోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. నటుడు జానీ డెప్(58), అతని మాజీ భార్య అంబర్ హర్డ్(36) ఇద్దరూ పరువు నష్టం పొందేందుకు అర్హులేనంటూ పేర్కొంటూనే.. డెప్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఏడుగురు సభ్యులతో కూడిన జ్యూరీ ఇచ్చిన తీర్పుతో కోర్టు హాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అస్పష్టమైన వాదనలు, పోటాపోటీ ఆరోపణల(సంచలన)తో ఆరు వారాలపాటు సాగింది విచారణ. బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించిన జ్యూరీ.. నటి అంబర్ హర్డ్ తన మాజీ భర్తకు 15 మిలియన్ డాలర్ల(తర్వాత దానిని 13.5 మిలియన్ డాలర్లకు కుదించింది) పరిహారం చెల్లించాలని తెలిపింది. 2018లో ఆమె రాసిన సెక్సువల్ వయొలెన్స్ ఆర్టికల్ ఒకటి.. జానీ పరువుకు భంగం కలిగించేంది ఉందని, దాని ఆధారంగానే ఆమె ఆయనపై వేధింపులకు, పరువుకు భంగం కలిగించిందని అంచనాకి వచ్చామని కోర్టు పేర్కొంది. కోర్టు తీర్పు అనంతరం అంబర్ బోరున ఏడ్చేసింది. తన గుండె బద్ధలైందని, నిరాశ చెందానని, ఈ తీర్పు తనకే కాదని.. మహిళలందరికీ దెబ్బ అని ఆమె వ్యాఖ్యానించింది. కేవలం తన పరపతితోనే తన మాజీ భర్త నెగ్గాడంటూ ఆరోపణలు చేసింది ఆమె. ఇదిలా ఉంటే జానీ డెప్ పేరును ప్రస్తావించకుండానే.. వైవాహిక జీవితపు హింస గురించి.. 2018లో ఆమె ది వాషింగ్టన్ పోస్టులో ఒక కథనం రాసింది. దాని ఆధారంగా 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలంటూ 2019 ఫిబ్రవరిలో కోర్టుకు ఎక్కాడు పైరెట్స్ ఆఫ్ కరేబియన్ నటుడు. అంతేకాదు ఆమె తనకు నరకం చూపించేదని, అవమానించేదని, ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో(ఎలన్ మస్క్)తో ఎఫైర్ నడిపించిందని, అదే ఆమెను ప్రభావితం చేసిందని దావాలో ఆరోపించాడు. ప్రతిగా 2020 ఆగష్టులో తానూ గృహ హింసను ఎదుర్కొన్నానని, పైగా జానీ డెప్.. ఆయన లాయర్ నుంచి అసత్య ప్రచారాలు ఎదుర్కొంటున్నాంటూ 100 మిలియన్ డాలర్లకు కౌంటర్ దావా వేసింది ఆమె. ఈ దావాల్లో ఇరు పక్షాల వాదనలు వింటూ వచ్చిన కోర్టు.. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. బుధవారం(జూన్ 1) తీర్పు జానీ డెప్‌కు అనుకూలంగానే వచ్చినా.. అంబర్ హర్డ్ ప్రత్యారోపణలను సైతం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రతిగా 2 మిలియన్ డాలర్లను చెల్లించాలంటూ జానీ డెప్‌కు ఆదేశించింది వర్జీనీయా ఫెయిర్‌ఫాక్స్ కోర్టు. నా జీవితం నాకు దక్కింది కోర్టు తీర్పు పట్ల ‘జాక్ స్పారో’ జానీ భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు అనుకూలంగా రావడంతో.. జానీ డెప్ సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవితాన్ని తనకు తిరిగి ఇచ్చారంటూ జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడాయన. ఇదిలా ఉంటే.. 2015లో జానీ డెప్, అంబర్‌హర్డ్‌ల వివాహం జరిగింది. కానీ, ఏడాదికే వాళ్ల కాపురంలో మనస్పర్థలు మొదలు అయ్యాయి. 2017లో అధికారికంగా విడాకులు తీసుకుంది ఈ జంట. అయితే కొద్దిరోజులకే ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు.. అదీ జుగుప్సాకరంగా చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇది వాళ్ల వాళ్ల కెరీర్‌ను సైతం దెబ్బ తీయడం గమనార్హం. -
ఎలన్ మస్క్: అప్పుడు డేటింగ్‌తో చిచ్చు! ఇప్పుడేమో ఇలా..
