TV 9
-
దుబాయ్‌లో శివాజీ అడ్డగింత
సాక్షి, హైదరాబాద్: టీవీ9 అధికార మార్పిడి కేసులో నిందితుడిగా ఉన్న సినీనటుడు, గరుడ పురాణం శివాజీ అమెరికా వెళ్లకుండా మరోసారి ఆటంకం ఎదురైంది. కనెక్టింగ్ ఫ్లైట్‌లో అమెరికా వెళ్తుండగా దుబాయ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఈ నెల 26న (శుక్రవారం) జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌లో అమెరికా విమానం ఎక్కుతుండగా అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు.. ఆయన్ను అడ్డుకుని మరో విమానంలో భారత్‌కు పంపించారు. అయితే ఇందుకు కారణాలేంటన్నది స్పష్టంగా తెలియరాలేదు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌తో పాటు శివాజీపై హైదరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని సైబరాబాద్ పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పుడు విచారించిన పంపిన సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు.. పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని శివాజీకి నోటీసులు ఇచ్చారు. ఆయనపై ఎలాంటి ఆంక్షలు లేవు దుబాయ్ విమానాశ్రయంలో శివాజీని అడ్డుకోవడంపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. శివాజీ విదేశాలకు వెళ్లే విషయంలో తామెలాంటి ఆంక్షలు విధించలేదని ఆయన స్పష్టంచేశారు. దుబాయ్‌లో ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని ఎందుకు తనిఖీ చేశారు? ఏ కారణంతో వెనక్కి పంపారన్న సంగతి తమకు తెలియదన్నారు. ఈ విషయం ఒక్క శివాజీకి మాత్రమే తెలుసని.. ఆయన మాట్లాడితేనే విషయాలు బయటకొస్తాయని పోలీసులంటున్నారు. తెలంగాణలో నమోదైన కేసులు కాకుండా వీసా లేదా ఇతర వివాదాలేమైనా కారణాలు కావొచ్చని భావిస్తున్నారు. -
రవిప్రకాశ్‌కు బెయిల్ ఇవ్వొద్దు
సాక్షి, హైదరాబాద్: పోలీసుల విచారణకు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సహకరించడం లేదని, కొన్ని పత్రాలు ఆయనకు చూపించినా వివరాలు చెప్పడం లేదని, ఈ నేపథ్యంలో రవిప్రకాశ్‌ను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ పోలీసుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ చెప్పారు. కొన్ని విషయాలపై రవిప్రకాశ్‌కు మాత్రమే పూర్తి అవగాహన ఉందని, వివరాలు చెప్పకుండా మౌనం గా ఉండటమో, పొంతనలేని జవాబులు చెప్పడమో చేస్తున్నారని తెలిపారు. టీవీ9 యాజమాన్యం దాఖలు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని రవిప్రకాశ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి ఎదుట వాదప్రతివాదనలు జరిగాయి. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండేలా చేయగలరని చెప్పారు. కావాలని లిటిగేషన్ క్రియేట్ చేసే ప్రయత్నాలు కూడా కనబడుతున్నాయని చెప్పారు. టీవీ9 లోగో ఖరీదు కోట్ల రూపాయల ధర పలుకుతుందని, దానిని కేవలం రూ.99 వేలకే అమ్మేశారంటే ఆయనలో ఉన్న నేరస్వభావాన్ని అర్ధం చేసుకోవచ్చని అన్నారు. కంపెనీ సెక్రటరీ దేవేందర్ అగర్వాల్ రాజీనామా చేశారని తప్పుడు పత్రాల్ని సృష్టించారని, అగ ర్వాల్ రాజీనామా చేసినట్లుగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు పంపించేశారని, దాంతో కొత్త డైరెక్టర్ల వివరాలు పంపితే వాటిని నమోదు చేసేందుకు ఇబ్బంది వచ్చిందని హరేన్ రావల్ వివరించారు. అగర్వాల్ రాజీనామా చేసినట్లు చెబుతున్న నెలలో రోజూ ఆఫీసుకు వచ్చారని, బయోమెట్రిక్ కూడా రికార్డు అయిందని, జీతం కూడా తీసుకున్నారని చెప్పారు. సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదన్నారు. ఏడేళ్లకుపైగా శిక్ష పడే కేసు కాబట్టి రవిప్రకాశ్‌కు బెయిల్ ఇవ్వవద్దని వాదించారు. నటుడు శివాజీకి షేర్ల విక్రయం కూడా ఆర్థిక నేరమేనని, రూ.20 లక్షలకు షేర్లను విక్రయిస్తే ఆ మేరకు ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన పత్రాల్లో శివాజీగానీ, రవిప్రకాశ్గానీ ఎందుకు చూప లేదని ప్రశ్నించారు. శివాజీ తరఫున నోటీసు ఇచ్చిన న్యాయవాదే తిరిగి రవిప్రకాశ్ తరఫున జవాబు ఇచ్చారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. శివాజీ పరారీలో ఉన్నందున రవిప్రకాశ్‌కు బెయిల్ ఇస్తే దర్యాప్తులోని సమాచారాన్ని ఇతర నిందితులకు తెలియజేసే అవకాశముందన్నారు. రవిప్రకాశ్‌ను వెంటాడుతున్నారు... టీవీ9 లోగోను రవిప్రకాశ్ తయారు చేయించారని, కాపీ రైట్ యాక్ట్ ప్రకారం దానిపై సర్వహక్కులు ఆయనకే చెందుతాయని ఆయన తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దల్జీత్‌సింగ్ అహ్లూవాలియా వాదించారు. రవిప్రకాశ్‌కు మౌనంగా ఉండే హక్కు ఉందని చెప్పారు. పోలీసులు రవిప్రకాశ్‌ను వెంటాడుతున్నారని, కావాలనే కేసుల్లో ఇరికించారని చెప్పారు. ఎందుకు బెయిల్ ఇవ్వాలో, ఎందుకు ఇవ్వరాదో లిఖితపూర్వకంగా న్యాయవాదులు తమ వాదనల్ని హైకోర్టుకు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణ 18కి వాయిదా పడింది. ఎఫ్ఐఆర్లు కొట్టేయండి: శివాజీ తనపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసుల్ని కొట్టేయాలని కోరుతూ నటుడు శొంఠినేని శివాజీ మంగళవారం హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. టీవీ9లో రవిప్రకాశ్‌కు ఉన్న షేర్లలో 40 వేల షేర్లను గత ఏడాది ఫిబ్రవరి 19న రూ.20 లక్షలకు కొనుగోలు నిమి త్తం చెల్లించినట్లు తెలిపారు. అయితే రవిప్రకాశ్ షేర్లను బదలాయించకపోవడంతో ఈ ఏడాది మార్చి 15న నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. -
రవిప్రకాశ్‌వన్నీ అసత్యాలే!
