
టీవీ9, ఏబీఎన్, టీవీ 6లపై దావా
హైదరాబాద్: టీవీ 9, ఏబీఎన్ చానెళ్లు మరో వివాదంలో ఇరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఈ రెండు చానెళ్లతో పాటు టీవీ 6పై దావా వేశారు.
ఎన్నికల సమయంలో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ఈ మూడు చానెళ్లు కథనాలు ప్రసారం చేశాయని శ్రీధర్ ఆరోపించారు. ఆయన టీవీ9, ఏబీఎన్, టీవీ లపై దావా దాఖలు చేశారు. కాగా తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా కథనాలు ప్రసారం చేశాయని, తెలంగాణ ఎంఎస్వోల సంఘం ఇటీవల ఏబీఎన్, టీవీ 9 ప్రసారాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.