ఎలన్ మస్క్‌కు ఉన్న ఫాలోయింగ్, అభిమాన గణం సంగతి ఏమోగానీ.. తాజాగా ఆయన చేసిన ఓ రీట్వీట్ ఎక్కువ విమర్శలకే దారి తీసింది. హాలీవుడ్ సెలబ్రిటీ ఎక్స్ కపుల్.. జానీ డెప్-అంబర్ హర్డ్ కోర్టుకెక్కిన వ్యవహారంపై తొలిసారి బహిరంగంగా స్పందించాడు ఎలన్ మస్క్. డెప్-హర్డ్ దావా వ్యవహారంలో శుక్రవారం కోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో జ్యూరీ తదుపరి చర్చలు మొదలు పెట్టింది. ఈ దరిమిలా.. ఎలన్ మస్క్ శనివారం ఉదయం ఓ ట్వీట్ చేశాడు. ఇద్దరూ ఉత్తమమైన వ్యక్తిత్వాలు ఉన్న అద్భుతమైన వ్యక్తులని.. వారిద్దరూ జీవితంలో ముందుకు సాగాలని ఆశిస్తున్నట్లు ఓ ట్వీట్‌కు రీట్వీట్ చేశాడు. దీంతో కాపురంలో చిచ్చు పెట్టి.. ఇప్పుడు ఓదారుస్తున్నాడంటూ మండిపడుతున్నారు పలువురు. I hope they both move on. At their best, they are each incredible. — Elon Musk (@elonmusk) May 28, 2022 బుధవారం కోర్టులో వాదనల సందర్భంగా.. డెప్ తన మాజీ టాలెంట్ మేనేజర్ అయిన క్రిస్ట్రియన్ కార్నిన్నోకు పంపిన ఓ సందేశం హైలైట్ అయ్యింది. అందులో అంబర్ హర్డ్, ఎలన్ మస్క్ మధ్య ఎఫైర్ గురించి ప్రస్తావన ఉంది. అసభ్యమైన పదజాలంతో అందులో మస్క్‌ను తిట్టాడు డెప్. ఇదిలా ఉంటే.. 2015లో జానీ డెప్, అంబర్‌హర్డ్‌ల వివాహం జరిగింది. కానీ, ఏడాదికే వాళ్ల కాపురంలో మనస్పర్థలు మొదలు అయ్యాయి. దాదాపుగా ఆ టైంలోనే నటి అంబర్ హర్డ్‌తో కొంతకాలం డేటింగ్ చేశాడు ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ డేటింగ్‌తో ఆ గొడవలు మరింత ముదిరాయన్నది జానీ డెప్ ఆరోపణ. అంతేకాదు.. ఇప్పుడు కూడా ఆమె కోర్టు ఫీజులను ఎలన్ మస్కే చెల్లిస్తున్నాడంటూ చెప్తున్నాడు. ఇదిలా ఉంటే.. హాలీవుడ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానగణం సంపాదించుకున్న ఈ మాజీ భార్యాభర్తలు.. ఒకరి మీద ఒకరు పరువు నష్టం దావాతో వర్జీనీయా ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ కోర్టుకెక్కడమే కాదు.. యాక్టింగ్ ప్రొఫెషన్‌కు భారీగా డ్యామేజ్ చేసుకున్నారు కూడా. -
రఘురామ కృష్ణరాజు కు ఏపీ ప్రభుత్వం కౌంటర్..
-
రఘురామరాజుది తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే మద్యంలో హానికర రసాయనాలు ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం అమ్ముతున్నట్టు గత కొన్నిరోజులుగా ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మద్యం శాంపిల్స్‌కు లేబొరేటరీలో పరీక్షలు చేయించామని వారు చూపుతున్న పత్రాలు కూడా తప్పుడువేనన్నారు. ఈ మేరకు రజత్ భార్గవ మంగళవారం సచివాలయంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో కలసి మీడియాతో మాట్లాడారు. రఘురామ అండ్ కో మద్యం శాంపిల్స్ పరీక్ష చేయించామని చెబుతున్న చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబ్ నుంచి ఈ మేరకు నివేదిక తెప్పించామన్నారు. మద్యం శాంపిళ్లలో హానికర రసాయనాలు లేవని, పైగా ఆ మద్యాన్ని ఏపీ నుంచి తెచ్చినట్టు ఆధారాలు కూడా లేవని స్పష్టమైందన్నారు. సమర్పించిన వ్యక్తులు కోరనందున ఆ నమూనాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఎస్ఐ) 4449 (విస్కీ), 4450 (బ్రాందీ) ప్రకారం పరీక్షించలేదని ఎస్జీఎస్ ల్యాబ్ పేర్కొందన్నారు. ఈ పరీక్షలు ఎక్సైజ్ చట్టం ప్రకారం అనుసరించాల్సిన విధానాల మేరకు జరగలేదన్నారు. ఈ మేరకు ల్యాబ్ ఇచ్చిన లేఖను రజత్ భార్గవ మీడియాకు చూపించారు. తప్పుడు ప్రచారానికి కారణమైన రఘురామపై పరువునష్టం దావా వేస్తామన్నారు. క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తామని తెలిపారు. ప్రమాణాలు పాటించకుండా పరీక్షలు.. చైతన్య, పవన్ అనే వ్యక్తులు గతేడాది డిసెంబర్ 11న నాలుగు విస్కీ, ఒక బ్రాందీ నమూనాలను అనధికారికంగా చెన్నైలోని ల్యాబ్‌కు పంపారని తెలిపారు. డిసెంబర్ 24న వారికి నివేదిక ఇచ్చినట్టు ఎస్జీఎస్ ల్యాబ్ తెలిపిందన్నారు. వీటిని ఏపీ నుంచి కొనుగోలు చేశారా, లేదా అనే విషయం తేలాలన్నారు. పరీక్షల కోసం నమూనాలను కల్తీ చేసి పంపారా, లేదా అనేదాన్ని గుంటూరులోని ప్రభుత్వ కెమికల్ ల్యాబ్ ఎగ్జామినర్ తేల్చాల్సి ఉందన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేందుకే చైతన్య, పవన్ ఈ పనిచేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. నిర్ణీత ప్రమాణాల ప్రకారం.. మద్యం శాంపిల్స్‌ను కమిషనర్ లేదా శాంపిల్స్ సేకరించేందుకు అనుమతించిన ఇతర డిస్టిలరీ ఎక్సైజ్ అధికారి మాత్రమే ల్యాబ్‌కు పంపాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ఐదు ప్రభుత్వ లేబొరేటరీల్లో ఎప్పటికప్పుడు మద్యం నమూనాలను ఎన్నో విధాలుగా పరీక్షిస్తున్నామని తెలిపారు. 