సాక్షి, హైదరాబాద్: తమ సంస్థలపై అసత్య, పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేయడంపై టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పాత యాజమాన్యం శ్రీనిరాజు సంస్థలైన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐల్యాబ్స్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. ప్రధానంగా టీవీ 9 ప్రస్తుత ప్రమోటర్లైన అలంద మీడియా, పాత ప్రమోటర్లైన శ్రీనిరాజు సంస్థల మధ్య లావాదేవీల్లో చెల్లింపులు అక్రమంగా హవాలా మార్గంలో జరిగాయని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చేసిన వాదనలు అవాస్తవం అని ప్రకటించాయి. ఫోర్జరీకి పాల్పడి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని, అరెస్టును ఎదుర్కొంటున్న రవిప్రకాశ్, ఎలాగైనా బెయిల్‌ను పొందడం కోసం తమపై నిరాధార ఆరోపణలు ప్రచారంలోకి తీసుకురావడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నాయి. విచారణ అధికారుల ముందు, కోర్టులోనూ రవిప్రకాశ్ చేసిన ఆరోపణలకు ఎలాం టి ఆధారాలు లేవని ఒక ప్రకటనలో తెలిపాయి. కోర్టులో రవిప్రకాశ్ తరఫు న్యాయవాది చేసిన వాదనల ఆధారంగా మీడియాలో వచ్చిన వార్తలను ఖం డించాయి. ఫోర్జరీ, చీటింగ్ కేసుల్లో తాను ఎదుర్కొంటున్న విచారణను పక్కదారి పట్టించడం కోసమే రవిప్రకాశ్ ఈ ఆరోపణలకు దిగారంటూ విమర్శిం చా యి. వాస్తవాలను వెల్లడించడంలో భాగంగా టీవీ9 విక్రయ లావాదేవీల వివరాలను కొత్త, పాత యాజమాన్యాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. డీల్ విలువ రూ.414 కోట్లు... ‘2018, ఆగస్టు నాటికి చింతలపాటి హోల్డింగ్స్, ఐ ల్యాబ్స్, క్లిపోర్డ్ ఫెరీరా, ఎంవీకేఎన్ మూర్తిలకు టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్లో 90.54 శాతం వాటా ఉండేది. ఈ వాటా మొత్తాన్ని ఆగస్టు 24, 2018న అలంద మీడియా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.414 కోట్లు. దీనికి సంబంధించిన షేర్ పర్చేజ్ ఒప్పందాన్ని చట్టబద్ధంగా చేసుకుని, నిధుల బదిలీని పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిపింది. రవిప్రకాశ్ ఆరోపిస్తున్నట్లు ఇందులో ఎలాంటి నగదు లావాదేవీ అన్నదే జరగలేదు. ఏబీసీఎల్కు అప్పటికి ఉన్న బకాయిలను చెల్లించడానికి అలంద మీడియా రూ.150 కోట్లు నేరుగా సంస్థ ఖాతాల్లోకి బదిలీ చేయగా, మిగిలిన రూ.264 కోట్లు పాత ప్రమోటర్లకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిగాయి. ఈ లావాదేవీలు పాత, కొత్త ప్రమోటర్ల రికార్డుల్లో నమోదయ్యాయి. సంస్థ యాజమాన్య బదిలీపై కేంద్ర సమాచార ప్రసార మం త్రిత్వ శాఖకు కూడా సమాచారమిచ్చాం. ఈ వ్యవహారమంతా చట్టపరిధిలోనే జరిగింది తప్ప, ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదు’అని వివరించాయి. ‘ఈ బదిలీ వ్యవహారం ఆగస్టు 2018 లోనే జరిగింది. ఆ సమయంలో టీవీ9 సీఈవోగా ఉన్న రవిప్రకాశ్, షేర్‌పర్చేజ్ అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేశారు. అయినప్పటికీ, 9 నెలల తర్వాత, రవిప్రకాశ్ ఈ ఆరోపణలు చేయడం చూస్తుంటే, ఫోర్జరీ కేసుల విషయంలో తాను ఎదుర్కొంటున్న క్రిమినల్ విచారణను పక్కదారి పట్టించడానికి, తనను తాను కాపా డుకోవడానికి చేస్తున్న పనే అని అర్థమవుతోంది. సైఫ్ త్రీ మారిషస్‌తో కుదిరిన సెటిల్మెంట్ వ్యవహారం పైనా రవిప్రకాశ్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. టీవీ9 విక్రయం జరిగే సమయానికి హైదాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సైఫ్ త్రీ కంపెనీ వేసిన ఓ కేసు పెండింగ్‌లో ఉంది. ఐ విజన్‌లో ఉన్న వాటాల విషయంలో సైఫ్ త్రీ ఈ కేసు వేసింది. అయితే.. ఇది సెటిల్మెంట్ అగ్రిమెంట్ ద్వారా పరిష్కారం అయ్యింది. దీనికి సంబంధించి ఆర్బీఐ నియమ నిబంధనలకు లోబడి బ్యాంకుల ద్వారానే చెల్లింపు జరిగింది. నిధులను స్వీకరించిన తర్వాత, సైఫ్ త్రీ కేసును ఉపసంహరించుకోవడానికి ఎస్‌సీఎల్‌టీ అనుమతి కూడా ఇచ్చింది. వాస్తవాలు ఇలా ఉంటే, రవిప్రకాశ్ మాత్రం ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగినట్లుగా అవాస్తవమైన, అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలతో ప్రభావితం కావొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తమ పరువుకు భంగం కలిగించేలా అసత్యమైన, పూర్తిగా అవాస్తమైన ఆరోపణలను రవిప్రకాశ్ చేసినందుకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం’అని స్పష్టం చేశాయి. -