2021–22 (ఫిబ్రవరి వరకు)లో 1,47,636 శాంపిళ్లను పరీక్షించామని, ఎందులోనూ కల్తీ జరిగినట్టు, హానికర పదార్థాలు ఉన్నట్టు తేలలేదన్నారు. ప్రియాంక రాష్ట్రానికి గర్వకారణం మహిళా గ్రాండ్ మాస్టర్ నూతక్కి ప్రియాంక రాష్ట్రానికి గర్వకారణమని ç రజత్‌భార్గవ చెప్పారు. ఆయన మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో ప్రియాంకను సత్కరించారు. క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ చెస్ చాంపియన్ షిప్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడంతోపాటు డబ్ల్యూజీఎం మూడో నార్మ్‌ను సొంతం చేసుకున్న ప్రియాంకను అభినందించారు. -
మంత్రి నవాబ్ మాలిక్‌కు హైకోర్టు చురకలు
ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు బాంబే హైకోర్టు చురకలు అంటించింది. కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలని ఆయనను ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తండ్రి ధ్యాన్‌దేవ్ వేసిన పరువు నష్టం దావా విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. నవాబ్ మాలిక్ తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ధ్యాన్‌దేవ్ పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ మాధవ్ జామ్‌ధార్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్.. అఫిడవిట్ ద్వారా సమాధానం ఇవ్వాలని మాలిక్‌ను ఆదేశించింది. ‘మీరు (నవాబ్ మాలిక్) రేపటిలోగా మీ సమాధానం ఇవ్వండి. మీరు ట్విటర్లోనే కాదు, ఇక్కడకు వచ్చి కూడా సమాధానం ఇవ్వొచ్చు’ అంటూ మాలిక్‌కు చురకలు అంటించింది. కాగా, ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సమీర్ వాంఖెడేను లక్ష్యంగా చేసుకుని ట్విటర్లో మాలిక్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వాంఖెడే కుటుంబానికి వ్యతిరేకంగా మళ్లీ ఎటువంటి ప్రకటనలు చేయకుండా మాలిక్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయలేదు. (చదవండి: ఆర్యన్ కేసు నుంచి వాంఖెడే అవుట్) ప్రతిరోజు తప్పుడు ప్రకటనలతో వాంఖెడే కుటుంబ పరువుకు నష్టం కలిగించేలా నవాబ్‌మాలిక్ ఆరోపణలు చేస్తున్నారని వాంఖెడే తరఫు న్యాయవాది అర్షద్ షేక్ కోర్టులో వాదించారు. సోషల్ మీడియాలో అసత్య పోస్ట్‌లు పెడుతూ మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ ఉదయం కూడా సమీర్ వాంఖడే భార్య సోదరి గురించి ట్వీట్ చేశారని వెల్లడించారు. కనీసం విచారణ ముగిసే వరకు నవాబ్ మాలిక్ ఎటువంటి ప్రకటనలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దావాపై అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని నవాబ్ మాలిక్ తరపు న్యాయవాది అతుల్ దామ్లే కోరారు. ఇతర వ్యక్తులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించిన వాటిని నవాబ్ మాలిక్ ఆపాదించడం సరికాదని కోర్టుకు తెలిపారు. కాగా, మీడియా సమావేశాలు, సోషల్ మీడియా తమ కుటుంబ పరువు తీసిన నవాబ్ మాలిక్‌పై రూ.1.25 కోట్లకు ధ్యాన్‌దేవ్ వాంఖెడే దావా వేశారు. (చదవండి: ఆర్యన్‌ను కిడ్నాప్ చేయాలనుకున్నారు) -
Revanth Reddy: నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు రేవంత్ సిద్ధమా? అని సవాల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. తాను లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. మాతో పాటు కేసీఆర్ కూడా లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. సహారా, ఈఎస్ఐ కుంభకోణాలు, సీబీఐ కేసులలో వీరు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. కాగా, తనపై రేవంత్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి కేటీఆర్ హైకోర్టులో పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. చదవండి: తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ -
అప్పుడేదో వ్యంగ్యం ప్రదర్శించా అంతే: రాహుల్ గాంధీ
‘‘నీరవ్.. లలిత్.. నరేంద్ర మోదీ.. ఇలా ఈ దొంగలంతా ఒకే ఇంటిపేరుతో ఉండడం ఎలా?’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెర మీదకు వచ్చాయి. ఆ టైంలో రాహుల్‌కి వ్యతిరేకంగా పరువు నష్టం దావా వేశాడు ఓ బీజేపీ నేత. ఈ కేసుకు సంబంధించి గురువారం సూరత్ కోర్టులో ప్రత్యక్షంగా హాజరైన రాహుల్.. మేజిస్ట్రేట్ ముందు తన చివరి స్టేట్మెంట్ ఇచ్చారు. సూరత్: తనకు వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం దావా కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తుది వాంగ్మూలం ఇచ్చారు. ‘‘నేను ఏ కమ్యూనిటీని లక్క్ష్యంగా చేసుకుని ఆ కామెంట్ చేయలేదు. కేవలం ఆ సమయానికి వ్యంగ్యం ప్రదర్శించా అంతే. అంతకుమించి నాకేం గుర్తులేదు’’ అని రాహుల్ కోర్టుకు తెలియజేశారు. కాగా, ఈ కేసులో స్వయంగా హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని వారం క్రితమే రాహుల్‌ను మేజిస్ట్రేట్ ఏఎన్ దవే ఆదేశించారు. ఇక ఇరువర్గాల స్టేట్మెంట్స్ రికార్డు పూర్తి కావడంతో జులై 12 నుంచి ఈ కేసులో కోర్టులో వాదనలు జరగనున్నాయి. కాగా, 2019లో కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఏప్రిల్13న కోలార్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ తన ప్రసంగంలో పై వ్యాఖ్యలు చేశాడు. అయితే మోదీ ఇంటిపేరుతో ఉన్నవాళ్లంతా దొంగలే అని అర్థం వచ్చేలా రాహుల్ మాట్లాడాడని, ప్రధానిని అగౌరవపరిచారని, తన పరువుకూ భంగం కలిగిందని చెబుతూ బీజేపీ నేత పూర్ణేష్ మోదీ, రాహుల్‌పై దావా వేశాడు. ఈ కేసులో 2019 అక్టోబర్‌లోనే రాహుల్ ఇంతకు ముందు హాజరై.. ఆరోపణల్ని నమోదు చేయొద్దని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని కోర్టును అభ్యర్థించారు కూడా. చదవండి: ఆత్మనిర్భర్ అంటే..:రాహుల్ గాంధీ -
ఆ మహిళలపై బీబర్ పరువునష్టం దావా
పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఇద్దరు మహిళలపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. తనపై ఆరోపణలు చేసిన ఒక్కో మహిళపై 10 యూఎస్ మిలియన్ డాలర్ల(దాదాపు రూ. 75.6 కోట్లు) పరువు నష్టం దావా వేశారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా కల్పితమైనవని బీబర్ స్పష్టం చేశారు. ఆ ఆరోపణలు నిరాధరమైనవని నిరూపించడానిని తన వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాలను ఓ ప్రముఖ మీడియా వెబ్సైట్ వెల్లడించింది.(చదవండి : స్వీయ నిర్బంధంలో ‘ముద్దు’ ముచ్చట) ఈ ఆరోపణలు చేసినవారిలో ఒకరు.. 2014లో అస్టిన్‌లో జరిగిన సౌత్‌వెస్ట్ ఫెస్టివల్ చూసేందుకు వచ్చిన సమయంలో బీబర్ తనపై దాడి చేసినట్టుగా చెప్పారు. మరో మహిళ 2015 న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బీబర్ తనపై దాడికి పాల్పడినట్టు ఆరోపించారు. అయితే ఇవి రెండు కూడా పూర్తిగా కల్పితమైనవని.. ఇటువంటి ఆరోపణలు చేయడం ద్వారా ఇతరుల దృష్టిని ఆకర్షించాలనే కుట్ర దాగి ఉందని బీబర్ పేర్కొన్నారు. ఇటువంటి తప్పుడు చర్యల వల్ల ఇతరుల పరువుకు భంగం వాటిల్లడమే కాకుండా.. కొత్త సమస్యలు పుట్టుకొచ్చే అవకాశం ఉందన్నారు. కాగా, ఇదివరకే తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ పోరాటం చేయనున్నట్టు బీబర్.. ట్విటర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘అయ్యన్న పాత్రుడుపై పరువు నష్టం కేసు వేస్తా’
సాక్షి, తూర్పు గోదావరి: కరోనా విపత్కర సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శ్రేణలు ఎంతో కష్టపడి పనిచేన్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రజలకు సాయం అందిస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు లేనిపోని ఆరోపణలు చేశారని, అందుకు ఆయనపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా కేసు వేస్తానని ఎంపీ అన్నారు. ఇక ఆధారాలు లేకుండా టీడీపీ నేతలు ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మార్గాని భరత్ హెచ్చరించారు. -