రవిప్రకాశ్ కేసులో తొలగని ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు, లోగో విక్రయం తదితర కేసుల్లో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. దర్యాప్తులో సహకరించని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ వైఖరిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి, న్యాయమూర్తి ఇచ్చే ఆదేశాలకనుగుణంగా ముందుకు సాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీవీ9కి సంబంధించి అటు హైదరాబాద్, ఇటు సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా పలు సాక్ష్యాలు సంపాదించిన పోలీసులు మరిన్ని ఆధారాల సేకరణలో తలమునకలయ్యారు. ఇప్పటికే ఫోర్జరీ కేసులో సంస్థ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు రవిప్రకాశ్ అంగీకరించిన నేపథ్యంలో పోలీసులు మిగిలిన కేసులపై దృష్టి సారించారు. ఈ కేసులో శివాజీ– రవిప్రకాశ్ మధ్య నడిచిన లావాదేవీలు, పాతతేదీలతో నకిలీపత్రాల సృష్టికి సంబంధించి పలు వివరాలను పోలీసులు సంగ్రహించిన విషయం తెలిసిందే. చానల్ నుంచి నిధులను తన సొంత ఖాతాకు బదిలీ చేసిన విషయంలోనూ పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో బంజారాహిల్స్ పోలీసులు సేకరించిన ఆధారాలు కూడా కేసులో కీలకం కానున్నాయి. దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే టీవీ9 లోగోను కేవలం రూ.99 వేలకు విక్రయించడంపైనా పోలీసుల సందేహాలు కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే స్వా ధీనం చేసుకున్న పోలీసులు వాటి విశ్వసనీయతపై నిగ్గు తేల్చనున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు సినీనటుడు శివాజీ తనకు మంచిమిత్రుడని చెప్పిన రవిప్రకాశ్.. అతన్ని ఎందుకు మోసం చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నలకు మౌనం వహించడం విశేషం. మరోవైపు సైబరాబాద్ పోలీసులపైనా రవిప్రకాశ్ బెదిరింపులకు దిగడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో రవిప్రకాశ్ విచారణను సాంతం పోలీసులు వీడియోలో చిత్రీకరించారు. రెండు కమిషనరేట్లలో పోలీసులు ఇప్పటిదాకా సేకరించిన ఆధారాలు సరిపోలేదని అనిపిస్తే.. మరోసారి రవిప్రకాశ్‌ను విచారించే అవకాశాలు ఉన్నాయి. న్యాయస్థానం ఆదేశాలతో ముందుకెళతాం.. రవిప్రకాశ్ కేసు విషయమై ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్ కుమార్ సైబరాబాద్ కమిషనరేట్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తు ఫిర్యాదులోని అం శాల ఆధారంగా జరుగుతోంది. తదుపరి విచారణ చేయాల్సి ఉంది. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలను సోమవారం న్యాయస్థానం ముందుంచుతాం. తదుపరి దర్యాప్తు ముందుకుసాగేలా అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తాం.. అని అన్నారు. లోపల ఒకలా.. బయట మరోలా.. కేసు సాంతం రవిప్రకాశ్ వ్యవహారశైలి వింత గా ఉంటూ వస్తోంది. లోపల విచారణలో ఒకలా.. బయట మీడియాకు మరోలా కనిపిస్తూ.. విచార ణను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారు. లోపల మాత్రం దర్యాప్తునకు సహకరించట్లేదు. కేసు నమోదైనప్పటి నుంచి కోర్టులో పిటిషన్ల విచా రణ జరుగుతున్నపుడు వాటిపై ప్రభావం చూపేలా 9వ తేదీన ఒకసారి, 22న మరోసారి వీడియోలు రిలీజ్ చేశాడు. విచారణకు హాజరైనప్పుడు మాత్రం ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు. పైగా ప్రశ్నావళి రాసిస్తే.. తాను వాటికి సమాధానాలు రాసిస్తాను అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఓ 10 నిమిషాలు ప్రశ్నలు అడిగాక తల టేబుల్‌పై పెట్టుకుని పడుకుంటున్నారు. విచారణ కు సంబంధించిన వీడియో రికార్డింగ్ అంతా తనికివ్వాలంటూ పోలీసులను కోరుతున్నారు. 6 నెలల తరువాత అసలు యుద్ధం మొదలుపెడతా అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా ఒక్కటి కూడా పాటించకుండా విచారణకు సహకరించడం లేదు. -