మామాజీ బెదిరింపులు.. దిగొచ్చిన రాహుల్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాల జోరు పెంచాయి. ఈ క్రమంలో ఇరు పార్టీలు పరస్పరం విమర్శల దాడికి దిగాయి. సోమవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌పై పలు అవినీతి ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలో పాల్గొన్న రాహుల్ పనామా పత్రాల కుంభకోణాన్ని ఉటంకిస్తూ ‘ఈ కుంభకోణంలో మామాజీ(శివ్‌రాజ్ సింగ్ చౌహన్ నిక్ నేమ్), మామాజీ కుమారుడి పేరు ఉంది. అక్కడ చౌకీదార్(మోదీ).. ఇక్కడ మామాజీ ఇద్దరు దోచుకుంటున్నారం’టూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ ఆరోపణలపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వ్యాపం నుంచి పనామా కుంభకోణం వరకు నాపై, నా కుటుంబంపై రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ విషయంపై నేను కోర్టుకు వెళతా. రాహుల్‌పై పరువునష్టం దావా వేస్తాన’ని చౌహన్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. రాహుల్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. Mr @RahulGandhi You have been making patently false allegations of Vyapam to Panama Papers against me and my family. Tomorrow, I am filing a criminal defamation suit for maximum damages against you for frivolous and malafide statements. Let law take its own course now. — ShivrajSingh Chouhan (@ChouhanShivraj) October 29, 2018 దాంతో చౌహన్‌పై చేసిన అవినీత ఆరోపణల గురించి రాహుల్ దిగొచ్చారు. కానీ మరోసారి బీజేపీపై విమర్శల వర్షం గుప్పించారు. ‘బీజేపీలో అవినీతి చాలా ఎక్కవ కదా అందుకే నేను పొరబడ్డాను. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబంపై పనామా కుంభకోణం ఆరోపణలు లేవు. ఆయనపై కేవలం ఈ-టెండరింగ్, వ్యాపం కుంభకోణం లాంటి ఆరోపణలు మ్రాతమే ఉన్నాయంటూ’ అని రాహుల్ చురకలంటించారు. -
గుజరాత్ నుంచే పరువు నష్టం దావాలు?
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణానికి సంబంధించి వార్తా కథనాన్ని ప్రచురించినందుకు ‘ది సిటిజెన్’ పత్రిక సంపాదకురాలు సీమా ముస్తఫాపై అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ తాజాగా ఏడువేల కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. ఇదే కంపెనీ గత వారం ఇదే కారణంతో ‘ఎన్డీటీవీ’పైన పది వేల కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. ఇదే రాఫెల్ యుద్ధ విమానాల స్కామ్‌కు సంబంధించి అంబానీ కంపెనీ పలువురు కాంగ్రెస్ నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్, మీడియా సంస్థలపై మొత్తం 75 వేల కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం దావాలు వేసింది. అన్ని దావాలు కూడా గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోనే దాఖలు చేయడం గమనార్హం. భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జయ్ షా కూడా 2017లో ‘ది వైర్’ మీడియాపై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది కూడా అహ్మదాబాద్ నుంచే. పరువు నష్టం దావాలకు, గుజరాత్‌కు లింకేమిటీ? ఎందుకు అక్కడి నుంచే దావాలు వేస్తున్నారు? 2004లో గుజరాత్ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్టు రుసుముల చట్టం ప్రకారం ఎంత పెద్ద మొత్తానికి పరువు నష్టం దావా వేసినా గరిష్టంగా చెల్లించాల్సింది 75 వేల రూపాయలు మాత్రమే. ఉత్తుత్తి పరువు నష్టం దావాలను నిరుత్సాహ పర్చేందుకుగాను దేశంలోని పలు రాష్ట్రాలు పరువు నష్టం దావా రుసుములను పెంచాయి. పేద వారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో గుజరాత్ రాష్ట్రం అన్నింటికన్నా పరువు నష్టం రుసుములను తక్కువగా పేర్కొంది. అందుకని భారీ మొత్తాలకు పరువు నష్టం దావాలను వేయాలనుకున్న వారు గుజరాత్‌ను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్లో బ్రాంచీలున్న కంపెనీలు అలా చేస్తున్నాయి. పైగా ఎక్కడో ఉన్న నిందితుడిని కోర్టు విచారణ పేరిట గుజరాత్ వరకు రప్పించి తిప్పించవచ్చన్నది కూడా వారి కుట్రలో ఓ భాగం. గుజరాత్ హైకోర్టుకు సివిల్ జురిడిక్షన్ హోదా లేకపోవడం కూడా కలిసిసొచ్చే అవకాశమే. ఈ హోదా లేకపోవడం వల్ల అన్ని సివిల్ పరువు నష్టం దావాలను అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులోనే దాఖలు చేయాలి. అప్పీల్‌కు మాత్రమే హైకోర్టుకు రావాలి. బాంబే, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్, హిమాచల్ ప్రదేశ్‌లోని ఐదు హైకోర్టులు మాత్రమే సివిల్ జురిడిక్షన్‌లో ఉన్నాయి. వీటి పరిధిలో ఓ పరిమితికి మించి పరువు నష్టం దావాలు వేయాలంటే హైకోర్టులనే నేరుగా ఆశ్రయించాల్సి ఉంటుంది. తమిళనాడులోని సిటీ సివిల్ కోర్టులో 25 లక్షల రూపాయల వరకు పరువు నష్టం కేసు దాఖలు చేయవచ్చు. పది లక్షల నుంచి 25 లక్షల వరకు మూడు శాతం చొప్పున కోర్టు ఫీజు చెల్లించాలి. 