‘సైఫ్’ పిటిషన్‌పై 24న ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 వాటాల బదలాయింపు వ్యవహారంలో ‘సైఫ్ మారిషస్ కంపెనీ లిమిటెడ్’దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు అనుమతిపై ఈనెల 24న ఉత్తర్వులు ఇస్తామని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ–హైదరాబాద్) పేర్కొంది. ట్రిబ్యునల్ సభ్యుడు అనంత పద్మనాభ స్వామి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. తమతో చేసుకున్న ఒప్పందం మేరకు టీవీ 9 వాటాల బదలాయింపు జరగలేదని, ఈ విషయంలో ఎన్సీఎల్టీ ఆదేశాలను ‘ఐ విజన్ మీడియా’ ధిక్కరించిందని గతంలోనే సైఫ్ మారిషస్ కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. ఐ విజన్ మీడియాపై ధిక్కార చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొంది. ఆ తర్వాత పరిణామాల్లో సైఫ్ పెట్టిన పెట్టుబడిని వెనక్కి ఇచ్చేసేందుకు ఏబీసీఎల్ శ్రీనిరాజు అంగీకరించారు. ఈ మేరకు ఐ విజన్, సైఫ్ మారిషస్ కంపెనీల మధ్య ఒప్పందం జరిగింది. దీంతో తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతివ్వాలని ఎన్సీఎల్టీని సైఫ్ మారిషస్ కోరింది. దీనిపై విచారణ జరుగుతుండగానే.. టీవీ9లో తాను వాటాదారుడినని చెప్పుకుంటున్న సినీనటుడు శివాజీ అభ్యంతరం తెలిపారు. ఈ పరిస్థితుల్లో సైఫ్ మారిషస్ పిటిషన్ శుక్రవారం ఎన్సీఎల్టీ ముందు విచారణకు వచ్చింది. ఈ విచారణకు శివాజీ తరపు న్యాయవాదులు ఎవ్వరూ హాజరు కాలేదు. దీంతో ఉపసంహరణ పిటిషన్‌పై ఈ నెల 24న తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని ట్రిబ్యునల్ సభ్యుడు అనంతపద్మనాభ స్వామి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. -
తెల్లకాగితం మీద అగ్రిమెంట్ రాసుకోవడమేంటో?
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా మరోసారి టీవీ9 రవిప్రకాశ్, టాలీవుడ్ నటుడు శివాజీ విమర్శనాస్త్రాలు సంధించారు. రవిప్రకాశ్ తనకు టీవీ9 షేర్లు అమ్మి బదిలీ చేయడం లేదని కంపెనీస్ లా ట్రిబ్యునల్‌కు శివాజీ ఫిర్యాదు చేసింది నిజమైతే.. చీటింగ్ కేసుగా పరిగణించి ఆ ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ‘ రవి ప్రకాశ్ తనకు టీవీ9 షేర్లు అమ్మి బదిలీ చేయడం లేదని గరుడ పురాణం శొంటినేని శివాజీ కంపెనీస్ లా ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశాడంటున్నారు. ఇది చీటింగ్ కేసు అవుతుంది. ట్రిబ్యునల్ ఆ ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. అయినా తెల్ల కాగితం మీద షేర్ల అమ్మకం అగ్రిమెంట్ రాసుకోవడమేంటో?’ అని విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు. వాళ్ల కోసం బాబు నానా తంటాలు పడుతున్నారు ప్రజలంతా మనవైపే.. విజయం మనదే అంటూ ఢీలా పడ్డ నేతలను గాలికొట్టి లేపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ నేతలకు ధైర్యాన్ని నూరిపోస్తునే మరోవైపు తన కోటరీలో ఉన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను చకచక క్లియర్ చేయించుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఈ నెల 23న( ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) రిటర్న్ టికెట్ బుక్ చేసుకొని..తమ్ముళ్లకు మాత్రం ధైర్యం నూరిపోస్తున్నారని ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. -
పోలీసు విచారణకు హాజరు కాని రవిప్రకాశ్, శివాజీ
-
‘మెరుగైన సమాజం’ వెనుక చీకటి రాజ్యం
సాక్షి, అమరావతి: మెరుగైన సమాజం వెనుక చీకటి రాజ్యం నడుపుతున్న టీవీ–9 రవిప్రకాశ్ దశాబ్దిన్నర కాలంలో చేసిన అక్రమాల జాబితా గురించి రాస్తే ఒక పెద్ద గ్రంధమే అవుతుందని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి గురువారం పేర్కొన్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. టీవీ9తో తెలుగు జర్నలిజంలో నిన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన రవి ప్రకాశ్‌కు అంతే చీకటి చరిత్ర కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలుసు. గత ఏడాది టీవీ9లో 90 శాతం వాటాలను శ్రీనిరాజు విక్రయించినప్పటి నుంచి రవిప్రకాశ్ ‘మెరుగైన జీవితం’లో చీకట్లు మొదలయ్యాయి. అతని చీకటి సామ్రాజ్యం గుట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం ఆరంభమైంది. చంద్రబాబుకు అండగా.... చంద్రబాబు చిరకాలం అధికారంలో కొనసాగేందుకు టీవీ9 తెర ముందు శివాజీ, తెర వెనుక రవిప్రకాశ్ తమ పాత్రలను శక్తి వంచన లేకుండా పోషిస్తూ వచ్చారు. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ ప్రకారమే వీరిద్దరూ వైఎస్సార్సీపీ పైనా, వైఎస్ జగన్మోహన్రెడ్డి పైనా టీవీ9 ద్వారా విషం కక్కుతూ, గరుడ పురాణాలు ప్రసారం చేస్తూ వచ్చారు. వారి పాపం బద్దలై వారి రహస్య బంధం కూడా బట్టబయలైంది. రవిప్రకాశ్ టీవీ9లోని తన వాటాల్లో కొన్ని తనకు అమ్మి ఆ షేర్లు బదలాయించకుండా మోసం చేశారంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని శివాజీ ఆశ్రయించి మరో పెద్ద నాటకానికి తెర తీశాడు. షేర్ల కొనుగోలు కోసం వీళ్ళద్దరూ ఒక తెల్ల కాగితంపై ఒప్పందం రాసుకుని ఏడాది తరువాత బదిలీ విషయం చూసుకుందాం అని అనుకున్నారంటేనే ఎంత హంబగ్గో అర్థం చేసుకోవచ్చు. టీవీ–9 పెత్తనం కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్ళకుండా కుట్ర... టీవీ9పై పెత్తనం కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్ళకుండా ఆపేందుకే ఏడాది క్రితమే పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీని రవిప్రకాశ్ రంగంలోకి దింపాడు. ఈ వ్యూహ రచన అంతా అమరావతిలోని కరకట్టపైనే జరిగింది. ఆమేరకే శివాజీ ఎన్సీఎల్టీలో తన షేర్ల పురాణం విప్పాడు. టీవీ9పై పెత్తనం రవిప్రకాశ్ చేతుల్లోంచి జారిపోతే అది రాజకీయంగా తమకు తీరని నష్టం జరుగుతుందన్న భయంతో దీన్ని ఒక లీగల్ సమస్యగా మార్చి యాజమాన్య మార్పును అడ్డుకోవడానికి శివాజీ లాంటి కేరెక్టర్లను అడ్డం పెట్టుకుని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ‘మెరుగైన సమాజం కోసం, కులం గోడలు కూల్చేద్దాం’ అంటూ గొప్ప ఆదర్శాలను వల్లిస్తూ ఒక సాదాసీదా జర్నలిస్టు బుల్లి తెరపై దూసుకువచ్చినపుడు సమాజం ఆశగా అతనిని అక్కున చేర్చుకుంది. అదే జర్నలిస్టు ఆ ఆదర్శాలను తుంగలో తొక్కేసి, అనేక మందిని బ్లాక్ మెయిల్ చేస్తూ, బలవంతపు వసూళ్ళకు నడుం కట్టినపుడు సమాజం సిగ్గుతో తలవంచుకుంది. కులం గోడలు కూల్చడానికి బదులుగా తానే కులం రొచ్చులో పీకల వరకు మునిగిపోయాడు. చంద్రబాబు నాయుడే ఆదర్శంగా జర్నలిజంలో విలువలు, సంప్రదాయాలను అధఃపాతాళానికి దిగజార్చాడు. అతి తక్కువ కాలంలోనే వందల కోట్లకు పడగలెత్తాడు. అక్రమంగా ఆర్జించిన వందల కోట్లను విదేశాల్లో ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో పెట్టుబడులుగా పెట్టాడు. ఆ ఆదర్శవాది ఇప్పుడు జైలు గోడలు తప్పించుకోవడానికి పోలీసులకు దొరక్కుండా చంద్రబాబు అండతో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. నిధులు కాజేసి, ఫోర్జరీ పత్రాలు సృష్టించి.... రవిప్రకాశ్ భాగోతంపై బ్రేకింగ్ న్యూస్ నిజానికి నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆయన రహస్య మిత్రుడు, చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్ ‘గరుడ పురాణం’ శివాజీ ఇంట్లో కూడా సోదాలు చేయడం కొంత ఆసక్తికరంగా అనిపించింది. రవిప్రకాశ్, ‘శుంఠ’ శివాజీల మధ్య బంధం ఈనాటిది కాదు. వారి రహస్య మైత్రి వెనుక బలమైన ఒక రాజకీయ అజెండా ఉందన్న మా అనుమానం తిరుగులేని సత్యమని ఈ ఉదంతం «ధృవపరుస్తోంది. రవి ప్రకాశ్ సంపాదన వందల కోట్లు దాటింది... టీవీ9ను అడ్డు పెట్టుకుని రవిప్రకాశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బ్లాక్మెయిల్ చేసి కూడబెట్టిన సంపాదనే వందల కోట్లు దాటిపోయింది. ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోయన రవిప్రకాశ్ బాధితుల సంఖ్య వేలల్లోనే ఉంది. సత్యం రామలింగరాజును బ్లాక్మెయిల్ చేసి కోట్లు కొట్టేశాడు ట్విట్టర్లో విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి రవిప్రకాశ్ వంటి చీడపురుగుల వల్ల తెలుగు మీడియా ప్రతిష్ట మసకబారిందని విజయసాయిరెడ్డి ట్విటర్లో్ల విమర్శించారు. ప్రవక్తలాగా చెలరేగిన రవిప్రకాశ్ చేయని దుర్మార్గాలు లేవని, మతాలను కించపర్చడం, కార్పొరేట్ల విబేధాల నుంచి భార్య భర్తల గొడవల వరకు టీవీ స్క్రీన్ పైకి ఎక్కించి సమాజాన్ని భ్రష్టు పట్టించాడన్నారు. చివరకు టీవీ9 ప్రధాన పెట్టుబడిదారుడు శ్రీనిరాజు సంస్థలో పనిచేస్తూ అతని తోడల్లుడు సత్యం రామలింగరాజును కూడా బ్లాక్మెయిల్ చేసి రూ. కోట్లు వసూలు చేశాడంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. రామలింగరాజు బెయిల్ రావడానికి ముందు చికిత్సకోసం నిమ్స్ హాస్పిటల్లో చేరితే ఆయన సెల్ఫోన్లో మాట్లాడుతుండగా స్పై కెమెరాతో రికార్డు చేయించి కోట్లు వసూలు చేశాడని చెపుతుంటారు. అలాగే ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి నెలనెలా మామూళ్లు తీసుకున్నాడన్న ఆరోపణలపై కూడా దర్యాప్తు జరగాలి. చివరకు టీవీ9 స్టిక్కర్లు వేసిన వాహనాల్లో ఎర్రచందనాన్ని తరలించారని, ఇలా రూ. లక్షల కోట్ల ఎర్రచందనం తరలిపోవడంలో రవిప్రకాశ్ హస్తం ఉండటం దారుణమన్నారు. సినిమాల్లో వేషాల్లేక బ్రోకర్ అవతారం ఎత్తిన శివాజీ ఆదాయ మార్గాలపై దర్యాప్తు జరగాలన్నారు. శివాజీ గరుడ పురాణం ఒక కుట్ర అని ఆయన అమరావతిలో భూములు, హైదరాబాద్‌లో ఆస్తులు ఎలా కొన్నాడు అన్న విషయం బయటకు రావాలన్నారు. తెలుగు మీడియా వీళ్ల బారినుంచి బయట పడితే మళ్లీ 1980ల ముందు నాటి విశ్వసనీయత వస్తుందన్నారు. మెరుగైన సమాజం కోసం ‘చెమటలు’ కక్కిన రవిప్రకాశ్.. పోలీసులకు లొంగిపోయి సహకరించాలని పౌర సమాజం కోరుతోందన్నారు. మరిన్ని బ్రేకింగ్‌లు.. ►టీవీ9పై రవిప్రకాశ్ పెత్తనం కొనసాగించమని చంద్రబాబుతోపాటు ఆయన అనుచరగణం (గూండాలు) కొత్త యాజమాన్యాన్ని తీవ్రస్థాయిలో బెదిరించారు. ►టీవీ9 రాబడిని, నిధులను సీఈవోగా రవి ప్రకాశ్ భారీ ఎత్తున అక్రమ మార్గంలో తన సొంత ఖాతాలకు మళ్ళించుకున్నట్లు కొత్త యాజమాన్యం చేసిన ఆడిట్లో వెల్లడైంది. ►ఇటీవల ప్రారంభించిన భారత్ వర్ష్ హిందీ జాతీయ చానల్ విషయంలోనూ రవి ప్రకాశ్ కొన్ని నిధులు స్వాహా చేసినట్లు వెల్లడైంది. ► టీవీ9పై తన పెత్తనం యధాప్రకారం కొనసాగేందుకు రాజకీయంగా కూడా రవిప్రకాశ్ పావులు కదిపాడు. -
ప్రసారాల నిలిపివేత అప్రజాస్వామికం
హైదరాబాద్: మీడియూ హక్కులను కాలరాయడం అప్రజాస్వామికమని పలువురు వక్తలు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్ల ప్రసారాలు నిలిపివేయుడాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాల్సిన అవసరముందని వారు పేర్కొన్నారు. ప్రసారాల నిలిపివేతకు నిరసనగా సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో దీక్ష చేపట్టారు. దీనికి పలు జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు మద్దుతు పలికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ జర్నలిస్టు యూనియన్ నాయకులు దేవులపల్లి అమర్, ప్రముఖ విద్యా వేత్త చుక్కా రామయ్య, బీజేపీ శాసనసభ పక్షనేత కె.లక్ష్మణ్, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు రంగారెడ్డి, నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు మల్లు రవి, నాగం జనార్దన్‌రెడ్డి, జూలకంటి రంగారెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం (ఎంఎల్) న్యూడెమ్రోకసీ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్, పీవోడబ్ల్యూ సంధ్య, విమలక్క తదితరులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ తీరు బ్రిటీష్ పాలన గుర్తుకు తెస్తోందని, బ్రిటీష్ పాలనలో కూడా మీడియాపై ఇంత నిషేధం లేదని అన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎంఎస్‌వోల ముసుగులో ప్రభుత్వమే నిషేధం విధించిందని ఆరోపించారు. సాయంత్రం ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి జర్నలిస్టులకు నిమ్మరసం ఇచ్చి నిరసనను విరమింపజేశారు. మీడియా స్వేచ్ఛను హరించడం సరికాదు: జవదేకర్ న్యూఢిల్లీ: మీడియా స్వేచ్ఛను హరించడం సరికాదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మీడియాపై నిషేధం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్(ఐఐఎంసీ) స్నాతకోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ‘‘రెండు మూడు రాష్ట్రాలు కొన్ని టీవీ చాన ళ్లపై నిషేధం విధించాయి. ఇది మీడియా స్వేచ్ఛకు విఘాతం కల్పించడమే’’ అని ఆయన అన్నారు. పెయిడ్ న్యూస్ జాడ్యం ఇంకా పోలేదని, ఇటీవలి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని గమనించినట్లు వివరించారు. ఈ పెయిడ్ న్యూస్‌ను అరికట్టేందుకు మీడియానే ముందుకు రావాలని కోరారు. -
ఆ చానళ్లను ప్రజలు కోరుకోవడం లేదు