25 లక్షలకు మించిన పరువు నష్టం దావాలయితే మద్రాస్ హైకోర్టులోనే దాఖలు చేయాలి. ఎంత మేరకైనా పరువు నష్టం దావా వేయవచ్చు. అయితే అందులో ఒక శాతం మొత్తాన్ని కోర్టు రుసుము కింద చెల్లించాలి. 2015లో సవరణల ప్రకారం ఢిల్లీలో దిగువ కోర్టులు రెండు కోట్ల రూపాయల వరకు, అంతకుమించితే హైకోర్టులో పరువు నష్టం దావాలు వేయాల్సి ఉంటుంది. రిలయెన్స్ కంపెనీ ‘ఎన్డీటీవీ’పైన మద్రాస్ నుంచి పరువు నష్టం దావా వేసి ఉన్నట్లయితే కోర్టు రుసుము కింద వంద కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చేది. గుజరాత్లో గరిష్ట రుసుము 75 వేల రూపాయలే కనుక ఆ మొత్తాన్ని చెల్లించి పదివేల కోట్ల రూపాయలకు దావా వేసింది. పేదలను దృష్టిలో పెట్టుకొని కోర్టు రుసుములను అతి తక్కువగా నిర్ణయిస్తే రిలయెన్స్ లాంటి పెద్దలు, రాజకీయ నాయకులకే ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందుకు ఎక్కువగా మీడియా సంస్థలే నష్టపోవాల్సి వస్తోంది. సామాన్యులు చాలా వరకు పరువు నష్టం దావాల జోలికి వెళ్లరని తెల్సిందే. -
మీటూ : పరువు నష్టం దావాపై ఈనెల 31న విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : తనను మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపించిన జర్నలిస్ట్ ప్రియా రమణిపై దాఖలైన పరువు నష్టం దావాపై ఢిల్లీ కోర్టులో గురువారం విచారణ ప్రారంభమైంది. 20 ఏళ్ల కిందట ఎంజే అక్బర్ తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని ప్రియా రమణి ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రియా రమణి ట్వీట్లతో మాజీ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి అక్బర్ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన తరపు న్యాయవాది గీతా లూథ్రా అడిషనల్ చీఫ్ మెట్రపాలిటన్ మేజిస్ర్టేట్ సమర్ విశాల్‌కు నివేదించారు. ఈ ఆరోపణల ఫలితంగా అక్బర్ మంత్రి పదవి నుంచి వైదొలిగారని గుర్తుచేశారు. జర్నలిస్టుగా అక్బర్ ప్రతిష్టను ప్రస్తావిస్తూ ఆయన 40 ఏళ్లుగా సంపాదించుకున్న పేరుప్రఖ్యాతులను ఈ ఆరోపణలు దెబ్బతీశాయంటూ ఆయన ఫిర్యాదును కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తన క్లెయింట్ ప్రతిష్టను దిగజార్చేలా ప్రియా రమణి ట్వీట్ చేశారని, ఆమె రెండో ట్వీట్‌ను 1200 మంది లైక్ చేశారని, ఇది తన క్లెయింట్ ప్రతిష్టను దెబ్బతీయడమేనని లూథ్రా వాదించారు. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ఈ ట్వీట్లను ప్రస్తావించారని, తన ఆరోపణలను ఆమె నిరూపించలేకపోతే ఈ ట్వీట్లు అక్బర్ ప్రతిష్టను మసకబార్చేవేనని పేర్కొన్నారు. లూథ్రా వాదనలు విన్న అనంతరం అక్టోబర్ 31న అక్బర్ స్టేట్మెంట్ను నమోదు చేయాలని, దీనిపై తాము సంతృప్తికరంగా ఉంటే ప్రియా రమణికి నోటీసులు జారీ చేస్తామని కోర్టు పేర్కొంది. తనపై పలువురు మహిళా జర్నలిస్టులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఎంజే అక్బర్ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అక్బర్ తనపై ఆరోపణలను తోసిపుచ్చుతూ ఇది రాజకీయ కుట్రేనని అభివర్ణించారు. మరోవైపు సత్యమే తనకు బాసటగా నిలుస్తుందని ప్రియా రమణి పేర్కొన్నారు. -
ఆ నటిపై రూ 100 కోట్ల పరువునష్టం దావా
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ నటి, గాయని మిసా షఫీపై గాయకుడు అలీ జఫర్ రూ 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అలీ జఫర్ తనను లైంగికంగా వేధించాడని గతంలో మిష ఆరోపించడంపై అలీ జఫర్ లాహోర్ జిల్లా కోర్టులో కేసు వేశారు. తన ప్రతిష్టను మిసా ఆరోపణలు తీవ్రంగా దెబ్బతీశాయని, తన గుడ్‌విల్‌ను మసకబార్చేలా ఉండటంతో పాటు జీవనోపాధిని దెబ్బతీసేలా ఆమె ఆరోపణలు చేశారని అలీ ఆమెకు పంపిన నోటీసులో పేర్కొన్నారు. తనను మానసికంగా వేధించినందుకు రూ 2 కోట్లు, కాంటాక్టులు కోల్పోయినందుకు రూ 8 కోట్లు, ప్రతిష్ట దెబ్బతీసినందుకు రూ 50 కోట్లు, వ్యాపార అవకాశాలు నష్టపోయినందుకు రూ 40 కోట్ల చొప్పున చెల్లించాలని నోటీసులో అలీ కోరారు. అలీ రెండు సందర్భాల్లో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మీసా ఓ ఇంటర్వ్యూలో ఆరోపించిన సంగతి తెలిసిందే. తొలిసారి అలీ తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించిన సందర్భంలో తాను ఆ విషయం తేలిగ్గా తీసుకున్నానని, తామిద్దరం సెలబ్రిటీలు కావడంతో అతడిపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని తన భర్తకు సూచించానని చెప్పారు. మరో సందర్భంలోనూ అలీ ఇలాగే వ్యవహరించారని ఆరోపించారు. అయితే మీసా ఆరోపణలను అలీ తోసిపుచ్చారు. న్యాయస్ధానాల్లోనే ఆమెతో తేల్చుకుంటానని మీసాపై ప్రత్యారోపణలు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు. -
కేవలం ఒక్క రూపాయకే ! పరువు నష్టం దావా
మైసూరు : మైసూరు–కొడుగు ఎంపీ ప్రతాప్ సింహపై బహుబాషా నటుడు ప్రకాశ్ రాజ్ మంగళవారం కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దావా కేవలం ఒక్క రూపాయి వేయడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ...ఎంపీగా ఉన్న ప్రతాప్ సింహ ఉన్నత స్థానంలో ఉంటూ సోషల్ మీడియాలలో తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలను పోస్టు చేశారని, ఇలాంటివి పోస్టు చేసి ప్రతాప్ సింహ తన రౌడీయిజాన్ని చూపిస్తున్నారని అన్నారు. ఇటీవల తను మోదీపై కర్ణాటకకు సంబంధించిన పలు విషయాలు మీడియా ద్వారా ప్రశ్నిస్తే దానికి కౌంటర్‌గా ప్రతాప్ సింహ, తన పట్ల అసభ్య వ్యాఖ్యలు చేశారని, తన కుమారుడు చనిపోయినప్పుడు తాను ఒక డ్యాన్సర్‌తో ఉన్నట్లు పోస్టు చేశారని, అలాంటి వ్యక్తి మోదీ గురించి మాట్లాడే అర్హత లేదని ట్వీట్ చేశారని ప్రకాశ్ అన్నారు. దీంతో తన పరువుకు భంగం కలిగిన ఇలాంటి వ్యాఖ్యలు తనను బాధ కలిగించాయని, ఆయనపై తనకు వ్యక్తిగత కోపం లేదని, సోషల్ మీడియాను తప్పుదోవ పట్టించడం, అసభ్యంగా వ్యాఖ్యానిండచడం సరికాదని, అందుకే ఆయనకు ఒక్క రూపాయి పరువు నష్టం దావా వేసినట్లు ప్రకాశ్ రాజ్ చెప్పారు. -
కంగనకు మరో షాక్
సాక్షి, ముంబై : వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదు అయ్యింది. సీనియర్ నటుడు ఆదిత్య పంచోలీ, ఆయన భార్య జరీనా వహబ్.. శుక్రవారం అంధేరీ కోర్టులో కంగనాపై పరువు నష్టం దావా వేశాడు. తన పేరు, తన కుటుంబ సభ్యుల పేరిట అసత్య ఆరోపణలు చేస్తున్న కంగనపై కేసు వేసినట్లు ఆదిత్య పంచోలీ ప్రకటించారు . ‘కంగనా నాకు కొన్నేళ్లుగా తెలుసు. కానీ, ఈ మధ్య మీడియాలో ఆమె నా గురించి అభ్యంతరకర ప్రకటనలు చేస్తోంది. నాతోపాటు నా కుటుంబ సభ్యుల ప్రస్తావన కూడా తీసుకొచ్చి నా పరువును బజారుకీడుస్తోంది. నేను ఆమెను హింసించానన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. వాటిని మౌనంగా భరించాల్సిన అవసరం నాకేంటి. అందుకే ఆమెపై కేసు వేశా’ అని ఆయన చెప్పారు. క్రిమినల్ కేసుతోపాటు మరో సివిల్ కేసు కూడా వేసేందుకు సిద్ధంగా ఉన్నామని పంచోలీ ఆయన భార్య జరీనా వహబ్ తెలిపారు. కాగా, కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలీ పేరును కూడా దావాలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సినిమాలోకి వచ్చిన కొత్తలో నటుడు ఆదిత్య పంచోలీ ఆమెకు గాడ్ ఫాదర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే హృతిక్ రోషన్‌తో అఫైర్ వ్యవహారం వెలుగులోకి రాగానే.. ఆయన ఆమెను దూరం పెట్టాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటుంటాయి. ఈ నేపథ్యంలో పంచోలీ తనను దారుణంగా హింసించేవాడని కంగనా ఓ ఇంటర్వ్యూలో చెప్పగా.. వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉండేది ఆమె సోదరి రంగోలీ మరో బాంబు పేల్చింది. ఆయా ప్రకటనలపై వారిద్దరికీ పంచోలీ ఓ లీగల్ నోటీస్ పంపినప్పటికీ.. వారి తరపునుంచి ఎలాంటి స్పందన రాలేదు.దీంతో ఆయన కేసు వేశారు. ఇప్పటికే బాలీవుడ్లో మద్దతు కరువై ఒంటరి అయిన ఆమె ఈ కేసును ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. -
కమల్ కాచుకో!