తెలంగాణ ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి సూర్యాపేట: టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను ప్రజలు ప్రసారం చేయాలని కోరుకోవడం లేదని, వారు కోరుకుంటే ప్రసారం చేస్తామని తెలంగాణ ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణ సమీపంలోని సీతారామ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ రెండు చానళ్ల ప్రసారాలను నిలిపివేయడంలో ప్రభుత్వ పాత్ర, ఎంఎస్ఓల పాత్ర ఏమీ లేదన్నారు. వ్యాపార ఒప్పందాలు కొనసాగించే ఆలోచన ఆ రెండు యాజమాన్యాలకు లేదని చెప్పారు. ఉన్నత న్యాయస్థానాలు సైతం ఎంఎస్ఓలకు అనుకూలంగానే తీర్పు చెప్పాయని గుర్తు చేశారు. ఎంఎస్‌ఓలందరూ సమస్యల పట్ల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసికట్టుగా సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే హక్కులను సాధించుకోగలుగుతామని తెలిపారు. -
మీడియా స్వేచ్ఛను హరించొద్దు
ఆ చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలి అఖిలపక్ష సదస్సు డిమాండ్ హైదరాబాద్: మీడియా స్వేచ్ఛను హరించటం సరికాదని, ఏబీఎన్, టీవీ9 చానళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సోమవారమిక్కడ ఏబీఎన్, టీవీ9 ఆధ్వర్యంలో ‘మీడియా స్వేచ్ఛ పరిరక్షణ’పై అఖిలపక్ష సదస్సు నిర్వహించారు. విశాలాంధ్ర సంపాదకులు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, సీపీఎం తెలంగాణ అధ్యక్షుడు త మ్మినేని వీరభద్రం, బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్, నాగం జనార్దన్ రెడ్డి (బీజేపీ), రేవంత్‌రెడ్డి (టీడీపీ), విరసం నేత వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, సినీనటుడు శివాజీ తదితరులు ప్రసంగించారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, ఆ రెండు చానళ్ల నిషేధం ఎమ్మెస్‌ఓలకు సంబంధిం చిన అంశమని, తమకెలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. సీపీఐ నేత కె.నారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే 10 కిలోమీటర్ల లోతు బొందపెడతామని కాళోజీ సొంత జిల్లా వరంగల్‌లోనే అనటం బాధాకరమని, ఒకవేళ కాళోజీ బతికుంటే ఆ మాటలను ఏ మాత్రం సహించి ఉండేవారు కాదన్నారు. పత్రికలకు స్వేచ్ఛ ఇవ్వకుంటే అభివృద్ది సాధ్యం కాదని తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఇది ఎమ్మెస్ఓల ముసుగులో మీడియాపై విధించిన నిషేధమని కె.లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ఏకపక్ష ధోరణితో నియంతలా వ్యవహరిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, సీపీఐఎంఎల్ నాయకులు గోవర్ధన్, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, విమలక్క, పౌరహక్కుల సంఘం నేత రఘు, పీడీఎస్‌యూ అధ్యక్షుడు గౌతం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్‌కు వినతిపత్రం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాలపై నిషేధాన్ని ఎత్తివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని వివిధ పార్టీల నాయకులు, వివిధ ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు గవర్నర్‌ను కోరారు. అఖిలపక్ష సదస్సులో చేసిన తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేశారు. ముక్తకంఠంతో వ్యతికించాలి: అమర్ ఏ ఒక్క చానల్, పత్రికపై దాడి జరిగినప్పుడైనా మిగతా పత్రికలు, చానళ్లు ముక్తకంఠంతో ఎదిరించి ఉంటే ఇప్పుడిలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్ అన్నారు. తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్ల ప్రసారాలు నిలిపివేసినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం ‘సాక్షి’ దినపత్రిక, సాక్షి చానల్‌ను అధికారిక కార్యక్రమాలకు అడ్డుకుంటోందని అన్నారు. పత్రికా స్వేచ్ఛపై దాడిని అన్ని పత్రికలు, చానళ్లు ముక్తకంఠంతో ఎదిరించాలని కోరారు. సమాజంలో తమను ఎదిరించే వారుండకూడదని ప్రభుత్వాలు భావించడం సరి కాదన్నారు. ప్రసారాల నిలిపివేత ఎమ్మెస్వోల అంశమనడం విడ్డూరమన్నారు. -
టీవీ9, ఏబీఎన్, టీవీ 6లపై దావా
హైదరాబాద్: టీవీ 9, ఏబీఎన్ చానెళ్లు మరో వివాదంలో ఇరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఈ రెండు చానెళ్లతో పాటు టీవీ 6పై దావా వేశారు. ఎన్నికల సమయంలో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ఈ మూడు చానెళ్లు కథనాలు ప్రసారం చేశాయని శ్రీధర్ ఆరోపించారు. ఆయన టీవీ9, ఏబీఎన్, టీవీ లపై దావా దాఖలు చేశారు. కాగా తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా కథనాలు ప్రసారం చేశాయని, తెలంగాణ ఎంఎస్‌వోల సంఘం ఇటీవల ఏబీఎన్, టీవీ 9 ప్రసారాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణలో చానళ్ల నిలిపివేత సరికాదు