⇒ కమల్‌హాసన్ విమర్శలపై ఆగ్రహం ⇒ కేసువేస్తామని మంత్రుల హెచ్చరిక ⇒ దమ్ముంటే నాపై కేసు పెట్టండని స్టాలిన్ సవాల్ ఎడపాడి ప్రభుత్వంపై నటుడు కమల్‌హాసన్ చేసిన విమర్శలు రాష్ట్రంలో తీవ్రస్థాయిలో దుమారం రేపాయి. అన్ని శాఖల్లో అవినీతి పేరుకుపోయిందని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలతో మంత్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. పరువునష్టం దావా వేస్తాం జాగ్రత్త అంటూ కమల్‌ను బహిరంగంగా హెచ్చరించారు. అయితే కమల్‌కు అన్నాడీఎంకేలోని పన్నీర్‌సెల్వం వర్గం సహా అన్ని పార్టీలూ అండగా నిలిచాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై : ప్రభుత్వంపై నటుడు కమల్‌హాసన్ విమర్శలు, మంత్రుల ప్రతి విమర్శలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.జయ హయాంలో కమల్‌హాసన్ తీవ్రస్థాయిలో రాజకీయ వేధింపులకు గురయ్యారు. తాను నటించి, దర్శకత్వం వహించిన విశ్వరూపం చిత్రంలో ఒక సామాజికవర్గాన్ని కించపరుస్తూ చిత్రీకరించారనే కారణం చూపి విడుదలకు విఘాతం కల్పించారు. ఈ చర్యలతో విసిగిపోయిన కమల్ దేశాన్ని విడిచిపోతానని ప్రకటించారు. ఆ తరువాత వెనుకడుగు వేసిన ప్రభుత్వం విడుదలకు మార్గం సుగమం చేసింది. ఇలా ఎన్నో రకాల ఇబ్బందులకు గురైన కమల్ జయ మరణించిన తరువాత తరచూ రాజకీయ విమర్శలను చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఎడపాడి ప్రభుత్వం అవినీతిమయమని ఇటీవల మీడియా ముందు దుమ్మెత్తిపోశారు. కమల్ విమర్శలతో ఉలిక్కిపడిన మంత్రులు కమల్‌పై తిట్ల దండకం అందుకున్నారు. వ్యక్తిగత జీవితాన్ని సైతం అసభ్య పదజాలంతో విమర్శించారు. కమల్ విమర్శలతో అధికారపక్షం ఒకవైపు, విపక్షం మరోవైపుగా మారాయి. తమ ప్రభుత్వంపై కమల్ ఇలాగే విమర్శిస్తూ పోతే పరువునష్టం దావా వేస్తామని మంత్రి కడంబూరు రాజా హెచ్చరించారు. కమల్‌కు రాజకీయాలు మాట్లాడే హక్కులేదని మంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యానించారు. డబ్బు, ఆదాయం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి అని కమల్‌ను ఎద్దేవా చేశారు. కమల్ విమర్శలకు తగిన సమాధానం చెబుతున్నామని, ధైర్యం ఉంటే రాజకీయాల్లోకి వచ్చి ఈ విమర్శలు చేయాలని మంత్రి జయకుమార్ సవాల్ విసిరారు. ప్రతి ఒక్క ఓటరులో ఒక నేత ఉన్నాడు, ఈ వాస్తవాన్ని విస్మరించిన వాడు నేతగా కొనసాగలేడు అని నటుడు కమల్‌హాసన్ పేర్కొన్నారు. కమల్‌కు ప్రతిపక్షాల బాసట జయ మరణం తరువాత అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసాగడంపై మండిపడుతున్న ప్రతిపక్షాలు కమల్ చేసిన విమర్శలను సమర్థించాయి. మంత్రులంతా కమల్‌పై దుమ్మెత్తిపోయడాన్ని అడ్డుకుంటూ బాసటగా నిలిచాయి. ‘నేను సైతం అనేక విమర్శలు చేశాను, నాపై కూడా కేసు వేసే ధైర్యం ఉందా?’అని ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. రాజకీయ నేతలేకాదు ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ విమర్శించే హక్కుందని ఆయన అన్నారు. ఈ హక్కుతోనే కమల్ తనదైన శైలిలో విమర్శలు చేశారని చెప్పారు. విమర్శిస్తే కేసులు వేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన హితవు పలికారు. ఐటీ దాడులు, కేసులు, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి ఉన్న ఈ ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పేమిటని ఆయన నిలదీశారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ సైతం కమల్ వ్యాఖ్యలను సమర్థిస్తూ మంత్రులను తప్పుపట్టారు. కమల్ విమర్శలను సావధానంగా విని ఓరిమితో తగిన బదులు చెప్పాల్సిన ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడటం సమంజసం కాదని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం అన్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ భిన్నమైన ధోరణిలో స్పందించారు. జయలలిత జీవించి ఉన్నంతకాలం మౌనంగా ఉండిన కమల్ అకస్మాత్తుగా రాజకీయ విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. జయ బతికున్నపుడు రాష్ట్రంలో అవినీతి లేదా అని ఆమె కమల్‌ను ప్రశ్నించారు.