-
రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేలను కించపరుస్తూ కథనం ప్రసారం చేసిన కేసులో టీవీ 9 చానెల్ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ బలుసు శివశంకరరావు గురువారం ఉత్తర్వులు జారీ చేస్తూ డజనుకుపైగా షరతులు విధించారు. టీవీ 9 కథనంపై న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ కింది కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేయటం తెలిసిందే. -
'ఛానల్స్ నిలిపివేతపై సర్కార్‌కి సంబంధం లేదు'
హైదరాబాద్ : హైదరాబాద్‌ను సాంకేతిక నగరంగా అభివృద్ధి చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం ఆయన హైటెక్స్‌లో ఇండియా గాడ్జెట్ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌ను హార్డ్‌వేర్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటికే ఇన్క్యూబేషన్ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. ఇన్క్యూబేషన్ సెంటర్ల ద్వారా యువ పారిశ్రామకవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. సాప్ట్వేర్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేటీఆర్ తెలిపారు. ఆరు నుంచి ఎనిమిది నెలల్లో హార్డ్‌వేర్‌కు సంబంధించి కొత్త పాలసీ తీసుకు రానున్నట్లు ఆయన తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం చిన్న కంపెలకు ప్రోత్సహం ఇచ్చేందుకు ప్రత్యేకమైన విధానం రూపొందిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా టీవీ 9, ఆంధ్రజ్యోతి ఛానల్స్ ప్రసారాల నిలుపుదలపై కేటీఆర్ స్పందించారు. కేబుల్ ఆపరేటర్ల నిర్ణయానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. ఎంఎస్‌వోలతో సదరు టీవీ ఛానల్స్ చర్చించుకోవాలని కేటీఆర్ సూచించారు. -
ప్రజా నాయకులంటే టీవీ9 కి అంత చులకనా?
-
టీవీ-9 కార్యాలయాన్ని తీసెయ్యండి
లేకుంటే తీవ్ర ఆందోళన తెలంగాణ ఎమ్మెల్యేలను హీనంగా చూస్తారా..? కార్యాలయం ఎదుట ధర్నా బంజారాహిల్స్: తెలంగాణ ముఖ్యమంత్రి కే సీఆర్‌తోపాటు తెలంగాణ శాసనసభ్యులను కించపర్చేలా కథనాలు ప్రసారం చేసిన టీవీ-9 చానల్‌ను వెంటనే ఇక్కడినుంచి తీసేయాలంటూ నవతెలంగాణ టీఆర్ఎస్ బ్రాహ్మణ, అర్చక సేవాసంఘం సభ్యులు శనివారం పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. తెలంగాణ అడ్వకేట్ల జేఏసీ సభ్యులతోపాటు అర్చకులు పెద్దసంఖ్యలో ఇక్కడికి చేరుకొని తెలంగాణ శాసనసభ్యులకు టీవీ-9 తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మా ఎమ్మెల్యేలను పాచిపోయిన కల్లుతో పోలుస్తారా..? టూరింగ్ టాకీస్‌లో కూర్చొండే ముఖాలంటారా..? అని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇక్కడినుంచి టీవీ-9 కార్యాలయాన్ని ఎత్తివేయకుంటే మళ్లీ ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సంఘం అధ్యక్షుడు రాహుల్ దేశ్‌పాండే, సీతారామశర్మ, శ్రీకాంత్‌శర్మ, సాయికుమార్‌శర్మ, వెంకన్న పంతులు, సంజీవరావు, శరత్‌శర్మ, గణేష్‌శర్మ తదితరులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి అక్కడ్నించి తరలించారు. ఆ చానెల్ వైఖరి దారుణం అంబర్ పేట: తెలంగాణ శాసనసభ్యులను అవహేళన చేస్తూ టీవీ9 న్యూస్‌చానెల్ కథనాలను ప్రసారం చేయడాన్ని ఆం ధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఫ్), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్లు తీవ్రంగా ఖండించాయి. మీడియాలో ప్రమాణాలు పడిపోయాయని అన్నివర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం అత్యంత దారుణమ ని ఫెడరేషన్ భావిస్తోందని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధానకార్యదర్శి జి.ఆంజనేయులు, టీడబ్ల్యూజేఎఫ్ కన్వీనర్ బసవపున్నయ్యలు అన్నారు. తప్పుచేశామని టీబీ-9 చానెల్ క్షమాపణలు చెప్పినప్పటికీ ఆ ధోరణి ప్రజాస్వామ్య విలువలను, మీడియా ప్రతిష్టను ఎంతమాత్రం నిలబెట్టేవిగా లేవన్నారు. -
'తెలంగాణ నేతలంటే ఆ చానళ్లకంత చులకనా ?'